సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం.. | Sirulolikince for small laugh .. | Sakshi
Sakshi News home page

సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం..

Published Sun, Dec 28 2014 1:00 AM | Last Updated on Sat, Sep 2 2017 6:50 PM

సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం..

సిరులొలికించే చిన్ని నవ్వుల కోసం..

బుడి బుడి నడకల చిన్నారి గురించిన కలల్లో తేలిపోయే కాబోయే తల్లులు  చేసిన క్యాట్‌వాక్ కనువిందు చేసింది. అమ్మాయి పోస్ట్ వదిలేస్తూ మరికొన్ని నెలల్లో అమ్మ హోదాను అందుకోబోతున్న ఆనందాన్ని ప్రతిఫలింపజేశారు ప్రెగ్నెంట్ లేడీస్. సమాజానికి భావిరత్నాలను అందించి బంగారు తల్లులు కానున్న మహిళలు తాము గర్భం దాల్చిన తొలినాటి సంగతులు పంచుకుని సందడి సృష్టించారు.
 
తల్లులు- పిల్లల అంశంపై వెలువడే ప్రసిద్ధ చైల్డ్ మేగ్‌జైన్, నగరానికి చెందిన మూలకణ నిధి నిర్వహణ సంస్థ కార్డ్‌లైఫ్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఈవెంట్ వినూత్నంగా సాగింది. ఈ కార్యక్రమంలో భాగంగా కాబోయే తల్లులు పంచుకున్న మధురానుభూతులు ఆహూతులను అలరించాయి. న్యాయనిర్ణేతలు అడిగిన ప్రశ్నలకు చక్కని సమాధానాలు చెప్పిన వారి నుంచి విజేతలను ఎంపిక చేశారు. ఈ ఈవెంట్‌లో కాబోయే తల్లులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించే సమాచారాన్ని అందించడంతో పాటుగా గర్భిణులకు ఉపయోగడే దుస్తులు, ఇతరత్రా ఉత్పత్తులను విక్రయించే స్టాల్స్ సైతం ఏర్పాటు చేశారు. ‘గర్భంతో ఉన్నప్పటి నుంచి  తీసుకునే జాగ్రత్తలే గుడ్ పేరెంట్‌గా తీర్చిదిద్దుతాయి.
 
ఈ అవగాహన అందరిలో కలగాలనే ఉద్దేశంతోనే ఈ ఈవెంట్‌కు రూపకల్పన చేశాం’ అని చెప్పారు చైల్డ్ మేగ్‌జైన్ ఎడిటర్ గీతిక. తొలిగా సిటీలో నిర్వహించిన ఈ ఈవెంట్‌ను తర్వాత ముంబయి, బెంగళూరు, ఢిల్లీలకు సైతం తీసుకెళ్లనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మిసెస్ ఇండియా శిల్పారెడ్డి, ఫ్యాషన్ డిజైనర్ ఇషితాసింగ్ తదితరులు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు.
     
..:: సిటీప్లస్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement