బాలీవుడ్ టూ హైదరాబాద్..
రిచ్ ఫ్యాషన్‌కు కేంద్రం భాగ్యనగరం
రాజసాన్ని కొనసాగిస్తున్న నగరం..
ఐశ్వర్యారాయ్, ప్రియాంక చోప్రా తదితరులకు డిజైనర్‌గా
అనుభవాలు పంచుకున్న ఓస్వాల్..
సాక్షి, సిటీబ్యూరో: ఫ్యాషన్ డిజైనింగ్, అధునాతన ఫ్యాషన్ ట్రెండ్స్‌కు హైదరాబాద్ నగరం ‘సోల్ సిటీ’ అని ప్రముఖ బాలీవుడ్ ఫ్యాషన్ డిజైనర్ అనిత ఓస్వాల్ తెలిపారు. దశాబ్దాల కాలం నుంచే ఇక్కడి రిచ్ కల్చర్ ప్రసిద్ధి చెందిందని, ఆ సాంస్కృతిక వారసత్వాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ సౌందర్య వాణిజ్య రంగానికి కూడా కేంద్రంగా రాజసాన్ని నిలుపుకుంటుందని ఓస్వాల్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌కు జ్వువెల్లరీ డిజైన్ చేస్తున్న సమయంలో పలుమార్లు దక్షిణాది సౌందర్య సొగసుల పైన చర్చించిన సందర్భాలూ ఉన్నాయని ఆమె గుర్తు చేసుకున్నారు. అనిత ఓస్వాల్ డిజైన్ చేసిన బంగారు, వజ్రాభరణాలను నగరంలోని రూం 9 పాప్ అప్ వేదికగా ‘ఝౌహరి’ పేరుతో ప్రదర్శిస్తున్నారు. తనతో పాటు కవిత కోపార్కర్ ఆధ్వర్యంలోని అత్యంత విలువైన ప్రతా పైథానీ, బనారస్ శారీస్‌నూ ప్రదర్శిస్తున్న ’ఝౌహరి’ని ప్రముఖ సామాజిక వేత్త శ్రీదేవి చౌదరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓస్వాల్ నగరంలోని ఫ్యాషన్ హంగులను, బాలీవుడ్ తారల అభిరుచులను పంచుకున్నారు.
హైదరాబాద్.. డ్రీమ్ ప్రాజెక్ట్..
విలాసవంతమైన జీవితాల్లో ఆభరణాలు, జీవన శైలి ప్రధానమైన అంశాలని ఓస్వాల్ వివరించారు. 25 ఏళ్లుగా బాలీవుడ్ తారలకు జువెల్లరీ డిజైన్స్ రూపొందిస్తున్నానని, కానీ హైదరాబాద్ వేదికగా తన డిజైన్స్ ప్రదర్శించడం డ్రీమ్ ప్రాజెక్ట్‌గా పెట్టుకున్నానని అన్నారు. మాజీ మిస్ యూనివర్స్ ఐశ్వర్య రాయ్, ప్రియాంక చోప్రా, కిరన్ ఖేర్, సోనాక్షి సిన్హా, సంజయ్ లీలా భన్సాలీ వంటి స్టార్స్‌కు డిజైనర్‌గా చేశాను. ఐశ్వర్యరాయ్ భారతీయ సంస్కృతిలోని ఆభరణాల సౌందర్య వైభవాన్ని మరింత ఉన్నతంగా గ్లోబల్ వేదికపైన ప్రదర్శించడానికి ఇష్టపడేదని ఆమె అన్నారు.
ఫ్యాషన్ ఐకాన్ ప్రియాంక చోప్రా అంతర్జాతీయ స్థాయి డిజైనింగ్‌ను అందిపుచ్చుకోవడంలో ఆసక్తిగా ఉంటుంది. ఎప్పటికప్పుడు న్యూ ట్రెండ్స్‌ను అనుకరిస్తూ, సృష్టిస్తూ ఫ్యాషన్‌కు కేరాఫ్‌గా నిలిచే హైదరాబాద్ ఫ్యాషన్ ఔత్సాహికులను కలవడం, వారి అభిరుచులను మరింతగా గమనించడం సంతోషాన్నిచ్చింది. సెలబ్రిటీ సీక్రెట్స్ వ్యవస్థాపకురాలు డా.మాధవి నేతృత్వంలో రిచ్ లైఫ్‌ను ప్రతిబింబించే కవిత కోపార్కర్ ప్రతా పైథానీ, బనారస్ డిజైన్‌లతో రూం 9 పాప్ అప్‌లో... 3 రోజుల పాటు నగర ఫ్యాషన్ ప్రేమికులకు మరో ప్రపంచాన్ని చేరువ చేయనుందని ఆమె తెలిపారు.
ఇవి చదవండి: An Inch.. ఆర్ట్ పంచ్! రూపం సూక్ష్మం.. కళ అనంతం!
Comments
Please login to add a commentAdd a comment