‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం | NASA invitation to pravalika | Sakshi
Sakshi News home page

‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం

Published Sun, May 11 2014 11:44 PM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM

‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం - Sakshi

‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం

కాటేదాన్, న్యూస్‌లైన్:  అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక.

ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు.

 కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినిలతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొందించారు. అయితే పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు.

ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకువచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. కాగా భావితరాలకు మార్గదర్శకాన్ని చూపిం చేందుకు ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement