
లగ్జరీ బంగారు, వజ్రాభరణాలకు కేంద్రంగా..
కేపీహెచ్‌బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్‌లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు.
మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment