బద్వేలు: వైఎస్సార్ జిల్లాలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఏడేళ్ల చిన్నారిని తండ్రే హత్యచేసినట్లు మొదటి భార్య ఆరోపిస్తుండడంతో....రెండో భార్య ఆత్మహత్యాయత్నం చేయడం కొత్త సందేహాలకు దారితీసింది.
బద్వేలు పట్టణంలోని రాజుగారివీధికి చెందిన ఫయాజుద్దీన్ మొదటి భార్య ఇమామ్‌బీ విడిపోవడంతో... కమలాపురంకు చెందిన జహీరాను పెళ్లాడాడు. మొదటి భార్య పిల్లలు సనా అమ్రీన్(7), నయీముద్దీన్(9) ఫయాజుద్దీన్ వద్దే ఉంటున్నారు. ఈ నెల 13న అమ్రీన్ అనుమానాస్పద పరిస్థితిలో మృతి చెందింది. తండ్రి ఫయాజుద్దీనే గొంతు నులిమి హతమార్చినట్టు ఆరోపిస్తూ మొదటి భార్య ఇమామ్‌బీ మంగళవారం బద్వేలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు బుధవారం ఫోరెన్సిక్ నిపుణులతో అమ్రీన్ మృతదేహానికి పోస్ట్‌మార్టం జరిపించారు. ఈ సమయంలో ఫయాజుద్దీన్ రెండో భార్య జహీరా కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. 80 శాతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తనపై కేసులు పెడుతున్నారన్న భయంతోనే జహీరా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు తెలుస్తుంది.
చిన్నారి మృతికేసులో పినతల్లి ఆత్మహత్యాయత్నం
Published Wed, Feb 17 2016 2:09 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement