సాక్షి, కురవి: గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ (బుధవారం) మహబూబాబాద్ జిల్లా కురవి మండలం పెద్దతండాలో పల్లె నిద్ర చేశారు. గురువారం తెల్లవారుజామునే నిద్ర లేచిన మంత్రి... వేప పుల్లతో పండ్లు తోముకుంటూ సొంతూరులో జరిగిన పల్లెప్రగతి పనులను పరిశీలించారు. జనం వద్దకు వెళ్లి ఆత్మీయంగా పలకరించారు. వార్ కాకి.. వార్ కాకా... వార్ బాబు.. వార్ బాయి..(ఎలా ఉన్నావు చిన్నమ్మ, చిన్నాయన, బాపు, అక్కా) అని పలకరిస్తూ వాడవాడలా కలియ తిరిగారు. ఊరిలోని నర్సరీని పరిశీలించి మొక్కలు బాగా పెరగడంతో సంతోషం వ‍్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘పల్లె ప్రగతి’ పనులతో గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తోందని చెప్పారు. 30 ఏళ్లుగా గ్రామస్తులతో తనకు అనుబంధం ఉందన్నారు.
పెద్ద తండాలో పల్లెప్రగతిని పరిశీలిస్తున్న మంత్రి సత్యవతి
Comments
Please login to add a commentAdd a comment