అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌.. | Hyderabad Is The Center Of Trendy Fashion Future | Sakshi
Sakshi News home page

అధునాతన ఫ్యాషన్‌కు కేంద్రంగా హైదరాబాద్‌..

Published Fri, Jun 28 2024 9:48 AM | Last Updated on Fri, Jun 28 2024 9:54 AM

Hyderabad Is The Center Of Trendy Fashion Future

ఫ్యాషన్ ఫ్యూచర్

అప్పారల్‌ ఫ్యాషన్‌ రంగంలో ప్రత్యేకత చాటుకుంటూ..

ఈ రంగంలో భారత్‌ 350 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌

అందిపుచ్చుకోవడానికి అడుగులేస్తున్న ఔత్సాహికులు

సాక్షి, సిటీబ్యూరో: అద్భుతమైన వారసత్వ సంపద, అధునాతన ఫ్యాషన్‌ హంగులకు పెట్టింది పేరు హైదరాబాద్‌ మహానగరం. విభిన్న రంగాల్లో తనదైన ముద్రవేసుకుంటూనే యావత్‌ ప్రపంచం అనుసరిస్తున్న ఫ్యాషన్‌ పోకడలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటోంది. ముఖ్యంగా ఈ ఫ్యాషన్‌ ప్రపంచంలో దుస్తుల డిజైనింగ్‌ అనేది ముఖ్యమైంది.  వివిధ దేశాలకు భారత్‌ వస్త్ర ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్కృతిని హైదరాబాద్‌ డిజైనింగ్‌ రంగం ఇప్పటికీ కొనసాగిస్తోంది. ఈ రంగానికి భారత్‌లో దాదాపు 350 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ మార్కెట్‌ ఉంది.

ఫ్యాషన్‌లోని విభిన్న అంశాల్లో హైదరాబాద్‌ వేదికగా ఉన్నందున ఈ అవకాశాలను వినియోగించుకుంటూ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ రంగంలో నగర విద్యార్థులు మంచి కెరీర్‌కు బాటలు వేసుకుంటున్నారు. ఆర్థికంగా, ఉద్యోగావకాశాల పరంగా, అంకుర సంస్థల ఏర్పాట్లలోనూ రాణిస్తున్నారు.

ఈ ఫ్యాషన్‌ ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులు, ఇన్‌స్టిట్యూషన్లను నెలకొల్పారు. ప్రభుత్వ యూనివర్సిటీలో సైతం ఈ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ఔత్సాహిక ఫ్యాషన్‌ డిజైనర్లు ఈ కోర్సుల్లో తమ ప్రతిభ నిరూపించుకుంటూ జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు.

ఫ్యాషన్‌ రంగానికి కేంద్రంగా.. 
నగరంలోని మాసబ్‌ట్యాంక్‌ వేదికగా ఉన్న జవహర్‌లాల్‌ నెహ్రూ ఆర్కిటెక్చర్‌ అండ్‌ ఫైన్‌ ఆర్ట్స్‌ యూనివర్సిటీతో పాటు పలు ప్రైవేట్‌ రంగ సంస్థలు ఈ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులను అందిస్తున్నాయి. 9 నెలల పాటు ఉండే ఈ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సులో రెండు సెమిస్టర్లు ఉంటాయి. ఇందులో భాగంగా ప్రిన్సిపుల్స్‌ ఆఫ్‌ ఫ్యాషన్, ఫ్యాషన్‌ ఆర్ట్‌ అండ్‌ ఇల్ల్రస్టెషన్, టెక్స్‌టైల్‌ అండ్‌ పాటర్న్‌ మేకింగ్, గార్మెంట్‌ కన్‌స్ట్రక్షన్, సర్ఫేస్‌ ఆర్నమెంటేషన్‌ వంటి అంశాల్లో శిక్షణ అందిస్తున్నారు.

అనంతరం డిజైనింగ్‌ వృత్తిలో నైపుణ్యులైన మార్కెటింగ్‌ మర్చెండైజింగ్, క్యాడ్‌ బేసిక్స్, పోర్ట్‌ఫోలియో వంటి విభిన్న అంశాల్లోనూ శిక్షణ ఉంటుంది. ఈ కోర్సులు చేస్తున్న నగర విద్యార్థులు జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్‌ షోలలో, ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కంపెనీలో అవకాశాలను పొందుతూ భవిష్యత్‌లో కూడా ఫ్యాషన్‌ రంగానికి హైదరాబాద్‌ కేంద్రంగా నిలుస్తుందని నిరూపిస్తున్నారు.

