కురవి: అప్పుడే పుట్టిన పండంటి మగ శిశును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మనుషులెవరూ లేకపోవడంతో వీధికుక్కలు పాపాయిని చుట్టుముట్టాయి. నిమిషాల్లోనే పీక్కుతిన్నాయి. కొద్దిసేపటికిగానూ అటుగా వచ్చిన స్థానికులు.. కుక్కలను అదిలించేలోపే శిశువు ప్రాణాలు కోల్పోయాడు.
మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శిశువును కని పారేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఛిధ్రమైన శిశువు శరీరాన్ని చూసి స్థానిక మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు.
దారుణం; శిశువును పీక్కుతిన్న కుక్కలు
Published Sat, Jun 17 2017 3:22 PM | Last Updated on Mon, Oct 8 2018 5:19 PM
Advertisement
Advertisement