- కురవిలో ఘటన
ఆడపిల్ల అమ్మకం!
Published Tue, Sep 27 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 3:05 PM
కురవి : ఇప్పటికే నలుగురు ఆడపిల్లలు.. కొడుకు కోసం చూస్తే ఐదో కాన్పులోనూ అమ్మాయే పుట్టింది. దీంతో పోషించలేమనే భయంతో ఆ పాపను పది రోజుల క్రితం విక్రయించగా, సోమవారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన కురవిలో చోటుచేసుకుంది. కురవి మండల కేంద్రంలో చెంచు(గిరిజన) తెగకు చెందిన మండల వెంకన్న దంపతులకు ఇప్పటికే నలుగురు అమ్మాయిలు ఉన్నారు. కుమారుడి కోసం చూస్తుండగా ఐదో కాన్పులోనూ ఆడపిల్లే పుట్టింది. దీంతో పుట్టిన పాపను వేరే వారికి విక్రయించారు. మానుకోట చైల్డ్‌లైన్ సంస్థకు ఈ విషయం తెలియడంతో సంస్థ ప్రతినిధులు కురవి ఎస్సై అశోక్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాలిక తల్లిదండ్రులను సోమవారం స్టేషన్‌కు తీసుకొచ్చి కౌన్సెలింగ్ చేశారు. అయితే పాపను విక్రయించలేదని, తమ బంధువులకు పిల్లలు లేకపోవడంతో వారికి ఇచ్చామని తల్లిదండ్రులు చెప్పినట్లు ఎస్సై తెలిపారు. రెండు రోజుల్లో బాలికను తీసుకొస్తామని బంధువులు చెప్పారని, ఆ తర్వాత పాపను తల్లిదండ్రులకు అప్పగిస్తామని వివరించారు.
Advertisement
Advertisement