cat walk
-
Hyderabad: రాకింగ్ ర్యాంప్ వాక్..! టాప్ మోడల్స్.. క్యాట్ వాక్!!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని పార్క్ హోటల్ వేదికగా జరిగిన బిగ్గెస్ట్ ఫ్యాషన్ షోలో టాప్ మోడల్స్ క్యాట్ వాక్ తో అలరించారు. ఇండియన్, వెస్ట్రన్ లుక్స్‌తో మోడల్స్ ర్యాంప్ పై సోమవారం సందడి చేశారు.లండన్‌లోని ప్రముఖ రేవన్స్ బోర్న్ యూనివర్సిటీ, సవరియా ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ సంయుక్త భాగస్వామ్యంతో పలు కొత్త కోర్సులను లాంచ్ చేశారు. ఇందులో భాగంగా ఎంబీఏ ఫ్యాషన్ మేనేజ్మెంట్, బీకాం, బీఏ చేసిన వారికీ సైబర్ సెక్యూరిటీ మేనేజ్మెంట్, లగ్జరీ మేనేజ్మెంట్ వంటి కోర్సులను లాంచ్ చేశారు.ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన డెలిగేట్ మీట్ అండ్ గ్రీట్ ఫ్యాషన్ షో అలరించింది. ముఖ్య అతిథిగా రావెన్స్బోర్న్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆండీ కుక్, డిప్యూటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ సైమన్ రాబర్ట్‌షా, యూనివర్సిటీ ప్రతినిధులు మోహిత్, గంభీర్ తదితర ప్రతినిధులు, ఫ్యాషన్ ఔత్సాహికులు పాల్గొన్నారు. -
మిస్ యూనివర్స్ స్టేట్ గ్రాండ్ ఫినాలే.. బ్యూటీ క్వీన్స్ క్యాట్ వాక్ (ఫోటోలు)
-
సిరీస్ క్లీన్‌స్వీప్.. పీపీఈ కిట్లతో క్రికెటర్ల క్యాట్‌వాక్
టీమిండియా మహిళల జట్టు ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి 3-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ పర్యటనలో తన చివరి మ్యాచ్ ఆడిన జులన్ గోస్వామికి హర్మన్‌ప్రీత్ సేన సిరీస్ విజయాన్ని కానుకగా అందించింది. ఇక వచ్చే వన్డే వరల్డ్‌కప్ 2023 వరకు టీమిండియా ఉమెన్స్‌కు మరో వన్డే సిరీస్ లేదు. ఈ నేపథ్యంలో స్వదేశానికి తిరుగుపయనమైన టీమిండియా మహిళా క్రికెటర్లు ఎయిర్‌పోర్టులో పీపీఈ కిట్లతో క్యాట్‌వాక్ చేయడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ విషయాన్ని భారత మహిళా క్రికెటర్ జేమిమా రోడ్రిగ్స్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసుకుంది. ఈ వీడియోలో జెమీమా రోడ్రిగ్స్‌తో పాటు జులన్ గోస్వామి, హర్లిన్ డియోల్ సహా ఇతర క్రికెటర్లు.. ఫ్యాషన్ మోడల్స్‌ను అనుకరిస్తూ ఎయిర్‌పోర్ట్‌లో క్యాట్‌వాక్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. ఇక స్వదేశానికి చేరుకున్న టీమిండియా మహిళా క్రికెటర్లకు అభిమానుల నుంచి ఘన స్వాగతం లభించింది. ముఖ్యంగా జులన్ గోస్వామి, ఆల్‌రౌండర్ దీప్తి శర్మలకు కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. కాగా ఇంగ్లండ్‌తో మూడో వన్డేలో ఆఖర్లో దీప్తిశర్మ.. ఇంగ్లండ్ బ్యాటర్ చార్లీ డీన్‌ను మన్కడింగ్ చేయడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ దీప్తి శర్త తాను చేసింది కరెక్టేనని చెప్పింది. ‘రనౌట్ విషయంలో మేం వ్యూహంతో సిద్ధమయ్యాం. మేం ఎన్నిసార్లు హెచ్చరించినా ఆమె మళ్లీ మళ్లీ క్రీజ్ దాటి ముందుకు వెళ్లింది.ఆ విషయాన్ని అంపైర్లకు కూడా చెప్పాం. అయినా ఆమె తీరు మార్చుకోలేదు. దాంతో నిబంధనల ప్రకారమే అవుట్ చేశాం. మేం ఇంకేం చేయగలం’ అని వివరణ ఇచ్చింది. i've never loved a team more😭 from @JemiRodrigues Instagram post pic.twitter.com/qE5ZsgXFeB — s (@_sectumsempra18) September 26, 2022 చదవండి: ఒక శకం ముగిసింది.. బాల్‌గర్ల్ నుంచి స్టార్ క్రికెటర్ దాకా ఇన్నింగ్స్ చివర్లో హైడ్రామా.. 'మరో అశ్విన్'లా కనబడింది -
ర్యాంప్‌పై క్యూట్‌గా క్యాట్ వాక్ (ఫొటోలు)
-
చూడండి బాబూ చూడండి.. ఇది సర్కస్ కాదు.. ‘క్యాట్’ వాక్
-
క్యాట్‌వాక్‌తో దుమ్మురేపిన క్రికెటర్ భార్య; వీడియో వైరల్
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా భార్య నటాషా స్టాంకోవిక్ క్యాట్‌వాక్‌తో దుమ్మురేపింది. గర్ల్ గ్యాంగ్ 'వాసాబి' పాటకు హాట్ లుక్స్ఇస్తూ క్యాట్‌వాక్ చేసిన తీరు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో పసుపు పచ్చ డ్రెస్ వేసుకొని.. బ్లాక్ కలర్ కోటుతో.. తలపై టోపితో స్టన్నింగ్ లుక్స్‌తో తన అభిమానులను ఫిదా చేసింది. ఇన్‌స్టాలో దాదాపు 3.1 మిలియన్ ఫాలోవర్లు కలిగిన ఆమెకు వ్యూస్ పరంగా ఇదే హయ్యస్ట్ కావడం విశేషం. వీలైతే మీరు ఒక లుక్కేయండి. హార్దిక్ పాండ్యా నటాషా క్యాట్వాక్కు కాంప్లిమెంట్స్ ఇస్తూ హార్ట్, లాఫింగ్ ఎమోజీని జత చేశాడు. ఇక ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపికకాని హార్దిక్ పాండ్యా లంకతో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సన్నద్దమవుతున్నాడు. శిఖర్ ధావన్ సారధ్యంలోని టీమిండియా రెండో జట్టు లంకతో సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ను జూలై 13న ఆడనుంది. కాగా హార్దిక్ తన సోదరుడు కృనాల్‌తో కలిసి ఐపీఎల్ 14వ సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన సంగతి తెలిసిందే. కాగా కరోనా కారణంగా వాయిదా పడిన మిగిలిన సీజన్ సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 వరకు యూఏఈ వేదికగా జరగనుంది. చదవండి: '17 అయితే 28 గా చూపించారు.. ఏం తాగి వచ్చారా?' ‘ఎన్ని గెలిచి ఏం లాభం, ఒక్కసెషన్ టీమిండియా కొంపముంచింది’ View this post on Instagram A post shared by Nataša Stanković✨ (@natasastankovic__) -
బ్యూటీస్..క్యాట్‌వాక్
-
మెరుపు తీగలు..
-
శ్రీమతి కరీంనగర్‌గా రాజశ్రీ
సప్తగిరికాలనీ(కరీంనగర్): క్యాట్‌వాక్‌లు.. జడ్జిల ప్రశ్నలు..కళ్లు చెదిరే సమాధానాలు...అదిరేటి స్టెప్పులు..కోకిల గొంతులు ఇలా కరీంనగర్లో ఆదివారం కరీంనగర్ జిల్లా శ్రీమతులు చేసిన ప్రదర్శన ఆహుతులను ఆకట్టుకుంది. శ్రీమతి తెలంగాణ పేరుతో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పోటీలు నిర్వహిస్తుండగా ఆడిషన్స్‌కు కరీంనగర్ వేదికైంది. స్థానిక శ్వేత హోటల్లో జరిగిన ఆడిషన్స్‌కు పెద్దసంఖ్యలో శ్రీమతులు పాల్గొని అద్భుత ప్రదర్శన ఇచ్చారు. అచ్చు మిస్ యూనివర్స్ పోటీలను తలపించేలా కార్యక్రమం సాగింది. జిల్లా పరిషత్ చైర్పర్సన్ తుల ఉమ హాజరై విజేతకు కిరిటాన్ని తొడిగారు. -
అందమైన భామలు... లేత మెరుపు తీగలు...
ఇంత పొడవాటి గౌనులు వేసుకుని అంత అందంగా ఎలా నడుస్తారు? పైగా ఎత్తు మడమల చెప్పులతో అంత వయ్యారంగా ఎలా వాక్ చేస్తున్నారు? మెడ, చెవులనంటి పెట్టుకున్న ఆ ఆభరణాలు ఎంతో పుణ్యం చేసుకుని ఉంటాయి.. అని కాన్స్ చలనచిత్రోత్సవాల్లో పాల్గొంటున్న అందాల తారల గురించి అనుకోని వారుండరు. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతున్న ఈ ఉత్సవాలపైనే అందరి దృష్టి. ఈ వేడుకల్లో పాల్గొంటున్న తారల తళుకులను చూడ్డానికి రెండు కళ్లూ చాలడం లేదని సౌందర్యారాధకులు మురిసిపోతున్నారు. వయసుతో సంబంధం లేకుండా టీనేజ్ నుంచి ఓల్డేజ్ వరకూ ఆడవాళ్లందరూ పొడవాటి గౌను, ఎత్తు మడమ చెప్పులు, వజ్రాభరణాలు ధరించి, ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఎర్ర తివాచీపై ఈ తారలు చేసే క్యాట్ వాక్ని కెమెరాల్లో బంధించడానికి ఫొటోగ్రాఫర్లు తెగ తాపత్రయపడిపోతారు. అందుకే, పొరపాటున గౌను తొలగినా, ఎవరైనా జారి పడినా కెమెరా కన్ను నుంచి తప్పించుకోలేరు. గురువారం ప్రముఖ అందాల తార జూలియా రాబర్ట్స్ అలా ఓ విషయంలో కెమెరాలకు దొరికిపోయారు. అదేంటంటే... ‘జూలియా.. వాటె కలర్ యార్’ అనుకునే రేంజ్లో తెల్లగా ఉంటారీ బ్యూటీ. నలుపు రంగు గౌనులో ఈ ఉత్సవాలకు హాజరయ్యారు జూలియా. ఆ గౌనులో ఆమె తెల్లని దేహం మెరిసిపోయింది. వజ్రాల కంఠాభరణం మినహా ఒంటి మీద వేరే ఏ ఆభరణం లేకపోయినా ఆమె తళుకులీనారు. ఎత్తు మడమ చెప్పులతో వచ్చిన జూలియా మెట్లు ఎక్కేటప్పుడు జారి పడిపోతానని భయపడ్డారేమో. వాటిని విడిచేసి, వట్టి కాళ్లతో మెట్లెక్కేశారు. రెప్పపాటులో జరిగిపోయిన ఈ తతంగాన్ని కెమెరా కళ్లు క్యాప్చర్ చేసేశాయి. మెట్లెక్కేసిన తర్వాత సహాయకుడు చెప్పులు తెస్తే, తొడుక్కున్నారామె. ఇదో విషయమా అనుకునేరు. మామూలుగా ఇలాంటి పెద్ద పెద్ద వేడుకలకు డ్రెస్ కోడ్ ఉంటుంది. ఆడవాళ్లేమో లాంగ్ ఫ్రాక్స్, హై హీల్స్ వేసుకోవాలి. మగవాళ్లు సూటూ, బూటూ ధరించాల్సిందే. గతేడాది కొంతమంది తారలు ఎత్తు మడమ చెప్పులు కాకుండా ఫ్లాట్స్ వేసుకుని వస్తే, అనుమతించలేదు. వాళ్లు వెనుతిరగాల్సి వచ్చింది. అలాంటిది జూలియా వట్టి కాళ్లతో మెట్లెక్కితే ఊరుకుంటారా?.. ఊరుకున్నారు. ఎందుకంటే ఆమె జూలియా రాబర్ట్స్ కాబట్టి. ఏదేమైనా ఇంట్లో ఉన్నప్పుడు జూలియా కాళ్లను చెప్పులు అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకే పాదరక్షలు లేకుండా ఆమె కాసేపే నడిచినా పెద్ద టాపిక్ అయ్యింది. అయ్యో పాపం... అమల్! నటుడు జార్జ్ క్లూనే సతీమణి, నటి అమల్ క్లూనే పాపం ఇబ్బందిపడే పరిస్థితి తెచ్చుకున్నారు. భర్త చెయ్యి పట్టుకుని అందంగా నడుచుకుంటూ వచ్చిన అమల్ పొరపాటున తన పొడవాటి గౌను పైన కాలు వేశారు. రెండు చీలికల్లా డిజైన్ చేయబడిన ఆ గౌను అటూ ఇటూ కావడంతో అమల్ ఇబ్బందిపడిపోయారు. కంగారుగా గౌను సర్దుకుని, పాలిపోయిన మొహంతో ముందుకు సాగారామె. ఊడీ... పరమ మూడీ! రసవత్తరంగా జరుగుతున్న వేడుకల్లో ఆనందపడేవాళ్లూ, అలిగే వాళ్లూ ఉంటారు. అలా దర్శకుడు ఊడీ అలెన్ అలిగారు. తన కుమార్తె ఏడేళ్ల వయసులో ఉన్నప్పుడు ఆమెపై ఊడీ అత్యాచారం చేశారనే అభియోగం ఉంది. ఈ విషయం గురించి వేడుకలకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఫ్రెంచ్ హాస్యనటుడు లారెంట్ లఫిట్టె జోక్ చేశారు. యూరోపియన్ దర్శకుడు రోమన్ పొలాన్స్కీతో ఊడీని పోల్చారు లఫిట్టె. రోమన్ తన 13 ఏళ్ల కుమార్తెపై అత్యాచార ప్రయత్నం చేసిన విషయం బయటకు రావడంతో, అభియోగాలు భరించలేక ఆయన ఏకంగా యూఎస్ నుంచి యూరోప్ పారిపోయి అక్కడ సినిమాలు చేసుకుంటున్నారనీ, ‘మరి మీ మీద అత్యాచార ఆరోపణలు నిర్ధారణ కాకపోయినా సరే మీరెందుకు రోమన్‌లా యూరోప్‌లోనే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు?’ అని లఫిట్టె చమత్కరించడంతో ఊడీ మొహం ఎర్రబారింది. లఫిట్టె మాటల్లో గూఢార్థం ఉంది. ఊడీ అత్యాచార యత్నం చేశారు కాబట్టే, యూఎస్‌లో ఎక్కువ సినిమాలు చేయడంలేదన్న భావం వ్యాఖ్యాత మాటల్లో కనపడింది. అది విని కొంతమంది నవ్వేసరికి, ఊడీ ముఖం కందగడ్డలా మారింది. లఫిట్టె ఇలా ‘రేప్ జోక్’ చేయడం కొంతమందికి అస్సలు నచ్చలేదు. కొందరు హాలీవుడ్ నటీమణులు బాహాటంగానే అతణ్ణి విమర్శించారు. దాంతో ఊడీ మనసు కొంచెం శాంతించి ఉంటుంది. ఇదిలా ఉంటే... గురువారం ఈ వేడుకలకు హాజరైనవారిలో... నటీమణులు అన్నా కెండ్రిక్, చెరిల్ కోల్, నయోమీ వాట్స్, జెస్సికా చేస్టైన్, క్రిస్టెన్ స్టీవాట్ తదితరులు ఉన్నారు. -
కాబోయే తల్లుల ర్యాంప్ వాక్
సాక్షి,బెంగళూరు: మదర్స్‌డే సందర్భంగా స్థానిక అపోలో క్రాడల్ ఆసుపత్రిలో గర్భిణులు వారి భర్తలతో పాటు క్యాట్‌వాక్ చేసి అలరించారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి సంస్థ సీఈఓ నీరజ్‌గార్గ్ బహుమతులను అందజేశారు. ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో గర్భిణులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. -
‘క్యాట్‌వాక్’
క్యాట్‌వాక్... మోడల్స్ పిల్లి నడక! కానీ ఈ పిల్లుల ‘క్యాట్‌వాక్’ చూస్తే టాప్ మోడల్స్ కూడా వెనక్కు పోవాల్సిందే. క్యాట్ ఫుడ్ బ్రాండ్ విస్కాస్... నగరంలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది. జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం జరిగిన ఈ షోలో అందంగా అలంకరించుకున్న జాతి పిల్లులు హుందాగా నడిచాయి. ఎదురొస్తేనే అపశకునంగా భావించే పిల్లులు.. ఎప్పుడో పెంపుడు జంతువుల జాబితాలో చేరాయి. ఇప్పుడు ఈ పెట్స్కే టాప్ ప్రేయారిటీ ఇస్తున్నారు నగరవాసులు. కుటుంబ సభ్యులతో సమానంగా చూసుకుంటున్నారు. ఒక్క నగరంలోనే కాదు ప్రస్తుతం ఇతర దేశాల్లో సైతం డాగ్స్ కంటే క్యాట్స్‌ను పెంచుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. వీటిని పెంచేవారికి... పెట్స్ గురించి సమాచారం తెలియజేయడానికి ఈ ఇంటర్నేషనల్ క్యాట్ షో నిర్వహించింది విస్కాస్. ఇందులో దేశంలోని పలు రాష్ట్రాల నుంచి 130 మేలు జాతి పిల్లులు పాల్గొన్నాయి. ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, బ్రిటిష్ లాంగ్ హెయిర్ బ్రీడ్, నార్వేజియన్ బ్రీడ్, అరేబియన్ మావ్ ఇలా 16 రకాల బ్రీడ్స్ ఇందులో పోటీపడ్డాయి. విస్కాస్కు ఇది నాలుగో అంతర్జాతీయ షో. వరల్డ్ క్యాట్ షో మ్యాప్‌లో ఇండియాకు స్థానం కల్పించడమే ఈ షో లక్ష్యం అంటున్నారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో బ్లూ క్రాస్ చైర్పర్సన్ అమల... హైదరాబాదీ బిల్లీలను ఫ్రీ అడాప్షన్ కోసం ఉంచారు. కలిసొచ్చింది... ‘నా పిల్లి పేరు డస్టీ. నేను పుట్టినప్పటికే మా ఇంట్లో పిల్లి ఉండేది. దానికి రెండు పిల్లలు పుట్టాయి. అందులో ఒకటే ఈ డస్టీ. దీనికి చాక్లెట్స్ అంటే చాలా ఇష్టం. నా ఫీలింగ్స్‌ను, ఎమోషన్స్‌ను ఇట్టే పట్టేస్తుంది. నేను డల్‌గా కనిపిస్తే సంతోషపెట్టడానికి ‘పిల్లి’మొగ్గలు వేస్తూ నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ఇంట్లో నా సిస్టర్లా పెరుగుతోంది. దీని పోషణకు నెలకు ఆరువేల రూపాయల దాకా ఖర్చవుతుంది’ అని చెబుతోంది మాసబ్ ట్యాంక్‌లో ఉండే అదీబా. ‘మా సిస్టర్స్‌కు పిల్లులు అంటే చాలా ఇష్టం. అమెరికా నుంచి నాలుగు పర్షియన్ క్యాట్స్‌ను ఇంపోర్ట్ చేసుకున్నాం. ఒకటి 45 వేల రూపాయలు. వీటికి సపరేట్ ఏసీ రూమ్ ఉంది. క్యాట్ ఫుడ్‌తోపాటు స్టీమ్డ్ చికెన్, ఫిష్ బాగా తింటాయి. కేజింగ్ నచ్చదు. ఫ్రీగా ఉండటానికే ఇష్టపడతాయి. అందరూ అపశకునంగా భావిస్తారు కానీ పిల్లులతో మాకు కలిసొచ్చింది’ అంటున్నాడు యూసఫ్గూడవాసి మోసిన్‌ఖాన్. శుభ పరిణామం... ‘పిల్లి ఇండిపెండెంట్ నేచర్ ఉన్న ఫ్రెండ్లీ పెట్. ఇవి ఎదురొస్తే అపశకునంలా భావించడం చూస్తుంటాం. కానీ ఈ క్యాట్ వాక్‌లో 45 జాతుల పిల్లులు నగరం నుంచే పాల్గొన్నాయి. దీనిద్వారా మూఢనమ్మకాలు లేనివారు సిటీలోనూ ఉన్నారన్న విషయం అర్థమవుతోంది. ఇది మంచి పరిణామం’ అన్నారు అమల. శిరీష చల్లపల్లి -
చూపుల సిరులు.. నవ్వుల విరులు..
-
సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం..
బుడి బుడి నడకల చిన్నారి గురించిన కలల్లో తేలిపోయే కాబోయే తల్లులు చేసిన క్యాట్‌వాక్ కనువిందు చేసింది. అమ్మాయి పోస్ట్ వదిలేస్తూ మరికొన్ని నెలల్లో అమ్మ హోదాను అందుకోబోతున్న ఆనందాన్ని ప్రతిఫలింపజేశారు ప్రెగ్నెంట్ లేడీస్. సమాజానికి భావిరత్నాలను అందించి బంగారు తల్లులు కానున్న మహిళలు తాము గర్భం దాల్చిన తొలినాటి సంగతులు పంచుకుని సందడి సృష్టించారు. తల్లులు- పిల్లల అంశంపై వెలువడే ప్రసిద్ధ చైల్డ్ మేగ్జైన్, నగరానికి చెందిన మూలకణ నిధి నిర్వహణ సంస్థ కార్డ్లైఫ్లు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్ వినూత్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే తల్లులు పంచుకున్న మధురానుభూతులు ఆహూతులను అలరించాయి. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పిన వారి నుంచి విజేతలను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్లో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే సమాచారాన్ని అందించడంతో పాటుగా గర్భిణులకు ఉపయోగడే దుస్తులు, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించే స్టాల్స్ సైతం ఏర్పాటు చేశారు. ‘గర్భంతో ఉన్నప్పటి నుంచి తీసుకునే జాగ్రత్తలే గుడ్ పేరెంట్‌గా తీర్చిదిద్దుతాయి. ఈ అవగాహన అందరిలో కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్‌కు రూపకల్పన చేశాం’ అని చెప్పారు చైల్డ్ మేగ్జైన్ ఎడిటర్ గీతిక. తొలిగా సిటీలో నిర్వహించిన ఈ ఈవెంట్‌ను తర్వాత ముంబయి, బెంగళూరు, ఢిల్లీలకు సైతం తీసుకెళ్లనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ ఇషితాసింగ్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ..:: సిటీప్లస్ -
అదిరే..
-
ఫ్యాషన్ " షో "
-
ఫ్యాషన్ అంటే ఇష్టమే
ర్యాంప్‌పై క్యాట్ వాక్ చేసిన సానియా మీర్జా న్యూఢిల్లీ: ధవళ కాంతులతో తనుకులీనుతున్న అనార్కలి చుడీదార్... దానిపై బంగారు రంగుతో చూడ చక్కని డిజైన్... చెవులకు జుమ్కీలు... చేతికి అందమైన రిస్ట్ వాచ్... నల్లగా నిగనిగలాడుతున్న కురులు... ర్యాంప్‌పై క్యాట్ వాక్... శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన విల్స్ లైఫ్ స్టయిల్ ఇండియా ఫ్యాషన్ వీక్‌లో పాల్గొన్న భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా వస్త్రధారణ ఇది. డిజైనర్ రీతూ పాండే రూపొందించిన ఈ స్లీవ్‌లెస్ డ్రెస్‌లో హైదరాబాద్ అమ్మాయి... తన అందంతో చూపరులను కట్టిపడేసింది. చీరలు, ప్యాంట్లు, ధోతీలు... ఇలా రకరకాల డిజైన్ దుస్తులతో ర్యాంప్‌పై హొయలు ఒలికించిన మోడల్స్‌తో కలిసి సానియా తన ప్రత్యేకతను చాటుకుంది. ఫ్యాషన్ అంటే తనకు ఇష్టమని ఈ సందర్భంగా టెన్నిస్ స్టార్ చెప్పింది. ‘ర్యాంప్‌పై వాక్ చేసేటప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది. మన జీవితాల్లో ఫ్యాషన్ కూడా ఓ భాగం. నాకు అనుకూలంగా ఉంటే టీషర్ట్లు, జీన్స్, జాకెట్స్‌ను ధరిస్తుంటాను. నడుముపైకి వచ్చే దుస్తులు, మోకాలి వరకు ఉండే స్కర్టులంటే కూడా నాకు ఇష్టమే’ అని షో తర్వాత సానియా వ్యాఖ్యానించింది. దుస్తులకు కొత్త అందాన్నిచ్చే టెక్నిక్లను వాడి వీటిని రూపొందించినట్లు డిజైనర్ పాండే తెలిపింది. -
కుక్కా.. స్టైలు బాగుందే ..
కుక్కలు పిల్లి నడకలు నడిస్తే ఎలాగుంటుంది? ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే డాగీస్ అండ్ టయారాస్ పోటీకి వెళ్తే.. మనకా విషయం తెలుస్తుంది. ఈ బుల్లి కుక్కల అందాల పోటీలో యాక్టివ్ వేర్, టాలెంట్, ఈవెనింగ్ వేర్ వంటి విభాగాలుంటాయి. ఆయా విభాగాల్లో వచ్చే మార్కుల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు. గౌన్లు, ఫ్రాకులు వంటి వివిధ డ్రస్సులేసుకుని బుల్లి కుక్కలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తుంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే శునకాల యజమానులు ఎంట్రీ ఫీజు కింద రూ.4,500 చెల్లించాలి. ఈ పోటీల ద్వారా వచ్చే డబ్బును వీధి కుక్కల సంక్షేమానికి ఉపయోగిస్తారు. -
జోష్ ఫుల్
ఎప్పుడూ బిజీబిజీగా పరుగులేనా..! లైఫ్ అంటే అప్పుడప్పుడూ కాస్త కొత్తగా... ఇంకాస్త గవ్ముత్తుగా... ఆస్వాదించేలా ఉండాలి. అదేనండీ... కూసింత కళా పోషణ ఉండాలి. అప్పుడే మాజా. ఫ్యాషన్ డిజైనింగ్‌లో మునిగిపోయే అమ్మయిలు , అబ్బాయిలదీ ఇదే థీమ్. మాదాపూర్ నిఫ్ట్‌లో శుక్రవారం జరిగిన ఫ్రెషర్స్ డేలో ఆడేసి... పాడేసి... ఆపై ర్యాంప్‌పై క్యాట్‌వాక్‌లు చేసేసి అద్భుతః అనిపించారు. ఆమ్ ఆద్మీ చాయ్‌వాలా అంటూ ఇద్దరు విద్యార్థులు వెరైటీ స్కిట్ ‘ప్లే’ చేస్తే... మా ఐటమ్ చూడండంటూ ఇంకొందరు సల్సా డ్యాన్స్‌లతో ఊపేశారు. ఈలోగా వురో యుువతి స్టేజి పైకి దూసుకొచ్చి.. యోగాను తలపించే నాట్య విన్యాసంతో అదరహో అనిపించింది. ఈ వుధ్యలో నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు చేసిన క్యాట్‌వాక్ ఫ్యాషన్ షోను తలపించారుు. చివరకు అంతా కలిసి బ్యాండ్ బాజాలతో.. వుధురానుభూతులను పంచుతూ ఉల్లాసాల కేళితో ఫ్రెషర్స్‌కు స్వాగతం పలికారు. ఈవెంట్లో మిస్ ఫ్రెఫర్గా సంజన.. మిస్టర్ ఫ్రెషర్‌గా అవినాష్ ఎన్నికయ్యారు. -
కొంచెం కష్టమే..!
రాజ్‌మహల్ జ్యూయెలర్స్ ఇండియా కోషర్ వీక్‌లో శనివారం రాత్రి డిజైనర్ మనీశ్ మల్హోత్రా కోసం ఆలియా భట్ ర్యాంప్‌పై తళుక్ముంది. వధువు కోసం డిజైన్ చేసిన ఎరుపురంగు గౌనులో జిగేల్మంది. అయితే క్యాట్‌వాక్ చేసేందుకు బాగా కష్టపడాల్సి వచ్చిందట. మనీశ్ రూపొందించిన గౌన్ ఏకంగా 25 కేజీల బరువు ఉంది. దీనిని వేసుకొని హైహీల్స్ చెప్పులతో ర్యాంప్‌పై నడిచేటప్పుడు చాలా చిరాకుగా అనిపించిందని ఈ కుర్ర హీరోయిన్ చెప్పింది. ‘ర్యాంప్‌పై నడవడం నాకు కొంచెం కష్టమే. ఎందుకంటే నాకు ఊరికే చిరాకు వస్తుంటుంది. 25 కేజీల బరువున్న గౌనుకుతోడు హైహీల్స్ చెప్పులు వేసుకొని నవ్వుతూ నడుస్తూ ఉంటే చుట్టూ ఉన్న వాళ్లు చప్పట్లు కొడుతుంటారు. ఈ సమయంలో కాస్త చిరాకేసినా, అద్భుతంగా అనిపిస్తుంది’ అని వివరించింది. ఆలియా క్యాట్‌వాక్ చేస్తున్నప్పుడు ఆదిత్యరాయ్ కపూర్ వెంట నడవగా, ఊర్మిళా మతోంద్కర్, హ్యుమాఖురేషీ ప్రేక్షకుల వరుసలో కూర్చున్నారు. బాలీవుడ్ ఎందరో ప్రముఖ హీరోయిన్లకు దుస్తులు డిజైన్ చేసే మనీశ్ కోసం క్యాట్‌వాక్ చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని ఈ బ్యూటీ చెప్పింది. ఒకప్పుడు మనీశ్ డిజైన్లను చూసేందుకు ఫ్యాషన్ షోలకు వెళ్లిన రోజులను కూడా ఈమె ఈ సందర్భంగా గుర్తుతెచ్చుకుంది. -
ఎర్ర తివాచీ చిన్నబోయింది
అందాల తారలు ఎర్ర తివాచీపై క్యాట్‌వాక్ చేస్తుంటే చూడటానికి అదో హాయి. పైగా ఐశ్వర్యా రాయ్ లాంటి సౌందర్య రాశి హంస నడకలు నడిస్తే చూడడానికి రెండు కళ్లూ చాలవు. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో జరిగే కేన్స్ చలన చిత్రోత్సవాల్లో ఐష్ చేసే ర్యాంప్ వాక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఆమె అభిమానులు ఎదురు చూస్తుంటారు. ప్రతి ఏడాది మే నెలలో జరిగే ఈ ఉత్సవాలపై సినీ అభిమానుల దృష్టి ఉంటుంది. పదమూడేళ్లుగా క్రమం తప్పకుండా ఐష్ ఈ వేడుకల్లో మెరుస్తున్నారు. ప్రతి ఏడాదిలానే ఈసారి కూడా ఓ ప్రముఖ సౌందర్య సాధనం తరఫున ఎర్ర తివా చీపై హంస నడకలు నడవడానికి సమాయత్తమయ్యారు. కూతురు ఆరాధ్య, తల్లి బృందా రాయ్‌తో కలిసి ఆమె బుధవారం ముంబయ్ నుంచి ఫ్రాన్స్‌కు ప్రయాణం అయ్యారు. ఈ ప్రయాణం సజావుగా సాగి ఉంటే, శుక్రవారం కేన్స్ చిత్రోత్సవాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేసి ఉండేవారు. కానీ, ఫ్రాన్స్‌లో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సమ్మె కారణంగా ఐష్ లండన్ దాటలేకపోయారు. ఈ అందాల సుందరి ఆగమనం కోసం ఎదురు చూసిన అభిమానులను ఈ వార్త నిరాశపరిచింది. అందాల సుందరి పాదాలను మోయడానికి సిద్ధంగా ఉన్న ఎర్ర తివాచీ సైతం చిన్నబోయిందంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి శుక్ర, శనివారాల్లో ఐష్ ర్యాంప్ వాక్ చేయాల్సి ఉంది. కానీ, మొదటి రోజు మిస్సయ్యారు. రెండో రోజు గురించి తెలియాల్సి ఉంది. ఒకవేళ ఈరోజు కూడా మిస్సయితే అప్పుడు వేరే తేదీల్లో ఐష్‌తో ర్యాంప్ వాక్ చేయించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారట. ఈ నెల 14న ప్రారంభమైన ఈ చిత్రోత్సవాలు 25 వరకు సాగుతాయి. ఇది ఇలా ఉంటే.. చిత్రోత్సవాల ప్రారంభం నాడు మల్లికా శెరావత్ ర్యాంప్ వాక్ చేశారు. -
గుంటూరులో ఆకట్టుకున్న తెలుగమ్మాయిలు
-
మిస్ ఇండియా
-
సిలిగురిలో 17వ ఫ్యాషన్ ఈవెంట్
-
అదిరే...