యువ ప్రతిభకు వేదికగా ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా’..
దేశవ్యాప్తంగా పాల్గొంటున్న యువ ఔత్సాహికులు..
గ్రాండ్ ఫినాలేకు చేరుకున్న నగరానికి చెందిన 17 ఏళ్ల ఐశ్వర్య..
సాక్షి, సిటీబ్యూరో: దేశవ్యాప్తంగా యువ ప్రతిభను కనిపెట్టి, వారిని ప్రోత్సహించే ప్రతిష్టాత్మక పోటీ ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా’. ఈ పోటీలో పాల్గొనడానికి, విజేతగా నిలవడానికి దేశవ్యాప్తంగా యువత ఆసక్తి చూపిస్తుంది. అయితే ‘అలీ క్లబ్ మిస్ అండ్ మిస్టర్ టీన్ ఇండియా–2024’ పోటీల్లో హైదరాబాద్‌కు చెందిన 17 ఏళ్ల కాటేపల్లి ఐశ్వర్య ఫైనలిస్ట్‌గా నిలిచి అందరి దృష్టినీ ఆకర్షించింది.
ఫ్యాషన్, జీవనశైలి, వినోద రంగాల్లో యువ ప్రతిభతో వారి కలలను నెరవేర్చుకోవడానికి అద్భుత వేదికగా ఫ్యాషన్ పోటీలు నిలుస్తా్తయి. ముఖ్యంగా నగరంలో ‘అలీ క్లబ్ మిస్, మిస్టర్ టీన్ ఇండియా’.. ‘లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్’ ద్వారా గుర్తింపు పొందింది. ఇలాంటి వేదికపై తన అభిరుచులు, ఫ్యాషన్‌పై ఆమె అంకితభావంతో విజేతగా నిలవడానికి గ్రాండ్ ఫినాలేకి చేరుకుంది.
సెమీ ఫైనల్స్ ఆత్మస్థైర్యాన్ని పెంచింది...
ప్రస్తుతం షాఫ్ట్ మల్టీమీడియాలో కంప్యూటర్ సైన్స్‌పై దృష్టి సారిస్తూ 12వ తరగతి చదువుతోంది ఐశ్వర్య. ఆమె చదువులతో పాటు మల్టీమీడియా, ఫైన్ ఆర్ట్స్‌లో డిప్లొమా కోసం కృషి చేస్తుంది. నగరంలోని డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో పనిచేస్తూ వాస్తవ ప్రపంచ అనుభవాన్ని పొందుతోంది. ఈ ప్రయాణం వ్యక్తిగతంగానే కాకుండా వృత్తిపరమైన వృద్ధికి ఆమె నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఈ నెల 31న ఢిల్లీ వేదికగా జరగనున్న గ్రాండ్ ఫినాలేలో విజేతగా నిలవడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్నానని ఐశ్వర్య తెలిపింది.
గత నెలలో జరిగిన సెమీ–ఫైనల్ రౌండ్‌లో దేశవ్యాప్తంగా పాల్గొన్న ఫ్యాషన్ ఔత్సాహికులను దాటుకుని గ్రాండ్ ఫినాలేలో అడుగుపెట్టడం మరింత ఆత్మస్థైర్యాన్ని పెంచిందని ఆమె అన్నారు. దేశవ్యాప్తంగా యువ ప్రతిభావంతులకు గుర్తింపునిచ్చే ఈ వారసత్వంలో ప్రాతినిథ్యం వహిస్తూ హైదరాబాద్ నగరాన్ని మరోసారి జాతీయ వేదికపై నిలపడం సంతోషంగా ఉందన్నారు. తన తోటి పారి్టసిపెంట్స్‌తో కలిసి జడ్జిల ప్యానెల్ ముందు తమ సామర్థ్యాలను ప్రదర్శించే ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నానని ఐశ్వర్య తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment