Pravalika
-
సిబ్లింగ్ రైటర్స్..! రచయితలుగా రాణిస్తున్న అక్కా, తమ్ముళ్లు..
వారిది ఓ మధ్యతరగతి కుటుంబం.. ఇద్దరూ అక్కా, తమ్ముళ్లు.. చిన్నప్పటి నుంచీ ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్నారు.. వారి ముందుతరాల్లో ఎవరికీ పుస్తకాలు రాయడమనే మాటే తెలియదు.. అసలు వాటిని చదవడమే గగనమైన కుటుంబం నుంచి వచ్చారు.. అనూహ్యంగా ఇద్దరికీ తెలుగుపై మమకారం పెరిగింది. సాధారణంగా బీటెక్ చదువుకున్న వారిలో చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఉద్యోగం చేస్తూ కాలం గడిపేస్తుంటారు. కానీ వీరిద్దరూ అందుకు భిన్నం. అక్క ఉస్మానియా యూనివర్సిటీలో డిగ్రీ చదువుకోగా.. తమ్ముడేమో విశాఖలోని గీతమ్ యూనివర్సిటీలో బీటెక్ చదివాడు. కానీ వీరిద్దరూ భాషలో పట్టు సాధించి పుస్తకాలు రాస్తూ తమకు తోచినంతలో తెలుగుకు సేవ చేస్తున్నారు. అక్కా, తమ్ముళ్లు ప్రవళిక, ప్రవర్ష్ జర్నీ ఒక్కసారి చూద్దాం.. – సాక్షి, సిటీబ్యూరోతెలుగులో రాయాలనే ఆకాంక్ష అయితే ఉంది.. కాకపోతే పుస్తకాలు రాయడం ఇంట్లో ఎవరికీ అలవాటు లేదు. దీంతో వినూత్నమైన ఆలోచన వారి మదిలో మెదిలింది. 2017లో ‘కరపత్ర’ పేరుతో అవసరం ఉన్న వారికి లేఖలు రాయడం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు విషయంలో మహేశ్పోలోజు అనే మరోరచయిత వీరిద్దరికీ తోడయ్యాడు. వీరు ముగ్గురూ కలసి దాదాపు వెయ్యికి పైగా ఉత్తరాలు రాసిచ్చారు. లేఖలు అందుకున్న వారు అభినందనలతో ముంచెత్తడంతో రచయిత కావాలనే తృష్ణ వారిలో మరింత పెరిగింది.ఛాయాదేవి చెత్త కథలు..ప్రవళిక తొలిసారిగా 2017 సమయంలోనే ‘ఛాయాదేవి చెత్త కథలు’ పేరుతో తన తొలి పుస్తకాన్ని తీసుకొచి్చంది. అక్కను స్ఫూర్తిగా తీసుకుని ప్రవర్ష కూడా తన తొలి పుస్తకాన్ని ‘కథనై.. కవితనై’ పేరుతో వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రవళిక మరో పుస్తకాన్ని ఇప్పటికే పూర్తి చేయగా, ప్రవర్ష్ ‘అభినిర్యాణం’ పేరుతో రెండో పుస్తకాన్ని ఆదివారం ఆవిష్కరించారు.అసిస్టెంట్ డైరెక్టర్‌గా..ప్రవర్ష్ మూడేళ్లు ఓ ఐటీ కంపెనీలో జాబ్ చేశాడు. కానీ తనకు అస్సలు సంతృప్తినివ్వలేదు. ఇక తనకు ఇష్టమైన రంగంలో రాణించాలని నిర్ణయించుకుని ఆ జాబ్ మానేసి పుస్తకాలు రాయడం ప్రారంభించాడు. పుస్తక రచయిత మాత్రమే కాదు.. అటు సినిమాలకు పాటలు రాయడం హాబీగా మార్చుకున్నాడు. ప్రస్తుతం ఓ డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. -
ప్రవళిక కుటుంబానికి భరోసా ఏదీ?
సాక్షి, వరంగల్/దుగ్గొండి: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ మర్రి ప్రవళిక ఆత్మహత్య రాష్ట్రాన్నే కాదు దేశంలోనే సంచలనంగా మారింది. ప్రధాని మోదీ, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతోపాటు తెలంగాణ టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి , బీజేపీ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌ల నోటి వెంట రాజకీయ ఎన్నికల ప్రచారంలో ఆమె పేరు మార్మోగింది. అదే సమయంలో ప్రవళిక కుటుంబాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదుకోవాలని, ఆమె కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించడంతో పాటు ఆమె కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో రాబోయే తమ ప్రభుత్వం ద్వారా ప్రవళిక కుటుంబానికి అండగా ఉంటామని బాహాటంగానే ప్రకటించాయి. అలా వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం బిక్కాజిపేటకు చెందిన ప్రవళిక పేరును వాడుకొని ఆయా పార్టీలు మద్దతు కూడగట్టుకున్నాయి. ఇక్కడివరకు బాగానే ఉన్నా అప్పటి వరకు ప్రతిపక్షంలో ఉండి ప్రవళిక కుటుంబాన్ని ఆదుకోవాలన్న కాంగ్రెస్, బీజేపీ నేతలు కనీసం ఇప్పుడు ఆ కుటుంబంవైపు చూడకపోవడంతో కన్నీరుమున్నీరవుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల వద్దకు కాళ్లు అరిగేలా తిరిగిన ప్రవళిక తండ్రి విసిగివేసారి కూలీ పనులకు వెళ్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నెల 28న ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి వరంగల్‌కు రానున్న సందర్భంలో తమ కుటుంబాన్ని ఆదుకోవాలని వేడుకుంటున్నారు.అసలేం జరిగిందంటే..వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలోని బిక్కాజిపల్లి గ్రామానికి చెందిన మర్రి ప్రవళిక పోటీ పరీక్షల కోసం హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో కోచింగ్ తీసుకుంటున్న క్రమంలో పోటీ పరీక్షల పేపర్లు లీక్ కావడంతో విరక్తి చెందిన ఆమె 2023 అక్టోబర్ 13న ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ప్రవళిక మృతితో అక్కడే వివిధ కోచింగ్ సెంటర్లలోని నిరుద్యోగ యువతీ యువకులు నిరసనకు దిగారు. అప్రమత్తమైన అప్పటి ప్రభుత్వం ప్రవళిక మృతదేహాన్ని భారీ పోలీసు బందోబస్తు మధ్య స్వగ్రామం బిక్కాజిపల్లి గ్రామానికి తీసుకువచ్చి వందలాది మంది పోలీసుల పహారా మధ్య అంత్యక్రియలు నిర్వహించింది. అంత్యక్రియల సందర్భంలో వేలాది మంది విద్యార్థ్ధులు వచ్చి ఆందోళన చేపట్టినా పోలీసులు వారిని తోసివేశారు. వివిధ రాజకీయ పార్టీల నేతలు సైతం వచ్చి ఆందోళన నిర్వహించారు.ప్రియాంక గాంధీ దూత వచ్చినా..అసెంబ్లీ ఎన్నికలకు కేవలం 45 రోజుల గడువు ఉండగా ప్రవళిక మృతిని అప్పటి ప్రతిపక్షం, నేటి అధికార పక్షం కాంగ్రెస్ పార్టీ, బీజేపీలు అనుకూలంగా మలచుకున్నాయి. ప్రవళిక మృతిని దేశ, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేసి నిరుద్యోగ యువతీ యువకుల మద్దతు కూడగట్టాయి. అప్పటి అధికార పక్షం, నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ప్రవళిక మృతిని పెద్దది చేయకుండా ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడి ప్రవళిక సోదరుడికి ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చింది. ప్రభుత్వం మారడంతో ఆ పార్టీ నాయకులు చేతులు ఎత్తివేశారు. ప్రవళిక మృతి సమయంలో ప్రియాంకగాంధీ దూతగా ఉత్తర్‌ప్రదేశ్ ఎంపీ డాలీశర్మ స్వయంగా అక్టోబర్ 15న బిక్కాజిపల్లికి వచ్చి ప్రవళిక తల్లిదండ్రులతో మాట్లాడారు. అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ‘ప్రియాంకగాంధీ నీకు తోడుగా ఉంటానని చెప్పమని నన్ను పంపింది’అని డాలీశర్మ ప్రవళిక తల్లి విజయకు చెప్పారు. ఇదే సమయంలో పీసీసీ అధికార ప్రతినిధి, నేటి రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్‌రియాజ్ స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో ప్రవళిక తల్లిదండ్రులు లింగయ్య, విజయలతో మాట్లాడించారు. ‘పోయిన బిడ్డను తెచ్చి ఇవ్వలేం.. అండగా ఉంటాం.. ధైర్యంగా ఉండండి’అని ధైర్యం చెప్పారు. నేడు ఆయనే ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏడు నెలలు దాటింది. ప్రవళిక కుటుంబం, ముఖ్యమంత్రికి గుర్తుకు రాలేదా అంటూ విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. నాటి, నేటి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి దూతలుగా వచ్చి మార్తినేని ధర్మారావు, కొండేటి శ్రీధర్‌లు నేడు ప్రవళిక కుటుంబ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి ఎందుకు తీసుకెళ్లడం లేదని నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంది. ఇప్పటికై నా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లు స్పందించి ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగంతో పాటు కుటుంబానికి ఆర్థికసాయం అందించి ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.కూలీ పనులకు వెళ్తున్నా..నా బిడ్డ చనిపోయి ఎనిమిది నెలలు దాటుతుంది. బిడ్డ చనిపోయినప్పుడు వేలాది మంది రోజు వచ్చిండ్లు. ఆదుకుంటామని ధైర్యం చెప్పిండ్లు. మీటింగ్లల్ల నాబిడ్డ పేరు చెప్పని నాయకుడు లేడు. ఎన్నికలు అయిపోయినయి. నన్ను ఎవళ్లూ పట్టిచ్చుకుంటలేరు. చానామంది నాయకుల దగ్గరికి తిరిగిన. కాళ్లు ఏళ్లు మొక్కినా కనికరం లేదు. అప్పడు ఇప్పుడు అంటున్నరు. బిడ్డ పోయినందుకు కొడుక్కు ఉద్యోగం ఇస్తం అన్నరు. ఇప్పుడు ఎవళూ ఏమీ చెబుతలేరు. రెక్కాడితిగాని డొక్కాడదు. అందుకు రోజు కూలీ పనులకు పోతున్న. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంతరెడ్డి సారు నా కొడిక్కి ఉద్యోగం, నాకు ఆర్థికసహాయం చేసి ఆదుకోవాలే.– మర్రి లింగయ్య, ప్రవళిక తండ్రినిందమోపిండ్లు.. రుజువు చేయలే.. నాబిడ్డ చదువులో చాలా తెలివిగలది. ఏనాటికైనా గవర్నమెంట్ ఉద్యోగం సాధిస్తా అన్నది. ఉద్యోగం వచ్చినంకనే పెళ్లి అన్నది. పరీక్షల పేపర్లు లీక్ కాంగనే రంది పడ్డది. మళ్ల ఎప్పుడు పెడుతరో.. నౌకరి వస్తదో రాదో అని మదన పడేది. గుండె ధైర్యం చెడి ఆత్మహత్య చేసుకున్నది. చావుకు ప్రేమ కథ అల్లిండ్లు. నింద మోపిండ్లు. ఇప్పటికీ రుజువు చేయలే. కడుపు కాలుతుంది. క్షణంక్షణం బిడ్డ యాదికోస్తుంది. ఇప్పుడు మా ఇంటి వంక ఎవ్వలూ చూడటం లేదు. నా బిడ్డ పేరు చెప్పుకుని ఓట్లు సంపాదించుకున్నరు. గద్దెలు ఎక్కిండ్లు. నా బిడ్డ ఇప్పుడు ఎవ్వరికి గుర్తుకు లేదు.– మర్రి విజయ, ప్రవళిక తల్లి -
ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థిని తీవ్ర నిర్ణయం..
బాపట్ల: పరీక్షలు సరిగ్గా రాయలేనేమోననే బెంగతో మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన బుధవారం సాయంత్రం మార్టూరులో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బలరాం కాలనీకి చెందిన తిరుమలశెట్టి నాగేశ్వరరావు కుమార్తె ప్రవల్లిక (16) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతోంది. త్వరలో జరగబోతున్న పరీక్షలు సరిగా రాయలేనేమోనని తరచూ స్నేహితులతో చెప్పే ప్రవల్లిక మానసిక ఒత్తిడికి గురై అనారోగ్యంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో సీలింగ్ ఫ్యాన్‌కు చీరెతో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com ఇవి చదవండి: 130 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన బైక్.. క్షణంలో ఇద్దరూ.. -
ప్రవల్లిక కేసులో కోత ట్విస్ట్..
-
శివరామ్‌ను వదలొద్దు: ప్రవళిక తల్లిదండ్రులు
సాక్షి, హైదరాబాద్: ప్రవళిక బలవన్మరణం కేసులో ఇవాళ మరో పరిణామం చోటు చేసుకుంది. హైదరాబాద్ చిక్కడపల్లి పోలీసులు ఈ కేసులో శివరామ్‌ను నిందితుడిగా చేర్చారు. ప్రేమాపెళ్లి పేరుతో నమ్మించి మోసం చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు ఆధారాలు సేకరించిన పోలీసులు.. అతనిపై కేసు నమోదు చేశారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా కోస్గి మండలానికి చెందిన శివరామ్ రాథోడ్‌పై 417, 420, 306 సెక్షన్ల కింద కేసులు నమోదు అయ్యాయి. ప్రస్తుతం శివరాం పరారీలో ఉన్నాడని, బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నట్టు చిక్కడపల్లి పోలీసులు తెలిపారు. మరోవైపు.. ప్రవళిక ఆత్మహత్య కేసులో కుటుంబ సభ్యులు మాట మార్చారు. గ్రూప్ టూ పరీక్ష వాయిదా పడడంతోనే ఆత్మహత్య చేసుకుందని తొలుత చెప్పిన కుటుంబ సభ్యులు.. తాజాగా శివరామ్ రాథోడ్ వేధింపులే కారణమంటూ ఆరోపించారు. ప్రవళిక తల్లి విజయ, సోదరుడు ప్రణయ్‌లు తాజాగా వీడియోలు విడుదల చేశారు. బిడ్డ పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నామని, రాజకీయాలు చేయొద్దని తల్లి విజయ కోరుతున్నారు. శివరామ్‌ను వదిలిపెట్టొద్దని పోలీసులు కోరారు వాళ్లు. ‘‘నా బిడ్డ చావుకు కారణమయిన వాడిని కఠినంగా శిక్షించాలి. వాడు జీవితాంతం బయటకు రాకుండా జైల్లోనే పెట్టాలి. నా బిడ్డకు వచ్చిన పరిస్థితి మరే ఆడబిడ్డకు రాకూడదు. నా బిడ్డయితే ఇప్పుడు మాకు రాదు. చదువు పూర్తి చేసుకొని ఉద్యోగం చేసుకుంటుందని భావించాం. కానీ వాడి టార్చర్ కారణంగా చనిపోయింది. అయితే ఈ రాజకీయ పార్టీలు వాళ్ల గొడవలు వాళ్లే చూసుకోవాలి. మమ్మల్ని మాత్రం మీ రాజకీయంలోకి లాగవద్దు. ఇలా చెప్పండి.. అలా చేయండనే సలహాలు ఇవ్వొద్దు. ఇప్పటికే నా బిడ్డ బతుకు ఆగం అయ్యింది. ఇప్పుడు ఏమైనా గొడవలు ఉంటే మీరే చూసుకోండి. మా దాక మాత్రం తీసుకొని రావొద్దు. నా బిడ్డ మరణానికి కారణమైన వాడికి తగిన శిక్ష విధించాలి. నా బిడ్డ ఎలా అయితే ఉరేసుకొని చనిపోయిందో.. అలాగే వాడికి కూడా ఉరేసి చంపాలి.. అని ఆమె చేతులెత్తి నమస్కరించారు. వరంగల్‌కు చెందిన మర్రి ప్రవళిక(23) ప్రభుత్వ ఉద్యోగం కోసం అశోక్‌నగర్‌లోని ఓ వసతిగృహంలో ఉంటూ ప్రవళిక శిక్షణ తీసుకుంది. ఈనెల 13న వసతిగృహంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గ్రూప్-2 పరీక్ష రద్దు చేయడంతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందని కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు. ఆ తర్వాత పోలీసులు ప్రవళిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. అయితే రాజకీయంగా ఈ ఘటన ప్రభుత్వంపై విమర్శలకు తావిచ్చింది. ఇక ఈ కేసు ప్రాథమిక దర్యాప్తులో పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయి. శివరామ్ అనే యువకుడు ప్రవళికను ప్రేమించాడని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు తేలింది. మరో యువతితో వివాహం నిశ్చయం కావడం తెలిసి.. భరించలేకే ప్రవళిక ప్రాణం తీసుకుందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రేమ వ్యవహారం ప్రవళిక ఇంట్లోనూ తెలుసని చెప్పారు. ఆమె కుటుంబ సభ్యుల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా శివరాంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. -
‘ప్రవళికది ప్రేమ విఫలం' కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే!
సాక్షి, ఆదిలాబాద్: హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరాల సుభాష్, జగన్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్లో సోమవారం వారు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం విద్యార్థులు, యువకుల బలిదా నాలతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. అయి తే సీఎం కేసీఆర్ నీళ్ల పేరు చెప్పి నిధులను తన ఇంటికి మళ్లించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు. గ్రూప్–1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు రద్దయిందన్నారు. ఉద్యోగ ప్రకటనలిస్తూ నియామకాల ప్రక్రియ సరిగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రవళిక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య ప్రేమ విఫలం వల్లే జరిగిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువత ఇప్పటికై నా ఆలోచించాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే విప్లవ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇందులో నాయకులు అశోక్, దండేకర్ వామన్, నితిన్, సురేష్, కృపాకర్, శ్రవణ్ తదితరులున్నారు. -
లవ్ ఫెయిల్..ప్రవళిక కేసులో కొత్త ట్విస్ట్
-
ప్రేమ వ్యవహారమే ప్రవళిక ఆత్మహత్యకు కారణం
-
ప్రేమ వ్యవహారమే ప్రవళిక బలవన్మరణానికి కారణం: డీసీపీ వెంకటేశ్వర్లు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య ఉదంతం కేసుపై డీసీపీ వెంకటేశ్వర్లు శనివారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ప్రవళిక ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని తెలియజేశారాయన. ప్రవళిక 15 రోజుల కిందటే హాస్టల్లో చేరింది. ఆమె శివరామ్ రాథోడ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఆ సంగతి ఆమె తల్లిదండ్రులకు తెలుసు. కానీ, అతను ఆమెను మోసం చేశాడు. వేరే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. అది తెలిసి ప్రవళిక డిప్రెషన్లోకి వెళ్లింది. వాట్సప్ ఛాటింగ్, సీసీటీవీ ఫుటేజీలతో ఈ వ్యవహారం బయటపడింది. అది తట్టుకోలేక ప్రవళిక ఆత్మహత్య చేసుకుంది అని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. సూసైడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాం. శివరామ్‌తోనే ఆమె చివరిసారిగా కాల్ మాట్లాడింది. పూర్తి దర్యాప్తు తర్వాత అతనిపై చర్యలు ఉంటాయని డీసీపీ స్పష్టం చేశారు. ప్రవళిక మృతికి.. పరీక్ష వాయిదాకి ఎలాంటి సంబంధం లేదు. ఇప్పటివరకు ప్రవళిక ఎలాంటి పోటీ పరీక్షకు హాజరు కాలేదు. పూర్తిగా వ్యక్తిగతమైన అంశాలే ప్రవళిక ఆత్మహత్యకు కారణం. కాబట్టి.. ఎటువంటి అవాస్తవాలు ప్రచారం చేయొద్దు అని డీసీపీ వెంకటేశ్వర్లు కోరారు. కేసు వివరాలు.. వరంగల్ జిల్లా బిక్కాజీపల్లికి చెందిన మర్రి ప్రవళిక.. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్‌లోని ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ గ్రూప్-2 పరీక్షకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో.. శుక్రవారం ఎవరూ లేని టైంలో గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అయితే.. ఆమె పరీక్ష వాయిదా కారణంగానే ఆమె తీవ్ర మనోవేదనకు గురైందని.. ఆ ఒత్తిడిలోనే ఆత్మహత్యకు పాల్పడిందని విద్యార్థి జేఏసీ ప్రతినిధులు, విపక్ష పార్టీ సభ్యులు, కొందరు ఉద్యోగాభ్యర్థులు ఆందోళనకు దిగారు. దీంతో శుక్రవారం అర్ధరాత్రి ఆర్టీసీ క్రాస్ రోడ్లో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆపై నిరసనకారుల్ని అరెస్ట్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. మరోవైపు ఆత్మహత్య కాదని.. పరీక్షల వాయిదాతో ప్రభుత్వం చేసిన హత్య అంటూ రాజకీయ విమర్శలు తెరపైకి వచ్చాయి. ఇదిలా ఉండగానే.. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ సైతం ప్రవళిక మృతిపై పోలీస్ శాఖను నివేదిక కోరారు. పోలీస్ బందోబస్తు మధ్య.. శనివారం మధ్యాహ్నం తర్వాత ప్రవళిక అంత్యక్రియలు పూర్తయ్యాయి. చివరకు.. ఆమె మృతికి ప్రేమ వ్యవహారమే కారణమని దర్యాప్తు ద్వారా పోలీసులు తేల్చి చెప్పారు. -
ఉస్మానియా యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత
-
ప్రవల్లిక మృతిపై స్పందించిన ఖర్గే, రాహుల్.. ఏమన్నారంటే..
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 పరీక్షల వాయిదాపై ఆందోళనతో తెలంగాణలో ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్యకు పాల్పడటంపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీలు స్పందించారు. ప్రవల్లిక మృతిపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన ఇరువురు తెలంగాణలోని కేసీఆర్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఖర్గే..తెలంగాణలో విద్యార్థిని ప్రవల్లిక ఆత్మహత్య చేసుకోవడం దిగ్భ్రాంతికి, తీవ్ర వేదనకు గురి చేసిందన్నారు. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షలను పదే పదే వాయిదా వేయడం, నిర్వహణలో అవకతవకల కారణంగా ప్రవల్లిక ఈ విపరీత చర్యకు పాల్పడినట్లు తెలుస్తోందని తన ట్వీట్లో పేర్కొన్నారు. ప్రవల్లిక కుటుంబానికి ఖర్గే సంతాపం ప్రకటించారు. పరీక్షల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉదాసీనత కారణంగా తెలంగాణలోని వేలాది మంది యువ ఔత్సాహికులు నిరాశకు గురవుతున్నారని, ఆగ్రహంగానూ ఉన్నారని అన్నారు. తెలంగాణ యువకులు అవినీతి, అసమర్థమైన బీఆర్ఎస్ను గద్దె నుంచి దించాలన్నారు. Shocked and deeply anguished by the suicide of a 23-year-old girl student in Telangana, who reportedly took the drastic step to end her life due to repeated postponements and irregularities in the State Public Service Commission Exams. In this hour of grief and anger, our heart… — Mallikarjun Kharge (@kharge) October 14, 2023 మరోవైపు రాహుల్ గాంధీ కూడా ప్రవల్లిక మృతిపై ట్విట్టర్లో స్పందిస్తూ ‘ప్రవల్లిక ఆత్మహత్య బాధాకరం. ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. హత్య’ అని రాష్ట్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. తెలంగాణ నిరుద్యోగ సమస్యతో విలవిలలాడుతోందన్నారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసి రాష్ట్రాన్ని నాశనం చేశాయని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ఉద్యోగాల క్యాలెండర్‌ను విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన నెల వ్యవధిలోనే TSPSCని పునర్వ్యవస్థీకరిస్తామని స్పష్టం చేశారు. ఏడాదిలోపు రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని తెలిపారు. कल हैदराबाद में एक छात्रा की आत्महत्या का समाचार अत्यंत दुखद है। ये आत्महत्या नहीं, हत्या है - युवाओं के सपनों की, उनकी उम्मीदों और आकांक्षाओं की। तेलंगाना का युवा आज बेरोज़गारी से पूरी तरह टूट चुका है। पिछले 10 सालों में BJP रिश्तेदार समिति - BRS और BJP ने मिलकर अपनी अक्षमता… — Rahul Gandhi (@RahulGandhi) October 14, 2023 వరంగల్‌కు చెందిన ప్రవల్లిక (23) హైదరాబాద్‌లోని అశోక్ నగర్లో ఉన్న బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతూండేది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురై హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు.. సీఎం కేసీఆర్ డౌన్ డౌన్, కేటీఆర్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోటీ పరీక్షల నిర్వహణలో విఫలమైన కేసీఆర్ సర్కార్ దిగిపోవాలని డిమాండ్ చేశారు. టీఎస్సీఎస్సీని రద్దుచేసి యూపీఎస్సీకి ఇవ్వాలని, కొత్త బోర్డును ఏర్పాటు చేయాలని కూడా వారు నినదించారు. -
రేవంత్ శవాల మీద పేలాలు ఏరుకునే రకం.. ఎమ్మెల్సీ కవిత ఫైర్
సాక్షి, హైదరాబాద్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యను రాజకీయం చేయడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా మండిపడ్డారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి విమర్శలను ఆమె తిప్పికొట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్‌కి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం.. కాంగ్రెస్ ఆందోళన నాటకం’’ అంటూ కవిత మండిపడ్డారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం.. ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రాకూడదన్నారు. ‘‘మేము బతుకమ్మ చేస్తాం. బాధను కూడా పంచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?’’ అంటూ కవిత ప్రశ్నించారు. నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా?. కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్‌ది. చివరికి గ్రూప్-2ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్‌రెడ్డి కూడా ట్విట్టర్లో డిమాండ్ చేయలేదా?’’ అని కవిత దుయ్యబట్టారు. బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాము.. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం... ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం మీ విధానమా ? ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం. ఏ… https://t.co/ET9YmGPsPW pic.twitter.com/i5Alelsakh — Kavitha Kalvakuntla (@RaoKavitha) October 14, 2023 -
