జోరు.. హుషారుగా : మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌-బ్యూటీఫుల్‌ ఆడిషన్స్‌ | Miss and Mrs Strong - Beautiful Auditions At Hyderabad | Sakshi
Sakshi News home page

జోరు.. హుషారుగా : మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌- బ్యూటీఫుల్‌ ఆడిషన్స్‌

Published Sat, Mar 1 2025 4:54 PM | Last Updated on Sat, Mar 1 2025 5:06 PM

Miss and Mrs Strong - Beautiful Auditions At Hyderabad

నగరంలో జరుగుతున్న మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్‌ – బ్యూటీఫుల్‌ ఆడిషన్స్‌  ఆకట్టుకున్నాయి. మాసాబ్‌ ట్యాంక్‌లోని జేఎన్‌ఎఫ్‌ యూలో శుక్రవారం యువతులతో పాటు వివాహిత మహిళలకు ఈ ఆడిషన్స్‌ నిర్వహించారు. ఇందులో రెండు తెలుగు రాష్ట్రాల్లో విభిన్న రంగాలకు చెందిన వారు ఈ పోటీల్లో హుషారుగా పాలుపంచుకున్నారు. కార్యక్రమంలో సినీనటుడు జోయల్, మిస్‌ ఇండియా రన్నరప్‌ నిషితా తదితర ఫ్యాషన్‌ రంగ ప్రముఖులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ ఆడిషన్స్‌ ద్వారా ఎంపికైన వారు మార్చి 29న జరిగే ఫైనల్స్‌లో పోటీ పడతారని నిర్వాహకురాలు కిరణ్మయి అలివేలు తెలిపారు. – సాక్షి, సిటీబ్యూరో 

 

గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి : హైదరాబాద్ : ఆకట్టుకున్న మిస్‌ అండ్‌ మిసెస్‌ స్ట్రాంగ్ ఆడిషన్స్‌ (ఫొటోలు)
 

శిల్పారామానికి   గోల్డ్‌ గార్డెన్‌
మాదాపూర్‌ : మాదాపూర్‌ శిల్పారామం అరుదైన పురస్కారాన్ని అందుకుంది. తెలంగాణ ప్రభుత్వం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ హార్టీకల్చర్‌ ఎనిమిదో గార్డెన్‌ ఫెస్టివల్లో మాదాపూర్‌ శిల్పారామానికి ల్యాండ్‌స్కేప్‌ గార్డెన్‌ నిర్వహణకు గానూ గోల్డ్‌గార్డెన్‌ సర్టిఫికెట్, జ్ఞాపికను 
అందజేశారు. ఈ అవార్డు ఇచ్చినందుకు శిల్పారామం ప్రత్యేక అధికారి జి.కిషన్‌రావు సంతోషం వ్యక్తం చేశారు .డిపార్ట్‌మెంట్‌ 
ఆఫ్‌ హార్టీకల్చర్‌ ఎనిమిదో ఫెస్టివల్లో ప్రదానం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement