నగరంలో లండన్ యూనివర్సిటీ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్ కోర్సులు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.
లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్‌మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.
ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్‌బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment