
సాక్షి, మహబూబాబాద్: జిల్లాలోని కురవిలోని శ్రీభద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయంలో మహా శివరాత్రి వేడుకలకు వేలాదిగా భక్తులు హాజరయ్యారు. ఈ క్రమంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఆలయ సిబ్బంది ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా అందరికి నేరుగా శానిటైజర్ అందించడం వీలు కాకపోవడంతో ప్రత్యేక ఫ్యాన్ వంటి యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీనికి కింది భాగంలోని ట్యాంకులో శానిటైజర్ ద్రావణం పోస్తే, పైపుల ద్వారా పైకి వెళ్లి ఫ్యాన్ రెక్కలు తిరిగే క్రమంలో మధ్యలో నుంచి చుక్కలు చుక్కలుగా బయటకు వస్తుంది. ఆ ప్రాంతంలో చేతులు పెడితే శానిటైజర్ పడేలా ఈ ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment