
ఐదేళ్ల వయసుండే పిల్లలు ఆటపాటల్లో గడుపుతారు. స్కూల్‌కి వెళ్లనని మారాం చేస్తారు. కానీ బెల్లా మాత్రం అవేవీ చేయలేదు. పుస్తకం రాసి ప్రచురించింది. ఇప్పుడు దానికి కొనసాగింపు గా మరో పుస్తకం రాయబోతోంది. అందరూ తన ప్రతిభను చూసి ఆశ్చర్యపోతున్నారు.
బెల్లా.జె.డార్క్ అనే పాప యూకేలోని వేమౌత్ ప్రాంతంలో పుట్టింది. చిన్ననాటి నుంచే అమ్మ చెప్పే కథలు వింటూ పెరిగింది. చిన్నారుల కోసం ప్రచురించే పుస్తకాలు చదివి, వాటి మీద ఆసక్తి పెంచుకున్న తను సొంతంగా కథలు రాయాలని ఐదేళ్ల వయసులో నిశ్చయించుకుంది. కానీ ఏ అంశం మీద రాయాలా అని ఆలోచిస్తూ ఉంది. ఆ సమయం లో తను గీసిన ఓ పిల్లి బొమ్మను చూసి ఓ ఆలోచన వచ్చింది. వెంటనే దాన్ని అక్షరరూపంలో పెట్టేసింది. ఆ కథే The Last Cat (ది లాస్ట్ క్యాట్).
ఐదు రోజులపాటు ఆ కథ రాసిన బెల్లా దానికి తనే సొంతంగా బొమ్మలు కూడా వేసింది. అర్ధరాత్రి పూట ఇంటి నుంచి బయటకు వెళ్లిన పిల్లి ఎలాంటి ఇబ్బందులు పడింది, తిరిగి ఎలా తన ఇంటికి చేరిందనేది ఇందులోని కథ. ఈ కథే ఎందుకు రాశావని బెల్లాని అడిగితే, ‘పిల్లలు అలా ఎవరికీ చెప్పకుండా ఎక్కడికీ వెళ్లకూడదు. ముఖ్యంగా రాత్రిపూట అస్సలే వెళ్లకూడదు. ఆ విషయం అందరికీ చె΄్పాలనే ఈ కథ రాశాను’ అంటోంది. 2022 జనవరి 31న ఈ కథ పుస్తకంగా ప్రచురితమయ్యేనాటికి బెల్లాకు ఐదేళ్ల 211 రోజులు. ఈ విషయాన్ని గుర్తించిన గిన్నిస్ ప్రతినిధులు ‘అతి చిన్న వయసు రచయిత్రి’ అంటూ రికార్డు అందజేశారు.
‘ది లాస్ట్ క్యాట్’ పుస్తకం ఇప్పటికి వేల కాపీలు అమ్ముడు΄ోయింది. ఈ పుస్తకం చదివి అనేకమంది బెల్లాకు మెయిల్స్ చేస్తున్నారు. తను రాసిన కథను మెచ్చుకుంటున్నారు. ఆ సంతోషంతో ఆ కథకు కొనసాగింపుగా మరో కథ రాసేందుకు సిద్ధమవుతోంది. ఖాళీ సమయాల్లో ఈత కొట్టడం, ఆడుకోవడం తనకు ఇష్టమని అంటోంది బెల్లా.

ఉల్ఫ్ కింగ్ సూపర్ యానిమేటెడ్ సిరీస్
హాయ్ కిడ్స్... ఈ హాలిడేస్‌లో మూవీస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా... అయితే ఎప్పుడూ మూవీసేనా ఒక్కోసారి సిరీస్‌లు కూడా చూడాలి. అందుకే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న ఓ సూపర్ యానిమేటెడ్ సిరీస్ మీ ముందుకు తీసుకువచ్చాం. దాని పేరే ‘ఉల్ఫ్ కింగ్’. ఇదో సూపర్ యాక్షన్ స్టోరీ. డ్రూ ఫెర్రాన్ అనే కుర్రాడి కథ. ఉల్ఫ్ జాతికి చెందిన డ్రూ ఫెర్రాన్ ఆ ఫ్యామిలీలో ఆఖరివాడు. అతనికి ఉల్ఫ్ నుండి వచ్చే సూపర్ ఫాంటసీ పవర్స్ ఉంటాయి. కాని ఈ విషయం తనకు తెలియదు. డ్రూ ఫెర్రాన్ రాజ్యాన్ని సింహరాజులు అటాక్ చేసినపుడు, వాళ్ళతో ఫైట్ చేసేటపుడు తనలోని ఉల్ఫ్ పవర్ తెలుస్తుంది. ఆ పవర్స్‌తో డ్రూ ఫెర్రాన్ ఎలా ఫైట్ చేసి తన రాజ్యాన్ని తిరిగి సం΄ాదించుకున్నాడనేది మాత్రం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతున్న యానిమేటెడ్ సిరీస్ అయిన ఉల్ఫ్ కింగ్ చూసేయండి. ఈ సిరీస్ మొత్తం 8 ఎపిసోడ్స్ ఉంటాయి. ప్రతి ఎపిసోడ్ సూపర్బ్‌గా ఉంటుంది. అంతేకాదు ఓ రాజ్యంలో రాజులకు సంబంధించిన సీక్రెట్స్, ఫైట్స్ అలాగే ఛేజింగ్స్‌తో ఈ సిరీస్ మొత్తం ఓ అద్భుతమైన రోలర్ కోస్టర్ రైడ్. ఇంకెందుకాలస్యం... గ్రాబ్ ది రిమోట్ టు క్రూస్ ఫర్ ది అడ్వెంచరస్ జర్నీ ఆఫ్ ఉల్ఫ్ కింగ్.
– హరికృష్ణ ఇంటూరు