- ∙కాత, పూత లేకపోవడంతో రైతుల వేదన
మిరప తోటకు నిప్పు
Published Tue, Oct 4 2016 12:39 AM | Last Updated on Wed, Sep 5 2018 9:47 PM
కురవి : రెండున్నర నెల లు కష్టపడి సాగుచేసిన మిరపపంట..కాత, పూత లేకపోవడంతో రైతులు తోటను అగ్గిపా లు చేశారు. తాము వేసినవి నకిలీ విత్తనాలు అని తేలడంతో వారి కం ట కన్నీరు వస్తోంది. ఇక దిగుబడి రాదని తెలుసుకున్న రైతులు పంటకు నిప్పు పెట్టిన ఘటన కురవి మండలం పో లంపల్లి తండాలో సోమవారం చో టుచేసుకుంది. తండాకు చెందిన సపావట్ బాలు, సపావట్ బిక్షం, గుగులోత్ భాస్కర్, బాదావత్ బాలు మరికొందరు రైతులు మిరప సాగు చేస్తున్నారు. ప్రస్తుతం పూత, కాత రావాల్సిన సమయం. ఏపుగా పెరిగిన మిరప తోటను చూసి సంతోషపడిన రైతులకు ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. పంట ఏపుగా పెరుగుతున్నా పూత, కాత లేకపోవడంతో వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించారు. అ వి నకిలీ విత్తనాలని తెలియగానే కన్నీరు పె ట్టారు. ఏపుగా పెరిగిన మిరపచెట్లను కూలీల తో తీసివేయించి కిరోసి¯Œన పోసి నిప్పుపెట్టారు. నకిలీ విత్తనాలను అంటగట్టిన వ్యాపారులపై చర్య తీసుకోవాలని, తమకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Advertisement