stray dogs attack
-
కిల్లర్ డాగ్స్!
..: ఇది జర్నలిజంలో ఓ పాత పాఠం :..జర్నలిస్టుల సంగతి ఎలా ఉన్నా.. ప్రభుత్వాలు మాత్రం దీన్ని సీరియస్‌గానే తీసుకున్నట్లు ఉన్నాయి. అందుకే మనిషిని కుక్క కరవడం కాదు.. చంపేస్తున్నా.. పెద్దగా పట్టనట్లే ఉంటున్నాయి.ఫలితం..ఓ విహాన్.. ఓ పూలమ్మ,.. ఓ రామలక్ష్మి.. పేరేదైతేనేం.. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. తరచూ పదుల సంఖ్యలో ప్రజలు కుక్కకాట్ల బారిన పడుతూనే ఉన్నారు. ఏళ్లుగా ఉన్న సమస్య ఇది.. ఎవరూ సీరియస్‌గా తీసుకోని విషయమిది. మరేం చేద్దాం?ఇప్పటికైనా పట్టించుకుందామా? పట్టనట్లే ఉందామా?⇒ హైదరాబాద్‌లోని మియాపూర్ మక్తాకు చెందిన ఆరేళ్ల బాలుడు సాత్విక్‌పై రెండు నెలల క్రితం వీధికుక్కలు దాడి చేసి చంపేశాయి. నెల రోజుల క్రితం ఇబ్రహీంపట్నం రాయపోల్‌లో నాలుగేళ్ల బాలుడిపై వీధికుక్క దాడి చేసింది. నిలోఫర్‌లో చికిత్స పొందుతూ ఇటీవల చనిపోయాడు. గత పదిహేను రోజుల్లో నాలుగు కుక్కకాటు ఘటనల్లో పదుల సంఖ్యలో చిన్నారులు, పెద్దవాళ్లు గాయపడ్డారు. ⇒ రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం బట్టోనితాళ్లలో 20 రోజుల కింద పిట్ల రామలక్ష్మి (80) అనే వృద్ధురాలిపై వీధికుక్కలు దాడి చేసి పీక్కుతిన్నాయి.⇒ సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండల కేంద్రానికి చెందిన భరత్, వెంకటలక్ష్మి దంపతులు హైదరాబాద్ జవహర్‌నగర్ పరిధిలోని ఆదర్శనగర్‌కు మూడు నెలల క్రితం వలస వచ్చారు. వారి 18 నెలల కుమారుడు విహాన్‌ను ఇటీవల కుక్కలు దాడి చేసి చంపేశాయి.⇒ మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్లకు చెందిన జంగం నర్సయ్య బర్ల కాపరిగా, ఆయన భార్య పూలమ్మ (50) గ్రామ పంచాయతీ నర్సరీలో కూలీ పని చేసేవారు. వారి ఏకైక కుమార్తె వివాహం కావడంతో.. భార్యాభర్త ఇద్దరే ఉండేవారు. జూలై 5న పూలమ్మ నర్సరీలో పని ముగించుకుని తిరిగొస్తుండగా కుక్కలు దాడి చేశాయి. తీవ్రంగా గాయపడిన ఆమె చికిత్స పొందుతూ చనిపోయింది. దీనితో తాను ఒంటరిని అయిపోయానంటూ నర్సయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు... ఈ ఘటనలే కాదు.. చెప్పుకుంటూపోతే మరెన్నో.. వీధి వీధినా, గ్రామం, పట్టణం తేడా లేకుండా ఎన్నో వందల కుటుంబాల్లో విషాదం నింపుతున్న కుక్కల దాడి ఘటనలెన్నో. అవి మనుషులకు మంచి స్నేహితులంటూ మనం చెప్పుకొనే శునకాలే.. ఇంటి ముందో, వీధిలోనో కలియదిరుగుతూ కనిపించేవే. కానీ కొన్నేళ్లుగా కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నాయి. చిన్నారులను, వయసు మళ్లినవారిపై దాడిచేసి పొట్టనపెట్టుకుంటూ కన్నీళ్లు నింపుతున్నాయి. - సాక్షి, హైదరాబాద్ఆహార కొరత.. విపరీతంగా సంతానోత్పత్తివీధికుక్కలు రెచ్చిపోవడానికి ప్రధాన కారణం ఆహార కొరత అని వెటర్నరీ వైద్యులు చెప్తున్నారు. ఖాళీ ప్రదేశాలు తగ్గిపోవడం, వాతావరణ పరిస్థితులు కూడా ప్రభావం చూపిస్తున్నాయని అంటున్నారు. కుక్కలు పెద్ద శబ్దాలు, ఎక్కువ వెలుగు ఉండే లైట్ల వల్ల ఆవేశపడతాయని.. ఇలాంటి సమయాల్లోనే అవి అతిగా దాడులు చేస్తుంటాయని వివరిస్తున్నారు. సాధారణంగా కుక్కలు మాంసాహారాన్ని ఇష్టపడతాయి. కానీ ఇప్పుడు వాటికి శాఖాహారం కూడా దొరకని పరిస్థితి రావడంతో రెచ్చిపోతున్నాయి.అందువల్ల కుక్కలకు షెల్డర్ హోమ్‌లు, ప్రత్యేకంగా పార్కులు ఏర్పాటు చేసి, వాటికి సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. ఈ మేరకు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కొంత ప్రయత్నం జరిగినా ఫలితం మాత్రం శూన్యం. జీహెచ్ఎంసీ పరిధిలో నాలుగు లక్షలకుపైగా వీధి కుక్కలు ఉన్నాయని కార్పొరేషన్ వెటర్నరీ విభాగం చెబుతోంది. కానీ వాస్తవంగా 10 లక్షలకుపైగానే వీధి కుక్కలు ఉన్నట్టు అంచనా. వీటిలో మూడో వంతు కుక్కలకు కూడా స్టెరిలైజేషన్, వాక్సినేషన్ జరగలేదని సమాచారం.నామ్ కే వాస్తేగా కార్యాచరణకుక్కకాట్లతో ప్రజలు ప్రాణాలు కోల్పోతుండటంపై ఇటీవల హైకోర్టు తీవ్రస్థాయిలో స్పందించడంతో.. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించింది. కానీ ఆ హడావుడి నాలుగైదు రోజుల్లోనే ముగిసిపోయింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 26 జిల్లాల్లో పశు జనన నియంత్రణ కేంద్రాలు ఉండగా.. మిగతా జిల్లాల్లోనూ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. కానీ అడుగు ముందుకు పడలేదు.2030 నాటికి రేబిస్ నిర్మూలన సాధ్యమెట్లా?దేశంలో 2030 నాటికి రేబిస్‌ను నిర్మూలించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది. ఆ లక్ష్యం నెరవేరాలంటే శునకాల నియంత్రణ చర్యలు వేగవంతం చేయాలి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో యాంటీ రేబిస్ టీకాలను విరివిగా అందుబాటులో ఉంచాలి. కానీ కేంద్రం సరిగా నిధులు కేటాయించడం లేదు. రాష్ట్రాలూ పట్టించుకోవడం లేదు. కుక్కకాట్లతో రేబిస్ సోకడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా 59 వేల మంది చనిపోతుంటే.. అందులో 20 వేలకుపైగా (36 శాతం) మరణాలు మనదేశంలోనే నమోదవుతున్నట్టు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.ఒక్క జంట నుంచి ఏడేళ్లలో 4 వేల కుక్కలు⇒ కుక్కల జీవిత కాలం 8 నుంచి 12 ఏళ్లు⇒ 8 నెలల వయసు నుంచే వాటికి సంతానోత్పత్తి సామర్థ్యం ఉంటుంది⇒ వీటి గర్భధారణ సమయం 60–62 రోజులే ఏటా రెండు సార్లు పిల్లలను కంటాయి. ప్రతిసారి 4 నుంచి 8 పిల్లలను పెడతాయి⇒ ఒక శునకాల జంట, వాటి పిల్లలు, వీటన్నింటికీ పుట్టే పిల్లలు ఇలా.. ఏడాదిలోనే 40 వరకు అవుతాయి. మొత్తంగా ఒక్క జంట నుంచి ఏడేళ్లలో సుమారు 4 వేల వరకు అయ్యే అవకాశం ఉంటుందికాకి లెక్కలేనా..?జీహెచ్ఎంసీలో ఏటా 50, 60 వేల వీధికుక్కలకు సంతాన నిరోధక శస్త్రచికిత్స (స్టెరిలైజేషన్) జరుగుతున్నట్టు లెక్కలు చెప్తున్నాయి. ఈ శస్త్రచికిత్సలు, రేబిస్ వ్యాధి సోకకుండా వ్యాక్సినేషన్, సిబ్బంది జీతభత్యాలు, ఇతర ఖర్చుల కోసం ఏటా రూ.12 కోట్లకుపైగానే వ్యయం చేస్తున్నారు. కానీ వీధికుక్కల సంఖ్య ఏమాత్రం తగ్గకపోగా.. అంతకంతకూ పెరిగిపోతోంది. నిధులన్నీ ఎక్కడికి వెళ్తున్నాయన్న ప్రశ్న తలెత్తుతోంది. మున్సిపల్ కార్పొరేషన్లు ఒక్కో కుక్క స్టెరిలైజేషన్ కోసం రూ.1,700 చొప్పున ఖర్చు చేస్తున్నా.. చేసే ఆపరేషన్లకు, చూపే లెక్కలకు తేడా ఉంటోందన్న ఆరోపణలు ఉన్నాయి.గోవా ఎలా కంట్రోల్ చేయగలిగింది?కుక్కకాట్ల విషయంలో గోవా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఆ రాష్ట్రంలో గత మూడేళ్లలో ఒక్క కుక్కకాటు మరణం కూడా నమోదు కాలేదు. నిర్ణీత కాలవ్యవధిలో కుక్కలకు శస్త్రచికిత్సలు చేస్తున్నారు. శునకాల దాడినుంచి స్వీయరక్షణ విధివిధానాలను విద్యార్థులకు, మహిళలకు తెలియజెప్పడం వంటి అంశాలు గోవాలో సత్ఫలితాలిస్తున్నాయి. బెంగళూరు, అహ్మదాబాద్ నగరాల్లోనూ కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు పొందాయి.ఆ రాష్ట్రాల్లో బాధితులకు పరిహారంకుక్కకాటు ఘటనలకు రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని గత సంవత్సరం హరియాణా– పంజాబ్ హైకోర్టు తీర్పునిచ్చింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు 10వేల రూపాయల చొప్పున బాధి తులకు నష్ట పరిహారం చెల్లించాలని ఆదేశించింది. కుక్కకాటు ఘటనలో 0.2 సెంటీమీటర్లు, ఆపైన కోత పడితే బాధితులకు రూ.20 వేలు చెల్లించా లని.. ప్రాణనష్టం జరిగితే రూ.5 లక్షలు పరిహారంగా ఇవ్వాలని స్పష్టం చేసింది. కర్ణాటకలో కుక్కకాటు కేసులను సమీక్షించడానికి, కుక్కకాటుకు గురైన వ్యక్తులకు పరిహారం అందించడానికి అక్కడి పట్టణాభివృద్ధి శాఖ పట్టణ, స్థానిక సంస్థలతో కమిటీలను ఏర్పాటు చేసింది. ఆ కమిటీల ద్వారా 48 గంటల్లో బాధితులకు పరిహారాన్ని అందిస్తున్నారు. రాష్ట్రంలో ఎలాంటి పరిహారం లేదు.పిల్లలు పలవుతున్నా ప్రభుత్వం స్పందించల్లేదుమాది సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం గోవిందాపూర్. ఇటీవల రెండు పిచ్చి కుక్కలు ముగ్గురు చిన్నారులపై దాడి చేశాయి. నా బిడ్డ ప్రావీణ్య కూడా తీవ్రంగా గాయపడింది. కుక్కల దాడిలో పిల్లలు బలవుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. కుక్కల నియంత్రణకు చర్యలు చేపట్టాలి. – సాగర్‌రెడ్డి, ప్రావీణ్య తండ్రికొత్త ప్రదేశాల్లో వదిలేయడంతో సమస్యలువీధికుక్కల స్టెరిలైజేషన్ విషయంలో మున్సిపల్ అధికారులు పొరపాట్లు చేస్తున్నారు. స్టెరిలైజేషన్ కోసం తీసుకువెళ్లిన కుక్కలను తిరిగి అదే ప్రాంతంలో వదలకుండా కొత్త ప్రదేశాల్లో విడిచిపెడుతున్నారు. అక్కడి కుక్కలు కొత్తవాటిని రానీయకపోవడం, మనుషులూ కొత్తవారు కావడంతో అభద్రతకు లోనవుతాయి. దీనికితోడు కుక్కలు అతి చల్లదనం, వర్షాలు, వేడిని తట్టుకోలేవు. చిత్రంగా ప్రవర్తిస్తూ దారినపోయే వారిపై దాడులకు దిగుతాయి. కుక్కలకు సకాలంలో స్టెరిలైజేషన్ చేయాలి. షెల్టర్లు ఏర్పాటు చేసి తరలించాలి. – అసోసియేట్ ప్రొఫెసర్ రాంసింగ్ లఖావత్, వెటర్నరీ యూనివర్సిటీరేబిస్ సోకే ప్రమాదం.. జాగ్రత్త.కుక్కకాటుతో రేబిస్ సోకే ప్రమాదం ఉంటుంది. కుక్క కరిస్తే వెంటనే గాయాన్ని పది, పదిహేను నిమిషాల పాటు నీటితో శుభ్రం చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలి. రేబిస్ సోకితే తొలిదశలో జ్వరం, తలనొప్పి, వాంతులు వస్తాయి. తర్వాత పిచ్చిగా ప్రవర్తించడం, మనుషులను గుర్తించèలేక పోవడం, నోట్లోంచి నురగ, గొంతు పట్టేయడం, ఊపిరి ఆడకపోవడం వంటివి కనిపి స్తాయి. చివరిగా కోమాలోకి వెళ్లి ప్రాణాలు పోయే ప్రమాదమూ ఉంటుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండాలి. – డాక్టర్ వెంకటేశ్వర్రావు, డీఎంహెచ్ఓ, రంగారెడ్డిరెచి్చపోయిన పిచ్చి కుక్కలు29 మందికి గాయాలు బాధితుల్లో చిన్నపిల్లలు, వృద్ధులు నందిపేట్ /మాచారెడ్డి/ మంగపేట: నిజామాబాద్, కామారెడ్డి, ములుగు జిల్లా మంగపేటలో సోమవా రం పిచ్చి కుక్కలు స్వైర విహారం చేసి సుమారు 29 మందిని గాయపర్చాయి. బాధితులు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. నందిపేట మండల కేంద్రంలోని బంగారు సాయిరెడ్డి ఫ్యాక్టరీ దగ్గర గల రామ్‌రెడ్డి వెల్డింగ్ షాప్ నుంచి మెయిన్ రోడ్డు వెంబడి లిటిల్ ఫ్లవర్ స్కూల్, చాకలి ఐలమ్మ, ఆనంది హాస్పిటల్, వ్యాన్ల అడ్డ, నట్రాజ్ టాకీస్ కాంప్లెక్స్ ప్రాంతాల వరకు ఓ పిచి్చకుక్క పదిమందిపై దాడి చేసి తీవ్రంగా గాయపర్చింది. లిటిల్ ఫ్లవర్ స్కూలు విద్యారి్థ, ఆనంద్ హాస్పిటల్ ఆయమ్మ లసుంబాయిపై కూడా కుక్క దాడి చేసి తొడ, చేతి కండరాలను పీకేసింది.మాచారెడ్డి మండలంలోని ఘన్పూర్ (ఎం)లో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పిచ్చి కుక్క పది మందిని గాయ పర్చింది. అక్షిత అనే బాలికపై, ఆరుబయట నిద్రిస్తున్న వృద్ధుడు పోచయ్యతో పాటు యాకూబ్, చైతన్య, హార్యన్, రంజిత్ తదితరులపై కుక్క దాడి చేసి గాయపర్చింది. ఆగ్రహించిన గ్రామస్తులు కుక్కను చంపేశారు. అలాగే ములుగు జిల్లా మంగపేటలోనూ ఓ పిచ్చి కుక్క పలువురిపై దాడిచేసింది. గంపోనిగూడెం, పొదుమూరు, మంగపేటలో సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఇంట్లో ఉన్న వృద్ధురాలిని, రోడ్డుపై నున్న ఎర్రావుల సమ్మయ్య, కొప్పుల లాలయ్య, దాదాని, ఎండి సైదా, మైతున్బి, ఎండి గోరెతోపాటు మరో ముగ్గురిపై పిచ్చి కుక్క దాడిచేసింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా మరో ఆరుగురికి స్పల్ప గాయాలయ్యాయి. -
ఇళ్లలోకి చొరబడి మనుషులను చంపడమా!
సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కలు ఇంట్లోకి వెళ్లి మహిళను చంపి.. అవయవాలు తినడం అత్యంత దారుణమైన ఘటన అని హైకోర్టు పేర్కొంది. ఇలా మహిళలు, చిన్నారులను కుక్కలు చంపుతున్నా పరిష్కార మార్గం కనుగొనకుంటే ఎలా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. ‘స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్ కాదు.. దాడుల నియంత్రణకు ఏం చర్యలు చేపట్టారో చెప్పాలి’అని ఆదేశించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యంలో వాదనలు కాదని, పరిష్కారం కావాలని న్యాయవాదులకు సూచించింది.ఆ దిశగా అందరి నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సర్కారుకు స్పష్టం చేసింది. వీధి కుక్కలకు పునరావాస కేంద్రాలు, ప్రజల కోసం హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలని చెప్పింది. జూన్ 28న పటాన్చెరు ఇస్నాపూర్‌లో వీధి కుక్కల దాడిలో 8 ఏళ్ల బాలుడు విశాల్ మృతి చెందాడు. ఈ దారుణంపై వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలను హైకోర్టు సుమోటోగా విచారణకు స్వీకరించింది. గతంలో ఇదే అంశంపై పెండింగ్‌లో ఉన్న పిటిషన్లకు దీనిని జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.ఈ పిటిషన్లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.శ్రీనివాసరావు ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా వృద్ధురాలిని కుక్కలు పీక్కుతిన్న వైనం, చిన్నారులపై కుక్కల దాడిపై పత్రికల్లో వచ్చిన కథనాలు కోర్టులో ప్రస్తావనకు వచ్చాయి. పర్యవేక్షణకు కమిటీ ఏర్పాటు చేశాం..రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎ.సుదర్శన్‌రెడ్డి హాజరయ్యారు. యానిమల్ బర్త్ కంట్రోల్, యాంటీ రేబీస్ ప్రోగ్రామ్‌ను సమర్థవంతంగా అమలు చేయడం కోసం కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ పలు నిర్ణయాలు తీసుకుందని వివరించారు. యానిమల్ బర్త్ కంట్రోల్ (ఏబీసీ) సెంటర్ పనిచేస్తోందన్నారు. జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నంబర్‌ను కూడా నిర్వహిస్తోందన్నారు. కాగా, గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశాల అమలుపై జీహెచ్ఎంసీ నివేదిక అందజేసింది.పెంపుడు కుక్కలకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని వాటి యజమానులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించింది. కాగా, వీధి కుక్కలను షెల్టర్లకు తరలించి వాటికి అక్కడే అన్ని సదుపాయాలు కల్పించాలని న్యాయవాది వేణుమాధవ్ కోరారు. జీహెచ్ఎంసీ నివేదికను పరిశీలించిన సీజే పలు సూచనలు చేశారు. జంతు సంక్షేమ బోర్డు తరఫున న్యాయవాదిగా డీఎస్జీ గాడి ప్రవీణ్‌కుమార్‌ను చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించారు.ధర్మాసనం సూచనలు..⇒ వీధి కుక్కలపై ఫిర్యాదులకు నగరవాసుల కోసం ప్రత్యేకంగా ఓ హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు చేయాలి.⇒ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ, రాష్ట్రంలోని వివిధ జంతు సంక్షేమ సంస్థలను సంప్రదించి దాడుల నియంత్రణకు సూచనలు స్వీకరించాలి.⇒ ఏబీసీ నిబంధనల ప్రకారం జీహెచ్ఎంసీ, స్థానిక సంస్థలు తగినన్ని షెల్టర్లు, పశు వైద్యశాలలు, కుక్కల తరలింపు వ్యాన్లు, మొబైల్ వ్యాన్లు, సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఏబీసీ కేంద్రాలు నెలకొల్పి సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.⇒ ఏబీసీ కేంద్రాల్లో కుక్కలకు వ్యాక్సినేషన్ చేయించాలి. వ్యాక్సినేషన్ నిర్వహించేందుకు జంతు సంక్షేమ సంస్థలు ముందుకొస్తే ఆ ఖర్చులు ప్రభుత్వం భరించాలి. ⇒ ఏబీసీ కమిటీ నెలకోసారి భేటీ కావాలి. నిబంధనలు పాటించకుంటే కమిటీలను రద్దు చేయాలి.⇒ ఐదేళ్ల పాటు 10 కుక్కలను దత్తత తీసుకునేలా జంతు ప్రేమికులను ప్రోత్సహించాలి. ⇒ కుక్కలు కరిస్తే ఏం చేయాలో ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి.⇒ హైదరాబాద్ సిటీకి దూరంగా వీధి కుక్కలకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేయాలి. -
రేవంత్ అంకుల్.. మా ప్రాణాలకు రక్షణ ఏదీ?
కుత్బుల్లాపూర్: వీధి కుక్కల బెడదపై ఆదివారం కొంపల్లి ఎన్సీఎల్ కాలనీకి చెందిన చిన్నారులు వినూత్న తరహాలో నిరసన తెలిపారు. ‘రేవంత్ అంకుల్..మా ప్రాణాలకు రక్షణ ఏదీ?’ అంటూ ఆదివారం ప్లకార్డులు చేతబూని పెద్ద సంఖ్యలో చిన్నారులు పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌కు వద్దకు చేరుకున్నారు. అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.ఎన్సీఎస్ నార్త్ కాలనీలో వీధి కుక్కల దాడుల్లో గత ఆరు నెలల వ్యవధిలో సుమారు 70 మంది చిన్నారులు గాయపడ్డారు. ఈ విషయమై పలుమార్లు కొంపల్లి మున్సిపల్ అధికారులకు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేసినా సరిగ్గా స్పందించలేదు. దీంతో అధికారుల తీరును నిరసిస్తూ కాలనీకి చెందిన చిన్నారులు ప్లకార్డులతో నిరసన చెప్పారు. కొంపల్లి మున్సిపల్ కమిషనర్ హరికృష్ణపై సీఐ విజయవర్దన్కు ఫిర్యాదు చేశారు. చిన్నారుల ఫిర్యాదు మేరకు జీడీ నమోదు చేశామని, డీసీపీ దృష్టికి తీసుకెళ్లి తదుపరి చర్యలు చేపడతామన్నారు. -
బిడ్డా.. ఎంత తల్లడిల్లినవో
మిరుదొడ్డి/జవహర్‌నగర్: గోరంత ముల్లు గుచ్చు కుంటేనే తల్లడిల్లే ప్రాణంరా నీది.. గుంపులుగా వచ్చిన కుక్కలు గాట్లు పడేలా కొరుకుతూ, ఈడ్చుకెళుతుంటే ఎంత తల్లడిల్లినవో కొడుకా అంటూ ఆ చిన్నారి తల్లిదండ్రులు రోదించిన తీరు కంటతడిపెట్టించాయి. మల్కాజిగిరి– మేడ్చల్ జిల్లా జవహర్‌నగర్‌లోని ఆదర్శనగర్‌లో కుక్కల దాడిలో విహాన్ మృతి చెందడం యావత్ రాష్ట్రాన్నే కుది పేసింది. విహాన్ మృతదేహం బుధవారం ఉదయం స్వగ్రా మమైన మిరుదొడ్డికి చేరుకుంది. నిలువెల్లా గాయాలతో నిండిపోయిన చిన్నారి మృతదేహాన్ని చూసిన బంధువులు, గ్రామస్తుల రోదనలు మిన్నంటాయి. మధ్యాహ్నం తర్వాత విహాన్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. బతుకుదెరువుకు వలసొచ్చి.. కొడుకును కోల్పోయి సిద్దిపేట జిల్లా మిరుదొడ్డికి చెందిన పుల్లూరి భరత్‌కుమార్–వెంకటలక్ష్మి దంపతులకు ఎనిమిదేళ్లలోపు ఇద్దరు కూతుళ్లు సాహితి, శృతి, కుమారుడు విహాన్ ఉన్నారు. గ్రామంలో కార్పెంటర్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. నెలరోజుక్రితం బతుకుదెరువుకు జవహర్‌నగర్‌కు వలసవచ్చారు. స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. మంగళవారం రాత్రి విహాన్ బ్రెడ్ ప్యాకెట్ తీసుకొని ఆరు బయటకు వెళ్లాడు. అక్కడే వేచి ఉన్న వీధికుక్కలు విహాన్ వెంటపడి విచక్షణారహితంగా దాడిచేసి కొరికాయి. కుక్కలదాడిలో విహాన్ బలికావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. అఖిలపక్ష నేతల నిరసన జవహర్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట అఖిలపక్ష నాయకులు, ప్రజా సంఘాల నేతలతో కలిసి ప్రజలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకుంటుందని కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు శ్రీకాంత్ యాదవ్, మేయర్ శాంతి, డిప్యూటీ మేయర్ శ్రీనివాస్‌లు అన్నారు. తక్షణ సహాయంగా రూ. 50వేలు అందిస్తున్నా మన్నారు. బాలుడి కుటుంబానికి మున్సిపల్ కార్యాల యంలో ఔట్సోర్సింగ్ ఉద్యోగంతో పాటు ఇంటిస్థలం అందించేందుకు కృషి చేస్తామని హమీ ఇచ్చారు. కదిలిన మున్సిపల్ యంత్రాంగం వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడంతో ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీంతో మున్సిపల్ అధికారులు ప్రధాన రహదారుల్లో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని వ్యాన్‌లో ఎక్కించి బయటకు తీసుకెళ్లారు. విహాన్ కుటుంబాన్ని ఆదుకోవాలి: ఎంపీ ఈటల విహాన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. బుధవారం మేడ్చల్ కలెక్టర్‌తోపాటు జవహర్‌నగర్ మున్సి పల్ కమిషనర్‌కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకు న్నారు. గురువారం ఉదయం సంఘటన స్థలాన్ని పరిశీలిస్తానని చెప్పారు. కలెక్టర్‌కు నివేదించాం: కమిషనర్ తాజ్మోహన్రెడ్డివీధికుక్కల దాడి ఘటనపై పూర్తి వివరాలతో మేడ్చల్ కలెక్టర్‌కు నివేదిక అందించామని జవహర్‌నగర్ కమిషనర్ తాజ్మోహన్ రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబానికి తక్షణ సహాయం కింద రూ.50 వేలు అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. -
విధి కుక్కల దాడిలో..
-
వీధికుక్కలు దాడిలో మరో చిన్నారి మృతి
-
కుక్క కాటు.. ఒక్కో పంటి గాటుకు రూ.10వేల పరిహారం!
చండీగఢ్: కుక్క కాటు కేసులపై హర్యానా-పంజాబ్ హైకోర్టులు సంచలన తీర్పు వెలువరించింది. కుక్క కాటుపై రాష్ట్ర ప్రభుత్వాలే ప్రధాన బాధ్యత వహించాలని ధర్మాసనం తెలిపింది. కుక్క కాటు కేసుల్లో ఒక్కో పంటి గాటుకు రూ.10,000 నష్టపరిహారం చెల్లించాలని తీర్పు వెలువరించింది. కుక్క కాటు ఘటనల్లో 0.2 సెంటీమీటర్ల కోత పడితే రూ.20,000 బాధితునికి చెల్లించాలని ఆదేశించింది. కుక్క కాటు కేసులో దాఖలైన 193 కేసుల్లో న్యాయస్థానం విచారణ చేపట్టింది. వీధికుక్కల బెడదపై దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ తీర్పు వెలువడింది. వాఘ్ బక్రీ టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ 49 ఏళ్ల పరాగ్ దేశాయ్ అక్టోబర్‌లో వీది కుక్కలు వెంబడించిన ఘటనలో మరణించారు. వీధికుక్కలు ఆయన్ని వెంబడించగా పడిపోవడంతో తీవ్ర రక్తస్రావం అయిందని.. ఆ కారణంగా దేశాయ్ మరణించారని సంబంధిత ఆసుపత్రి ఇటీవల ప్రకటనలో పేర్కొంది. ఈ విషాద ఘటన అనంతరం సోషల్ మీడియాలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని పెద్ద ఎత్తున చర్చ సాగింది. పంజాబ్, హర్యానా, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లలో నమోదైన కుక్క కాటు కేసులపై ఒక కమిటీని ఏర్పాటు చేయాలని హైకోర్టు కోరింది. జంతువుల దాడి కేసుల్లో చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని నిర్ణయించాలని తీర్పులో స్పష్టం చేసింది. అయితే.. వీది కుక్కలతో పాటు ఆవులు, ఎద్దులు, గాడిదలు, గేదెలు, అడవి, పెంపుడు జంతువులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఇదీ చదవండి: Liquor Sale In Delhi: ‘దీపావళి మద్యం’తో ఢిల్లీ సర్కారుకు భారీ ఆదాయం! -
విషాదానికి ముందు.. ఎంజీఎంలో చిన్నారి రాజు సరదా క్షణాలు
-
‘నా కొడుకా.. నీకప్పుడే నూరేళ్లు నిండాయారా’
ఆడుతూ పాడుతూ అల్లరి చేయాల్సిన ఆ చిన్నారిని మృత్యువు వీధి కుక్కల రూపంలో వెంటాడింది. ఆపై గాయాలతో ఆస్పత్రిలో చేరాడు. తనకు ఏం జరుగుతుందో అర్థం కాక.. అక్కడా అయినవాళ్ల నడుమ ఆడుకుంటూ కనిపించాడు. కానీ, విధి మరొకటి తలిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చిన్నారి కన్నుమూశాడు. ఆ తల్లిదండ్రులు గుండెలు అవిసెలా రోదించారు. హన్మకొండ జిల్లా పరిధిలో జరిగిన విషాదం.. స్థానికుల చేత కంటతడి పెట్టిస్తోంది. వీధి కుక్కలు మరో చిన్నారిని బలిగొన్నాయి. కిందటి నెలలో కుక్కల దాడిలో గాయపడి.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారి రాజు(18 నెలలు) కన్నుమూశాడు. దీంతో కాజీపేట రాజీవ్ గృహకల్ప కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. రాజీవ్ గృహకల్ప కాలనీలో రాజు కుటుంబం ఉంటోంది. గత నెల(జూన్) 17వ తేదీన ఆడుకుంటున్న పిల్లలపై వీధి కుక్కలు దాడి చేశాయి. ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా, 18 నెలల రాజుకి తీవ్ర గాయాలయ్యాయి. మొహంపై గాయాలతో పాటు చెంప కొంత వరకు తెగిపోయింది. పిల్లల అరుపులు విన్న స్థానికులు.. ఇళ్లలోంచి వచ్చి కుక్కలను తరిమి కొట్టారు. ఆపై పిల్లలను ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఎంజీఎంలో చిన్నారి రాజు ఫస్ట్ ఎయిడ్ తర్వాత ఆడుకుంటున్న దృశ్యాలను మొబైల్లో బంధించారు. ఆపై చికిత్స కోసం అతన్ని ఆస్పత్రిలో చేర్పించారు. అయితే.. క్రమక్రమంగా రాజు పరిస్థితి క్షీణిస్తూ వచ్చింది. 25 రోజులపాటు మృత్యువుతో పోరాడి బుధవారం ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తోంది. -
మేడ్చల్: వీధి కుక్కలు వెంటపడడంతో ఆ చిన్నారి..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని జగద్గిరిగుట్ట లెనిన్‌నగర్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇంటి బయట ఆడకుంటూ అదృశ్యమైన నాలుగేళ్ల చిన్నారి మనోజ్.. శవమై కనిపించాడు. మనోజ్ మృతదేహాన్ని దగ్గర్లోని క్వారీ గుంత నుంచి పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. చిన్నారి ఎలా చనిపోయి ఉంటాడనే దానిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే.. వీధి కుక్కల వల్లే తమ కొడుకు చనిపోయి ఉంటాడని మనోజ్ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంటి బయట ఆడుకుంటున్న సమయంలో వీధి కుక్కలు వెంటపడి ఉంటాయని, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో క్వారీ గుంతలో పడిపోయి ఉంటాడని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. -
కాజీపేటలో దారుణం.. వీధికుక్కల దాడిలో బాలుడి మృతి
సాక్షి, హన్మకొండ: వీధి కుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెట్టుకుంటున్నాయి. తాజాగా హన్మకొండ జిల్లా కాజీపేటలో వీధికుక్కలు మరో బాలుడి ప్రాణాలు తీశాయి. వీధికుక్కలు దాడి చేయడంతో ఎనిమిదేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. రైల్వే క్వార్టర్స్‌లోని చిల్డ్రన్స్ పార్క్ వద్ద ఆడుకుంటుండగా మల్కాన్ సింగ్, సునీత దంపతుల కుమారుడు చోటు అనే చిన్నారిపై కుక్కలు దాడి చేశాయి. దీంతో తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఎంజీఎంకు తరలించారు. కాగా పని కోసం మల్కాన్ సింగ్ కుటుంబం గురువారమే యూపీ నుంచి ఖాజీపేటకు వలస వచ్చారు. వీరు నగరంలో ఉంగరాలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారు. పొట్ట కూటికోసం వస్తే.. మరుసటి రోజే కుమారుడు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఎమ్మెల్యే పరామర్శ కాజీపేటలో కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోయిన బాలుడి కుటుంబాన్ని ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, మేయర్ గుండు సుధారాణి పరామర్శించారు. మృతుడి కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. మృతదేహాన్ని స్వంత ఖర్చులతో యూపీకి తరలించారు. నగరంలో ఒక్కో వాడలో 200 వరకు కుక్కలు ఉన్నాయని, కుక్కలను చంపడం నేరం కావడంతో వాటి సంతతిని కంట్రోల్ చేసే చర్యలు చేపట్టామని ఎమ్మెల్యే తెలిపారు. కుక్కలకు కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వాటికి వ్యాధులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కుక్కల దాడుల నివారణ కోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక బృందాన్ని రప్పిస్తామన్నారు ఇదిలా ఉంటే గడిచిన 20 రోజుల్లో వరంగల్ జిల్లాలో ఇద్దరు కుక్కల దాడిలో ప్రాణాలు కోల్పోవడం, పలువురు గాయపడ్డడం కలకలం సృష్టిస్తుంది. చదవండి: పైళ్లెన వారం రోజులకే విషాదం నింపిన క్షణికావేశం -
సిద్దిపేట: అడిషినల్ కలెక్టర్‌ని కరిచిన కుక్క
సిద్ధిపేట: అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం నాడే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్‌నే కరవడంతో రంగంలోకి దిగారు. శనివారం రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెప్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని విమర్శిస్తున్నారు స్థానికులు. -
వెంటాడుతున్న కుక్కలు.. జనగామలో ఒకేరోజు 21 మందికి గాయాలు
జనగామ: వీధి కుక్కల స్వైరవిహారంతో పలు ప్రాంతాల్లో 23మంది తీవ్రంగా గాయపడ్డారు. జనగామ జిల్లా కేంద్రంలోనే ఏకంగా 21 మంది వీధి కుక్కల బారిన పడి గాయాలపాలయ్యారు. కుర్మవాడ(సుమారు 4 వార్డుల పరిధి), హనుమాన్ స్ట్రీట్ తదితర ప్రాంతాలకు చెందిన స్థానికులు రోడ్డుపై వెళ్తుండగా కుక్కలు దాడి చేశాయి. సమీప వాసులు కర్రలు, రాళ్లతో తరిమికొట్టడంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. వెంటనే బాధితులు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుక్క కాటుకు సంబంధించిన ఇంజక్షన్ తీసుకుని చికిత్స పొందారు. హైదరాబాద్‌లోని మలక్‌పేట పద్మానగర్‌కు చెందిన పదేళ్ల బాలుడు మహ్మద్ అర్స్లాన్ రోడ్డుపై ఆడుకుంటుండగా కుక్క కరవడంతో చేతికి గాయాలయ్యాయి. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. ఇక హనుమకొండ జిల్లా కాజీపేటలో స్కూలుకు వెళ్లి వస్తున్న తొమ్మిదేళ్ల బాలుడు ముస్త ఫాను స్థానిక శైలేందర్ సింగ్‌కు చెందిన పెంపుడు కుక్క కరిచింది. బాధితుడి తండ్రి ఫిర్యాదుతో కుక్క యజమానిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: విషాదం.. కొడుకు పుట్టినరోజే.. తండ్రి ఆత్మహత్య.. -
విషాదం: వీధి కుక్కల దాడిలో మరో బాలుడు మృతి
సాక్షి, ఖమ్మం: వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల కాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రతిరోజు ఏదో ఒక మూల వరుస ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఏ వీధిలో చూసిన గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిస్తున్నాయి. రోడ్లపై వెళ్తున్న పాదచారులు, వాహనాదారుల వెంటపడి తీవ్రంగా కరుస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై విచక్షణారహితంగా దాడి చేసి వారి ప్రాణాలను పొట్టన పెంటుకుంటున్నాeయి. అంబర్‌పేట ఘటన మరవకముందే ఖమ్మం జిల్లాలో కుక్కల దాడిలో మరో బాలుడు మృతి చెందాడు. ఈ విషాదం రఘునాథపాలెం పుఠానితండాలో సోమవారం చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న బాలుడు బానోతు భరత్(5) పై వీధి కుక్కలు విరుచుకుపడ్డాయి.. మీదపడి కరవడంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన తల్లిదండడ్రులు చిన్నారిని ఖమ్మంలోని రెండు, మూడు ఆసుపత్రులకు తీసుకువెళ్లగా సిరియస్‌గా ఉండటంతో ఎవరూ ఆడ్మిట్ చేసుకోలేదు. దీంతో.. చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతిచెందాడు. కాగా బానోతు రవీందర్, సంధ్య దంపతులకు భరత్ చిన్న కుమారుడు. బాలుడు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఎంత విషాదం.. వీధి కుక్కల దాడి.. 2 రోజుల వ్యవధిలో ఇద్దరు చిన్నారులు మృతి
గత కొన్ని రోజులుగా వీధికుక్కలు హడలెత్తిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారులపై కుక్కల దాడులు ఎక్కువైపోయాయి. విచక్షణ రహితంగా పిల్లలను కరిచి, గాయపరచడమే కాకుండా ప్రాణాలు సైతం తీస్తున్నాయి. తాజాగా వీధికుక్కల దాడికి మరో బాలుడు బలైపోయాడు. ఈ దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగుచూసింది. అయితే రెండు రోజుల క్రితమే బాలుడి అన్నను కూడా కుక్కలు కరిచి చంపడం మరింత విషాదం. వివరాలు.. వసంత్ కుంజ్ సమీపంలోని అటవీ భూభాగమైన సింధి క్యాంప్ ఏరియాలో ఎక్కువగా పేదలు గుడిసెలు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో ఆనంద్ అనే ఏడేళ్ల బాలుడు కనిపించడం లేదని తల్లిదండ్రులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుటుంబం నివసించే ఇంటి సమీపంలో ఉన్న అడవిలో అతని కోసం వెతకడం ప్రారంభించారు. రెండు గంటల అనంతరం నిర్మానుష్య ప్రాంతంలో బాలుడి మృతదేహం లభ్యమైంది. అంతేగాక చిన్నారి శరీరంపై అనేక గాయాలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆనంద్‌పై అడవిలోని వీధి కుక్కలు, మేకలు, పందులు దాడి చేసి ఉంటాయని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఘటన స్థలాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ బృందం.. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి పంపారు. అయితే ఈ విషాదం జరిగిన రెండు రోజుల్లోనే మరో ఘోరం చోటుచేసుకుంది. ఆనంద్ తమ్ముడు ఆదిత్య, అతని బంధువులు కొందరు ఆదివారం వారి ఇంటి నుంచి కొంచెం బయటకు వెళ్లారు. ఆదిత్య దగ్గరి నుంచి కొంచెం దూరంగా వెళ్లిన బంధువు చందన్ కొద్దిసేపటి తర్వాత తిరిగి వచ్చాడు. అప్పటికే ఆదిత్యను వీధికుక్కలు కరవడం చూశాడు. భయంతో చందన్ గట్టిగా అరవడంతో.. అక్కడే ఉన్న ఆనంద్ మరణంపై దర్యాప్తు చేస్తున్నఓ పోలీసు అధికారి చందన్ అరుపులు విని ఆదిత్యను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడికి చేరుకునేలోపే అతను చనిపోయినట్లు ప్రకటించారు. పోస్టుమార్టం నిర్వహించారు. తదుపరి విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు. మూడు రోజుల వ్యవధిలోనే అన్నదమ్ములు ఇద్దరూ కుక్కల దాడిలో మరణించడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. -
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన నటి అమల? ఏమందంటే!
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఇటీవల అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనతో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. దీనిపై సమాజం రకరకాలుగా స్పందిస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. వివాదస్పద డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తరచూ దీనిపై ట్విట్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఖడ్గం’లో ఆ సీన్ చేస్తుండగా నన్ను హేళన చేశారు: నటి సంగీత ఇలాంటి ఘటనలు పునరావుతం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని అంతా డిమాండ్ చేస్తుంటే.. డాగ్ లవర్స్ మాత్రం మరోలా స్పందిస్తున్నారు. వాటికి సపరేట్గా వసతి కల్పించాలని, అవి మనలాగే ప్రాణులంటూ ఇటీవల జంతు ప్రేమికురాలు, యాంకర్ రష్మీ కామెంట్స్ చేసింది. దీంతో ఆమెపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై బ్లూక్రాస్ సోసైటీ ఆఫ్ హైదరాబాద్ నిర్వహకురాలు, నటి అమల అక్కినేని స్పందించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ ఘటనపై మాట్లాడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఈ నేపథ్యంలో వీధి కుక్కల దాడిలో బాలుడు ప్రదీప్ మృతిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ఓ జంతుప్రేమికురాలిగా అమల కుక్కలను శత్రువులుగా చూడోద్దని సూచించారట. ‘ఒక కుక్క తప్పు చేస్తే అన్ని కుక్కలను శిక్షిస్తామా? ఒక మనిషి తప్పు చేస్తే మొత్తం మానవ జాతిని శిక్షిస్తున్నామా? మరి ఒక కుక్క చేసిన పనికి అన్నింటినీ శిక్షించడ సరికాదు కదా? కుక్కలు ఎప్పుడూ మనషులను ప్రేమిస్తూనే ఉంటాయి.. అవి మనల్ని రక్షిస్తుంటాయి’ అని అమల వ్యాఖ్యానించినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఇందుకు సంబంధించిన వార్తను సురేఖ వాణి కూతురు సుప్రిత తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. దీంతో అమల కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఆమె నిజంగానే ఈ కామెంట్స్ చేసిందా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అమల స్పందించేవరకు వేచి చూడాలి. -
అంబర్‌పేట కుక్కల దాడి ఘటన.. రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లు
సాక్షి, హైదరాబాద్: నగరంలోని అంబర్‌పేటలో కుక్కల దాడిలో చిన్నారి మృతి చెందడం, దానిపై నగర మేయర్ విజయలక్ష్మి స్పందించిన తీరు పట్ల దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ వరుస ట్వీట్లను సంధించారు. ‘పాపం నిరుపేద కుక్కలు వేరే దారి లేక ఆకలి తాళలేక 4 ఏళ్ల బాలుడిని చంపేశాయని మేయర్ అనడం షాకింగ్‌గా.. నమ్మశక్యం కాని విధంగా ఉంది. హృదయాన్ని పిండేస్తున్న బాలుడి వీడియో రిపీటెడ్‌గా నగర మేయర్‌కి చూపించాలి. మేయర్ తన పెట్ డాగ్స్‌కు తినిపిస్తున్న పాత వీడియోను ఆయన షేర్ చేసి...ఈ వీడియోని నగరంలో ఉన్న కుక్కలన్నింటికీ చూపిస్తే.. పిల్లల్ని చంపే బదులు, తమకు ఆకలి వేసినప్పుడు అవి నేరుగా ఆమె ఇంటికి వెళ్లవచ్చు. ఈ ఘటన అనంతరం మేయర్‌గా రిజైన్ చేసి అన్ని కుక్కలను మీ ఇంటికి తీసుకెళ్లి స్వయంగా వాటికి తినిపించవచ్చు కదా? అప్పుడు అవి మా పిల్లల్ని తినవు కదా’ అని వ్యంగాస్త్రాలు విసిరారు. ‘నగరంలోని మొత్తం 5 లక్షల కుక్కల్ని ఒక డాగ్ హోమ్‌లో రౌండప్ చేయండి’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాధినేతలను అభ్యర్థించారు. కుక్కల అంశంపై గురువారం సమావేశం పెట్టామని, చర్చించాం అని మేయర్ చెప్పడంపై స్పందిస్తూ..‘ఏ రకమైన ముగింపునకు వచ్చారు మీరు? అకౌంటబిలిటీ కోసం దీన్ని మీరు పాయింట్ టు పాయింట్ ట్విట్టర్లో పెట్టగలరా?’ అని ప్రశ్నించారు. హైకోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించడంపై ఉపశమనంగా ఉంది’ అని ఆర్జీవీ ట్వీట్ చేశారు. – సాక్షి, సిటీబ్యూరో -
మాంసపు వ్యర్థాలు రోడ్లపై వేస్తే కఠిన చర్యలు
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో వీధి కుక్కల కారణంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు తగిన చర్యలు చేపట్టనున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ప్రజల భద్రత, జీవాల సంరక్షణకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తోందని చెప్పారు. గురువారం వివిధ శాఖల అధికారులతో తన కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశంలో మంత్రి మాట్లాడారు. నగరంలో కుక్కల బెడద నివారణకు నెల రోజుల పాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి స్టెరిలైజేషన్ కార్యక్రమాలు చేయాలని అధికారులను ఆదేశించారు. బస్తీలు, కాలనీలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. నగరంలో కుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి వాటిని హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంరక్షణ కేంద్రాలకు తరలించి ఆహారం, తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో నూతన సంరక్షణ కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పారు. రోడ్లపై కుక్కలకు ఇష్టమొచ్చినట్లుగా ఆహారం వేయడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. షాపుల నిర్వాహకులు మాంసం వ్యర్థాలను రోడ్లపై వేస్తుండటంతో ఆయా ప్రాంతాల్లో కుక్కలు ఎక్కువగా చేరడానికి కారణమవుతోందని పేర్కొన్నారు. మటన్, చికెన్ షాపుల వద్ద శుక్రవారం నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. నిబంధనలు అతిక్రమించి ఎవరైనా రోడ్లపై మాంసపు వ్యర్థాలు వేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుక్కల విషయంలో ప్రస్తుతం 8 ప్రత్యేక టీములతో స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నట్లు చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తాం.. కోతులు, కుక్కల కారణంగా తలెత్తే సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ టోల్‌ఫ్రీ నంబర్ (040–21111111)కు ఫిర్యాదు చేయవచ్చన్నారు. ప్రత్యేక యాప్‌ను కూడా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు వాటి ద్వారా ద్వారా ఫిర్యాదులు చేయొచ్చని తెలిపారు. కోతుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు. ప్రత్యేక అనుభవం ఉన్న వారి ద్వారా నగరంలోని కోతులను పట్టుకొని అటవీ శాఖ అధికారుల సమన్వయంతో వాటిని సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, పశుసంవర్ధక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అధర్ సిన్హా, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, అడిషనల్ కమిషనర్ శ్రుతిఓజా (హెల్త్), పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ జోనల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
GHMC నిర్లక్ష్యంతో పసి బాలుడు చనిపోయాడు: హైకోర్టు
-
కుక్కల దాడిలో బాలుడి మృతి ఘటనపై హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో కుక్కల దాడిలో బాలుడి మృతి కేసుపై తెలంగాణ హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది. జీహెచ్ఎంసీ నిర్లక్ష్యంతోనే బాలుడు చనిపోయాడని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీ ఏం చేస్తోందని ప్రశ్నించింది. నష్టపరిహారం చెల్లింపు అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నామని తెలిపిన కోర్టు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశించింది. విచారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్నించిన ధర్మాసనం.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని జీహెచ్ఎంసీని ఆదేశించింది. తదుపరి విచారణను మార్చి 16కు వాయిదా వేసింది. కాగా గత ఆదివారం అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మరణించిన విషయం తెలిసిందే. పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా ఈ ఘటనను హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది. అసలేం జరిగిందంటే... నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలానికి చెందిన గంగాధర్.. నాలుగేళ్ల క్రితం ఉపాధి నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చి అంబర్‌పేటలో నివాసముంటున్నారు. అంబర్‌పేటలోని ఓ కారు సర్వీసింగ్ సెంటర్లో వాచ్‌మన్‌గా పని చేస్తూ జీవనోపాధి పొందుతున్నారు. గత ఆదివారం గంగాధర్ తన ఆరేళ్ల కుమార్తె, నాలుగేళ్ల కుమారుడు ప్రదీప్‌తో కలసి తాను పని చేస్తున్న సర్వీస్ సెంటర్‌కు వెళ్లారు. కుమారుడిని సర్వీస్ సెంటర్ లోపల ఉంచి తాను పనిచేసుకుంటున్నారు. ప్రదీప్ ఆడుకుంటూ అక్క కోసం కేబిన్ వైపు నడుచుకుంటూ వెళ్తుండగా వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. దీంతో చిన్నారి తల, కడుపు భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన బాలుడి తండ్రి అక్కడికి వచ్చే లోపే చిన్నారి అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. -
వీధి కుక్కల దాడి కేసు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మూడురోజుల కిందట వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం యావత్ ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటనపై ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఈ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గురువారం ఈ ఉదంతంపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఘటనపై పోలీస్ విచారణ సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
వీధి కుక్కల దాడి ఘటనపై స్పందించిన యాంకర్ రష్మీ
హైదరాబాద్ నగరంలో వీధి కుక్కుల దాడిలో మరణించిన చిన్నారి ఘటన ప్రతి ఒక్కరిని కదిలిస్తోంది. ఆదివారం అంబర్ పేట్ పరిధిలో చోటు చేసుకున్న ఈ సంఘటనలో అయిదేళ్ల బాలుడు ప్రదీప్ ప్రాణాలు కొల్పోవడం విషాదకరం. ఈ ఘటనతో రాష్ట్రం ఉలిక్కిపడింది. అంతేకాదు రాష్ట్ర మంత్రి కేటీఆర్ స్పందిస్తూ ఇది అత్యంత బాధాకరమన్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా యాంకర్ రష్మీ గౌతమ్ కూడా ఈ వీధి కుక్కల దాడిపై స్పందించింది. ఈ మేరకు ఆమె ట్వీట్ చేస్తూ ఈ ఘటనపై విచారం వ్యక్తం చేసింది. చదవండి: నటుడు ప్రభుకి తీవ్ర అస్వస్థత, ఆస్పత్రిలో చేరిక ‘అవును.. తన తప్పు లేకుండానే వీధి కుక్కల దాడిలో ఆ చిన్నారి చనిపోయాడు. ఇది అత్యంత బాధాకర విషయం. కానీ ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కుక్కల బర్త్ కంట్రోల్‌కు వ్యాక్సినేషన్‌ను తప్పనిసరిగా అమలు చేయాలి. దానితో పాటు వాటికి సపరేటుగా వసతి కల్పించాలి. ఎందుకంటే అవి కూడా మనలాగే ప్రాణులు’ అంటూ తన ట్వీట్లో రాసుకొచ్చింది. అయితే రష్మీ జంతు ప్రేమికురాలనే విషయం తెలిసిందే. జంతువులపై ఎక్కడ ఎలాంటి ఘటనలు జరిగిన వాటికి సంబంధించిన ఫొటోలు, వీడియోలనుషేర్ చేస్తూ తన ఆవేదనను వ్యక్తం చేస్తుంటుంది. ఇక లాక్డౌన్లో ఆమె వీధి కుక్కలకు ఆహారం పెట్టి మంచి మనసు చాటుకుంది. చదవండి: సినిమాలపై ఆసక్తి లేదు.. కానీ విధే ఇక్కడ నిలబెట్టింది: హీరోయిన్ సంయుక్త Unfortunately yes the little boy did die for no fault of his and a long term solution of birth control,vaccination and shelter shud be implemented Animals are territorial just like us they need there own space https://t.co/GTZ1UhRlCN — rashmi gautam (@rashmigautam27) February 21, 2023 -
కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన ఘటనపై విచారణకు ఆదేశం
-
భాగ్యనగరంలో భయపెడుతున్న కుక్కలు
-
వీధి కుక్కల వీరంగం.. బయటకు వెళ్లాలంటే వణికిపోతున్న జనాలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇటీవల కాలంలో కుక్కుకాటు ప్రమాదాలు భారీగా పెరుగుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌తోపాటు శివారు ప్రాంతాల్లో కుక్కలు చెలరేగిపోతున్నాయి. చిన్నారులు, పెద్దలు అనే తేడా లేకుండా వారిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. రోడ్డు మీద వెళ్లే వారిని భయంకరంగా కరుస్తున్నాయి. కుక్కల దాడిలో పలువురు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. తరచుగా కుక్కలు దాడి చేస్తుండటంతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే వణికిపోతున్నారు. ముఖ్యంగా పిల్లల్ని ఆడుకోడానికి పంపించాలన్నా వెనకడుగు వేస్తున్నారు. భాగ్యనగరంలో భయపెడుతున్న వీధికుక్కలు తాజాగా అంబర్ పేటలో వీధి కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు మృత్యువాతపడ్డాడు. తండ్రితో కలిసి సరాదాగా బయటకు వెళ్లిన ప్రదీప్ అనే చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేశాయి. కుక్కలను చూసి భయపడిన పరుగెత్తిన బాలుడిని వెంటపడీ మరి ఒళ్లంతా తీవ్రంగా గాయపరిచాయి. ఆసుపత్రికి తరలించే లోపే ప్రాణాలు కోల్పోయాడు. అంతకుముందు నగరంలోని పలుచోట్లు ఇలాంటి ఘటనలే చోటుచేసుకున్నాయి. చిన్నారులపై వీధికుక్కలు మూకుమ్మడి దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. 2016 ఫిబ్రవరి 12న కుషాయిగూడలో ఎనిమిదేళ్ల బాలికపై వీధి కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలైన బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందింది. 2020 ఆగష్టు 25న లంగర్‌హౌజ్‌లో నలుగురు చిన్నారులను కుక్కలు విచక్షణరహితంగా కరిచాయి. 2021 జనవరి 30న పాతబస్తీ బహదూర్‌పురాలో బాలుడిపై దాడిచేసిన శనకాలు అతడు ప్రాణాలు విడిచే వరకు వదిలిపెట్టలేదు. 2022 డిసెంబర్ 12న ఫిర్జాదిగూడలో కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే వీధి కుక్కల దాడి ఘటనలు పెరిగిపోతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీ అధికారులపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుక్కల బెడదను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవని మండిపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని తిరగాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల కాకి లెక్కలు! గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో ఒక కోటి 30 లక్షల మంది జనాభా ఉండగా.. మొత్తం కుక్కలు 13 లక్షలు ఉన్నాయి. కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేశామని లెక్కల్లో చూపుతూ 50 కోట్ల రూపాయలను జీహెచ్ఎంసీ , శివారు మున్సిపాల్టీల అధికారులు మింగేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఒక్కో శునకం కుటుంబ నియంత్రణ కోసం రూ. 1,500 ఖర్చు చేసినట్లు అధికారులు లెక్కలో చూపుతున్నారు. ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామంటున్నారు. అయితే కాకి లెక్కలు చెబుతూ అధికారులు డబ్బులు దండుకుంటున్నారనే ఆరోపణలు సైతం వెల్లువెత్తున్నాయి. మరోవైపు అధికారుల లెక్కలు మాత్రం ఇందుకు విరుద్దంగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 4 లక్షల 61 వేల కుక్కలు ఉన్నాయని, వాటిలో 75 శాతం కుక్కలు అంటే 3 లక్షల 20 వేల కుక్కలకు స్టేరలైజేషన్ పూర్తి చేశామని బల్దియా వెటర్నరీ అధికారులు చెబుతున్నారు. బల్దియాతో పాటు 5 ప్రైవేట్ ఏజన్సీలతో కుక్కల ఆపరేషన్ కొనసాగుతోందన్నారు. ఒక్కో కుక్కకు రూ. 1, 500 ఖర్చు చేస్తోందని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 యానిమల్ కేర్ సెంటర్లు ఉన్నాయని ప్రతి రోజు 200 కుక్కలకు ఆపరేషన్ చేస్తున్నామని తెలిపారు. కంప్లయింట్ వచ్చిన చోటుకు వెళ్లి కుక్కను తీసుకువచ్చి ఆపరేషన్ చేస్తున్నామని చెబుతున్నారు.