సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల దాడులకు పసివాళ్లు బలవుతున్నారు. నగరంలో శునకాల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. 20 రోజుల క్రితం ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్‌లో కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. నీలోఫర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.. కుక్కలు పిల్లలపై దాడులు చేస్తున్నాయని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
మరో ఘటనలో రంగారెడ్డి జిల్లా కోకాపేట్ కుక్కలు స్వైర విహారం చేశాయి. కుక్కల దాడిలో చిన్నారి తీవ్ర గాయలయ్యాయి. వెంటనే ఆ చిన్నారిని ఆసుప్రతికి తరలించారు.
కాగా, ఇటీవల రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో అచేతన స్థితిలో అనారోగ్యంతో మంచానికే పరిమితమైన వృద్ధురాలిపై కుక్కలగుంపు దాడి చేసి ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. తలను పీకి.. పొట్టను చీల్చి పేగులు, కాలే యాన్ని తినేశాయి.
బట్టోనితాళ్లకు చెందిన పిట్ల రామలక్ష్మి(85) ఇంట్లో నిద్రిస్తుండగా బుధవారం అర్ధరాత్రి వీధికుక్కల గుంపు విచక్షణారహితంగా దాడిచేసి ముఖాన్ని కొరుక్కుతిని, పొట్టను చీల్చాయి. వృద్ధాప్యం, అనారోగ్యంతో కదలలేని స్థితిలో ఉన్న రామలక్ష్మి ఎదురుతిరగలేని పరిస్థితిలో ప్రాణాలు విడిచింది. రామలక్ష్మి ము ఖం పూర్తిగా ఛిద్రమై ఎముకలు తేలాయి. ఆమె పడుకున్న మంచంలోనే ప్రాణాలు వదలగా, రక్తం ధారలు కట్టింది.
Comments
Please login to add a commentAdd a comment