వినూత్న ఆలోచనకు వారధి..
అందరిలా కాకుండా వినూత్నంగా ఆలోచించే నా విధానానికి ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌ తోడ్పాటు అందించింది. ఈ డిజైనింగ్‌ కోర్స్‌లో భాగంగా డిజైన్స్‌ ఎలా రూపొందించాలి.. వాటిని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్లాలి.. మారుతున్న అధునాతన ఫ్యాషన్‌ జీవనానికి అనుగుణంగా మన ఆలోచనలు ఎలా మార్చుకోవాలి తదితర అంశాల్లో అవగాహన పెంచుకున్నాను. జీవితానికి భరోసా ఇచ్చే వృత్తి విద్య కోర్సుల్లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అత్యుత్తమమైంది. మంచి ఫలితాలను అందిస్తుంది. ఈ కోర్సు చేయడమే కాకుండా 2023లో జాతీయస్థాయిలో ఉత్తమ డిజైనింగ్‌ బృందంలో ఒకడిగా అవార్డు అందుకున్నాను.  – దీక్షిత్, ఫ్యాషన్‌ డిజైనర్‌.

అవకాశాలు పుష్కలం.. 
ఈ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్స్‌కు గతంలో ఇంటర్‌ అర్హతగా ఉండేది. కానీ ప్రస్తుతం పదవ తరగతి చదివిన వాళ్లకు కూడా అవకాశం   కలి్పస్తున్నారు. ఈ కోర్స్‌ చేసిన తర్వాత ఫ్యాషన్‌ రంగంలో అవకాశాలతో పాటు వ్యక్తిగతంగా బోటిక్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. కేవలం ఒక్కో డిజైనింగ్‌కు రూ.10 వేల నుంచి లక్షల్లో సంపాదించుకునే వేదికలు, అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎంతోకాలంగా నగరంలోని ఫ్యాషన్‌ డిజైనింగ్‌ పరిశ్రమను వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి వచి్చన డిజైనర్లు వినియోగించుకోగా ఈ మధ్యకాలంలో స్థానికంగానే ఫ్యాషన్‌ డిజై నర్లు పుట్టుకొస్తున్నారు. దుబాయ్‌ వంటి దేశాల్లో అవకాశాలను పొందుతున్నారు.

గ్లోబల్‌ రన్‌వేలో మనమే టాప్‌.. 
హితమ్స్‌ అకాడమీ(హెచ్‌ఐఐటీఎంఎస్‌) అప్పారల్‌∙ఫ్యాషన్‌ రంగంలో ఔత్సాహిక విద్యార్థులకు శిక్షణ అందించడానికి విభిన్న ప్రాజెక్టులను రూపొందించాం. నగరంలోని జేఎన్‌ఏఎఫ్‌ఏ యూనివర్సిటీతో పాటు ఫ్యాషన్‌ క్యాపిటల్‌గా ప్రసిద్దిగాంచిన ఇటలీలోని ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ సంస్థ ఐఎంబి మిలాన్‌ ఆధ్వర్యంలో సర్టిఫికేషన్‌ కోర్సులను అందిస్తూ.. మా విద్యార్థులకు ఏకకాలంలో రెండు యూనివర్సిటీల సర్టిఫికేట్లను అందిస్తున్నాం.

ఔత్సాహిక విద్యార్థులను సైట్‌ విసిట్, వర్క్‌షాప్‌లో భాగంగా ఇటలీకి తీసుకెళ్లి అధునాతన ఫ్యాషన్‌ డిజైనింగ్‌లపై అవగాహన కల్పిస్తున్నాం. భారత్‌లోని 350 బిలియన్‌ డాలర్ల బిజినెస్‌ మార్క్‌ను రాష్ట్రానికి చెందిన విద్యార్థులు అందుకునేలా.. కోర్సులో బాడీ పోస్టర్, కలర్‌ కాంబినేషన్‌ సైకాలజీ, ఔట్‌ ఫిట్, ఫ్యాబ్రిక్‌ అనాలసిస్‌ వంటి అంశాల్లో ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్‌తో శిక్షణ అందిస్తున్నాం. జాతీయ అంతర్జాతీయ ఫ్యాషన్‌ షోలలో భాగం చేస్తూ.. ప్రాక్టికల్‌ అనుభవాన్ని చేరువ చేస్తున్నాం.

ఈ మధ్యనే మా విద్యార్థులు ఢిల్లీ వేదికగా నిర్వహించిన ‘ద గ్లోబల్‌ రన్‌వే’ ఫ్యాషన్‌ ఈవెంట్లో మొదటి బహుమతి పొంది అందరి దృష్టిని నగరం వైపునకు మరల్చారు. ఈ అవార్డును ప్రముఖ అంతర్జాతీయ ఫ్యాషన్‌ డిజైనర్‌ రీనా ధాకా చేతులమీదుగా అందుకున్నారు. శిక్షణ అనంతరం బోటిక్‌లను ప్రారంభిస్తూ, ప్రముఖ సెలబ్రిటీలకు ఫ్యాషన్‌ డిజైనర్లుగా కొందరు సెటిల్‌ అయ్యారు. 10 వేల మందికి శిక్షణ అందించడమే కాకుండా ఈ రంగానికి ప్రోత్సాహం అందించడం కోసం 40 శాతం స్కాలర్‌íÙప్‌ అందిస్తున్నాం.  
– రఫీ, హితమ్స్‌ అకాడమీ (హెచ్‌ఐఐటీఎంఎస్‌) ఫౌండర్, హైదరాబాద్‌.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement