kphp
-
Hyderabad: క్రియాలో.. శ్రియ! కేపీహెచ్బీలో క్రియా జ్యువెల్లర్స్ ప్రారంభం!
సాక్షి, సిటీబ్యూరో: లక్షణమైన దక్షిణాది అమ్మాయిలా ముస్తాబు కావడం ఎంతో ఇష్టమని ప్రముఖ సినీతార శ్రియ శరన్ తెలిపారు. కేపీహెచ్‌బీ రోడ్ నంబర్–1లో నూతనంగా ఏర్పాటు చేసిన క్రియా జ్యువెల్స్‌ను బుధవారం ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అందరు మగువల్లానే తనకూ బంగారు ఆభరణాలు ఎంతో ఇష్టమన్నారు. ఆభరణాలు మగువలకు మరింత సౌందర్యాన్ని పెంచుతాయని పేర్కొన్నారు. క్రియా ఆధ్వర్యంలోని లైట్ వెయిట్ ఆభరణాలు వినూత్నంగా ఉన్నాయని చెప్పారు. సినిమాల గురించి మాట్లాడుతూ.. తెలుగులో తేజా సజ్జా సినిమాలో, తమిళ్లో సూర్యతో మరో సినిమాలో నటిస్తున్నానని తెలిపారు. వారసత్వం, సంప్రదాయ ఆవిష్కరణలో భాగంగా క్రియా జ్యువెల్లరీని ప్రారంభించామని నిర్వాహకులు కొణిజేటి వెంకట మహేష్ గుప్తా అన్నారు. వజ్రాభరణాలతో పాటు ప్రత్యేకంగా విక్టోరియన్ కలెక్షన్ అందుబాటులో ఉన్నాయన్నారు. మరికొద్ది రోజుల్లో మరిన్ని స్టోర్లను ప్రారంభించను న్నామని ఆయన తెలిపారు. -
తిరుపతి వెళ్లివచ్చేలోగా..
కేపీహెచ్‌బీకాలనీ: దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు రూ.60వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ పోలిస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపీనా«థ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవ ఫేజ్ హెచ్ఐజీ 868లో హెచ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణదాసు కుటుంబం నివాసం ఉంటోంది. తన కూతురు వివాహాం కోసం ఇంట్లో ఉన్న పాత బంగారంతో పాటు మరికొన్ని నగలు కొనుగోలు చేసి ఇంట్లో భద్రపరిచారు. బంధువుల శుభకార్యం నిమిత్తం కుటుంబ సమేతంగా ఈనెల 7న నెల్లూరు వెళ్లిన క్రిష్ణదాస్ అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి దైవదర్శనం చేసుకొని బుధవారం తిరిగివచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న కిలో బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు కనిపించకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కుషాల్కర్, సైబరాబాద్ క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. బెడ్రూంలో తలగడ కింద ఉన్న తాళాలను తీసుకుని గదిలోని మూడు బీరువాల్లో ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లడంతో తెలిసిన వారి పనే అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉరేసుకుని సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్‌బీ లో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని 5వ ఫేజ్ హాస్టల్ ఉంటున్న తేజస్విని (25) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగిని గురువారం తన మేనమామ ఇంట్లో ఆత్మహత్య చేసింది. ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. తేజస్విని సొంతూరు వరంగల్ జిల్లా ఖాజీపేట. తండ్రి రైల్వేలో ఉద్యోగం చేస్తున్నాడు. తేజస్విని ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
వీడ్కోలు అంటూ..