సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు.
ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ‘‘మేము బతుకమ్మ చేస్తాం. బాధను కూడా పంచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?’’ అంటూ కవిత ప్రశ్నించారు.
నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా?. కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. చివరికి గ్రూప్-2ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్‌రెడ్డి కూడా ట్విట్టర్‌లో డిమాండ్ చేయలేదా?’’ అని కవిత దుయ్యబట్టారు.
బతుకమ్మ చేస్తాము..
— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023
బాధను కూడా పంచుకుంటాము..
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం...
ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh
Comments
Please login to add a commentAdd a comment