
జైపూర్: ఓ యువతి ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుంచి బయటకు రావడమే ఆమెకు శాపమైంది. దాదాపు 10 వీధి కుక్కలు ఒక్కసారిగా ఆమెపై దాడి చేశాయి. ఆమెకు వెంటాడి మరీ గాయపరిచాయి. ఈ దారుణ ఘటన రాజస్థాన్‌లోని అల్వర్ నగరంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
వివరాల ప్రకారం.. అల్వర్‌లోని జేకే నగర్‌కు చెందిన నవ్య ఫోన్ మాట్లాడుతూ ఇంటి బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడుకుంటూ అలా కొంత దూరం ముందుకు నడిచింది. ఈ క్రమంలో 10-12 కుక్కలు అకస్మాత్తుగా ఆమెపైకి వచ్చి దాడి చేశాయి. అనంతరం నవ్య పరుగులు తీస్తూ తప్పించుకునే ప్రయత్నం చేసింది. అయితే కుక్కలు ఆమెపై దాడి చేయడం వల్ల నవ్య కింద పడిపోయింది. అయినప్పటికీ కుక్కలు వదలకుండా ఆమెపై దాడి చేశాయి.
ఈ సమయంలో పక్కన ఉన్న ఇంట్లో వారు, స్కూటీపై వెళ్తున్న మహిళ వెంటనే స్పందించి కుక్కలను తరిమేశారు. దీంతో, నవ్యపై దాడిని ఆపేసి పారిపోయాయి. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మరోవైపు.. ఈ ఘటన తర్వాత బాధితురాలు, ఫిజియోథెరపీ చదువుతున్న నవ్య మాట్లాడుతూ.. కుక్కల దాడి కారణంగా చాలా భయపడినట్లు చెప్పింది. రెండు రోజుల్లో ప్రాక్టికల్ పరీక్షలు ఉన్న నేపథ్యంలో ఇలా జరిగిందని వెల్లడించింది. పలుచోట్ల గాయాలైనట్టు తెలిపింది.
ఇదిలా ఉండగా.. ఈ ఘటన తర్వాత వీధి కుక్కలకు ఆహారం పెట్టే ఓ మహిళను స్థానికులు మందలించారు. వీధి కుక్కల దాడులు పెరగడానికి ఇదే కారణమని చెప్పారు. గత ఐదేళ్లుగా వీధి కుక్కలు ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని ఈ ప్రాంత కౌన్సిలర్ అన్నారు. ఈ సమస్యను మున్సిపల్ కార్పొరేషన్ బోర్డులో అనేకసార్లు లేవనెత్తానని, కానీ ఎటువంటి పరిష్కారం చూపించలేదని తెలిపారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Is there any city in India that does not have to suffer because of street dogs.
This is from Alwar in Rajasthan.
pic.twitter.com/0dmZaNdFpu— Ravi Handa (@ravihanda) March 8, 2025
Comments
Please login to add a commentAdd a comment