ఆధారాలు సేకరిస్తున్న క్లూస్‌టీం
కేపీహెచ్‌బీకాలనీ: దైవదర్శనం కోసం తిరుపతి వెళ్లి తిరిగి వచ్చేలోగా ఇంట్లో దొంగలు పడి కిలో బంగారు ఆభరణాలు, కిలో వెండితో పాటు రూ.60వేల నగదు ఎత్తుకెళ్లిన సంఘటన కేపీహెచ్‌బీ పోలిస్‌స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. కేపీహెచ్‌బీ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ గోపీనా«థ్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కేపీహెచ్‌బీ కాలనీలోని మూడవ ఫేజ్ హెచ్‌ఐజీ 868లో హెచ్‌సీఐ రిటైర్డ్ ఉద్యోగి కృష్ణదాసు కుటుంబం నివాసం ఉంటోంది.
తన కూతురు వివాహాం కోసం ఇంట్లో ఉన్న పాత బంగారంతో పాటు మరికొన్ని నగలు కొనుగోలు చేసి ఇంట్లో భద్రపరిచారు. బంధువుల శుభకార్యం నిమిత్తం కుటుంబ సమేతంగా ఈనెల 7న నెల్లూరు వెళ్లిన క్రిష్ణదాస్ అక్కడి నుంచి తిరుపతికి వెళ్లి దైవదర్శనం చేసుకొని బుధవారం తిరిగివచ్చారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటంతో పాటు బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో ఉన్న కిలో బంగారు ఆభరణాలు, కిలో వెండి ఆభరణాలు, రూ.60 వేల నగదు కనిపించకపోవడంతో కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ కుషాల్కర్, సైబరాబాద్ క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరించారు. బెడ్‌రూంలో తలగడ కింద ఉన్న తాళాలను తీసుకుని గదిలోని మూడు బీరువాల్లో ఉన్న ఆభరణాలను ఎత్తుకెళ్లడంతో తెలిసిన వారి పనే అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment