
గచ్చిబౌలి: వజ్రాభరణాలంటే చాలా ఇష్టమని నటి పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput) అన్నారు. కొండాపూర్‌లోని ప్రణవ్ వైష్ణాయ్ బిజినెస్ పార్క్‌లో టీబీజడ్–ది ఒరిజినల్ జ్యువెలర్ స్టోర్‌ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టోర్‌లో వివిధ రకాల డిజైన్ల భరణాలు ధరించి సందడి చేశారు. అనంతరం పాయల్ రాజ్‌పుత్ మాట్లడుతూ రూ.75 లక్షల విలువైన వజ్రాలు (Diamonds) పొదిగిన నక్లెస్‌తో పాటు మొత్తం కోటి రూపాయల విలువైన ఆభరణాలు ధరించానని చెప్పారు.
ప్రతి ఆభరణం మన సంస్కృతిని తెలియజేసే విధంగా రూపొందించారన్నారు. టీబీజడ్ మూడో స్టోర్‌ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మార్కెటింగ్ చీఫ్ ఆఫీసర్ రితీష్ గాడే మాట్లాడుతూ ప్రతి ఆభరణం మన వారసత్వానికి ప్రతీకలని, స్టోర్ బంగారంతో పాటు యాంటిక్, టెంపుల్ ఆభరణాలు అందుబాటులో ఉంటాయని అన్నారు. విస్తృతశ్రేణి మోడళ్లు, వినూత్నమైన డిజైన్లు, ఆకర్షణీయమైన ఆఫర్లతో సమకాలీన ఆభరణాల నుంచి సంప్రదాయ ఆభరణాలను వినియోగదారులకు అందిస్తున్నామన్నారు. టీబీజడ్ ఒరిజినల్ సర్టిఫైడ్, స్వచ్ఛతను సూచించే హాల్‌మార్క్‌ను కలిగి ఉందన్నారు. దేశంలో వివిధ నగరాల్లో 37 స్టోర్లు ఉన్నాయని తెలిపారు.
చదవండి: ఉద్యోగం కోసం వెళ్లి, 42 ఏళ్లు అక్కడే మగ్గిపోయాడు...చివరికి