
ఫన్‌కార్
విచిత్ర వేషాల్లో మహిళలు మురిపించారు. ముఖాలకు మాస్క్‌లు ధరించి, వాలంటైన్ గేమ్స్ ఆడి, డీజే మ్యూజిక్ హోరులో యమ జోష్‌తో ఎంజాయ్ చేశారు. ఫంకార్ లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బంజారాహిల్స్ తాజ్ బంజారాలో గురువారం నిర్వహించిన ‘ప్రి వాలంటైన్ పార్టీ’ దుమ్మురేగింది. అతివలంతా నల్లని డ్రెస్సుల్లో అటెండై విభిన్నంగా పార్టీని సెలబ్రేట్ చేసుకున్నారు.