‘ప్రవళికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య’
సాక్షి, ఢిల్లీ: గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన వరంగల్ విద్యార్థిని ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఘటనపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ గవర్నర్ తమిళసై నివేదిక కోరగా, ప్రతిపక్ష కాంగ్రెస్ సైతం ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఈ ఘటనపై ఎంపీ, కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. ‘ప్రవల్లికది ఆత్మహత్య కాదు.. ప్రభుత్వ హత్య. సమయానికి పరీక్షలు నిర్వహించకపోవడం వల్లనే విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. సీఎం కేసీఆర్ దీనిపై స్పందించాలి. తెలంగాణ యువత సీఎం కేసీఆర్‌ను గద్దె దింపడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం -
ప్రవళిక మృతిపై స్పందించిన గవర్నర్.. నివేదిక ఇవ్వాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్/వరంగల్: గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ స్పందించారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 23 ఏళ్ల ప్రవళిక ఆత్మహత్యకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ఆమె మృతిపట్ల ప్రవళిక తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాద ఘటన నేపథ్యంలో ప్రవళిక ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పోలీసు డైరెక్టర్ జనరల్, టీఎస్పీఎస్సీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ‘గ్రూప్ 2 అభ్యర్థి ప్రవళిక అకాల మరణం.. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువ ఔత్సాహికులు ఎదుర్కొంటున్న సవాళ్లు, ఒత్తిళ్లను గుర్తుచేస్తుంది. గ్రూప్2కు సన్నద్ధమవుతున్న ప్రవళిక.. ఉద్యోగ పరీక్షల వాయిదా పడటంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు నా దృష్టికి వచ్చింది. నిరుద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు. విద్యార్థులు దైర్యంగా ఉండండి. నిరుద్యోగులకు అండగా ఉంటాం. ఆమె ఆత్మహత్యపై 48 గంటల్లో సమగ్ర నివేదిక పంపాలి’ అంటూ తమిళిసై పేర్కొన్నారు.. అంతిమయాత్రలో స్పల్ప ఉద్రిక్తత వరంగల్‌లోని దుగ్గొండి మండలం బిక్కాజిపల్లిలో నిర్వహించిన ప్రవళిక అంతిమయాత్రలో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేయూ, ఓయూ జేఏసీ విద్యార్థుల ఆందోళన చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి నేతలు డిమాండ్ చేశారు. దీంతో విద్యార్థి జేఏసీ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో పలువురు విద్యార్థుల చొక్కాలు చినిగాయి. కాగా గ్రూప్–2 పరీక్షలు వాయిదా పడటంతో ఆవేదన చెందిన ప్రవళిక అనే విద్యార్థిని శుక్రవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. వరంగల్‌కు చెందిన ప్రవల్లిక(23) అశోక్ నగర్‌లోని బృందావన్ గర్ల్స్ హాస్టల్లో ఉంటూ గ్రూప్–2 పోటీ పరీక్షలకు సిద్ధమవుతోంది. పరీక్షలు వాయిదా పడిన నేపథ్యంలో మానసిక ఒత్తిడికి గురైన ప్రవల్లిక తానుంటున్న హాస్టల్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న తోటి విద్యార్థులు పోలీసులకు సమాచారం అందించారు. చిక్కడపల్లి ఏసీపీ ఏ.యాదగిరి, ఇన్స్పెక్టర్ పి.నరేష్ వెంటనే అక్కడికి చేరుకున్నారు. మృతదేహాన్ని తరలించే సమయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు. మృతురాలి కుటుంబానికి న్యాయం చేయాలని, ఆమె సూసైడ్ లెటర్ బయటపెట్టాలని కోరారు. తల్లిదండ్రుల కన్నీటి పర్యంతం గ్రూప్-2 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్యతో ఆమె స్వగ్రామం వరంగల్ జిల్లా బిక్కాజిపల్లిలో విషాదం అలుముకుంది. బిడ్డ మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. జయ- లింగయ్య దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు కాగా..కూతురు ప్రవళిక ఉన్నత విద్యను అభ్యసించి గ్రూప్-2ప్రిపేర్ కోసం హైదరాబాద్ హాస్ట్‌లో ఉంటుంది. ప్రవళిక అంతిమయాత్ర కొనసాగుతోంది. ఈ యాత్రలో రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఓయు, కేయు జేఏసీ ప్రతినిదులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రవళిక ది ఆత్మహత్య కాదు ప్రభుత్వ హత్యా అని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. టీఎస్పీఎస్సీ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలి కుటుంబానికి కోటి రూపాయల ఎక్సిగ్రేషియాతో పాటు కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ప్రేమ వేధింపులకు విసిగి.. బాలిక తీవ్ర నిర్ణయం..
వికారాబాద్: ప్రేమ పేరుతో ఓ యువకుడు వేధించడంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యాలాల మండల పరిధిలోని హాజీపూర్‌లో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ అరవింద్‌కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బుర్జుకాడి వెంకటమ్మ, రాములు దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. వీరిలో పెద్ద కూతురు ప్రవలిక (17) పదో తరగతి చదువుతోంది. ఇదే గ్రామానికి చెందిన కమాలి రాజు కొంతకాలంగా ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నాడు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలియడంతో ప్రవలికను మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాజు వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి తండ్రి రాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రేమికుడు మోసం చేశాడని.. యువతి ఆత్మహత్య
మహబూబాబాద్ రూరల్ : ఓ యువకుడు తనను ప్రేమించడంతో పాటు పెళ్లి చేసుకుంటానని చెప్పి పెళ్లికి నిరాకరించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్లో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. టౌన్ ఎస్సై సీహెచ్.రమేష్‌బాబు కథనం ప్రకారం... మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని లెనిన్ నగర్‌కు చెందిన బూర్గుల యాకమ్మ, పాపయ్య మనుమరాలు బూర్గుల ప్రవళిక(19)కు తల్లి ఉపేంద్రమ్మ చిన్నతనంలోనే చనిపోయింది. దీంతో ఆమె అమ్మమ్మ ఇంటి వద్దే ఉంటోంది. ఇదే కాలనీకి చెందిన బల్లెం మార్కయ్య కుమారుడు చంటి, ప్రవళికలు ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలో పెద్ద మనుషుల వద్ద పంచాయితీ కూడా నిర్వహించారు. ఈ క్రమంలో ప్రవళికను పెళ్లి చేసుకుంటానని చంటి కాగితం కూడా రాసి ఇచ్చాడు. అనంతరం పెళ్లి చేసుకోనని చెప్పడంతో మనస్తాపానికి గురై ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకుని మృతి చెందింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు బల్లెం చంటిపై ఐపీసీ 306 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై రమేష్‌బాబు తెలిపారు. మృతదేహన్ని పోస్టు మార్టమ్ నిమిత్తం ఏరియాస్పత్రికి తరలించారు. -
ఆనందానికి అడ్డుగా ఉన్నాడని భర్తనే..
హయత్‌నగర్: వ్యక్తి మృతదేహాన్ని బైక్‌పై అనుమానాస్పదంగా తరలిస్తూ పట్టుబడిన కేసులో మిస్టరీని పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని బాలుడితో కలిసి భార్యే అతడిని చంపి.. మృతదేహాన్ని మాయం చేసేందుకు యత్నించినట్టు తేల్చారు. బాలుడితో పాటు మహిళను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిం చారు. వనస్థలిపురం ఏసీపీ భాస్కర్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ మార్కెట్ కమిటీలో ఉద్యోగిగా పనిచేసిన మెండెం పుల్లయ్య, ప్రవల్లిక దంపతులకు ఇద్ద రు పిల్లలు. ఆరు నెలల క్రితం వరుసకు మేనల్లుడయ్యే ఓ బాలుడితో ప్రవల్లిక ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. పుల్లయ్యకు ఈ విషయం తెలిసి బాలుడిని హెచ్చరించాడు. అయినా బాలుడు ప్రవల్లిక వద్దకు రావడం మానలేదు. దీంతో పుల్లయ్య భార్యాపిల్లలను తీసుకుని నగరానికి వచ్చి ఎల్బీనగర్ మైత్రినగర్‌లో ఉంటున్నాడు. ఈ నెల 22న పుల్లయ్య ఇంట్లో లేని సమయంలో ఆ బాలుడు వచ్చా డు. 23న ఇంటికి వచ్చిన పుల్లయ్యకు భార్యతో బాలు డు కనిపించాడు. కోపం కట్టలు తెంచుకున్న అతను ఇద్దరినీ కొట్టి.. బాలుడిని తన ఇంటి నుంచి పంపేశాడు. అనంతరం బయటకు వెళ్లి మద్యం తాగి వచ్చాడు. రాత్రి మద్యం మత్తులో ఉన్న పుల్లయ్యను ప్రవల్లిక, బాలుడు కలిసి కొట్టి.. తలను గోడకేసి బాది చంపేశారు. మృతదేహాన్ని ఏం చేయాలో పాలుపోక 24వ తేదీ రాత్రి వరకు వేచి చూశారు. 25న ఆసుపత్రిలో ఉన్న తమ బంధువులను చూసి వస్తామని పక్కింటి వ్యక్తి దగ్గర బైక్ తీసుకున్నారు. రాత్రి 11 గంటలకు నిర్జన ప్రదేశంలో మృతదేహాన్ని పడేద్దామని బైకు మధ్యలో పెట్టుకొని బాలుడు, ప్రవల్లిక బయలుదేరారు. మృతదేహం కాళ్లు వేలాడుతూ కనిపించడంతో పెద్దఅంబర్‌పేట వద్ద పెట్రోలింగ్ పోలీసులు బైక్‌ను ఆపారు. విచారించగా పొంతనలేని సమాధానాలు చెప్పారు. 108 సిబ్బందిని పిలిపించగా బైకు మధ్యలో ఉన్న వ్యక్తి మృతి చెందినట్లు తేలింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించి కేసు నమోదు చేశారు. ప్రవల్లికతో పాటు బాలుడిని తమదైన శైలిలో విచారించగా.. తామే హత్య చేశామని చెప్పారు. దీంతో నిందితులను సోమవారం రిమాండ్‌కు తరలించారు. -
బాక్సింగ్ చాంప్స్ నగ్మా, ప్రవళిక
అండర్-19 జూ. కాలేజి, స్కూల్ గేమ్స్ టోర్నీ సాక్షి, హైదరాబాద్: అండర్-19 జూనియర్ కాలేజి, స్కూల్ గేమ్స్ బాక్సింగ్ పోటీల్లో షేక్ నగ్మా, ప్రవళిక విజేతలుగా నిలిచారు. ఎల్బీస్టేడియంలోని బాక్సింగ్ హాల్లో బుధవారం జరిగిన బాలికల 44-46 కేజీల కేటగిరీలో నగ్మా (సుల్తాన్ వులూమ్ జూనియర్ కాలేజి) గెలుపొందగా, త్రిపూజ (కస్తూర్బా కాలేజి) రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ద్రివిత (మహబూబియా కాలేజి)కు మూడో స్థానం దక్కింది. 46-48 కేజీల కేటగిరీలో ప్రవళిక (మహబూబియా) టైటిల్ సాధించింది. ఇతర పోటీల ఫలితాలు: 48-52 కేజీల కేటగిరీ: 1.మాధవి (మహర్షి కాలేజి); 50-52 కేజీలు: 1. అభిలాష (సెరుుంట్జార్జ్ కాలేజి), 2.స్మిత్ (కస్తూర్బా); 52-54 కేజీలు: 1. తన్మరుు (నారాయణ), 2. ఉమారాణి (కస్తూర్బా); 54-57 కేజీలు: 1. శాని (సెరుుంట్ ఫ్రాన్సిస్), 2. అంజలి (వనిత), 3. శ్రుతి గుప్తా (కస్తూర్బా); 57-60 కేజీలు: 1. నాగమణి (కస్తూర్బా), 2. ప్రతిభ (వనిత); 60-63 కేజీలు: 1. జుబియా అఫ్రిన్ (ఎన్ఏఎస్ఆర్), 2. క్యాథలిన్ (వనిత), 3. మనీష (వనిత); 63-66 కేజీలు: 1. సారుుశ్రీ (ఆదర్శ కాలేజి); 66-70 కేజీలు: 1. తబసుమ్ (కస్తూర్బా); 70-75 కేజీలు: సోని సింగ్ (వనిత); 75-81 కేజీలు: 1. అక్షిత (నారాయణ), 81-86 కేజీలు: 1. నాగనిక (సెరుుంట్ఆన్స కాలేజి). -
యువతి అదృశ్యం
శంషాబాద్ రూరల్ : మండలంలోని ననాజీపూర్‌లో ఓ యువతి అదృశ్యమైంది. ఎస్ఐ అహ్మద్ పాషా కథనం మేరకు.. మెదక్ జిల్లా పటాన్చెరు మండలం చిట్కుల్‌కు చెందిన వీరస్వామి కుటుంబం కొంత కాలంగా ననాజీపూర్‌లో నివాసముంటుంది. వీరాస్వామి కుమార్తె ప్రవళిక (18) ఈ నెల 15న మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. తె లిసిన వారు, బంధువుల వద్ద వెతికినా ప్రయోజనం లేకుండా పోవడంతో కుటుంబ సభ్యులు శనివారం శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువతి ఆచూకీ తెలిస్తే 08413 - 2220333 నంబరు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. -
‘వ్యోమోగ్రహ’కు నాసా పిలుపు
పెరుగుతున్న జనాభా, గ్లోబల్ వార్మింగ్‌తో రాబోయే రోజుల్లో భూమి మనుగడ ప్రమాదకరం కానుంది. అందుకోసం ముందుగానే నా వంతుగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు -ప్రవళిక కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినులతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొం దించారు. ఈ పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకు వచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు. -
‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం
కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినిలతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొందించారు. అయితే పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకువచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. కాగా భావితరాలకు మార్గదర్శకాన్ని చూపిం చేందుకు ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు.