Kuravi
-
ఔషధాల కొండ.. కందికొండ గుట్ట
కురవి: దేశంలో పూర్వకాలంలో ఆయుర్వేద వైద్యం విరాజిల్లింది. ప్రకృతిలో లభించే వనమూలికలు, ఔషధమొక్కలతో పలు రకాల రోగాలను నయం చేసేవారు. ప్రస్తుతం ఆయుర్వేద వైద్యం మనుగడలోకి వస్తోంది. వన మూలిక మొక్కలు ప్రకృతిలో ఎక్కువగా కొండలు, గుట్టల్లో లభిస్తాయి. అలాంటి ఔషధ మొక్కలకు మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కందికొండ గుట్ట నిలయంగా పేరుగాంచింది. మునులు తపస్సు చేసిన ప్రాంతం కందికొండపై ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. కొండపైకి నడక దారి, మార్గమధ్యలో గుహలు, పైన దేవాలయం, కోనేర్లు ఉన్నాయి. ఈ క్షేత్రంలో పూర్వం కపిలవాయి మహాముని, స్కంద మహాముని వంటి వారు తపస్సులు చేసినట్లు చరిత్ర చెబుతోంది. అయితే అప్పటి నుంచి ఈ కొండపై తపస్సుకు వినియోగించే మొక్కలతో పాటు, వైద్యం చేసేందుకు ఉపయోగపడే ఔషధ మొక్కలు కూడా పెంచినట్లు చరిత్ర చెబుతోంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కొండ పరిసర ప్రాంతాలకు వెళ్లగానే ఏదో అనుభూతి, ప్రత్యేకమైన సువాసన వెదజల్లుతోందని స్థానికులు చెబుతారు. మూలికల సేకరణ.. గుట్టపై పెద్ద కందిచెట్టు ఉండేదని, అందుకే ఇది కందికల్ గుట్టగా చరిత్రలో లిఖించి ఉందని పూర్వికులు చెబుతుంటారు. కొండ అనేక వనమూలికలకు ప్రసిద్ధి అని, ఇక్కడికి సాధువులు, కోయ గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు వచ్చి వనమూలికలు, ఔషధ మొక్కలను తీసుకెళ్తుంటారని గ్రామస్తులు చెబుతున్నారు. ఇప్పటికీ కొంత మంది కోయ జాతికి చెందిన గిరిజనులు వచ్చి మొక్కలను తీసుకెళ్తుంటారని చెబుతుంటారు.గుట్ట ఎక్కుతుంటే మధ్యలో భోగం గుడి ఎదురుగా రెండు కోనేర్లు ఉంటాయి. అందులో అనేక ఔషధమొక్కలు కనిపిస్తుంటాయి. గుడి ముందు మరో కోనేరు ఉంటుంది. ఈ కోనేటిలో స్నానాలు ఆచరించడం వల్ల రోగాలు నయమవుతాయని నమ్మకం. అయితే కార్తీక పౌర్ణమితోపాటు, ఇతర శుభ దినాల్లో మూలికలను సేకరిస్తే మంచి ఫలితం ఉంటుందని సాధువులు చెబుతారు. అందుకోసమే తెలంగాణ ప్రాంతంలోని జంగాలు ఈ ప్రాంతం నుంచి ఔషధ మొక్కలు, వన మూలికలు సేకరించి తయారు చేసిన ఆయుర్వేద మందులు చెన్నై, ముంబై, సింగపూర్, ఢిల్లీ వంటి ప్రాంతాలతో పాటు ఇతర దేశాలకు వెళ్లి వైద్యం చేసి వస్తారు.ఔషధ మొక్కల పేర్లు..గుట్టపై ఉన్న కోనేరులో నాలుగు రకాల మొక్కలు కనిపిస్తాయి. ఈరజడ, రక్తజడ, అంతర దామెర, మద్దెడ వీటిని గుట్ట ఎక్కిన భక్తులు తెంపుకుని తీసుకెళ్తుంటారు. ఈరజడ ఆకులను ఇంటికి తీసుకెళ్లి చిన్నారులకు ఊదు పడుతుంటారు. వీటికి తోడు రాజహంస, పరంహంస, పందిచెవ్వు చెట్టు, నల్ల ఉసిరి చెట్టు, అడవి నిమ్మ, బుర్రజమిడి, నల్లవాయిలి చెట్లు ఉన్నాయి. గుడి దగ్గర బండ పువ్వు లభిస్తుంది. అలాగే నాగసారం గడ్డ, నేల ఏను మొక్కల ఆకులను పశువులకు రోగాలు వచ్చినప్పుడు ఉపయోగిస్తారు. కొండ మామిడి చెట్టుతో కాళ్లు, చేతులు విరిగితే కట్టు కడుతుంటారు. పొందగరుగుడు చెక్క, నల్లెడ తీగలు, బురుదొండ, అడవిదొండ లాంటి మొక్కలు లభిస్తా యని గ్రామస్తులు తెలిపారు. గొర్రెలు, మేకల కు రోగాలు వస్తే న యం చేసేందుకు చే గొండ ఆకు, ఉప్పుచెక్క, ముచ్చతునక చెట్టు ఆకులను వాడుతుంటారని గొర్రెలు, మేకల పెంపకందారులు చెబుతున్నారు. అలాగే కలములక చెట్టు మనుషులకు దగ్గుదమ్ముకు, సోమిడిచెట్టు చెక్క, ఆకులు చిన్న పిల్లలకు జబ్బు చేస్తే వాడుతుంటారని చెబుతున్నారు.కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తారు కందికొండ గుట్టపై అనేక ఔషధ మొక్కలుంటాయి. మొక్కల కోసం ఏటా కోయ జాతి గిరిజనులు, ఆయుర్వేద వైద్యులు, సాధువులు వస్తుంటారని గ్రామంలో చర్చించుకుంటారు. కార్తీక పౌర్ణమిరోజు మూలికలు సేకరిస్తే మంచిగా పని చేస్తాయని నమ్మిక. – బి.హేమలత, కందికొండ మాజీ సర్పంచ్ప్రతీ మొక్కలో ఔషధ గుణమే కొండపైన ఉన్న ప్రతీ మొక్కకు ప్రత్యేకత ఉంది. మనం రోజువారీగా చూసే మొక్కలతోపాటు, రకరకాల మొక్కలు దొరుకుతాయి. పెద్ద పెద్ద రోగాలను కూడా నయం చేసే మొక్కలు ఇక్కడ దొరుకుతాయట. దూర ప్రాంతం నుంచి వచ్చిన వారు గొర్రెల కాపరులను తీసుకెళ్లి మొక్కలు తెస్తారు. – మెట్టు ఉప్పల్లయ్య, కందికొండఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి మా ఊరు సరిహద్దులో కందికొండ గుట్ట ఉంటుంది. ఇక్కడ దొరికే ఔషధ మొక్కలు ఎక్కడ దొరకవు అంటారు. ఇంతటి ప్రాధాన్యత ఉన్న గుట్టపై ఉన్న మందు మొక్కలను పరిరక్షించాలి. దీనిని రాబోయే తరాలకు, ఆయుర్వేదంలో ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలి. ఈ ప్రాంతంలో ఆయుర్వేద కళాశాల ఏర్పాటు చేయాలి. – గాండ్ల సతీశ్, సూదనపల్లి -
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
-
అంగన్వాడీ టీచర్‌పై అమానుషం.. దుస్తులు చింపి.. సెల్‌ఫోన్ లాగేసుకుని
మహబూబాబాద్ రూరల్: అంగన్వాడీ టీచర్‌పై స్థానికులు అమానుషంగా ప్రవర్తించారు. ఆమె రాజీనామా కోరుతూ దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మానుకోట మండలంలోని ఇస్లావత్‌తండా గ్రామపరిధిలోని తేజావత్తండాలో చోటుచేసుకుంది. కురవి ఎస్సై బి.రాణాప్రతాప్ వివరాల ప్రకారం.. ఆ గ్రామంలోని అంగన్వాడీ టీచర్ కమల. అంగన్వాడీ కేంద్రం నిర్వహణ విషయంలో కొంతకాలంగా టీచర్‌కు, స్థానికులకు మధ్య వ్యక్తిగత గొడవలు జరుగుతున్నాయి. అవికాస్త పెరిగి సోమవారం రాత్రి ఘర్షణకు దారితీశాయి. స్థానికుల దాడిలో కమల గాయపడింది. పుస్తెలతాడు, సెల్‌ఫోన్ ఎత్తుకెళ్లారని బాధితురాలు వాపోయింది. దుస్తులు చింపేసి దాడికి పాల్పడ్డారు. స్థానిక సర్పంచ్ రాజీనామా చేయాలని ఒత్తిడి చేశారని.. అందుకు అంగీకరించకపోవడంతో దాడి చేశారని ఆరోపించింది. దాడి అనంతరం కురవి పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని ఎస్సై రాణా ప్రతాప్ తెలిపారు. ఉద్యోగానికి రాజీనామాచేయాలంటూ డిమాండ్ చేశారు. -
ఇది ఫ్యాన్ అనుకుంటే పొరపాటే..
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కురవిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అందరికి నేరుగా శానిటైజర్ అందించడం వీలు కాకపోవడంతో ప్రత్యేక ఫ్యాన్ వంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కింది భాగంలోని ట్యాంకులో శానిటైజర్ ద్రావణం పోస్తే, పైపుల ద్వారా పైకి వెళ్లి ఫ్యాన్ రెక్కలు తిరిగే క్రమంలో మధ్యలో నుంచి చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది. ఆ ప్రాంతంలో చేతులు పెడితే శానిటైజర్ పడేలా ఈ ఏర్పాటు చేశారు. -
వార్ కాకి.. వార్ కాక...!
సాక్షి, కురవి: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (బుధవారం) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్ర లేచిన మంత్రి... వేప పుల్లతో పండ్లు తోముకుంటూ సొంతూరులో జరిగిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. జనం వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వార్ కాకి.. వార్ కాకా... వార్ బాబు.. వార్ బాయి..(ఎలా ఉన్నావు చిన్నమ్మ, చిన్నాయన, బాపు, అక్కా) అని పలకరిస్తూ వాడవాడలా కలియ తిరిగారు. ఊరిలోని నర్సరీని పరిశీలించి మొక్కలు బాగా పెరగడంతో సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందని చెప్పారు. 30 ఏళ్లుగా గ్రామస్తులతో తనకు అనుబంధం ఉందన్నారు. పెద్ద తండాలో పల్లెప్రగతిని పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి -
అన్నదమ్ముల ప్రాణం తీసిన పండుగ సెలవులు
సాక్షి, కురవి: సద్దుల బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు రావడంతో ఆనందంగా గడుపుదామని వచ్చిన అన్నదమ్ములను ఈత సరదా రూపంలో మృత్యువు కాటేసింది. ఈ హృదయవిదారక సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. కురవి మండలం సూదనపల్లికి చెందిన పొల్లూరి లక్ష్మీ, సోమయ్య దంపతులకు వేణుమాధవ్(18), వరుణ్‌తేజ్(14) సంతానం. కుటుంబంతో కొంతకాలంగా హైదరాబాద్‌లో ఉంటున్నారు. దసరా సెలవులు రావడంతో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ అమ్మమ్మ పద్మతో కలసి గురువారం కురవిలోని చిన్నమ్మ గుండేటి రాధిక, రవి ఇంటికి వచ్చారు. భోజనం చేసిన తర్వాత చిన్నమ్మ కొడుకు ధనుష్, అతడి స్నేహితులు జక్కుల గణి, నద్దునూరి వెంకటేశ్‌తో కలసి ఈత కొట్టడానికి చెరువు వద్దకు వెళ్లారు. నీళ్లు తక్కువగా ఉండడంతో సమీపంలోని మండలి వీరయ్యకు చెందిన వ్యవసాయ బావి వద్దకు చేరారు. వెంకి, గణి బావిలోకి దిగి ఈతకొడుతుండగా ధనుష్ ఒడ్డున ఉన్నాడు. ఈ క్రమంలో వేణుమాధవ్, వరుణ్‌తేజ్ ఒడ్డున ఉన్న కట్టెను పట్టుకుని బావిలోకి దిగే ప్రయత్నంలో నీళ్లలో పడిపోయారు. ఈత రాకపోవడంతో నీటిలో మునుగుతుండగా.. అప్పటికే బావిలో ఉన్న వెంకి, గణి భయంతో బయటకు వచ్చి ధనుష్‌తో కలసి పరుగున ఊర్లోకి వెళ్లి కుటుంబ సభ్యులకు చెప్పారు. రాధికతో పాటు భర్త రవి, కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బోరున విలపించారు. విషయం గ్రామస్తులు, చుట్టుపక్కల వారికి తెలియడంతో పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్థానిక ఎస్సై శంకర్రావుకు సమాచారం అందడంతో సిబ్బందితో అక్కడికి చేరుకుని స్థానిక యువకుల సాయంతో మృతదేహాల కోసం గాలించారు. మానుకోట నుంచి అగ్నిమాపక శాఖ అధికారి కొమురయ్య, సిబ్బంది వచ్చి రెండు గంటల పాటు శ్రమించిన అనంతరం మృతదేహాలను బయటకు తీసి ఆటోలో వారి చిన్నమ్మ రాధిక ఇంటికి తరలించారు. ఏం పాపం చేశాం బిడ్డా.. ‘ఏం పాపం చేశాం బిడ్డా.. మమ్ములను అన్యాయం చేసి వెళ్లిపోయారా?’.. అంటూ అక్కడికి చేరుకున్న తల్లి లక్ష్మీ మృతదేహాలపై పడి బోరున విలపించింది. ఆ హృదయ విదారక దృశ్యాన్ని చూపిన ప్రతిఒక్కరూ కన్నీటిపర్యంతమయ్యారు. ఇద్దరు చిన్నారులు మృతి చెందడంతో కురవితోపాటు సూదనపల్లిలో విషాదం అలుముకుంది. మృతుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై శంకర్రావు తెలిపారు. సంఘటన స్థలానికి మానుకోట ఆర్డీఓ కొమురయ్య, ఇన్చార్జ్ తహసీల్ధార్ శేషగిరిస్వామి, సీఐ వెంకటరత్నం చేరుకుని వివరాలను సేకరించారు. ఎమ్మెల్యే పరామర్శ.. డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ కురవికి చేరుకుని మృతదేహాలపై పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబసభ్యులను ఓదార్చారు. కుటుంబాన్ని ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీటీసీ చిన్నంభాస్కర్, టీఆర్ఎస్ నాయకులు బాదావత్ రాజునాయక్, సోమిశెట్టి శ్రీనివాస్, మేక నాగిరెడ్డి, తుకారాంనాయక్ ఉన్నారు. మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం ఇద్దరు చిన్నారులు బావిలో పడిపోయి మృతి చెందిన విషయం తెలుసుకున్న రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సంతాపం వ్యక్తం చేశారు. కుటుంబానికి సానుభూతిని తెలిపారు. -
నింద మోపారని యువకుడి ఆత్మహత్య
కురవి(డోర్నకల్) : తనపై దొంగతనం నెపం మోపి, తరచూ వేధింపులకు గురి చేస్తుండడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కురవి మండలం మొగిలిచర్ల శివారు జగ్యాతండాలో శుక్రవారం సాయంత్రం జరిగింది. బాధిత కుటుంబ సభ్యుల కథనంప్రకారం... జగ్యా తండాకు చెందిన బానోతు శ్రీను(21) తన భార్య సంధ్య, కూతురితో కలిసి బతుకుదెరువు కోసం హైదరాబాద్ వెళ్లాడు. ఇదే తండాకు చెందిన నూనావత్ కరుణాకర్ మానుకోటలోని వసుమతిరెడ్డి ఆస్పత్రిలో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గత మూడు నెలల క్రితం హైదరాబాద్‌లో ఉంటున్న శ్రీనుతో ఫోన్లో మాట్లాడి, దూరంగా బతకడం ఎందుకని, ఇక్కడికి వస్తే పని ఇప్పిస్తానని భరోసా ఇచ్చాడు. దీంతో శ్రీను తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి తండాకు వచ్చాడు. కరుణాకర్ తాను పనిచేసే ఆస్పత్రిలోనే శ్రీనును వాచ్‌మెన్‌గా పనికి కుదిరించాడు. ఈ క్రమంలో ఆస్పత్రిలో ఉండే సామగ్రి ఒక్కొక్కటి కనిపించడం లేదని, నువ్వే ఆ సామగ్రిని ఎత్తుకెళ్లావంటూ శ్రీనుపై కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్ నిందలు మోపారు. కాగా ఆస్పత్రిలోని కొలకుండ అనే వస్తువు కూడా మాయమైందని, దీన్ని కూడా నీవే తీశావని, నీపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని శుక్రవారం శ్రీనును కరుణాకర్‌తోపాటు, ఆస్పత్రిలోని మేడమ్ బెదిరించారు. తాను దొంగతనం చేయలేదని పలుమార్లు బతిమిలాడినా వారు వినిపించుకోలేదు. దీంతో తీవ్రమనోవేదనకు గురైన శ్రీను శుక్రవారం సాయంత్రం ఇంటికి చేరుకుని ఇంట్లో ఎవరూ లేని సమయంలో సూసైడ్‌నోట్‌లో ‘నా పేరు శ్రీను, నా చావుకు డీఆర్ కరుణాకర్, అందులో పనిచేసే మేడమ్ కారణం’ అని రాశాడు. ఆ తర్వాత ఇంటి పై కప్పుకున్న కొక్కానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంతలో బయటికి వెళ్లిన భార్య సంధ్య తలుపులు నెట్టి చూసేసరికి భర్త మృతదేహం వేలాడుతూ కనిపించడంతో ఒక్కసారిగా కేకలు పెడుతూ బయటికి పరుగులు తీసింది. చుట్టుపక్కల వారు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారమిచ్చారు. ఎస్సై నాగభూషణం వచ్చి శవపంచనామా నిర్వహించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
చెరువును లూటీ చేశారు..
కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండల కేంద్రంలోని పెద్ద చెరువులో శనివారం సాయంత్రం పెద్ద ఎత్తున ప్రజలు చేరుకుని వలల సాయంతో చేపలను పట్టుకెళ్లారు. అయితే మత్స్యకారులు చేపలు పట్టడం పూర్తయిందనే దష్ప్రచారంతోనే జనం తమ చెరువును లూటీ చేసినట్లు కార్మికులు ఆరోపించారు. వివరాలు ఇలా ఉన్నాయి.. కురవిలోని పెద్ద చెరువులో మత్స్యకార్మికులు కొన్నేళ్లుగా చేపలను పెంచుకుంటున్నారు. అయితే మత్స్యకార్మికులు చేపలు పట్టడం చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు వద్ద కాపలాగా ఉన్న కార్మికులపై వందలాది మంది దాడి చేసి చెరువులోకి దిగి చేపలను పట్టుకున్నారని మత్స్యకార్మికులు లింగరబోయిన శ్రీను, రేషబోయిన నారాయణ, కొణతం పెంటయ్య, మామిడి యాకన్న, వెంకన్న, వీరన్న, రాజు, కృష్ణ, వీరేందర్ తెలిపారు. చెరువులో చేపలు పుష్కలంగా ఉన్నాయని చెరువును వదిలిపెట్టలేదని వారు తెలిపారు. కురవికి చెందిన కొందరు వ్యక్తులు కుట్ర చేసి చెరువులో చేపలు పట్టడం పూర్తయిందని దుష్ప్రచారం చేశారని, దీంతో కురవి గ్రామస్తులు, తండా గిరిజనులతోపాటు సమీప గ్రామాల నుంచి ప్రజలు వచ్చి వలలతో చేపలను పట్టుకెళ్లారని పేర్కొన్నారు. ఈ విషయమై కురవి పోలీసులకు ఫిర్యాదు చేశామని కార్మికులు తెలిపారు. చేపలు అయిపోయాయనే.. చెరువులో చేపలు పట్టడం పూర్తయిందనే సమాచారంతో కురవితో పాటు చుట్టుపక్కల తండాలకు చెందిన గిరిజనులు, పలు గ్రామాలకు చెందిన ప్రజలు పెద్ద ఎత్తున చేరుకుని చెరువులో చేపలు పట్టుకున్నారు. దీంతో చెరువులో ఎక్కడ చూసినా జనమే కనిపించారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
కురవి/మహబూబాబాద్ రూరల్: రోడ్డు ప్రమాదంలో ఓ బాలుడు మృత్యువాతకు గురికాగా మరో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన కురవి మండలంలోని కాంపల్లి శివారు సత్యమాత ఆలయం సమీపంలో ఖమ్మం ప్రధాన రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన విద్యుత్ స్తంభానికి ఢీకొనడంతో ఈ సంఘటన చోటు చేసుకుంది. సీరోలు ఏఎస్సై సారమల్లు కథనం ప్రకారం.. మహబూబాబాద్ పట్టణం మార్నేనినగర్‌కు చెందిన మార్నేని వేణు, భార్య సునీత, కుమారులు మ నుచరణ్, శ్రీహర్షతో పాటు వేణు బంధువులైన సూరి శెట్టి శ్రీనివాసరావు, భార్య అనిత, కుమార్తె విదాత్రి మహబూబాబాద్ నుంచి విజయవాడకు గత సోమవారం వెళ్లారు. విదాత్రికి ఆరోగ్య సమస్యలుండడంతో విజయవాడలో చికిత్సకోసం కారులో వెళ్లారు. చికిత్స అనంతరం సోమవారం రాత్రి అదే కారులో విజయవాడ నుంచి ఖమ్మంకు చేరుకున్నారు. ఖమ్మం నుంచి కురవి మీదుగా మహబూబాబాద్‌కు వస్తుండగా కురవి శివారులోని సత్యమాత గుడి సమీపంలోకి రాగానే సోమవారం తెల్లవారుజామున(మంగళవారం) కారు ఒక్కసారిగా పల్టీకొట్టింది. కారును శ్రీనివాసరావు డ్రైవింగ్ చేస్తున్నాడు. కారు పల్టీకొట్టి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభానికి ఢీకొంది. ఈ ఘటనలో మార్నేని మనుచరణ్(13) అక్కడికక్కడే మృతి చెందాడు. అందులో ప్రయాణిస్తున్న మార్నేని వేణుకు ఎడమకాలు విరిగి కిడ్నీల వద్ద బలమైన గాయమైం ది. వేణు భార్య సునీతకు, కుమారుడు శ్రీహర్షకు, వేణు సడ్డకుడైన సూరిశెట్టి శ్రీని వాసరావుకు, అతని భార్య అని తకు, కు మార్తె విధాత్రికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే శ్రీనివాసరావు 108కి సమాచారం అందజేయడంతో హుటాహుటిన క్షతగాత్రులను మహబూబాబాద్‌లోని ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో మనుచరణ్ మృతదేహం వద్ద బంధువుల రోధనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సారమల్లు తెలిపారు. గణపురంలో.. గణపురం(భూపాలపల్లి): గణపురం మండలంలోని బస్వరాజుపల్లె కాకతీయ లాంగ్వాల్ ప్రాజెక్టు సమీపంలో గొల్లపల్లె క్రాస్ వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందాడు. గణపురం ఏఎస్సై యాకుబ్‌అలీ కథనం ప్రకారం.. గణపురం మండలకేంద్రానికి చెందిన కొయ్యల కృష్ణంరాజు అనే వ్యక్తి స్థానిక ద్విచక్రవాహన షోరూంలో పని చేస్తున్నాడు. సోమవారం సాయంత్రం కృష్ణంరాజు అతని ద్విచక్ర వాహనంపై భూపాలపల్లికి వెళ్లి రాత్రి 9గంటలకు తిరిగివస్తుండగా గొల్లపల్లె క్రాస్ వద్ద ఉన్న స్పీడ్ బ్రేకర్‌ను గమనించకుండా అతివేగంతో వచ్చి ఢీ కొట్టాడు. దీంతో అతను బండిపై నుంచి కింద పడగా తలకు బలమైన గాయాలయ్యాయి. గమనించిన సింగరేణి ఉద్యోగులు వెంటనే 108కి సమాచారం అందించడంతో కృష్ణంరాజును సింగరేణి ఏరియా ఆస్పత్రికి తరలించారు. అక్కడ నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించారు. అక్కడ కూడా వైద్యులు పరిస్థితి విషమించిందని తెలపడంతో హైదరాబాద్‌కు తరలిస్తుండగా మార్గమద్యలోనే మృతి చెందాడు. మృతుడికి భార్య మాధవి, రెండు సంవత్సరాల కూతురత్సుంది. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు. -
వివాహేతర సంబంధం..యువకుడి హత్య
మహబూబాబాద్ : కురవి మండలం బలపాల శివారు లింగ్యా తండాలో బాణోత్ రవీందర్(29) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు..లింగ్యా తండాకు చెందిన బాణోత్ రవీందర్‌కు సునీత, ప్రమీల అనే ఇద్దరు భార్యలున్నారు. వీరిద్దరితో కలిసి హైదరాబాద్‌లోని షాపూర్లో నివాసం ఉంటున్నాడు. అందరూ కలిసి ఓ రెస్టారెంట్లో పనిచేస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం మొదటి భార్య సునీత, భర్తల గొడవలు జరిగాయి. మొదటి భార్య వేరొకరితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు తెలియడంతో ఆమెను అత్తగారింటికి తీసుకొచ్చి పంచాయతీ చేశాడు. ఇదే విషయంలో పంచాయతీ కొనసాగుతుండగా రవీందర్ అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. గుర్తుతెలియని ముగ్గురు వ్యక్తులు ముసుగు ధరించి కారులో వచ్చారని, వాళ్లే గొంతు నులిమి చంపేశారని రవీందర్ కుమారుడు మనోజ్ చెబుతున్నాడు. పెనుగులాటలో ముఖంపై గోళ్లతో గీకిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. పెద్ద భార్య సునీతనే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దారుణం; శిశువును పీక్కుతిన్న కుక్కలు
కురవి: అప్పుడే పుట్టిన పండంటి మగ శిశును గుర్తుతెలియని వ్యక్తులు రోడ్డు పక్కన పడేసి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ మనుషులెవరూ లేకపోవడంతో వీధికుక్కలు పాపాయిని చుట్టుముట్టాయి. నిమిషాల్లోనే పీక్కుతిన్నాయి. కొద్దిసేపటికిగానూ అటుగా వచ్చిన స్థానికులు.. కుక్కలను అదిలించేలోపే శిశువు ప్రాణాలు కోల్పోయాడు. మహబూబాబాద్ జిల్లా కురవి గ్రామంలో శనివారం ఈ దారుణ సంఘటన చోటుచేసుకుంది. గ్రామస్తుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. శిశువును కని పారేసింది ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిగా ఛిధ్రమైన శిశువు శరీరాన్ని చూసి స్థానిక మహిళలు కన్నీరుమున్నీరుగా విలపించారు. -
వీరభద్రుడికి కోరమీసాలు
-
కాంగ్రెస్ ఓ దొంగల ముఠా!
ప్రాజెక్టులను అడ్డుకుంటూ చిల్లర రాజకీయాలు చేస్తున్నారు: కేసీఆర్ ► కురవిలో వీరభద్రుడికి కోరమీసాల మొక్కు చెల్లింపు సాక్షి, మహబూబాబాద్: రాష్ట్రంలో తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకుంటూ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మండిపడ్డారు. గ్రీన్ ట్రిబ్యునల్, కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. ప్రాజెక్టులను అడ్డుకునేం దుకు ఓ దొంగల ముఠా తయారైందని విమర్శించారు. ఇక దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని.. రూ.36 వేల కోట్లతో గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రంలో గుంట పొలం కూడా ఎండిపోకుండా ఉండేందుకు ఇప్పటికే 9,500 మెగావాట్ల విద్యుత్‌ను కొనుగోలు చేసి పంటలకు విద్యుత్ సరఫరా చేస్తున్నామని.. మరో 500 మెగావాట్లు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ‘తెలంగాణ’ మొక్కుల్లో భాగంగా సీఎం కేసీఆర్ శుక్రవారం మహబూబాబాద్ జిల్లా కురవిలోని శ్రీవీరభద్ర స్వామిని దర్శించు కున్నారు. రూ.62,908 వ్యయంతో 20.28 గ్రాముల బరువుతో తయారు చేయించిన కోర మీసాలను వీరభద్రుడికి సమర్పించి.. ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చిన్నగూడురు మండలం ఉగ్గంపల్లిలోని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ ఇంట్లో భోజనం చేశారు. తర్వాత అక్కడే విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ నేతలవి బానిస బతుకులు.. ప్రజలు 40 నుంచి 44 ఏళ్లు కాంగ్రెస్ నాయకులకు అవకాశమిస్తే ఏమీ చేయలేదని.. ఇప్పుడు తమ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే అడ్డుపడుతున్నారని కేసీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ తరఫున కొల్లాపూర్ నుంచి పోటీ చేసిన హర్షవర్దన్ రెడ్డి కోర్టుల్లో కేసులు వేయిస్తున్నారని, వాటిపై స్పష్టమైన ఆధారా లతో అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. ‘‘ఆంధ్రా ముఖ్యమంత్రులకు సంచులు మోసిన చరిత్ర కాంగ్రెస్ నేతలది. వారివి బానిస బతుకులు. కాంగ్రెస్ కల్చర్ చీప్ లిక్కర్ పంచే కల్చర్. ప్రాజెక్టులను అడ్డుకునేందుకు దొంగల ముఠా తయారైంది. చిల్లర రాజకీయాలు చేస్తూ కాంగ్రెస్ నేతలు రైతుల నోట్లో మట్టికొడుతున్నారు..’’అని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడి మొక్కుల విషయంలో కొందరు సన్నాసులు రాజకీయం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కాలం చెల్లిన కమ్యూనిస్టులు అడ్డగోలు విమర్శలు చేస్తున్నారని.. ప్రజలందరూ బాగుండాలని తలపెట్టిన యాగంపై సురవరం సుధాకర్‌రెడ్డి విమర్శలు చేయడం సరికాదని పేర్కొన్నారు. త్వరలోనే టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన వరంగల్ రూరల్ జిల్లాలో త్వరలోనే టెక్స్టైల్ పార్క్‌కు శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. సూరత్, భీవండికి వలస వెళ్లిన వారంతా తిరిగి వచ్చేలా ఈ టెక్స్టైల్ పార్క్‌ను ఏర్పాటు చేస్తున్నామని.. దీనికి భూసేకరణ కూడా పూర్తయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాత వరంగల్ జిల్లాను సస్యశ్యామలం చేస్తామన్నారు. డోర్నకల్ నియోజకవర్గానికి తాత్కాలికంగా పాలేరు నుంచి నీరందిస్తామని హామీ ఇచ్చారు. మల్కాపూర్ దగ్గర రిజర్వాయర్ కావాలని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య కోరారని.. దానికి కేబినెట్ ఓకే చెప్పిందని వెల్లడించారు. ఈసారి బీసీల బడ్జెట్ ఈ ఏడాది రూ.10–12 వేల కోట్లతో బీసీల బడ్జెట్ ఉంటుందని కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో 64 లక్షల మంది సంచార జాతుల వారు ఉన్నారని, వారి కోసం రూ.వెయ్యి కోట్లతో ఎంబీసీ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలోని యాదవుల కోసం రూ.4 వేల కోట్లతో 88 లక్షల గొర్రెలు పంపిణీ చేయబోతున్నామని తెలిపారు. నాయీ బ్రాహ్మణులు చెట్ల కింద, చెరువు కట్ట మీద క్షవరాలు చేసే పద్ధతి పోవాలని, రాష్ట్రవ్యాప్తంగా 40 వేల వరకు హైజెనిక్ సెలూన్లను ఏర్పాటు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇక రజకులకు డ్రైయింగ్ మిషన్, వాషింగ్ మిషన్లు అందజేసి అత్యాధునిక లాండ్రీ షాపులు ఏర్పాటు చేయిస్తామన్నారు. వీరభద్రుడి ఆలయానికి రూ.5 కోట్లు.. డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక ఫండ్ నుంచి రూ.28.25 కోట్లు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. అందులో కురవి వీరభద్ర స్వామి ఆలయ అభివృద్ధికి రూ.5 కోట్లు, డోర్నకల్, మరిపెడ మండల కేంద్రాలకు రూ.కోటి చొప్పున, మిగతా 4 మండల కేంద్రాలకు రూ.50 లక్షల చొప్పున ఇస్తామ ని నియోజకవర్గంలోని 77 గ్రామ పంచాయ తీలకు రూ.25 లక్షల చొప్పున మంజూరు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి కడియం, మంత్రులు ఇంద్రక రణ్‌రెడ్డి, అజ్మీరా చందూలాల్, ఎంపీలు సీతారాం నాయక్, పసునూరి దయాకర్, ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, శంకర్‌నాయక్, కోరం కనకయ్య, కొండా సురేఖ, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, చల్లా ధర్మారెడ్డి, ఆరూరి రమేష్, ఎమ్మెల్సీలు కొండా మురళీ, బోడకుంటి వెంకటేశ్వర్లు ఉన్నారు. -
24న కురవికి సీఎం
వీరభద్ర స్వామికి బంగారు కోర మీసాలు సమర్పించనున్న కేసీఆర్ సాక్షి, మహబూబాబాద్: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఈ నెల 24న మహబూబాబాద్ జిల్లాలోని కురవికి రానున్నారు. 2001లో తెలంగాణ ఉద్యమంలో భాగంగా కురవి శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్వామివారికి కోరమీసాలు సమర్పిస్తానని మొక్కుకున్నారు. ఈ మేరకు సీఎం మొక్కులు చెల్లించేందుకు వస్తున్నారు. ఇప్పటికే వరంగల్ అర్బన్ జిల్లాలోని శ్రీభద్రకాళి అమ్మవారికి కిరీటం, తిరుపతి వెంకటేశ్వరస్వామికి ఆభరణాలు సమర్పించారు. కాగా, సీఎం రాక సంద ర్భంగా అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. -
మిరప తోటకు నిప్పు
∙కాత, పూత లేకపోవడంతో రైతుల వేదన కురవి : రెండున్నర నెల లు కష్టపడి సాగుచేసిన మిరపపంట..కాత, పూత లేకపోవడంతో రైతులు తోటను అగ్గిపా లు చేశారు. తాము వేసినవి నకిలీ విత్తనాలు అని తేలడంతో వారి కం ట కన్నీరు వస్తోంది. ఇక దిగుబడి రాదని తెలుసుకున్న రైతులు పంటకు నిప్పు పెట్టిన ఘటన కురవి మండలం పో లంపల్లి తండాలో సోమవారం చో టుచేసుకుంది. తండాకు చెందిన సపావట్ బాలు, సపావట్ బిక్షం, గుగులోత్ భాస్కర్, బాదావత్ బాలు మరికొందరు రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పూత, కాత రావాల్సిన సమయం. ఏపుగా పెరిగిన మిరప తోటను చూసి సంతోషపడిన రైతులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పంట ఏపుగా పెరుగుతున్నా పూత, కాత లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. అ వి నకిలీ విత్తనాలని తెలియగానే కన్నీరు పె ట్టారు. ఏపుగా పెరిగిన మిరపచెట్లను కూలీల తో తీసివేయించి కిరోసి¯Œన పోసి నిప్పుపెట్టారు. నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులపై చర్య తీసుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
ఆడపిల్ల అమ్మకం!
కురవిలో ఘటన కురవి : ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు.. కొడుకు కోసం చూస్తే ఐదో కాన్పులోనూ అమ్మాయే పుట్టింది. దీంతో పోషించలేమనే భయంతో ఆ పాపను పది రోజుల క్రితం విక్రయించగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కురవిలో చోటుచేసుకుంది. కురవి మండల కేంద్రంలో చెంచు(గిరిజన) తెగకు చెందిన మండల వెంకన్న దంపతులకు ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కుమారుడి కోసం చూస్తుండగా ఐదో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. దీంతో పుట్టిన పాపను వేరే వారికి విక్రయించారు. మానుకోట చైల్డ్‌లైన్ సంస్థకు ఈ విషయం తెలియడంతో సంస్థ ప్రతినిధులు కురవి ఎస్సై అశోక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులను సోమవారం స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేశారు. అయితే పాపను విక్రయించలేదని, తమ బంధువులకు పిల్లలు లేకపోవడంతో వారికి ఇచ్చామని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. రెండు రోజుల్లో బాలికను తీసుకొస్తామని బంధువులు చెప్పారని, ఆ తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామని వివరించారు. -
ప్రాణం తీసిన బెల్లం అక్రమ రవాణ
కురవి : బెల్లం అక్రమ రవాణా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన మండలంలోని నేరడ శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరడ శివారు కాకులబోడు తండాకు చెందిన బానోత్ లాల్‌సింగ్(22), గుగులోత్ రెడ్డి, గుగులోత్ నరేష్ రెండు ద్విచక్రవాహనాలపై బెల్లం బస్తాలు తెచ్చేం దుకు మహబూబాబాద్ మండలంలోని చోక్లాతండాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయినిపట్నం క్రాస్ రోడ్ వద్ద ఓ వాహనం వెళ్తుండడాన్ని చూసి పోలీ సులుగా భావించి తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పక్కన ఆపారు. బెల్లం బస్తాలు పక్కన పడేసి సమీపంలోని మిరపతోటలోకి వెళ్లారు. కాగా, తోటలో ఉన్న మరో వ్యక్తి వీరిని చూసి ‘దొంగలు..దొంగలు..’ అని అరిచాడు. దీంతో ఆ ముగ్గురూ పరుగుతీశారు. ఈ క్రమంలో బానోత్ లాల్‌సింగ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. రెడ్డి, నరేష్ రోడ్డుపైకి వచ్చి తమ బైక్‌పై కాకులబోడు తండాకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక లాల్‌సింగ్ బావిలో పడ్డాడని, అందులో వెతకాలని బంధువులకు ఫోన్ చేశారు. తండాలోని కొందరు వ్యక్తులు బావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్లతో వెతికినా కనిపించలేదు. ఈలోగా మిరప తోటలోని వ్యక్తి సమాచారం అందించడంతో రాత్రి 12 గంటలకు పోలీసులు వచ్చి బెల్లం బస్తాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బావిలో వెతికి లాల్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
బావిలో పడి యువరైతు మృతి
కురవి (వరంగల్) : వ్యవసాయ బావి వద్ద మోటర్ ఆన్ చేయడానికి వెళ్లిన యువ రైతు ప్రమాదవశాత్తు బావిలో పడి మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం నెరెడ పంచాయతి పరిధిలోని ఎల్కచెట్టు తండాలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తండాకు చెందిన లాల్ సింగ్(23) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆదివారం ఉదయం మోటర్ ఆన్ చేయడానికి వెళ్లి.. కాలు జారి బావిలో పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
నారాయణపురంలో జ్వరాలు
∙వైద్యం అందక అవస్థలు నారాయణపురం(కురవి): మండలంలోని నారాయణపురం గ్రామంలో జనం జ్వరాలతో బాధపడుతున్నారు. ఇంటికొక్కరు జ్వరంతో ఇబ్బంది పడుతున్నారు. నారాయణపురం గ్రామానికి చెందిన నిమ్మల రాజమల్లు, గాదె పిచ్చమ్మలతోపాటు మరికొందరు జ్వరంతో మంచం పట్టారు. వైద్య సిబ్బంది సకాలంలో వైద్యం అందించడంలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీజనల్ వ్యాధులు ప్రభలుతున్నా గ్రామంలో వైద్య సేవలందించకపోవడంతోనే జ్వరంతో స్థానికులు బాధపడాల్సి వస్తుందని తెలిపారు. వెంటనే వైద్య సేవలందించాలని కోరుతున్నారు. -
ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నం
ముసుగులతో వచ్చి సీసీ కెమెరాలు ధ్వంసం చేసిన దుండగులు మూడు గంటల పాటు బ్యాంకులోనే.. భద్రంగానే నగదు, రూ.4కోట్ల విలువైన బంగారం కురవిలో సంచలనం సృష్టించిన ఘటన కురవి : మండల కేంద్రంలోని ఆంధ్రాబ్యాంకులో ఆదివా రం అర్ధరాత్రి కొందరు దుండుగులు దోపిడీకి యత్నిం చిన ఘటన సంచలనం సృష్టించింది. కురవి ఎస్సై జె.రామకృష్ణ, బ్యాంకు మేనేజర్ అజిజ్ కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి.. కురవిలో ది ఆంధ్రాబ్యాంకు కర్షక సహకార సేవా సంఘం భవన సముదాయంలో ఆంధ్రాబ్యాంకు కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. అయితే, ఆదివారం అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో గుర్తు తెలి యని వ్యక్తులు ముసుగులు ధరించి చేతిలో రాడ్లు, టార్చి లైట్లతో వచ్చిఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో కర్షక సేవాసహకార సంఘం తలుపులను పగులగొట్టారు. అందులో నుంచి లోపలకు వెళ్లిన వారు గదిలోని బీరువాలను పగులగొట్టేందుకు యత్నించారు. అయితే, అది బ్యాంకు కాదని గుర్తించిన వారు ఆంధ్రాబ్యాంకు వెనుక భాగంలో ఉన్న తలుపు వద్దకు చేరుకుని గునపంతో పగులగొట్టారు. తలుపు వెనుక సిమెంట్ ఇటుకల గోడకు రంధ్రం చేసి ఆగంతకుల్లో ఒకరు బ్యాంకులోకి వెళ్లాడు. ఆ తర్వాత గదిలోని సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ఐదింటిని ధ్వంసం చేయడంతో పాటు మరో కెమెరాను పైకి లేపాడు. అదేగదిలోని హారన్ మోగకుండా తీగలు తెంచేశారు. అక్కడి నుంచి లాకర్లు ఉన్న గదిలోకి వెళ్లిన ఆగంతకుడు టార్చ్‌లైట్ వేసుకుని మరీ లాకర్లు తెరిచేందుకు యత్నించాడు. అలా లోపలకు ప్రవేశించినప్పటి నుంచి మూడు గంటల పాటు లోపలే ఉండగా దోపిడీ సాధ్యం కాకపోవడంతో సోమవారం తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో బయటకు వచ్చారు. కాపలాగా నైట్ వాచ్మెన్లు సహకార సంఘంలో గంగరబోయిన సత్యం, ఆంధ్రాబ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో దయాకర్ అనే వ్యక్తులు రాత్రి పూట నైట్ వాచ్మన్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు. సొసైటీలోకి ప్రవేశించి తలుపు పగులకొట్టిన విషయాన్ని పక్క గదిలో నిద్రించిన నైట్ వాచ్మెన్ గ్రహించలేదు. సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి బయటకు వస్తుండగా దోపిడీ యత్నం జరిగిన విషయాన్ని గుర్తించి సొసైటీ అధికారులు, బ్యాంకు మేనేజర్, క్యాషియర్ రంజిత్‌కు తెలిపారు. దీంతో వారు పోలీసులు తెలపగా కురవి సీఐ శ్రీనివాస్‌నాయక్, ఎస్సై రామకృష్ణ చేరుకున్నారు. అలాగే, మానుకోట సీఐ నందిరాంనాయక్, క్లూస్‌టీం ఎస్సై రఘు ఆధ్వర్యంలోని బృందం వచ్చి ఫింగర్ప్రింట్లు సేకరించారు. ఆంధ్రాబ్యాంకు డీజీఎం శివప్రసాద్, ఏజీఎం సూర్యనారాయణ, సెక్యూరిటీ అధికారి గిరిష్ప్రసాద్కుమార్ వచ్చి వివరాలను తెలుసుకున్నారు. బ్యాంకులో సుమారు రూ.4కోట్ల విలువైన బంగారు ఆభరణాలు ఉన్నాయని, అందులో ఏదీ దొంగతనం జరగలేదని ఆంధ్రాబ్యాంకు మేనేజర్ అబ్దుల్అజీజ్, పోలీసులు తెలిపారు. ఒక కన్ను మాత్రమే కనిపించేలా.. ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి యత్నించిన సంఘటన కురవిలో సంచలనం సృష్టించింది. సీసీ కెమెరాల ఫుటేజీలో ముసుగు ధరించిన వ్యక్తి కని పించాడు. తల నుంచి కాళ్ల వరకు తెల్లని దుస్తువులు ధరించి ఉండగా, గోడ పగులగొట్టేందుకు పెద్ద రాడ్ ఆయన చేతిలో ఉంది. అయితే, ఒకరిని బయట ఉంచి మరో ఇద్దరు లేదా ముగ్గురు లోనకు వెళ్లి దోపిడీకి యత్నించి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఒక కన్ను మాత్రమే కనిపించేలా ముసుగు ధరించడం, సీసీ కెమెరాల్లో దృశ్యాలు నమోదు కాకుండా ధ్వంసం చేయడాన్ని గమనిస్తే ఆరితేరిన దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు కురవి పోలీసులు తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
కురవి (వరంగల్): వేగంగా వెళ్తున్న కారు సైకిల్‌ను ఢీకొట్టిన ఘటనలో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం బంచరాయితండలో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సురేష్(18) సైకిల్‌పై వెళ్తుండగా.. మహబూబాబాద్ నుంచి భద్రాచలం వెళ్తున్న కారు ఢీకొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
పోలీసుల అదుపులో ముగ్గురు?
- వీడనున్న బానోత్ సురేష్ మృతి కేసు కురవి (వరంగల్) : ఓ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. శనివారం సాక్షిలో ‘అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి’ అనే శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి విదితమే. మండలంలోని కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ (యజమాని) బానోత్ సురేష్ మొగిలిచర్ల శివారు జగ్యా తండా సమీపంలోని మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును విచారిస్తున్న సీఐ శ్రీనివాస్‌నాయక్, ఎస్సై రామకృష్ణలకు ముగ్గురిపై అనుమానం వచ్చి పట్టుకున్నట్లు సమాచారం. మృతుడు సురేష్‌కు చెందిన తండావాసులైన బాదావత్ ప్రసాద్, బానోత్ రావోజీ, తేజావత్ సంక్రు, తేజావత్ గన్నాలపై అనుమానం రావడంతో వారి కోసం ఆరా తీశారు. తేజావత్‌గన్నా తప్ప మిగిలిన ముగ్గురు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరిని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మృతుడు సురేష్ వదిన సుజాతను సైతం తీసుకొచ్చి విచారణ చే పడుతున్నారు. రెండు రోజుల్లో కేసు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయమై పోలీసులను వివరణ కోరితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు. -
ఇద్దరు రైతుల ఆత్మహత్య
కురవి : వరంగల్ జిల్లా కురవి మండలం నెరాడ గ్రామంలో ఓ కౌలు రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. గ్రామ శివారులో ఓ మామిడితోటలో చెట్టుకు ఉరివేసుకుని నీలం వెంకన్న(45) అనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు గమనించి పోలీసులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఆత్మహత్యకు ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలిస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా ధన్వాడ మండలం వెంకటాపూర్ గ్రామంలో కుర్వ ధశరద్(40) అనే మరో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. పొలంలో పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని కుటుంబసభ్యులు తెలిపారు. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రియుడి ఇంటి ముందు ప్రేయసి ధర్నా
కురవి (వరంగల్): రెండేళ్లు ప్రేమాయణం సాగించిన ఓ యువకుడు పెళ్లి ఊసెత్తేసరికి ముఖం చాటేశాడు. పెళ్లి చేసుకోవాలంటే రూ.5 లక్షలు కట్నం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాడు. దీంతో ఆగ్రహించిన ప్రియురాలు ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన వరంగల్ జిల్లా కురవి మండలం కోలంపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మండలంలోని కొలంపల్లి గ్రామానికి చెందిన రాజేందర్(22) డిగ్రీ చదువుతున్న సమయంలో పక్క గ్రామానికి చెందిన మాలోతు భద్ర(21)ను ప్రేమించాడు. ఇంటర్మీడియట్ చదువుతున్న భద్ర కూడా రాజేందర్‌ను ఇష్టపడింది. ఈ క్రమంలో రెండు సంవత్సరాలు హాయిగా గడిచిన వీరి ప్రేమబంధం పెళ్లి ప్రస్తావన వచ్చే సరికి బీటలు వారింది. చదువు పూర్తి కావడంతో పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి తీసుకురాగా యువకుడు ముఖం చాటేసి తిరుగుతున్నాడు. దీంతో ఆగ్రహించిన యువతి నెల రోజుల క్రితం పోలీసులను ఆశ్రయించింది. కుల పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించుకుంటామని చెప్పిన యువకుడి తరఫు బంధువులు యువతి కుటుంబసభ్యులను రూ.5 లక్షలు డిమాండ్ చేశారు. దీనికి నిరాకరించిన యువతి యువకుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఆమెకు మహిళ సంఘాల నాయకులు మద్దతు తెలిపారు. -
ట్రాక్టర్ కింద పడి చిన్నారి మృతి
కురవి (వరంగల్) : ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారి ట్రాక్టర్ కింద పడి మృతిచెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడ గ్రామంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన టి.వరుణ్ (2) ఇంటి ముందు ఆపి ఉన్న ట్రాక్టర్ కింద ఆడుకుంటున్న సమయంలో ట్రాక్టర్ ఒక్కసారిగా వెనక్కి రావడంతో దాని కింద పడి మృతిచెందాడు. చిన్నారి మృతిచెందడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.