Trend designs
-
షహర్ కా షాన్ షేర్వానీ
నవాబుల కాలం నుంచి ఇప్పటి దాకా షేర్వానీకి ఏమాత్రం క్రేజ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు రాజ కుటుంబీకులు, సంపన్నవర్గాలకే షేర్వానీ పరిమితమయ్యేది. రానురాను పేద, ధనిక అందరూ షేర్వానీ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో కుటుంబ సభ్యులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా షేర్వానీ ధరించాల్సిందే.. బ్రాండెడ్ దుస్తులు మార్కెట్‌ను రాజ్యమేలుతున్నా.. రాజుల కాలం నాటి షేర్వానీలు పండగలు, శుభకార్యాలకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయి. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది. అభిరుచులకు అనుగుణంగా షేర్వానీ డిజైన్లలోనూ మార్పులొచ్చాయి. రాకుమారులు.. సినీహీరోలు.. రాజకీయ నాయకులు ఇలా సెలబ్రెటీలంతా భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా షేర్వానీని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన సంస్కృతే కాదు.. పాశ్చాత్య డిజైన్ల సమ్మేళనంగా సరికొత్త షేర్వానీలు మార్కెట్లో ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం నిజాం నవాబులు, ముస్లిం, మార్వాడీ సమాజంలోనే షేర్వానీ ఆహార్యం కనిపించేంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ అందరి ఒంటి మీదకు చేరింది. మొదట్లో కేవలం పెళ్లి కుమారుడే షేర్వానీతో ఊరేగేవాడు.. ఇప్పుడు వరుడే కాదు.. పెళ్లి బరాత్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్ వేర్‌ను వాడటం పరిపాటిగా మారింది. విభిన్న రకాలతో షేర్వానీలతో బరాత్కే కొత్త అందం వస్తుందనే ప్రచారంతో వివాహంలో షేర్వానీ డ్రెస్ కోడ్‌గా మారింది. షేర్వానీ అంటే మక్కువ ఇండో వెస్టన్ డిజైన్స్‌తో వినియోగదారులకు నచ్చే విధంగా షేర్వానీలు తయారు చేస్తున్నాం. నేటి యువత మాములు డిజైన్ షేర్వానీలకు కాకుండా స్టైయిలి‹Ùగా కనబడటానికి కొత్త డిజైన్స్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న డిజైన్స్‌కు అనుగుణంగా మా వద్ద షేర్వానీలు తయారవుతాయి. ప్రస్తుతం అన్ని మతాలు, వర్గాల వారు వీటిని ధరిస్తున్నారు. వారి వారి సంప్రదాయల డిజైన్లలో తయారు చేస్తున్నాం. షేర్మానీలు ధరించి శుభకార్యాలకు వెళితే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు పెళ్లిళ్లు విందుల్లో షేర్వాణి ధరించి వెళ్లే వారివైపే అందరి చూపు ఉంటుంది. నేటి యువత వీటిని ధరించడానికి మక్కువ చూపుతున్నారు. – ఇబ్రాహీమ్ బుఖారీ, జహాపనా డిజైనర్స్ వ్యవస్థాపకుడు బనారస్ పట్టుతో తయారీ షేర్వానీల తయారీలో బనారస్ పట్టుదే పైచేయి. ఈ పట్టుతోనే వీటిని ఉత్పత్తి చేసే అవకాశమున్నందున.. ఫ్యాషన్‌లో బనారస్ షేర్వానీలదే హవా. పురుషులు వ్రస్తాలలో పట్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం షేర్వానీలలో మాత్రం ఈ పట్టుకే పట్టం కడుతున్నారు. ఇలా వస్త్ర నాణ్యతకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. రూ.2వేల నుంచి రూ.2 లక్షల వరకు షేర్వానీలు లభ్యమవుతున్నాయంటే వీటికి మార్కెట్లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. వీటికి ఉన్న ఆదరణ దష్ట్యా షేర్వానీ ప్రియులు కస్టమైజ్డ్ డిజైన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైనర్లు సైతం పుట్టుకొచ్చారు. నగరంలో బుఖారీ ఫ్యామిలీ జహాపనా డిజైనర్స్ పేరుతో షేర్వానీ రంగంలో విప్లం తీసుకొచి్చంది. యుత్‌కు నచ్చే స్టయిల్స్‌తో పాటు అన్ని కట్స్‌లో షేర్వానీలు తయారవుతున్నాయి. -
శారీ.. ఫర్ ఎవర్
నగరం ఓ మినీ ఇండియా. నార్త్, సౌత్, నార్త్ ఈస్ట్‌తో పాటు మధ్య భారతం, పశి్చమ, వాయువ్య భారతం అంతా కనిపిస్తుంది. నోరు విప్పి మాట్లాడిన తరవాత భాషను బట్టి వారిది ఏ రాష్ట్రమో తెలుస్తుంది. కానీ మహిళల వస్త్రధారణ మౌనంగా మాట్లాడుతుంది. ఇండియన్ ఫ్యాషన్ అవుట్ ఫిట్‌లో చీరది ప్రత్యేకమైన స్థానం. చీరలకు అతి పెద్ద షోకేస్ హైదరాబాద్ నగరం. వెస్టర్న్ ప్యాటర్న్స్ ఎన్ని వచి్చనా వాటిని స్వాగతిస్తూనే ఉంది. పాతికేళ్ల కిందట ఒక టేబుల్ వేసుకుని కాటన్ వస్త్రం మీద అందమైన డిజైన్లను అద్దడంతో చీర కొత్త పుంతలు తొక్కింది. అప్పటి వరకూ చేనేతకారులు తరతరాల సాదా మోడల్స్ దగ్గరే ఉన్నారు. సూరత్‌లోని టెక్స్టైల్ మిల్స్ ఒక డిజైన్ రూపొందిస్తే ఆ డిజైన్‌లో వేలాది చీరలు దేశమంతటా విస్తరించేవి. అలాంటి సమయంలో ఒక చీరకు అద్దిన డిజైన్ మరో చీరలో ఉండకూడదని, వేటికవే వినూత్నంగా ఉండాలని మహిళా డిజైనర్లు చేసిన ప్రయోగం సక్సెస్ అయ్యింది. ప్రతిదీ యూనిన్గా ఉండాలని కోరుకునే మహిళలకు ఈ ప్రయోగం ఓ వరంలా కనిపించింది. డిజైనర్లు రూపొందించిన డిజైన్లకే పరిమితం కాకుండా సొంత డిజైన్లు గీసి మరీ చేయించుకోవడం మొదలైంది. క్రమంగా అద్దకం ఓ ట్రెండ్ అయ్యింది. చీరను ట్రెండ్ నుంచి పక్కకు పోనివ్వకుండా కాపాడుకుంటూనే ఉంది మెట్రో ఫ్యాషన్. పాతికేళ్లుగా హైదరాబాద్ ఫ్యాషన్ ట్రెండ్‌ని గమనిస్తున్న ప్రముఖ డిజైనర్ గాయత్రి రెడ్డి చెబుతున్న మాట ఇది. నేతలో క్రియేటివిటీ.. చీర మీద అద్దిన డిజైన్ హైలైట్ కావడానికి డిజైన్ అవుట్ లైన్ ఎంబ్రాయిడరీ చేయడం మరో ప్రయోగం. అక్కడి నుంచి మగ్గం వర్క్ మొదలైంది. చీరతోపాటు బ్లౌజ్‌కు ఎంబ్రాయిడరీ, చీర కంటే బ్లౌజ్‌కు పెద్ద ఎంబ్రాయిడరీ, బ్లౌజ్‌కు హైలైట్ కావడానికి ప్లెయిన్ చీర కాంబినేషన్ వంటి ప్రయోగాలన్నీ సక్సెస్ అయ్యాయి. ఇదే సమయంలో మహిళా డిజైనర్లు తమ క్రియేటివిటీని చేనేత వైపు మళ్లించారు. పోచంపల్లి, ఇకత్ నుంచి నారాయణపేట, ఉప్పాడ, ధర్మవరం, వెంకటగిరి, పాటూరు వంటి నేతలన్నింటికీ ఫ్యాషన్ లుక్ తెచ్చారు. దాంతో ఫ్యాషన్ ప్రపంచాన్ని చేనేత శాసించేంతగా డిజైన్లు పాపులర్ అయ్యాయి. పట్టు చీరల బరువు తగ్గించడంలో విజయవంతమయ్యారు. దాదాపు క్రేప్ మాదిరి తేలిగ్గా ఉంటోందిప్పుడు.వాతావరణం మారింది నగరంలో ఏడాదిలో పది నెలలు చల్లని వాతావరణం ఉండేది. ఈ పాతికేళ్లలో బాగా మార్పులు వచ్చాయి. ఏడాదిలో పది నెలలు వేడిగా ఉంటోంది. వెదర్‌కు అనుకూలంగా ఉండేటట్లు డిజైనర్ శారీస్ కాటన్లో తీసుకురావడం కొత్త తరం మహిళలు చీరపై మోజు పడడానికి ఓ కారణం. చీర కట్టే రోజులు తగ్గినా.. కొనడం మాత్రం తగ్గలేదు. ప్రతి ఫంక్షన్‌కీ ఓ కొత్త చీర కొనే ట్రెండ్ వచ్చేసింది. సాఫ్ట్వేర్ ఉమర్స్ పారీ్టలకు చీరలో మెరిసిపోతున్నారు. రోజూ చుడీదార్ ధరించే వాళ్లు కూడా బర్త్‌డే పార్టీ, గెట్ టు గెదర్ వంటి వాటికి చీర కడుతున్నారు. చీర చుట్టూ ఫ్యాషన్..పాతికేళ్ల క్రితం హైదరాబాద్‌లో నూటికి 70 నుంచి 80 శాతం మహిళలు రోజూ చీరలే ధరించేవారు. క్రమంగా 2015 నాటికి 40 శాతానికి పరిమితమైంది. వర్కింగ్ ఉమెన్స్, డాక్టర్లు, లెక్చరర్లు చీరలతోనే డ్యూటీ చేశారు. ఇప్పుడిది పాతిక శాతం మాత్రమే ఉంది. ఆధునిక వనితల వార్డ్‌రోబ్‌లో చుడీదార్, జీన్స్ డైలీ వేర్ స్థానాన్ని ఆక్రమించాయి. కానీ చీర మాత్రం దూరం కాలేదు. తనను తాను మార్చుకుంటూ ఎప్పటికప్పుడు ఫ్యాషనబుల్‌గా మారుతోంది చీర. అందుకే శారీఫ్యాషన్ ఎప్పటికీ తెరమరుగు కాదు. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్యార్ హువా..! ఆర్గానిక్ ఇంటీరియర్‌పై ఇంట్రెస్ట్!!
సాక్షి, సిటీబ్యూరో: దుస్తుల నుంచి ఆస్తుల దాకా అన్నీ ఆరోగ్యకరమైతేనే మాకు అది మహాభాగ్యం అంటోంది సిటీ. ఆహారంతో మొదలైన ఆర్గానిక్ ట్రెండ్ ఇంతింతై.. విస్తరిస్తూ ఇంటీరియర్ దాకా వచ్చేసింది. నగరంలో ఆర్గానిక్ ఆహారం కోసం ఏకంగా సొంతంగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన సెలబ్రిటీలు ఉన్నారు. అదేవిధంగా ఇప్పుడు ఇళ్లు, ఆఫీసులు, ఫార్మ్‌హౌస్‌లు, క్లబ్‌హౌస్‌లతో సహా ఇంటీరియర్ అంటే ఆర్గానిక్కే డియర్ అంటున్నారు.ఇంటీరియర్‌లో అత్యంత ప్రధానమైన సర్ఫేస్ డిజైనింగ్‌లో ఆర్గానిక్ ఉత్పత్తుల వాడకం బాగా పెరిగింది. సర్ఫేస్ డిజైనింగ్ అంటే ఉపరితల అలంకరణగా తెలుగులో పేర్కొనవచ్చు. ఫ్లోరింగ్, సీలింగ్ నుంచి సైడ్ వాల్స్ దాకా.. వాటి ఉపరితలాలపై వేసే పైపూత ఇంటీరియర్‌లో ప్రధానమైన అంశం. దీంతో ఇంట్లో అడుగుపెట్టగానే కనువిందు చేసేలా, కంటికి మాత్రమే కాదు ఆరోగ్యానికి సైతం ఇంపుగా ఉండేలా కోరుకుంటున్నారు ‘లగ్జరీ అంటే ఎవరినో చూసి అనుసరించే ఫ్యాషన్ కాదు పర్సనలైజేషన్ అని చెప్పాలి. సిటిజనులు ఆర్గానిక్ మెటీరియల్/సస్టెయినబుల్ మెటీరియల్ కావాలని అడుగుతున్నారు’ అంటూ చెప్పారు నగరంలో సర్ఫేస్ డిజైనింగ్‌కి చెందిన పేరొందిన బియాండ్ కలర్ నిర్వాహకులు కుమార్ వర్మ.జీరో వివైసీ.. అదే క్రేజీ.. సర్ఫేస్ డిజైనింగ్ కోసం అవసరమైన మెటీరియల్స్ అయిన లైమ్ ప్లాస్టర్, టెర్రాకోట, టెర్రాజోజ్ వంటివన్నీ పూర్తిగా ఆర్గానిక్‌వే వాడుతున్నారు. అలాగే 70శాతం రీసైకిల్డ్ మెటీరియల్స్ వినియోగిస్తున్నారు. ఇక వినియోగించే రంగులు కూడా కెమికల్ కలర్స్ బదులుగా వృక్షాధారితమైన ప్లాంట్ బేస్డ్ కలర్స్ వాడుతున్నారు. ఇవి కూడా దాదాపు అన్నీ ఆక్సైడ్ కలర్స్ మాత్రమే అంటే పౌడర్స్ తప్ప లిక్విడ్ రూపంలో ఉండవు. ఈ తరహా మెటీరియల్‌ని జీరో వాలెంటైల్ ఆర్గానిక్ కాంపౌండ్‌గా పేర్కొంటున్నారు.విదేశాల నుంచీ వచ్చేస్తున్నాయి..ఆధునికుల ఆరోగ్య స్పృహను సంతృప్తి పర్చేందుకు సర్ఫేస్ డిజైనర్స్.. ఆర్గానిక్ మెటీరియల్‌ను విదేశాల నుంచీ దిగుమతి చేసుకుంటున్నారు. వీటిలో అత్యధికంగా ఇటలీ నుంచి కొంత వరకూ స్పెయిన్, అమెరికా నుంచి కూడా దిగుమతి చేసుకుంటున్నారు. మన పూరీ్వకులు ఇళ్ల నిర్మాణæ శైలిలో ఆరోగ్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు భావిస్తున్న నవతరం.. వాటినే తిరిగి కోరుకుంటోంది. శతాబ్దాల క్రితం ఎలాగైతే సున్నంతో కొన్ని రకాల మెటీరియల్ తయారు చేసేవారో అదే కాన్సెప్‌్టతో చేస్తున్నారు. మెటీరియల్‌ని నీటిలో 18 నుంచి 20 నెలలు పాటు హైడ్రేట్ చేసి అందులోనుంచి వచ్చిన క్రీమ్‌ని సర్ఫేస్ డిజైనింగ్‌లో ఉపయోగిస్తున్నారు. ఎకో ఫ్రెండ్లీ.. అదే ట్రెండీ..మన సిటీలోని టీ హబ్ సహా దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ప్రాజెక్ట్‌లకు పనిచేశాం. ఇప్పుడు విల్లాస్, ఫార్మ్‌హౌస్‌లు, సెలబ్రిటీల బిల్డింగ్ దేనికోసమైనా సరే.. సిటీలో ఎకో ఫ్రెండ్లీ ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. దీనికోసం ఇంటీరియర్ డిజైనర్స్, ఆర్కిటెక్ట్స్‌తో కలిసి సర్ఫేస్ డిజైనింగ్ చేస్తున్నాం. మా దగ్గర 8 రకాల మెటీరియల్స్ ఉన్నాయి. 250 రకాల టెక్చర్స్ ఉన్నాయి. అత్యుత్తమ నేచురల్ క్వాలిటీ కోసం ఇటలీ నుంచి 80శాతం, స్పెయిన్, అమెరికా నుంచి 10శాతం చొప్పున మెటీరియల్స్ దిగుమతి చేసుకుంటున్నాం. ఇలా చేసేటప్పుడే భారతీయ వాతావరణానికి నప్పు తుందా లేదా.. అని పూర్తి స్థాయిలో స్కాన్ చేసి తెస్తాం.– కుమార్ వర్మ, బియాండ్ కలర్, సర్ఫేస్ డిజైనింగ్ కంపెనీ -
పండుగ వేళ.. గృహ కళ!
సాక్షి, హైదరాబాద్: పండుగ వేళ మీ ఇంటి శోభను రెట్టింపు చేయాలంటే ఇల్లును, ఇంట్లోని వస్తువులను శుభ్రం చేయడమే కాదు.. చిన్న చిన్న మెళకువలతో ట్రెండీ లుక్ తీసుకురావచ్చని నిపుణులు సూచిస్తున్నారు. సంప్రదాయ అలంకరణ స్థానంలో ట్రెండీ లుక్ రావాలంటే ఎక్స్టీరియర్, ఇంటీరియర్ రెండు చోట్లా డెకరేటివ్ చేస్తే ఎకో–ఫ్రెండ్లీగా మారుతుందంటున్నారు. ► సంప్రదాయమైన దీపాంతులు, కొవ్వొత్తులకు కాలం చెల్లింది. వీటి స్థానంలో సిరామిక్ లేదా మార్బుల్ పల్లెంలో మట్టి దీపాంతలను వెలిగించండి. వీటిని హాల్, పూజ గదిలో పెట్టండి. డిస్కౌంట్ ధరల్లో వినూత్న డిజైన్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. మరింత సృజనాత్మకత కావాలంటే బంగారపు వర్ణం ఉండే ఎలక్ట్రిక్ దీపాంతలు కూడా లభ్యమవుతాయి. ► ప్రముఖ ఎల్రక్టానిక్ కంపెనీలు బహుళ రంగుల లైట్లు, పోర్టబుల్ లైట్లు, లాంతర్లు వంటి వినూత్న లైటింగ్ ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. వీటిని స్మార్ట్‌ఫోన్‌తో ఆపరేట్ చేసుకోవచ్చు కూడా. వైర్లెస్ ఉత్పత్తులు కావటంతో మొబైల్‌తో మనకు ఎంత కావాలంటే అంత కాంతి స్థాయి, రంగులను ఎంపిక చేసుకోవచ్చు. ► రంగు రంగుల బాటిల్స్‌లో కొవ్వొత్తులను పెట్టి గోడల మూలల్లో లేదా ప్రధాన ద్వారానికి ఇరు వైపులా, ఇంటి చుట్టూ వేలాడదీయవచ్చు. దీంతో ఇల్లు రకరకాల వర్ణాల్లో అందంగా దర్శనమిస్తుంటుంది. ► చేతితో తయారు చేసిన మట్టి దీపాంతలు, లాంతర్లు చాలా కామన్. వీటికి బదులుగా అకార్డియన్ పేపర్ లాంతర్లు మార్కెట్లో లభ్యమవుతున్నాయి. ఇవి పగటి పూట సూర్య రశి్మని సేకరించి.. రాత్రి సమయాల్లో ప్రకాశిస్తాయి. వీటిని హెవీ డ్యూటీ నైలాన్‌తో తయారు చేస్తారు. ఈ లాంతర్ సెట్లు వివిధ డిజైన్స్, రంగుల్లో దొరుకుతాయి. ► ఈ మధ్య కాలంలో నీళ్లల్లో తేలియాడే కొవ్వొత్తులు బాగా ప్రాచుర్యం పొందాయి. అలంకరణ ప్రాయంగా వీటిని పూల కుండీల్లో, మొక్కలున్న ప్రాంతాల్లో, స్విమ్మింగ్‌పూల్, ఫౌంటేన్ వంటి మీద అమర్చుకోవచ్చు. -
చిరిగిన స్వెటర్.. లక్షపైనే.. స్పెషల్ ఏంటంటే
