![Congress Leader SirigiReddy Gangireddy Committed Suicide Due To Corona Fear - Sakshi](/styles/webp/s3/article_images/2020/08/25/kdp.jpg.webp?itok=8SfTPlmh)
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కరోనావైరస్ సోకిందనే భయంతో కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు సిరిగిరెడ్డి గండిరెడ్డి ఆత్మహత్య చేసుకున్నారు. యర్రగుంల్ల మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కరోనా సోకడంతో గంగిరెడ్డి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే రెండు రోజుల క్రితం చెప్పకుండా వెళ్ళిన గంగిరెడ్డి.. ఎర్రగుంట్ల మండలం సున్నపురాళ్ళపల్లె దగ్గర రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. ఆయన రైలు కింద పడి ప్రాణాలు తీసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. కరోనా భయంతోనే గంగిరెడ్డి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment