
మోహిత్‌సాయి(ఫైల్)
తోట్లవల్లూరు (పామర్రు): మండలంలోని యాకమూరులో అదృశ్యమై బాలుడి మృతదేహం పుల్లేటి కాలువలో లభ్యమైంది. గ్రామంలోని పుల్లేటికాలువ కట్టపై నివశించే శింగవరపు వెంకటరమణ, మంగ దంపతుల కుమారుడు మోహిత్‌సాయి (4) శనివారం మధ్యాహ్నం నుంచి కనిపించలేదు. దీంతో కుటుంబ సభ్యులు, పోలీసులు స్థానిక పుల్లేటి కాలువలో గాలింపు చేపట్టారు. ఆదివారం ఉదయం మోహిత్‌సాయి మృతదేహం కాలువలో లభ్యమైంది. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మోహిత్‌సాయి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ అర్జున్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మోహిత్‌సాయి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్ హామీ ఇచ్చారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
చదవండి: కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే..
Comments
Please login to add a commentAdd a comment