హైదరాబాద్: భారతీయ కళానైపుణ్యాన్ని ప్రోత్సహించే స్వదేశ్ బ్రాండ్, అంతర్జాతీయ వస్త్ర తయారీదారులు ఫాల్గుణి షేన్ పీకాక్‌తో కలిసి హైదరాబాద్‌లో స్వదేశ్ ఫ్లాగ్ షిప్ స్టోర్‌లో ప్రత్యేక ప్రదర్శనను ప్రకటించారు. ఫాల్గుణి షేన్ పీకాక్ 20వ వార్షికోత్సవంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ పద్ధతులను అత్యాధునిక ఫ్యాషన్ డిజైన్ తో మేళవించారు. కాంచీవరం సిల్క్స్, చికంకారీ ఎంబ్రాయిడరీ, బనారసి బ్రోకేడ్స్ వంటి ఐకానిక్ భారతీయ హస్తకళలు ఉన్నాయి.
స్వదేశ్‌లో ప్రత్యేకంగా లభించే ఈ లిమిటెడ్ ఎడిషన్ కోచర్.. భారతీయ హస్తకళా వారసత్వాన్ని పునఃసమీక్షిస్తుంది. వినూత్న డిజైన్‌తో పాటు అద్భుతమైన కళానైపుణ్యాన్ని ప్రదర్శిస్తుంది. ఫాల్గుణి షేన్ పీకాక్ 20 సంవత్సరాల కాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ కోచర్ డిజైనర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. సంప్రదాయ కళానైపుణ్యాన్ని జోడిస్తూ, రంగులతో ప్రయోగాలు చేస్తూ సరిహద్దులను విస్తరించింది. వర్చువల్ స్టైలింగ్ వంటి మార్గదర్శక ఫీచర్ల ద్వారా టెక్నాలజీ పరంగా బ్రాండ్ అభివృద్ధి చెందింది. అందుకే ఇది సెలబ్రిటీలకు సైతం నచ్చేసింది.
రెండు దశాబ్దాల ఫ్యాషన్ ఆవిష్కరణను ప్రతిబింబిస్తూ, ఫాల్గుణి షేన్ పీకాక్ సహ వ్యవస్థాపకుడు షేన్ పీకాక్ ఇలా పేర్కొన్నాడు, "స్వదేశ్‌తో కలిసి నడవడం స్పెషల్‌గా అనిపిస్తోంది. ఎందుకంటే మా డిజైన్లకు భారతీయ హస్తకళ తోడవటంతో ఫ్యాషన్‌లో కొత్త కోణాలను అన్వేషించేందుకు ఉపయోగపడుతుంది. మొట్టమొదటిసారిగా భారత్‌తో పనిచేసి ఇక్కడి వారసత్వం, సంస్కృతి నుంచి ప్రేరణ పొందే ఆకృతులను తయారు చేశాం. ఈ లిమిటెడ్ ఎడిషన్ సేకరణలో క్లిష్టమైన జరీ వర్క్ తో బెస్పోక్ చీరలు ఉన్నాయి. హైదరాబాద్ లోని స్వదేశ్ స్టోర్‌ను సందర్శించేందుకు వస్త్రప్రియులను ఆహ్వానిస్తున్నాము" అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment