
‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’
డిజైన్‌కు ప్రపంచ కేంద్రంగా..
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరం ఇప్పటికీ ముత్యాల నగరంగా ప్రసిద్ధి చెందిన విషయం విధితమే.. ఈ గుర్తింపును ఇప్పటికీ కాపాడుకుంటూ దేశవ్యాప్తంగా బంగారు ఆభరణాలు, వజ్రాలకు ప్రసిద్ధ గమ్యస్థానంగా నగరం నిలుస్తోంది. అంతేకాకుండా ఆభరణాల వ్యాపారానికి సురక్షితమైన ప్రాంతంగానూ నగరం సేవలందిస్తోంది. విభిన్న సంస్కృతుల నేపథ్యంలో ఈ వ్యాపార కలాపాలు ఇక్కడ విస్తృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ప్రపంచ ఆభరణాల వినియోగంలో దేశం దాదాపు 29 శాతం వాటా కలిగి ఉంది. ఇందులో దక్షిణాది, మరీ ముఖ్యంగా భాగ్యనగరం ప్రధాన వాటాదారుగా ఉంది.
ఈ నేపథ్యంలో నగరం వేదికగా ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’కు సిద్ధమవు తోంది. 3 రోజుల ఈవెంట్‌లో ట్రెండ్ సెట్టింగ్ డిజైన్లు, బ్రాండ్ లాంచ్‌లు, ఆభరణాల సమావేశాలు, ప్రతిష్టాత్మక అవార్డుల వేడుక, పవర్ ఆఫ్ యంగ్, లెజెండ్స్ ఆఫ్ సౌత్, జ్యువెలరీ పర్చేజ్ మేనేజర్స్ కనెక్ట్, కాఫీ విత్ డాక్టర్ చేతన్, బిజినెస్ మ్యాచ్ మేకింగ్ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం
దక్షిణాదిలోని హైదరాబాద్ సహా ముంబై, జైపూర్, కేరళ, బెంగళూరు, కోయంబత్తూర్, చెన్నై వంటి నగరాలకు చెందిన ప్రముఖ జ్యువెల్లరీ బ్రాండ్లు నగరానికి విచ్చేయనున్నాయి. నగరంలోని హైటెక్స్ వేదికగా వచ్చే నెల 9 నుంచి 11వ తేదీ వరకు ప్రతిష్టాత్మక ‘హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్’ నిర్వహించనున్నారు. భారతదేశపు ప్రీమియర్ బీ2బీ జ్యువెలరీ ఎగ్జిబిషన్‌గా ఇందులో 8 వేలకు పైగా వాణిజ్య సందర్శకులను ఆకర్షిస్తోందని, 220పైగా ప్రదర్శనకారులకు ఆతిథ్యం ఇస్తుందని అంచనా. ఈ వేదికగా తాజా ఆభరణాల ట్రెండ్స్, ప్రత్యేక బ్రాండ్ సేకరణలు, అత్యాధునిక డిజైన్లను ఆవిష్కరిస్తుంది. ఈ వేదికగా భారతదేశ వార్షిక ఆభరణాల అమ్మకాలలో 60 శాతం వరకు ప్రభావితం చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్ అండ్ జెమ్ ఫెయిర్ దేశంలోని ప్రీమియం ప్లాట్‌ఫామ్‌లలో ఒకటిగా స్థిరపడింది. దక్షిణాదిలోని ఆవిష్కరణ, హస్తకళ, వారసత్వం, వ్యాపారాన్ని ఒకే వేదికపైకి తీసుకువస్తున్నాం. బంగారం, వజ్రం, వెండి, ముత్యాలు, రత్నాల ఆభరణాలను, టెక్నాలజీ ప్రొవైడర్లు, విలువైన లోహ సరఫరాదారులు, ఆభరణాల యంత్రాల తయారీదారులు, భారత్‌తో పాటు విదేశాల నుంచి మౌంటింగ్ వ్యాపారులను ఏకం చేస్తున్నాం.
– యోగేష్ ముద్రాస్, భారత
ఇన్ఫార్మా మార్కెట్స్ మేనేజింగ్ డైరెక్టర్. వచ్చే నెలలో హైదరాబాద్ జ్యువెలరీ పెర్ల్, జెమ్ ఫెయిర్