సాక్షి, హైదరాబాద్: మూడురోజుల కిందట వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం యావత్ ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటనపై ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో..
ఈ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గురువారం ఈ ఉదంతంపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఘటనపై పోలీస్ విచారణ సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment