కుక్కా.. స్టైలు బాగుందే .. | dogs walking event | Sakshi
Sakshi News home page

కుక్కా.. స్టైలు బాగుందే ..

Published Tue, Sep 2 2014 2:55 AM | Last Updated on Sat, Sep 29 2018 4:26 PM

కుక్కా.. స్టైలు బాగుందే .. - Sakshi

కుక్కా.. స్టైలు బాగుందే ..

కుక్కలు పిల్లి నడకలు నడిస్తే ఎలాగుంటుంది? ఏటా న్యూయార్క్‌లో నిర్వహించే డాగీస్ అండ్ టయారాస్ పోటీకి వెళ్తే.. మనకా విషయం తెలుస్తుంది. ఈ బుల్లి కుక్కల అందాల పోటీలో యాక్టివ్ వేర్, టాలెంట్, ఈవెనింగ్ వేర్ వంటి విభాగాలుంటాయి. ఆయా విభాగాల్లో వచ్చే మార్కుల ఆధారంగా విజేతను ప్రకటిస్తారు.
 
గౌన్లు, ఫ్రాకులు వంటి వివిధ డ్రస్సులేసుకుని బుల్లి కుక్కలు ర్యాంప్‌పై క్యాట్‌వాక్ చేస్తుంటే.. చూడముచ్చటగా ఉంటుంది. ఈ పోటీల్లో పాల్గొనాలనుకునే శునకాల యజమానులు ఎంట్రీ ఫీజు కింద రూ.4,500 చెల్లించాలి. ఈ పోటీల ద్వారా వచ్చే డబ్బును వీధి కుక్కల సంక్షేమానికి ఉపయోగిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement