అన్ని శుభకార్యాలకు స్పెషల్ వేర్
అన్ని వర్గాల ప్రజల నుంచి ఆదరణ
నగరంలో ఆనాటి నుంచీ షేర్వానీ ట్రెండ్
నవాబుల కాలం నుంచి ఇప్పటి దాకా షేర్వానీకి ఏమాత్రం క్రేజ్ తగ్గకపోగా రోజురోజుకూ పెరుగుతోంది. ఒకప్పుడు రాజ కుటుంబీకులు, సంపన్నవర్గాలకే షేర్వానీ పరిమితమయ్యేది. రానురాను పేద, ధనిక అందరూ షేర్వానీ అంటే ఆసక్తి కనబరుస్తున్నారు. పెళ్లిళ్లు, పేరంటాల్లో కుటుంబ సభ్యులంతా చిన్నాపెద్దా తేడా లేకుండా షేర్వానీ ధరించాల్సిందే.. బ్రాండెడ్ దుస్తులు మార్కెట్‌ను రాజ్యమేలుతున్నా.. రాజుల కాలం నాటి షేర్వానీలు పండగలు, శుభకార్యాలకు సరికొత్త శోభను తీసుకువస్తున్నాయి. ఇదే ఇప్పుడు నయా ట్రెండ్‌గా మారింది.
అభిరుచులకు అనుగుణంగా షేర్వానీ డిజైన్లలోనూ మార్పులొచ్చాయి. రాకుమారులు.. సినీహీరోలు.. రాజకీయ నాయకులు ఇలా సెలబ్రెటీలంతా భారతీయ సంస్కృతికి అద్దంపట్టేలా షేర్వానీని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు. కేవలం మన సంస్కృతే కాదు.. పాశ్చాత్య డిజైన్ల సమ్మేళనంగా సరికొత్త షేర్వానీలు మార్కెట్‌లో ఆదరణ పొందుతున్నాయి. హైదరాబాద్‌లో కేవలం నిజాం నవాబులు, ముస్లిం, మార్వాడీ సమాజంలోనే షేర్వానీ ఆహార్యం కనిపించేంది. ఇప్పుడు ఈ ఫ్యాషన్ అందరి ఒంటి మీదకు చేరింది. మొదట్లో కేవలం పెళ్లి కుమారుడే షేర్వానీతో ఊరేగేవాడు.. ఇప్పుడు వరుడే కాదు.. పెళ్లి బరాత్‌కు హాజరయ్యే ప్రతి ఒక్కరూ ఈ డ్రెస్ వేర్‌ను వాడటం పరిపాటిగా మారింది. విభిన్న రకాలతో షేర్వానీలతో బరాత్‌కే కొత్త అందం వస్తుందనే ప్రచారంతో వివాహంలో షేర్వానీ డ్రెస్ కోడ్‌గా మారింది.
షేర్వానీ అంటే మక్కువ ఇండో వెస్టన్
డిజైన్స్‌తో వినియోగదారులకు నచ్చే విధంగా షేర్వానీలు తయారు చేస్తున్నాం. నేటి యువత మాములు డిజైన్ షేర్వానీలకు కాకుండా స్టైయిలి‹Ùగా కనబడటానికి కొత్త డిజైన్స్‌ను ఫాలో అవుతున్నారు. మారుతున్న డిజైన్స్‌కు అనుగుణంగా మా వద్ద షేర్వానీలు తయారవుతాయి. ప్రస్తుతం అన్ని మతాలు, వర్గాల వారు వీటిని ధరిస్తున్నారు. వారి వారి సంప్రదాయల డిజైన్లలో తయారు చేస్తున్నాం. షేర్మానీలు ధరించి శుభకార్యాలకు వెళితే ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. శుభకార్యాలు పెళ్లిళ్లు విందుల్లో షేర్వాణి ధరించి వెళ్లే వారివైపే అందరి చూపు ఉంటుంది. నేటి యువత వీటిని ధరించడానికి మక్కువ చూపుతున్నారు.
– ఇబ్రాహీమ్ బుఖారీ, జహాపనా డిజైనర్స్ వ్యవస్థాపకుడు
బనారస్ పట్టుతో తయారీ
షేర్వానీల తయారీలో బనారస్ పట్టుదే పైచేయి. ఈ పట్టుతోనే వీటిని ఉత్పత్తి చేసే అవకాశమున్నందున.. ఫ్యాషన్‌లో బనారస్ షేర్వానీలదే హవా. పురుషులు వ్రస్తాలలో పట్టుకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. కేవలం షేర్వానీలలో మాత్రం ఈ పట్టుకే పట్టం కడుతున్నారు. ఇలా వస్త్ర నాణ్యతకు అనుగుణంగా వీటి ధరల్లో హెచ్చు తగ్గులున్నాయి. రూ.2వేల నుంచి రూ.2 లక్షల వరకు షేర్వానీలు లభ్యమవుతున్నాయంటే వీటికి మార్కెట్‌లో ఉన్న డిమాండ్‌ను అర్థం చేసుకోవచ్చు. వీటికి ఉన్న ఆదరణ దష్ట్యా షేర్వానీ ప్రియులు కస్టమైజ్డ్ డిజైన్లు చేయించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యేకంగా డిజైనర్లు సైతం పుట్టుకొచ్చారు. నగరంలో బుఖారీ ఫ్యామిలీ జహాపనా డిజైనర్స్ పేరుతో షేర్వానీ రంగంలో విప్లం తీసుకొచి్చంది. యుత్‌కు నచ్చే స్టయిల్స్‌తో పాటు అన్ని కట్స్‌లో షేర్వానీలు తయారవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment