child death case
-
Kathleen Folbigg: కన్నబిడ్డల మృతి కేసులో ఆస్ట్రేలియా మహిళ.. 20 ఏళ్లకు విముక్తి
సిడ్నీ: కన్నబిడ్డల మృతి కేసులో 20 ఏళ్లపాటు కారాగారంలో మగ్గిన ఆf స్ట్రేలి యా మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది.న్యూ సౌత్ వేల్స్ లోని క్రిమినల్ కోర్టు ఆదేశాలతో గురువారం ఆమె విడుదలయ్యారు. కాథ్లీన్ ఫాల్బిగ్కు జన్మించిన నలుగురు సంతానం 1989–1999 సంవత్సరాల మధ్య వివిధ కారణాలతో చనిపో యారు. అయితే, వారి మరణాలకు తల్లి కాథ్లీనే కారణమంటూ పోలీసులు 2003లో హత్య కేసు నమోదు చేసి, జైలు శిక్ష విధించారు. తాను అమాయకురాలినని, తన బిడ్డల మరణాలు సహజంగానే జరిగినవని ఆమె ఎంతగా చెప్పినా ఎవరూ వినలేదు. మీడియా ఆమెను వరస్ట్ ఫిమేల్ సీరియల్ కిల్లర్‌గా అభివర్ణించింది. 2019లో మరోసారి జరిగిన దర్యాప్తులోనూ ఆమెనే దోషిగా తేలింది. 2022లో మాజీ న్యాయాధికారి జరిపిన విచారణలో మాత్రం..చనిపోయిన నలుగురు బిడ్డల్లో ఇద్దరు జన్యు సంబంధ వ్యాధులతోనే చనిపోయి ఉండొచ్చంటూ తెలిపింది. దీంతో, ఈ ఏడాది జూన్‌లో ఆమెకు కోర్టు క్షమాభిక్ష ప్రకటించింది. ఆమెపై వచ్చిన ఆరోపణలను న్యూ సౌత్ వేల్స్ కోర్టు కొట్టివేస్తూ జైలు నుంచి విడుదల చేసింది. జైలు నుంచి విడుదలైన కాథ్లీన్ ఫాల్బిగ్ హర్షం వ్యక్తం చేశారు. 1999లోనే తనపై మోపిన ఆరోపణలకు జవాబులు దొరికినా, నిరపరాధినని నిరూపించుకోలేకపోయాను. పిల్లలు ఆకస్మికంగా, గుర్తు తెలియని కారణాలతో చనిపోయే అవకాశం ఉందని భావించని యంత్రాంగం నన్ను దోషిగా చూసింది’అని పేర్కొన్నారు. రెండు దశాబ్దాలపాటు తనను నిర్బంధించిన యంత్రాంగం నుంచి భారీగా పరిహారం కోరుతూ దావా వేస్తానన్నారు. ఫాల్బిగ్ను విడుదల చేయాలంటూ పలువురు వైద్య నిపుణులు, వైద్యులు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను సైతం చేపట్టారు. -
అంబర్‌పేట ఘటన.. పోలీస్ కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: అంబర్‌పేటలో వీధికుక్కల దాడిలో చిన్నారి మృతి చెందిన ఘటనపై స్థానిక పోలీసులు ఎట్టకేలకు కేసు నమోదు చేశారు. మూడు రోజుల పాటు లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతే అంబర్‌పేట పోలీసులు శుక్రవారం కేసు వైపు అడుగేశారు. సీఆర్పీసీ 174 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అయితే.. కేసులో ఎవరినీ నిందితులుగా చేర్చలేదు. మరోవైపు ఈ ఉదంతాన్ని మీడియా కథనాల ఆధారంగా సుమోటోగా తీసుకున్న కోర్టు.. గురువారం విచారణ సందర్భంగా జీహెచ్ఎంసీ తీరుపై ఆగ్రహం వెల్లగక్కింది. -
వీధి కుక్కల దాడి కేసు.. సుమోటోగా స్వీకరించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: మూడురోజుల కిందట వీధి కుక్కల దాడిలో అంబర్‌పేటకు చెందిన నాలుగేళ్ల వయసున్న చిన్నారి మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ ఉదంతం యావత్ ప్రజానికాన్ని దిగ్భ్రాంతికి గురి చేయడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా కూడా మారింది. మరోవైపు రాజకీయంగానూ ఈ ఘటనపై ప్రభుత్వ వ్యతిరేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో.. ఈ ఉదంతంపై తెలంగాణ హైకోర్టు స్పందించింది. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి కేసును బుధవారం సుమోటోగా స్వీకరించింది. పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా విచారణకు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. గురువారం ఈ ఉదంతంపై విచారణ చేపట్టనున్నట్లు పేర్కొంది. మరోవైపు ఘటనపై పోలీస్ విచారణ సైతం జరుగుతున్న సంగతి తెలిసిందే. -
అదృశ్యమైన నాలుగేళ్ల బాలుడు కాలువలో నిర్జీవంగా...
తోట్లవల్లూరు (పామర్రు): మండలంలోని యాకమూరులో అదృశ్యమై బాలుడి మృతదేహం పుల్లేటి కాలువలో లభ్యమైంది. గ్రామంలోని పుల్లేటికాలువ కట్టపై నివశించే శింగవరపు వెంకటరమణ, మంగ దంపతుల కుమారుడు మోహిత్‌సాయి (4) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు స్థానిక పుల్లేటి కాలువలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం మోహిత్‌సాయి మృతదేహం కాలువలో లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోహిత్‌సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్‌సాయి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే.. -
చిన్నారి మృతికేసులో పినతల్లి ఆత్మహత్యాయత్నం
బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిని తండ్రే హత్యచేసినట్లు మొదటి భార్య ఆరోపిస్తుండడంతో....రెండో భార్య ఆత్మహత్యాయత్నం చేయడం కొత్త సందేహాలకు దారితీసింది. బద్వేలు పట్టణంలోని రాజుగారివీధికి చెందిన ఫయాజుద్దీన్ మొదటి భార్య ఇమామ్‌బీ విడిపోవడంతో... కమలాపురంకు చెందిన జహీరాను పెళ్లాడాడు. మొదటి భార్య పిల్లలు సనా అమ్రీన్(7), నయీముద్దీన్(9) ఫయాజుద్దీన్ వద్దే ఉంటున్నారు. ఈ నెల 13న అమ్రీన్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. తండ్రి ఫయాజుద్దీనే గొంతు నులిమి హతమార్చినట్టు ఆరోపిస్తూ మొదటి భార్య ఇమామ్‌బీ మంగళవారం బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఫోరెన్సిక్ నిపుణులతో అమ్రీన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. ఈ సమయంలో ఫయాజుద్దీన్ రెండో భార్య జహీరా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనపై కేసులు పెడుతున్నారన్న భయంతోనే జహీరా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది.