- వీడనున్న బానోత్ సురేష్ మృతి కేసు
కురవి (వరంగల్) : ఓ అనుమానాస్పద మృతి కేసులో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం ద్వారా తెలిసింది. శనివారం సాక్షిలో ‘అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి’ అనే శీర్షికన వార్త ప్రచురితమైన సంగతి విదితమే. మండలంలోని కాంపల్లి శివారు సక్రాంనాయక్ తండాకు చెందిన ఆటోడ్రైవర్ (యజమాని) బానోత్ సురేష్ మొగిలిచర్ల శివారు జగ్యా తండా సమీపంలోని మామిడితోటలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ కేసును విచారిస్తున్న సీఐ శ్రీనివాస్‌నాయక్, ఎస్సై రామకృష్ణలకు ముగ్గురిపై అనుమానం వచ్చి పట్టుకున్నట్లు సమాచారం.
మృతుడు సురేష్‌కు చెందిన తండావాసులైన బాదావత్ ప్రసాద్, బానోత్ రావోజీ, తేజావత్ సంక్రు, తేజావత్ గన్నాలపై అనుమానం రావడంతో వారి కోసం ఆరా తీశారు. తేజావత్‌గన్నా తప్ప మిగిలిన ముగ్గురు పోలీసులు అదుపులో ఉన్నట్లు సమాచారం. వీరిని విచారణ చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. మృతుడు సురేష్ వదిన సుజాతను సైతం తీసుకొచ్చి విచారణ చే పడుతున్నారు. రెండు రోజుల్లో కేసు మిస్టరీ వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయమై పోలీసులను వివరణ కోరితే ఎవరినీ అదుపులోకి తీసుకోలేదని చెబుతున్నారు.
పోలీసుల అదుపులో ముగ్గురు?
Published Sun, Jun 19 2016 11:31 AM | Last Updated on Mon, Sep 4 2017 2:53 AM
Advertisement
Advertisement