Dog attack
-
వీడియో: అమ్మాయిని పగబట్టిన కుక్కలు.. భయానక దాడి
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.వివరాల ప్రకారం.. అల్వర్‌లోని జేకే నగర్‌కు చెందిన నవ్య ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. Is there any city in India that does not have to suffer because of street dogs. This is from Alwar in Rajasthan. pic.twitter.com/0dmZaNdFpu— Ravi Handa (@ravihanda) March 8, 2025 -
పగబట్టినట్టు గుంపుగా దాడిచేసిన కుక్కలు: వైరల్ వీడియో
కుక్కలు చాలా విశ్వాసంగా ఉంటాయి. కాసిన్ని గంజినీళ్లు పోసినా కూడా చాలా కృతజ్ఞతతో ఉంటాయి. కళ్లలోనే ప్రేమను చూపిస్తూ మనిషితో చాలా స్నేహంగా ఉంటాయి. కానీ ఇటీవలి కాలంలో వీధికుక్కల దాడులు బాగా పెరగడం దడ పుట్టిస్తోంది. తాజాగా పంజాబ్‌లో ఒక వృద్ధురాలిపై దారుణంగా కుక్కలు దాడి చేశాయి. ఈ సంఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డైనాయి.పంజాబ్‌లోని ఖన్నాలోని ధనిక నాయి అబాది ప్రాంతంలోఈ ఘటన చోటు చేసుకుంది. ఇంట్లో పనిచేస్తున్న వృద్ధ మహిళపై కుక్కల గుంపు దాడి చేసింది. ఆ మహిళ కుక్కల నుండి తప్పించుకోవడానికి పరుగెత్తుకుంటూ వెళ్లినప్పటికీ, పాపం తప్పించు కోలేకపోయింది. సెకన్లలోనే, ఒక కుక్క ఆమె కాలు పట్టి లాగేసింది. అలా ఒకటీ రెండూ కాదు ఏకంగా ఐదు కుక్కల ఒకేసారి ఆమెమీదకు లంఘించాయి కిందకు తోసి, చేయి , ముఖం మీద ఇష్టమొచ్చినట్టు కరిచాయి. ఈడ్చుకెళ్లిపోయాయి. అయితే ఈ సమయంలో, ఒక వ్యక్తి దూరంగా నుంచే ఒక వస్తువును విసిరాడు. దీంతో అవి కొద్దిగా వెనక్కు తగ్గాయి. మరి కాసేపట్లోనే కొంతమంది మహిళలు గుమిగూడి వాటిని చెదరగొట్టారు. తీవ్రంగా గాయపడిన మహిళను రక్షించారు. కనీసం 15 చోట్ల గాయాలైనట్టు గుర్తించారు. గాయాలకు 40 కుట్టు వేసినట్టు తెలుస్తోంది.మరోవైపు ఈ వారంలో తనపై కుక్కలు దాడి చేయడం ఇది మూడోసారి అని చెప్పింది బాధిత మహిళ కన్నీళ్లతో. అదే ప్రాంతంలో నివసించే జోగిందర్ సింగ్‌ది ఇలాంటి అనుభవమే. ఈ ప్రాంతంలో కుక్కల దాడి పెరుగుతోందని, తనను నాలుగుసార్లు కరిచాయని తెలిపారు. దీనిపై చర్యలు చేపట్టాల్సిందిగా ఆ ప్రాంత వాసులు కోరుతున్నారు.ఉన్నట్టుండి కుక్కలు (ఇతర జంతువులు) దాడి చేస్తే ఏం చేయాలి? కుక్కలు కనిపించిన వెంటనే మనం పరుగులు పెట్టకూడదు.అక్కడే నిలబడి గట్టిగా అదిలించాలి. చేతిలో ఏది ఉంటే దానితో బెదిరించాలి.కుక్కలు భయపెడుతూ, మొరుగుతున్నపుడు నడక ఆపి, అవి మొరగడంఆపాకనెమ్మదిగా అక్కడ నుంచి మెల్లిగా అక్కడినుంచి పక్కకి వెళ్లాలి.కళ్లలోకి సూటిగా చూడకూడదు. లేదంటే వాటిని రెచ్చ గొడుతున్నట్లుగా, వాటికి హాని చేస్తున్నట్టుగా భావిస్తాయి. మనం వేసుకున్న రంగులు వాటికి కొన్నిసార్లు నచ్చకపోవచ్చు. ఇందులో మనం ధరించే విచిత్రమైన కలర్ దుస్తువులు, వస్తువులకు కూడా అవి రియాక్ట్ అవుతాయి. ఉదాహరణకు ఎర్ర చొక్కా, నల్ల టోపీ, కళ్లద్దాలు లాంటివి పెట్టుకున్న క్యాప్ తీసేయడం కళ్లద్దాలు తొలగించడం బెటర్.ఇదీ చదవండి: దివ్యాంగుల్లో కొత్త వెలుగులు, మన ‘సారా’ సేవకే అంకితం -
మహిళా యూనివర్సిటీలో కుక్కల దాడి
సుల్తాన్‌బజార్: కోఠిలోని చాకలి ఐలమ్మ మహిళా విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. యూనివర్సిటీ ప్రాంగణంలో దాదాపు 20 కుక్కలు రోజూ స్వైర విహారం చేస్తుంటాయి. ఆదివారం రాత్రి కళాశాల హాస్టల్ వైపు వెళ్తున్న డిగ్రీ విద్యార్థులనులు అంకిత, ప్రవీణలపై కుక్కలు ఒక్కసారిగా దాడిచేసి కరిచాయి. దీంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కుక్కలు దాడి చేయడంతో పరిగెత్తిన ఓ విద్యారి్థని చెవికమ్మ తెగిపోయి తీవ్ర రక్తస్రావమైంది. మరో విద్యారి్థనికి ముఖంపై గాయాలు కావడంతో యూనివర్సిటీ నిర్వాహకులు వారిని బర్కత్‌పురాలోని సీసీ షరాఫ్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థి సంఘాల నాయకులు కళాశాల అధికారులపై మండిపడ్డారు. యూనివర్సిటీలో కుక్కలతో పాటు పాములు సైతం పెద్ద సంఖ్యలో తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంపై వర్సిటీ వీసీ సూర్య ధనుంజయ్ మాట్లాడుతూ తాను బాధ్యతలు చేపట్టిన రెండవ రోజే వర్సిటీలో కుక్కల నియంత్రణపై జీహెచ్ఎంసీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
పిచ్చికుక్కల స్వైరవిహారం.. 26 మంది చిన్నారులకు గాయాలు
మహబూబ్‌నగర్ క్రైం/గూడూరు: వేర్వేరు జిల్లాల్లో పిచ్చికుక్కల దాడిలో 26 మంది చిన్నారులు గాయపడ్డారు. మహబూబ్‌నగర్ పట్టణంలో గురువారం రాత్రి 7 – 8.30 గంటల ప్రాంతంలో గోల్ మజీద్, పాత పాలమూరు ఏరియాలో ఒక పిచ్చికుక్క చిన్నారులను వెంటాడి కరుస్తూ గాయపరిచింది. గాయపడిన 24 మంది చిన్నారులకు జనరల్ ఆస్పత్రిలో టీటీ ఏఆర్వీ టీకాలు ఇచ్చారు.ఇందులో ఐదుగురు చిన్నారులకు గాయాలు ఎక్కువ కావడంతో.. వారిని ఆస్పత్రిలో చేర్పించుకుని పరిశీలనలో ఉంచినట్లు ఆర్ఎంవో డాక్టర్ జరీనా తెలిపారు. చిన్నారులను గురువారం రాత్రి జిల్లా జనరల్ ఆస్పత్రిలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ పరామర్శించారు. పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని ఎమ్మెల్యే వైద్యాధికారులను ఆదేశించారు. కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. మహబూబాబాద్ జిల్లాలో.. : మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం కొల్లాపురానికి చెందిన మహేశ్ కూతురు స్మైలీ, కారం సుమన్ కుమారుడు అచ్చితానంద.. గురువారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటుండగా, పిచ్చికుక్క వీరిద్దరిపై దాడికి పాల్పడింది. కుటుంబసభ్యులు చిన్నారులను కుక్క బారి నుంచి కాపాడారు. గాయపడిన చిన్నారులను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. -
AP: దారుణం.. కుక్కల దాడిలో రెండేళ్ల బాలుడి మృతి
సాక్షి,ఎన్టీఆర్జిల్లా: ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మోడల్ కాలనీలో సోమవారం(నవంబర్ 11) దారుణం జరిగింది. రెండేళ్ల బాలుడు బాలతోటి ప్రేమ్ కుమార్ తన ఇంటి ముందు ఆడుకుంటుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి.దాడి చేసిన తర్వాత కుక్కలు బాలుడిని పొలాల్లోకి లాక్కెళ్లాయి. కుక్కల దాడిలో తీవ్ర గాయాలు కావడంతో బాలుడిని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు. బాలుడి మృతితో పెనుగంచిప్రోలు గ్రామంలో విషాదం నెలకొంది.ఇదీ చదవండి: రంగరాయలో ర్యాగింగ్ కలకలం -
Family Survey : ఇద్దరు మహిళా ఎన్యుమరేటర్లపై కుక్కల్ని వదిలిన ఇంటి యజమాని
-
కుక్కలు చుట్టుముట్టాయ్..ఈ బుడ్డోడి ధైర్యం చూడండి!
చిన్నారులపై కుక్కలు పాశవివంగా దాడిచేసి, ప్రాణాల్ని తీసేసిన ఘటనలు మనందరి హృదయాల్ని పిండేసాయి. కారణాలేమైనప్పటికీ పిల్లలు,పెద్దలపై కుక్కల స్వైర విహారం ఉదంతాలు ఈ మధ్య కాలంలో కనిపించాయి. అలాగే రోడ్డుపై వెళుతున్నపుడు కూడా ఒక్కసారిగా మీదకు ఉరుకుతాయి. భయంకరంగా మొరుగుతూ కొద్ది దూరం వెంబడిస్తాయి కూడా. ద్విచక్రవాహనదారులకు ఇలాంటి అనుభవాలు కోకొల్లలు. అయితే కుక్క మనపై దాడికి ప్రయత్నించినా, గట్టిగా మొరిగినా పరిగెత్తకుండా, నిలబడి గట్టిగా అదిలిస్తే చాలా వరకు వెనక్కి తగ్గుతాయి. దాదాపు అలాంటి వీడియో ఒకటి ఎక్స్‌లో ఆకట్టుకుంటోంది.ప్రమాదం మన ముందుకొచ్చినపుడు ధైర్యంగా ఉండటమే ఏకైక మార్గం అంటూ ఒక వీడియోను ది ఫిగెన్ అనే ఎక్స్ యూజర్ దీన్ని షేర్ చేశారు. ఇది ఎక్కడ జరిగింది అనేది వివరాలు అందుబాటులో లేన్నప్పటకీ, ఈ ఫుటేజ్ ప్రకారం ఇద్దరు చిన్నారులు (పాప,బాబు) వీధిలో నడుస్తుండగా కుక్కలు ఎదురపడ్డాయి. దీంతో పక్కనున్న పాప భయంతో పారిపోయింది. తరువాత ఒంటరిగా మిగిలిన చిన్నారి మీదికి ఒకటి కాదు రెండు కాదు ఏకంగా నాలుగైదు కుక్కలు ఎగబడ్డాయి. అప్పుడా బాలుడు ధైర్యంగా నిలబడిన తీరు విశేషంగా నిలిచింది.When you're cornered, your only option is to be brave ... pic.twitter.com/uLDXhtNvcw— Figen (@TheFigen_) September 11, 2024ఆ బాలుడి గుండె ధైర్యానికి సమయస్ఫూర్తికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. నువ్వెంత బలవంతుడివో నీకు తెలియదు.. ధైర్యంగా ఉండటమే నీకున్న ఏకైక మార్గం అంటూ ఒక యూజర్ వ్యాఖ్యానించారు. -
వీధి కుక్క స్వైర విహారం.. గంటలో 17 మందిపై దాడి
ఉత్తరప్రదేశ్‌లో ఓ వీధి కుక్క స్వైర విహారం చేసింది. కనిపించిన వారిని కనిపించినట్లే మీద పడి గాయపరిచింది. చిన్న, పెద్ద, ముసలి తేడా లేకుండా కేవలం గంట వ్యవధిలోనే కంట పడిన 17 మందిపై దాడి చేసింది. కుక్క దాడిలో గాయపడిన వారిలో మహిళతోపాటు చిన్నారులు కూడా ఉన్నారు. అయితే ఈ ఘటన గోరఖ్‌పూర్‌లోని షాపూర్లో ఆగష్టు 14న జరగ్గా.. సీసీటీవీ ఫుటేజీలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి.ఇందులో 22 ఏళ్ల విద్యార్ధి ఆశిష్ యాదవ్.. ఆవాస్ వికాస్ కాలనీలోని తన ఇంటి ముందు నిలబడి ఫోన్లో మాట్లాడుతుండగా వీధి కుక్క తీవ్రంగా దాడి చేసింది. ఇంటి ముందు వెళ్తున్న కుక్క.. అకస్మాత్తుగా యువకుడి వైపుకు పరుగెత్తుకొచ్చి కరిచింది. అయితే దాని నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా.. ఆ కుక్క ఎంతకు తగ్గలేదు.అతడిపైకి ఎగురుతూ, మరింత వేగంగా కరిచేందుకు యత్నించింది. ఆశిష్ కిందపడిపోవడంతో అతని కాలుపై, ముఖంపై గాయపరిచింది. అనంతరం అక్కడి నుంచి పారిపోయింది. కుక్క దాడిలో అతని ముఖం, నోరు, కళ్లు, పెదవులు దెబ్బతిన్నాయి. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే రేబిస్ వ్యాక్సిన్ కోసం జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లగా.. వ్యాక్సిన్ అయిపోయిందని చెప్పారని ఆశిష్ తండ్రి విజయ్ యాదవ్ తెలిపారు. కుక్కల దాడిపై నగరపాలక సంస్థకు సమాచారం అందించినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధితులు వాపోయారు.ఈ ఘటన తరువాత కుక్కు ఇంటి గేటు వద్ద నిలబడిన మరో మహిళపై దాడి చేసింది. ఆమె మోకాలి, కాలుపై కరిచి వెళ్లిపోయింది. దీంతో మహిళ మోకాలిపై లోతైన గాయమవ్వగా కుట్లు పడ్డాయి. దీని తర్వాత ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు బాలికలపై కుక్క దాడి చేసింది. ఇలా ఆ పిచ్చి కుక్క దాదాపు 17 మందిని గాయపరిచింది.దీనిపై గోరఖ్‌పూర్ అదనపు మున్సిపల్ కమీషనర్ దుర్గేష్ మిశ్రా మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తనకు తెలియదని, ఎటువంటి ఫిర్యాదులు అందలేదని చెప్పారు. వీధికుక్కలకు స్టెరిలైజేషన్ కోసం నిరంతరం ప్రచారం నిర్వహిస్తున్నామని, యానిమల్ బర్త్ కంట్రోల్ సెంటర్‌ను కూడా నిర్మిస్తున్నామని చెప్పారు. వీధికుక్కలను పట్టుకుని స్టెరిలైజ్ చేయడంతోపాటు పెంపుడు కుక్కలకు వ్యాక్సినేషన్‌పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. -
ప్రాణాలు తీస్తున్న వీధికుక్కలు
ఇబ్రహీంపట్నం/ మణికొండ/ ఎంజీఎం (వరంగల్): రాష్ట్రంలో వీధి కుక్కల దాడి ఘటనలు మరింతగా పెరుగుతున్నా యి. అభంశుభం ఎరుగని చిన్నారులపై దాడి చేస్తున్న వీధి కుక్కలు ‘విధి’రాత మార్చేస్తున్నాయి. పిల్లలను పొట్టనపెట్టు కుంటున్నాయి. శుక్రవారం ఒక్కరోజే జరిగిన మూడు ఘట నలు భయాందోళన రేపుతున్నాయి. శునకాల దాడిలో గాయపడిన ఓ చిన్నారి చికిత్స పొందుతూ మృతి చెందితే.. మరో ఘటనలో దివ్యాంగ బాలుడిపై వీధి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. మరోచోట శిశువు మృతదేహాన్ని కుక్క పీక్కుతినడం కలకలం రేపింది.నాలుగేళ్ల చిన్నారి మృతిరంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పరిధిలోని రాయపోల్‌లో గత నెల 12న స్కూల్ బయట వీధికుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ నాలుగేళ్ల చిన్నారి క్రియాన్‡్ష.. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. ముక్కుపచ్చలారని తమ కుమా రుడిని కుక్కలు పొట్టనపెట్టుకున్నాయంటూ తల్లిదండ్రులు ఉడుగుల మాధురి, శివగౌడ్ దంపతులు రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది.శుక్రవారం గ్రామంలో నిర్వ హించిన బాలుడి అంత్యక్రియలకు ఊరంతా తరలివచ్చింది.దివ్యాంగ బాలుడిపై దాడిహైదరాబాద్ శివార్లలోని నార్సింగి మున్సిపాలిటీ పరిధిలోని సబితానగర్‌లో ఉంటున్న నర్సింహ, అంజమ్మల కుమా రుడు భరత్ (7). అతను దివ్యాంగుడు. తల్లిదండ్రులు కూలి పనులకు వెళ్తే ఇంట్లోనే ఉంటాడు. శుక్రవారం అలా ఇంటి వద్దే ఉన్న భరత్.. బహిర్భూమికి వెళ్లి, గుడిసెలోకి వచ్చాడు. వెనకాలే వచ్చిన ఓ వీధికుక్క బాలుడిపై దాడి చేసింది. జననాంగంపై కరిచింది. బాలుడి చేతులు పనిచేయక పోవటం, చిన్న గుడిసె కావడంతో తప్పించుకోలేక పోయాడు. గట్టిగా అరుస్తూ, ఏడవటంతో చుట్టుపక్కల వారు వచ్చి కుక్కను తరిమేశారు. నార్సింగిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాలుడికి శస్త్రచికిత్స చేయాలని, రూ.40 వేలు ఖర్చవుతుందని వైద్యులు చెప్పారని.. తమను ఆదుకోవాలని తల్లిదండ్రులు విజ్ఞప్తి చేశారు. కాగా.. ఈ ఘటనతో స్పందించిన నార్సింగి మున్సిపాలిటీ సిబ్బంది.. శుక్రవారం కాలనీలోని కుక్కలను పట్టుకుని, అక్కడి నుంచి తరలించారు.ఎంజీఎంలో పసికందు మృతదేహాన్ని పీక్కుతిన్న కుక్క!వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో నిత్యం రద్దీగా ఉండే క్యాజువాలిటీ ప్రాంతం వద్ద ఓ పసికందు మృతదేహాన్ని కుక్క పీక్కుతింది. శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయంలో దీన్ని గమనించిన ఓ కానిస్టేబుల్ కుక్కను తరిమివేసి ఆస్పత్రి అధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే శిశువు ఎవరనేది గుర్తించలేనంతగా కుక్క కొరికేసింది. మృతదేహాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు.. ఆడ శిశువుగా గుర్తించారు. రెండు, మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటే కుళ్లిన వాసన వస్తుందని, మృతదేహం నుంచి ఎలాంటి దుర్వాసన రాకపోవడంతో శుక్రవారమే చనిపోయి ఉంటుందని భావిస్తున్నారు.సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో..ఆ పసికందు ఎవరు? ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శిశువులదా? బయటినుంచి తీసుకువచ్చిందా? శిశువు బతికి ఉండగా కుక్కల బారిన పడిందా? ఎవరైనా శిశువు చనిపోతే ఆస్పత్రిలో వదిలేసి వెళ్లిపోయారా? అనే సందేహాలతో కలకలం చెలరేగింది. అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకపోవడంతో.. పసికందును కుక్క ఎక్కడి నుంచి తీసుకువచ్చిందో తెలుసుకోవడం కష్టంగా మారింది. అయితే.. ఎంజీఎం ఆస్పత్రిలోని నవజాత శిశు కేంద్రంలో శుక్రవారం చిన్నారులెవరూ మృతి చెందలేదని.. పసికందు మృతదేహం ఎంజీఎం ఆస్పత్రికి సంబంధించినది కాదని సూపరింటెండెంట్ మురళి చెప్పారు. శనివారం పాప మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తామని, వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. -
హైదరాబాద్: కుక్కల దాడిలో మరో బాలుడి మృతి
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడులకు పసివాళ్లు బలవుతున్నారు. నగరంలో శునకాల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కోకాపేట్ కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని ఆసుప్రతికి తరలించారు.కాగా, ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కాలే యాన్ని తినేశాయి.బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. -
వృద్ధురాలిని పీక్కుతిన్న కుక్కలగుంపు
ముస్తాబాద్ (సిరిసిల్ల): వీధికుక్కలు జవహర్‌నగర్‌లో బాలు డిని చంపిన ఘటన మరువకముందే మ రో దారుణం చోటు చేసుకుంది. అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీశాయి. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కా లే యాన్ని తినేశాయి.ఈ దారుణ ఘటన రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం. బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది. వేర్వేరు ఇళ్లలో కొడుకులు రామలక్ష్మి ముగ్గురు కుమారులు బాలరాజు, దేవయ్య, అంజయ్యలు వేర్వేరు ఇళ్లలో ఉంటున్నారు. వ్యవసాయ పనులు ముమ్మరం కావడంతో పొద్దంతా పనులకు వెళ్లి వచ్చినవారు బుధవారం రాత్రి గాఢనిద్రలోకి జారుకున్నారు. రామలక్ష్మి తనకున్న ప్రత్యేక గదిలో నిద్రించింది. ఆ గదికి సరైన తలుపులు లేకపోవడంతో రాత్రివేళ కుక్కలు దాడి చేశాయి.మంచంలో ఎంత గింజుకున్నా, కుక్కలు వదల్లేదని అక్కడున్న పరిస్థితులను బట్టి తెలుస్తోంది. అందరూ నిద్రలో ఉండడంతో ఆమె కేకలు ఎవరికీ వినిపించలేదు. గురువారం ఉదయం రామలక్ష్మి కుటుంబీకులు జరిగిన సంఘటన చూసి బోరున విలపించారు. మృతురాలి గదంతా రక్తసిక్తమై, శరీర భాగాలు పడి ఉన్నాయి. -
ఈ సమస్య ఒకరిది కాదు..అందరిదీ
సాక్షి, హైదరాబాద్: కుక్కల దాడి సమస్య ఒకరిది కాదని, అందరిదీ అని హైకోర్టు అభిప్రాయపడింది. మనుషులపై దాడి చేయకుండా పరిష్కారం కావాలని.. నిపుణులను సంప్రదించి నివేదిక ఇవ్వాలని జంతు జననాల నియంత్రణ కమిటీని ఆదేశించింది. వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేసి శిశువులు, వృద్ధులపై దాడులు చేయకుండా నిరోధించలేమని వ్యాఖ్యానించింది. దాడులు చేయకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ప్రణాళిక రూపొందించాలని ఆదేశించింది.జీహెచ్ఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం, జంతు సంరక్షణ సంస్థలు, జంతు జనన నియంత్రణ కమిటీలు పటిష్ట పరిష్కారం చూపి.. పసికందులపై వీధికుక్కలు దాడి చేసి చంపేస్తున్న ఘటనలను అరికట్టేందుకు మార్గం వెతకాలని చెప్పింది. జూన్ 28న పటాన్చెరు ఇస్నాపూర్‌లో వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. బిహార్‌కు చెందిన వీరి కుటుంబం పొట్టకూటి కోసం రాష్ట్రానికి వచ్చింది. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లిన బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ దారుణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లను దీనికి జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ఈ పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్‌కుమార్ జూకంటి ధర్మాసనం గురువారం మరోసారి విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా జస్టిస్ అలోక్ అరాధే.. హైదరాబాద్‌లో వీధికుక్కల దాడికి గురైన పసికందు వార్త క్లిప్పింగ్‌ను కోర్టు హాల్లో చూపించారు. ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం చాలా దారుణమన్నారు. నిబంధనలు అమలు చేస్తున్నాం: ఏజీప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘అనుమమ్ త్రిపాఠి వర్సెస్ కేంద్రం కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలను, జంతు జననాల నియంత్రణ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. రాష్ట్రంలో 3,79,148 కుక్కలున్నాయి. నిబంధనల ప్రకారం కుక్కలకు స్టెరిలైజేషన్, ఇమ్యూనైజేషన్ చేసి మళ్లీ అదే ప్రాంతంలో వదిలేస్తున్నాం. కుక్కల దాడులు ప్రభుత్వానికి కూడా ఆందోళన కలిగిస్తున్నాయి. జంతు సంక్షేమ సంఘాలతో కూడా చర్చలు జరుపుతాం’ అని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో లక్షల్లో కుక్కలుండగా.. రోజుకు 30–40 కుక్కలకు వ్యాక్సిన్ చేస్తున్నారని న్యాయవాది వేణుమాధవ్ చెప్పారు. ఈ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. కుక్కల దాడుల బారినపడిన బాధితులను ఆదుకోవడానికి హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసే ప్రతిపాదనను పరిశీలించాలని సూచించింది. తదుపరి విచారణను ఈనెల 31కి వాయిదా వేసింది. -
TG: కుక్కల దాడులను ఆపలేరా?.. ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కుక్కల దాడి ఘటనల పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. ఈ క్రమంలో తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.కాగా, నిన్న జవహర్ నగర్లో కుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కుక్కల దాడుల ఘటనపై వేసిన పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా వీధి కుక్కల దాడి ఘటనలను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని హైకోర్టు ప్రశ్నించింది.ఈ క్రమంలో అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ.. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా 3.79 లక్షల వీధి కుక్కలు ఉన్నాయి. కుక్కల దాడి ఘటనలను నివారించడానికి స్టేట్ లెవల్ కమిటీ చేశాము. హైదరాబాద్‌లో ఆరు కేంద్రాల వద్ద కుక్కలకు స్టెరిలైజేషన్ చేస్తున్నారు. ఒక్కో కేంద్రం వద్ద రోజుకు సుమారు 200 కుక్కలకు స్టెరిలైజేషన్ జరుగుతోందన్నారు. ఈ సందర్భంగా హైకోర్టు.. స్టెరిలైజేషన్ ద్వారా ఎలా దాడులను ఆపుతారని ప్రశ్నించింది.ఈ నేపథ్యంలో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. కుక్కలను షెల్టర్ హోమ్స్‌కు తరలిస్తే సమస్య పరిష్కారం అవుతుందన్నారు. నాగపూర్‌లో దాదాపు 90వేల కుక్కలను షెల్టర్ హోమ్‌లో పెట్టినట్టు చెప్పారు. దీంతో, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీలతో అనిమల్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు భేటీ అయ్యి పరిష్కారం చూపాలని హైకోర్టు సూచించింది. అనంతరం, పిటిషన్లపై తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది. -
Dogs Attack: కుక్కల నుంచి ప్రజలకు రక్షణేది?
శివార్లలోని జవహర్‌నగర్‌లో కుక్కల దాడిలో ఏడాదిన్నర విహాన్ మృతి వార్తతో నగర ప్రజల గుండెలు బరువెక్కాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో సైతం అలాంటి ఘటనే చోటు చేసుకుంది. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కల దాడిలో మరణించడం ఎందరినో కలచివేసింది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఇలాంటి దుర్ఘటనలు జరిగినప్పుడు తగిన చర్యలు తీసుకుంటామనే ప్రకటనలు తప్ప నిజంగా ప్రజలకు.. ముఖ్యంగా పసిపిల్లల ప్రాణాలకు రక్షణ ఉంటుందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వాటికి సరైన సమాధానాలు దొరకడం లేదు. ⇒హైదరాబాద్అక్కడ బాగు..జైపూర్, గోవాల్లో ఏబీసీ కార్యక్రమాల అమలు బాగుందనే అభిప్రాయాలున్నాయి. అక్కడ ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలో ( 5–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తారని, ‘మిషన్ రేబిస్’ పేరిట వ్యాక్సినేషన్ డ్రైవ్ ఇతరత్రా కార్యక్రమాలు నిర్వహిస్తారని జంతుప్రేమికులు చెబుతున్నారు. పాఠశాలల్లోనూ అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహిస్తారని పేర్కొన్నారు.నామ్‌కే వాస్తేగా హైలెవెల్ కమిటీ ఏళ్ల తరబడిగా కుక్కల బెడద ఉన్నా, వాటి దాడుల్లో ఎందరో మరణిస్తున్నా.. కుక్కలతో ఇక భయం లేదనుకునే పరిస్థితుల్ని ప్రభుత్వాలు కల్పించలేకపోయాయి. రోడ్డు ప్రమాదాలు, నాలాల్లో మరణాల మాదిరే కుక్కకాట్లతో సైతం మరణాలు చోటు చేసుకుంటుండటం విషాదకరం. వీధికుక్కలపై ప్రజల నుంచి వెల్లువెత్తిన ఫిర్యాదులతో గత సంవత్సరం జీహెచ్ఎంసీ అఖిలపక్ష సభ్యులతో హైలెవెల్ కమిటీ ఏర్పాటు చేసినా, అది 27అంశాలు సిఫార్సు చేసినా ప్రజలకు కుక్కకాట్లు తప్పడం లేదు. సిఫార్సు చేసిన అంశాల్లో ఆరేడు అంశాలు మాత్రం కొద్దిరోజులు అమలు చేశారు. ఆ తర్వాత వాటిని మరచిపోయారు. ఐదు కుక్కల సంరక్షణ కేంద్రాలు, వాటి నిర్వహణ, వెటర్నరీ విభాగంలో సిబ్బంది పెంపు వంటివి మాత్రం అమలు చేశారు. అమలుకు నోచుకోని అమాత్యుడి హామీ.. బహిరంగ ప్రదేశాల్లో మాంసాహార వ్యర్థాలు వేసే హోటళ్లు, దుకాణాలను ప్రాసిక్యూట్ చేయడంతో పాటు వాటిని మూసి వేస్తామనే హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. మటన్, చికెన్ షాపుల వ్యర్థాలు బహిరంగంగా వేయకుండా కవర్లను అందజేస్తామన్న అప్పటి పశుసంవర్థక శాఖ మంత్రి హామీ అమలు కాలేదు. మూడు నెలల పాటు వీధికుక్కల స్పెషల్ డ్రైవ్, వీధికుక్కల సమాచారం కోసం ప్రత్యేక యాప్ వంటివి మాటలకే పరిమితమయ్యాయి. సినిమాలు, టీవీల్లో స్లైడ్లు, షార్ట్ ఫిల్మ్, వీడియో కాంటెస్ట్ వంటి వాటితో సహ మిగతా అంశాలు మరచిపోయారు. వీధికుక్కల సంరక్షణకు ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ నిర్మాణాలూ అటకెక్కాయి. రాత్రి సమయాల్లోనూ వీధికుక్కలను పట్టుకోవడం, వీధికుక్కల దత్తత వంటివి పట్టింపు లేకుండా పోయాయి. కుక్కలకు ఆహారం, నీళ్లు అందుబాటులో ఉంచుతామన్న మాటలు కొద్దిరోజులే అమలయ్యాయి. కుక్కలు కనిపించిప్పుడు చేయాల్సిన, చేయకూడని పనుల గురించి విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు కొద్దిరోజులు మాత్రం నిర్వహించారు. ఇంతే చేయగలం.. సుప్రీంకోర్టు ఆదేశాలు, కేంద్రప్రభుత్వ యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ)రూల్స్ ,కుక్కల నివారణకు జీహెచ్ఎంసీ బైలాస్ మేరకు కుక్కల సంతతి తగ్గించడం, రేబిస్ వ్యాధి సోకకుండా యాంటీ రేబిస్ (ఏఆర్) వ్యాక్సిన్ వేయడం మాత్రమే తాము చేయగలమని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. వాటితోపాటు ఫంగస్ ఇన్ఫెక్షన్ల వంటివి సోకకుండా ఐవర్‌మెక్టిన్ ఇంజెక్షన్లు వేస్తున్నామంటున్నారు. కాగా.. సీఎం ఆదేశాల నేపథ్యంలో కుక్క కాట్ల బారిన పడకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి వెటర్నరీ అధికారులతో మాట్లాడినట్లు సమాచారం. లెక్కకు మిక్కిలిగా.. ⇒ జీహెచ్ఎంసీ గణాంకాల మేరకు పదేళ్లలో 8మంది చిన్నారుల మరణాలు, ఐపీఎం లెక్కల మేరకు 3,36,767 మంది కుక్కల బారిన పడ్డట్లు లెక్కలున్నా, అవి అంతకంటే ఎక్కువగా ఉంటాయని అంచనా. ⇒ 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఏళ్ల బాలిక మృతి. ⇒ 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ⇒ 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. ⇒ 2020 ఆగస్ట్‌లో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు. ⇒ 2021 జనవరి 30 బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. ⇒ 2023 ఫిబ్రవరిలో అంబర్‌పేటలో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృతి చెందాడు. ⇒ 2023 డిసెంబర్లో షేక్‌పేటలో ఐదు మాసాల పసికందు కుక్కల దాడితో అసువులు బాశాడు. ⇒ ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ⇒ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని హైకోర్టు ఆదేశాలున్నా, అమలుకు నోచుకోలేదు. నాలాలు, నిర్మాణాలూ కారణమేవీధికుక్కల బెడద పెరగడానికి ఖాళీ జాగాలు లేకుండా వెలుస్తున్న భవన నిర్మాణాలతో నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడం కూడా ఒక కారణమని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. నాలాల పైకప్పులు, మెష్లతోనూ కుక్కల దాహార్తి తీరే దారి లేకుండా పోయిందంటున్నారు. ఖాళీ జాగాలుంటే నీరుండే ప్రాంతాలుంటాయని పేర్కొన్నారు. ఆహారం, నీరు దొరక్కపోవడం కుక్కలు పిచి్చపట్టినట్లు దాడులు చేయడానికి కారణమని అంటున్నారు. వర్షాకాలంలో చర్మవ్యాధుల బాధలతోనూ తట్టుకోలేక వీధికుక్కలు పిచి్చపట్టినట్లు కరుస్తాయని పేర్కొన్నారు. -
HYD: ‘జవహర్‌నగర్’ కుక్కలదాడి ఘటన.. సీఎం రేవంత్ ఆవేదన
సాక్షి,హైదరాబాద్: వీధి కుక్కల దాడిలో హైదరాబాద్ జవహర్‌నగర్‌లో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై సీఎం రేవంత్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనను కలిచివేసిందని బుధవారం(జులై 17) ఒక ప్రకటనలో తెలిపారు. భవిష్యత్‌లో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. తరచూ ఈ తరహా ఘటనలు జరుగుతున్నందున వీధి కుక్కల బెడదను అరికట్టడానికి అన్ని చర్యలు తీసుకోవాలని సీఎం జీహెచ్ఎంసీ యంత్రాంగాన్ని సీఎం అప్రమత్తం చేశారు. వీధి కుక్కల బెడద ఉన్న ప్రాంతాల ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించడానికి కాల్ సెంటర్ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి తక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. పసి కందులపై కుక్కలు దాడులు చేస్తున్న ఘటనల మీద పశు వైద్యులు, బ్లూ క్రాస్ వంటి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వీధి కుక్కలకు టీకాలు వేయడంతో పాటు కుక్కల దాడులను నివారించడానికి ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న పద్ధతులను పరిశీలించాలని అధికారులకు సూచించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని అన్ని అర్బన్ హెల్త్ సెంటర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రుల్లో కుక్కల దాడి చికిత్సకు అవసరమైన అన్ని మందులను అందుబాటులో ఉంచాలని వైద్యారోగ్యశాఖను సీఎం ఆదేశించారు. జవహర్‌నగర్ మునిసిపల్ ఆఫీసు ముందు స్థానికుల ఆందోళన..కుక్కలదాడిలో రెండేళ్ల బాలుడు విహాన్ మృతి చెందడంపై హైదరాబాద్ జవహర్‌నగర్ వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని ఆరోపించారు. బుధవారం జవహర్‌నగర్ మునిసిపల్ కార్యాలయం ముందు అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
గుంపుగా వచ్చి.. బాలుడిని ఈడ్చుకెళ్లి..
జవహర్‌నగర్/గాందీఆస్పత్రి: మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో ఏడాదిన్నర వయసున్న బాలుడు ఆరు బయట ఆడుకుంటున్నాడు...అదే సమయంలో వీధి కుక్కలు గుంపుగా అక్కడకు వచ్చాయి. ఒక్కసారిగా ఆ బాలుడిపై దాడి చేశాయి. తలభాగాన్ని నోట్లో కరుచుకొని కొంత దూరం ఈడ్చుకెళ్లాయి. అలా ఈడ్చుకుంటూ వెళుతున్న క్రమంలో ఆ బాలుడి తలవెంట్రుకలు, తలలోని కొంత భాగం ఆ పరిసరాల్లో ఊడి పడింది. గాంధీ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ హృదయ విదారక సంఘటన మల్కాజిగిరి–మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్ధానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి గ్రామానికి చెందిన భరత్–లక్ష్మి దంపతులకు ఏడాదిన్నర కుమారుడు విహాన్ ఉన్నాడు. లక్ష్మి సోదరుడు వెంకట్ జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్ కాలనీలో నివాసముంటున్నాడు. ఆయన ఇంటికి లక్ష్మి దంపతులు కుమారుడితో కలిసి చుట్టపుచూపుగా కొద్దిరోజుల క్రితం వచ్చారు. మంగళవారం రాత్రి ఏడు గంటల సమయంలో విహాన్ ఇంటి ఎదుట ఆడుకుంటున్నాడు. గుంపులుగా వచ్చిన వీధి కుక్కలు ఒక్కసారిగా విహాన్‌పై దాడి చేశాయి. కొంతదూరం వరకు ఈడ్చుకెళ్లి పడేశాయి. ఈ ఘటన జరిగిన సమయంలో అదే కాలనీలో ఉన్న ఓ వ్యక్తి ఆ కుక్కల గుంపు దగ్గరకు వెళ్లి చూడగా, బాలుడు తీవ్ర రక్తస్రావంతో కిందపడి ఉన్నాడు. ఒళ్లంతా రక్కడంతో కుక్కకాటు గుర్తులు ఉన్నాయి. ఆ పరిసరాల్లోనే విహాన్ తల వెంట్రుకలు, మెదడులోని కొంత భాగం కూడా మరో చోట పడింది. వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలుడిని గాంధీ ఆస్పత్రిలోని అత్యవసర విభాగానికి తరలించారు. శరీరమంతా కుక్కకాట్లతో నిండిపోయి ఉండటంతో పరిస్థితి విషమించింది. అనస్థీషియా, పిడియాట్రిక్ తదితర విభాగాలకు చెందిన వైద్యులు చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. రాత్రి 9:30 గంటలకు విహాన్ మృతి చెందాడు. తీవ్రమైన రక్తస్రావం కావడంతో కాపాడలేకపోయామని గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. జవహర్‌నగర్ పరిధిలో వీధికుక్కల బెడద ఎక్కువగానే ఉందని స్థానికులు వాపోయారు. ఇంకెన్ని ప్రాణాలు పోతే.. అధికారులు ఈ సమస్యను పట్టించుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
HYD: కుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి,హైదరాబాద్: పటాన్చెరు ఇస్నాపూర్‌లో శుక్రవారం(జూన్28) దారుణం జరిగింది. కుక్కలదాడిలో ఎనిమిదేళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్లినపుడు కుక్కలు విశాల్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది.విశాల్ కుటుంబం కూలిపని చేసుకోవడానికి హైదరాబాద్ వచ్చింది. పొట్ట కూటి కోసం వచ్చి కొడుకును కోల్పోవడంపై విశాల్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
భీమిలిలో విషాదం.. పెంపుడు కుక్క కరిచి తండ్రీకొడుకుల మృతి
విశాఖపట్నం: భీమిలో పెంపుడు కుక్క కాటుకు తండ్రి కొడుకులు మృతి చెందారు. వివరాలలోకి వెళితే నర్సింగరావు(59), కొడుకు భార్గవ్(27) ను వారం క్రితం వారి పెట్ డాగ్ కరిచింది..భార్గవ్ ను ముక్కు మీద, నర్సింగరావు ను కాలిపై కరిచిన వారి పెట్ డాగ్ రెండు రోజుల్లో చనిపోవడంతో వారు అలెర్ట్ అయ్యారు..రేబిస్ ఇంజక్షన్స్ వేయించుకున్నారు..అయితే బ్రెయిన్ తో పాటు ఇతర భాగాలకు రేబిస్ సోకడంతో ట్రీట్మెంట్ తీసుకుంటూనే. తండ్రి కొడుకు మరణించారు -
వీధి కుక్కల వీరంగం
మణికొండ: వాకింగ్ కోసం ఇంట్లోంచి బయటకు వచ్చిన ఓ మహిళను వీధి కుక్కలు వెంటపడి తరిమాయి. ఏకంగా పదికి పైగా కుక్కల గుంపు ఆమెను చుట్టుముట్టి భయభ్రాంతులకు గురిచేశాయి. కుక్కల బారి నుంచి తప్పించుకుంటూ ఆ మహిళ వంద అడుగుల దూరం వరకు వెళ్లింది. అయినా అవి వెంటపడి మరీ తరమడంతో మహిళ అదుపుతప్పి కింద పడిపోయింది. దీంతో అవి ఒక్కసారిగా ఆమెపై పడ్డాయి. అదే సమయంలో అటువైపుగా స్కూటీపై వచ్చిన వ్యక్తి వద్దకు సదరు మహిళ పారిపోయి కుక్కల బారి నుంచి తప్పించుకున్న ఘటన మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని చిత్రపురి కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం.. చిత్రపురి కాలనీకి చెందిన రాజేశ్వరి రోజు మాదిరిగానే శనివారం ఉదయం 6 గంటలకు వాకింగ్ నిమిత్తం ఇంట్లోంచి బయటకు వచి్చంది. అదే సమయంలో పదుల సంఖ్యలో ఉన్న కుక్కలు ఒక్కసారిగా ఆమె వెంట పడ్డాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆమె విశ్వ ప్రయత్నాలు చేసింది. వాటి కాటుకు బలి కాకుండా తప్పించుకోగలిగింది. తిండి కోసం ఎదురు చూస్తుండగా.. కాలనీ వాసులు ముందు రోజు మిగిలిపోయిన ఆహారాన్ని కుక్కల కోసం వీధుల్లో పెడుతున్నారు. దీంతో ప్రతిరోజూ ఉదయం కుక్కలు ఆకలితో అక్కడికి చేరుకుంటున్నాయి. శనివారం కుక్కల బారిన పడిన మహిళ సైతం తమకు ఆహారం పెట్టేందుకే వచ్చి ఉంటుందని కొద్ది సేపు వెంటపడినట్టు సీసీ టీవీలలో రికార్డు అయ్యింది. ఎంతకూ అన్నం పెట్టకపోయేసరికి మహిళ వెంట పడ్డాయని కాలనీ వాసులు భావిస్తున్నారు. -
15 నెలల చిన్నారిపై వీధి కుక్కల దాడి
దుండిగల్: వీధి కుక్కల దాడిలో 15 నెలల చిన్నారి గాయపడింది. దుండిగల్ మున్సిపాలిటీ డిపోచంపల్లి పరిధిలోని సత్యసాయి కాలనీలో మింటూసింగ్ తన కుటుంబంతో నివసిస్తున్నాడు. అతడి కుమార్తె ఆరుషి (15 నెలలు) శనివారం ఇంటి ముందు ఆడుకుంటోంది. ఈ క్రమంలో వీధి కుక్కలు ఒక్కసారిగా చిన్నారిపై దాడి చేశాయి. ఈ ఘటనలో చిన్నారి తల, చేతికి గాయాలయ్యాయి. సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రిలో బాలిక చికిత్స పొందుతోంది. మరో ఘటనలో 14 ఏళ్ల బాలుడిపై.. నిజాంపేట్: నిజాంపేట్‌లో 14 ఏళ్ల సాయిచరణ్ అనే బాలుడు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కల వెంటపడ్డాయి. వాటి బారి నుండి తప్పించుకునేందుకు యతి్నంచినా వెంబడించి గాయపరిచాయి. బాలుడి చేతులు, కాళ్లు, ఇతర శరీర భాగాల్లో కరిచాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. -
Dogs Attack: నాలుగేళ్ల బాలుడిపై వీధి కుక్కల మూకుమ్మడి దాడి
మలక్‌పేట: నగరంలో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూనే ఉన్నాయి. శనివారం సాయంత్రం మలక్‌పేటలోని మూసారంబాగ్ డివిజన్ లక్ష్మీనగర్ కాలనీలో నాలుగేళ్ల బాలుడు ఉజ్వల్ కుమార్‌పై వీధి కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. తాను ఇంట్లోంచి బయటి రాకపోతే కుమారుడి ప్రాణాలు దక్కేవి కావని బాలుడి తల్లి ఆవేదన వ్యక్తం చేయడం ఈ ఘటన తీవ్రతకు అద్దంపడుతోంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపురం జిల్లా కదిరి మండలం వీరపల్లి పేట గ్రామానికి చెందిన జంపన సాయికుమార్, అలేఖ్య దంపతులు బతుకుదెరువు కోసం వచ్చి మూసారంబాగ్లో నివాసం ఉంటున్నారు.వీరికి ఉజ్వల్‌కుమార్ (4), ఆరు నెలల వయసున్న మరో బాబు ఉన్నారు. శనివారం సాయంత్రం చిన్న కుమారుడికి అలేఖ్య పాలు తాపుతుండగా.. ఉజ్వల్‌కుమార్ నిద్ర లేచి అపార్ట్మెంట్ గేట్ వైపు వెళ్తుండగా వీధి కుక్కలు వచ్చి అతనిపై దాడిచేశాయి. మొదట కుడికాలు పట్టుకుని బయటికి ఈడ్చుకుంటూ వెళ్లి బాలుడి ముఖాన్ని తీవ్రంగా గాయపరిచాయి. బాలుడు గట్టిగా ఏడ్వడంతో గదిలోంచి తల్లి బయటికి వచి్చంది. అప్పటికే కుక్కలు బాలుడిని కరుస్తున్నాయి.ఆమె కేకలు వేస్తూ వాటిని కట్టెతో కొట్టి వెళ్లగొట్టింది. బాలుడి ముఖంపై, కాలుకు తీవ్ర గాయాలు కావడంతో ఒళ్లంతా రక్తంతో తడిసి పోయింది. చికిత్స కోసం నల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి.. అక్కడి నుంచి ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఉజ్వల్‌కుమార్ ముఖానికి వైద్యులు చికిత్స చేశారని, 10 కుట్లు వేశారని తండ్రి సాయికుమార్ తెలిపారు. గది నుంచి బయటికి రావడం ఆలస్యమైతే తమ కొడుకును కుక్కలు చంపేసి ఉండేవని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కుక్కల బెడదను నివారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డిమాండ్ చేశారు. -
వీధి కుక్కల దాడిలో ప్రముఖ వ్యాపారవేత్త కన్నుమూత!
వీధి కుక్కల దాడితో ప్రముఖ వ్యాపారవేత్త, వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. అక్టోబర్ 15న మార్నింగ్ వాక్కు వెళ్లిన పరాగ్ దేశాయ్‌ను వీధి కుక్కలు వెంబడించాయి. ఆపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన కిందపడినట్లుగా సన్నిహితులు చెబుతున్నారు. అప్రమత్తమైన కుటుంబసభ్యులు అత్యవసర చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తాజాగా, అహ్మదాబాద్‌లోని జైదాన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెదడులో రక్తస్రావం వల్ల కన్నుమూశారు. మెదడులో రక్తస్రావం వల్ల ఆస్పత్రిలో మరణించినట్లు వాఘ్ బక్రీ టీ గ్రూప్ కంపెనీ వెల్లడించింది. పరాగ్ మరణంపై పలువురు ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అంకితభావానికి కేరాఫ్ అడ్రస్ వ్యాపార రంగంలో సరికొత్త ఆవిష్కరణలకి, అంకితభావానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు పరాగ్ దేశాయ్. భారత్‌లోనే అతిపెద్ద 3వ ప్యాకేజ్డ్ వాఘ్ బక్రీ టీ’ గా అవతరించడంలో విశేషంగా కృషి చేశారు. వారసత్వ వ్యాపారంలో అడుగు వాఘ్ బక్రీ టీ కంపెనీ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. పరాగ్ దేశాయ్ అమెరికా లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏని ఉన్నత విద్యను అభ్యసించారు. అనంతరం, వారసత్వంగా వస్తున్న టీ’ వ్యాపారంలో అడుగు పెట్టారు. తన తండ్రి రసేష్ దేశాయ్ స్థాపించిన వాఘ్ బక్రీ టీ సంస్థలో అమ్మకాలు, మార్కెటింగ్, ఎగుమతి విభాగాల్లో కీలక పాత్ర పోషించారు. రూ.2,000 కోట్ల టర్నోవర్ 1892లోవాఘ్ బక్రీ గ్రూప్‌ను పరాగ్ తండ్రి నరన్దాస్ దేశాయ్ ప్రారంభించారు. అయితే పరాగ్ దేశాయ్ నేతృత్వంలో వాఘ్ బక్రీని భారతదేశపు మూడవ అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ బ్రాండ్‌గా మార్చడంలో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా, వారసత్వం,సాంప్రదాయ విలువలను గౌరవిస్తూ కొత్త కొత్త వ్యాపార వ్యూహాలతో ముందుకు సాగారు. తన దూరదృష్టి తో వాఘ్ బక్రీ టీ పరిధిని ప్రపంచవ్యాప్తంగా విస్తరించుకుంటూ వెళ్లగలిగారు. ఈ వాఘ్ బక్రీ టీ ఒక్క మనదేశంలోనే ప్రపంచంలోని వివిధ దేశాలలో ఇంటి పేరుగా మారింది. నేడు ఈ కంపెనీ ప్రస్తుత టర్నోవర్ రూ.2,000 కోట్లు. -
కుక్కలు మనుషుల్ని ఎందుకు కరుస్తాయి?వాటికీ ఫ్రస్ట్రేషన్ ఉంటుందా?
జిల్లాలో రోజురోజుకూ కుక్కకాటు ఘటనలు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్క డో ఒక చోట మనుషులపై దాడి చేసి గాయపరుస్తూ నే ఉన్నాయి. వీధులు, రోడ్లపై గుంపులు గుంపులు గా తిరుగుతూ పాదచారులు, ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారిని వెంబడించి మరీ కరుస్తున్నాయి. అంతేకాకుండా ఇళ్లలోకి దూరి దాడి చేస్తున్నాయి. శునకాల దాడిలో చిన్నారులు ప్రాణాలు వదిలిన సందర్భా లు అనేకం. కుక్క కాటుకు గురైన వారు ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. రోజు రోజుకు కుక్కల బాధితులు పెరిగిపోతున్నారు. కుక్కలు కరవడం వల్ల రేబిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. రేబిస్ వల్ల ఏటా 55 వేల మందికి పైగా చనిపోతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. మన దేశంలో కుక్క కాటుకు ఏటా 15 వేలకు పైగా మంది చనిపోతున్నారు. ఆకలితో దాడి చేస్తున్నాయా..? ఇంతకీ కుక్కలు మనుషులపై ఎందుకు తెగబడుతున్నాయి. ఆకలితోనా లేక దూపతోనా.. ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకప్పుడు వీధి కుక్కలు మనుషులపై దాడి చేసేవి కావు. గ్రామాల్లోకి కొత్తగా ఎవరైనా వచ్చినా, వాటికి హాని చేసే జంతువులు, ఇతర ప్రాణులు ఏవైనా కనిపిస్తే దాడి చేయడం చూశాం. కానీ ఇప్పుడు మనుషులపై దాడి చేయడం ఎక్కువైంది. ఏ కుక్క మంచిదో ఏది పిచ్చిదో తెలియని పరిస్థితి నెలకొంది. శునకాల దాడికి ప్రధాన కారణం ఆకలి అని పలువురు అంటున్నారు. గ్రామాల్లో, మున్సిపలిటీల్లో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా మెరుగుపడింది. దీంతో వాటికి ఆహారం దొరకడం లేదు. అలాగే ఇంటింటా చెత్త సేకరణ ప్రారంభమయ్యాక రోడ్డు పక్క అన్నం, ఇతర ఆహార పదార్థాలు పడేయడం తగ్గింది. దీంతో వాటికి ఆహారం దొరకడం కష్టంగా మారింది. పైగా కుక్కలు తరుచూ దాడి చేస్తుండడంతో వాటిని ఎవరూ చేరదీసి ఆహారం పెట్టడం లేదు. దీంతో అవి ఆకలికి అలమటిస్తున్నాయి. కనీసం దాహం తీర్చుకునేందుకు వీధి నల్లాల వద్ద నీరు కూడా దొరడం లేదు. కుక్కలు డీ హైడ్రేషన్‌కు గురైనప్పుడు కూడా తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. ఆ సమయంలో అధిక శబ్ధం వినిపించినా, వ్యక్తులు అధికంగా తన పక్క నుంచి తిరిగినా, వాటి పక్క నుంచి హఠాత్తుగా పరుగెత్తుతున్న కుక్కలు కరిచేసే అవకాశం ఉంది. కొన్ని సార్లు ప్రజల్ని భయపెట్టడానికి కుక్కలు అరుస్తుంటాయి. అవి అలా అరుస్తూ వెంటపడినప్పుడు ప్రజలు పరుగెడతారు. దీంతో తమకు భయపడి మనుషులు పరుగెడుతున్నారని కుక్కలు భావిస్తాయి. ఈ క్రమంలోనే వాళ్లను వెండిస్తూ కరచే దాకా వదలవు. ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. ►కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. ► నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. ► కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. ►కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికారాబాద్ మున్సిపల్ పరిధిలో గత ఏడాది ఏర్పాటు చేసిన ఏబీసీలో 1,429 శునకాలకు సంతానం కలగకుండా ఆపరేషన్లు చేశారు. ఆపరేషన్ల అనంతరం కొన్నాళ్ల పాటు సెంటర్లోనే ఉన్న కుక్కలు బయటి వచ్చాక వరుసపెట్టి జనాలపై దాడికి తెగబడుతున్నాయి. వీధి కుక్కలను ఒకేచోట పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు బంధించి ఉంచడంతో అవి ఒత్తిడికి లోనై మనుషులపై దాడి చేస్తున్నట్లు తెలిసింది. తాండూరులోని ఏబీసీ సెంటర్లో కూడా సుమారు 1,247 కుక్కలకు ఆపరేషన్లు చేశారు. కుక్క కరిస్తే ఏం చేయాలి? కుక్క కాటుకు గురైన వ్యక్తి ఐదు సార్లు రేబిస్ వ్యాధికి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. కుక్క కాటు వల్ల బాగా గాయం అయ్యి రక్తస్రావం అయితే వ్యాక్సిన్ తో పాటు కరిచిన చోట ఇమ్యునొగ్లోబిలిన్స్ ఇంజెక్షన్ తీసుకోవాలి. కుక్క కరిస్తే ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలంటే..గతంలో కుక్క కాటుకు గురైన వ్యక్తికి ఒకప్పుడు బొడ్డు చుట్టూ 16 ఇంజెక్షన్లు వేసేవారు. దీంతో ఆ వ్యక్తి ఎంతో బాధను అనుభవించాల్సి వచ్చేది. కానీ ప్రస్తుతం ఈ పద్ధతి మారింది. వ్యాక్సినేషన్ ఈ ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా సుమారు 3వేల కుక్కలకు రేబీస్ వ్యాధి సోకకుండా పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. అయినా ఎక్కడో ఒక చోట రేబీస్ వ్యాధితో కుక్కలు జనాలపై దాడి చేస్తున్నాయి. రేబిస్‌తో చాలా ప్రమాదం రేబీస్ వ్యాధికి గురైన పశువులను కుక్కలు కరిసినా, రేబీస్ వ్యాధి ఉన్న కుక్కను మరో కుక్క కరిచినా వ్యాధి ఒకదాని నుంచి మరొక దానికి సోకుతుంది. ఆ కుక్కలు మనుషులను కరిస్తే ప్రమాదం. వెంటనే వైద్యులను సంప్రదించాలి. అయితే రేబీస్ వ్యాధి సోకుండా ప్రతి ఏటా జూన్ మొదటి వారంలోనే పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో టీకాలు వేస్తున్నాం. పెంపుడు కుక్కలకు కూడా వాటి యజమానులు తప్పకుండా వ్యాక్సిన్ వేయించాలి. కుక్కలను భయపెట్టడం, నేరుగా వాటివైపు చూడడం, వాటి దగ్గరగా పెద్ద చప్పుడు చేయడం వంటివి చేయరాదు. అలా చేస్తే అవి దాడిచేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. – అనిల్‌కుమార్, జిల్లా పశు వైద్యాధికారి -
హైదరాబాద్‌లో మళ్లీ.. బాలుడిపై వీధి కుక్క దాడి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో వీధి కుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. టప్పాచబుత్రలో కుక్క దాడి చేయడంతో ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. తన తల్లితో కలిసి బాలుడు విధిలో నడుస్తూ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. అయిదేళ్ల బాలుడిని కుక్క కరిచిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అయితే బాలుడి తల్లి వెంటనే గుర్తించి అప్రమత్తమవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే అప్పటికే కుక్క బాలుడి చెవిని కొరికేసిందని తెలుస్తోంది. వెంటనే బాధిత బాలుడిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా రెండురోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసినట్లు తెలుస్తోంది. చిన్నారికి జర్జరీ చేశారని, అందుకోసం తల్లిదండ్రులు రూ. 3 లక్షలు వెచ్చించినట్లు ఓ వ్యక్తి ట్వీట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో కుక్కల దాడులు ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట కుక్కలు దాడులకు తెగబడుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్‌పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల చిన్నారి ప్రదీప్ మృతి చెందిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోకపోవటం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ప్రజలు ఆరోపించడంతో తెలంగాణ హైకోర్టు ఈకేసును సుమోటోగా తీసుకొని జీహెచ్ఎంసీకి, ప్రభుత్వ అధికారులకు నోటీసులు సైతం జారీ చేసింది. ఈ ఘటన తర్వాత ప్రభుత్వం కుక్కలు వీధుల్లో తిరగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టినా క్షేత్రస్థాయిలో పరిస్థితిలో మార్పు రావటం లేదు. ప్రస్తుతం వీధి క్కలపై జీహెచ్ఎంసీ ఫోకస్ తగ్గినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎలక్షన్ డ్యూటీతో పాటు వెటర్నరీ అధికారులు బిజీ బిజీగా గడుపుతున్నారు. మరోవైపు సిబ్బంది నిరసన చేస్తుండటంతో కుక్కల కాటు కేసులు నగరంలో మళ్ళీ పెరుగుతున్నాయి. కుక్కల బెడదపై వేసిన హై లెవెల్ కమిటీ ఎక్కడ ఉందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. కమిటీ ఏర్పాటు చేసి.. ఒక్కసారి కూడా సమావేశం కాకపోవడం శోచనీయం -
Rangareddy: పిచ్చి కుక్క కరిచిన బాలుడి దుర్మరణం
రంగారెడ్డి: పిచ్చికుక్క దాడిలో 25 రోజుల క్రితంతీవ్రంగా గాయపడిన చిన్నారి మంగళవారం మృతిచెందాడు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. ఆగస్టు 10న బొంరాస్‌పేట మండలం రేగడిమైలారంలో ఓ కుక్క స్వైరవిహారం చేసింది. 2 గంటల వ్యవధిలో 12మందిని కరిచి గాయపర్చింది. వీరిలో ఏడుగురు చిన్నారులు కాగా ఐదుగురు పెద్దవాళ్లు ఉన్నారు. ఇందులో తీవ్రంగా గాయపడిన ఆరుగురిని నగరంలోని నల్లకుంట ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు. మిగిలిన వారిని వికారాబాద్‌లోని జిల్లా ఆస్పత్రికి పంపించారు. వీరిలో ఆరుగురు చిన్నారులు ప్రస్తుతం మందులు వాడుతున్నారు. ఇదిలా ఉండగా ఆరోజు ఘటనలో తీవ్రంగా గాయపడిన నెల్లి అనురాధ, శ్రీనివాస్‌ల కుమారుడు ఆదిత్య(5) సోమవారం రాత్రి అస్వస్థతకు గురయ్యారు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం ఉదయాన్నే ఆస్పత్రికి తరలిస్తుండగా ఆరోగ్యం విషమించి మార్గమధ్యలోనే మృతిచెందాడు. బాధితులకు వర్షిత, ఆదిత్య ఇద్దరు సంతానం. ఉన్న ఒక్కగానొక్క కొడుకు మరణించడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఆదిత్య మృతితో మిగిలిన చిన్నారుల తల్లిదండ్రులు భయాందోళనకు గురవుతున్నారు. పిచ్చికుక్కగాటు బాధితులకు ఉరుములు, మెరుపుల వాతావరణం పడదని పెద్దలు చెబుతున్నారు. వీధి కుక్కల నివారణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
కుక్కల గొడవ కాస్తా ఎంత దూరం వెళ్లిందో చూడండి
భోపాల్: ఇండోర్‌లో ఒక కాలనీలో కుక్కలను వాకింగ్ కోసమని తీసుకొచ్చారు ఇద్దరు వ్యక్తులు. కానీ ఆ కుక్కలు ఒక్కసారిగా కయ్యానికి కాలు దూశాయి. వాటి తరపున వకాల్తా పుచ్చుకుని వాటి యజమానులు కూడా గొడవపడ్డారు. అందులో ఒకరు ఆగ్రహంతో పక్కనే ఉన్న తన ఇంటిలోకి వెళ్లి తుపాకీతో కాల్పులు జరిపగా కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు.. ఆరుగురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ఇండోర్ కృష్ణ బాగ్ కాలనీలో రాత్రి 11 గంటలకు ఒక ఇరుకైన సందులో రజావత్, విమల్ అచల్ ఇద్దరూ తమ పెంపుడు కుక్కలతో వాకింగ్ చేయడానికి బయటకు వచ్చారు. ఆ సమయంలో రెండు కుక్కలు ఎదురుపడేసరికి పెద్దగా మొరుగుతూ తగువుకు దిగాయి. వాటికంటే గట్టిగా అరుపులతో రజావత్, అచల్ గొడవపడ్డారు. అంతలో ఏమైందో రజావత్ ఆగ్రహంతో పక్కనే ఉన్న బిల్డింగ్ మొదటి అంతస్తులోని తన ఇంటిలోకి ఆవేశంగా వెళ్లి బాల్కనీలోకి వచ్చి 12-బోర్ రైఫిల్ తో కాల్పులు జరిపాడు. కాల్పుల్లో అచల్ అక్కడికక్కడే చనిపోయాడు. అతడి తోపాటు అక్కడే ఉన్న మరో వ్యక్తి రాహుల్ వర్మ కూడా ప్రాణాలు కోల్పోయాడు. మరో ఆరుగురికి బులెట్ గాయాలయ్యాయి. రజావత్ కు గన్ లైసెన్స్ ఉన్నందున అతడిని ఒక ప్రయివేట్ కంపెనీ సెక్యూరిటీ గార్డుగా నియమించింది. మృతుడు అచల్ కు నిపనియాలో కటింగ్ షాపు ఉంది. రజావత్ క్షణికావేశంలో చేసిన పొరపాటుకు రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు రజావత్ ను, అతడి కుమారుడిని, వారి బంధువు శుభంను అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. Indore | Dog Fight | कुत्ता घुमाने निकले दो पड़ोसियों के कुत्ते आपस में लड़ गए। दोनों पड़ोसियों के बीच भी हाताहपाई हो गई। इतने में एक पड़ोसी अपने घर गया, बंदूक लाया और गोली चला दी। तमाशा देख रहे 2 लोगों की मौत हो गई और 6 घायल हो गए। गोली चलाने वाले व्यक्ति गिरफ्तार: अमरेंद्र… pic.twitter.com/NhKKSLLBcZ — काश/if Kakvi (@KashifKakvi) August 18, 2023 ఇది కూడా చదవండి: మసాజ్ కోసం కక్కుర్తి పడ్డ బెజవాడ కుర్రాళ్ళు. -
జగిత్యాల: కుక్క దాడిలో గాయపడ్డ బాలిక మృతి
సాక్షి, జగిత్యాల: కుక్క కాటు మరో బాలిక జీవితాన్ని బలిగొంది. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె మృత్యువుతో పోరాడింది. రెండువారాల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ .. చివరకు కన్నుమూసింది. గొల్లపెల్లి మండలం ఆత్మకూరు గ్రామంలో పదిహేను రోజుల కిందట ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. ఊర్లో దాదాపు పది మందిని గాయపర్చింది. అయితే సంగెపు సాహిత్య అనే 12 ఏళ్ల బాలిక మాత్రం కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలించిన చికిత్స అందించారు. అయితే చికిత్స పొందుతూ ఆ చిన్నారి ఇవాళ(శనివారం) ఉదయం కన్నుమూసింది. తమ ముందు ఆడిపాడిన చిన్నారి ఇక లేదనే విషయం తెలిసి.. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇదీ చదవండి: గుండెలో రంధ్రం.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి.. -
వేములవాడలో కుక్కల బీభత్సం !
వేములవాడ: వేములవాడలో బుధవారం కుక్కలు రెచ్చిపోయాయి. వివిధ అవసరాల కోసం బయటకు వచ్చిన 25 మందిపై దాడి చేశాయి. గాంధీనగర్, జాతరాగ్రౌండ్, ఉప్పుగడ్డ, ముదిరాజ్వీధి ప్రాంతాల్లో దాదాపు 25 మందిని కరిచాయి. వీరంతా స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి చేరుకున్నారు. అందిరికీ యాంటీ రెబీస్ ఇంజక్షన్లు ఇచ్చి పంపించినట్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ రేగులపాటి మహేశ్‌రావు తెలిపారు. కుక్కల దాడులపై ఇప్పటికే అధికారులకు ఫిర్యాదులు చేసినా స్పందన లేకపోవడంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. -
పొరుగింటిలో 34 పెంపుడు కుక్కలు వీరంగమాడుతున్నాయని..
యూపీలోని లక్నోలో శునకాల వీరంగంతో జనం ఏ స్థాయిలో భయపడుతున్నారంటే చివరికి ఇంటిని కూడా అమ్మేసుకునేందుకు సిద్ధం అవుతున్నారు. లక్నోలోని జానకీపురంలో ఉంటున్న ఒక వృద్ధ జంట ఎదురింటిలోని కుక్కలకు భయపడి తమ ఇంటిని విక్రయించేందుకు సిద్ధం అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకున్న ఈ విచిత్ర ఉదంతానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే లక్నోలోని జానకీపురం ప్రాంతానికి చెందిన ఒక వృద్ధ జంట ఇటీవలే స్థానికంగా ఉన్న ఒక ఇంటిని కొనుగోలు చేశారు. అయితే వారు ఈ ఇంటిలోకి అడుగుపెట్టగానే వారికి కుక్కల బెడద మొదలయ్యింది. దీంతో వారు తాము ఉంటున్న ఇంటిని వెంటనే అమ్మివేయాలని భావిస్తూ, ఇంటి బయటి గేటుకు ‘ఇల్లు అమ్మబడును’ అనే బోర్డు తగిలించారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రాంతంలోని ఒక ఇంటిలోని వారు ఏకంగా 34కు మించిన కుక్కలను పెంచుతున్నారని,ఈ కుక్కలు రోజుంతా ఈ ప్రాంతంలో తిరుగుతూ అందరినీ వెంబడిస్తున్నాయని, చిన్నారులను భయపెడుతున్నాయని, కరుస్తున్నాయని తెలిపారు. వీటికి భయపడే ఆ వృద్ధ దంపతులు తమ ఇంటిని విక్రయించాలనుకుంటున్నారని అన్నారు. స్థానికుల ఫిర్యాదు మేరకు నగరపాలక సంస్థ అధికారులు ఆ కుక్కల యజమానికి నోటీసు అందించారు. కాగా లక్నోలో పెంపుడు కుక్కలు మనుషులపై దాడులకు దిగిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఒక పిట్‌బుల్ డాగ్ తన యజమానిపై తీవ్రంగా దాడి చేయడంతో అతను మృతి చెందాడు. ఇదేవిధంగా రిటైర్డ్ టీచర్ సుశీల్(82) కూడా శునకాల దాడిలో కన్నుమూశారు. ఇది కూడా చదవండి: ఆ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న ‘నీటిగండం’.. రాబోయే రోజుల్లో.. -
విషాదం: వీధి కుక్కల కారణంగా చిన్నారి మృతి
సాక్షి, హన్మకొండ: ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా వీధి కుక్కల దాడులు ఎక్కువైన విషయం తెలిసిందే. వీధి కుక్కల దాడిలో ఇప్పటికే పలువురు మృతిచెందగా, చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇక, తాజాగా హన్మకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఓ చిన్నారి మృతిచెందాడు. వివరాల ప్రకారం.. తెలంగాణ దశాబ్ది సంబరాలు ముగింపు దశకు చేరుకున్నాయి. 21రోజులపాటు జరిగే ఉత్సవాల్లో నేడు 19వరోజున విద్యా దినోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కమలాపూర్ మండలం మర్రిపల్లిగూడెంలో విద్యా దినోత్సవంలో అపశృతి చోటుచేసుకుంది. కాగా, విద్యా దినోత్సవం సందర్భంగా గ్రామంలో ర్యాలీ తీస్తుండగా విద్యార్థులపైకి వీధి కుక్కలు ఎగబడ్డాయి. ఈ సమయంలో కుక్కల దాడి నుంచి తప్పించుకోబోయి విద్యార్థి ఇనుగాల ధనుష్(12) మృతిచెందాడు. కాగా, ధనుష్ ఆరో తరగతి చదవుతున్నాడు. అయితే, ధనుష్ మృతితో గ్రామంలో విషాయఛాయలు అలుముకున్నాయి. ఇది కూడా చదవండి: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్‌న్యూస్.. -
‘భౌ’బోయ్.. కరుస్తున్నాయ్!
సాక్షి, అమరావతి: కమ్యూనిటీ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ లోకల్ సర్కిల్స్ సర్వే ప్రకారం దేశవ్యాప్తంగా 82 శాతం మంది ప్రజలు నిత్యం వీధి, పెంపుడు శునకాలతో దాడి ముప్పు పొంచి ఉందని భయపడుతున్నారట. ఇందులో 61 శాతం మంది ఇలాంటి దాడులు సర్వ సాధారణమని చెప్పగా.. ఇది గతంతో పోలిస్తే 31 శాతం పెరుగుదలను చూపిస్తోంది. లోకల్ సర్కిల్స్ దేశవ్యాప్తంగా 326 జిల్లాల్లో 53 వేల మందికిపైగా ప్రజల నుంచి ప్రతి స్పందనలు స్వీకరించింది. వీరిలో 67 శాతం పురుషులు, 33 శాతం మహిళలు ఉన్నారు. ప్రతి 10 మందిలో 8 మంది కుక్కల బెడదను తొలగించడంలో అధికారుల సహకారం దూరమైందని అభిప్రాయపడ్డారు. వీధి కుక్కల నియంత్రణ, పెంపుడు కుక్కల డేటా సేకరణలోనూ నిర్లక్ష్యంగా ఉన్నట్టు సర్వే తెలిపింది. కేవలం 10 శాతం మంది మాత్రమే అధికార యంత్రాంగంపై విశ్వాసం వ్యక్తం చేశారు. ముఖ్యంగా 71 శాతం మంది ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమం కింద విచ్చలవిడి జంతు నిర్వహణకు నిధులు కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం విశేషం. 36 శాతం రేబిస్ మరణాలు భారత్‌లోనే! దేశంలో జంతువులపై క్రూరత్వ నిరోధక చట్టం–1960 ప్రకారం జంతువులను హింసించడం, చంపడం చట్టవిరుద్ధం. యానిమల్ బర్త్ కంట్రోల్ రూల్–2001 ప్రకారం.. వాటి జనాభాను తగ్గించడానికి వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, టీకాలు వేయాల్సి ఉంటుంది. అయితే, చాలా రాష్ట్రాల్లో నిధుల కొరతతో వీధి కుక్కలకు టీకాలు వేయడంలో విఫలమవుతున్నట్టు సర్వే చెబుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా రేబిస్ మరణాలలో 36 శాతం భారతదేశం నుంచే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. అంటే 18వేల నుంచి 20వేల మరణాలు సంభవిస్తున్నాయి. 30నుంచి 60 శాతం మృతుల్లో 15 ఏళ్లలోపు చిన్నారులే ఎక్కువగా ఉంటున్నారు. వీధి శునకాలకు వేటాడే స్వభావం వీధి శునకాలకు విచ్చలవిడిగా వేటాడే స్వభావం ఉంటుందని జంతుశాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అవి సంచరిస్తున్న ప్రదేశంలో ఆహారం లభించకుంటే చిన్నచిన్న జంతువులను చంపి తింటాయని.. ఆ ప్రక్రియ వాటి మానసిక ప్రవృత్తిని ప్రభావితం చేస్తోందని వాదిస్తున్నారు. ఏటా ఆడ శునకం 20 పిల్లలకు జన్మనిస్తుంది. ఒక్కసారి కారు, బైక్ ప్రమాదంలో శునకం పిల్ల చనిపోతే ఆ వాహనాన్ని శత్రువుగా భావిస్తుంది. అలాంటి వాహనాలు వస్తే దూకుడుగా వెంబడించడం.. దాడి చేయటం వాటికి అలవాటుగా మారుతుందంటున్నారు. గతేడాది మహారాష్ట్రలో అత్యధికంగా 3,46,318 శునకాల దాడుల కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత 3,30,264 కేసులతో తమిళనాడు రెండో స్థానంలో నిలిచింది. ఏపీలో 1,69,378, ఉత్తరాఖండ్‌లో 1,62,422, కర్ణాటకలో 1,46,094, గుజరాత్లో 1,44,855, బీహార్‌లో 1,18,354 కేసులొచ్చాయి. -
కుక్కలు పగబట్టాయా?.. పార్క్‌లో మహిళను వెంబడించి..
నోయిడా: కొద్దిరోజులుగా కుక్కల దాడితో గాయపడుతున్న, మృతిచెందుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. దేశంలో ఏదో ఒక చోట కుక్కల దాడుల కారణంగా ఎవరో ఒకరు గాయపడుతూనే ఉన్నారు. ఇక, ఇటీవల యూపీలోని గుర్గావ్లో మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిపై కుక్కల గుంపు దాడి చేసిన ఘటనలో అతను మృతిచెందిన విషయం తెలిసిందే. ఇక, ఈ ఘటన మరువక ముందే తాజాగా నోయిడాలో ఓ మహిళపై శునకాలు దాడి చేశాయి. దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల ప్రకారం.. నోయిడాలోని సెక్టార్-78లోని మహాగున్ మోడరన్ సొసైటీలోని ఓ పార్కులో ఓ మహిళ తన పెంపుడు కుక్కతో నడుచుకుంటూ వెళుతున్నది. ఈ సందర్భంగా మహిళపై కొన్ని వీధికుక్కలు ఒక్కసారిగా దాడికి దిగాయి. దీంతో, కుక్కల బారినుండి ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసినా అవి వెంటపడ్డాయి. కుక్కల గుంపు నుండి తన కుక్కను, తనను తాను రక్షించుకునేందుకు ఆమె పరుగు తీసింది. ఈ క్రమంలో కుక్కల దాడిలో ఆమెకు స్వల్ప గాయలయ్యాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Disturbing scenes from Noida's Mahagun Mezzaria Society where stray dogs attack a woman and her pet. Thanks to the Dog Lovers in every such society where they neither adopt them nor they’ll allow others to evict them from the complex.https://t.co/rSYRvyhfOv — Rishi Bagree (@rishibagree) April 19, 2023 ఇది కూడా చదవండి: మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి -
మార్నింగ్ వాక్ వెళ్లిన వ్యక్తిపై కుక్కల దాడి.. అక్కడికక్కడే మృతి
లక్నో: ఇటీవలి కాలంలో కుక్కల దాడులు ఎక్కువయ్యాయి. దేశవ్యాప్తంగా కుక్కల దాడి ఘటనలు ఎక్కువ సంఖ్యలో వెలుగులోకి వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఏదో ఒకచోట కుక్కల దాడిలో ఎవరో ఒకరు మృతిచెందడం లేక గాయపడటం జరుగుతోంది. ఇక, తాజాగా మార్నింగ్ వాక్ చేస్తున్న ఓ వ్యక్తిపై కుక్కలు మూకుమ్మడి దాడి చేశాయంతో తీవ్రంగా గాయపడి మృతిచెందాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల ప్రకారం.. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ క్యాంపస్‌లో డాక్టర్ సఫ్దర్ అలీ అనే వ్యక్తి ఆదివారం ఉదయం 6 గంటల ప్రాంతంలో మార్నింగ్ వాక్ చేస్తున్నారు. పార్క్‌లో ఓ చోట నిలుచుని వ్యాయామం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడున్న కుక్కలు ఒక్కసారిగా అతడిపై దాడి చేశాయి. పది కుక్కుల గుంపుగా ఏర్పడి మూకుమ్మడిగా దాడి చేశాయి. తప్పించేందుకు ఆయన ఎంతగా ప్రయత్నించినప్పటికీ అవి పదే పదే దాడి చేయడంతో పాటు నోటితో ఈడ్చుకెళ్లి తీవ్రంగా గాయపరిచాయి. తీవ్రగాయాలతో సఫ్దర్ అలీ ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం, అటుగా వచ్చిన కొందరు వ్యక్తులు సప్దర్ అలీ మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో, ఘటనా స్థలానికి చేరుకున్ని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయితే, అతను ఎలా చనిపోయాడోనని పోలీసులు సీసీ ఫుటేజీని పరిశీలించగా కుక్కల దాడిలో మృతిచెందినట్టు గుర్తించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీని విడుదల చేశారు. దీంతో, ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఘటన నేపథ్యంలో స్థానికులు ఆ ప్రాంతంలో తిరిగేందుకు టెన్షన్ పడుతున్నారు. #Aligarh #DogMenance CCTV footage of the painful death of a person due to dog attack emerged. More than half a dozen #dogs attacked a person in the Aligarh Muslim University campus of Thana Civil Line area of Aligarh, which killed the person on the spot. pic.twitter.com/5XedupSu90 — Dr. Sandeep Seth (@sandipseth) April 16, 2023 -
ఆపరేషన్ చేసి.. తాబేలుకు ప్రాణం పోశారు
అనకాపల్లి: కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడ్డ తాబేలుకు ఆపరేషన్ చేసి ఓ వైద్యాధికారి జీవం పోశారు. స్థానిక యువకులు సకాలంలో స్పందించడంతో ఒక మూగ జీవి ప్రాణం నిలబడింది. వివరాలు.. వడ్డాది పెద్దేరు నదిలో తాబేళ్లు సంచరిస్తూ ఉంటాయి. శనివారం తాబేలు ఒకటి గుడ్లు పెట్టడానికి ఒడ్డుకు వచ్చింది. అక్కడే ఉన్న వీధి కుక్కలు దానిపై దాడి చేశాయి. తీవ్రంగా గాయపడ్డ తాబేలు పేగులు బయటకు వచ్చేయడంతో విలవిల్లాడింది. ఈ విషయం గమనించిన స్ధానిక యువకులు దగ్గర్లోనే ఉన్న ప్రభుత్వ పశువైద్యాధికారి శివకుమార్‌కు ఈ విషయం తెలిపారు. వెంటనే స్పందించిన వైద్యుడు తాబేలును ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్య సేవలు అందించారు. ఆధునిక పద్ధతిలో శస్త్రచికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడారు. తీవ్ర గాయాలైన మూగజీవికి ఆపరేషన్ చేసి ఆదుకున్నందుకు వైద్యు డు శివకుమార్‌ను స్థానికులు అభినందించారు. -
చిన్నారినిపై వీధికుక్క దాడి.. వైద్యానికి రూ.10లక్షల ఖర్చు..
కరీంనగర్: అభం శుభం తెలియని చిన్నారి అందరాని లోకాలకు వెళ్లింది. తమ్ముళ్లను ఆడిపిస్తూ.. అల్లరిచేస్తూ.. ఇంటికి మహాలక్ష్మిగా భావించిన కూతురు ఇకలేదన్న నిజాన్ని ఆ తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. పదిహేను రోజుల క్రితం కుక్కకాటుకు గురైన బాలిక చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయింది. ఈ ఘటన మానకొండూర్ మండలం పోచంపల్లి గ్రామంలో విషాదం నింపింది. స్థానికుల వివరాల ప్రకారం.. పోచంపల్లి గ్రామానికి చెందిన కోమళ్ల చిరంజీవి– రజిత దంపతులు వ్యవసాయం, కూలీ పని చేస్తుంటారు. వీరికి కూతురు మహేశ్వరి(12), ఇద్దరు కొడుకులు సంతానం. మహేశ్వరి స్థానిక మోడల్ స్కూల్లో ఏడో తరగతి చదువుతోంది. పదిహేను రోజుల క్రితం తమ్ముళ్లతో ఇంటిముందు ఆడుకుంటుండగా ఓ కుక్క అకస్మాత్తుగా వచ్చి మహేశ్వరి చేతును కరిచింది. వెంటనే తల్లిదండ్రులు మండలంలోని వెల్ది ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఇంజక్షన్‌తో పాటు వారంరోజుల పాటు వైద్యం చేశారు. వారం తరువాత మహేశ్వరికి జ్వరం వచ్చింది. వెంటనే కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చిన్నారికి ఇన్ఫెక్షన్ సోకిందని చెప్పడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించారు. మహేశ్వరి ప్రాణాలు దక్కించుకోవడానికి తల్లిదండ్రులు రూ.10లక్షలకు పైగా అప్పు చేశారు. అయినా పరిస్థితిలో మార్పురాకపోవడం, విషమంగా మారడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ శుక్రవారం మహేశ్వరి ప్రాణాలు వదిలింది. చిన్నారి మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. -
పేట్రేగిన పిచ్చికుక్కలు
రాజంపేట రూరల్ : రాజంపేటలో పిచ్చికుక్క దాడిలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానిక రాజు హైస్కూల్లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న చౌడయ్య వైఎస్సార్ నగర్లో నివాసం ఉంటున్నారు.ఈయన టీ తాగేందుకు ఇంటి నుంచి బయటకు వచ్చారు. వీధిలో ఉన్న పిచ్చికుక్క దాడిచేసి గాయపరిచింది. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తోపుడుబండిలో కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగించే నరసయ్య అనే వ్యక్తిపై కూడా కుక్కలు దాడిచేసి గాయపరిచాయి. చిట్వేలిలో మహిళపై.. చిట్వేలి : మండల పరిధిలోని నేతివారిపల్లిలో బుధవారం లక్ష్మీ నరసమ్మ (65) అనే మహిళపై పిచ్చికుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. చిట్వేలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేసి మెరుగైన చికిత్స నిమిత్తం రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో ఇప్పటి వరకు 20 మందిపై కుక్కలు దాడి చేసినట్లు సమాచారం. అధికారులు స్పందించి వీధి కుక్కల బెడద నుండి రక్షించాలని ప్రజలు కోరుతున్నారు. -
కుక్కలకు కరవమని నేను చెప్పానా?.. మేయర్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి.. తాజాగా మరోసారి కుక్క కాట్లపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎవరినో కుక్క కరిస్తే.. కుక్కను నేనే కరవమన్నట్టు చేశారు’’ అంటూ మండిపడ్డారు. కావాలనే తనపై బురద జల్లుతున్నారని నిప్పులు చెరిగారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాజకీయాల్లో మహిళల గురించి ఎప్పుడూ చెడుగా మాట్లాడతారని, మహిళలు బయటకు వస్తే ఓర్వలేరు.. తట్టుకోలేరన్నారు. అన్ని రంగాల్లో మహిళలు పోటీపడుతున్నారన్నారు. మహిళలు ఎన్ని అడ్డంకులు వచ్చినా ముందుకు వెళ్లాలన్నారు. హైదరాబాద్ మేయర్‌గా పనిచేయడం అంత సులువు కాదని విజయలక్ష్మి అన్నారు. కాగా, తెలంగాణలో కుక్కల దాడిలో బాలుడు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించారు.. ట్విట్టర్ వేదికగా కేటీఆర్ సార్.. ఒక్క దగ్గరకు చేర్చిన కుక్కల మధ్యలోకి మేయర్‌ను పంపండి అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలోనే మేయర్ తన పదవికి ఎందుకు రాజీనామా చేయకూడదని ఆయన ప్రశ్నించారు. చదవండి: ఉప్పు-నిప్పు: ఔను..! వాళ్లిద్దరూ ఒక్కటయ్యారు!! ఆకలితో ఉన్నందునే కుక్కలు దాడి చేశాయంటూ మేయర్ వ్యాఖ్యలపై కూడా వర్మ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లల ప్రాణం కంటే కుక్కల ఆకలి గురించి ఆలోచించడమేంటని మండిపడ్డారు. అంతగా ఉంటే.. మేయర్ గారు కుక్కలన్నింటినీ ఇంటికి తీసుకువెళ్లి ఆహారం పెట్టొచ్చు కదా అని కామెంట్ చేశారు. కుక్కలన్నీ మేయర్ ఇంట్లో ఉంటేనే పిల్లలకు రక్షణ ఉంటుందని సెటైర్ వేశారు. అలాగే, కుక్కల విషయంలో సమీక్షలో భాగంగా ఏం నిర్ణయం తీసుకున్నారో చెప్పాలన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మరోసారి మేయర్ వివాదస్పద వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి. -
షాకింగ్.. తల్లితో నిద్రిస్తున్న పసికందును ఈడ్చుకెళ్లిన వీధి కుక్క..
జైపూర్: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువకముందే అలాంటి దారుణం మరొకటి వెలుగుచూసింది. రాజస్థాన్ సిరోహి జిల్లాలోని ఓ ఆస్పత్రిలో అమ్మపక్కన నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధికుక్క ఈడ్చుకెళ్లింది. అనంతరం అతనిపై దాడి చేసింది. దీంతో తీవ్రగాయాలపాలై శిశువు చనిపోయాడు. హాస్పిటల్ వార్డు బయట మృతదేహం లభించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు సీసీటీవీ రికార్డులను పరిశీలించారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వత రెండు వీధి కుక్కలు ఆస్పత్రిలోని టీబీ వార్డులోకి ప్రవేశించాయి. అనంతరం వీటిలో ఓ శునకం పసికందును బయటకు ఈడ్చుకెళ్లినట్లు అందులో రికార్డయింది. ఈ శిశువు తండ్రి టీబీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. అతనితో పాటు భార్య, పిల్లలు కూడా ఇదే వార్డులో ఉన్నారు. అయితే అర్ధరాత్రి దాటిన తర్వాత అందరూ నిద్రపోయారు. అదే సమయంలో వీధికుక్క వార్డులోకి వచ్చి చిన్నారిని ఎత్తుకెళ్లింది. ఈ సమయంలో వార్డు సెక్యూరిటీ గార్డు కూడా అక్కడ లేరని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని, శిశువు మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించామని పేర్కొన్నారు. మరోవైపు ఆస్పత్రి నిర్వాహకులు కూడా ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. రోగితో పాటు ఉన్న కుటంబసభ్యులు అందరూ నిద్రలో ఉన్నప్పుడు ఈ ఘటన జరిగిందని, ఆ సమయంలో వార్డు గార్డు వేరే వార్డుకు వెళ్లాడని పేర్కొన్నారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని చెప్పారు. కాగా.. ఇటీవల హైదరాబాద్‌లోని అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో ప్రదీప్ అనే బాలుడు మరణించిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో కక్కుల బెడద నివారణకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. చదవండి: ముంబైలోకి ప్రవేశించిన 'డేంజర్ మ్యాన్'.. చైనా, పాకిస్తాన్, హాంకాంగ్‌లో శిక్షణ.. పోలీసుల హై అలర్ట్.. -
ప్రజల విమర్శలతో కుక్కల బెడద నివారణకు చర్యలు..
సాక్షి, సిటీబ్యూరో: ఎప్పుడైనా సరే.. ప్రజల ప్రాణాలు పోయాక సదరు ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామనే జీహెచ్ఎంసీ.. కుక్కకాట్ల విషయంలోనూ అలాగే సిద్ధమైంది. ప్రజలకు కుక్కకాట్ల బెడద తగ్గించేందుకు ప్రభుత్వం ఆదేశించిన కార్యక్రమాల అమలుకు సిద్ధమైంది. యాక్షన్ స్టార్ట్ చేయడంతో పాటు పబ్లిసిటీపైనా శ్రద్ధ చూపుతోంది. కుక్కలు మనుషుల జోలికి రాకుండా ఉండేందుకు ఎలా వ్యవహరించాలి? అనే అంశంపై పాఠశాలల్లోని విద్యార్థులకు వివరించడంతో పాటు కుక్కల విషయంలో చేయాల్సినవి, చేయకూడనివి (డూస్ అండ్ డోంట్స్) పనులను వివరిస్తూ పాఠశాలల్లో పోస్టర్లును ప్రదర్శిస్తోంది. కరపత్రాల పంపిణీ ప్రారంభించింది. వీటితోపాటు కుక్కల సంతతి నిరోధానికి ఆపరేషన్లు, రేబిస్ సోకకుండా వ్యాక్సిన్లు వేసే చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. ప్రతియేటా కుక్కల గణన వీటితోపాటు ప్రతియేటా కుక్కల గణన చేపట్టాలని నిర్ణయించింది. వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులందగానే తక్షణ చర్యలు చేపట్టాలని, కుక్కల సంరక్షణ కేంద్రాలకు తరలించే కుక్కలకు వ్యాధులుంటే చికిత్సలు చేయడంతోపాటు ఆహార సమస్యలు తలెత్తకుండా చూడాలని నిర్ణయించింది.విద్యార్థులతో పాటు రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్లు, స్వయం సహాయక సంఘాలు, స్లమ్ ఫెడరేషన్ సభ్యులకు సైతం కుక్కలకు సంబంధించి తగిన అవగాహన కలి్పంచ నున్నారు. కుక్కలు ఎక్కువగా సంచరించే ప్రాంతాలను గుర్తించి అవసరమైన చర్యలు చేపట్టనున్నారు. మాంసం, ఇతరత్రా ఆహార వ్యర్థాలు బహిరంగ ప్రదేశాల్లో వేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మూసీ ప్రాంతాల్లో నూరుశాతం వీధికుక్కలను పట్టుకునేందుకు స్పెషల్‌డ్రైవ్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. కుక్క కాటు నివారణకు స్వచ్ఛంద సంస్థలు , జంతు ప్రేమికులు, ప్రజాప్రతినిధులు తగిన సహకారం అందించాల్సిందిగా కోరింది. సామర్థ్యం లేని బల్దియా.. వేల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నా.. వాటిని పరిష్కరించేందుకు తగిన యంత్రాంగం బల్దియాలో లేదు. వచి్చన ఫిర్యాదులకు అనుగుణంగా వీధి కుక్కలను పట్టుకునేందుకు తగిన వాహనాలు, నిపుణులైన సిబ్బంది గానీ లేరు. ఫిర్యాదుల్లో ఒకే ప్రాంతం సమస్యను ఎక్కువ సార్లు ఫోన్ చేసి చెప్పడంతో అధిక సంఖ్యలో ఫిర్యాదులు కనిపిస్తున్నాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. ఫిర్యాదుల వరద.. అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడు కుక్కలదాడిలో మృతి చెందడంతో నగర ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో దాడి దృశ్యాలు చూసిన వారు బయటకు వెళ్లే తమ పిల్లల గురించి ఆందోళన చెందుతున్నారు. జీహెచ్ఎంసీ కాల్‌సెంటర్‌కు నాలుగు రోజులుగా నిత్యం రెండు వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. నాలుగు రోజుల్లో పదివేలకు పైగా ఫిర్యాదు వచ్చాయి. వివరాలిలా ఉన్నాయి. జీహెచ్ఎంసీ ముద్రించిన పోస్టర్లలో దిగువ అంశాలు పేర్కొన్నారు చేయాల్సినవి.. ♦ కుక్క మీ దగ్గరకు వస్తుంటే.. కదలకుండా అక్కడే నిలబడాలి. ♦ వీధి కుక్కలకు దూరంగా ఉండాలి. ♦ నిశ్శబ్దంగా ఉండాలి. ♦ పిల్లలతో ఉన్న కుక్కల దగ్గరకు వెళ్లొద్దు. ♦ కుక్కలతో స్నేహపూర్వకంగా ఉండాలి.. కానీ వాటిని ముట్టుకోవద్దు. ♦ కుక్కల గుంపు కనిపిస్తే వాటికి దూరంగా ఉండాలి. చేయకూడనివి.. ♦ కుక్కలు అరుస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, నిద్రిస్తున్నప్పుడు వాటికి భంగం కలిగించొద్దు. ♦ వీధికుక్కలపై రాళ్లు విసరడం వంటివి చేయొద్దు. ♦ తల్లి, పిల్లలు ఉన్నప్పుడు కుక్కల వద్దకు వెళ్లొద్దు. ♦ కుక్కల వెంటపడి తరమడం చేయవద్దు. ♦ కుక్కల తోక, చెవులు లాగడం వంటి పనులు చేయవద్దు. ♦ రోడ్లపై మాంసాహారం వేయవద్దు. ► ఎప్పుడైనా కుక్క కరిస్తే కరిచిన ప్రాంతంలో సబ్బుతో శుభ్రం చేసి వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ► జీహెచ్ఎంసీని సంప్రదించాల్సిన ఫోన్ నంబర్: 040 21111111 చదవండి: స్నేహితుడిని కత్తితో పొడిచి.. తల, గుండె వేరు చేసి.. -
కుక్కలు దాడులు చేయడానికి కారణాలు ఇవే..
-
కుక్కల దాడి ఘటన.. వారికి మెదడు ఉందా?.. రేవంత్‌రెడ్డి సీరియస్
సాక్షి, భూపాలపల్లి: కుక్కల బెడదపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి స్పందించారు. కుక్కల బెడదను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమయిందని ఆరోపించారు. హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు చనిపోతే మానవత్వం లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. హాథ్ సే హాథ్ జోడో యాత్రలో భాగంగా భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటిస్తున్న రేవంత్‌రెడ్డి.. కోటంచ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కుక్కలకు ఆకలి వేసి బాలుడిని తిన్నాయని మేయర్ అంటే.. మంత్రి కేటిఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయిస్తామని చెప్పడం చూస్తే వారి ఆలోచన ఏవిధంగా ఉందో అర్థమవుతుందన్నారు. చనిపోయిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి ఆదుకోవాల్సిన మంత్రి కేటీఆర్ కుక్కలకు కుటుంబ నియంత్రణ చేస్తామనడం వారికి మెదడు ఎక్కడ ఉందో అర్థమవుతుందన్నారు. ఎఫ్1 రేస్‌పై ఉన్న శ్రద్ధ కుక్కల బెడదపై లేదా అని ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ తక్షణమే మృతి చెందిన బాలుడి కుటుంబాన్ని పరామర్శించి, క్షమాపణ చెప్పి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. భూపాలపల్లిలో పామాయిల్ కంపెనీ పేరుతో ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి బినామీల పేరుతో పేదల భూములను ఆక్రమించుకుంటున్నాడని ఆరోపించారు. రేపు భూపాలపల్లిలో పర్యటించే మంత్రి కేటీఆర్.. దానిపై విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే అక్రమ దందాను నిరూపించేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. చదవండి: అందుకే నన్ను టార్గెట్ చేస్తున్నారు: చికోటి ప్రవీణ్ షాకింగ్ కామెంట్స్ భూపాలపల్లికి పట్టిన చీడపీడ విరగడం కోసం కోటంచ లక్ష్మి నరసింహస్వామి వారిని వేడుకుని పాదయాత్ర చేస్తున్నానని తెలిపారు. భూపాలపల్లిలో ఆరాచకశక్తులు పార్టీ ఫిరాయింపుదారులు రాజ్యమేలుతున్నారని విమర్శించారు. వారి తప్పిదాలను ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన చరిత్ర భూపాలపల్లిలో ఉందన్నారు. ప్రజా వ్యతిరేక పాలనతో ఆస్తులు సంపాదనే లక్ష్యంగాఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పనిచేస్తున్నాడని విమర్శించారు. భూపాలపల్లిలో పర్యటించే కేటీఆర్ తమ సవాల్ స్వీకరించి సమాధానం చెప్పాలని కోరారు. -
ఈ పాపం ఎవరిది? అంబర్‌పేట కుక్కల దాడిపై జనాగ్రహం..
సాక్షి, సిటీబ్యూరో: గుంపుగా వచ్చిన కుక్కలు.. నాలుగేళ్ల బాలుడిని చుట్టుముట్టాయి. జంతువులను వేటాడినట్టు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారి పరిస్థితి.. పులినోట చిక్కిన లేడిపిల్లలా తప్పించుకోలేని దైన్యం. ఏంచేయాలో తెలియని తనం. అరుపులే తప్ప ఆదుకునే వారు లేని దుస్థితి. ఒక కుక్క కాలు.. మరొకటి చేయిని నోట కరిచి లాగేశాయి. ఆ సమయంలో పసికందు వేదన అరణ్య రోదనగానే మిగిలిపోయింది. నిమిషాల వ్యవధిలో ఆ బాలుడి నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆదివారం నగరంలోని అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో జరిగిన ఈ హృదయ విదారక దృశ్యాల్ని సామాజిక మాధ్యమాల్లో చూసిన వారు కన్నీటి పర్యంతమయ్యారు. అభం శుభం తెలియని పసిబాలుడిని పీక్కు తినడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నగరంలో ఎక్కడ చూసినా ఈ విషాదకర ఘటన గురించే చర్చిస్తూ కనిపించారు. కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు జరుగుతున్నా చీమకుట్టినట్లు కూడా లేని బల్దియా తీరుపై మండిపడ్డారు. కుక్కలు మీదపడి రక్కుతున్న చిత్రాలను చూసి నెటిజెన్లు ఆగ్రహావేశాలతో పోస్టింగులు చేశారు. జంతు ప్రేమికులిప్పుడేం చేస్తారు.. ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలో చెప్పాలంటూ గొంతెత్తారు. ఆపరేషన్లు చేసి వదిలేస్తున్నారు.. వీధి కుక్కల స్వైర విహారం ఒక్క అంబర్‌పేటకే పరిమితం కాదు. నగరమంతటా ఇదే పరిస్థితి నెలకొంది. కాగా.. అంబర్‌పేట సమీప ప్రాంతాల్లోనే ఈ సమస్య మరీ అధికంగా ఉంది. సమీపంలోని మూసీ పక్కనే ఉన్న కుక్కల ఆపరేషన్ కేంద్రానికి నగరంలోని పలు ప్రాంతాల నుంచి శునకాలను తీసుకువస్తుంటారు. ఇక్కడికి నిత్యం 50కి పైగా కుక్కలు తీసుకు వచ్చి వాటికి ఆపరేషన్లు చేస్తుంటారు. అనంతరం వాటిని ఎక్కడి నుంచి తెచ్చారో అక్కడే వదిలేయాల్సి ఉంటుంది. కానీ.. అలా జరగడంలేదు. దీంతో వీధి శునకాలు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. నియోజకవర్గంలోని దుర్గానగర్, గోల్నాక, ప్రేమ్‌నగర్, పటేల్‌నగర్, చే నంబరు చౌరస్తా, బతుకమ్మకుంట ప్రాంతాల్లో కుక్కల బెడద తీవ్రంగా నెలకొంది. వీటి భయంతో సాయంత్రం సమయాల్లో మహిళలు, చిన్నారులు బయటకు వెళ్లడానికి జంకుతున్నారు. బిస్కెట్ పాకెట్ అనుకుని.. ఆదివారం అంబర్‌పేట చే నంబర్ చౌరస్తా ప్రాంతంలో నాలుగేళ్ల బాలుడు ప్రదీప్ చేతిలో వాటర్ బాటిల్‌తో కనిపించడంతో.. కుక్కలు దానిని బిస్కెట్ ప్యాకెట్ అనుకుని అతని వెంటపడ్డాయి. దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రమాదంలో బాలుడు తీవ్రంగా గాయపడడంతో అక్కడే ఉన్న తండ్రి గంగాధర్ ఇతర సిబ్బందితో సమీపంలోని ఆస్పత్రికి తీసుకువెళ్లేలోపు బాలుడు అప్పటికే మృతి చెందాడు. అయిదు నిమిషాలు దాడి చేశాయి బాలుడు తండ్రితో పాటు కారు సరీ్వస్ సెంటర్‌కు వచ్చాడు. ప్రాంగణంలో ఆడుకుంటుండగా చూశా. ఒంటరిగా చేతిలో నీటి బాటిల్ పట్టుకుని బయటకు రావడంతో కుక్కలు వెంటబడి దాడి చేశాయి. పెద్దగా శబ్దం రాలేదు. అయినప్పటికీ వెంటనే తరిమేశాం. గాయపడ్డ బాలుడిని ఆస్పత్రికి తీసుకువెళ్లినా ఫలితం లేకుండా పోయింది. – నాగులు, కారు సర్వీస్ సెంటర్ సెక్యూరిటీ గార్డు సుప్రీం ఆదేశాలు బేఖాతర్.. ► ఆర్ఓసీ నెంబర్ 8938/2009 ఎం 3 ప్రకారం పట్టణాల్లో ఉన్న వీధి కుక్కలకు 90 రోజుల్లోనే కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయాలని సుప్రీంకోర్టు దశాబ్దం క్రితం ఆదేశాలు జారీచేసింది. ఈ ఆదేశాలు నగరంలో అమలవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే ఆరోపణలున్నాయి. ► నల్లకుంట ఫీవర్ ఆస్పత్రిలో ఈ ఏడాది ఇప్పటి వరకు 3500కు పైగా కుక్క కాటు కేసులు నమోదయ్యాయి. ఫీవర్ ఆస్పత్రికి నిత్యం పదుల సంఖ్యలో కుక్క కాటు బాధితులు వ్యాక్సిన్ కోసం వస్తున్నారు. జంతు సంరక్షణ కేంద్రాలు సరే... కుక్కలతో సహా జంతు సరంక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న జీహెచ్ఎంసీ.. కుక్కల బారి నుంచి ప్రజల ప్రాణాలకు రక్షణ ఇవ్వలేకపోతోంది. గతంలో ‘కేటీఆర్ అంకుల్ మమ్మల్ని వీధికుక్కల బారినుంచి కాపాడండి’ అంటూ చిన్నారులు ప్లకార్డులతో ప్రదర్శనలు చేశారు. అయినా పరిస్థితి మారలేదు. కుక్క కాట్లు..కన్నీటిచారికలు ఆరడం లేదు. టీటీ, ఏఆర్వీ, రిగ్ వ్యాక్సిన్ తప్పనిసరి.. కుక్క కాటుకు టీటీతో పాటు యాంటీ రేబీస్ వ్యాక్సిన్(ఏఆర్వీ), రేబీస్ ఇమ్యునో గ్లోబులిన్ (రిగ్) వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈవీ నారాయణగూడ ఐపీఎం (కుక్కల దవాఖానా), నల్లకుంట ఫీవర్ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని కుక్కలకు రేబీస్ ఇంజక్షన్లు వేయించాలని పశు వైద్యాధికారులు సూచిస్తున్నారు. పెంపుడు కుక్కల యజమానులు వీటిని తప్పనిసరిగా తమ ఇళ్లలో పెంచుకునే కుక్కలకు వేయించాలన్నారు. వీధి కుక్కలకు జీహెచ్ఎంసీ నిధుల నుంచి కొనుగోలు చేసి వేయాల్సి ఉందన్నారు. ప్రజా ప్రతినిధులు వీటిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. బాధితుల సంఖ్య పెరుగుతోంది గత కొద్ది రోజులుగా నల్లకుంట ఫీవర్ ఆసుపత్రికి కుక్కకాటు బాధితుల సంఖ్య పెరుగుతోంది. ఆసుపత్రిలో రేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. కుక్క కాటుకు గురైన బాధితులు వెంటనే ఫీవర్‌కు వచ్చి రిగ్ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. కుక్క కరిసిన తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రేబిస్ సోకి ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. రేబిస్ చికిత్సకు మందులేదు. కుక్క కరిస్తే మొదటిరోజు ఒక డోస్ 7, 13, 28వ రోజు ఇంజక్షన్లు తప్పనిసరిగా వేయించుకోవాలి. – డాక్టర్ కె.శంకర్, ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగోలులో దాడి.. ఆడుకుంటున్న బాలుడిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన కొత్తపేట డివిజన్ మారుతీనగర్‌లో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. కొత్తపేట డివిజన్లో మారుతి నగర్ రోడ్ నెంబర్– 18లో వాచ్‌మన్‌గా పనిచేసే బాలు కుమారుడు నాలుగేళ్ల రిషి ఆడుకుంటుండగా కొన్ని శునకాలు వచ్చి బాలుడిపై దాడి చేసి తీవ్ర గాయాలు చేశాయి. గాయాల పాలైన చిన్నారిని తల్లిదండ్రులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున వీధి కుక్కలు ఈ కాలనీలోకి వస్తున్నాయి. గుంపులు గుంపులుగా వస్తూ దారి వెంట వెళ్లే వారిని వెంబడించి దాడికి పాల్పడుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకుని వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. కుక్కల భయంతో వణికిపోతున్నాం.. కుక్కల బెడద ఉదయం, సాయంత్రం వేళల్లో ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం బయటకు వెళ్లడానికి భయమేస్తోంది. సాయంత్రం వీధిలో పిల్లలు ఆడుకోవడానికి జంకుతున్నారు. పలుమార్లు అధికారులకు ఫిర్యాదులు చేసినా పెద్దగా ఫలితం లేకుండాపోయింది. – గిరిజ, బతుకమ్మకుంట పిల్లలు వెళ్లే సమయంలో.. నర్సింహ బస్తీలో వీధి కుక్కల బెడద అధికంగా ఉంది. వీధుల్లో కుక్కలు పెరిగిపోవడంతో పిల్లలు బడికి వెళ్లేందుకు భయపడుతున్నారు. ఈ వీధిలో ఓ కుక్క ఇప్పటికే పది మందికి పైగా దాడిచేసి గాయపరిచింది. అంబర్‌పేట ఘటనతో మా బస్తీలో కూడా కుక్కలు పిల్లలపై ఎక్కడ దాడి చేస్తాయోనని భయంగా ఉంది. – వేణు గౌడ్, నర్సింహ బస్తీ ద్విచక్ర వాహనాలను వెంబడిస్తున్నాయి తిలక్‌నగర్ బాలాజీ నగర్ మెయిన్ రోడ్డులో కుక్కల బెడద అధికంగా ఉంది. ద్విచక్ర వాహనాలపై వచీ్చపోయే వారిని వెంబడిస్తున్నాయి. చీకటి పడిందంటే చాలు వెళ్లాలంటే వృద్ధులు, చిన్నారులు భయంతో వణికిపోతున్నారు. ఏవైనా ఘటనలు జరిగినప్పుడు జీహెచ్ఎంసీ అధికారులు హడావుడి చేస్తున్నారే తప్ప సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడంలేదు. -రవి, తిలక్‌నగర్ బస్తీ మేయర్ చెప్పినవన్నీ అబద్ధాలే డెబ్బై అయిదు స్టెరిలైజేషన్ చేశామని నగర మేయర్ చెప్పిన మాటలన్నీ పచ్చి అబద్ధాలు. ఇంత పెద్ద సంఖ్యలో స్టెరిలైజేషన్ చేసినట్లయితే వీధి కుక్కల సంఖ్య ఎందుకు పెరిగింది? 2021లో 4,60,000 ఉన్న వీధి కుక్కల సంఖ్య ప్రస్తుతం 5 లక్షల 75 వేలకు ఎలా పెరిగింది?. వీధి కుక్కల నియంత్రణ చర్యలు చేపట్టే బాధ్యతను జీహెచ్ఎంసీ వదిలేసి, ప్రైవేటు స్వచ్ఛంద సంస్థలకు అప్పజెప్పడం చాలా నష్టకరం. వీధి కుక్కల నియంత్రణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలి. – ఎం శ్రీనివాస్, సీపీఎం, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆ సమయంలో దాడి చేసే అవకాశాలు ఎక్కువ ఫిబ్రవరి, సెపె్టంబర్ నెలలు కుక్కలకు బ్రీడింగ్ సీజన్ వంటివి. ఆయా నెలల్లో వీధి కుక్కలు మనుషుల్ని కరిచే అవకాశాలు ఎక్కువ. అంతేకాకుండా ఆకలి బాధ కూడా ఒక ప్రధాన కారణమే. ఒక ప్రాంతంలోని శునకాలు మరో ప్రాంతంలోకి వస్తే ఆ రెండు వర్గాల మధ్య పోటీ ఏర్పడి వెర్రెత్తి ప్రవర్తిస్తాయి. ఆ సమయంలో అక్కడ కనిపించే వ్యక్తులపై దాడి చేసేందుకు ప్రయత్నిస్తాయి. – డాక్టర్ ప్రవీణ్‌కుమార్, సూపర్‌స్పెషాలిటీ వెటర్నరీ ఆసుపత్రి, నారాయణగూడ చదవండి: కుక్కల దాడిలో చిన్నారి మృతి బాధాకరం.. చర్యలతో పునరావృతం కానివ్వం: మేయర్ -
విశ్వనగరానికి వీధికుక్కల బెడద.. మూడు రెట్లు పెరిగిన ఘటనలు
రాష్ట్రంలో వీధి కుక్కలు పేట్రేగిపోతున్నాయి. కాలనీలు, బస్తీల్లో స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ చిన్నారులపై దాడులు చేస్తున్నాయి. కొన్నిచోట్ల క్రూర మృగాల్లా రెచి్చపోతూ పసిపిల్లల ప్రాణాలు తీస్తున్నాయి. విశ్వనగరంగా చెప్పుకుంటున్న హైదరాబాద్‌లోనూ వీటి బెడద తప్పడం లేదు. సోమవారం బాగ్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఓ నాలుగేళ్ల బాలుడు మరణించడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు వేర్వేరు ఘటనల్లో కూడా ఇద్దరు చిన్నారులపై కూడా కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. 2022లో నవంబర్ నాటికే 80,281 కుక్కకాట్లు రాష్ట్రంలో కుక్కకాటు కేసులు ఏడాది కాలంలోనే గణనీయంగా పెరిగాయి. నాలుగేళ్ల క్రితం భారీగా ఉన్న కేసులు.. మరుసటి రెండేళ్లు తగ్గగా.. తర్వాత నాలుగో ఏడాది మళ్లీ పెరగడం ఆందోళన కలిగిస్తోంది. 2021లో 24,124 కుక్క కాట్లు సంభవించగా, 2022లో నవంబర్ నాటికే ఏకంగా 80,281 మందిని కుక్కలు కరిచినట్లు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ నివేదిక వెల్లడించింది. అంటే అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఏకంగా మూడురెట్లకు పైగా కుక్కకాట్లు జరిగాయి. దేశంలో కుక్కకాట్లలో తెలంగాణ 8వ స్థానంలో ఉంది. రాష్ట్రంలో 2019లో 1.67 లక్షల కాట్లు, 2020లో 66,782 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సమస్య తీవ్రం హైదరాబాద్‌లోని ఐపీఎంకు కుక్క కాట్లకు గురై చికిత్స కోసం వస్తున్నవారు నెలకు 2,000– 2,500కు పైగా ఉంటుండగా, నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో నెలకు 400 వరకు కుక్కకాటు కేసులు నమోదు కావడం.. వాటి బెడద ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. ఇక హైదరాబాద్‌తో పాటు జీహెచ్ఎంసీని ఆనుకొని ఉన్న జవహర్‌నగర్, బడంగ్‌పేట, బండ్లగూడ, మీర్‌పేట, జిల్లెలగూడ, బోడుప్పల్, పీర్జాదిగూడ, నిజాంపేటల్లో వీటి సమస్య అత్యంత తీవ్రంగా ఉంది. జవహర్‌నగర్‌లో డంపింగ్ స్టేషన్ కుక్కలకు ప్రత్యేక ఆవాస కేంద్రంగా తయారైంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్లలో వెటర్నరీ విభాగాలున్నా, అవి నామమాత్రంగా కొనసాగుతున్నాయి. వీధి కుక్కలు పెరిగిపోవడానికి, నగరాల్లో ఏటా వేల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవడానికి ఆయా కార్పొరేషన్లు, మునిసిపాలిటీలలో అధికార యంత్రాంగాల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, గ్రేటర్ వరంగల్, రామగుండం, ఖమ్మం కార్పొరేషన్లలో వీధికుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు తక్కువేనన్న విమర్శలూ ఉన్నాయి. కరీంనగర్ కార్పొరేషన్లో ఈ ఏడాది కుక్కల సంతాన నియంత్రణ శస్త్ర చికిత్సలను కూడా నిలిపివేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 20 జిల్లా కేంద్రాలలో జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసిన మునిసిపల్ శాఖ స్టెరిలైజేషన్ (సంతాన నియంత్రణ) చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒక కుక్క, దాని పిల్లలు..పిల్లల పిల్లలు! ఒక కుక్క దాని పిల్లలు కలిపి ఏడాది కాలంలో దాదాపు 42 కుక్క పిల్లలను పెడతాయి. వాటి పిల్లలు.. పిల్లల పిల్లలు ఇలా మొత్తం ఏడేళ్ల కాలంలో దాదాపు 4 వేల కుక్కలు పుడతాయని అంచనా. ఇలా కుక్కల సంతతి అభివృద్ధి చెందుతున్నా వాటిని తగ్గించే కార్యక్రమాలు అంత చురుగ్గా సాగడం లేదు. దీంతో వీధికుక్కల సంఖ్య తగ్గడం లేదు. స్టెరిలైజేషన్తోనే నియంత్రణ.. వీధి కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ ఒక్కటే మార్గం. అంటే కుక్కల పునరుత్పత్తి ప్రక్రియను నియంత్రించేలా శస్త్రచికిత్సలు చేయడం. మొత్తం కుక్కల్లో ఆడకుక్కలన్నింటికీ ఒకేసారి సంతాన నిరోధక శస్త్రచికిత్సలు జరిగితేనే కుక్కల సంతతి తగ్గుతుంది. ఏటా వేలాది కుక్కలకు శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు ఆయా కార్పొరేషన్ల వెటర్నరీ విభాగాల అధికారులు చెపుతున్న మాటలన్నీ డొల్ల మాటలేనని కుక్కల సంఖ్య పెరిగిపోతున్న తీరు స్పష్టం చేస్తోంది. ఒక్క వరంగల్ కార్పొరేషన్లోనే సుమారు 60 వేలకు పైగా వీధికుక్కలు ఉన్నట్లు అధికారులు లెక్కలేశారు. ఇక్కడ కుక్కల సంతాన నియంత్రణ కోసం ఓ ప్రైవేటు ఎన్జీవోకు శస్త్ర చికిత్సల బాధ్యత అప్పగించారు. ఒక కుక్కకు స్టెరిలైజేషన్ చేస్తే కార్పొరేషన్ రూ.750 చెల్లిస్తోంది. ప్రతిరోజు 20 కుక్కల వరకు పట్టుకొని ఆపరేషన్లు చేస్తున్నట్లు ఎన్జీవో సంస్థ చెపుతున్నప్పటికీ, వేలల్లో ఉన్న కుక్కల సంతతి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజు 20 నుంచి 30 కుక్క కాటు కేసులు ఎంజీఎం ఆసుపత్రికి వస్తున్నట్లు తెలుస్తోంది. కరీంనగర్, రామగుండంలలో కార్పొరేషన్ అధికారులే కుక్కల నియంత్రణకు స్టెరిలైజేషన్ చేపట్టినా, అవి ఎంతోకాలం సాగలేదు. కరీంనగర్లో స్టెరిలైజేషన్ పేరుతో కుక్కలను చంపుతున్నట్లు ఓ స్వచ్చంద సంస్థ పేర్కొనడంతో ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. రామగుండం పూర్తిగా కోల్‌బెల్ట్ ఏరియా కావడం, ఓపెన్ నాలాలు ఎక్కువగా ఉండడంతో కుక్కల బెడద తీవ్రంగా ఉంది. కొత్తవారు ఎవరు కనిపించినా పిక్కలు పీకేసే పరిస్థితి ఈ కాలరీస్‌లో ఉంది. కరీంనగర్, నిజామాబాద్ నగరాల్లో ప్రతి నెల 400 వరకు కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఖమ్మంలో 2021లో కుక్కల స్టెరిలైజేషన్ కార్యక్రమం ప్రారంభించిన కార్పొరేషన్ అధికారులు సుమారు 2,500 కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేసినట్లు చెప్పారు. కానీ తర్వాత ఆ కార్యక్రమాన్ని నిలిపివేశారు. ఇప్పుడు నగరంలో ఎక్కడ చూసినా వీధికుక్కల గుంపులే కనిపిస్తున్నాయి. 29,789 కుక్కలకు స్టెరిలైజేషన్ రాష్ట్ర వ్యాప్తంగా వీధికుక్కల సంతతిని తగ్గించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జీహెచ్ఎంసీ మినహా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేకంగా జంతు సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది. ఇందులో భాగంగా ఇప్పటివరకు 20 జిల్లా కేంద్రాలలో ఏర్పాటు చేసిన జంతు సంరక్షణ కేంద్రాల్లో 29,789 కుక్కలకు సంతతి నియంత్రణ ఆపరేషన్లు నిర్వహించినట్లు తెలిపింది. నగరాలు, మునిసిపాలిటీలలో ప్రజలకు ఇబ్బందిగా మారిన కుక్కలతో పాటు కోతులను కూడా ఈ సంరక్షణ కేంద్రాలకు తరలించి స్టెరిలైజేషన్ చేస్తున్నట్లు తెలిపింది. కుక్కలకు ఆహారం దొరక్కే..: మేయర్ విజయలక్ష్మి గ్రేటర్ నగరంలో 2022 జనవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 20 మధ్యకాలంలో 5,70,729 కుక్కలుండగా 4,01,089 కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేసినట్లు హైదరాబాద్ మేయర్ విజయలక్ష్మి చెప్పారు. అంబర్‌పేట ఘటనలో కుక్కలకు ప్రతిరోజూ ఆహారం వేసే వారు రెండురోజులుగా వేయనందునే ఆకలికి తట్టుకోలేక బాలునిపై దాడి చేసి ఉంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ప్రతిరోజూ కుక్కలకు మాంసం వేసే దుకాణాలు వారు దుకాణాలు మూసేసినా అలాగే వ్యవహరిస్తాయని చెప్పారు. ఇదొక ప్రమాదం మాత్రమేనంటూ.. బాలుడు మరణంపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నగరంలో మరోమారు ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆహారం కోసం నగరాలకు.. గతంలో వీధి కుక్కలు గ్రామాల్లో ఎక్కువగా ఉండేవి. అయితే నగరాల్లో వాటికి ఆహారం ఎక్కువ మొత్తంలో లభ్యమవుతుండడంతో వాటి సంఖ్య భారీగా పెరిగింది. ఏదైనా సంఘటన జరిగినప్పుడు హడావుడి చేసి వదిలేయకుండా.. వీధికుక్కల సమస్యపై కార్పొరేషన్లకు ప్రజలు ఫోన్లు చేసినప్పుడు స్పందించి ఆయా బస్తీలు, కాలనీల్లోని కుక్కలను తీసుకెళ్లి స్టెరిలైజేషన్ చేసి దూరంగా వదిలేస్తే ఈ సమస్యను కొంతవరకు తగ్గించవచ్చని ప్రజలు అంటున్నారు. ఆడకుక్కలన్నిటికీ ఆపరేషన్లు చేయాలి హైదరాబాద్‌లో కుక్కల సంఖ్య తగ్గించేందుకు ఏబీసీ (యానిమల్ బర్త్ కంట్రోల్) కార్యక్రమాలు నిబంధనల కనుగుణంగా జరగడం లేవని, అవినీతి జరుగుతోందని జంతు ప్రేమికురాలు, సంబంధిత అంశాలపై అవగాహన ఉన్న డాక్టర్ శశికళ తెలిపారు. జైపూర్, గోవాల్లో ఈ కార్యక్రమాలు బాగా జరుగుతున్నాయని చెప్పారు. ఆడ కుక్కలన్నింటికీ ఆపరేషన్లు చేయడంతో పాటు మగవాటికి సంతానోత్పత్తి వయసు వచ్చే సమయంలోనే (8–12 నెలల మధ్య) సంతాన నిరోధక శస్త్రచికిత్సలు చేస్తున్నారన్నారు. వీటితో పాటు ‘మిషన్ ర్యాబిస్’పేరిట కార్యక్రమాలు నిర్వహిస్తారని, కుక్కల బారిన పడకుండా ఎలా వ్యవహరించాలి, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తారని చెప్పారు. అసోంలోనూ కొన్ని సంస్థలు ఇలా పనిచేస్తున్నాయని వివరించారు. మాయమైన ‘మాఇంటి నేస్తం’.. పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ లోపం వల్ల, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేయడం వల్ల కుక్కల సంచారం పెరుగుతోంది. వీటి సంఖ్యను తగ్గించే చర్యల్లో భాగంగా దాదాపు ఐదేళ్ల క్రితం వీధికుక్కలను పెంచుకునే పథకం ‘మా ఇంటి నేస్తం’ప్రారంభించారు. అప్పట్లో 3 వేల వీధికుక్కల్ని ఆసక్తి ఉన్నవారికి దత్తత ఇచ్చారు. కానీ ఆ తర్వాత ఆ పథకం కనుమరుగైంది. అది కొనసాగినా వీధికుక్కల సంఖ్య తగ్గి ఉండేదనే అభిప్రాయాలున్నాయి. హైదరాబాద్ నగరంలో కుక్కలను కట్టడి చేయాలని దాదాపు 8 నెలల క్రితం హైకోర్టు ఆదేశించినప్పటికీ చర్యల్లేక పోవడం విచారకరం. హైదరాబాద్ ఐపీఎంలో 2022 జనవరి నుంచి 2023 జనవరి వరకు నమోదైన కుక్కకాటు కేసులు నెల కేసులు 2022 జనవరి 2,286 ఫిబ్రవరి 2,260 మార్చి 2,652 ఏప్రిల్ 2,540 మే 2,569 జూన్ 2,335 జూలై 2,201 ఆగస్టు 2,272 సెపె్టంబర్ 2,177 అక్టోబర్ 2,474 నవంబర్ 2,539 డిసెంబర్ 2,554 2023 జనవరి 2,580 ––––––––––––––––––––– హైదరాబాద్‌లో గతంలో... – 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో కుక్కలు దాడి చేయడంతో 8 ఏళ్ల బాలిక మృతి. – 2020లో అమీర్‌పేటలో ఒకేరోజు 50 మంది కుక్కకాట్ల బారిన పడ్డారు. – 2020 ఆగస్టులో లంగర్‌హౌస్‌లో నలుగురు చిన్నారులకు గాయాలు – 2022 డిసెంబర్ 12న పీర్జాదిగూడలో చిన్నారికి తీవ్రగాయాలు. – 2021 జనవరి 30న బహదూర్‌పురాలో 8 ఏళ్ల బాలుడు మృతి. – 2017లో 14 మంది, 2018లో 9 మంది కుక్కకాట్ల వల్ల మరణించారు. ఇలా ఏటా కుక్కకాట్ల వల్ల మరణాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. –––––––––––––––– ప్రతిసారీ 4–8 పిల్లలు – కుక్కల జీవిత కాలం 8–12 సంవత్సరాలు. – 8 నెలల వయసు నిండేటప్పటికి సంతానోత్పత్తి సామర్ధ్యం వస్తుంది. – కుక్కల గర్భధారణ సమయం 60–62 రోజులు – ఒక్కో కుక్క సంవత్సరానికి రెండు పర్యాయాలు సంతానోత్పత్తి చేస్తుంది. – సంతానోత్పత్తి జరిపిన ప్రతిసారీ 4–8 పిల్లలు పెడుతుంది. ––––––––––––––––––––– పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం: కేటీఆర్ అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడు మరణించడం బాధాకరమని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు చేపడతామని పేర్కొన్నారు. వీధికుక్కల దాడిలో గాయపడి మరణించిన బాలుడి కుటుంబానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వీధికుక్కలు, కోతుల సమస్య తీవ్రంగా ఉందన్నారు. దీనిపై జీహెచ్ఎంసీ, వెటర్నరీ అధికారులతో ఈ నెల 23 న ఉదయం 11.00 గంటలకు మాసాబ్‌ట్యాంక్‌లోని తమ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు ఆయన చెప్పారు. కుక్కల దాడిలో ఇద్దరు చిన్నారులకు గాయాలు సుజాతనగర్: కుక్కల దాడిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్, బేతంపూడి గ్రామాల్లో ఇద్దరు చిన్నారులు గాయపడ్డారు. సుజాతనగర్‌లోని సుందరయ్యనగర్‌కు చెందిన నాలుగేళ్ల చిన్నారి ఫజీమా మంగళవారం స్థానిక అంగన్వాడీ సెంటర్ నుంచి ఇంటికి వస్తుండగా.. ఒక్కసారిగా వచి్చన కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటనలో ఫజీమా చేతికి గాయాలు కాగా.. స్థానికులు కుక్కలను తరిమేశారు. బేతంపూడిలో ఇంటి వద్ద ఆడుకుంటున్న యశ్వంత్ అనే బాలుడిపై అకస్మాత్తుగా వచి్చన వీధి కుక్కలు దాడి చేసి గొంతుపై కరిచాయి. కుక్కల నుంచి బాలుడిని విడిపించేందుకు వెళ్లిన గ్రామస్తుడు బానోత్ లాలుపై కూడా దాడి చేయగా స్థానికులు వాటిని తరిమేశారు. అసలేం జరిగింది.. హైదరాబాద్‌లో తండ్రితో కలిసి అతను పనిచేసే చోటుకు వెళ్లిన బాలుడు కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడి మరణించడం కలకలం రేపింది. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయికి చెందిన గంగాధర్ జీవనోపాధి కోసం నగరానికి వచ్చి భార్యాపిల్లలతో కలిసి బాగ్‌అంబర్‌పేటలో నివాసముంటున్నాడు. ఛే నంబర్లోని కార్ల సరీ్వసింగ్ సెంటర్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 19న తన కుమారుడు ప్రదీప్ (4), కుమార్తెతో కలిసి కారు సరీ్వసింగ్ సెంటర్‌కు వెళ్లాడు. పిల్లల్ని ఆడుకొమ్మనిచెప్పి విధుల్లో నిమగ్నమయ్యాడు. ప్రదీప్ అక్కడ ఆటవిడుపుగా ఒంటరిగా తిరుగుతున్న సమయంలో కుక్కల గుంపు ఒకటి అకస్మాత్తుగా దాడి చేసింది. బాలుని అక్క గమనించి కేకలు వేయడంతో గంగాధర్‌తో పాటు ఇతర సెక్యూరిటీ గార్డులు వచ్చి కుక్కలను తరిమికొట్టారు. అప్పటికే తీవ్రంగా గాయపడ్డ ప్రదీప్‌ను సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు బాలుడు మృతి చెందినట్లు చెప్పారు. -
Hyderabad: కుక్కకు భయపడి మూడో అంతస్తు నుంచి దూకిన డెలివరీ బాయ్
సాక్షి, హైదరాబాద్: పార్శిల్ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్‌పై పెంపుడు కుక్క దాడి చేయడంతో మూడో అంతస్తు నుంచి కిందకు దూకిన ఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... బంజారాహిల్స్ రోడ్ నం. 6లోని లుంబిని ర్యాక్ క్యాజిల్ అపార్ట్మెంట్లో నివసించే శోభనా నాగాని ఫుడ్ డెలివరీ ఆర్డర్ చేశారు. ఈ నెల 11న ఉదయం 9 గంటల ప్రాంతంలో మహ్మద్ రిజ్వాన్(23) స్విగ్గి డెలివరీ బాయ్ పార్శిల్ ఇవ్వడానికి వెళ్లి తలుపు కొట్టాడు. తలుపు తీసి ఉండటంతో ఒక్కసారిగా ఇంట్లోనుంచి జర్మన్ షెపర్డ్ కుక్క బయటికి దూసుకొచ్చి అతడిని కరవబోయింది. దీంతో తీవ్ర ఆందోళనకు గురైన రిజ్వాన్ కుక్క బారి నుంచి తప్పించుకునేందుకు పరుగు పెట్టాడు. అతడి వెంట కుక్క పడడంతో మూడో ఫ్లోర్ నుంచి కిందకు దూకాడు. కారిడార్ రెయిలింగ్ నుంచి జారి కిందపడ్డాడు. దీంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం నిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. యజమానురాలు కుక్కను కట్టకుండా నిర్లక్ష్యం వదిలివేయడంతోనే తమ సోదరుడు తీవ్ర గాయాలపాలయ్యాడని, ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ బాధితుడి సోదరుడు ఖాజా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శోభనపై ఐపీసీ సెక్షన్ 336, 289 కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
షాకింగ్.. 2 గంటల్లో 40 మందిని కరిచిన వీధి కుక్క.. కిక్కిరిసిన ఆసుపత్రి వార్డ్
జైపూర్: కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న ఘటనలు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. పెంపుడు శునకాలు, వీధి కుక్కలనే తేడా లేకుండా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. తాజాగా రాజస్థాన్‌లో ఓ వీధి కుక్క బీభత్సం సృష్టించింది. కేవలం 2 గంటల్లోనే ఏకంగా 40 మందిని కరిచింది. ఈ ఘటన బార్మర్ జిల్లాలోని కళ్యాణ్పూర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వీధి కుక్క దాడితో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. కుక్క దాడిలో గాయాలపాలైన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితులతో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు నిండిపోయింది. దీంతో స్థానికంగా పరిస్థితి ఏ స్థాయికి చేరిందనేది వెల్లడవుతోంది. అకస్మాత్తుగా వీధికుక్క దాడి చేయడంతో చాలా మంది గాయపడ్డారని, వారందరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నామని సదరు హాస్పిటల్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బిఎల్ మన్సూరియా తెలిపారు. ఈ ఘటనపై వెంటనే నగర పాలక సంస్థకు సమాచారం అందించడంతో అధికారులు రంగంలోకి దిగారు. కుక్కను పట్టుకునేందుకు రెండు బృందాలను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆసుపత్రి సిబ్బంది సహాయంతో వీధికుక్కను పట్టుకున్నారు. తాజా ఘటనతో నగరంలోని కుక్కల బెడద ఎక్కువగా ఉన్న వివిధ ప్రాంతాల్లో వాటిని పట్టుకునేందుకు నగర పాలక సంస్థ చర్యలు చేపట్టింది. చదవండి: దారుణం.. ఇంటి యజమానిని చితకబాది.. నోట్లో పినాయిల్ పోసి.. -
వీడియో: అంత బలుపెందుకు.. నువ్వు సెలబ్రెటీవా!
మూగ జీవాలను హింసించిన కేసుల్లో ఇప్పటికే పలువురు సెలబ్రెటీలపై సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. సోషల్ మీడియాలో గుర్తింపు కోసం లేదా హిట్స్ కోసం కొందరు మూగజీవాలను శారీరకంగా భాధివంచారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి కారణమైన ఓ ఈ-సెలబ్రెటీపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. ఇన్‌స్టాగ్రామ్‌లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న మోజ్-ఆధారిత ఇన్ఫ్లుయెన్సర్ కాజల్ అనుచితంగా ప్రవర్తించింది. అయితే, సోషల్ మీడియాలో రీల్ పోస్ట్ చేయడం కోసం ఆమె.. ఓవర్‌గా బిహేవ్ చేసింది. కాగా, వీడియోలో కుక్కపై లేని ప్రేమను నటించి.. దాన్ని మచ్చిక చేసుకున్నట్టు ప్రవర్తించి.. చివరకు కుక్కను కాలితో తన్నింది. అనంతరం.. కాజల్ నువ్వుతూ అక్కడి నుంచి వెళ్లిపోయింది. How can you be so insensitive toward these voiceless souls If you cant love them dont hurt them #AnimalAbuse#DogsOnTwitter pic.twitter.com/8HaC2zD7Ea — Vidit Sharma 🇮🇳 (@TheViditsharma) November 30, 2022 కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, వీడియోను యూపీ, నోయిడా పోలీసులకు రీట్వీట్ చేసి ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు.. ఇన్ఫ్లుయెన్సర్ కాజల్‌కు మోజ్ యాప్‌లో దాదాపు 2.2 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఇక, ఇన్‌స్టాగ్రామ్‌లో సంఖ్య 121K మంది ఫాలోవర్స్ కాజల్‌ను ఫాలో అవుతున్నారు. @Uppolice @noidapolice please take stringent action against this sadistic, violent "social media influencer" and "content creator" kajal something — for Aslan! پربھا آپا (@prabha_j) November 30, 2022 -
రూ. 10 వేలు కట్టండి.. ఖర్చులు భరించండి
నోయిడా: బహుళ అంతస్తుల భవంతి లిఫ్ట్‌లో ఆరేళ్ల విద్యార్థిపై పెంపుడు శునకం దాడి ఘటనలో కుక్క యజమానిపై ఎఫ్ఐఆర్ నమోదైంది. చిన్నారి చేతికి గాయం కావడంతో చికిత్సకయ్యే ఖర్చంతా భరించాలని, మరో రూ.10,000 పరిహారంగా చెల్లించాలని ఆయనను గ్రేటర్ నోయిడా అథారిటీ ఆదేశించింది. గ్రేటర్ నోయిడా(పశ్చిమం)లోని విలాసవంత లా రెసిడెన్షియా సొసైటీలో మంగళవారం ఈ ఘటన జరిగింది. సొసైటీలో ఉండే ఒకావిడ తన కొడుకుతో కలిసి లిఫ్ట్‌లో వెళ్తుండగా అప్పుడే ఒకతను తన కుక్కతో సహా లిఫ్ట్‌లోకి వచ్చాడు. వచ్చీరాగానే బాలుడిని కుక్క కరిచేసింది. దీంతో సీసీటీవీ ఫుటేజీ సాక్ష్యంతో ఐపీసీ సెక్షన్ 289 కింద కేసు నమోదుచేసినట్లు పోలీసులు చెప్పారు. ‘కుక్కను అదుపుచేయడంలో మీరు విఫలమయ్యారు’ అని అతడికి పంపిన నోటీసులో గ్రేటర్ నోయిడా అథారిటీ ఆరోగ్యవిభాగాధిపతి డాక్టర్ ప్రేమ్‌చంద్ పేర్కొన్నారు. రూ.10వేలు, చికిత్స ఖర్చు ఏడు రోజుల్లో చెల్లించకపోతే చట్టప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. -
మహిళపై పెంపుడు కుక్క దాడి.. యజమానికి షాకిచ్చిన కోర్టు
ఇటీవల కాలంలో కుక్కలు మనుషులపై దాడి చేసిన ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న వారిపై విచక్షణ రహితంగా దాడి చేసి గాయపరుస్తున్నాయి. అయితే ఈ జాబితాలోకి పెంపుడు కుక్కలు కూడా చేరాయి. ఈ మధ్య పెంపుడు శనుకాలు కూడా ఉన్నట్టుండి యజమానులు, బయట వారిపై దాడి చేస్తున్నాయి. అయితే కుక్కలు గాయపరిచిన ఘటనలో బాధితులకు పరిహారం అందడం చాలా అరుదు. కానీ తాజాగా ఓ పెంపుడు కుక్క కరిచిన ఘటనలో గాయపడిన మహిళకు ఉపశమనం లభించింది. పెంపుడు కుక్క దాడిలో గాయపడ్డ బాదితురాలికి 2 లక్షల పరిహారం చెల్లించాలని జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార వేదిక.. గురుగ్రామ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను(ఎంసీజీ) మంగళవారం ఆదేశించింది. కావాలంటే చెల్లించిన పరిహారం మొత్తాన్నికుక్క యజమాని నుంచి తిరిగి పొందవచ్చని పేర్కొంది. కాగా ఇళ్లల్లో పనులు చేసుకుంటూ జీవించే మున్ని అనే మహిళ, తన కోడలుతోపాటు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా వినిత్ చికారా పెంచుకుంటున్న కుక్క ఆగష్టు 11 న దాడి చేసింది. ఈ ప్రమాదంలో మహిళ తల, ముఖానికి తీవ్ర గాయాలవ్వడంతో ఆమెను గురుగ్రామ్‌లోని ఆసుపత్రికి తరువాత ఢిల్లీలోని సఫ్దర్‌గంజ్ హాస్పిటల్‌కు తరలించారు. కుక్క దాడిపై సివిల్ లైన్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మహిళను కరిచిన శునకం ‘డోగో అర్జెంటీనో’ జాతికి చెందినదిగా యజమాని తెలిపారు. చదవండి: అరే! ఏం మనుషుల్రా ఇంత రాక్షసత్వమా! శునకానికి ఉరి వేసి... కుక్కను స్వాధీనం చేసుకోవాలని, దాని లైసెన్స్ అనుమతిని వెంటనే రద్దు చేయాలని ఫోరమ్ మున్సిపల్ కార్పొరేషన్‌ను ఆదేశించింది. అదే విధంగాపెంపుడు కుక్కల పాలసీని మూడు నెలల్లో రూపొందించాలని ఆదేశించింది. వీధి జంతువులను అదుపులోకి తీసుకున్న తర్వాత వాటిని పౌండ్లలో ఉంచాలని, అలాగే హనికరమైన 11 అన్యదేశ జాతులను నిషేధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ జాతి కుక్కులను ఎవరైనా పెంచుకుంటే వెంటనే కస్టడీలోకి తీసుకోవాలని తెలిపింది. డోగో అర్జెంటీనో వంటి క్రూర జాతికి చెందిన శునకం పెంపుడు విషయంలో యజమాని చట్టాన్ని, నిబంధనలు ఉల్లించాడని స్పష్టంగా అర్థం అవుతోందని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా అమెరికన్ పిట్-బుల్ టెర్రియర్స్, డోగో అర్జెంటీనో, రోట్వీలర్ వంటి క్రూర జాతి కుక్కులపై భారత ప్రభుత్వం నిషేధం విధించింది. -
World Zoonoses Day: కని‘పెట్’కుని ఉండాలి..! లేదంటే కష్టమే!
ఆధునిక సమాజంలో ప్రతి ఇంటిలోనూ పెంపుడు జంతువులు కనిపిస్తున్నాయి. అయితే పెంపుడు జంతువులతో ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా లేకుంటే మన ప్రాణాలకూ ముప్పు తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పెంపుడు జంతువుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించకుండా అవగాహన కల్పించేందుకు ఏటా జూలై 6న ‘ప్రపంచ జునోసిస్ డే’ను నిర్వహిస్తుంటారు. పొంచి ఉన్న వ్యాధులు మూగజీవాల పెంపకంలో అవగాహనతో పాటు అప్రమత్తత ఎంతో అవసరం. మనం ఎంతో అభిమానంగా పెంచుకునే కుక్కల నుంచి ర్యాబిస్, గజ్జి, పశువుల నుంచి, గొర్రెలు, మేకలు వంటి గడ్డి తినే జంతువుల నుంచి ఆంత్రాక్స్ వంటి ప్రాణాంతక వ్యాధులు మనుషులకు సోకుతాయి. ఈ సంక్రమిత వ్యాధులనే జూనోసిస్ డిసీజెస్ అంటారు. ముఖ్యంగా వీధి కుక్కుల నుంచి ర్యాబిస్ వేగంగా వ్యాపించి ప్రాణాంతకంగా మారుతుంది. పశువుల నుంచి మనుషులకు తరచుగా వచ్చే మరో వ్యాధి ఆంత్రాక్స్. దీన్ని దొమ్మ రోగం అని కూడా పిలుస్తారు. మనుషుల్లో చర్మంతో పాటు పేగులు, ఊపిరితిత్తులకు సోకే ఈ వ్యాధి అత్యంత ప్రమాదం. పశువులు, గొర్రెలు, మేకలు, గాడిదలు, గుర్రాల్లో ఆంత్రాక్స్ చాలా వేగంగా విస్తరిస్తుంది. ఈ వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారులను సంప్రదించి చికిత్స చేయించుకోవాలి. ర్యాబిస్ నివారణ చర్యలు ►ర్యాబిస్ సోకకుండా వీధి కుక్కలకు వ్యాక్సినేషన్ చేయాలి. ►అలాగే కుక్కల్లో పునరుత్పత్తి జరగకుండా ఇంజెక్షన్లు చేయాలి. ►ఇంటిలో పెంచుకునే పెంపుడు కుక్కలకు వ్యాక్సిన్ చేసినట్లు సర్టిఫికెట్ తీసుకోవాలి. ►కుక్కలతో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలి. ►ర్యాబిస్ వ్యాధి సోకిన కుక్క, పశువులు మరణిస్తే వాటి కళేబరాలను పూడ్చకుండా దహనం చేయాలి. అప్రమత్తత అవసరం జూనోసిస్ వ్యాధులు ప్రమాదకరమైనవి. మన పరిసరాల్లో ఉండే జంతువుల నుంచే వస్తాయి. జంతువులను కుట్టిన దోమలు మనుషులను కుట్టడం వల్ల, కుక్కలు నేరుగా మనుషులను కరవడం వల్ల ఈ వ్యాధులు సంక్రమిస్తాయి. ర్యాబిస్ వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలి. మా వద్దకు వచ్చే ప్రతి ఒక్కరికీ జూనోసిస్ వ్యాదుల పట్ల అవగాహన కల్పిస్తున్నాం. పెంపుడు జంతువుల యజమానులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలి. పశువైద్య కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సిన్లు వేస్తున్నాము. – డాక్టర్ సనపల లవకుమార్, మల్టీ స్పెషలిస్ట్, పశువైద్యాధికారి, ఇచ్ఛాపురం మండలం -ఇచ్ఛాపురం రూరల్, శ్రీకాకుళం చదవండి: Pregnancy Tips: ఆరో నెల.. నడుము నొప్పి, కాళ్ల నొప్పులు.. ఎలాంటి పెయిన్ కిల్లర్స్ వాడాలి? -
భౌభౌ.. బీ కేర్ ఫుల్...ఈ కాలంలోనే వాటి కాట్లు ఎక్కువ
సాక్షి హైదరాబాద్/కాచిగూడ: ఇందుగలవందు లేవనే సందేహంబు వలదు.. ఏ సందు వెదికినా అందందే భౌభౌ మనగలదు అన్నట్టుగా ఉంది నగరంలో వీధి కుక్కల పరిస్థితి. రోజూ వందల సంఖ్యలో నారాయణగూడ ఐపీఎంలో బారులు తీరుతున్న బాధితుల సంఖ్య ఓ నిదర్శనం. ఇక ఎండాకాలం వచ్చిందంటే కుక్కకాట్ల సంఖ్య మరింత పెరుగుతోంది. నారాయణగూడ వైఎంసీ చౌరస్తాలోని ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్‌కు కొన్ని రోజులుగా కుక్కకాటు బాధితుల రాక పెరిగింది. ‘ప్రతిరోజూ 250 నుంచి 300 వరకూ బాధితులు వస్తారు. ఎండాకాలం ఆ సంఖ్య 400 నుంచి 600 వరకూ పెరుగుతోంది’ అని ఇక్కడి సిబ్బంది చెబుతున్నారు. వేసవిలో కారణాలివీ.. సైకాలజీ టుడే ప్రకారం వేడి, ఉక్కపోత వాతావరణంలో మనుషుల్లో ఎలాగైతే కోపం, చికాకు పెరుగుతుందో అదే శునకాలకు కూడా వర్తిస్తుంది. ఈ సీజన్లో ఆహారం, నీరు అందకపోతే డీహైడ్రేట్ కావడంతో కూడా అవి కరుస్తాయి. దీనికి మరో కోణం కూడా ఉంది. వేసవిలో ఆరుబయట నీడనిచ్చే చెట్లు, పార్కులు వంటి ప్రాంతాల్లో ఎక్కువగా జనం సేదతీరాలనుకుంటారు. అందువల్ల కూడా ఈ సీజన్లో కుక్క కాట్లు పెరుగుతున్నాయి. పెట్స్ బైట్స్.. వీధి శునకాలు మాత్రమే కాదు అమెరికాకు చెందిన ఓ పరిశోధన సంస్థ చెప్పిన విషయం ఏమిటంటే ఎండాకాలంలో మొత్తం కుక్క కాట్లలో పెంపుడు శునకాల వాటా 27శాతం ఉంటుందట. శరీరంలో కరిచే ప్రాంతాలపై సంబంధిత నిపుణులు చెబుతున్న ప్రకారం.. కుక్కకాట్లలో 34 శాతం తల, మెడ, చెంపలు, పెదాలపై 21 శాతం, ముక్కు, చెవులపై 8శాతం ఉంటున్నట్టు గుర్తించారు. అదే విధంగా కాలి పిక్కలు, చీల మండలం దగ్గర కరవడం ద్వారా కూడా పెద్ద సంఖ్యలో బాధితులు ఉన్నారు. కుక్కకాటుతో గాయం సగటు పరిమాణం 7.15 సెంటీమీటర్లు ఉంటుందట. కోపాన్ని గుర్తించవచ్చు... పెంపుడుదైనా, వీధి కుక్కయినా కోపంగా/చిరాకుగా ఉందని, అది మనుషుల మీద దాడి చేసే అవకాశాలున్నాయనే విషయం ముందస్తుగా గుర్తించవచ్చునంటున్నారు నిపుణులు. కోపంగా ఉన్న శునకం.. చెవులు వెనక్కు సాగదీస్తుందట. నోటిని గట్టిగా మూస్తుందని, తన రెండు కాళ్ల మధ్య తోకను ఉంచి గట్టిగా ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగిస్తుంటుందని వెల్లడిస్తున్నారు. ఇక మొరగడం సరేసరి. భౌభౌ.. కేర్ ఫుల్... వీధికుక్కలకు ఈ సీజన్లో సరిగా ఆహారం దొరకదు. దానికి తోడు వేడి వాతావరణం కూడా వాటిలో అసహనాన్ని పెంచుతుంది. కాలే కడుపుతో వీధుల్లో ఇవి వీరంగాలు వేసే ప్రమాదం ఉంది కాబట్టి పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. వాటికి ఆహారం అందేలా చూడడంతో పాటు ముఖ్యంగా స్కూల్ లేదు కదా అని చిన్నారులను వీధుల్లోకి పంపవద్దు. పార్కులు, ఆటస్థలాల్లో కొంత రెక్కీ చేశాకే అనుమతించాలి. ఇక పెంపుడు కుక్కల్లో కొన్ని ప్రత్యేకమైన బ్రీడ్స్ అతిగా కరిచేవిగా గుర్తించారు. జర్మన్ షెపర్డ్, పిట్ బుల్ టెర్రిర్ వంటి కొన్ని ప్రత్యేకమైన జాతుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. కుక్కలు డీహైడ్రేట్ అవకుండా ఎప్పటికప్పుడు వాటికి నీరు అందేలా చూసుకోవాలి. -
చిన్నారిపై కుక్కలు మూకుమ్మడి దాడి.. నిజంగానే దేవుడిలా వచ్చాడు!
On CCTV 4 Year Old Girl Bitten: ఇటీవల కాలంలో కుక్కల దాడి చేసి పిల్లలను హతమార్చిన ఘటనలను ఎన్నో చూశాం. అంతెందుకు ఇటీవలే ఒక బాలుడిపై సుమారు 12 కుక్కలు దాడి చేస్తుండగా ఆ బాలుడిని కాపాడే ప్రయత్నంలో అడ్డుగా వెళ్లిన తల్లి పై కూడా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటనలు గురించి విన్నాం. అచ్చం అలానే నాలుగేళ్ల బాలికపై కుక్కలు అత్యంత భయంకరంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. (చదవండి: ఫుడ్ కంటైనర్‌లో స్పై కెమెరా!) అసలు విషయంలోకెళ్లితే...మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని ఒక కూలి కూతురు అయిన నాలుగేళ్ల బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా ఐదు కుక్కలు ఆమెపై దాడి చేశాయి. పైగా ఆబాలిక తప్పించుకనే నిమిత్తం పరిగెట్టడానికి ప్రయత్నించినప్పటికి అవి చుట్టుముట్టి దాడి చేశాయి. ఈ క్రమంలో ఆ కుక్కలు తల, బొడ్డు, కాళ్లపై అత్యంత దారుణంగా కొరికాయి. అయితే ఇంతలో ఒక వ్యక్తి వచ్చి ఆ కుక్కలను తరిమి కొట్టడంతో ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. సదరు వ్యక్తి రాకపోయి ఉంటే ఆ చిన్నారి పరిస్థితి దారుణంగా ఉండేది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఈ ఘటన భోపాల్‌లో బాగ్ సెవానియాలోని సీసీటీవీలో రికార్డు అవ్వడంతో వెలుగు చూసింది. ప్రస్తుతం ఈ భయనకమైన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఆ వ్యక్తి నిజంగా దేవుడిలా రావడంతోనే ఆ చిన్నారి ప్రాణాలతో బయటపడిందనే విషయాన్ని ఒప్పుకోవాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (చదవండి: ఫుల్‌గా తాగి సెక్యూరిటీ గార్డ్‌తో గొడవపడిన మహిళ) Horrific! Stray dogs mauled a 4 year old girl in Bhopal a passerby threw stones at the dogs and chased them away. The child has been hospitalized with severe injuries. pic.twitter.com/X4EyruZxra — Anurag Dwary (@Anurag_Dwary) January 2, 2022 -
వదల బొమ్మాలి.. వదల.. పెంపుడు కుక్కపై పిట్‌బుల్ దాడి
వాషింగ్టన్: సాధారణంగా కొందరు కుక్కలను ఇష్టంగా పెంచుకుంటారు. వాటిని ఇంట్లో మనుషుల మాదిరిగా చూసుకుంటారు. వాటికి తిండిపెట్టడం, స్నానం చేయించడం లాంటి పనులు చేస్తుంటారు. వాటిని ఎక్కడికి వెళ్లిన తమతో పాటు తీసుకెళ్తుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్కొసారి అనుకోని సంఘటనలు చోటుచేసుకుంటాయి. కొన్ని సార్లు యజమానులు తమ పెంపుడు కుక్కలను బయటకు తీసుకెళ్తున్నప్పుడు వేరే కుక్కలు వాటిపై అరుస్తూ వెంట పడటం, దాడి చేయడం మనకు తెలిసిందే. తాజాగా ఇలాంటి ఒక ఘటన యూఎస్‌లోని లాస్వేగాస్లో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియోలో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. 19 ఏళ్ల లారెన్ రే అనే యువతి తన పెంపుడు కుక్క మ్యాక్స్‌ను తీసుకొని ఇంటినుంచి బయటకు వచ్చింది. అప్పుడు ఆమెకు ఒక షాకింగ్ ఘటన ఎదురైంది. ఒక పిట్ బుల్ కుక్క ఆమె.. పెంపుడు కుక్కవైపు పరిగెత్తుకు వచ్చింది. అంతటితో ఆగకుండా మ్యాక్స్‌పై దాడిచేయడానికి ప్రయత్నించింది. పాపం.. లారెన్.. ఎంత తప్పించాలని చూసిన ఆ శునకం మాత్రం దాన్ని కరవడానికి విశ్వప్రయత్నాలు చేస్తుంది. ఈ క్రమంలో అప్పుడు ఒక అమెజాన్ డ్రైవర్ యువతి అరుపులు విని వారి ఇంటి వద్దకు చేరుకున్నాడు. ఆ తర్వాత.. చాకచక్యంగా యువతిని తప్పించి ఇంటి లోపలికి పంపించి వేశాడు. వెంటనే ఆమె ఇంటికి వెళ్లిపోయి ఇంటి తలుపులు మూసేసింది. ఆ వీధి శునకం కూడా కాసేపటికి అక్కడి నుంచి బయటకు వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు.. ‘వామ్మో.. ఎంత భయకరంగా దాడిచేస్తుంది..’,‘నీ తెలివికి హ్యట్సాఫ్..’, ‘పాపం.. చిన్న కుక్క దొరికితే దానిపని అంతే..’, ‘వదల బొమ్మాలి.. వదల అంటూ దాడి చేస్తోందంటూ’ కామెంట్లు పెడుతున్నారు. An #Amazon delivery driver has saved a woman and her dog from a vicious pit bull attack in #LasVegas. The heroic courier, who saved the woman and her #dog from the attack, has conquered hearts across social media.#dogs #dogattack #pitbull #anews pic.twitter.com/3f1yKZ5jLd — ANews (@anews) December 21, 2021 -
Viral: సింహాన్ని పరుగులు పెట్టించిన భౌభౌ!!
సింహాన్ని చూస్తే ఎవరికైనా హడల్ పుట్టాల్సిందే! కానీ దీని దెబ్బకి సింహమే బెదిరి సైడిచ్చుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోవైపు మీరు కూడా ఓ లుక్కెయ్యండి. ఈ వీడియోలో ఓ కుక్క అరుస్తూ సింహం వెంట పడటం కనిపిస్తుంది. అంతేకాకుండా సింహంపై దాడి చేస్తుంది కూడా. ఐతే కారణం ఏమిటో తెలియదు కానీ.. సింహం మాత్రం సదరు కుక్క నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దీనిని చూసిన నెటిజన్లు మాత్రం ఆశ్యర్యంతో తలమునకలైపోతున్నారు. ఇది నిజమేనా.. అసలేం జరుగుతుందని సరదాగా కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ ఫన్నీ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత నంద ట్విటర్లో పోస్ట్ చేశాడు. ఈ అధికారి అడవి జంతువులకు సంబంధించిన వీడియోలను తరచూ పోస్ట్ చేస్తుంటాడు. అతని ఫాలోవర్లు ఈ వీడియోలను అమితంగా ఇష్టపడటమేకాకుండా ఇతర సోషల్ మీడియాల్లో షేర్ కూడా చేస్తారట. చదవండి: ఐదేళ్లుగా వెతుకులాట.. దొరికిన గోల్డ్ ఐలాండ్.. లక్షల కోట్ల సంపద! What’s happening?? pic.twitter.com/QMESBRVZ6f — Susanta Nanda IFS (@susantananda3) October 28, 2021 -
వెంటాడిన కుక్కల గుంపు.. యువతి చేసిన పనికి నెటిజన్లు షాక్!
సోషల్ మీడియోలో నిత్యం ఎన్నోరకాల వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. కొన్ని వీడియోలు ఎంతో ఆహ్లదాన్ని కలిగిస్తాయి. మరి కొన్ని మనల్ని చాలా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి ఒక వీడియో సోషల్ మీడియోలో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. సాధారణంగా ఎవరైనా కుక్కలు అంటే భయపడతారు. మనం రాత్రి సమయంలో నడుచుకుంటూ ఇంటికి వెళ్తున్న సమయంలో కుక్కల గుంపు వెంటాడితే ఏం చేస్తాం.. మనం భయపడి పరుగులు పెడతాం లేక తిరిగి ప్రతిఘటిస్తాం. కానీ ఇలాంటి సమయంలో ఓ యువతి తీసుకున్న నిర్ణయం అందర్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. రాత్రి సమయంలో ఓ యువతి నడుచుకుంటూ వెళ్తోంది.. ఇంతలో శునక రాజాలు ఆమెకు కనిపించాయి. ఒక్క సారిగా ఆ యువతిని చుట్టుముట్టాయి. ఆ సమయంలో ఏం చేయాలో తోచక ఆ అమ్మాయి డ్యాన్స్ చేసింది. అవును మీరు విన్నది నిజం.. ఆ అమ్మాయి కుక్కలను చూసి బెదిరిపోకుండా తనలోని నృత్య కళా కౌశలాన్ని బయటకు తీసింది. ఆమె చేసిన డ్యాన్స్ కుక్కలుకు బాగా నచ్చినట్టుంది.. అలా చూస్తూ కూర్చున్నాయి. అదే దారిలో వెళ్తున్న మరో వ్యక్తి ఈ వీడియో తీసి సోషల్ మీడియోలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియో లో హల్చల్ చేస్తోంది. ఈ వీడియో చూసిన కొందరు నెటిజన్లు భలే సమయస్ఫూర్తి అంటుండగా.. మరికొందరు పిచ్చి పీక్స్ వెళ్లిందేమో అలా చేస్తోందని తిట్టిపోస్తున్నారు. Basanti इन कुत्तों के सामने ...☺️😊😊😊😊 Basanti kutton ke saamne naachin....☺️☺️😊😊 pic.twitter.com/rtn4r8PpMw — Rupin Sharma IPS (@rupin1992) July 17, 2021 -
షాకింగ్: రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష.. ఎందుకంటే
కరాచీ: మనుషులకు మరణశిక్ష విధిస్తారన్నది తెలిసిన విషయమే. కానీ ఓ దేశంలో విచిత్రంగా రెండు కుక్కలకు మరణ విధించారు. వినడానికి కాస్తా ఆశ్చర్యంగానే ఉన్న నిజంగానే పాకిస్థాన్‌లో రెండు పెంపుడు కుక్కలకు మరణశిక్ష విధించారు. కరాచీలోని ఓ న్యాయవాదిపై దాడి చేశాయన్న కారణంగా రెండు జర్మన్ షెపర్డ్ కుక్కలకు మరణశిక్ష విధించడం గమనార్హం. మీర్జా అక్తర్ అనే సీనియర్ లాయర్ గత నెలలో మార్నింగ్ వాక్ కోసం వెళ్లారు. అక్కడ ఓ రెండు కుక్కలు అతనిపై దాడి చేశాయి. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ దాడి దృశ్యాలన్నీ అక్కడున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అంతటి కౄరమైన కుక్కలను ఇళ్ల మధ్య ఉంచినందుకు యజమానిపై నెటిజన్లు తీవ్రంగా మండిపడ్డారు. ఇక అక్తర్ లాయర్ కావడంతో అతను కోర్టుకు వెళ్లాడు. అయితే చివరికి కుక్కల యాజమాని హుమయూన్ ఖాన్ రాజీకి వచ్చాడు. కానీ రాజీకి అంగీకరిస్తూనే లాయర్ అక్తర్ యాజమానికి పలు షరతులు పెట్టాడు. ఇంతటి దారుణం జరిగినందుకు తనకు వెంటనే క్షమాపణలు చెప్పాలని, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదకర కుక్కలను ఇంట్లో పెంచుకోవద్దని, అలాగే తనపై దాడి చేసిన ఆ కుక్కలను వెంటనే ఓ వెటర్నరీ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లి విషపూరిత ఇంజెక్షన్లతో చంపేయాలని సదరు యజమానికి లాయర్ అక్తర్ షరతులు విధించారు. ఈ ఒప్పందంపై ఇద్దరూ సంతకాలు చేసి కోర్టులో సమర్పించారు. అయితే ఈ ఒప్పందంపై హక్కుల కార్యకర్తలు తీవ్రంగా మండిపడుతున్నారు. Violent #Dogattack in #DHA Phase 7, Street number 14. #Karachi.#Pakistan pic.twitter.com/TxFhq6TiQL — Asad Zaman 🇵🇰 (@asadweb) June 27, 2021 -
కుక్కల గుంపు.. 100 మీటర్ల దూరం లాక్కెళ్లి..
కోవెలకుంట్ల: మండలంలోని అమడాల గ్రామంలో ఐదేళ్ల బాలుడిపై శుక్రవారం కుక్కల గుంపు దాడి చేసింది. స్థానికులు తెలిపిన మేరకు వివరాలు.. గ్రామానికి చెందిన తిమ్మయ్య, నాగజ్యోతి దంపతులకు ప్రదీప్, పౌర్ణమి, ప్రత్యూష సంతానం. ముగ్గురు పిల్లలు ఇంటి పక్కనే ఉన్న కల్లంలో ఆడుకుంటుండగా దాదాపు ఇరవై కుక్కలు ఒక్కసారిగా చిన్నారులపై దాడి చేశాయి. ఈ దాడిలో ఇద్దరు పిల్లలు తప్పించుకోగా ప్రదీప్‌ను వెంబడించాయి. కింద పడటంతో బాలుడిని 100 మీటర్ల మేర లాక్కెళ్లి వీపు భాగంలో విచక్షణా రహితంగా కరిచాయి. మిగతా పిల్లలు విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో తండ్రి తిమ్మయ్య హుటాహుటిన అక్కడకు చేరుకుని కుక్కల బారి నుంచి కుమారుడిని రక్షించాడు. చికిత్స నిమిత్తం వెంటనే కోవెలకుంట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు డాక్టర్లు పేర్కొన్నారు. విషయం తెలుసుకున్న బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి స్పందించి ఎంపీడీఓ మహబూబ్‌దౌలా, ఈఓపీఆర్డీ ప్రకాష్‌నాయుడు తదితర అధికారులను ఆసుపత్రికి పంపించి బాలుడి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. గ్రామంలో కుక్కల బెడద నుంచి ప్రజలను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. చదవండి: హడలెత్తించిన నాగుపాము.. నాగరాజుకు ఫోన్.. ప్రేమ వ్యవహారం: రాయబారానికి పిలిచి హతమార్చారు! -
దారుణం: కూలీ ప్రాణం తీసిన పెంపుడు కుక్క
సాక్షి, బెంగళూరు: నిర్మాణ స్థలంలో మెట్ల కింద నిద్రిస్తున్న కూలీని యజమాని పెంపుడు కుక్క దాడి చేసింది. ఆ కుక్క చేతిలో తీవ్రంగా గాయపడి అతడు మృతి చెందాడు. ఈ దాడిని ఆపడానికి ప్రయత్నించిన యజమానిని కూడా ఆ కుక్క గాయపరిచింది. దీంతో ఆ యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటన కర్నాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. బెంగళూరులోని అత్తూర్ లేఅవుట్ ప్రాంతంలో భవన నిర్మాణ కార్మికుడు నరసింహ (36) పని చేసేందుకు వచ్చాడు. నిర్మాణం జరుగుతున్న స్థలంలో మెట్ల కింద నరసింహ నిద్రిస్తున్నాడు. ఈ సమయంలో యజమాని తన విదేశీ (పిట్ బుల్) జాతికి చెందిన పెంపుడు కుక్కతో అక్కడకు చేరింది. అకస్మాత్తుగా ఆ కార్మికుడిపై కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. అతడి మెడను పట్టుకుని కొరికేసింది. అయితే కుక్క అదుపు చేయడానికి వెళ్లగా యజమానికి కూడా స్వల్ప గాయాలయ్యాయి. నరసింహ అరుపులు విని తోటి కార్మికులు అక్కడికి చేరుకుని వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. అప్పటికే నరసింహ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఒక వ్యక్తి మరణానికి కారణమైన కుక్క యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. చదవండి: అర్ధరాత్రి రౌడీ షీటర్ హల్చల్.. పోలీసుల ఎన్కౌంటర్ చదవండి: దారుణం.. వేశ్యను వాడుకుని డ్రైనేజీలో పారవేత -
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
-
కుక్కని కుక్కా అన్నందుకు తలలు పగలగొట్టారు..
న్యూఢిల్లీ: కుక్కని కుక్కా అని పిలిచినందుకు చిన్న గొడవ.. చిలికి చిలికి గాలివానలా మారింది. పెద్ద గొడవకు దారితీసింది. హర్యానాలోని గురుగ్రామ్ చెందిన జ్యోతిపార్క్ ప్రాంతంలో ఓ కుటుంబం టామీ అనే కుక్కని పెంచుకుంటున్నారు. ఆయితే ఆ కుక్క స్థానికుల్ని కరవడం, భయపెట్టడం చేస్తుండేది. ఈ నేపథ్యంలో స్థానికంగా ఉండే సుధీర్ అనే వ్యక్తి కుక్కని చైన్‌కి కట్టేయొచ్చు కదా, మా పిల్లల్ని కరుస్తోంది అని, కుక్క యజమానిని రిక్వెస్ట్ చేశాడు. అంతే మా టామీని కుక్క అని పిలుస్తావా? నీకెంత ధైర్యం అంటూ దాని యజమాని, యజమాని కుటుంబ సభ్యులు సుధీర్ కుటుంబంపై దాడికి దిగారు. రాడ్లు,కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో సుధీర్ కుటుంబానికి చెందిన ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఇదే సమయంలో ఘర్షణ జరుగుతుండగా స్థానికులు తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ ఘర్షణ అనంతరం సుధీర్ సదరు కుక్క యజమాని మా కుటుంబసభ్యలపై దాడి చేశాడు. ఆ కుక్క మా పిల్లల్ని కరుస్తోందని యజమానికి చెప్పా. టామీని కుక్కా అని పిలుస్తావా అని కొట్టాడంటూ పోలీసులు ఫిర్యాదు చేశాడు. కాగా, గురుగ్రామ్‌లో కుక్కల వల్ల ఘర్షణ పడ్డ సంఘటనలు గతంలో చాలానే జరిగాయని పోలీసులు చెబుతున్నారు. అందరూ కరోనా వల్ల ఇబ్బంది పడుతుంటే వీళ్లు మాత్రం కుక్క గురించి తలలు పగిలేలా కొట్టుకోవడం ఏమిటోనని గురుగ్రామ్ పోలీసులు నిట్టూరుస్తున్నారు. నెటిజన్లు సైతం ఈ ఘర్షణపై తమదైన స్టైల్లో కామెంట్లు చేస్తున్నారు. అరె ఏంట్రా ఇది..కుక్కని కుక్కా అని పిలవకూడదా? అంత మాత్రనికే తలలు పగలగొట్టాలా అంటూ కామెంట్లు చేస్తున్నారు. -
దారుణం: చిన్నారిపై 12 కుక్కలు ఒక్కసారిగా..
లక్నో: 7 ఏళ్ల బాలిక రోడ్డుపై వెళుతుండగా కుక్కల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ఈ దారుణం ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్‌లో జరిగింది. రోడ్డు మీద ఓ బాలిక తన దారిన తాను దుకాణం నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తుంటే.. ఆ దారిలోని కుక్కలు ఆమె మీదకు ఉరికాయి. దీంతో ఆ బాలిక భయపడి వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగెత్తింది. ఈ క్రమంలో ఆ పరిసరాల్లోని 12 కుక్కలు ఒక్కసారిగా మూకుమ్మడిగా బాలిక మీదకు ఉరికాయి. దీంతో చేసేదేమిలేక బాలిక గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపుల విని సమీంలోని ప్రజలు ఆమెను రక్షించడానికి పరుగెత్తారు. అక్కడ ఉన్న కుక్కలను తరిమేసి బాలికను రక్షించారు. అయితే ఈ ఘటనలో బాలిక తీవ్రంగా గాయపడడంతో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ విషాద ఘటన అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యింది. ( చదవండి: వైరల్ వీడియో: అయ్యయ్యో.. తెలిసిపోయిందా ) -
కుక్కల దాడిలో 40 గొర్రె, మేక పిల్లలు మృతి
నరసన్నపేట: కుక్కల దాడిలో 40 జీవాలు ప్రాణాలు కోల్పోయాయి. ఈ సంఘటన సత్యవరంలో శనివారం సాయంత్రం చోటుచేసుకోగా పాశిన నాగేష్కు చెందిన 30 గొర్రె, 10 మేక పిల్లలు మృతి చెందాయి. నాగేష్ తన ఇంటి ఆవరణలో పెద్ద గూడులో వీటిని ఉంచి ఇతర పనులపై కుటుంబ సభ్యులంతా బయటకు వెళ్లారు. ఆ సమయంలోనే కుక్కల మంద దాడి చేయడంతో జీవాలు చనిపోయాయి. లక్ష రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. చదవండి: కరోనా బారిన పడి డీఎస్పీ మృతి గుంటూరులో దారుణం: వృద్ధురాలిపై లైంగిక దాడి -
కుక్కల నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, హైదరాబాద్: తమ గ్రామంలో 26 మందిని కుక్కలు కరిచాయని, వాటి నుంచి రక్షణ కల్పించడంతో పాటు రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని నల్లగొండ జిల్లా ముడుగులపల్లి మండలం కన్నెకల్ గ్రామానికి చెందిన ఉపేందర్‌రెడ్డి ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలుచేశారు. దీన్ని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారించింది. కుక్కకాటుకు వినియోగించే రేబిస్ వ్యాక్సిన్‌ను అన్ని జిల్లాలకు ఎలా సరఫరా చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అలాగే కన్నెకల్ గ్రామంలో కుక్క కాటు బారిన పడిన వారిని తరలించేందుకు అంబులెన్స్, రేబిస్ వ్యాక్సిన్‌ను గ్రామస్తులకు అందుబాటులో ఉంచాలని జిల్లా వైద్యాధికారిని ఆదేశించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కన్నెకల్ గ్రామస్తులు తరచుగా కుక్కకాటుకు గురవుతున్నారని, రేబిస్ వ్యాక్సిన్ ఆ గ్రామంలో అందుబాటులో లేకపోవడంతో 10 కిలోమీటర్ల దూరంలోని మండల కేంద్రానికి వెళ్లాల్సి వస్తోందని పిటిషనర్ తరఫున వేణుధర్‌రెడ్డి నివేదించారు. కన్నెకల్‌లో పశువుల ఆస్పత్రితోపాటు హోమియో ఆస్పత్రి అందుబాటులో ఉన్నాయని, డాక్టర్, నర్సింగ్ సిబ్బందిని నియమించి రేబిస్ వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచేలా ఆదేశించాలని కోరారు. డాక్టర్‌ను నియమించాలా వద్దా అన్నది విధానపరమైన నిర్ణయమని, ఈ మేరకు ప్రభుత్వానికి ఉత్తర్వులు ఇవ్వలేమని ధర్మాసనం పేర్కొంది. -
ఉసురు తీసిన ఊర కుక్కలు
-
దారుణం: ఉసురు తీసిన ఊర కుక్కలు
సాక్షి, ములుగు: జిల్లాలోని ములుగు మండలం దేవగిరిపట్నం గ్రామ శివారులో ఘోరం జరిగింది. ఊర కుక్కలు బీభత్సం సృష్టిoచాయి. ఓ చిన్నారిపై దాడి చేసి ప్రాణాలు తీశాయి. కర్ణాటకలోకి గుల్బార్గాకు చెందిన వలస కార్మిక కుటుంబ రామప్ప-పాకాల పైపులైన్ పనులు చేస్తోంది. శుక్రవారం ఉదయం తల్లిదండ్రులు కంపెనీలో పనికి వెళ్లడంతో వారికోసం ఆడుకుంటూ గుట్ట పైకి వెళ్లిన ఐదేళ్ల బాలుడి చిరంజీవిపై కుక్కలు దాడికి దిగాయి. తీవ్ర గాయాలతో బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. కార్మిక కుటుంబం 2 నెలలుగా పైపులైన్ పనులో చేస్టున్నట్టు తెలిసింది. ఇక్కడే తాత్కాలిక గుడారాలు ఏర్పాటు చేసుకొని నివసిస్తున్నారు. చిన్నారి మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. -
'తిక్క కుదిరింది.. ఇలా కావాల్సిందే'
టిక్‌టాక్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రాత్రికి రాత్రే స్టార్ అవ్వాలనే తాపత్రయంతో రోడ్లు, పార్కులు ఎక్కడ పడితే అక్కడ వీడియోలు చేసేస్తున్నారు. ఈ సందర్భంలో కొన్నిసార్లు వారు చేసే వీడియోలు నవ్వులపాలయ్యేలా ఉంటాయి. తాజాగా అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి నవ్వులు పూయిస్తుంది. అయితే ఈ సంఘటన ఎక్కడ జరిగింది అనేది మాత్రం తెలియలేదు. అయితే టిక్‌టాక్ పిచ్చిలో మునిగిపోయి పక్కనే ఏం ఉన్నాయన్న సంగతి కూడా మరిచిపోయేవారు మాత్రం తప్పకుండా చూడాల్సిన వీడియో ఇది. (పేపర్ రైలు.. ఆశ్చర్యపోయిన రైల్వే మంత్రిత్వ శాఖ) ఇంతకు వీడియోలో ఏముందంటే.. ఒక యువతి తమ అపార్ట్మెంట్ దగ్గరగా ఉన్న రోడ్డు మీద డ్యాన్స్ చేస్తుంది. సడెన్‌గా ఒక కుక్క వచ్చి ఆమె వెనకాల నిలబబడింది. అయితే అప్పటికే సీరియస్‌గా టిక్‌టాక్‌లో లీనమైపోయి ఉన్న ఆమె పక్కన ఏం ఉందో కూడా పట్టించుకోలేదు. ఇదే మంచి సమయం అని భావించిన కుక్క ఒకసారిగా యువతిని కరవడానికి ప్యాంట్‌ను పట్టుకుంది. దీంతో ఆమె భయపడి కుక్కను వదిలించుకొని అక్కడి నుంచి పారిపోయింది. యువతి డ్యాన్స్ వీడియో పాపులర్ అయ్యేదో లేదో తెలియదు కాని వీడియోలోని కుక్క మాత్రం హీరో అయిపోయింది.' అందుకే ఇలాంటివి చేసేటప్పుడు పక్కన ఏం ఉన్నాయో చూడాలి'.. 'రోడ్లు మీద చేస్తే ఇలాగే ఉంటుంది.. బాగా తిక్క కుదిరింది' అంటూ నెటిజన్లు నవ్వుకుంటూనే కామెంట్లు పెడుతున్నారు. (సింహాల వల్ల కాలేదు: చిరుతలు సాధించాయి!) -
చిన్నారి ప్రాణం తీసిన వీధికుక్కలు
-
చిన్నారిమీదకు దూకిన బుల్డాగ్
-
పరిగెత్తుకొచ్చింది.. పాపపైకి దూకింది!..
కొలరాడో : ఎక్కడినుంచి వచ్చిందో! చర్చి ఆవరణలోకి పరిగెత్తుకొచ్చిందో కుక్క. పాత కక్షలు ఏమున్నాయో తెలీదు కానీ, ఆవేశంతో ఓ చిన్నారిమీదకు దూకి తీవ్రంగా గాయపర్చింది. ఈ విషాదకర సంఘటన అమెరికాలోని కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలో ఆలస్యంగా వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం అమెరికా కొలరాడో స్ప్రింగ్స్ పట్టణంలోని ఓ చర్చి పార్కింగ్ ఏరియాలోకి ప్రమాదకర జాతికి చెందిన ఓ బుల్డాగ్ పరిగెత్తుకుంటూ వచ్చింది. చాలా దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తున్న ఆ కుక్క తల్లిదండ్రులతో కలిసి నడుస్తున్న చిన్నారిపైకి దూకి కరవటం మొదలుపెట్టింది. ఈ హఠాత్పరిణామంతో పాప తల్లిదండ్రులు మొదట భయపడ్డా.. ఆ వెంటనే కుక్క బారినుంచి చిన్నారిని కాపాడేప్రయత్నం చేశారు. వారితో పాటు అక్కడే ఉన్న కొందరు వ్యక్తులు కూడా సహాయం చేశారు. వారి తీవ్ర శ్రమకు ఫలితంగా కొద్దిసేపటి తర్వాత కుక్క పాపను విడిచి పారిపోయింది. అయితే పాప మాత్రం తీవ్ర గాయాలపాలైంది. అక్కడి పార్కింగ్ ఏరియాలోని సీపీ టీవీలో రికార్డైన సంఘటనకు సంబంధించిన దృశ్యాలను హ్యూమన్ సొసైటీ తమ ఫేస్బుక్ ఖాతాలో ఉంచింది. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ( చదవండి : ఎవరైనా నన్ను చంపేయండి!.. ) -
ప్రసవ వేదన.. ప్రాణ తపన
రాయదుర్గం: ప్రసవవేదన వేళ ఓ జింకపై శునకాలు దాడి చేయడంతో గర్భస్థ జింక సహా తల్లి జింక మృత్యువాత పడ్డాయి. ఈ ఘటన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లో ఆదివారం చోటుచేసుకుంది. గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంగణంలోని చిట్టడవిలో వందలాది మూగజీవాలు జీవనం సాగిస్తున్నాయి. వాటికి అనువైన వాతావరణం కల్పించడంలోనూ హెచ్‌సీయూ పాలకవర్గం, విద్యార్థులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు సభ్యులు కృషి చేస్తూనే ఉన్నారు. కానీ అప్పుడడప్పుడు కుక్కలు, వేటగాళ్ల బారిన పడి మూగజీవాలు మృత్యువాత పడుతూనే ఉన్నాయి. తాజాగా హెచ్‌సీయూ క్యాంపస్ పరిసరాల్లో చోటుచేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది క్యాంపస్‌లోని నల్లగండ్ల చెరువు ఫెన్సింగ్‌ను పరిశీలించేందుకు వచ్చారు. ఈ సమయంలో అక్కడ మృత్యువాత పడిన జింక కనిపించింది. వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. దీంతో సెక్యూరిటీ అధికారులు అక్కడికి చేరుకొని జింకను పరిశీలించారు. ఇదే సమయంలో సమాచారం అందుకున్న వైల్డ్‌లెన్స్ ప్రతినిధులు కూడా చేరుకున్నారు. జింకను పరిశీలించగా.. అది ప్రసవ వేదన పడుతుండే సమయంలో కడుపులోపలి జింక తలభాగం బయటకు వచ్చిన సమయంలో కుక్కలు వెంబడించి దాడికి దిగాయని నిర్ధారించారు. అటవీ ప్రాంతం నుంచి బయటకు వచ్చే సమయంలోనే ప్రసవమయ్యే అవకాశం ఏర్పడటంతో అది అటూఇటూ అనువైన ప్రదేశాన్ని పరిశీలిస్తున్న తరుణంలోనే కుక్కలు వెంబడించగా నల్లగండ్ల చెరువు వైపు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. ఇదే తరుణంలో అవి దాడి చేయడంతో తాను ప్రాణాలు వదలడంతోపాటు పుట్టబోయే జింకపిల్ల కూడా తల బయటకు వచ్చేస్తున్న తరుణంలో మృత్యువాత పడినట్లు గుర్తించారు. సమాచారం అందించినా.. జింక మృత్యువాత పడిన ఘటన వివరాలను చిలుకూరులోని అటవీ శాఖ అధికారులకు మధ్యాహ్నం 2 గంటలకు సమాచారం అందించారు. ఘటనా స్థలంలోనే జింకను ఉంచి అక్కడే హెచ్‌సీయూ సెక్యూరిటీ సిబ్బంది, అధికారులు, వైల్డ్‌లెన్స్ గ్రూపు ప్రతినిధులు సాయంత్రం 6.30 గంటల వరకు వేచి ఉన్నారు. కానీ అటవీశాఖాధికారులు అప్పటికీ చేరుకోలేదు. వారి నిర్లక్ష్యం పట్ల హెచ్‌సీయూ విద్యార్థులు ఆగ్రహం వ్యక్తంచేశారు. హెచ్‌సీయూలో కుక్కల బెడద నుంచి మూగజీవాలను కాపాడాల్సిన అవసరం ఉందని వారు కోరారు. గతంలోనూ పలు సంఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. క్యాంపస్‌లోని పలు ప్రాంతాల్లో కుక్కలు సంచరిస్తున్నాయని, వాటిని క్యాంపస్ బయటకు వదలిపెట్టాలని సూచించారు. -
రెచ్చిపోయిన పెంపుడు కుక్క.. 15 నిమిషాల పాటు..
-
రెచ్చిపోయిన కుక్క.. 15 నిమిషాల పాటు..
జలందర్ : పంజాబ్‌లో జలందర్ ఘోరం జరిగింది. ఓ 15 ఏళ్ల బాలుడిపై ఓ పెంపుడు కుక్క దాడి చేసింది. మాములుగా పిచ్చి కుక్కలు దాడి చేసినప్పుడు ఇతరులు బెదిరిస్తే.. లేదా రాళ్లతో కొడితే పారిపోతాయి. కానీ ఈ కుక్క మాత్రం బాలుడి కాలిని పళ్లతో గట్టిగా పట్టి ఎంతకీ వదలలేదు. బాటసారులు వచ్చి దాడి చేసినా.. ఆ కుక్క ఆదరలేదు.. బెదరలేదు. జలందర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జలందర్‌కు చెందిన ఓ బాలుడు గత మంగళవారం సాయంత్రం సైకిల్‌పై ట్యూషన్‌కి వెళ్లాడు. సాయంత్రం తిరిగి వచ్చే క్రమంలో ఇంటికి సమీపంలో ఓ పెంపుడు కుక్క దాడికి దిగింది. అతని కుడికాలిని పళ్లతో పట్టి కొరకసాగింది. ఇది గమనించిన బాటసారులు.. కుక్కను రాళ్లతో, కర్రలతో కొట్టారు. అయినప్పటికీ కుక్క బాలుడిని వదలలేదు. బాలుడి తల్లి కాళ్లతో తన్నినా, నీళ్లు చల్లినా కుక్క మాత్రం అక్కడి నుంచి పారిపోలేదు. దాదాపు 15 నిమిషాల తర్వాత కుక్క అతన్ని వదిలి పారిపోయింది. కుక్క దాడిలో తీవ్రగాయాలపాలైన బాలుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. -
వెంటాడిన మృత్యువు
నిజామాబాద్ నాగారం: కుక్కలు రెండు ప్రాణాలను బలిగొన్నాయి. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తున్న ఏడీఈని కుక్కలు వెంటాడగా, తప్పించుకునేందుకు పరుగెత్తిన ఆయన గుండెపోటుతో మృతి చెందారు. నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం శెట్పల్లికి చెందిన గంగారాం (55) కామారెడ్డిలో ఏడీఈగా విధులు నిర్వర్తిస్తున్నారు. నిజామాబాద్ మహాలక్ష్మీనగర్‌లో నివాసముంటున్న ఆయన.. రోజూ కామారెడ్డికి వెళ్లి వస్తున్నారు. మంగళవారం రాత్రి విధులు ముగించుకుని నిజామాబాద్‌కు వచ్చిన గంగారాం.. నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా కుక్కలు ఆయన వైపు దూసుకొచ్చాయి. దీంతో భయపడి పరుగులు పెట్టారు. వేగంగా పరుగెత్తిన గంగారాం.. ఇంటి గేటు ముందరకు రాగానే కుప్పకూలి పోయారు. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మరో ఘటనలో.. కుక్క దాడి చేయగా, పట్టుతప్పి కిందపడి తలకు తీవ్ర గాయాలు కావడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. నిజామాబాద్ కోటగల్లి సమీపంలోని మైసమ్మ వీధికి చెందిన వేముల ఆంజనేయులు (49) బస్వాగార్డెన్ ఫంక్షన్ హాలు మేనేజర్‌గా పని చేస్తున్నాడు. మంగళవారం ఫంక్షన్ హాలులోకి కుక్క రావడంతో తరిమేందుకు యత్నించారు. కుక్క ఆంజనేయులుపై దాడి చేసి, వేలిని కొరికేసింది. ఈ క్రమంలో పట్టు తప్పి కింది పడిపోయిన ఆంజనేయులు తలకు బలమైన గాయాలయ్యాయి. అతడ్ని ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే కోమాలోకి వెళ్లాడు. బుధవారం అతడు బ్రెయిన్‌డెడ్ అయి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. -
అరుపులుండవ్.. మెరుపు దాడులే
అవి సాదాసీదా శునకాలుగానే ఉంటాయి. అంతకుమించి విశ్వాసమూ ప్రదర్శిస్తాయి. అరుపులు వాటికి చేతకావు. అనుమానమొస్తే అమాంతం దాడి చేసి.. ప్రతాపం చూపిస్తాయ్. గ్రామ సింహాల మాదిరిగా కనిపిస్తూ.. చిరుత రాజసాన్ని ప్రదర్శించే పందికోన శునకాలకు చాలా ప్రత్యేకతలున్నాయి. చిరుత పులితో క్రాస్ బ్రీడింగ్ వల్ల కలిగిన సంతానంగా చెప్పే ఈ శునకాలు పోలీస్ శాఖలో నూ సేవలందిస్తున్నాయి. పత్తికొండ: కర్నూలు జిల్లా పందికోన శునకాల ఖ్యాతి ఖండాంతరాలను దాటింది. మూగజీవాలకు రక్షణగా.. పంటలకు కాపలాగా ఉంటూ క్రూర మృగాలను సైతం తరిమేస్తాయి. పౌరుషానికి మారుపేరుగా నిలిచే ఈ శునకాలు పోలీస్ శాఖలో చేరి పలు కేసులను కూడా ఛేదించాయి. పౌరుషం, గాంభీర్యం, వేటాడే తత్వం వీటి సొంతం. పాలెగాళ్ల కాలంలో.. పత్తికొండకు 9 కిలోమీటర్ల దూరంలో ఉన్న పందికోన గ్రామాన్ని బ్రిటిష్ కాలంలో పాలెగాళ్లు పాలించేవారు. అప్పట్లో భారీ కొండల మధ్య ఉండే దట్టమైన అరణ్యం నుంచి చిరుతలు గ్రామంలోకి వస్తుండేవి. ఆ క్రమంలో గ్రామంలోని సత్రంలో ఓ చిరుత పులి ప్రసవించగా.. దానికి పుట్టిన మగ చిరుత ఆడ కుక్కలతో కలిసి సంచరించేదట. తదనంతర కాలంలో ఆ చిరుత, గ్రామ సింహాల సంపర్కం వల్ల ఆడ శునకాలకు చిరుత లాంటి కుక్క పిల్లలు పుట్టాయని.. ఆ సంతానం వృద్ధి చెంది పందికోన శునకాలుగా పేరొచ్చిందని గ్రామానికి చెందిన రంగప్పరాజు, గువ్వల రంగస్వామి చెప్పారు. దొంగల్ని ఇట్టే పట్టేస్తాయి పశువులు, మేకలు, గొర్రెల మందలకు రక్షణగా గ్రామస్తులు పందికోన శునకాలను వినియోగిస్తున్నారు. మృగాల వాసన పసిగట్టి వాటి బారినుంచి ఈ శునకాలే పశువుల్ని రక్షిస్తాయని, అవసరమైతే మృగాలను వేటాడతాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొత్త వ్యక్తులను గుర్తించి నిలువరించడం.. దొంగలను ముట్టడించి దాడి చేయడం వీటి ప్రత్యేకత. ఈ శునకాలు హైదరాబాద్, అమరావతి, ఢిల్లీ తదితర ప్రాంతాలతోపాటు అమెరికా, ఇతర దేశాలకూ ఎగుమతి అయ్యాయి. వీటి విశిష్టతను గుర్తించిన అమెరికాకు చెందిన ఓ బృందం 37 సంవత్సరాల క్రితం ఈ గ్రామాన్ని సందర్శించి వీటికి షెల్టర్, వసతి సౌకర్యాల కోసం నిధులు ఇస్తామని చెప్పగా.. గ్రామస్తులు నిరాకరించారు. కొన్నేళ్లుగా కేంద్ర రక్షణ శాఖ, పోలీసు అధికారులు వీటిని తీసుకెళ్లి పౌర, రక్షణ సేవలకు వినియోగిస్తున్నారు. వైద్యాధికారులు, కొందరు గృహ యజమానులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తరచూ గ్రామానికి వచ్చి వీటిని తీసుకెళుతుంటారని గ్రామస్తులు తెలిపారు. పేర్లు పెట్టి.. వాతలు వేస్తారు పందికోన గ్రామంలో సుమారు 700 కుటుంబాలు ఉండగా.. 1,500కు పైగా శునకాలను పెంచుతున్నారు. ప్రతి ఇంట్లో ఒక శునకం కనిపిస్తుంది. కొందరైతే రెండు, మూడింటిని పెంచుతుంటారు. వాటికి పేర్లు పెట్టి పిలుస్తుంటారు. ఆడ కుక్కలకు ఇందిరమ్మ, ఇందిరమ్మబీ, మగ కుక్కలకు రాముడు, భీముడు, రాజు వంటి పేర్లుంటాయి. చిన్న వయసులోనే వీటి దేహంపై రెండు వైపులా వాతలు పెడతారు. రాత్రి వేళ కంటిమీద కునుకు లేకుండా పంట ఉత్పత్తులు, గొర్రెలకు ఇవి కాపలాగా ఉంటాయని గ్రామానికి చెందిన సిద్ధప్ప, బుల్లేని ఆదినారాయణ చెప్పారు. ఈ శునకాలు యజమానులు భుజించే ఆహారాన్నే తింటాయి. పప్పుతో కలిపిన అన్నం ఆరగిస్తాయి. జొన్న రొట్టెలు, చికెన్, మటన్ ఎంతో ప్రీతిగా తింటాయి. పంటల్ని నాశనం చేయడానికొచ్చే అడవి పందుల్ని వేటాడి భుజిస్తాయి. వీటి ప్రత్యేకత తెలుసు గానీ.. పందికోన కుక్కల గురించి కొన్నేళ్లుగా వింటున్నాను. వీటి ప్రత్యేకతలు తెలుసు. చిరుత పులి, కుక్కల సంపర్కం వల్ల చిరుత లాంటి ఈ శునకాలు జన్మించాయనే ప్రచారం ఉంది. ఇందులో నిజమెంత అనేది చెప్పలేం. వీటికి పౌరుషం ఎక్కువ. మొరగకుండా దొంగల్ని పట్టేస్తాయ్. – లక్ష్మీప్రసాద్, డిప్యూటీ డైరెక్టర్, పశు సంవర్ధక శాఖ గొర్రెలకు ఇవే కాపలా నాకు 180 గొర్రెలున్నాయి. ఎప్పుడు అడవి పందులు దాడి చేస్తాయో తెలీదు. అలాంటప్పుడు ఈ కుక్కలే నాకు సహాయంగా ఉంటాయి. నేను భోజనానికి వెళ్తే ఇవే కాపలా ఉంటాయి. కొత్త వ్యక్తులు, దొంగలు, అడవి పందులను దరిదాపుల్లోకి రానివ్వవు. – కోదండ రాముడు, గొర్రెల యజమాని డిస్కవరీ ప్రతినిధులు వస్తుంటారు ఏటా ఢిల్లీ నుంచి డిస్కవరీ చానల్ ప్రతినిధులు మా గ్రామానికొచ్చి శునకాలను పరిశీలించి వెళుతుంటారు. వీటి పనితీరును పరిశీలించడానికి ఓసారి అమెరికన్లు మా పొలానికి వచ్చి రాత్రంతా పొలంలోనే ఉన్నారు. అదే సమయంలో అడవి పంది రావడంతో మా కుక్క దానిని వెంటాడి.. వేటాడి చంపేయడం చూసి ఆశ్చర్యపోయారు. – బోయ ఆదినారాయణ, రైతు -
బాగ్దాదీని తరిమిన కుక్క
బాగ్దాదీని తుదముట్టించడంలో బలగాలకు సాయంగా ఉన్న శునకం ‘కే–9’ఫొటోను అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్లో షేర్ చేశారు. రహస్య సొరంగం చివరికి వెళ్లిన బాగ్దాదీ తనను తాను పేల్చేసుకోవడంతో ‘కే–9’ స్వల్పంగా గాయపడింది. ‘బాగ్దాదీ కోసం చేపట్టిన ఆపరేషన్‌లో కే–9 పేరున్న ఈ కుక్క అద్భుత పనితీరు చూపింది’అంటూ బెల్జియన్ మలినోయిస్ జాతికి చెందిన ఆ కుక్కపై ట్విట్టర్లో ప్రశంసలు కురిపించారు. ఆ శునకం పేరు, ఇతర వివరాలు వెల్లడించలేదు. -
శునకం తెచ్చిన శోకం
సాక్షి, బంగారుపాళెం(చిత్తూరు) : ఓ శునకం రోడ్డు ప్రమాదానికి కారణమైంది. కవలల్లో ఒకరు మృతిచెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. హృదయ విదారకమైన ఈ సంఘటన మండలంలోని వినాయకపురం వద్ద ఆదివారం తెల్లవారుజామున జరిగింది. పోలీసుల కథనం మేరకు తవణంపల్లె మండలం అరగొండ పంచాయతీ ఆర్ఆర్ నగర్‌కు చెందిన సురేష్‌చౌదరికి ఇద్దరు కుమారులు (కవలలు) దిలీప్‌చౌదరి, దీపక్‌చౌదరి. ఇద్దరూ బెంగళూరులో ఓ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆదివారం సెలవు కావడంతో శనివారం రాత్రి 11–30 సమయంలో బెంగళూరు నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలుదేరారు. తెల్లవారుజామున 4–30 గంటలకు బంగారుపాళెం మండలంలోని వినా యకపురం వద్దకు రాగానే కుక్క అడ్డుపడటంతో ద్విచక్రవాహనం అదుపుతప్పింది. కుక్కను ఢీకొని ద్విచక్రవాహనం పడిపోవడంతో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది వారిని ప్రథమ చికిత్స నిమిత్తం బంగారుపాళెం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కవలల్లో చిన్నవాడు దీపక్‌చౌదరి(23) మృతిచెందాడు. దిలీప్‌చౌదరి(23)ని మెరుగైన వైద్యం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 23 సంవత్సరాల అన్నదమ్ముల అనుబంధాన్ని రోడ్డుప్రమాదం విడదీసిందంటూ దిలీప్‌చౌదరి తమ్ముని మరణాన్ని తలచుకుని కన్నీరుమున్నీరై విలపించాడు. మృతుని తల్లిదండ్రులు, కుటుం బసభ్యులు, బం«ధువుల రోదనలతో ఆస్పత్రి ఆవరణం శోకసంద్రమైంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. -
కుక్కల దాడి: ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం
సాక్షి, వరంగల్ రూరల్ జిల్లా : ఇంజినీరింగ్ కాలేజీలో దారుణం చోటుచేసుకుంది. బీటెక్ సెంకండియర్ చదువుతున్న ఓ విద్యార్థినిపై కాలేజీలోని కుక్కలు ఒక్కసారిగా దాడిచేశాయి. దీంతో ఆ అమ్మాయి పరిస్థితి విషమంగా ఉంది. నర్సంపేట మండలం లక్నేపల్లి శివారులోని బాలాజీ ఇంజినీరింగ్ కళాశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. రమ్య అనే విద్యార్థిని బాలాజీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెంకండియర్ చదువుతోంది. కాలేజీ హాస్టల్లో ఉంటున్న రమ్యపై శుక్రవారం కాలేజీలో ఉండే కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో తీవ్రంగా గాయపడిన రమ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ రోజు కాలేజీలో ఫ్రెషర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సమయంలో కాలేజీలో చదువుతున్న విద్యార్థినిపై కుక్కలు దాడి చేసి.. తీవ్రంగా గాయపర్చడం విద్యార్థులను షాక్‌కు గురిచేస్తోంది. రమ్య పరిస్థితి విషమంగా ఉండటంతో కాలేజీ ముందు విద్యార్థులు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తున్నారు. -
కుక్కల దెబ్బకు చిరుత పరార్
సాక్షి, బెంగళూరు : ఎక్కడైనా చిరుతపులిని చూసి కుక్కలు, మనుషులు పరుగులు తీస్తారు. అయితే కుక్కలే చిరుతను తరిమిన ఘటన బెంగళూరులో జరిగింది. మాగడి రోడ్డులోని తావరెకెరె వద్ద కవితా అనే మహిళకు చెందిన ద్వారక ఫామ్ ఉంది. అక్కడ రక్షణ కోసం ఆమె కుక్కలను పోషిస్తున్నారు. ఫామ్‌లోకి మంగళవారం రాత్రి కుక్కలను వేటాడటానికి చిరుతపులి ఎక్కడి నుంచో చొరబడింది. దీనిని గమనించిన కుక్కలు జోరుగా అరిచి చిరుతను తరిమేశాయి. ఈ దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అదే చిరుత మళ్లీ నెలరోజుల క్రితం ఇదే తోటలోకి వచ్చిన చిరుత ముధోల్ జాతికి చెందిన కుక్కను కరిచి వెళ్లింది. దీనితో జాగ్రత్త పడిన కవిత రక్షణ కోసం ఆరు కుక్కలను ఫాంహౌస్‌లో ఉంచారు. అదే చిరుత మంగళవారం అర్ధరాత్రి సమయంలో చొరబడి వరండా అంత తిరిగింది. కుక్కలు ఉంటున్న గది వద్దకు వెళ్లింది. చిరుతను చూసిన కుక్కలు జోరుగా అరుస్తూ చిరుత వెంట పడ్డాయి. చిరుత కుక్కల బారినుండి తప్పించుకొని పారిపోయిందని కవిత తెలిపారు. చుట్టుపక్కల ఉన్న అడవులు, సావనదుర్గ నుండి చిరుత వచ్చి ఉంటుందని అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. చిరుతలను తరిమేయాలని అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చినా సమస్య పరిష్కారం కాలేదని కవిత తెలిపారు. -
పసిమొగ్గ అసువులు తీసిన శునకం
రంపచోడవరం/విశాఖపట్నం: పిచ్చికుక్క దాడిలో తీవ్ర గాయాల పాలైన ఐదేళ్ల చిన్నారి 21 రోజుల అనంతరం ఆదివారం మరణించింది. తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం వట్టిగెడ్డకు చెందిన పల్లి కృపారక్ష, నాగమణి దంపతుల నాలుగేళ్ల కుమార్తె గ్రేస్ పుష్ప ఆగస్టు 21వ తేదీన పిచ్చి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడింది. ఆ బాలిక ఇంటి పక్కనే ఉన్న హోటల్ నుంచి ఇడ్లీ తీసుకొస్తుండగా పిచ్చికుక్క గాయపర్చింది. బాలికను కాకినాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించగా.. అదే నెల 29వ తేదీ వరకు అక్కడ చికిత్స పొందింది. వైద్య చికిత్స అనంతరం నెమ్మదిగా కోలుకోవడంతో బాలికను ఇంటికి పంపించారు. తదుపరి వైద్యం నిమిత్తం ఈ నెల 9న బాలికను ఆమె తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి కుట్టు విప్పేందుకు తిరిగి ఈనెల 18న రావాలని సూచించారు. అయితే, ఈ నెల 14న పాపకు తీవ్రజ్వరం రావటంతో రాజవొమ్మంగి పీహెచ్‌సీకి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇంటికి చేరాక.. మతిస్థిమితం లేని దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది. ఎవరిని చూసినా భయపడటం, పెద్దగా కేకలు వేయడం చేసింది. తావీజు కట్టిస్తే మంచిదని భావించిన తల్లిదండ్రులు ఆదివారం ఉదయం విశాఖ జిల్లాలోని ఓ గ్రామానికి తీసుకెళ్లారు. తిరిగి ఇంటికి బయలుదేరగా మార్గమధ్యలోనే మరణించింది. -
చిరుతతో పోరాడిన ‘టైగర్’
కోల్‌కతా : పెంపుడు జంతువులు, అందులోనూ కుక్కలు విశ్వాసానికి పెట్టింది పేరు. కోల్‌కతా, డార్జిలింగ్ సమీపంలో సోనాడలో జరిగిన ఒక సంఘటన ఈ విషయాన్నే మరోసారి రుజువు చేసింది. తన యజమానురాలిని చిరుతపులి దాడి నుంచి కాపాడి పలువురి ప్రశంసలందుకుంటోంది. చాలామంది లాగానే బాధితురాలు అరుణ లామా (57) కూడా ఒక కుక్కను పెంచుకుంటున్నారు. దాని పేరు ‘టైగర్’. ఈ టైగర్ సాహసోపేతంగా పోరాడి చిరుతపులి దాడి నుంచి ప్రాణాలకు తెగించి మరీ తన యజమాని అరుణను కాపాడింది. దీంతో తీవ్ర గాయాలతో (నుదిటి కుడివైపున 20కుట్లు, చెంపలపై ఐదు కుట్లు) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు అరుణ. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. బాధితురాలి కుమార్తె స్మార్టీ అందించిన సమాచారం ప్రకారం ఆగస్టు 14న ఈ సంఘటన జరిగింది. తమ ఇంటి భవనంలో కింది ఫ్లోర్లో నివాసం ఉండే.. తన తల్లి చీకట్లో రెండు కళ్లు మెరుస్తూ ఉండడాన్ని గమనించింది... అదేంటో తెలుసుకుని, ఈ షాక్ నుంచి తేరుకునే లోపే ఆమెపై చిరుతపులి దాడి చేసింది. దీన్ని అక్కడే వున్న నాలుగేళ్ల మాంగ్రెల్ జాతికి చెందిన టైగర్ చిరుతను ధీటుగా ఎదుర్కొంది. కొంత పోరాటం తరువాత విజయవంతంగా దాన్ని తరిమివేయగలిగింది. ఏంతో ధైర్యంగా తన తల్లిని టైగర్ కాపాండిందంటూ ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మరోవైపు అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో నిఘా పెట్టారు. చిరుతపులిని బంధించేందుకు ఉచ్చును ఏర్పాటు చేయనున్నారు. WB:A pet dog saved life of its owner,Aruna Lama who was attacked by a leopard on Aug 14 in Darjeeling.Aruna's daughter says,"as my mother was making her way to ground floor of our house she noticed a pair of glowing eyes,then the leopard attacked her but Tiger(pet dog) saved her" pic.twitter.com/JedUyCjGPd — ANI (@ANI) August 17, 2019 -
ఎలుగుబంటికి వార్నింగ్ ఇచ్చిన కుక్క
-
ఎలుగుబంటికి వార్నింగ్ ఇచ్చిన కుక్క
న్యూజెర్సీ: విశ్వాసానికి మారుపేరు శునకం. అది ఇంటిని కాపలా కాయడమే కాదు.. ఇంటి చుట్టుపక్కల ఎవరు కాస్త అనుమానంగా కనిపించినా పిక్క పట్టుకోడానికి కూడా వెనుకాడదు. ఇపుడు చెప్పుకునే కుక్క కూడా అలాంటిదే... దాని పేరు రియో. అది నివాసముండే ఇంటికి అనుకోని అతిథి వచ్చింది. ఆ అతిథి దర్జాగా ఇంటి పెరట్లోకి వెళ్లి పక్షులకు ఆహారం వేసే పంజరాన్ని పట్టి లాగింది. ఇంతకీ ఆ ఇంటికి వచ్చిన అతిథి ఏ పక్షో, పామో కాదు.. ఎలుగుబంటి. పంజరాన్ని కిందపడేసి అందులోని ఆహారాన్ని ఆవురావురుమంటూ తింటోంది. ఇంతలో అక్కడికి వచ్చిన రియో.. నా ఇంటికే వస్తావా అనుకుందో ఏమో..? దాని వెంటపడి మరీ పరిగెత్తించింది. ఎలుగుబంటి తిరుగుదాడి చేయడానికి ఏమాత్రం ఆస్కారం ఇవ్వకుండా దాన్ని బెదరగొట్టింది. దీంతో హడలిపోయిన ఎలుగుబంటి ఎలాగోలా కుక్క బారి నుంచి తప్పించుకుని బతుకుజీవుడా అనుకుంటూ వెళ్లిపోయింది. న్యూజెర్సీలో జరిగిన ఈ ఘటన సీసీ కెమెరాల్లో రికార్డ్ కాగా ఆ వీడియోను మార్క్ స్టింజియానా అనే వ్యక్తి ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. అది చూసిన జనాలు శునక ధీరత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. -
పాముతో వీరోచితంగా పోరాడి..
సాక్షి ప్రతినిధి, చెన్నై: శునక జాతిలోని విశ్వాసం గురించి ఎంత చెప్పినా తక్కువే. కన్నబిడ్డలతో సమానంగా చూసుకుంటున్న కుటుంబసభ్యుల కోసం ప్రాణాలను సైతం పణంగా పెట్టేందుకు పెంపుడు శునకాలు సిద్ధంగా ఉంటాయని చాటే సంఘటన తమిళనాడులో జరిగింది. తూత్తుకుడికి చెందిన బాబు విదేశాల్లో పనిచేస్తుండగా అతని భార్య పొన్‌సెల్వి ప్లస్‌టూ చదువుతున్న కవల కుమార్తెలతో కలిసి నగరంలోని నాసరత్ జూబ్లీ వీధిలో నివసిస్తున్నారు. డేజన్ జాతికి చెందిన రెండు శునకాలను ఆమె పెంచుతున్నారు. మగ శునకానికి అప్పు, ఆడ శునకానికి నిమ్మి అనే పేర్లు పెట్టి ఎంతో గారాబంగా చూసుకుంటున్నారు. ఈనెల 3న రాత్రి పొన్‌సెల్వి తన కుమార్తెలతో కలిసి ఇంట్లో నిద్రిస్తుండగా, కుక్కలు రెండూ బయట ఉన్నాయి. అర్ధరాత్రివేళ ఐదు అడుగుల పొడవైన తాచుపాము వారింటివైపు రావడంతో రెండు కుక్కలు పెద్దగా మొరగడం ప్రారంభించాయి. మగ కుక్క అప్పు ఒక్క ఉదుటున పాముపై లంఘించి కరవడం ప్రారంభించింది. అలాగే పాము సైతం అప్పును అనేకసార్లు కాటువేసింది. అయినా అప్పు ఆ పామును వదలకుండా నోటకరుచుకుని కొరుకుతూనే బయటి మెట్లగుండా మిద్దెపైకి తీసుకుని వెళ్లి చంపేసింది. పాముకాటు విషం వల్ల కుక్క సైతం ప్రాణాలు విడిచింది. గురువారం తెల్లారిన తరువాత ఇంటి బయటకు వచ్చిన పొన్సెల్వికి ఆడ శునకం మాత్రమే కనపడడంతో అప్పుకోసం అంతటా గాలించింది. మిద్దెపైకి వెళ్లి చూడగా పాము, కుక్క చనిపోయి పడి ఉన్నాయి. పాము కాటు నుంచి తమ ప్రాణాలు కాపాడేందుకు తన ప్రాణాలనే అర్పించిందని ఆమె కన్నీరుమున్నీరైంది. రెండింటినీ దూరంగా తీసుకెళ్లి గొయ్యితవ్వి పాతిపెట్టింది. -
పసికందు మృతదేహం కుక్కలపాలు
శంషాబాద్: ఓ పసికందు మృతదేహాన్ని వీధికుక్కలు పీక్కుతిన్న సంఘటన శంషాబాద్ వీకర్ సెక్షన్ కాలనీలో గురువారం కలకలం రేపింది. బతికున్న పసి కందునే గుర్తు తెలియని వ్యక్తులు పడేసి ఉం డొచ్చని భావించిన స్థానికులు ఆందోళనకు గురయ్యారు. వీధి కుక్కలను పసికందు మృతదేహం వద్ద నుంచి తరిమేసిన స్థానికులు అక్కడి నుంచి స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్దకు వెళ్లి వాకబు చేయగా అసలు విషయం బయటపడింది. ఈనెల 15న మధ్యాహ్నం రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి బస్తీ నుంచి గర్భిణి సునిధికుమార్ ఆమె భర్త రజనిసుమన్ శంషాబాద్ ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. నొప్పులు వస్తున్న ఆమెను పరిశీలించిన ఆస్పత్రి వైద్యులు.. గర్భంలో ఉన్న శిశువు మృతిచెందినట్లుగా గుర్తించారు. సాయంత్రం ఆరుగంటలకు ఆడ మృతశిశువును బయటికి తీసి వారికి అప్పగించారు. అయితే, భార్యాభర్తలు మాత్రం ఆ శిశువును ఆస్పత్రికి సంబంధించిన కొందరు సిబ్బందికి డబ్బులు ఇచ్చి ఖననం చేయాల్సిందిగా చెప్పి వెళ్లిపోయారు. దీంతో సిబ్బంది ఆస్పత్రి సమీపంలో మాములుగా గుంత తీసి అక్కడే పూడ్చిపెట్టారు. అయితే, సిబ్బంది సరిగా పూడ్చకపోవడంతో గురువారం ఉదయం కుక్కలు పసికందు మృతదేహాన్ని బయటకు లాగి నోటకరుక్కొని వీకర్ సెక్షన్ కాలనీకి పరుగులు పెట్టాయి. మృతదేహాన్ని తింటుండగా స్థానికులు వాటిని తరిమివేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని ఆస్పత్రి సిబ్బంది, వైద్యులను విచారించారు. మృతదేహానికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. పసికందు మృతదేహాన్ని వదిలేసి వెళ్లపోయిన వారు కూడా కేవలం పేర్లు మాత్రమే చెప్పారని, ఎలాంటి గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదని ఆస్పత్రి వర్గాలు చెప్పాయి. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
పిచ్చికుక్క స్వైర విహారం
పటాన్చెరు టౌన్: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో ఓ పిచ్చి కుక్క స్వైర విహారం చేసింది. సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు మొత్తం 48 మందిని కరిచి తీవ్రంగా గాయపర్చింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలోని మూడు కాలనీలవాసులు భయభ్రాంతులకు గురయ్యారు.కొన్ని గంటల పాటు ఇళ్లల్లోంచి బయటకు రాలేకపోయారు. పటాన్చెరు పట్టణంలోని పాత మార్కెట్ రోడ్డు, ముదిరాజ్ బస్తీ, ఎంజీ రోడ్డు, జేపీ కాలనీలో సోమవారం రాత్రి ఓ పిచ్చి కుక్క అకస్మాత్తుగా దారిన పోయేవారిపై దాడి చేసింది. కొందరు ఇంటి ముందుర కూర్చుని ఉండగా దాడి చేసి కరిచింది. ముదిరాజ్ బస్తీలోని ఈశ్వరమ్మ ఉదయం వాకిలి ఊడుస్తున్న సమయంలో ఎడమ కాలుపై కరిచింది. అదే బస్తీలో ఉషారాణి అనే విద్యార్థిని ఇంటి బయట ముగ్గువేస్తున్న సమయంలో కుడి చేతిపై కరిచింది. మొత్తం 48 మంది పిచ్చికుక్క బారినపడి ప్రభుత్వాస్పత్రిలో చేరి చికిత్స తీసుకున్నారు. స్థానికులు అందరూ కలిసి మంగళవారం ఉదయం పిచ్చికుక్కను కొట్టి చంపేశారు. -
పిచ్చికుక్కల స్వైరవిహారం
సాక్షి, రెంజల్(బోధన్): మండలంలోని బాగేపల్లి గ్రా మంలో పిచ్చికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మూగజీవాలు మృత్యువాతపడుతున్నాయి. పట్టించుకోవాల్సిన అధికారులు, పాలకుటు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పది, పన్నెండు రోజులుగా పిచ్చికుక్కలు పశువులపై దాడులు చేసి గాయపరుస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వాటి భయానికి ఇంట్లో నుంచి రాత్రిపూట బ యటకు వచ్చేందుకు జనాలు జంకుతున్నారు. రా త్రి సమయంలో పశువుల పాకల్లో కట్టెసిన పశువు లపై దాడులు చేస్తున్నాయని రైతులు పేర్కొంటున్నారు. బర్రెలను తలుగులకు కట్టేసి ఉంచడంతో అవి ఎదురు తిరగలేని పరిస్థితి ఉంటుందన్నారు. గురువారం రాత్రి టీఆర్ఎస్ నాయకుడు సాయిబాబగౌడ్‌కు చెందిన పశువుల పాకలోని రెండు గేదెలపై పిచ్చికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపర్చాయి. శుక్రవారం పశువుల పాకను శుభ్రం చేసేందుకు వెళ్లగా గేదెలు అపస్మారకస్థితిలో ఉన్న ట్లు గుర్తించారు. అప్పటికే ఓ గేదె మృత్యువాత ప డినట్లు గుర్తించారు. ఇప్పటికే అనేక పశువులను పిచ్చికుక్కలు దాడి చేశా యని గ్రామస్తులు వాపోతున్నారు. పంచాయతీ పాలకవర్గం సభ్యులకు, అధికారులకు చెప్పినా పట్టించుకోవడంలేదని బా ధిత రైతులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పం దించి గ్రామంలో రాత్రిపూట సంచరిస్తున్న పిచ్చి కుక్కలను సంహరించాలని కోరుతున్నారు. -
అడుగు బయటపెడితే బతుకు కుక్కలపాలే!
సాక్షి, అమరావతి : ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటే భయం.. ఓ వైపు రోడ్డు ప్రమాదాలు బెంబేలెత్తిస్తుంటే మరోవైపు చీకటి పడితే చాలు కుక్కలు ప్రాణాలు తోడేస్తున్నాయి. వెంటాడి.. వేటాడి మరీ కరుస్తున్నాయి. చిన్నా పెద్దా అనే తేడా లేదు.. అందరిదీ ఇదే సమస్య. హఠాత్తుగా మీదపడి ఎక్కడ కాటేస్తాయోనని ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిన పరిస్థితి. ముఖ్యంగా చిన్నారుల పాలిట యమపాశాలవుతున్నాయి. వీటి బారినపడి మృత్యువాత పడిన ఘటనలూ అనేకం. ఇలాంటి విషాద ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నా సమస్య పరిష్కారంపై అధికారుల్లో చిత్తశుద్ధి కొరవడింది. రాష్ట్రవ్యాప్తంగా కుక్కల భయం జనాన్ని వణికిస్తోంది. సగటున రోజుకు 387 మంది కుక్క కాటుతో వివిధ ఆస్పత్రులకు వస్తున్నారంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అంచనా వేయ్యొచ్చు. మారుమూల ప్రాంతాల్లో ఆసుపత్రుల వరకు రాని కేసులు వీటికి అదనం. వారం రోజుల కిందట కడప చిన్నచౌక్ ప్రాంతంలోని ఓ ప్రభుత్వ పాఠశాల నుంచి వస్తుండగా ఏడుగురు స్కూలు విద్యార్థులను కుక్కలు తీవ్రంగా గాయపరిచాయి. అలాగే, విజయవాడలో అయితే రోజూ పదుల సంఖ్యలో కుక్కకాటు కేసులు నమోదవుతున్నాయి. ఇలా రాష్ట్రంలోని అన్నిచోట్లా కుక్కకాటు బాధితులు నిత్యం నమోదు అవుతూనే ఉన్నారు. సకాలంలో ఆస్పత్రికి వెళ్లకపోతే దీని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో ఊహించడం కష్టం. పట్టణాల్లోనే ఎక్కువ.. కుక్కకాటు బాధితుల సంఖ్య పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఉంటోంది. విశాఖపట్నం, గుంటూరు, తిరుపతి, ఒంగోలు, నెల్లూరు, విజయవాడ, కర్నూలు వంటి నగరాల్లో ఈ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. వాస్తవానికి కుక్కలను చంపకూడదని చట్టం చెబుతోంది. దీనిబదులు వాటికి స్టెరిలైజేషన్ (కుటుంబ నియంత్రణ) విధిగా చేయాలి. కానీ, ఈ పనిచేయాల్సిన మున్సిపల్, పశుసంవర్ధక శాఖ అధికారులు దీనిపై దృష్టిపెడుతున్న దాఖలాలు చాలా తక్కువే. గత కొన్ని నెలలుగా మున్సిపల్ శాఖ ఈ ప్రక్రియ చేపట్టకపోవడంతో కుక్కల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో బాధితుల సంఖ్య కూడా అదే నిష్పత్తిలో పెరుగుతోంది. కాగా, కుక్క కాటుకు గురవుతున్న వారిలో ఎక్కువగా చిన్నారులే ఉండడం గమనార్హం. కుక్కల సంఖ్యపై కాకిలెక్కలు పట్టణాల్లో లక్షా 55వేల కుక్కలు మాత్రమే ఉన్నాయని మున్సిపల్ శాఖ చెబుతోంది. వీటిలో ఇప్పటివరకూ 1.30 లక్షల కుక్కలకు కుటుంబ నియంత్రణ చేశామని, ఇంకా పాతిక వేల కుక్కలు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆ శాఖ చెబుతోంది. కానీ, తాజా లెక్కల ప్రకారం కేవలం పట్టణాల్లోనే 3 లక్షల కుక్కలకు పైగానే ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో కుక్కల నియంత్రణ అంశాన్ని మున్సిపల్ శాఖ పూర్తిగా విస్మరించడంతో వాటి బాధ భరించలేక ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. 48 నెలల్లో ఎప్పుడైనా రేబిస్! ఇదిలా ఉంటే.. కుక్క కరిస్తే వచ్చే రేబిస్ వ్యాధి 14 రోజుల నుంచి 48 నెలల్లోపు ఎప్పుడైనా సోకవచ్చు. చిన్న గాటు కూడా పడలేదని సాధారణంగా చాలామంది తేలిగ్గా తీసుకుంటారు. కానీ, రేబిస్‌కు కారణమయ్యే వైరస్ అత్యంత ప్రమాదకారి. నెమ్మదిగా వ్యాపిస్తుంది. నిర్లక్ష్యం వహిస్తే మృత్యువాత పడే ప్రమాదం ఉంది. ఈ వైరస్ నరాల వ్యవస్థను ఛిన్నాభిన్నం చేస్తుంది. కాగా, భుజం, మెడ, వీపు.. ఇలా ఏదైనా తలకు సమీపంలో గాటు పడితే రేబిస్ అత్యంత వేగంగా వ్యాపిస్తుంది. ఈ వ్యాధి సోకి సురక్షితంగా బయటపడిన దాఖలాలు లేవు. కుక్క కరిస్తే ప్రాథమిక చికిత్స ఇలా.. కుక్క కరవగానే గాయాన్ని శుభ్రంగా కడగాలి కుళాయి నుంచి నేరుగా గాయం మీద నీళ్లు పడేలా చూడాలి. దీనివల్ల సొంగ కొట్టుకుపోతుంది సబ్బు నీటితో శుభ్రంగా కడగడం వలన వైరస్ లక్షణాలను వీలైనంత ఎక్కువగా నిర్మూలించవచ్చు డెటాల్ వంటి మందులను గాయంపై వేయడం మంచిది కుక్కకాటు గాయానికి కుట్లు వేయడంగానీ, ఆయింట్మెంట్ రాయడం కానీ చేయకూడదు కుక్కలలో నోటి నుంచి సొంగ కారడం, నాలుక బయటపెట్టడం, మతిలేకుండా తిరగడం, కనపడిన వస్తువులను, మనుషులను, పశువులను కరవడం వంటి లక్షణాలు కనిపిస్తే దాన్ని పిచ్చి కుక్కగా పరిగణించవచ్చు ఇలాంటి కుక్కలు కరచిన వెంటనే 30 నిముషాల్లోపు ఏఆర్వీ వ్యాక్సిన్ వేయించుకోవాలి రేబిస్ వ్యాధి ఒకరికి సోకితే కుటుంబ సభ్యులకు, ఇరుగు పొరుగు వారికి కూడా సోకే అవకాశం ఉంటుంది కుక్క కరచిన రోజు నుండి 0 డోసు నుండి ఏఆర్వీ వేయించుకోవాలి. కరచిన రోజు, 3వ రోజు, 7వ రోజు, 14వ రోజు, 28వ రోజు, 90వ రోజున యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించాలి గాయం బాగా పెద్దదిగా ఉంటే రేబిస్ ఇమ్యున్లోబిలిన్ యాంటీ సీరంలను వేయాలి రేబిస్ వ్యాక్సిన్ ప్రభుత్వాసుపత్రుల్లో లభిస్తుంది. అక్కడ లభించలేదంటే ఒక్కో డోసు రూ.600 నుంచి రూ.700 వరకూ అవుతుంది. -
వరుణ్ మృతికి హోంమంత్రే బాధ్యత వహించాలి
తూర్పుగోదావరి, అమలాపురం టౌన్: అమలాపురంలో పెంపుడు కుక్క తరమడం వల్ల భయంతో కాలువలో పడి మృతి చెందిన నెల్లి వరుణ్‌కుమార్ మృతికి రాష్ట్ర హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్పే బాధ్యత వహించాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేశాయి. అంతే కాకుండా అందుకు కారణమైన చినరాజప్ప సోదరుడు జగ్గయ్యనాయుడు భార్యపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ పలు ప్రజా సంఘాలు అమలాపురంలో ఆర్డీవో కార్యాలయాన్ని సోమవారం ఉదయం ముట్టడించాయి. వరుణ్ మృతిపై న్యాయ పోరాట వేదిక పేరుతో ఆ ఆందోళన జరిగింది. దళిత, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు పలు ప్రజా సంఘాల ప్రతినిధులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఆర్డీవో కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా కూడా నిర్వహించారు. ఈ ఘటనపై హోం మంత్రి రాజప్ప ఎంత మాత్రం స్పందించకుండా కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించకపోవడం దారుణమని దళిత బహుజన మహిళా శక్తి జాతీయ కన్వీనర్ కొంకి రాజామణి అన్నారు. వరుణ్ కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని సీపీఎం డివిజన్ కార్యదర్శి కారెం వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. వరుణ్ మృతికి కారణమైన పెంపుడు కుక్కను స్వాధీనం చేసుకోవాలని పీడీఎస్‌యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్.తిరుపతిరావు పేర్కొన్నారు. ఎమ్మెల్యేను నిలదీసిన ఆందోళనకారులు ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా జరుగుతున్న సమయంలో ఆ కార్యాలయానికి ఓ పని మీద వచ్చిన స్థానిక ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు ఆందోళనకారుల వద్దకు వచ్చి మాట్లాడారు. ఈ ఘటనపై తనకు ఎవరూ వినతి పత్రం ఇవ్వలేదని ఎమ్మెల్యే అనడంతో ఆందోళనకారులు అభ్యంతరం చెప్పారు. అదేమిటి సార్... మీ ఇంటికి సమీపంలోనే...మీ కాలనీలో ఈ ఘోరం జరిగినా మీరు స్పందించే తీరు ఇదా...? అంటూ నిలదీశారు. అనంతరం ఎమ్మెల్యే ఆందోళనకారుల డిమాండ్లను అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ధర్నా, ముట్టడి కార్యక్రమాల్లో జిల్లా సీపీఎం కార్యదర్శి కేఎస్ శ్రీనివాస్, వీసీకే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్, పౌరహక్కుల సంఘం జిల్లా కార్యదర్శి అమలదాసు బాబూరావు, ఐద్వా నాయకురాలు కుడుపూడి రాఘవమ్మ, రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మచ్చా నాగయ్య, పీడీఎం జిల్లా కన్వీనర్ దీపాటి శివప్రసాద్, సీఎస్సీ జిల్లా అధ్యక్షుడు జిల్లెళ్ల మనోహరం పాల్గొన్నారు. -
ఇది డాగ్స్ స్పెషల్!
ప్రతి కుక్కకూ ఓ రోజు వస్తుంది అంటే ఇదేనేమో. హైదరాబాద్‌లోని కుక్కలకు ఓ రోజేం ఖర్మ.. ఏకంగా ఓ పార్కే వచ్చింది. అలాంటి ఇలాంటి పార్కు కాదు.. నడిపించేందుకు వాకింగ్ ట్రాక్.. ఆటలాడించేందుకు స్థలం.. ఆటలకు ప్రత్యేక ఉపకరణాలు.. ఆటలు, విన్యాసాలకు శిక్షణ సదుపాయాలు.. స్నానం చేయించేందుకు స్లా్పష్ పూల్.. ఈత కొట్టించేందుకు స్విమ్మింగ్ పూల్... ఇలా ఎన్నో సదుపాయాలు. గచ్చిబౌలి సర్కిల్ పరిధిలోని కొండాపూర్‌లో జయభేరి ఎన్క్లేవ్ సమీపంలో రూపుదిద్దుకున్న ఈ ‘డాగ్ పార్కు’త్వరలో ప్రారంభం కానుంది. జపాన్, అమెరికా తదితర దేశాల్లో పెంపుడు కుక్కలకున్న వినోద, వ్యాయామ పార్కులు మన దేశంలో ఇప్పటి వరకు లేవు. ఇక్కడి డాగ్ పార్కులో ప్రత్యేక అలంకరణలు చేయించుకోవచ్చు. కుక్కతోపాటు యాంపీ థియేటర్లో కూర్చొని వినోదం పొందవచ్చు. – సాక్షి, హైదరాబాద్ ప్రవేశ రుసుము రూ. 10 జీహెచ్ఎంసీ నుంచి లైసెన్సు పొందిన కుక్కలకే ఇందులో ప్రవేశం కల్పిస్తారు. లైసెన్సు ఇచ్చేందుకు, ఏడాది కాలపరిమితి తరువాత దాని రెన్యువల్‌కూ అవకాశం కల్పిస్తారు. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ ఇచ్చే ఏర్పాట్లూ చేయనున్నారు. కుక్క పిల్లలు ఆడుకునేందుకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్ ఏర్పాటు చేశారు. మిగతా పార్కుల్లాగే దీనికీ ప్రవేశ రుసుము ఉంది. యజమానితో సహా కుక్కకు రూ.10 ప్రవేశ రుసుము ఉంటుంది. దాన్ని చెల్లించి ఎంట్రీ పాసు పొందాలి. నెలవారీ పాసులు కూడా ఇవ్వనున్నట్లు సంబంధిత అధికారి తెలిపారు. పార్కు నిర్వహణ కోసం టెండర్లు పిలిచారు. అర్హత పొందినవారికి నిర్వహణ బాధ్యతలప్పగిస్తారు. అంతర్జాతీయ ప్రమాణాలతో..: కేటీఆర్ పెట్స్, పెట్ పేరెంట్స్ కోసం అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ పార్కును తీర్చిదిద్దినట్లు కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. పెంపుడు కుక్కల కోసం ఇలాంటి పార్కు దేశంలో మరెక్కడా లేదని ప్రస్తావించారు. బెంగళూర్, చెన్నైల నుంచి సంప్రదిస్తున్నారు జపాన్‌లో ఇలాంటి డాగ్ పార్కును చూశాను. నగరంలోని వెస్ట్‌జోన్, సెంట్రల్ జోన్లలో దాదాపు రెండున్నర లక్షల మంది కుక్కల్ని పెంచుకుంటున్నారు. కుక్కలకు కూడా ఆహ్లాదం, వ్యాయామాలకు పార్కుంటే బాగుంటుందని అనిపించింది. ఇక్కడి డాగ్ పార్కు గురించి తెలిసి బెంగళూర్, చెన్నైల నుంచి కూడా సంప్రదిస్తున్నారు. పార్కులో వెటర్నరీ డాక్టర్, కాంపౌండర్‌తో క్లినిక్‌ను కూడా తెరుస్తాం. కుక్కల వినోదానికి తగిన విధంగా ఏర్పాట్లున్నాయని ‘కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా’కూడా సర్టిఫై చేసింది. – హరిచందన దాసరి, శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ -
తండ్రి మీదకి కుక్కను ఉసిగొల్పుతూ..
సాక్షి, యలమంచిలి: ఈ చిత్రంలో కనిపిస్తున్న వ్యక్తి పేరు ఉన్నమట్ల లక్ష్మణదాసు. పశ్చిమగోదావరి జిల్లా కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు భార్య చనిపోయింది. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్ట్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతను పెళ్లి చేసుకోలేదు. చిన్న కుమారుడు చిరంజీవికి, కూతురు సౌమ్యలకు పెళ్లి అయ్యింది. లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన ఐదు సెంట్ల ఇంటి స్థలం ఉంది. అది కాకుండా మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ మధ్య చిన్న కుమారుడు చిరంజీవి, అతని భార్య రజని ఆస్తి తమ పేరిట రాయమని ఇబ్బంది పెడుతున్నారు. అతని స్థలంలో ఉన్న కొబ్బరి చెట్ల ఫలసాయం కూడా తీసుకోకుండా అడ్డుకుంటున్నారు. అంతేకాకుండా కుక్కను తీసుకువచ్చి లక్ష్మణదాసుపై ఉసిగొల్పుతూ భయపెడుతున్నారు. దీనిపై స్థానిక సంఘ పెద్దలకు చెపితే వారి మాట కూడా వినకుండా సంఘ పెద్దలను దుర్భాషలాడి చెదరగొట్టారు. దీంతో స్థానిక సర్పంచ్ కలుగజేసుకుని ఆస్తి రాయమని సలహా ఇచ్చారు. సరే కదాని ఇరువురు కుమారులకు చెరొక 5 సెంట్ల స్థలం ఇవ్వడానికి సిద్ధపడగా అలా కుదరదు నాకు ఏడున్నర సెంట్లు రాయాలని చిన్న కొడుకు, కోడలు ఎదురుతిరగడంతో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు. ఇంటిలో ఉంటుంటే సూటి పోటు మాటలతో ఇబ్బందులు పెడుతున్నారు. దీంతో తన కుమారుడి నుంచి రక్షణ కల్పించాలని లక్ష్మణదాసు తహసీల్దార్ వి. స్వామినాయుడిని కలసి వినతిపత్రం సమర్పించారు. -
మియాపూర్‌లో ఐదేళ్ల బాలుడిపై కుక్కల స్వైర విహారం
-
పెంపుడు కుక్క చూపిన విశ్వాసం
-
కుక్క విశ్వాసంపై మరో వీడియో వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : మనిషి పట్ల మనిషికి లేని అత్యంత విశ్వాసం కలిగిన పెంపుడు జంతువేది అంటే ఎవరైనా కుక్క అని తేలిగ్గా చెప్పేస్తారు. యజమాని పట్ల కుక్క కుండే విశ్వాసానికి సంబంధించి అనేక సంఘటనలు, అనేకసార్లు చూసే ఉంటాం. మనం తేలిగ్గా చెబుతాంగానీ అవి యజమానికి ఏమైనా అయితే ఎంత భారంగా ఫీలవుతాయో, ఎంతగా ఆరాట పడతాయో తెలియజేసే మరో సంఘటన చైనా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చైనాలోని హైలాంగ్జియాంగ్ రాష్ట్రంలోని దాకింగ్ నగరంలో హఠాత్తుగా ఓ అమ్మాయి స్పృహ తప్పి పడిపోయింది. ఓ అంబులెన్స్ వచ్చి ఆమెను స్ట్రెచర్ మీద ఎక్కించుకుంది. ఆమె వెంట వచ్చిన కుక్క ఆమెను వదిలిపెట్టకుండా స్ట్రెచర్‌పై చేతులేసి యజమానురాలిని లేపేందుకు ప్రయత్నించింది. అప్పుడు ఆ యజమానురాలు కొద్దిగా స్పృహలోకి రావడంతో ఆమెను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని గుర్తించిన అంబులెన్స్ సిబ్బంది, అంబులెన్స్‌లోకి ఆ కుక్కను కూడా అనుమతించారు. అంబులెన్స్‌లో ఆస్పత్రి వరకు వెన్నంటి వచ్చిన ఆ కుక్క తన యజమానురాలికి చికిత్స సమయంలో కూడా పక్కనే ఉంది. ఆ యజమానురాలు పూర్తిగా స్పహలోకి రాగానే ఆ కుక్కను ఎంతో ఆప్యాయంగా కౌగిలించుకుంది. ఆ యజమానురాలి పేరు, ఇతర వివరాలు తెలియవుగానీ కుక్క మాత్రం గోల్డెన్ రిట్రీవర్ జాతికి చెందినది. తాము అసలు పెంపుడు జంతువులను ఆస్పత్రిలోకి అనుమతించమని, అయితే ఇక్కడ పేషంట్‌ను స్పృహలో ఉంచాల్సిన అవసరాన్ని, అందుకు సహకరిస్తున్న కుక్కను చూసి అనుమతించామని ‘జాంగ్ జియాంగ్’ ఆస్పత్రి హెడ్ నర్సు ప్రకటించింది. -
వైరల్: ధోని ట్రైనింగ్‌తో స్టన్నింగ్ క్యాచ్
టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోని సోషల్ మీడియాలో చాలా ఆక్టీవ్‌గా ఉంటాడన్న విషయం అందరికీ తెలిసిందే. తన కూతురు జీవాతో జరిగే సరదా సన్నివేశాలు ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా ఇంటి ఆవరణలో తన పెంపుడు కుక్కలకు క్యాచ్ ప్రాక్టీస్ చేపించిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘నా పెట్ డాగ్స్‌తో గడిపిన క్షణాలు వెలకట్టలేనివి. వాటికి ట్రైనింగ్ ఇవ్వడం, క్యాచ్ ప్రాక్టీస్ చేపించడం చాలా అనందంగా ఉంది’ అంటూ ధోని పేర్కొన్నాడు. కొద్ది రోజుల క్రితం తన కూతురు జీవాతో జరిగిన సరదా సన్నివేశాన్ని వీడియో తీసి పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అయింది. ఈ వీడియోలో జీవా ఆడుకుంటూ ఉండగా ధోని భార్య సాక్షి "జీవా.. నాన్న మంచోడా చెడ్డోడా? అని అడగ్గా.. మంచోడు(గుడ్) అని బదులిచ్చింది. ఆ తర్వాత మీరందరూ మంచివారు. మీ అందరూ (బిగ్గరగా)" అని జీవా బదులిచ్చింది. ఇక టెస్టులకు గుడ్‌బై చెప్పిన జార్ఖండ్ డైనమెట్ పరిమిత ఓవర్ల క్రికెట్ మాత్రమే ఆడుతున్నాడు. ఇంగ్లండ్‌తో వన్డే, టీ20 సిరీస్ అనంతరం ఖాళీ సమయం దొరకడంతో కుంటుంబంతో సరదాగా గడుపుతున్నాడు. A bit of hugging,training, catching practice and getting unconditional love in return.priceless A post shared by M S Dhoni (@mahi7781) on Aug 24, 2018 at 12:41am PDT Very smart A post shared by M S Dhoni (@mahi7781) on Aug 21, 2018 at 3:28am PDT -
ఇంటిని భైరవశాలగా మార్చిన ప్రకృతి వైద్యుడు
-
ఇక 'కీలు' గుర్రమే!
హైదరాబాద్: ఖర్చుకు వెనుకాడకుండా పెంపుడు జంతువులకు అధునాతన వైద్యం అందిస్తున్నారు జంతుప్రేమికులు. ఆసియాలోనే మొదటిసారిగా డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్(తుంటి ఎముక కీలు మార్పిడి) శస్త్ర చికిత్సకు నగరంలోని ‘డాక్టర్ డాగ్ పెట్’హాస్పిటల్ వేదికగా నిలిచింది. డాక్టర్ ఎన్.రమేశ్ ఆది వారం శస్త్రచికిత్స వివరాలను వెల్లడించారు. బంజారాహిల్స్‌కు చెందిన వ్యాపారవేత్త శ్రీనివాస్ ఎనిమిదేళ్లుగా లాబ్రడార్ జాతి శునకాన్ని పెంచుకుంటున్నారు. ఈ శునకం కొంతకాలంగా తుంటి కీలు నొప్పితో సతమతమవుతోంది. దీంతో బం జారాహిల్స్‌లోని డాక్టర్ డాగ్ పెట్ హాస్పిటల్‌కు శునకాన్ని తీసుకెళ్లారు. శునకాన్ని పరిశీలించిన డాక్టర్ రమేశ్ వివిధ పరీక్షలు నిర్వహించి శస్త్రచికిత్స అవసరమని నిర్ధారించారు. విదేశాల నుంచి పరికరాలను తెప్పించి ఈ నెల 17న డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ శస్త్రచికిత్స నిర్వహించారు. నాలుగు గంటలపాటు వైద్యుల బృందం నిర్వహించిన ఆపరేషన్ విజయవంతమైంది. ప్రస్తుతం శునకం కోలుకుంటోంది. మరో రెండ్రోజుల్లో పూర్తిస్థాయిలో నడుస్తుందని డాక్టర్ రమేశ్ తెలిపారు. పెంపుడు జంతువుల్లో సైతం.. పెంపుడు జంతువుల్లో ఆర్థరైటిస్ సమస్య వస్తుందని డాక్టర్ రమేశ్ తెలిపారు. అయితే, డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ మాత్రం ఇప్పటివరకు ఎక్కడా నిర్వహించలేదన్నారు. మనుషుల్లో సైతం తుంటి కీలు, మోకాళ్ల చిప్పల మార్పిడి అనేవి సాధారణమయ్యాయని చెప్పారు. పెంపుడు జంతువుల్లో సైతం ఈ చికిత్స అవసరముంటుందని చెప్పారు. ఆసియాలోనే మొదటిసారిగా శునకానికి డ్యూయల్ హిప్ రిప్లేస్మెంట్ చికిత్స నిర్వహించినట్లు వివరించారు. -
కుక్కల దర్జా..
కౌడిపల్లి(నర్సాపూర్) : స్థలమేదైనా..సమయమేదైనా..మమ్మల్ని ఆపేదెవరు, మాకు అడ్డు చెప్పేవారు లేరు.. అన్నట్లుగా ఉంది శునకరాజుల తీరు. మండల కేంద్రమైన కౌడిపల్లిలో శునకాలు అధికమయ్యాయి. వాటి దర్జాకు అడ్డులేకుండా ఉంది. కౌడిపల్లిలోని మండల కార్యాలయానికి వెళ్లే ప్రధాన రహదారిలో కుక్కలు గేదెమీద, కారు మీద దర్జాగా కూర్చుని సేదతీరాయి ఇలా.. -
పొట్టగొట్టాయి..!
భువనగిరి క్రైం : సమయం అర్ధరాత్రి ఒంటి గంట.. అప్పుడప్పుడే వర్షం మొదలవుతుంది.. పైగా దోమల బెడద. ఇక్కడ నిద్ర పట్టేట్టు లేద ని ఇంటికెళ్లి పడుకుందామని గొర్రెల యజమా ని కొట్టం నుంచి బయలుదేరాడు. మళ్లీ వేకువజామునే లేచి వెళ్లి మంద దగ్గరికి వెళ్లి చూసే సరికి షాక్‌కు గురయ్యాడు. రాత్రి వరకు బా గా నే ఉన్న గొర్రెలన్నీ రక్తం మడుగులో చనిపోయి ఉండడంతో గుండె చెరువైంది. గొర్రెల మం దపై కుక్కలు దాడి చేయడంతో 65 గొర్రెలు మృతి చెందాడు. ఈ సంఘటన భువనగిరి మండలం ఎర్రంబల్లి గ్రామంలో బుధవారం వేకువజామున జరిగింది. వెటర్నరీ అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గొర్ల బాలయ్యకు సుమారు 90పైగా గొర్రెలు ఉన్నాయి. గొర్రెల మందను తన వ్యవసాయబావి వద్ద గల కొట్టంలో తోలాడు. బాలయ్య ప్రతిరోజు రాత్రి మంద వద్దే పడుకుంటాడు. కానీ మంగళవా రం అర్ధరాత్రి వర్షం కురుస్తుండడంతో, దోమలు ఎక్కువగా ఉండడంతో ఇంటికి వెళ్లి పడుకున్నాడు. ఈ క్రమంలోనే మందకు ఏర్పాటు చేసి న జాలి కింది నుంచి అయిదు కుక్కలు మందలోకి ప్రవేశించాయి. అందులోకి ప్రవేశించిన కుక్కలు గొర్రెలపై విచక్షణారహితంగా దాడి చేయడంతో 65 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరో 15 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. బుధవారం వేకువజామునే మంద దగ్గరికి వెళ్లి చూసిన చనిపోయిన గొర్లను చూసి బాలయ్య తీవ్రంగా రోదించాడు. సుమారు రూ.5 లక్షల వరకు నష్టం వాటిల్లిందని వాపోయాడు. మృతి చెందిన గొర్రెలను పశువైద్యాధి కారి పృథ్వీరాజ్, గ్రామ ప్రత్యేకాధికారి అనిల్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌లు సంఘటన స్థలాన్ని పరిశీలించి గొర్రెలు కుక్కల దాడిలోనే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. -
కుక్క పిల్లలపై పైశాచిక ఘటన
-
హైదరాబాద్‌లో పైశాచిక ఘటన
సాక్షి, హైదరాబాద్: నగరంలో పైశాచిక ఘటన చోటు చేసుకుంది. మూగ జీవి నుంచి పిల్లలను ఎత్తుకెళ్లిన కొందరు దుండగులు.. వాటి తల నరికి చంపారు. పురానాపూల్ లోని పార్థివాడ వద్ద ఈ ఘటన చోటు చేసుకోగా.. నిందితులను కఠినంగా శిక్షించాలని తీసుకోవాలని జంతు ప్రేమికులు డిమాండ్ చేస్తున్నారు. స్థానికంగా ఉండే క్రాంతి రాజా అనే వాలంటీర్ ఓ కుక్కకు, దాని పిల్లలకి భోజనం పెడుతుంటాడు. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి అవి కనిపించకుండా పోవటంతో చుట్టుపక్కల గాలించాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఓ సిమెంట్ పైప్ లైన్ల వద్ద ఓ పిల్ల దేహం ముక్కలై పడి ఉండగా.. తల్లి అక్కడక్కడే తిరుగుతూ కనిపించింది. ఓ పైపులో మిగతా మృతదేహాలు పడి ఉన్నాయి. నాలిగింటిని తల నరికి చంపగా.. మరో దానిని చర్మంతో సహా వలిచి ముక్కలుగా నరికారు. ఈ దారుణంపై స్థానిక పోలీసులకు క్రాంతి ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకోని పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి తీరతామని చెబుతున్నారు. చుట్టుపక్కల సీసీ కెమెరాలు కూడా లేకపోవటంతో నిందితుడిని గుర్తించటం కష్టం మారిందని పోలీసులు చెబుతున్నారు. రెండు రోజుల క్రితం కొందరు తాగుబోతులు ఆ ప్రాంతంలో వీరంగం సృష్టించగా.. ఆ కుక్క వారిని చూసి మొరిగింది. ఈ కోపంలోనే వాళ్లు ఈ దాష్టీకానికి పాల్పడి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహాలను ఖననం చేశాక కూడా ఆ తల్లి శునకం సిమెంట్ పైపులైన్ల వద్దే తచ్చాడుతూ రోదిస్తుండటం స్థానికులను కలిచివేస్తోంది. -
కాళ్లు, చేతులు తీసేశారు.. కారణం తెలిస్తే షాక్
వాషింగ్టన్ : అమెరికా విస్కాన్సిన్కు చెందిన గ్రేగ్ మంటఫేల్(48) గత నెలలో ఆస్పత్రిలో చేరాడు. ఇప్పటికే అతని రెండు చేతులను మోచేతుల వరకూ తొలగించారు. మోకాళ్ల కింద భాగాన్ని కూడా తొలగించారు. ఇంకా కొన్ని సర్జరీలు చేయాల్సి ఉందని వైద్యులు తెలుపుతున్నారు. కాళ్లు, చేతులు తొలగించాల్సి వచ్చిందంటే చాలా తీవ్రమైన అనారోగ్య సమస్యే అయ్యుంటుంది అనుకుంటున్నారా.. అవును గ్రేగ్ ఒక అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు. అయితే ఈ వ్యాధి సోకడానికి గల కారణం మాత్రం చాలా విచిత్రమైనది. అది ఏంటంటే కుక్క నాకడం వల్ల గ్రేగ్ పరిస్థితి ఇలా తయారయ్యింది. దాంతో లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన వ్యాధితో బాధపడుతున్నాడు గ్రేగ్. వివరాల ప్రకారం.. గత నెలలో గ్రేగ్‌కు విపరీతమైన జ్వరం వచ్చింది, ఫ్లూ లక్షణాలు అనుకోని సమీప ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ గ్రేగ్‌ను పరీక్షించిన వైద్యులు, అతను అరుదైన బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నట్లు గుర్తించారు. వెంటనే వైద్యం చేసి చేతులు, కాళ్లను మోచేతులు, మోకాలు వరకూ తొలగించాలని లేకపోతే ప్రాణాలకే ప్రమాదం అని చెప్పారు. అనంతరం ఆపరేషన్ చేసి గ్రేగ్ కాళ్లను, చేతులను తొలగించారు. అయినా వ్యాధి ఇంకా పూర్తిగా నయం కాలేదని , మరికొన్ని సర్జరీలు చేయాల్సి ఉంటుందని తెలిపారు. గ్రేగ్‌కు వచ్చిన అరుదైన వ్యాధి గురించి వైద్యులు ‘సాధరణంగా పిల్లులు, కుక్కల లాలాజలంలో ఉండే బ్యాక్టీరియా వల్ల ఈ వ్యాధి సోకుతుంది. అయితే దీని గురించి జంతు ప్రేమికులు భయపడాల్సిన పన్లేదు. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు చాలా చాలా అరుదుగా జరుగుతుంటాయి. కాబట్టి మీ పెంపుడు జంతువులను చూసి భయపడాల్సిన పన్లేదు. ఇంతకు ముందులానే మీ పెంపుడు జంతువులతో గడపోచ్చు’ అంటూ తెలిపారు. అయితే గ్రేగ్ వైద్య ఖర్చుల నిమిత్తం గోఫండ్‌మి పేజ్‌ను క్రియేట్ చేసి విరాళాలు సేకరిస్తున్నారు అతని బంధువులు. -
ఓటమిని జీర్ణించుకోలేక...
పెషావర్: పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిని జీర్ణించుకోలేని కొందరు దారుణానికి పాల్పడ్డారు. బన్ను ప్రాంతంలోని జనీ ఖేల్ ప్రాంతంలో ఓ శునకానికి పీటీఐ జెండాను కట్టి దాన్ని దారుణంగా కాల్చి చంపారు. వీడియో కాస్త వైరల్ కావటంతో రంగంలోకి దిగిన బన్ను పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను ఖ్వామి వాతన్ పార్టీ కార్యకర్తలుగా గుర్తించారు. వీడియో వైరల్ అయిన 12 గంటల్లోనే నిందితులను అరెస్ట్ చేయటం విశేషం. ఈ మేరకు నిందితులు నేరాన్ని అంగీకరిస్తున్న వీడియోను సైతం కేపీ పోలీసులు రిలీజ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ నెల మొదట్లో ఓ గాడిదను పీటీఐ కార్యకర్తలు చిత్ర వధ చేయగా, ఆరో రోజుల తర్వాత అది ప్రాణాలు కోల్పోయింది. ఓ స్వచ్ఛంద సంస్థ ఆయా ఫోటోలను వైరల్ చేసింది. దీనికి ప్రతిగా కొందరు పీటీఐ జెండాను ఓ కుక్కకు కట్టి ఊరేగించారు కూడా. పాకిస్థాన్ రాజకీయాలకు మూగజీవాలను హింసించటాన్ని జంతు పరిరక్షక సంఘాలు ఖండిస్తున్నాయి. పలువురు నిందితులకు శాపనార్థాలు పెడుతున్నారు. EXTREMELY GRAPHIC AND BRUTAL: A viral post purports to show someone apparently affiliated with Qomi Watan Party shot dead a dog after wrapping it up in PTI flag pic.twitter.com/cNSyxwGycg — Khalid khi (@khalid_pk) July 28, 2018 -
మృత్యు దూతలు
విశాఖ సిటీ: నగర శివారు గుడ్లవానిపాలెంలో జనవరి ఒకటో తేదీన ఐదేళ్ల బాలుడు రాముపై ఓ కుక్క దాడి చేసి నోట కరచుకొని లాక్కెళ్లిన ఘటన మరవకముందే.. అనకాపల్లిలో పదేళ్ల బాలికను తీవ్రంగా గాయపరచడంతో కోమాలోకి వెళ్లి చావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్న దారుణం చోటు చేసుకుంది. ఈ దారుణాలకు బాధ్యులెవరు..? కుక్కలు ఇంతలా పేట్రేగుతున్నా.. అరికట్టడంలో విఫలమవుతున్న జీవీఎంసీనా..? కుక్కల్ని పట్టుకుంటే.. విడిచిపెట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్న మూగ జీవాల సంరక్షణ సంస్థ ప్రతినిధులా..? కుక్కల్ని చంపకూడదు.. కు.ని. చికిత్సలు చేసిన తర్వాత ఎక్కడ పట్టిన శునకాలను అక్కడే విడిచిపెట్టాలని ఆదేశాలిచ్చిన న్యాయస్థానమా..? బాధ్యులెవరైనా.. బాధలు మాత్రం సామాన్య ప్రజలే ఎదుర్కొంటున్నారు. కుక్కల దాడుల్లో నిత్యం గాయపడుతున్నారు. నగరంపై శునకం దాడి చేస్తోంది. రాత్రి పూట అయితే జనావాసం కంటే శునకాలే అధికంగా కనిపిస్తున్నాయి. పాఠశాలకు వెళ్లాలన్నా.. ఆరుబయట ఆడుకోవాలన్నా చిన్నారులు బిక్కుబిక్కుమంటున్న పరిస్థితి దాపురించింది. చీకటి పడితే చాలు పాదచారులు, ద్విచక్ర వాహనదారుల వెంటపడి మరీ తరుముతున్నాయి. వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందనీ, వాటిని తొలగించాలని కార్పొరేషన్ అధికారులకు ఫిర్యాదులు ఇబ్బడి ముబ్బడిగా వస్తున్నా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలో ఇదీ దుస్థితి జీవీఎంసీ అధికారుల లెక్క ప్రకారం నగరంలో 2012లో ఉన్న వీధి కుక్కల సంఖ్య సుమారు 70 వేలు. ప్రస్తుతం ఇవి సుమారు ల„ýక్ష ఉంటాయని చెబుతున్నా.. మొత్తం సంఖ్య లక్షకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే వీటిలో 70 వేల కుక్కల వరకూ కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసినట్లు నివేదికలు చెబుతున్నాయి. అంటే అధికారికంగా మరో 30 వేలు మొత్తమ్మీద మరో 70 వేల కుక్కల వరకూ శస్త్ర చికిత్సలు చెయ్యాల్సిన అవసరం ఉంది. రూ.కోట్లు కుమ్మరిస్తున్నా తగ్గవెందుకు.? జీవీఎంసీ అధికారులు కుక్కల నియంత్రణ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. జీవీఎంసీతో పాటు విశాఖ సొసైటీ ఫర్ ప్రొటెక్షన్ అండ్ కేర్ ఆఫ్ యానిమల్స్(వీఎస్‌పీసీఏ) అనే సంస్థతో కలిసి ఈ యానిమల్ బర్త్ కంట్రోల్ కార్యక్రమం నగరంలో జరుగుతోంది. ఒక్కో కుక్కకు శస్త్ర చికిత్స చేసేందుకు రూ.1100 చొప్పున.. ఏడాదికి కుక్కల కోసం సుమారు కోటి రూపాయలు ఖర్చు చేస్తున్నా... నగరంలో మాత్రం శునకాల బెడద తీరకపోవడం ఆశ్చర్యకరం. సాధారణంగా ఒక కుక్క కాన్పులో సుమారు 8 పిల్లలను కంటుంది. ఏటా లక్ష్యం పేరుతో 15 వేల కుక్కల వరకూ ఆపరేషన్లు చేస్తున్నారు. మిగిలిన కుక్కల్లో సగానికిపైగా ఆడ కుక్కలు ఉంటున్నాయి. వచ్చే ఏడాది నాటికి వీటిలో సగం కుక్కలు పిల్లలను కంటున్నాయి. అంటే ఏడాది తిరిగేలోపు సుమారు 25 నుంచి 30 వేల కుక్కల వరకూ పెరుగుతున్నాయి. ఈ లెక్కన టార్గెట్ల పేరుతో సగం సగం ఆపరేషన్లు చేస్తున్న కొద్దీ మరో 30 వేల కుక్కలు అదనంగా పెరుగుతూ వస్తున్నాయే తప్ప.. తగ్గుతున్న దాఖలాలు లేవు. సుప్రీంకోర్టు నిబంధనలే కారణమా..? కుక్కల సమస్య తగ్గాలంటే వాటి చంపాల్సిందేనన్న విధానాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. కుక్కల్ని చంపకుండా వాటికి కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేసి పట్టుకున్న చోటే తిరిగి విడిచిపెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. ఏళ్ల తరబడి అలవాటు పడిన ప్రదేశం నుంచి మరో ప్రదేశానికి కుక్కలను తీసుకెళ్లి విడిచిపెడితే... అక్కడి పరిస్థితులకు అలవాటు పడక వాటి మానసిక స్థితి గతితప్పి పిచ్చికుక్కలా ప్రవర్తించి మనుషులను కరిచే ప్రమాదముందని వైద్య నిపుణులు వెల్లడించడంతో.. సుప్రీంకోర్టు ఈ తరహా ఆదేశాలను జారీ చేసింది. దీంతో వీధుల్లో కుక్కలను పట్టుకొని శస్త్ర చికిత్సలు నిర్వహించి తిరిగి అక్కడే విడిచి పెడుతున్నారు. మరోవైపు జంతు ప్రేమికులు సైతం తమకు అడ్డు తగులుతున్నారని జీవీఎంసీ సిబ్బంది చెబుతున్నారు. ప్రజల ఫిర్యాదు మేరకు అక్కడి కుక్కలను తరిమేసేందుకు యత్నిస్తుంటే.. వివిధ జంతు ప్రేమికుల సంఘాలు తమ పనికి అడ్డుతగులుతున్నాయ నీ... ఫలితంగా ఏమీ చెయ్యలేకపోతున్నామని జీవీఎంసీ వెటర్నరీ సిబ్బంది చెబుతున్నారు. శివారు ప్రాంతాల్లో నియంత్రించలేకపోతున్నాం ఎండాడ, సాగర్‌నగర్, పెందుర్తి, గోపాలపట్నం, పీఎం పాలెం, అనకాపల్లి శివారు ప్రాంతాల్లో కుక్కల నియంత్రణ కుదరడం లేదు. కుక్కల బండి కనిపిం చగానే ఆ ప్రాంతంలోని కుక్కలన్నీ కొండల్లోకి వెళ్లిపోతూ దొరకడం లేదు. కుక్క కాటుని పూర్తిగా నియంత్రించాలంటే ప్రజలు, జంతు ప్రేమికుల సహకారం అవసరం. కుక్కలను తరిమెయ్యాలని మేం చేసే ప్రయత్నాలను వారు అడ్డుకుంటున్నారు. అనకాపల్లిలో స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నాం. శివాజీపార్కులో రోజూ పిల్లలను కుక్కలు కరుస్తున్నాయి. వాటిని తరలిద్దామని ప్రయత్నిస్తుంటే కుక్కల ప్రేమికులు అడ్డుపడుతున్నారు. ఇక మేమేం చెయ్యగలం. – డాక్టర్ ఎల్కే సుధాకర్, జీవీఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ -
సింహాల దాడి నుంచి యజమానిని రక్షించిన శునకం
రాజ్‌కోట్ : కుక్కకు ఉన్న విశ్వాసం మనిషికి కూడా ఉండదంటారు పెద్దలు. వాళ్లు ఊరికనే అనలేదు.. అని నిరూపించింది ఓ శునకం. ఏకంగా సింహాలకే ఎదురు నిలిచి తన యజమానిని ఓ శునకం కాపాడింది. ఈ సంఘటన గుజరాత్‌లోని అమ్రేలి జిల్లా సవెర్కుండ్ల తాలుకా అంబార్డి గ్రామంలో చోటు చేసుకుంది. గొర్రెల కాపరి భవేశ్ హమిర్ భర్వాద్(25) రోజూలానే మేకలు, గొర్రెలను గడ్డి కోసం ఊరి చివరకు తీసుకెళ్లాడు. అదే సమయంలో అక్కడే ఉన్న మూడు సింహాలు మేకలు, గొర్రెల మందపై దాడికి దిగాయి. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఏం చేయాలో తెలియక, మేకలను రక్షించడానికి సింహాలను అక్కడి నుంచి తరమాలని ప్రయత్నించాడు భవేశ్. వాటిని అక్కడి నుంచి పోయేలా ప్రయత్నం చేయడంతో సింహాలకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే ఓ సింహం భవేశ్‌పై పంజావిసరడానికి ప్రయత్నించగా అతను తృటిలో తప్పించుకున్నాడు. అంతలోనే అతని పెంపుడు కుక్క క్షణాల్లో అక్కడికి చేరింది. తన యజమానికి సింహానికి అడ్డుగా నిలుచుని అరవడం ప్రారంభించింది. కుక్క అరుపులు విని పెద్ద మొత్తంలో జనం రావడంతో సింహాలు అక్కడి నుంచి జారుకున్నాయి. సింహాల దాడిలో భవేశ్‌కు స్వల్పగాయాలవ్వగా, మూడు మేకలు మృతిచెందాయి. కుక్క అడ్డుగా రాకపోతే సింహం దాడిలో భవేశ్ మృతిచెంది ఉండే వాడని, కుక్క చూపించిన తెగువను గ్రామస్తులు అభినందించారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా సింహాల దాడి సంఘటనపై గ్రామస్తులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. -
దారుణం: కుక్కలకు అన్నం వేసిందని..
సాక్షి, బెంగళూరు(యశ్వంతపూర్) : విశ్వాసం లేని మనుషులు.. విశ్వాసం చూపించే కుక్కులకు అన్నం వేసిందని ఓ యువతిని చితకబాదారు. ఈ ఘటన మహాలక్ష్మీ లేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేకుంది. వివరాల్లోకి వెళితే.. తారిణి అనే యువతి రోజు తన ఇంటి ముందుకు వస్తున్న కుక్కలను అన్నం వేసేది. దీంతో కుక్కలు వీధిలోకి రావటంవల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు స్థానికులు అనేక సార్లు హెచ్చరించారు. వీధి కుక్కలకు అన్నం వేస్తే వీకేందుకు ఇబ్బందులంటూ బుధవారం తారిణితో స్థానికులు గోడవ పడ్డారు. కుక్కలకు అన్నం వేసిన్నందుకు తనపై దాడి చేయటంను తారిణి తీవ్రంగా ఖండించారు. దీనితో పాటు అన్నం వేసిన పాపానికి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తారణిపై మహాలక్ష్మీ లేఔట్ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయాలని ప్రయత్నించగా ఫోన్‌ను కూడ లాక్కోని కోట్టిన్నట్లు తారిణి పోలీసుల వద్ద వాపోయ్యారు. దీనిపై స్వచ్చంద సంస్థలు తారిణి అభినందిస్తుండగా కేసు నమోదు చేసిన పోలీసులు గుక్కమింగటం కష్టం మారింది. -
కుక్క కోసం... దొంగ వేషం
అల్వాల్: డబ్బులు సంపాదించాలనే దురాశతో ఇద్దరు యువకులు ఏకంగా ఖరీదైన శునకాన్నే దొంగిలించారు. దాన్ని అమ్మితే డబ్బులు వస్తాయని భావించి వారు ఈ దుశ్చర్యకు పాల్పడగా... సీసీ కెమెరాలో చిక్కడంతో పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మచ్చ బొల్లారంలో నివసించే అంబిక అనే మహిళ ఇంట్లో హైబ్రిడ్ శునకాన్ని(స్మార్టీ) పెంచుకుంటోంది. నెల రోజుల క్రితం స్థానికంగా నివసించే పవన్, శరత్‌చంద్రలు ఆ శునకాన్ని దొంగిలించారు. దాన్ని మరో కుక్కతో క్రాసింగ్ చేయించారు. స్మార్టీకి పుట్టిన పిల్లల్ని, తల్లిని అమ్మి సొమ్ము చేసుకుందామని భావించారు. అయితే తమ స్మార్టీ కన్పించకపోవడంతో యజమానురాలు అంబిక అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించారు. అనంతరం నిందితులను అదుపులోకి తీసుకొని విచారించడంతో విషయం బయటపడింది. కుక్కే కదా ఏమవుతుంది అనుకున్న యువకులు చివరకు కటకటాలపాలయ్యారు. ఇదిలా ఉండగా తన స్మార్టీకి క్రాసింగ్ చేయడం కూడా నేరమని పోలీసులతో అంబిక వాగ్వివాదానికి దిగింది. తాను అల్లారు ముద్దుగా పెంచుకున్న శునకాన్ని నిందితులు అనారోగ్యానికి గురయ్యేలా చేశారని, దీనికి పూర్తి బాధ్యత వారిదేనని ఆరోపించింది. పోలీసులు నిందితులను మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. శునకాన్ని యజమానురాలికి అప్పగించారు. (పోలీస్ స్టేషన్ వద్ద కుక్క కోసం పంచాయితీ) -
నాటు కోళ్ల ఫారంపై కుక్కల దాడి
చేర్యాల(సిద్దిపేట): నాటు కోళ్ల పారంపై కుక్కలు దాడి చేసి 600 నాటు కోళ్లను చంపిన ఘటన బుధవారం మండల పరిధిలో దానంపల్లి గ్రామంలో వెలుగుచూసింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. రైతు మల్లారెడ్డికి గ్రామ శివారులో గ్రామప్రియ నాటు కోళ్ల ఫారం ఉంది. రోజువారీగా మంగళవారం రాత్రి కోళ్ల ఫారంలో పనులు ముగించుకుని ఇంటికి వెళ్లిన మల్లారెడ్డి బుధవారం ఉదయం కోళ్ల ఫారానికి వచ్చి చూడగా కోళ్లన్నింటినీ కుక్కలు కొరికి చంపినట్టు గుర్తించాడు. దీంతో సుమారు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు వేడుకుంటున్నాడు. ఇదిలా ఉండగా, ఘటన తెలుసుకున్న చేర్యాల ఎంపీపీ మేడిశెట్టి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు అంకుగారి శ్రీధర్‌రెడ్డితో కలిసి బాధితుడిని పరామర్శించారు. ప్రభుత్వం తరపున సహాయం అందించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. -
కుక్క తెచ్చిన తంటా..
మదనపల్లె క్రైం: కుక్క అడ్డురావడంతో బైక్ అదుపు ఇద్దరు మిలటరీ ఉద్యోగులు తీవ్రంగా గాయపడి న ఘటన మంగళవారం రాత్రి గుర్రంకొండ మం డలంలో జరిగింది. బాధితుడి కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పెద్దమండ్యం మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన వి.సంతోష్ కుమార్‌రెడ్డి(23), వి.కృష్ణకిరీటి రెడ్డి(24) మిలటరీలో ఉద్యోగం చేస్తున్నారు. కాగా వీరిద్దరు సెలవుపై రెండు రోజులక్రితం స్వగ్రామంలో ఉన్న తల్లిదండ్రులను చూడటానికి వచ్చారు. మంగళవారం మధ్యహ్నం గుర్రంకొండలో వారి స్నేహితులను చూడానికి బైక్‌లో వెళ్లారు. తిరిగి రాత్రి స్వగ్రామానికి బయలుదేరారు. ఈ క్రమంలో తురకపల్లె వద్దకు రగానే ఓ కుక్క బైక్‌కు అడ్డు రావడంతో బైక్ అదుపు తప్పి కిందపడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. అపస్మారక స్థితిలోకి చేరుకున్న వీరిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన డాక్టర్లు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
శిక్షకుడిని కాపాడేందుకు పోలీసు కుక్క నానా తిప్పలు
-
మనిషి కన్నా జంతువే మిన్నా.. వైరల్ వీడియో
స్పేయిన్: మనిషి కన్నా జంతువే మిన్న అని నిరూపించిన సంఘటన ఒకటి స్పేయిన్‌లో చోటుచేసుకుంది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తన శిక్షకుడిని కాపాడేందుకు ఓ పోలీసు కుక్క నానా తిప్పలు పడింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. ఓ పోలీసు అధికారి కే-9 శిక్షకునిగా పనిచేస్తున్నారు. శిక్షణలో భాగంగా అధికారి సెల్యూట్ చేస్తూ ఒక్కసారిగా స్పృహతప్పి కుప్పకూలీపోయినట్టు నటించారు. దీంతో తన దగ్గరలో ఉన్న ఆఫీసర్ పోంచో అనే పోలీసు కుక్క అధికారి ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. అధికారి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ఛాతిపై ఒత్తిడి పెంచేందుకు పైకి కిందకు దూకుతూ.. మద్యలో మద్యలో శ్వాస తీసుకుంటున్నారో లేదో తెలుసుకునేందుకు ఆతని ముఖంపై తల పెట్టి గమనించింది. కొంత సమయం తరువాత అధికారి లేచి కూర్చోవడంతో కుక్క ఆనందంలో మునిగిపోయింది. దీనికి సంబంధించిన వీడియోను మాడ్రిడ్ మున్సిపల్ పోలీసులు ట్విటర్లో పోస్ట్ చేశారు. ఈ వీడియో పోస్ట్ చేసిన నాలుగు రోజులకే 20 లక్షల మందికి పైగా వీక్షించారు. దీంతో ఆ కుక్క సోషల్ మీడియాలో హీరో అయిపోయింది. -
జాతి వైరానికి దూరం..ఆ అమ్మతనం
సాక్షి, గూడెంకొత్తవీధి (పాడేరు) : సృష్టిలో అమ్మతనానికి మించిన దైవం మరొకటి లేదు. అనంతకోటి జీవరాశుల్లో జాతి వైరం సహజం. కుక్కకు కోడికి పడదు. కోడికీ పిల్లికి పడదు. ఇలా ఒక్కో జాతివైరం ప్రకృతి సహజంగా ఉంటుంది. ఇందులో ప్రేమాభిమానాలకు తావుండదు. జీకేవీధి మండలంలో సప్పర్ల గ్రామంలో అబ్బాస్ అనే వ్యక్తి ఇంట్లో మేక పిల్లను పెంచుతున్నాడు. తన ఇంటిలో ఒక శునకం ఉంది. మేకకు రెండు పిల్లలు జన్మించాయి. ఐతే ఇటీవల మేక అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో రెండు మేక పిల్లలు అనాథలయ్యాయి. దీంతో తన ఇంటిలో ఉన్న కుక్క, మేక పిల్లలకు పాలిచ్చింది. మేక పిల్లలు కుక్క పాలు తాగుతున్నాయి. -
కొండచిలువ నోట చిక్కి.. షాకింగ్ వీడియో
ప్రాణాల కోసం ఆ మూగ జీవి పోరాటం.. ధైర్యం చేసిన ఓ బృందం సభ్యులు.. తోడుగా మరో అల్పజీవి. అంతా కలిసి కష్టపడి ఆ భారీ జీవి నుంచి దానిని విడిపించగలిగారు. అయితే చివర్లోనే అసలు ట్విస్ట్ చోటు చేసుకుంది. కాస్త భయానకంగా ఉన్న ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బ్యాంకాక్: సుమారు 20 అడుగులపై ఉన్న ఓ భారీ కొండచిలువ ఓ నల్లకుక్క పిల్లను మింగేందుకు యత్నించింది. ముందుగా దానిని చుట్టేసి నలిపేయటం ప్రారంభించింది. అది గమనించిన కొందరు కర్రలతో విడిపించేందుకు యత్నించారు. అది సాధ్యం కాకపోవటంతో ఓ వ్యక్తి ధైర్యం చేసి దాని తోకపట్టి లాగాడు. ఇంతలో మిగతా వారు అతనితో కలవటంతో దానిని ఈడ్చి కుక్కను లాగేందుకు ప్రయత్నించారు. అక్కడ ఉన్న మరో చిన్న కుక్క పిల్ల మొరుగుతూ, ఆ భారీ జీవిపై దాడి చేయాలని చూసింది. చివరకు ఎలాగోలా దాని నోటి నుంచి కుక్క పిల్లను లాగిన ఆ బృందం.. పెనుగులాటలో అది చనిపోయి ఉంటుందని భావించారు. అయితే అనూహ్యంగా ఆ కుక్క పిల్ల లేచి, పక్కనే ఉన్న మరో కుక్కతో సహా అక్కడ నుంచి పరిగెత్తింది. మళ్లీ పట్టేందుకు ప్రయత్నించగా వారు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. చివరకు నోటి కాడ కూడు పోవటంతో ఊసురుమనుకుంటూ ఆ కొండచిలువ పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్లిపోయింది. థాయ్‌లాండ్‌లో చియాంగ్ మయి ప్రాంతంలో జరిగిన ఈ ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. ఆ కుక్కను కాపాడిన బృందాన్ని ‘ఫ్లైట్ ఆఫ్ ది గిబ్బన్స్’గా అధికారులు గుర్తించారు. -
కుక్కలను చూసి పులులు అనుకుని..!
రామగుండం : కుక్కలను పులులుగా భావించి.. అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి.. తీరా వాటి అరుపులు విని అవాక్కయిన ఘటన బుధవారం రామగుండం బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలో చోటుచేసుకుంది. ప్రతిరోజూ ఉదయం 3 గంటల ప్రాంతంలో బీ-థర్మల్ విద్యుత్ కేంద్రంలోని కోల్‌యార్డులో బొగ్గును బంకర్లోకి పంపిస్తారు. కోల్‌యార్డు పూర్తి చీకటిగా ఉండడంతో బొగ్గుకుప్ప వద్ద రెండు జంతువులు ఉన్నట్లు ఆపరేటర్ గుర్తించాడు. వాటిని పులులుగా భావించి.. కోల్‌యార్డు ఉద్యోగులు బీ-థర్మల్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం చేరవేశాడు. బీ-థర్మల్ భద్రతా సిబ్బంది, ఇంజినీర్లు స్థానిక పోలీసులు, ఫారెస్టు, ఫైర్ సిబ్బంది అందరూ అక్కడకు చేరుకున్నారు. ఉద్యోగులు, కార్మికులు సైతం పరుగున వచ్చారు. అధికారులు ఫ్లడ్లైట్లను అమర్చడంతో బొగ్గు కుప్పలు మెరుస్తూ కనిపించాయి. వాటిపైనున్న రెండు జంతువులు ఎంతకూ కదలలేదు. రాళ్లతో కొట్టడంతో భౌభౌ మంటూ అక్కడినుంచి పరుగుపెట్టాయి. అధికారులు ఒక్కసారిగా అవాక్కయి.. నవ్వుకుంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు. -
జాతివైరం మరిచి.. ప్రేమను చాటి...
కేసముద్రం(మహబూబాబాద్): ఓ కొండెంగ.. మరో కొండెంగ పిల్లపై దాడి చేసి చంపగా.. గతంలో దానితో జాతి వైరం మరిచి స్నేహం చేసిన శునకం గ్రామస్తులు నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని గ్రామ శివారులో ఖననం చేసే సమయంలో కొండెంగ కలేబరాన్ని ఆత్మీయంగా తాకుతూ.. తాన స్నేహాన్ని చాటిన సంఘటన కేసముద్రం మండలం కల్వల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు తెలిపిన ప్రకారం. కల్వల గ్రామానికి చెందిన ఆకుల సుధాకర్ అనే రైతు పంటపొలాల్లో, గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండడంతో రెండు కొండెంగలను తీసుకువచ్చి సాకుతున్నాడు. కొండెంగలకు ఆరునెలల క్రితం పిల్ల జన్మించింది. ఈ మేరకు తల్లికొండెంగను చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ అటుఇటూ తిరుగుతుండగా, ఇదే గ్రామంలో గుట్టయ్య అనే రైతు పెంచుకుంటున్న కుక్క జాతివైరాన్ని మరచి ఆ కొండెంగ పిల్లతో స్నేహం చేస్తూ వచ్చింది. కొండెంగ పిల్ల ఎక్కడుంటే ఆ శునకం అక్కడే ఉంటూ, దాన్ని నిమురుతూ స్నేహంగా మెదలాడాన్ని స్థానికులు చూసి ఆశ్చర్యపోయేవారు. ఊళ్లో కొండెంగలు ఉండటం వలన గ్రామానికి కోతులు రాకపోవడంతో, గ్రామస్తులు నిత్యం ఆ కొండెంగలకు పండ్లు, కూరగాయలు పెడుతూ వచ్చారు. ఈక్రమంలో అటవీ ప్రాంతం నుంచి ఊళ్లోకి చేరుకున్న మరో కొండెంగ గత కొద్దిరోజులుగా , పెంచుకునే కొండెంగలపై దాడిచేసే ప్రయత్నం చేస్తుండగా, గమనించిన గ్రామస్తులు ఆ కొండెంగను బెదిరించి పంపించేవారు. ఈ క్రమంలో సోమవారం తల్లి కొండెంగను గొలుసుతో చెట్టుకు కట్టేయగా, పిల్ల కొండెంగ చెట్టు ఎక్కడాన్ని గమనించిన అడవి కొండెంగ మెడకొరికి దాడిచేసి చంపేసింది. దీంతో గ్రామస్తులు ఆ కొండెంగకు మేళతాళాల నడుమ, పాడెను కట్టి, ఊరి చివర వరకు తీసుకెళ్లి, ఖననం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్ని రోజులుగా జాతివైరాన్ని మరిచి స్నేహం చేసిన శునకం మృత్యువాతపడిన కొండెంగ వద్దకు వచ్చి నిమురుతూ, ఆ తర్వాత పాడెకట్టి తీసుకెళ్తుంటే దానివెంటే వెళ్లి, చివరకు ఖననం చేసే ప్రాంతానికి చేరుకుని దానిచుట్టూ తిరిగింది. మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా మరో జంతువుపై ఇంత ప్రేమ ఉంటుందా.. అని గ్రామస్తులు ఆశ్చార్యానికి లోనయ్యారు. పైగా ఒకే జాతి కొండెంగ చంపగా, మరో జాతికి చెందిన శునకం మాత్రం స్నేహభావాన్ని చాటింది. -
అయ్యో! కన్నా!
కాకినాడ: వీధి కుక్కలు దాడి చేశాయి. అభం శుభం తెలియని ఆరేళ్ల బాలుడిని పొట్టనపెట్టుకున్నాయి. వివరాలివి...కాకినాడ నగరం నడిబొడ్డున ఉన్న బాలాజీ చెరువు వద్ద మండల రెవెన్యూ కార్యాలయం ఎదుటి వీధిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. వాసంశెట్టి శ్రీనివా స్, భూలక్ష్మి దంపతులు 15 రోజు క్రితమే ఇంద్రంపాలెం నుంచి ఇక్కడి ఇంట్లోకి అద్దెకు వచ్చారు. వీరికి సాందిక, సాయిశారద ఇద్దరు కుమార్తెలు. దాదాపు 11 సంవత్సరాల తరువాత నాగేంద్ర అనే బాలుడు జన్మించాడు. దీంతో అతడ్ని ఎంతో అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. బాలాజీచెరువు వద్ద ఆటో మెకానిక్‌గా పని చేస్తున్న శ్రీనివాస్ శనివారం ఉదయం మెకానిక్ షెడ్డుకు వెళ్లాడు. భూలక్ష్మి ఒక వృద్ధురాలికి సహాయకురాలిగా వెళ్లింది. ఇంట్లో ఇద్దరు అక్కలతో పాటు ఆరేళ్ల బాలుడు నాగేంద్ర ఉన్నారు. ఆ బాలుడు ఆడుకునేందుకు ఇంట్లోంచి బయటకు వచ్చాడు. విశాలమైన ఆవరణలో చెట్లు, మొక్కల మధ్య చిన్న కత్తెర పట్టుకుని ఆకులు కత్తిరిస్తూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ప్రహరీ గోడదూకి వచ్చిన కుక్కలు నాగేంద్రపై హఠాత్తుగా దాడి చేశాయి. అతడ్ని ఈడ్చుకుంటూపోయాయి. భుజంపై చర్మం పీకేశాయి. తలపై చర్మం ఊడిపోయింది. ఒళ్లంతా గాయాలపాలై తీవ్ర రక్తస్రావంతో మృతి చెందాడు. ఇంతలో పక్క ఇంట్లో నివసిస్తున్న మహిళ బయటకు వెళ్తూ నిర్జీవంగా ఉన్న నాగేంద్రను చూసి అతడి అక్కలకు చెప్పింది. దీంతో వారు బోరున విలపిస్తూ తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఆ కుటుంబం దుఃఖ సాగరంలో మునిగిపోయింది. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బిడ్డ దూరమైపోయాడని తల్లిదండ్రులు, అక్కలు గోలు గోలున విలపించారు. బాలుని మృదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జీజీహెచ్‌కు తరలించారు. మూడో వపట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధిత కుటుంబాన్ని మున్సిపల్ ఇన్చార్జి కమిషనర్ సత్యవేణి, కార్పొరేటర్ లక్ష్మీప్రసన్న పరామర్శించారు. కుక్కల దాడికి మాంసం వ్యర్థాలే కారణమా? కుక్కలు బాలుడిని హతమార్చిన ఇంటి ముందు డంపర్ బిన్నులో ఆస్పత్రి, హోటళ్ల నుంచి తెచ్చి వేసిన వ్యర్థాలను తినేందుకు కుక్కలు అక్కడ వస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉండే ఆస్పత్రుల నుంచి రక్తం మరకలతో కూడిన వ్యర్థాలు, హోటళ్లలోని ఆహార వ్యర్థాలను రాత్రి వేళల్లో తెచ్చి డంపర్ బిన్లో వేయడంతో వాటిని తినేందుకు కుక్కలు ఎక్కువగా ఇక్కడికి వస్తున్నాయని తెలిపారు. వాటిని తిన్నాకా ఎండ తీవ్రతకు మొక్కల మధ్యకు వచ్చి పడుకోవడానికి ప్రహరీ దూకి వస్తున్నాయని స్థానికులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే బాలుడిపై కుక్కలు దాడి చేసి ఉంటాయని భావిస్తున్నారు. -
పిచ్చికుక్కల దాడి: బాలుడు మృతి
సాక్షి, కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో దారుణం చోటు చేసుకుంది. స్థానిక బాలాజీ నగర్ చెరువు సెంటర్లో పిచ్చికుక్కలు స్వైర విహారం చేసి ఆరేళ్ల బాలుడుపై దాడి చేశాయి. ఇంటి వద్ద ఆడుకుంటున్న నాగేంద్రపై కుక్కలు గుంపు దాడి చేసింది. దీంతో తీవ్రంగా గాయపడిన బాలుడు అక్కడిక్కడే మృతి చెందాడు. నాగేంద్ర స్థానిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్నాడు. అయితే కుక్కలు ఒక్కసారిగా మీద పడడంతో భయపడిన నాగేంద్ర కార్డియాక్ అరెస్ట్‌తో మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బాలుడి మృతితో బాలాజీ నగర్లో విషాదఛాయలు అలముకున్నాయి. కుక్కల దాడిపై స్థానికలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతన్నాయని ఆరోపిస్తున్నారు. -
కాకినాడలో దారుణం: పిచ్చికుక్కల దాడిలో బాలుడు మృతి
-
దర్జాగా డాగ్ స్లీపింగ్
ఒంగోలు టౌన్: నగరంలో శునకాలను నిరోధిస్తామంటూ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు పదేపదే చెప్పినప్పటికి, వారికి సవాల్ చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గురువారం కునుకు తీసింది. మునిసిపల్ ఇంజనీర్ ఛాంబర్‌కు సమీపంలో ఆ శునకం దర్జాగా నిద్రపోయింది. ఒకవైపు మునిసిపల్ కార్యాలయ ప్రాంగణమంతా సబ్సిడీ రుణాల కోసం కోలాహలంగా ఉంది. మరోవైపు కార్యాలయ సిబ్బంది ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. ఎండ తీవ్రత కూడా ఎక్కువగా ఉండటంతో ఒక శునకం నీడపట్టు కోసం ఏకంగా మునిసిపల్ ఇంజనీర్ ఛాంబర్ ఉండే కారిడార్‌నే ఎంచుకొంది. దానికి అక్కడ చల్లగా ఉండటంతో గోడకు ఒకవైపు గంటల తరబడి పడుకొని నిద్రించింది. అటూ ఇటూ రాకపోకలు సాగించే సిబ్బంది, వివిధ రకాల పనుల నిమిత్తం వచ్చే ప్రజలు దానిని చూసుకుంటూ వెళ్లారు. మునిసిపల్ సిబ్బంది అయితే దానిని తరుముదామన్న ఆలోచన కూడా రాకపోవడం గమనార్హం. నగరంలోని రోడ్లలో శునకాలు లేకుండా చేస్తామని మునిసిపల్ అధికారులు పదేపదే ప్రకటిస్తుండగా, వారికి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఒక శునకం ఏకంగా మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో గంటల తరబడి కునుకు తీసింది. -
నిద్రిస్తున్న కుక్కపై తారురోడ్డు.. నెటిజన్ల ఫైర్!
-
పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను..
లండన్ : పెంపుడు కుక్కల కోసం కట్టుకున్న భర్తను తృణప్రాయంగా వదిలేసిందో భార్య. 25 ఏళ్ల దాంపత్య జీవితాన్ని కాదని భర్తని విడిచి పెంపుడు కుక్కలతో ఇంటి బయటకు నడిచింది. ఈ సంఘటన బ్రిటన్‌లోని సఫోక్ కౌంటీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సఫోక్ కౌంటీకి చెందిన లిజ్ గ్రూ(45) మైక్ అస్లామ్(53) భార్యాభర్తలు వీరికి 21 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. లిజ్ గ్రూకు చిన్నప్పటి నుంచి కుక్కలంటే అమితమైన ప్రేమ. అందుకే పెళ్లైన తర్వాత కూడా ఇంటిని మొత్తం మూగజీవాలతో నింపేసింది. ఇంటిని మొత్తం కుక్కలు ఆక్రమించేయడంతో భర్త మైక్‌కు కోపం వచ్చింది. ఈ విషయమై ఇరువురికి తరుచూ గొడవలు జరిగేవి. కుక్కలను ఇంటి నుంచి బయటకు పంపించడానికి ఆమె ససేమీరా అనటంతో మైక్ తీవ్రంగా కోపగించాడు. కుక్కలు కావాలో తాను కావాలో నిర్ణయించుకోమని తేల్చిచెప్పాడు. లిజ్ మాత్రం 25 ఏళ్ల దాంపత్య జీవితం కంటే పెంపుడు కుక్కలే ముఖ్యమని ఇంటి నుంచి బయటకు వచ్చేసింది. ఇప్పుడామె వద్ద మొత్తం 30 కుక్కలు ఉన్నాయి. వాటిలో 5 కుక్కలకు చెవుడు కాగా మరో రెండు కుక్కలకు ఒక కన్ను మాత్రమే ఉంది. వాటిలో మిగిలినవి వేటకుక్కలు వీటిలో కూడా కొన్ని ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాయి. లిజ్ గ్రూ మాట్లాడుతూ.. తన తండ్రికి జంతువుల ఆహారం తయారుచేసే వ్యాపారం ఉండేదని, చిన్నప్పటి నుంచి కుక్కల మధ్యే ఎక్కువగా తన జీవితాన్ని గడిపానంది. ఈ మధ్యే కుక్కల సంరక్షణ కోసం ‘‘బెడ్ఫర్ బుల్లీస్’’ అనే స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేసానంది. భర్త తన పనిలో బిజీ ఉండటం వల్ల ఒంటరిగా ఉన్న తాను కుక్కల సంరక్షణను బాధ్యతగా చేపట్టినట్లు తెలిపింది. పెళ్లైన నాటి నుంచి భర్త మైక్‌కు తానేంటో తెలుసని, మరి ఎందుకు ఇలా అన్నాడో తెలియదని వాపోయింది. కుక్కల పెంపకం అన్నది టైం పాస్ కోసం చేసే పని కాదని, అంకిత భావంతో.. ప్రేమతో వాటిని చూసుకోవాలని తెలిపింది. -
నిద్రిస్తున్న కుక్కపై రోడ్డు వేశారు..
ఆగ్రా, ఉత్తరప్రదేశ్ : ఆదమరచి నిద్రిస్తున్న వీధికుక్కపై రోడ్డును వేయడం ఆగ్రహజ్వాలలకు దారి తీసింది. రోడ్డు నిర్మాణానికి కాంట్రాక్టు తీసుకున్న ఆర్పీ ఇన్ఫ్రా వెంచర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన వర్కర్లు నిద్రిస్తున్న కుక్కపై తారును వేసి సజీవ సమాధిని చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ఫూల్ సయ్యద్ క్రాస్ నుంచి సర్క్యూట్ హౌజ్, తాజ్‌మహల్‌ల మీదుగా రోడ్డు నిర్మాణం సాగుతోంది. కోల్‌తారును మరో రౌండ్ వేసేందుకు వచ్చిన కంపెనీ వర్కర్లు నిద్రిస్తున్న కుక్కను అక్కడి నుంచి లేపకుండా దానిపై సలసలకాగే తారును వేశారు. అయితే, ఈ విషయం బయటకు పొక్కడంతో ప్రస్తుతం కుక్క మృతదేహం ఆచూకీలేకుండా చేశారని సామాజిక కార్యకర్త నరేష్ పరాస్ ఆరోపించారు. ఈ మేరకు కంపెనీపై ఫిర్యాదు చేసినట్లు పరాస్ వెల్లడించారు. కాగా, ఈ ఘటనతో షాక్‌కు గురైన ఆగ్ర వాసులు కుక్క మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. -
అర్ధరాత్రి నాలుగిళ్లలో చోరీ
మర్పల్లి: మండల కేంద్రంలో సోమవారం రాత్రి 4 ఇండ్లలో చోరీ జరిగింది. ఓ ఇంట్లో నగదుతో పాటు వెండి నగలు అపహరణకు గురయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన మహ్మద్ ఇర్శత్ హైదరాబాద్‌లో దినసరి కూలీగా పనిచేస్తుంటాడు. ఇర్శత్ తల్లి షాహదాబేగం, ఆయన భార్య ఆఫ్రీన మర్పల్లిలోనే ఉంటారు. సోమవారం రాత్రి షాహదాబేగం, ఆఫ్రీన గ్రామంలోనే ఇఫ్తార్ విందుకు వెళ్లారు. ఇఫ్తార్ ముగిసన తర్వాత అర్ధరాత్రి 1 గంట సమయంలో ఇంటికి రాగా తాళం పగలగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉన్న రూ. 5 వేల నగదు, 20 తులాల పట్టగొలుసులు, బంగారు చెవిపోగులు కనిపించలేదు. సమీపంలో ఉన్న యూసూఫ్‌జీ, ఉదయభాను, నర్సింలు ఇండ్ల తాళాలను దొంగలు పగులగొట్టారు. ఇంట్లో ఉన్న వస్తువులను చిందర వందరగా చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై విఠల్‌రెడ్డి మంగళవారం ఉదయం వికారాబాద్ నుండి డాగ్ స్క్వాడ్ (జాగిలాలు)ను రప్పించాడు. బాధితుల ఇండ్ల నుండి గ్రామం సమీపంలోని బూచన్‌పల్లి చౌరస్తా వద్దకు జాగిలాలు వెళ్లి ఆగాయి. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
గూడ్స్ బోగీలో రక్తపు సంచి తీరా చూస్తే..
రైల్వేగేట్: ఓ గూడ్స్ రైలులోని ఖాళీ బోగీలో రక్తం కారుతున్న కట్టు కట్టి ఉన్న ఓ సంచి సిబ్బందికి కనిపించింది. దీంతో వారు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. తీరా దానిని తెరచి చూస్తే చనిపోయిన కుక్క కనిపించింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సంఘనటన ఆదివారం మధ్యాహ్నం వరంగల్ గూడ్స్ షెడ్లోని రైలు బోగీలో జరిగింది. వరంగల్ జీఆర్పీ ఏఎస్సై పరశురాములు కథనం ప్రకారం.. పీడీఎస్ బియ్యం లోడ్ చేసుకుని తీసుకెళ్లేందుకు గద్వాల నుంచి హైదరబాద్ కాచిగూడ, అక్కడి నుంచి వరంగల్‌కు వచ్చిన గూడ్స్‌రైలులోని ఓ ఖాళీ బోగీలో సంచి కనిపించింది. అది కూడా రక్తం కారుతుండడంతో అనుమానం వచ్చిన గూడ్స్ షెడ్ సిబ్బంది స్టేషన్ డిప్యూటీ మేనేజర్‌కు సమాచారం ఇవ్వడంతో అతను జీఆర్పీ పోలీసులకు చెప్పారు. దీంతో సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు సంచిని బయటకు తీయించి విప్పగా అందులో చనిపోయి ఉన్న కుక్క కనిపించింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఊపిరి పీల్చుకున్నారు.. -
కుక్క కాదు.. నక్క!
బుజ్జి కుక్క పిల్లలంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి.. మీలాగే చైనాలో కూడా వాంగ్ అనే ఒక అమ్మాయి చాలా ఇష్టపడి గతేడాది ఓ దుకాణం నుంచి చిన్న కుక్క పిల్లను కొనుక్కుంది. దాన్ని చాలా అల్లారు ముద్దుగా పెంచుకుంది. అయితే షాంగ్జీ ప్రావిన్స్ జిన్జాంగ్లో కొన్న ఈ కుక్కపిల్ల కొద్ది నెలలు బాగానే ఉంది. ఆ తర్వాతే కుక్కలు తినే ఆహారాన్ని తినడం మానేసిందట. తోక కూడా కుక్కలకు పెరిగినట్లు కాకుండా చాలా పొడవుగా పెరగుతోందట. అయితే వాంగ్ దీన్ని అంతగా పట్టించుకోలేదట. అయినా కూడా చికెన్, పళ్లు వంటి ఆహారాన్ని పెడుతూనే ఉందట. అయితే ఇక అప్పటి నుంచి ఆమెకు అసలు కష్టాలు ప్రారంభమయ్యాయట. వెంట్రుకలు చాలా మందంగా, గుబురుగా పెరుగుతున్నాయట. ముక్కు పొడవుగా సాగుతోందట. తోక సాధారణ కుక్కల కన్నా చాలా పొడవుగా పెరిగిందట. మామూలు కుక్కల మాదిరిగా అరవడం లేదట. పార్కులకు తీసుకెళ్లినప్పుడు తోటివారంతా ఇది కుక్క కాదు.. నక్క అని చెప్పడంతో కంగారుపడ్డ వాంగ్ కుక్కల డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లిందట. అప్పుడు అసలు విషయం చెప్పారు డాక్టర్లు. దీంతో ఈ నక్కను జంతుశాలకు అప్పగించిందట. -
ఒక పిజ్జా ఇవ్వండి..!
‘డబ్బులు చెట్లకు కాస్తాయా ఏమన్నా’.. ఈ సామెత మనం చాలా సార్లే వింటుంటాం.. అయితే ఈ ఫొటోలో ఉన్న కుక్కకు మాత్రం అలా కాదు.. దీనికి డబ్బులు చెట్లకే కాస్తాయి.. అదెలా అనుకుంటున్నారా..? దీని పేరు నీగ్రో.. దీనికి ఏదైనా తినాలనిపిస్తే చాలు దుకాణానికి వెళ్లి చెట్ల ఆకులు ఇస్తుంది. వెంటనే ఆ దుకాణదారుడు దానికి కావాల్సింది ఇచ్చేస్తారు. నీగ్రో కొలంబియాలోని కాసనేర్ మాంటెర్రీ అనే యూనివర్సిటీలో ఉంటుంది. నీగ్రోను అక్కడి టీచర్లు దత్తత తీసుకున్నారు. విద్యార్థులకు నీగ్రో అంటే చాలా ఇష్టం. దీంతో వారంతా అప్పుడప్పుడు తినుబండారాలు కొనిస్తూ ఉంటారు. వారు డబ్బులిస్తూ దుకాణంలో కొనడం చూసిన మన నీగ్రోకు ఓ ఐడియా వచ్చింది. విద్యార్థులు తినుబండారాలు కొనివ్వనప్పుడు తాను కూడా తినుబండారాలను కొనుక్కోవాలని డిసైడ్ అయింది. విద్యార్థులు ఏదో ఇచ్చి కొనడం క్షుణ్నంగా పరిశీలించిన నీగ్రో.. చెట్ల ఆకులు తీసుకెళ్లి ఇస్తూ ఉండేది.. దుకాణదారులు కూడా ముచ్చట పడి ఏదో ఒకటి ఇస్తుంటారు. ప్రతి రోజూ బిస్కెట్ల కోసం వస్తూ ఉంటుందని గ్లాడిస్ బరెటో అనే దుకాణదారుడు చెబుతున్నాడు. నీగ్రో చాలా తెలివైన కుక్కండీ బాబోయ్ అని అక్కడి వారంతా తెగ సంబరపడతారు.. -
వైద్యుడి నిర్లక్ష్యంతో కుక్క మృతి
చిలకలగూడ: వెటర్నరీ వైద్యుని నిర్లక్ష్యం కారణంగానే కుక్క మృతి చెందిందని ఆరోపిస్తు ఓ జంతు ప్రేమికురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. చిలకలగూడ పోలీసులు, జంతు ప్రేమికురాలు రాధాకుమారి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. గత నెల 10న బాగ్‌లింగంపల్లి రోడ్డుపై పడి ఉన్న కుక్కపిల్లను అదేప్రాంతానికి చెందిన రాధ గుర్తించి చేరదీసింది. నారాయణగూడలోని ప్రభుత్వ వెటర్నరీ ఆస్పత్రిలో గత కొద్దిరోజులుగా దానికి చికిత్స చేయిస్తోంది. రెగ్యులర్‌గా వైద్యం అందించే డాక్టర్ సెలవుపై వెళ్లడంతో మరో వైద్యుడు బేగ్ కుక్కపిల్లకు వైద్యసేవలు అందించాడు. కుక్కపిల్లకు తక్షణమే సర్జరీ చేయాలని సూచించిన అతను బౌద్ధనగర్‌లోని తన ప్రైవేటు ఆస్పత్రి కెన్నెల్ స్మార్ట్ క్లినిక్‌కు తీసుకువస్తే సర్జరీ చేస్తానని చెప్పాడు. ఆపరేషన్‌కు ముందు రెండు డోసుల మత్తుమందు ఇచ్చాడు. దీనికి రాధాకుమారి అడ్డు చెప్పినా ఇబ్బంది లేదని డాక్టర్ పేర్కొన్నాడు. మరుసటి రోజు శ్వాస ఆడక కుక్కపిల్ల మృతి చెందింది. మత్తుమందు ఎక్కువ ఇవ్వడంతోపాటు సర్జరీ అనంతరం కుట్లుకూడా సరిగా వేయలేదని ఆమె తన ఫిర్యాదులో పేర్కొంది. ఈనెల 1న పోలీసులకు ఫిర్యాదు చేయగా, న్యాయనిపుణుల సలహామేరకు గురువారం సాయంత్రం కేసు నమోదు చేశారు. డాక్టర్ బేగ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు చిలకలగూడ ఎస్ఐ బ్రహ్మచారి తెలిపారు. -
ఆ శునకాల నుంచైనా నేర్చుకోండి!
సాక్షి, చిత్రదుర్గ/రాయ్‌చూర్/బాగల్కోట్/హుబ్లీ: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పోలింగ్ తేదీ దగ్గరవుతున్న కొద్దీ.. వాగ్బాణాల వాడి పెరుగుతోంది. భారతీయ సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటకకు చెందిన ముధోల్ శునకాల నుంచైనా దేశభక్తి నేర్చుకోండంటూ కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హుబ్లీలో ఆదివారం జరిగిన ప్రచార ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘దేశభక్తి అనే మాట వినపడగానే ఇబ్బందిపడేవారికి, దేశభక్తిని విమర్శించేవారికి, దేశభక్తి వల్లనే కష్టాలని భావించేవారికి నేనొకటే చెబుతున్నా. మీ పెద్దల నుంచి మీరేం నేర్చుకోలేదు.. కనీసం సైన్యంలో సేవలందిస్తోన్న ఉత్తర కర్ణాటక ప్రాంతానికి చెందిన శునకాల నుంచైనా కాస్త దేశభక్తి నేర్చుకోండి. అలా నేర్చుకుంటారని కూడా నేను అనుకోవడం లేదు’ అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. ‘దేశాన్ని ముక్కలు చేస్తామంటూ నినాదాలు చేసిన వారికి మద్దతిచ్చిన పార్టీ మీది’ అని మండిపడ్డారు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో ఆందోళనల సమయంలో విద్యార్థులకు ప్రస్తుత కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ స్వయంగా వెళ్లి సంఘీభావం తెలిపిన విషయాన్ని ప్రధాని ఇలా పరోక్షంగా ప్రస్తావించారు. ఉత్తర కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ముధోల్ ప్రాంతానికి చెందిన జాతి కావడంతో ఇక్కడి శునకాలకు ఆ పేరు వచ్చింది. అవి భారతీయ ఆర్మీలో సేవలందిస్తున్న తొలి భారతీయ జాతి శునకాలు. పేదలకు పదవులు వారికిష్టంలేదు ‘వారు అంబేడ్కర్‌ను అవమానించారు. ఆయనను అంగీకరించలేదు. సమయాన్ని ఇవ్వలేదు’ అని బాగల్కోట్ బహిరంగ సభలో మోదీ పేర్కొన్నారు. దళిత నాయకుడైన రామ్‌నాథ్ కోవింద్‌ను బీజేపీ రాష్ట్రపతిగా గెలిపించుకోవటం కూడా కాంగ్రెస్‌కే నచ్చలేదన్నారు. ‘దేశంలో ప్రస్తుతం ఉన్న పదవులను పేదలు, సామాన్యులు అందుకోవటం కాంగ్రెస్‌కు ఇబ్బందికరంగా మారింది’ అని విమర్శించారు. ప్రధాని జవహర్లాల్ నెహ్రూ విధానాలను ప్రశ్నించారని అప్పటి మైసూరు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎస్. నిజలింగప్పను కాంగ్రెస్ దారుణంగా అవమానించిందన్నారు. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం కాంగ్రెస్ ఎంతకైనా తెగిస్తోందని చిత్రదుర్గ ర్యాలీలో మోదీ విమర్శించారు. ‘18వ శతాబ్దంలో దళిత సామాజిక వర్గానికి చెందిన ఒణకె ఓబవ్వ చిత్రదుర్గ సామ్రాజ్యాన్ని కాపాడుకోవటం కోసం సుల్తాన్ వంశస్తుడైన మైసూరు హైదర్ అలీ సైన్యంతో పోరాడి.. కన్నడ తెగువను చూపారు. అలాంటి ఎందరో యోధులు, యోధురాళ్లను విస్మరించిన కాంగ్రెస్.. సుల్తాన్ల జయంతులు మాత్రం జరుపుతోంది’ అని మండిపడ్డారు. దోపిడీని అరికట్టినందుకే.. రాజకీయంగా తనను ఎదుర్కొనేందుకే కాంగ్రెస్ పార్లమెంటు సమావేశాలనూ అడ్డుకుంటోందని మోదీ విమర్శించారు. ‘నన్ను వ్యతిరేకించటం, విమర్శించటమే కాంగ్రెస్‌కు ఉన్న ఏకైక ఎజెండా. అందుకే పార్లమెంటును కూడా జరగనీయటం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీని మేం అరికట్టాం. అందుకే వారు నాపై, మా పార్టీ నేతలను దూషిస్తున్నారు’ అని తెలిపారు. తాము అధికారంలోకివస్తే రాయచూరు జిల్లాలో పండించే సోనామసూరి బియ్యానికి అంతర్జాతీయ మార్కెట్లో గుర్తింపు తెస్తామని, హట్టి బంగారు గనుల అభివృద్ధికి శ్రమిస్తామన్నారు. -
ఇంట్లో చెప్తే తిడతారని....
ఇచ్ఛాపురం : మున్సిపాలిటి పరిధిలోని రత్తకన్న గ్రామానికి చెందిన బాలుడు జగన్(12) కుక్క కాటుకు గురై మృతిచెందాడు. వివరాల్లోకి వెళ్తే.. రత్తకన్న గ్రామంలోని తోటవీధికి చెందిన వ్యవసాయ కూలీలు లెంక జగ్గారావు, జేజమ్మలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు జగన్ స్థానిక మున్సిపల్ పాఠశాలలో 7వ తరగతి చదువుతూ 17 రోజుల క్రితం కుక్క కాటుకు గురయ్యాడు. ఇంట్లో చెబితే తల్లిదండ్రులు మందలిస్తారని భయపడి కుక్క కరిచిన విషయం చెప్పలేదు. శరీరం నొప్పిగా ఉందని జగన్ తల్లిదండ్రులకు చెబుతూ మంగళవారం హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే బాలుడిని స్థానిక ప్రయివేటు ఆస్పత్రికి తరలించగా అక్కడి నుంచి విశాఖపట్నం రిఫర్ చేశారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి ర్యాబిస్ వ్యాధి సోకిందని గుర్తించారు. పరిస్థితి విషమంగా మారడంతో కొద్దిగంటల్లోనే చనిపోతాడని చెప్పడంతో చేసేదేమీలేక ఇంటికి తీసుకువస్తుండగా టెక్కలి సమీపంలో మృతి చెందాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. జగన్ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. -
సీరియల్ నటికి కుక్కకాటు
సాక్షి, ముంబై : బాలీవుడ్ కమ్ బుల్లితెర నటి రీనా అగర్వాల్ ఆస్పత్రి పాలయ్యారు. క్యా హాల్ మిస్టర్ పంచల్ షో షూటింగ్లో భాగంగా ఓ కుక్కతో సీన్‌ను చిత్రీకరిస్తుండగా.. అది కాస్త ఆమె ముఖంపై కరిచింది. దీంతో గాయాలు కాగా హుటాహుటినా ఆమెను ఆస్పత్రిని తరలించారు. ఆమె ముఖానికి కుట్లు వేశామని తెలిపిన వైద్యులు.. ఓ నెలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. పలు టీవీ సీరియళ్లతోపాటు అమీర్ ఖాన్ తలాష్.. బహెన్ హోగీ తేరీ తదితర చిత్రాల్లో రీనా నటించారు. -
ఇంతకీ చర్మం పులిదా.. కుక్కదా?
లక్సెట్టిపేట(మంచిర్యాల): పులిచర్మంగా రాష్ట్రంలో హల్చల్ రేపిన పులిచర్మం కథ ఇప్పటికీ సుఖాంతం కాలేదు. కుక్క చర్మానికి రంగులు దిద్ది పులిచర్మంగా అమ్ముతున్నారని భావించిన కథ ఇంకా ముగియలేదు. ఒక వేళ అది కుక్క చర్మం అయినట్లైతే పోలీసులు కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు అవుతుందని పలువురు అనుకుంటున్నారు. కుక్క చర్మంతో వ్యాపారం చేస్తు పోలీసులకే పంగనామాలు పెట్టినట్లు అవుతుందని పలువురు భావిస్తున్నారు. ఫొరెనిక్స్ రిపోర్టు రాలేదని వచ్చేదాకా ఎటూ తేల్చేది లేదని పోలీసులు తెలుపుతున్నారు. పులిచర్మంగా మొదట వెల్లడి మండలంలో ఈనెల 4న స్థానిక పోలీసులు కౌటాల మండలం తాటినగర్ గ్రామానికి చెందిన శ్యాంరావు అనే వ్యక్తి పులి చర్మం తరిలిస్తున్నాడని తెలిసి స్థానిక ఎన్టీఆర్ చౌరస్తా వద్ద సీఐ శ్రీనివాస్, ఎస్సై మధుసూదన్‌రావు నిందితులను అదుపులోకి తీసుకుని మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత నలుగురు వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అది పులి చర్మం కాదు కుక్క చర్మం అని సోషల్ మీడియాలో పోస్టులు, సంబంధిత ఫారెస్టు అధికారులు పులిచర్మం కాదని చెప్పడంతో అనుమానంతో పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పులిచర్మంగా భావిస్తున చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాకోన్స్ ల్యాబోరేటరీకి తరలించారు. పది రోజులు గడిచినా రిపోర్టు రాకపోవడంతో పులిచర్మం కథ ఇంకా సుఖాంతం కాలేదు. కుక్కను చంపి పులి చర్మంగా తయారు చేయడానికి హెయిర్ డై వంటి రంగులు వాడి పులి చర్మంగా పెద్ద ఎత్తున్న చీకటి వ్యాపారం సాగుతున్నట్లు బహిర్గతమవుతోంది. దీనిపై పోలీసులు నిఘా పెడితే అసలు వ్యాపారం బట్టబయలవుతుందని ఎందుకు దీనిపై పోలీసులు దృష్టిపెట్టలేదని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కుక్క అయితే మాత్రం చంపి దానికి రంగులు పూసి వ్యాపారం చేసే అధికార ం లేదని అటువంటి వారిని కఠినంగా శిక్షించాలని పెట్ యానిమల్స్ వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. నివేదిక కోసం ఎదురుచూపులు పులిచర్మంగా భావిస్తున్న చర్మాన్ని హైద్రాబాద్‌లోని ల్యాబోరేటరీకి పంపినట్లు పోలీసులు తెలుపుతున్నారు. చర్మం పులిదా కుక్కదా అని తేల్చేందుకు ఇంత సమయం పడుతుందా పది రోజులైన ఇంకా రిపోర్టు రాకపోవడం ఏంటి అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అది పక్కాగా కుక్క చర్మమే అని ఫారెస్టు అధికారులు ముందే కొట్టిపారేస్తున్నారు. పోలీసులు తొందరపడి పులిచర్మంగా మీడియాకు తెలియపర్చారని దీంతో ఫారెస్ట్ ఇమేజ్ డ్యామేజ్ అయినట్లుగా ఫారెస్టు అధికారులు భావిస్తున్నారు. కుక్కదా పులిదా పోలీసులే తేల్చి చెప్పాలని రిపోర్టు ఎలా వస్తుందని పోలీసులు ఏం చెప్తారని ప్రజలు ఎదురుచూస్తున్నారు. -
పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం.. విషాదం
మాంచెస్టర్(ఇంగ్లాండ్) : ప్రేమగా పెంచుకున్న పెంపుడు కుక్క తెచ్చిన అంటురోగం కారణంగా రెండు కాళ్లు, తన కుడిచేతి ఐదు వేళ్లు, ముక్కు పోగొట్టుకున్నాడో వ్యక్తి. ఈ సంఘటన ఇంగ్లాండ్‌లోని మాంచెస్టర్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాంచెస్టర్‌కు చెందిన సైకియాట్రిస్ట్ డాక్టర్ జాకో నెల్ (50) తన పెంపుడు కుక్కతో రోజూ సరదాగా ఆడుకునే వాడు. ఒక రోజు ఆడుకుంటున్న సమయంలో కుక్క కారణంగా చేతిపై ఓ చిన్న గాయం ఏర్పడింది. మూమూలు గాయమేకదా అనుకున్న జాకోనెల్ దాన్ని సబ్బుతో కడిగి మిన్నకుండిపోయాడు. కొద్ది రోజుల తర్వాత తీవ్రమైన జలుబు ఒళ్లు నొప్పుల కారణంగా మంచానికే పరిమితమయ్యాడు. ఆ తర్వాత ఒంటి నిండా దురద మొదలైంది. కొద్ది సేపటికే శరీరంలోని భాగాలు నియత్రణ కోల్పోయి నడవటం, మాట్లాడటం, చేతులు సైతం పైకి ఎత్తలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో అతని భార్య జాకోనెల్ను ఆస్పత్రికి తరలించింది. జాకోనెల్ పరిస్థితి గమనించిన వైద్యులు అతన్ని ఇంటెన్సివ్ కేర్‌లో ఉంచారు. వైద్య పరీక్షల అనంతరం అతనికి పెంపుడు కుక్క కాటు కారణంగా సెప్సిస్ అనే అంటువ్యాధి సోకిందని వైద్యులు తేల్చారు. అంటువ్యాధి కారణంగా జాకోనెల్ రెండు కాళ్లు మోకాలి భాగం వరకు తొలగించేశారు. కుడిచేతి వేళ్లు, ముక్కు భాగాన్ని సైతం తొలగించాల్సి వచ్చింది. జాకోనెల్ మాట్లాడుతూ.. ప్రస్తుతం బయటకు వెళ్లడానికి కొంచెం బెరుగ్గా ఉందన్నారు. అయినా ఎవరీ మీద ఆధారపడకుండా బతకుతానని, తన రూపం మొత్తం తుడిచిపెట్టుకుపోవడమే కొద్దిగా బాధ కలిగిస్తోందన్నారు. -
కుక్క తెచ్చిన అంటురోగం.. రెండు కాళ్లు పోగొట్టుకున్నాడు
-
ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతి
దోమ : ఊరకుక్కల దాడిలో 40 గొర్రెలు మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నల్ల చిన్నయ్యకు చెందిన 100 గొర్రెలను తన పొలం దగ్గర మంద చేసి ఉదయం ఇంటికి వచ్చాడు. ఉదయం 10 గంటల సమయంలో ఊరకుక్కలు ఆ మందపై దాడి చేయడంతో 40 గొర్రెలు మృతి చెందాయి. గొర్రెలను మేపేందుకు పొలానికి వెళ్లగా గొర్రెలు మృతి చెంది కుప్పలుగా పడి ఉన్నాయి. కష్టపడి పొషించిన గొర్రెలు ఒకేసారి మృతి చెందడంతో రైతు దిక్కుతోచి స్థితిలో ఉన్నాడు. దీంతో రైతుకు తీవ్రంగా ఆర్థిక నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తమకు ఆర్థిక సహాయం అందించాలని ఆయన కోరుతున్నాడు. -
ప్రతిపక్షాలు పాములు, కుక్కలు: అమిత్
ముంబై: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా ఏర్పాడాలనుకుంటున్న ప్రతిపక్ష పార్టీలపై బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా శుక్రవారం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష పార్టీలను ఆయన పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులతో పోల్చారు. తర్వాత ఆ పార్టీలను జంతువులతో పోల్చడం తన ఉద్దేశం కాదని షా వివరణ ఇచ్చారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబైలో జరిగిన ర్యాలీలో అమిత్ పాల్గొన్నారు. ‘2019 ఎన్నికలకు కౌంట్‌డౌన్ మొదలైంది. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారీ వరదలు వచ్చినప్పుడు అంతా కొట్టుకుపోతుంది. వటవృక్షం (మర్రి చెట్టు) మాత్రమే వరదను తట్టుకుని నిలబడుతుంది. పాములు, ముంగిసలు, కుక్కలు, పిల్లులు ఇతర జంతువులన్నీ అప్పుడు వరద నుంచి తమను తాము కాపాడుకోవడానికి వటవృక్షం మీదకే చేరుతాయి. ప్రధాని మోదీ అనే వరద కారణంగా ఆ జంతువులు, సరీసృపాలన్నీ ఎన్నికల కోసం దగ్గరవుతున్నాయి’ అని షా తన ప్రసంగంలో అన్నారు. ప్రతిపక్ష పార్టీలను జంతువులతో పోల్చడం అమిత్ దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ పేర్కొంది. ఇవి ఆయన ఆలోచనా విధానాన్ని స్పష్టం చేస్తున్నాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. నా ఉద్దేశం అది కాదు.. తర్వాత షా మీడియాతో మాట్లాడుతూ సారూప్య సిద్ధాంతాలు లేని పార్టీలన్నీ మోదీ భయం వల్లనే ఏకమయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయని చెప్పడమే తన ఉద్దేశమన్నారు. ‘పాముకు, ముంగిసకు ఎన్నో తేడాలున్నాయి. ఎంతో భిన్నమైన ఎస్పీ, బీఎస్పీలు కలసి ఇటీవల బీజేపీపై పోటీ చేశాయి. కూటమి కోసం ప్రయత్నిస్తున్న ఇలాంటి పార్టీల సిద్ధాంతాలు కూడా వేర్వేరు. కానీ ఎన్నికల కోసం అవి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి’ అని అన్నారు. రిజర్వేషన్లను తొలగించం.. తొలగించనివ్వం ర్యాలీలో రిజర్వేషన్లపై షా మాట్లాడుతూ ‘రాహుల్, పవార్ (కాంగ్రెస్, ఎన్సీపీల అధ్యక్షులు)! ఇది వినండి. రిజర్వేషన్లను బీజేపీ తొలగించదు. మీరు అలా చేయాలనుకున్నా మేం చేయనివ్వం’ అని అన్నారు. ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లను తాము ఎత్తేయాలనుకుంటున్నట్లు రాహుల్, మరికొందరు దుష్ప్రచారం చేస్తున్నారనీ, అది పూర్తిగా అబద్ధమని షా స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం సమాజంలోని అన్ని వర్గాలకూ ఎంతో చేసిందని ఆయన పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వ పనితీరును చూసి 2019లో ఓటేయాల్సిందిగా ప్రజలను కోరతామనీ, ప్రతిపక్షాల్లాగా ఒట్టి హామీలు ఇవ్వబోమన్నారు. సిద్ధరామయ్య చెబుతున్నట్లు తాను జైన మతస్తుడను కాదనీ, హిందూ వైష్ణవుడనని చెప్పారు. -
కుక్కలు చంపేస్తున్నా..దిక్కులేదు
బాబోయ్.. కుక్కలు కరుస్తున్నాయి.. దయచేసి వాటి బారినుంచి తమను కాపాడండిఅంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు అధికారులకు మొరపెట్టుకుంటున్నా అది చెవిటివాడి ముందు శంఖమూదినట్లే అవుతోంది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో కుక్కల బారిన పడి పెద్దలు, పిల్లలు, వృద్ధులు, మహిళలు ఇలా అనేకమంది గాయపడుతున్నారు. ఇక రాత్రి సమయాల్లో ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారి పరిస్థితి దిన దిన గండం నూరేళ్ల ఆయుష్షులా తయారైంది. కుక్కలు వెంటబడితే వాటి బారి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదాల బారిన పడుతున్నవారు అనేక మంది ఉన్నారు. కడప అర్బన్ : కడప నగరంలో బుధవారం ఓ పిచ్చికుక్క బీభత్సం సృష్టించింది. ఉదయం 6 గంటల నుంచి కరవడమే పనిగా పెట్టుకుంది. ఎర్రముక్కపల్లె, ద్వారకా నగర్ ప్రాంతాల్లో కనిపించిన వారందరినీ కరిచింది. ఆ రెండు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 20 మందికి పైగా ప్రజలు తీవ్రంగా గాయపడ్డారు. మా అమ్మ మీద పడి కరిచేసింది: సరస్వతి కుమార్తె హారతి మా ఇంటి సమీపంలో ఉండగా ఓ పిచ్చికుక్క వచ్చి ఉన్నట్లుండి మా అమ్మ సరస్వతమ్మ మీదపడి తీవ్రంగా గాయపరిచింది. తలకు, కుడి చేతికి, ఎడమకాలికి కరిచేసింది. ఉదయం నుంచి కరుస్తున్నా పట్టించుకోలేదు : కమల మాది ద్వారకా నగర్. మా అన్న కుమారుడు తన్వీష్ కుమార్‌ను పాఠశాల నుంచి ఇంటికి తీసుకుని వస్తుండగా నన్ను పిచ్చికుక్క కరిచింది. తర్వాత తన్వీష్ను గాయపరిచింది. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఒకే పిచ్చికుక్క కరుస్తున్నా , చుట్ట పక్కల వారు నగర పాలక సంస్థ వారికి సమాచారం ఇచ్చినా పట్టించుకోలేదు. పిచ్చికుక్క బాధితులకు ప్రత్యేక వైద్య సేవలు అందిస్తాం : రిమ్స్ సూపరింటెండెంట్ కడప నగరంలో పిచ్చికుక్క కాటు బారిన పడిన వారు ఎవరున్నా రిమ్స్‌లో ప్రత్యేక వైద్యసేవలను అందిస్తామని రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ టి. గిరిధర్, ఆర్ఎంఓ డాక్టర్ జంగం వెంకట శివ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి కుక్కకరిచిన 6–12 గంటలలోపు ‘ఇమ్యునో గ్లోబిలిన్స్’ ఇంజక్షన్‌ను ఇస్తామన్నారు. ఈ ఇంజక్షన్ ఏఆర్వీ కన్నా రెట్టింపుగా పనిచేస్తుందని తెలిపారు. బాధితులు త్వరగా కోలుకునేలా చేస్తామన్నారు. కుక్కల నియంత్రణకు చర్యలేవీ..! గతంలో వీధి కుక్కలను పట్టుకెళ్లి చంపేసేవారు. ఆ తర్వాత జంతు సంరక్షణ చట్టం పేరుతో.. కుక్కలను చంపకూడదనే నిర్ణయంతో వాటిని అలాగే వదిలేశారు. దీంతో ఏ వీధిలో చూసినా పదుల సంఖ్యలో కుక్కలు పెరిగి పోయాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా అవి జనంపై దాడి చేస్తున్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసి తిరిగి అక్కడే వదిలేసే కొత్త కార్యక్రమం కొద్ది నెలల క్రితం చేపట్టి వదిలేశారు. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించినా కుక్కలు మాత్రం అక్కడే ఉంటుండటంతో ప్రతి ఒక్కరూ వాటి బారిన పడక తప్పడం లేదు. కుక్కలను చంపడం పాపం.. నేరం.. ఘోరం.. అనుకుంటే.. వాటి చేతిలో ప్రాణాలు పోగొట్టుకుంటున్నవారు.. తీవ్రంగా గాయపడుతున్న వారి పరిస్థితిని ఏమనాలి.. అందుకే కుక్కలను పట్టుకెళ్లి జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన అడవుల్లో వదిలేస్తే ఎవరికీ ఏ సమస్య ఉండదని పలువురు సూచిస్తున్నారు. ఇలా చేయడమొక్కటే కుక్కల బారినుంచి బయటపడేందుకు శాశ్వత పరిష్కారం అని పేర్కొంటున్నారు. అధికారులు ఈ దిశగా చర్యలు తీసుకోవడం అవసరం. -
కుక్కల దాడిలో పద్నాలుగు గొర్రెలు హతం
నిజాంపేట(మెదక్): నిజాంపేట మండలంలోని నందగోకుల్ గ్రామంలో ఆదివారం రాత్రి కుక్కలు కొట్టంపై దాడి చేయడంతో పద్నాలుగు గొర్రెలు చనిపోయా యి. మరో 8 గొర్రెలు గాయపడ్డాయి. గ్రామస్తుల కథనం ప్రకారం కూడవెళ్లి చంద్రం ఆదివారం తన గొర్రెలను కొట్టంలోకి పంపాడు. రాత్రి సమయంలో చంద్రం వాటికి కాపలా ఉండేందుకు అ క్కడే పడుకున్నాడు. మధ్యలో లేచి చూసేసరికి గొర్రెల కొట్టంలోకి చేరిన నాలుగు కుక్కలు దాడి చేసి పద్నాలుగు జీవాలను బలిగొన్నాయి. మరో 8 గొర్రెలను గాయపర్చాయి. ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలు మృత్యువాతపడ్డాయి. దీంతో బాధితుడికి సుమారు రూ. 60 వేల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. దీనిపై గ్రామ రెవెన్యూ అధికారి రమేష్ పంచనామా చేసి పైఅధికారులకు సమాచారాన్ని అందజేశారు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్ ప్రమీల కోరారు. -
కుక్క కాటు అనివార్యమేనా?
కరవనంతవరకు వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరని నానుడి. వీధికుక్కల్లో రోగక్రిములను హరించే సమర్థ విధానం దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. తన వీధుల్లో వీధికుక్కలు లేని ఒక నగరం, పట్టణం లేదా గ్రామం పేరు చెప్పండి. తన దారిన తాను పోతున్న వాడి జీవితాన్ని కల్లోలపర్చే కుక్క కాట్ల వల్ల అతగాడు రేబిస్ వ్యాధిబారిన పడి మరణించవచ్చు. గ్రామ పంచాయతీ నుంచి పెద్ద మునిసిపల్ కార్పొరేషన్ల దాకా వీధికుక్కల నిర్వహణలో కాస్తంత వైవిధ్యం ప్రదర్శించగల పౌర సంస్థను చూపించండి మరి. వ్యవస్థీకృతం అని మనం చెప్పుకుంటున్న మన సమాజంలో కుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవాలను సరైన నిష్పత్తిలో గుర్తించడం లేదు. భారత్‌లో 30 కోట్ల వీధి కుక్కలు ఉన్నట్లు కొన్ని సంవత్సరాల క్రితం బీబీసీ పేర్కొంది. ప్రతి సంవత్సరం 20 వేలమంది రేబిస్ వ్యాధి కారణంగా చనిపోతున్నారని కూడా తెలిపింది. అయితే ఈ ప్రకటన వివాదం రేపింది. వీధికుక్కల కంటే పెంపుడు కుక్కలే మనుషులను ఎక్కువగా కరుస్తున్నాయని వాదనలు ఉన్నాయి కూడా. కాబట్టి వీధికుక్కలు పెద్ద సమస్యేమీ కాదు. కొన్నేళ్ల క్రితం ముంబై, ఠాణే నగరాల్లో ఒక పిల్లాడిని కుక్క కరిచింది. ఆ పిల్లాడికి నూరు కుట్లు పడ్డాయి. మరో ఘటనలో ఒక కుక్క ఆ ప్రాంతంలోని మరో కుక్కతో కలిసి ఒక చిన్న పిల్లాడిని అకారణంగా కరిచింది. ఇక పోతే, ప్రపంచంలోని ఏకైక పట్టణ ప్రాంత జాతీయ పార్కు అయిన సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌లోని చిరుతపులులు పార్క్ నుంచి బయటకు వచ్చి పరిసర ప్రాంతాల్లో వేటాడేవి. ఎందుకంటే వేటాడ్డానికి వాటికి సమృద్ధిగా వీధికుక్కలు దొరికేవి. దీంతో ఆ చిరుతపులులను కాల్చి చంపాలని లేక పట్టుకోవాలని, వాటిని మరోచోటికి పంపాలని జనం అభిప్రాయాలు చెప్పేవారు. అంతే కానీ వీధికుక్కల ఉపద్రవాన్ని అరికట్టాల్సిందని డిమాండ్ చేస్తూ వీరిలో ఒక్కరు కూడా పురపాలక శాఖ అధికారులను ఒత్తిడికి గురిచేసేలా ఏ చర్యలకూ దిగేవారు కాదు. నిజానికి ఈ సమస్యను నిర్లక్ష్యం చేసేవారు లేదా జనం ప్రేమతో తిండి పెడుతుండటం వల్ల వీధికుక్కల జనాభా ఇబ్బడి ముబ్బడిగా పెరిగేది. అయితే, కుక్కలకు టీకాలు వేయడం కానీ, వాటిలో రోగక్రిములు లేకుండా జాగ్రత్తలు చేపట్టడం కానీ చేసేవారు కాదు. కుక్కల్లోని రోగక్రిములను నాశనం చేయడం ఒక్కటే వీధికుక్కల జనాభాను నివారించలేదని కొన్నేళ్ల క్రితం, ముంబై పురపాలక సంస్థకు చెందిన ఆరోగ్యవిభాగం అధికారి వివరించారు. అలాగని ఇతర సమర్థవంతమైన కార్యక్రమాలు లేకపోవడంతో కష్టాలు మరింతగా పెరిగేవి. కేవలం రోగక్రిముల నివారణ అనే ఒక్క చర్య ద్వారా కుక్కల జనాభాను అరికట్టడానికి పదేళ్ల కాలం పట్టింది. అయితే విస్తృతస్థాయిలో స్టెరిలైజేషన్, రేబిస్ నిరోధక చర్యలను చేపట్టడం నిలకడగా సాగించాలనే ఆలోచనను పురపాలక సంస్థ అస్సలు పట్టించుకునేది కాదు. ఇది మరొక పరిణామానికి దారితీసేది. పెంపుడు కుక్కలను పెంచుకోని శునక ప్రేమికులు రెండు కారణాలవల్ల వాటికి తిండి పెట్టేవారు. వాటిపై మమత లేక పేరు కోసం వారు వీధికుక్కలకు అలా తిండి పెట్టేవారు. ఇక పెంపుడు కుక్కలతో కరిపించుకునే యజమానులు (రాజ్‌థాక్రే భార్యకు పెంపుడు కుక్క కరిస్తే 60 కుట్లు పడ్డాయి) వీధికుక్కల నుంచి వచ్చే ప్రమాదాన్ని అసలు చూడలేరు. రాజకీయంగా పలుకుబడి కలిగిన థాక్రే వంటి నేతలు (ఎన్నికల్లో గెలుపు సాధనకు ఇది పనిచేయదనుకోండి) ఆచరణ సాధ్యమయ్యే వీధికుక్కల పాలసీపై ఎలాంటి ఒత్తిడీ చేయరు. సమాజంలో న్యూసెన్స్ కలిగిస్తున్న వీధి కుక్కలను ఏరిపారేయడానికి ముంబై హైకోర్టు అనుమతించింది. కానీ అపెక్స్ కోర్టు దీనిపై స్టే విధించి వీధికుక్కల్లో రోగ క్రిములను తొలగించే కార్యక్రమాన్ని విస్తృత స్థాయిలో అమలుచేసే విధానాన్ని తీసుకురావాలని ఆదేశించింది. దేశంలోని అన్ని పురపాలక సంస్థల్లో అన్ని స్థాయిల్లో ఇలాంటి విధానం ఇంకా ఆవిర్భవించాల్సి ఉంది. ఎందుకంటే ఎవరినైనా కుక్క కరవకుంటే వీధికుక్కల సమస్య గురించి ఎవరూ పట్టించుకోరన్న అభిప్రాయం ఉంది. అలాగే అకారణంగా తన నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసిన కుక్కను చంపుతానని ఆ తండ్రి ప్రమా ణం చేశాడు. మరొక పిల్లాడిని కూడా కుక్క కరిస్తే వందలాది కుట్లు వేయించాల్సి వచ్చింది. ఇదీ కుక్కకాటు కథ. వీధికుక్కల వల్ల కలుగుతున్న ఉపద్రవం కథ. మహేశ్ విజాపుర్కర్, వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్: mvijapurkar@gmail.com -
కుక్క పగబడితే ఇలా ఉంటుందా.. వైరల్
సాక్షి, న్యూఢిల్లీ : నాకు కోపం వస్తే మనిషిని కాదు అంటుంటాం కదా... మరి కుక్కకు కోపం వస్తే ఏమౌతుంది. మామూలు వీధికుక్క కరవడానికొస్తే రెండు దెబ్బలు కొడితే పారిపోతుంది. కానీ బలిష్టమైన పిట్ బుల్ డాగ్ పగబట్టినట్లు మీదకు దూకితే ఏమవుతుంది. పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఢిల్లీలోని ఉత్తమ్ నగర్లో జరిగిన ఈ ఘటనను చూస్తే మీకే అర్థమవుతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ కుక్క మొదట ఇంటి బయట కూర్చున్న పిల్లల వైపుగా దూసుకొచ్చింది. అక్కడున్న ఓ అబ్బాయిపై పగపట్టినట్లుగా దాడి చేసి కరవటం మొదలెట్టింది. ఓ మహిళ శాయశక్తులా విడిపించేందుకు యత్నించినా కుక్క వదిలి పెట్టలేదు. మరో మహిళ పెద్ద కర్రతో కొట్టి కుక్కను తరమాలనుకుంది. కర్రతో పలుమార్లు కుక్కను కొట్టి విడిపించే యత్నం చేసింది. ఈ క్రమంలో ఆ దెబ్బలు కుక్కకు కాకుండా ఆ అబ్బాయికే ఎక్కువగా తగిలాయి పాపం. దాడి గమనించిన మరోవ్యక్తి కుర్చీతో గట్టిగా కొట్టడంతో అబ్బాయిని వదిలిపెట్టింది. కానీ తనను కుర్చీతో కొట్టిన వ్యక్తిని కరించేందుకు వెంబడించింది. ఏమైందో ఏమో మళ్లీ తిరిగొచ్చిన కుక్క ఆ అబ్బాయిని మరోసారి కరిచేందుకు వెంబడించింది. కుక్క పగబడితే ఇలాగే ఉంటుందేమోనని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
కుక్కకు కోపం వస్తే ఎలా ఉంటుందో చూడండి
-
శునకానికి పెద్దకర్మ
బుగ్గారం(ధర్మపురి): మానవ సంబంధాలు మంటగలుస్తున్న ఈ రోజుల్లో జం తువులపై తమకు ఉన్న ప్రేమ అమితమైనదని చాటిచెప్పారు మండలంలోని చందయ్యపల్లె గ్రామానికి చెందిన గాదె శంకరయ్య,చిలుకవ్వ దంపతులు. తమ కన్న బిడ్డలతో సమానంగా పెం చుకు న్న బబ్బి అనే శునకం ఇటీవల చనిపోవడంతో సంప్రదాయబద్ధంగా దశదినకర్మ నిర్వహించారు. శంకరయ్య– చిలుకవ్వ దంపతులకు కొన్నాళ్ల వరకు పిల్లలు కలుగకపోవడంతో పలు ఆలయాలు తిరిగారు. క్రమంలో వారి బంధువుల్లో కొందరు శునకం కూనలకు బారసాల జరిపితే పిల్లలు పుడతారని చెప్పడంతో ఆ తంతు జరిపారు. కొద్దికాలానికి వారికి కుమారుడు నాగరాజు, కుమార్తె పూజిత జన్మించారు. దీంతో వారికి శునకాలపై విశ్వాసం పెరిగింది. అప్పటినుంచి వాటిని తమ పిల్లలతో సమానంగా పెంచుకున్నారు. కొద్దిరోజుల క్రితం వారి పెంపుడు శునకం బబ్బి చనిపోయింది. గత బుధవారం సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించారు. వారం రోజులకు బుధవారం పెద్దకర్మ జరిపించారు. దాదాపు 200 మందికి భోజన ఏర్పాట్లు చేశారు. -
శునకం ప్రధాన పాత్రలో చిత్రం
జంతువులు నటించిన చాలా చిత్రాలు గతంలో తెరపైకొచ్చాయి. అయితే జంతువులే ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రాలు ఎక్కువగా హాలీవుడ్‌లోనే రూపొందాయి. అలాంటిది ఒక కుక్క ప్రధాన పాత్రలో భారతీయ సినీ పరిశ్రమలోనే తొలిసారిగా ఏడ్వెంచర్ కథా చిత్రాన్ని తెరకెక్కించనున్నట్లు దర్శకుడు శక్తివేల్ పెరుమాళ్స్వామి తెలిపారు. ఈయన ఇంతకుముందు ఉరుమీన్ అనే వైవిధ్యభరిత కథా చిత్రాన్ని రూపొందించారు. కాల్టైల్ సినిమాస్, యునైటెడ్ ఫిలింస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం గురించిన ప్రకటన, ఫస్ట్‌లుక్ ఫోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది. ఈ చిత్రం వివరాలను దర్శకుడు తెలుపుతూ కుక్కకు, మనిషికి మధ్య అనుబంధం, ఒకరికి ఒకరు చేసుకునే సాయం గురించి ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. కేరళలో జరిగిన యథార్థ సంఘటన ఆధారంగా పలు ఆసక్తికరమైన అంశాలతో తెరకెక్కిస్తున్న ఎండ్వేంచర్ కథా చిత్రం ఇదని తెలిపారు. చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన చెప్పారు. -
స్మగ్లింగ్ నిరోధానికి డాగ్‌స్క్వాడ్
జన్నారం(ఖానాపూర్): జిల్లాలో స్మగ్లింగ్ నిరోధానికి డాగ్‌స్క్వాడ్ ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా అటవీ సంరక్షణ అధికారి రామలింగం తెలిపారు. బుధవారం ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురష్కరించుకుని మండల కేంద్రంలో వివిధ పాఠశాలల విద్యార్థులతో కలిసి అవగాహన ర్యాలీ నిర్వహించారు. అంబేద్కర్ విగ్రహం ఎదుట మానవహారం ఏర్పాటు చేశారు. ఎఫ్‌డీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మానవ మనుగడకు ఉపయోగపడే అడవుల సంరక్షణ అందరి బాధ్యత అని పేర్కొన్నారు. అడవులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉందన్నారు. కవ్వాల్ టైగర్‌జోన్‌లో త్వరలో టైగర్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లు ఏర్పాటు చేస్తామన్నారు. డాగ్‌స్క్వాడ్ ద్వారా స్మగ్లింగ్‌ను పూర్తిగా నిరోధించే దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. డాగ్ ద్వారా ఎక్కడ టేకు కలప దాచి ఉన్న బయటకు వస్తుందన్నారు. వాహానాల ద్వారా తరలించినా డాగ్‌స్క్వాడ్ ద్వారా పట్టుకోవచ్చన్నారు. అలాగే అడవి లోపల నివాసం ఉంటున్న వారిని ఇతర ప్రాంతాలకు తరలించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. టైగర్‌జోన్ పరిధిలో కోర్ ఏరియాలో ఉండే 27 గ్రామాల్లో పర్యటించి అడవుల గురించి అవగాహన కల్పిస్తామన్నారు. అడవుల రక్షణ, వన్యప్రాణుల సంరక్షణలో అలసత్వం చేసే అధికారులపై చర్యలుంటాయన్నారు. సమావేశంలో జన్నారం, ఇందన్పల్లి, తాళ్లపేట్ రేంజ్ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, దేవిదాస్, సెక్షన్ అధికారి ప్రకాశ్, వివిధ రేంజ్ పరిధిలోని అటవీ అధికారులు పాల్గొన్నారు. -
‘కాలా’ శునకానికి కోట్లలో బేరం
సాక్షి, పెరంబూరు: సినీ నటుడు రజనీకాంత్ నటించిన కాలా చిత్రంలో ఉన్న ఓ శునకానికి కోట్లలో బేరాలు రావడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశమైంది. అది ఒక సాధారణ కుక్క అట. అయితే సిమోన్ అనే శునకాల శిక్షకుడు ఈ కుక్కకు చక్కగా ట్రైనింగ్ ఇచ్చి కాలా చిత్రంలో నటింపజేశారట. దీనికి మణి అని నామకరణం కూడా చేశాడట. సినిమాల్లో జంతు జీవాలను ఉపయోగించుకున్న తర్వాత యజమానుల వెంట వెళ్లిపోతుంటాయి. అయితే శునకరాజు మణిపై రజనీ పడటంతో దానికి కోట్ల రూపాయల్లో బేరం పలుకుతోంది. మలేషియాకు చెందిన రజనీకాంత్ అభిమానులు ఇప్పటికే రూ.2 కోట్లు ఆఫర్ చేశారట. అయితే మణి అనే ఆ శునకాన్ని దాని శిక్షకుడు సిమోన్ విక్రయించడానికి నిరాకరించారని సమాచారం. -
కుక్కల దాడిలో 40 గొర్రెపిల్లల హతం
డోన్ టౌన్ : కృష్ణగిరి మండలం కర్లకుంట శివారులో ఆదివారం కుక్కలు దాడి చేయడంతో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. బాధితుల వివరాల మేరకు..మండలంలోని వెంకటాపురం గ్రామానికి చెందిన గొల్ల శ్రీనివాసులు, వీరకుమార్ మేపు కోసం మందను కృష్ణగిరి మండలం కర్లకుంటకు తీసుకెళ్లారు. ఉదయం గొర్రెపిల్లలను కల్లం(ముళ్లకంప మధ్య)లో ఉంచి గొర్రెల మేపు కోసం బయటకు తీసుకెళ్లారు. ఇంతలో ఊరకుక్కలు కల్లంలో ఉన్న గొర్రె పిల్లలపై దాడి చేశాయి. ఘటనలో 40 గొర్రెపిల్లలు మృతి చెందాయి. మరో పదింటికి తీవ్రగాయాలయ్యాయి. కొద్దిసేపటి తర్వాత ఘటనా స్థలికి చేరుకున్న కాపరులు అక్కడ ఉన్న దృశ్యాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. దాదాపు రూ.1.6 లక్షల నష్టం వాటిల్లినట్లు బాధితులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని వారు కోరారు. -
భౌబోయ్!
జిల్లాలో తరచూ ఏదో ఒక ప్రాంతంలో వీధి కుక్కలు చెలరేగిపోతున్నాయి. జనంపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వీటి బెడద మరీ ఎక్కువగా ఉంది. నియంత్రణ చర్యలపై ప్రభుత్వం ఏ మాత్రమూ దృష్టి సారించడం లేదు. పెంపుడు కుక్కలకు కూడా రేబిస్ నివారణ టీకాలు నామమాత్రంగానే వేస్తున్నారు. కర్నూలు(అగ్రికల్చర్): వీధి కుక్కల నియంత్రణ చర్యలను అర్బన్ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు చేపట్టాల్సి ఉంటుంది. వీటి సంతతి తగ్గించేందుకు పశుసంవర్ధక శాఖ అధికారులు శస్త్ర చికిత్సలు చేయాలి. జిల్లాలో ఇటు అర్బన్ ప్రాంతాల్లోనూ, అటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వీధి కుక్కల సంతతి అడ్డూ అదుపు లేకుండా పెరిగిపోతూనే ఉంది. 2012 పశుగణన ప్రకారం జిల్లాలో 65 వేల వీధి కుక్కలు ఉండగా, నేడు వీటి సంఖ్య 1.25 లక్షలకు చేరింది. కృష్ణగిరి మండలం చిట్యాలలో చిన్నారి ఇబ్రహీంను వీధి కుక్కలు కొరికి చంపాయంటే వీటి వల్ల ప్రమాదం ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్చు. ఈ ఘటన తర్వాత కూడా అధికారులు స్పందించలేదు. కర్నూలు నగరపాలక సంస్థలో వీధికుక్కల నియంత్రణకు కొంత ప్రయత్నం జరిగినా తర్వాత గాలికొదిలేశారు. కర్నూలు నగరంతో పాటు నంద్యాల, ఆదోని, డోన్, నందికొట్కూరు, ఎమ్మిగనూరు తదితర పట్టణ ప్రాంతాల్లో, మేజర్, మైనర్ పంచాయతీల్లో శునకాల బెడద ఎక్కువగా ఉంది. జూనోసిస్ దినోత్సవం రోజునే టీకాలు పశుసంవర్ధక శాఖ ప్రతి ఏటా జూలై 24న జూనోసిస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని పెంపుడు కుక్కలకు రేబిస్ టీకాలు నామమాత్రంగా వేస్తోంది. వీధి కుక్కల గురించి అసలు పట్టించుకోవడం లేదు. జిల్లాలో వీధి కుక్కలు 1.25 లక్షల వరకు ఉండగా, పెంపుడు కుక్కలు దాదాపు ఎనిమిది వేల వరకు ఉన్నాయి. పెంపుడు కుక్కల నుంచి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యజమానులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వీధికుక్కలను ఏ మాత్రమూ పట్టించుకోకుండా పశుసంవర్ధకశాఖ, మున్సిపాలిటీలు, పంచాయతీలు ప్రజలపైకి వదులుతున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 2020 సంవత్సరానికల్లా భారత దేశాన్ని రేబిస్ రహితంగా తీర్చిదిద్దాలని భారత జంతు సంక్షేమ సంస్థ లక్ష్యంగా నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా క్షేత్ర స్థాయిలో చర్యలు మాత్రం లేవు. నియంత్రణే ముఖ్యం పెంపుడు కుక్కలతో పాటు వీధికుక్కలకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి అవకాశాలున్నాయి. కర్నూలులో 9,600 వీధికుక్కలు ఉండగా.. ఇందులో 25 శాతం వరకు జనన నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ఈ బాధ్యతను స్వచ్ఛంద సంస్థలకు అప్పగించినప్పటికీ అవి జవాబుదారీతనంతో పనిచేయలేదు. జిల్లాలోని మిగిలిన ప్రాంతాల్లో ఈ ఊసే లేదు. ఆపరేషన్ అయిన కుక్కలు దీర్ఘాయుస్సుతో బతకడమే కాకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కరవడం కూడా చాలా తక్కువ. చెవిని కత్తిరించి వీ ఆకారంలో ఉంటే ఆపరేషన్ అయ్యిందని గుర్తు. పెంపుడు కుక్కలకు కూడా విధిగా జనన నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించాలి. ప్రపంచ ఆరోగ్య సంçస్థ తన నివేదికలో 75 శాతం వీధికుక్కలకు రేబిస్ టీకాలు వేయడం వల్ల ఆ ప్రాంతాన్ని రేబిస్ రహితంగా మార్చవచ్చని సూచించింది. వీటికి మూడు నెలల వయస్సులో తప్పనిసరిగా టీకాలతో పాటు ప్రతి ఏటా బూస్టర్ డోస్ వేయించాలి. అప్పుడే వాటి వల్ల ప్రజలకు ప్రమాదం ఉండదు. ఈ నెల 21న ప్యాపిలి మండలం హుసేనాపురంలో ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. కన్పించిన వారినల్లా కరుస్తూ వెళ్లింది. ఈ క్రమంలో దాదాపు పదిమంది గాయపడ్డారు. ఇదే రోజు గూడూరు మండలం చనుగొండ్ల, మునగాలలో నలుగురు వ్యక్తులు వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు ఇలా చేస్తే కుక్క కాటు నుంచి తప్పించుకోవచ్చు .. - కుక్క దగ్గరికి వస్తే కదలకుండా నిలబడాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగెత్తరాదు. కళ్లలోకి తదేకంగా చూడరాదు. కుక్క పిల్లల దగ్గరికి వెళ్లరాదు. - నిద్రిస్తున్నప్పుడు, తింటున్నప్పుడు, పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఏ రకంగానూ ఇబ్బంది పెట్టరాదు. - కుక్క దాడి చేసేటప్పుడు ముఖాన్ని పంచె లేదా తువ్వాలు తదితర వాటితో కప్పుకోవాలి. ఏమీ లేకపోతే చొక్కాను పైకి జరుపుకోవాలి. లేదా ముఖాన్ని చేతులతో కప్పుకోండి. ముఖంపై కరిస్తే ఇన్ఫెక్షన్ మెదడుకు త్వరగా సోకుతుంది. దీనివల్ల ప్రాణహాని ఉండే ప్రమాదం ఉంది. - కుక్క కోపంగా దగ్గరికి వస్తే నేల వైపు చూస్తూ దానికి దూరంగా మెల్లగా నడవాలి. నియంత్రణ చర్యలు తీసుకోవాలి వీధి వీధినా కుక్కలు ఉంటున్నాయి. వాటిని దాటుకొని పోవాలంటేనే భయమేస్తోంది. మరోవైపు ఆసుపత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలు అందుబాటులో ఉండడం లేదు. వీధి కుక్కల నియంత్రణకు స్థానిక సంస్థలు చొరవ చూపాలి. – కర్రెక్కగారి నాగిరెడ్డి, వెల్దుర్తి రేబిస్ అత్యంత ప్రమాదకరం రేబిస్ వ్యాధి అత్యంత ప్రమాదకరం. కుక్క కాటు వల్ల ఇది సోకుతుంది. వ్యాక్సిన్ వేయించిన కుక్క కాటు వల్ల ప్రమాదం లేదు. వేయించని కుక్క కాటు అత్యంత ప్రమాదకరం. కావున వెంటనే యాంటీ రేబిస్ టీకా వేయించుకోవాలి. కరిచిన వెంటనే చికిత్స తీసుకుంటే ఫలితం ఉంటుంది. పెంపుడు కుక్కలకు విధిగా వ్యాక్సిన్ వేయించాలి. – డాక్టర్ మల్లికార్జున్, కర్నూలు -
భౌబోయ్ కుక్కలు..!
సాక్షి, హైదరాబాద్ : గ్రామ సింహాలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రోడ్లపై తిరగాలంటేనే భయపడేలా చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనాలపైకి ఎగబడుతున్నాయి. దీంతో కుక్కకాటు బారిన పడేవారి సంఖ్య భారీగా పెరుగుతోంది. నగరాలు, పట్టణాల కంటే గ్రామాల్లోనే కుక్కకాటు బాధితుల సంఖ్య ఎక్కువగా ఉంటోంది. గ్రామపంచాయతీలకు సరిపడా నిధుల్లేకపోవడంతో కుక్కల నియంత్రణకు శాశ్వత చర్యలు తీసుకునే పరిస్థితి ఉండట్లేదు. దీంతో కుక్కల సంఖ్య పెరుగుతోంది. కుక్కకాటు బాధితులూ పెరుగుతున్నారు. సకాలంలో వైద్యం అందకపోవడంతో కుక్కకాటు వల్ల రేబిస్ సోకి మరణాలు సంభవిస్తున్నాయి. రేబిస్ కారణంగా ఏటా 500 మంది మరణిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో రేబిస్ నియంత్రణ ఔషధాలూ కరువవుతున్నాయి. గ్రామ పంచాయతీలకే నగరాలు, పట్టణాల్లో కుక్కల నియంత్రణ అంతా నగర పాలక సంస్థలు, మున్సిపాలిటీల పర్యవేక్షణలో ఉంటోంది. గ్రామాల్లో ఆయా గ్రామపంచాయతీలే ఈ బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. గ్రామాల వెలుపల వాటిని వదిలేయడంతోనే సరిపెడుతున్నారు. దీంతో వీధి కుక్కలు మళ్లీ ఊళ్లోకి వస్తున్నాయి. కుక్కల నియంత్రణలో దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోవడంతో అసలు సమస్యలు పెరుగుతున్నాయి. వీటికి ఆహారం దొరకక అసహనంతో మనుషులపై దాడులు చేస్తున్నాయి. దీంతో కుక్కకాటు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఏటా 1.7 లక్షల మంది బాధితులు ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఏటా సగటున 1.70 లక్షల మంది కుక్కకాటు బారిన పడుతున్నారు. హైదరాబాద్, వరంగల్ మహానగరాల్లో కుక్కకాటు కేసులు వైద్య, ఆరోగ్య శాఖ గణాంకాల్లో చేరట్లేదు. ఇక్కడి బాధితులలో ఎక్కువ మంది ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స చేసుకుంటుండటంతో అధికారులు అధికారిక గణాంకాల్లో నమోదు చేయట్లేదు. పాత నల్లగొండ జిల్లాలో ఎక్కువ సంఖ్యలో కుక్కకాటు బాధితులు ఉన్నట్లు తెలిసింది. -
చనిపోయిన యజమానికి 11ఏళ్లు కాపలా!
బ్యూనస్ ఎయిర్స్: విశ్వాసానికి మారు పేరు శునకాలు. అర్జెంటీనాలో ఓ శునకం తన యజమానిపై ఉన్న విశ్వాసాన్ని ఏళ్ల తరబడి నిరూపించుకుంది. తాజాగా ఆ శునకం చనిపోయింది. దీంతో దాని యజమాని కుటుంబంలో విషాదం నిండుకుంది. అదేంటీ కుక్క చనిపోతే ఎందుకంత బాధ అంటారా. ఆ వివరాల్లోకెళ్తే.. అర్జెంటీనా విల్లా కార్లోస్ పాజ్, కార్డోబాకు చెందిన మిగ్యేల్ గజ్‌మ్యాన్ అల్సాటియన్ జాతికి చెందిన కాపిటన్ అనే చిన్న కుక్కపిల్లను 2005లో కొన్నాడు. అప్పుడు కాపిటన్ వయసు దాదాపు రెండేళ్లు. గజ్‌మ్యాన్ తన కుమారుడు డామియన్(15)కు అదే సమయంలో పెట్ డాగ్ కాపిటన్‌ను కానుకగా ఇచ్చాడు. యజమాని గజ్‌మ్యాన్ ఆ కుక్క పిల్లను ఎంతో ముద్దుచేసేవాడు. ఆయన ఎక్కడికి వెళ్లినా కాపిటన్ గజ్మ్యాన్నే అనుసరించేది. కానీ మరుసటి ఏడాది (2006)లో గజ్‌మ్యాన్ మృతిచెందాడు. కొన్నిరోజుల పాటు విషాధంలో ఉన్న కుటుంబసభ్యులు ఆ తర్వాత మామూలు మనుషులయ్యారు. కానీ విశ్వాసానికి మారుపేరైన కాపిటన్ తన యజమాని మరణాన్ని తట్టుకోలేక పోయింది. ఇంటి నుంచి వెళ్లిపోవడంతో కాపిటన్ వేరే ఇంటిని చూసుకుందో, లేక చనిపోయిందోనని గజ్‌మ్యాన్ ఫ్యామిలీ భావించింది. 2007లో గజ్మ్యాన్కు నివాళి అర్పించేందుకు సమాధివద్దకు రాగా ఆశ్చర్యం.. కాపిటన్ బాధతో సమాధిని చూస్తు కూర్చుంది. కాపిటన్‌ను యజమాని కుమారుడు డామియన్ మళ్లీ ఇంటికి తీసుకెళ్లినా.. అది బయటకు వెళ్లిపోయేది. పగలు ఇంట్లో ఉన్నా.. రాత్రికి మాత్రం ఎక్కడికో వెళ్లేది. ప్రతిరోజు రాత్రి యజమాని గజ్‌మ్యాన్ సమాధి వద్దకు వెళ్తుందన్న విషయం తమకు ఆరేళ్ల తర్వా తెలిసిందని డామియన్ చెప్పాడు. అప్పటినుంచీ కాపిటన్ (శునకం) ఆర్జెంటీనాలో ఫేమస్. ఇలా దాదాపు 11ఏళ్లకు పైగా ప్రతిరోజూ తన తండ్రి సమాధివద్దే నిద్రించే కాపిటన్ నేడు మన మధ్య లేదంటూ వాపోయాడు డామియన్. ఇంటి నుంచి తన తండ్రి సమాధి చాలాదూరం ఉన్నా.. ప్రతిరోజు రాత్రి తమ పెట్ డాగ్ అక్కడికి వెళ్లడం మరిచిపోలేని అంశమన్నాడు. తన తండ్రి సమాధి వద్దకు ఒక్కసారి కూడా తాము కాపిటన్‌ను తీసుకెళ్లకున్నా, కానీ అది తన విశ్వాసాన్ని ఇన్నేళ్లు చూపిందని.. చనిపోయిన తర్వాత కూడా అది(శునకం) ఆయన వద్దకే కాపలాగా వెళ్లి ఉంటుందని ఏడ్చేశాడు డామియన్. -
తప్పక చూడాల్సిన వీడియో..
సామాన్యుల సంగతి పక్కన బెడితే బద్ధకస్తులు మాత్రం కచ్చితంగా ఈ వీడియో చూడాల్సిందే. ఎందుకంటే ఇది చూశాక వాళ్లల్లో నిద్రిస్తున్న జీవకణాలు మొద్దు నిద్ర వదిలి వారిని పరుగులు పెట్టిస్తాయి. ఏమాత్రం ఉలుకు పలుకు లేకుండా దర్జాగా కూర్చుని తినేవారిని ఉరకలు పెట్టించొచ్చు కూడా. ఎందుకంటే ఆ వీడియో చూసి అబ్బ.. అనుకోవడం మానేసి ఔరా అనడం మొదలుపెడతారు. ఇంతకు ఆ వీడియో ఏమిటి? అందులో ఏముందని అనుకుంటున్నారా? బంగాళదుంప సాగు చేస్తున్న ఓ యజమానికి వాటిని నాటేందుకు సాయం చేస్తున్న కుక్కకు సంబంధించినదే ఆ వీడియో. వ్యవసాయంలో ఆరితేరిన ఓ మనిషిలా ఆ కుక్క సేద్యం చేస్తున్న తీరు నిజంగా అద్భుతం. తన యజమాని ఒక్కో ఆలుగడ్డను నాటుతూ వెళుతుంటే ఆ గుంటలన్నింటిని పూడుస్తూ ఆ కుక్క పనిచేసిన తీరు చూస్తే మాత్రం బద్దకంగా ఉండే మనుషులు కాస్తంత అప్రమత్తమవడం మాత్రం కచ్చితం. -
తప్పక చూడాల్సిన వీడియో..
-
కుక్కలకూ ఓ సంరక్షణ కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు అనాథలు, వృద్ధులు, మహిళలకు మాత్రమే సంరక్షణ కేంద్రాలను చూశాం. విశ్వనగరంగా ఎదుగుతున్న హైదరాబాద్‌లో కోతులు, పశువులు, కుక్కలకు కూడా ఒక ఆధునిక సంరక్షణ కేంద్రం త్వరలో అందుబాటులోకి రానుంది. దేశంలోని మరే ఇతర నగరాల్లో లేని విధంగా అత్యంత ఆధునిక సదుపాయాలతో ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈస్ట్ జోన్‌లోని ఫతుల్లాగూడలో జీహెచ్ఎంసీకి చెందిన 45.72 ఎకరాల ప్రదేశంలోని ఐదెకరాల స్థలంలో ఈ యానిమల్ కేర్ సెంటర్ పనులు చురుగ్గా సాగుతున్నాయి. రూ.7 కోట్లతో పనులు.. యానిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జీహెచ్ఎంసీ ఈ జంతు సంరక్షణ కేంద్ర నిర్మాణ పనుల్ని చేపట్టింది. ఈ కేంద్రంలో జీహెచ్ఎంసీ ఈస్ట్ జోన్ పరిధిలో పట్టే వీధికుక్కలతో పాటు ప్రజల ఫిర్యాదుల మేరకు ఆయా ప్రాంతాల్లో పట్టే కోతులు, అదుపులోకి తీసుకునే పశువులను ఉంచేందుకు షెల్టర్లు నిర్మిస్తున్నారు. వీటితోపాటు కుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్సల కేంద్రం, పరిపాలన భవనం, తదితరమైన వాటితో బిల్డింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ కాంప్లెక్స్ అంచనా వ్యయం రూ. 7 కోట్లు కాగా, ప్రహరీకి దాదాపు రూ. 2 కోట్లు ఖర్చు చేశారు. మిగతా రూ. 5 కోట్లతో ఆయా భవనాల్ని నిర్మిస్తున్నారు. కాంప్లెక్స్‌లో.. ఒక కోతుల షెల్టర్, ఒక పశువుల షెల్టర్‌తో పాటు రెండు కుక్కల షెల్టర్లు, ప్రిపరేషన్ అండ్ ఆపరేషన్ బ్లాక్, సెక్యూరిటీ సిబ్బంది గది, కిచెన్ తదితరమైన పనులు జరుగుతున్నట్లు జీహెచ్ఎంసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీవీ కృష్ణారావు తెలిపారు. మరో మూడు నాలుగు నెలల్లో పనులు పూర్తవుతాయన్నారు. కాంప్లెక్స్‌లో విశాలమైన రహదారులతోపాటు పచ్చని లాన్ తదితర ఏర్పాట్లు చేస్తారు. అటవీ అధికారుల సూచన మేరకు ఆయా ప్రాంతాల్లోని కోతుల్ని పట్టుకొచ్చి.. కొన్ని రోజుల పాటు వాటిని ఇక్కడ సంరక్షిస్తారు. అనంతరం అటవీ ప్రాంతాల్లో వదిలి వేస్తామని చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. దాదాపు 200 కోతులతోపాటు 50 పశువుల సంరక్షణకు ఈ కేంద్రంలో ఏర్పాట్లు ఉంటాయన్నారు. రూ. 2.5 కోట్లతో బయోగ్యాస్ జంతు శ్మశాన వాటిక.. జంతు సంరక్షణ కేంద్రానికి సమీపంలోనే ఆధునిక బయోగ్యాస్ ఆధారిత జంతు శ్మశాన వాటికను ఏర్పాటు చేయనున్నారు. గ్రేటర్లో మృతి చెందిన కుక్కలు, పశువులు తదితర జంతువుల కోసం జంతు శ్మశాన వాటిక అవసరమని గుర్తించిన జీహెచ్ఎంసీ ఎలక్ట్రికల్ శ్మశానవాటికను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దీని ఏర్పాటుకు దాదాపు రూ. 2.5 కోట్లు ఖర్చు కానుందని సంబంధిత అధికారి తెలిపారు. -
మన నగరాలపై కుక్కకాటు
విశ్లేషణ 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. ఈ వ్యాసం రెండు రకాల శునక ప్రేమికులకు నచ్చదు. శునకాలను గారాబంగా పెంచుకునేవారు, పెంచకున్నా వీధికుక్కలకు తిండి పెట్టేవారు. మొదటి విభాగంలో మళ్లీ రెండు రకాల వాళ్లున్నారు. పురపాలక సంస్థలనుంచి శునకాలకు లైసెన్స్ తీసుకునేవారు (వీరి సంఖ్య చాలా తక్కువ). అసలు అలాంటి ఆలోచనే చేయనివారు. ఏ పురపాలక సంస్థ అయినా సరే పెంపుడు జంతువులు లేదా వీధికుక్కలు లేక రెండింటి జనాభాను తన పరిధిలో అదుపులోకి తీసుకోగలదు అంటే నమ్మశక్యం కాదు. ఏరకంగా తీసుకున్నా సమాజంలో పెంపుడు కుక్కల కంటే వీధికుక్కల జనాభానే ఎక్కువ. పైగా వీధుల్లో కుక్కలకు తిండిపెట్టడాన్ని వ్యతి రేకించడం అనేది పెద్ద నేరం కిందే లెక్క. అలా చేస్తే జంతువులపై క్రూరత్వ నివారణ సమితి మీపై చర్య తీసుకునే అవకాశం కూడా ఉంది. నేను శునక ప్రేమికుడిని కాదు. కానీ పెంపుడు కుక్కల యజమానులు, వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారి హక్కులను నేను గుర్తిస్తాను. కానీ వారు కొంచెం బాధ్యతతో వ్యవహరించాలన్నది పలువురి అభిప్రాయం. మీ పెంపుడు కుక్క మీ ముఖం నాకుతూ, మీ పరుపుమీదే పడుకుంటూ ఉన్నప్పుడు మల విసర్జనకు దాన్ని బయటకు ఎందుకు తీసుకెళ్లాలి? తమ కుక్కలు వీధుల్లో మలవిసర్జన చేయడం కోసం కొంతమంది రోజువారీగా కొందరికి డబ్బులిస్తుంటారు. వీధుల్లో కుక్కలకు తిండి పెట్టేవారు ఆ చర్యను ఎవరైనా వ్యతిరేకిస్తే మూకుమ్మడిగా వచ్చి మాట్లాడుతుం టారు. సాధారణంగా ఇలాంటివారు ఒకేచోట కుక్కలకు తిండిపెడుతుంటారు కాబట్టి వీధికుక్కల ప్రేమికులకు, ఆ వీధికుక్కలకు కూడా అక్కడే తామేదో శాశ్వత నివాసముంటున్నట్లుగా తిష్టవేయడం పరిపాటిగా అవుతోంది. ఇలాంటి ప్రాంతాలే కుక్క కాట్లకు నెలవులుగా ఉంటాయి. వీధుల్లో కుక్కలకు తిండిపెడుతున్నవారిని ఆ కుక్కలకు రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సిన్ వేయిస్తుంటారా అని అడిగి చూడండి చాలు. ఏ ఒక్కరూ దీనికి నేరుగా సమాధానం ఇవ్వరు. పైగా ఎవరినైనా ఏ కుక్క అయినా కరిచిందా, దానివల్ల ఎవరైనా బాధపడ్డారా అంటూ వాదిస్తుంటారు, ఎదురుప్రశ్నలు వేస్తుంటారు. పైగా కుక్కల జనాభా వృద్ధిని నిలిపేందుకు తగు చర్యలు తీసుకోవడంలో పురపాలక సంస్థకు సహకరించే పని కూడా చేయరు. పురపాలక సంస్థలు కుక్కలను నపుంసకంగా మార్చడంలో ఘోరంగా విఫలమవుతుండటం మరొక విషయం. కానీ శునక ప్రేమికులు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంది. వీరికి రోడ్డుపైన లేక పక్కన కుక్కలు మలవిసర్జన చేయడం అభ్యంతరం అనిపించదు. కానీ ఆ పక్కనే నడిచి వెళ్లేవారికి ఇది మహా ఇబ్బంది కలిగిస్తుంటుంది. కుక్క విసర్జితాన్ని తీసివేసేం దుకు ఏ ఒక్కరైనా గెరిటలాంటిది తీసుకెళతారా అని నాకు ఆశ్చర్యం వేస్తుంటుంది. మనదేశంలో మనుషులు బహిరంగ మల విసర్జన చేయకుండా నివారించడం అలవిగాని పని అని మనకు తెలుసు. స్వచ్ఛభారత్ సర్‌చార్జి ద్వారా ప్రభుత్వ ప్రచారానికి మనం డబ్బు చెల్లిస్తున్నందున ఈ లక్ష్యం మనపై భారం వేస్తోంది కూడా. కానీ కుక్కలను, ప్రత్యేకించి వీధికుక్కలను ప్రేమించడం అనేది కొద్దిమేరకు పౌర బాధ్యతకు కూడా హామీ ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే గత రెండు దశాబ్దాలుగా ముంబైలో కుక్క కాటు వల్ల రేబిస్‌కు గురై చాలామంది చనిపోయారు. కుక్కకాటు మరణాల సంఖ్య భీతిగొలిపేదిగా ఉంది. 1993లో సీరియల్ బాంబు దాడుల్లో, 2008లో కసబ్ తదితరులు చేసిన ఉగ్రదాడిలో కంటే కూడా ముంబైలో కుక్క కాట్లతోనే అనేకమంది చనిపోయారు. కానీ దీనిపై పురపాలక సంస్థ ఎలాంటి యుద్ధం తలపెట్టలేదు. దీంతో వీధికుక్కలపై మనమే యుద్ధం చేయాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో సోమవారం ది హిందూ పత్రికలో వచ్చిన వార్త నన్ను ఆశ్చర్యానికి గురిచేసింది. కేరళలో కుక్క కాటుకు గురి అయిన వారికి చెల్లిస్తున్న పరిహారం మితిమీరుతోందని, కొన్ని ప్రత్యేక కేసుల్లో అయితే రూ.20 లక్షల రూపాయల దాకా చెల్లించాల్సి వస్తోందని కేరళ ప్రభుత్వం సమీక్షించింది. కుక్కకాటు బాధితులకు ఉచిత వైద్య సహాయం అందిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వాదించింది. మునిసిపాలిటీలే వీటిని చెల్లిస్తున్నందున వీటిపై మరింత బాధ్యత పెట్టే అవకాశం లేదని తేల్చేసింది. కానీ మనం చూడాల్సింది కుక్కకాటు చెల్లింపులు మితిమిరిపోయాయా అని కాదు. తమ బాధ్యతలను నిర్వహించడంలో విఫలమవుతున్న వారిని కఠినంగా శిక్షించాలి. ఇది చిన్న విషయం కాదు. మన దేశంలో దాదాపు మూడు కోట్ల వీధికుక్కలున్నాయి. 20 వేలమంది ప్రతి సంవత్సరం రేబిస్‌తో మరణిస్తున్నారు. ఒక్క ముంబై నగరంలోనే, మనుషులు నడవడానికి చోటు లేదు కానీ, 1994–2015 మధ్య కాలంలో 13 లక్షల కుక్క కాట్లు నగరంలో నమోదయ్యాయి. దేశంలోని ప్రతి నగరం, పట్టణం కూడా కుక్కకాట్లకు సంబంధించి సంతోషం కలిగించని గణాంకాలను కలిగిఉంటున్నాయి. ఉదాహరణకు భివండీలో రెండవ తరగతి విద్యార్థి ధీరజ్ యాదవ్ ఉదంతం భయం గొలుపుతుంది. చెత్త నిల్వ కేంద్రంలో ఆడుకుంటున్న ధీరజ్ అనుకోకుండా కుక్కపై పడ్డాడు. తోడుగా ఉన్న తొమ్మిది ఇతర కుక్కలతోపాటు ఆ కుక్క అతడిని ఎంతగా కరిచిందంటే స్థానిక ఆసుపత్రి అతడిని పెద్దాసుపత్రికి తరలించాల్సిందిగా సిఫార్సుచేసింది. చివరకు ధీరజ్ మరణించాడు. కొన్నేళ్ల క్రితం తొమ్మిదేళ్ల షాహిద్ నసీమ్ సయ్యద్ ముఖం, చేతులు, వక్షంపై 100 కుక్కకాట్లు పడ్డాయి. - మహేశ్ విజాపుర్కర్ వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : mvijapurkar@gmail.com