
హైదరాబాద్, సాక్షి: తెలంగాణ హైకోర్టులో మంగళవారం విషాదకర ఘటన చోటు చేసుకుంది. కేసు వాదించే సమయంలో ఓ సీనియర్ న్యాయవాది కుప్పకూలిపోయారు. అయితే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ఆయన మరణించారు.
మృతి చెందిన సీనియర్ లాయర్ పేరు వేణుగోపాల్ రావు. ఓ కేసు విషయంలో ఆయన మంగళవారం వాదనలు వినిపిస్తుండగా ఈ విషాదం చోటు చేసుకుంది. న్యాయవాది మృతికి సంతాపంగా హైకోర్టులోని అన్ని బెంచ్‌లో విచారణ నిలిపి వేసి.. రేపటికి వాయిదా వేశారు.
Comments
Please login to add a commentAdd a comment