చలికాలం వస్తుంది కదా అని మార్కెట్లో స్వెటర్ కొనడానికి వెళ్తే.. అక్కడ ‘ఎలుకలు కొరికిన స్వెటర్... కుందేలు కొరికిన స్వెటర్..’ ఇలా చిరిగిన స్వెటర్లు అమ్మే దృశ్యాలను త్వరలోనే చూడబోతున్నాం. నిజం, ఈ మధ్యనే ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్సియాగా ‘డిస్ట్రాయిడ్ క్రూనెక్’ పేరుతో కొత్తరకం స్వెటర్లను విడుదల చేసింది. వంద శాతం ఉన్నితో తయారు చేసిన వీటి డిజైన్, అచ్చం ఎలుకలు కొరికితే చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది. మొదట చిరిగిన ప్యాంటుగా పేరు పొందిన టాన్ జీన్స్ ఫ్యాషన్‌ను కూడా ఇలాగే అన్నారు. ఇప్పుడు సామాన్యులు కూడా ఇష్టపడిమరీ ఆ ప్యాంట్లను కొంటున్నారు. మార్కెట్లో వచ్చేవి యువతకు నచ్చితే చాలు వాటి సేల్స్ అమాంతం పెరిగిపోతాయి. ఇక ఈ స్వెటర్లో ఆశ్చర్యపోయే మరో విషయం ఏంటంటే దీని ధర. మీరు కనుక దీన్ని కొనాలనుకుంటే ఈ స్వెటర్‌లాగే మీ జేబు, పర్స్కూ చిల్లు పడ్డం ఖాయం. ఎందుకంటే ఈ స్వెటర్ అక్షరాల 1,450 డాలర్లు అంటే మన కరెన్సీలో రూ.1,07,652 పలుకుతుంది మరి! చదవండి: ఇడ్లీ, దోశ పిండితో మొదలెట్టి.. వేల కోట్ల కంపెనీకి సీఈఓ -
ట్రెండ్ మారుతోంది.. అలాంటి ఇళ్లే కావాలంట!
పల్లె అందం ఇప్పుడు పట్టణపు ఇళ్లలో కనువిందు చేస్తోంది. పాత తరం ముచ్చట నట్టింట కళాత్మకమై కొలువుదీరుతోంది. డిజటల్ యుగంలో కాంక్రీట్ క్లీనింగ్ బోర్ అనుకున్నవారు మట్టివాసనకు చేరువలో ఉండాలని తపిస్తున్నారు. అందుకే, ఇటుక కనిపించేలా గోడలు, నగిషీలు చెక్కిన వుడ్‌తో ఫర్నిచర్, మసకబారిన బ్రాస్ కలెక్షన్ వైపు మొగ్గుచూపుతున్నారు. ఇల్లు, కార్యాలయం, కాఫీషాప్.. వంటి వాటికి ఔట్ సైడ్ బ్రిక్ స్టైల్ డిజైన్స్ చూస్తుంటాం. అయితే, ఇప్పుడిది ఇంటీరియర్‌కి ట్రాన్స్ఫర్ అయ్యింది. దీంతో పాటే వింటేజ్ స్టైల్ సింపుల్ అండ్ గ్రాండ్ లుక్‌తో ఆకట్టుకోవడం కూడా ఇప్పుడీ స్టైల్ నగరవాసులకు ప్రియమైన డెకార్‌గా మారింది. నిర్లక్ష్యమే అందం ఇటుకను ప్రకృతిలోని దృశ్యాన్ని ఇంట్లోకి తీసుకువచ్చే ఒక మార్గంగా చెప్పుకోవచ్చు. గది నాలుగు గోడలలో ఒక గోడను ప్రత్యేకంగా డిజైన్ చేయడం ఇంటి అలంకరణలో ఎప్పటి నుంచో ఉన్నదే. ఇప్పుడదే పాత పుంతలను తొక్కుతోంది. లివింగ్ రూమ్, బెడ్రూమ్లలో ఒక వైపు ఇటుక గోడ రస్టిక్ ఫీల్‌ను ఇస్తుంది. సిమెంట్ తాపీ పని లేకుండా నిర్లక్ష్యంగా వదిలేశారనిపించేలా ఉండే ఎగుడుదిగుడుల ఇటుక గోడ క్రియేటివ్ స్పేస్‌గా మారిపోయింది. ఈ ఇటుక గోడపైన ఓల్డ్ స్టైల్ వాల్ ఫ్రేమ్స్ కొత్తగా కనువిందు చేస్తున్నాయి. దీనికి తగ్గట్టు బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్ వుడెన్ లేదా ఐరన్ ఎలాంటి హంగులు అవసరం లేకుండానే వింటేజ్ లుక్‌ను తీసుకువస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్‌లో ఇటుక ప్రధాన ఆకర్షణగా మారింది. వాల్ పేపర్‌తో వింటేజ్ లుక్ ఇంటి లోపల ఇటుక గోడ పెట్టక్కర్లేదు. రస్టిక్ లుక్ ఉన్న బ్రిక్ స్టైల్ వాల్‌పేపర్‌తో గది గోడను మార్చుకోవడం సులువు అవుతుంది. పెద్దగా ఖర్చూ ఉండదు. మార్చుకోవడం సులువు. అద్దె ఇంట్లోనైనా అనుకున్న లుక్‌ని ఆస్వాదించవచ్చు. ఫ్రేమ్ స్టైల్ బ్రిక్ లివింగ్ రూమ్ లేదా డైనింగ్ రూమ్‌లలో ఒక ఫ్రేమ్ స్టైల్లోనూ ఇటుక గోడను డిజైన్ చేసుకోవచ్చు. చుట్టుపక్కల తెల్లటి నున్నని గోడల మధ్య వెడల్పాటి ఇటుక గోడ ఒకటి ఫ్రేమ్స్టైల్లో డిజైన్ చేస్తే కళాత్మకతలో అదొక అందమైన ప్రదేశంగా మారిపోతుంది. సర్కిల్లా గుండ్రటి స్టైల్ మట్టి ఇటుక వచ్చేలా డిజైన్ చేస్తే ఇంటిలోపల యూనిక్ లుక్ కనువిందు చేస్తుంది. ఒక ఆర్ట్ వర్క్‌లా మారిపోతుంది. మరింత క్రియేటివ్‌గా మార్చుకోవాలంటే దీనికి కలపతో డిజైన్ చేసిన హ్యాంగింగ్స్‌ను ఉపయోగించుకోవచ్చు. పార్టిషన్ వాల్ హాల్లో కొంత భాగం పార్టిషన్ చేసుకోవాలంటే అందుకు మిర్రర్, వుడ్ ఇతరత్రా ఆలోచనలు చేస్తారు. సన్నని ఇటుక గోడ పార్టిషన్‌తో భిన్నమైన కళ తీసుకురావచ్చు. ఇక ఈ ఇటుక గోడలకు వైట్ వాష్ లేదా బ్లాక్ వాష్ ఐడియాలతో కొత్త కళను తీసుకురావచ్చు. తరతరాల ముచ్చట పాత ఇంటి గోడలపై పెయింట్ చేసిన బొమ్మలు, ముగ్గులు, పిల్లల ఆటల్లో వారు గీసిన రేఖాచిత్రాలు .. ఇవన్నీ ఇప్పుడు ఇంటిలోపల గోడపై కనువిందు చేయడం విశేషమైపోయింది. ఆ మనోహర దృశ్యాలకు తమ ఇల్లు వేదికైందని మురిసిపోతున్నారు నవతరం కళాప్రియులు. -
ట్రెండ్జ్..
పట్టు, ఫ్యాన్సీ, కాటన్ చీరలు... విభిన్నమైన నగనిగలు... అతివ అందాన్ని రెట్టింపు చేసే ఐటెమ్స్ ఎన్నో కొలువుదీరాయి బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో. పెళ్లిళ్లు, శుభకార్యాలకు కావల్సిన వస్త్రాభరణాలు చూడగానే ఆకట్టుకుంటున్నాయి. వెల్ డిజైన్డ్ వెరైటీల కోసం వేచి చూస్తున్న నగర మగువలకు ఈ ఎగ్జిబిషన్ చివరి మజిలీ అంటూ భరోసా ఇస్తున్నారు నిర్వాహకులు. కోల్‌కతా, ముంబై, బెంగళూరు, అహ్మదాబాద్, మధ్యప్రదేశ్, దిల్లీ, హైదరాబాద్ తదితర నగరాల్లో పేరెన్నికగన్న చీరలు, డిజైనర్ వస్త్రాలు, ఆభరణాలు, బ్రైడల్ వేర్, హాఫ్ శారీస్, లెహంగాలు, లైఫ్‌స్టైల్ ఐటెమ్స్, హోమ్ డెకార్స్, కిడ్స్వేర్స్ ఇక్కడి డెబ్భైకి పైగా స్టాల్స్‌లో ఆకర్షిస్తున్నాయి. శనివారం కూడా ప్రదర్శన ఉంటుంది. -
అభిమాని కోసం అడ్రెస్
సినిమాల్లో తారల డ్రెస్‌లు చూసి మనసుపడతాం. అలాంటి ట్రెండీ డిజైన్లు ధరించాలని ముచ్చటపడతాం. కానీ.. సేమ్ టు సేమ్ ఎక్కడ దొరుకుతాయి! అదిగో ఆ హీరో వేసుకున్న డ్రెస్... ఇదిగో ఈ తార కట్టుకున్న చీరలాంటివే కావాలంటే..? షాపులన్నీ తిరిగినా ఆ వెరైటీలు కనిపిస్తాయన్న గ్యారంటీ లేదు. ఇలాంటివారి అభిరుచిని గమనించి ఆన్లైన్లో ఓ స్టోర్ ఓపెన్ చేశారు సిటీ కుర్రాళ్లు చిన్మయ్ రాజు, మామిడి రాజా. బీటెక్ చదివిన వీరు మంచి ఉద్యోగాలు వదిలేసి ‘క్లాప్వన్.కామ్’ను రూపొందించారు. చిన్మయ్ చెల్లెలు హీరోయిన్ సమంత అభిమాని. ఈగ సినిమాలో ఆమె వేసుకున్న టాప్లాంటిదే కావాలని అన్నయ్యను అడిగింది. సిటీలో ఎక్కడ వెతికినా దొరకలేదు. ఈ అనుభవం ఓ బిజినెస్ ఆలోచనకు దారి తీసింది. స్నేహితుడు రాజాతో కలసి క్లాప్వన్ ఆన్లైన్ స్టోర్ ప్రారంభించాడు చిన్మయ్. దీనికి సెంటర్ ఫర్ ఇన్నోవేషన్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సాంకేతిక, ఆర్థిక సహకారం అందించింది.వీళ్లు కొంతమంది ఫ్యాషన్ డిజైనర్లను నియమించుకున్నారు. కొత్త సినిమాల్లో తారలు వేసుకున్న డ్రెస్‌లు పరిశీలించి వాటి డిజైనింగ్ వివరాలు, కలర్స్‌ను డిజైనర్లు అందిస్తారు. అలాంటివే సిద్ధం చేసి ఆన్లైన్లో డిస్ప్లే పెడతారు. సదరు తారల ఫొటోలనే వెబ్సైట్లో పెడతారు. కావల్సినవారు ఆ తారల ఫొటోలు క్లిక్ చేస్తే ఆన్లైన్ స్టోర్‌లోకి ఎంటర్ అయ్యి కొనుగోలు చేయవచ్చు. మింత్రా, ఫ్లిప్‌కార్ట్, జబాంగ్, ఫ్యాషనోరా వంటి వెబ్సైట్లతో వీరు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ వెబ్‌సైట్‌ను రోజుకు 50 వేల మంది వీక్షిస్తున్నారంటే తారల డ్రెస్‌లను ఫాలో అయ్యేవారు ఎంత మంది ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. - విజయారెడ్డి