Planetary Society of India
-
ఆకాశం లో అద్భుతం
-
వీడిన సూర్యగ్రహణం
సాక్షి, హైదరాబాద్ : ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం వీడింది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం ఆదివారం కనువిందు చేసింది. ప్రతి రెండేళ్లకు ఒక్కసారి రాహుగ్రస్త సూర్యగ్రహణం ఏర్పడుతుంది. తొలుత భారత్‌లో గుజరాత్‌లోని ద్వారకలో గ్రహణం కనిపించింది. ముంబైలో ఆకుపచ్చ వర్ణంలో సూర్యడు సాక్షాత్కరించాడు. రాజస్తాన్‌లోని జైపూర్‌లో సంపూర్ణ సూర్యగ్రహణం ఆవిష్కృతమైంది. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగిసింది. సూర్యగ్రహణం వీడడంలో భారత్‌లో కొన్ని ఆలయాలు ఈ రోజు తెరచుకున్నాయి. సూర్యగ్రహణం అనంతరం తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని తెరిచి శుద్ధి చేశారు. అలాగే పుణ్యాహవచనం నిర్వహించారు. ఏకాంతంగానే శ్రీవారికి పూజా కైంకర్యాలు చేశారు. నేడు పూర్తిగా దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే విజయవాడలో దుర్గమ్మ ఆలయం తెరుచుకుంది. సాయంత్రం పంచహారతుల అనంతరం అమ్మవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి భక్తులకు దర్శనం లభించనుంది. -
సూర్యగ్రహణంతో కరోనా తగ్గుతుందా?
సాక్షి, హైదరాబాద్ : ఖగోళంలో అద్భుతం ఆవిష్కృతం అయింది. అరుదుగా సంభవించే పూర్తి స్థాయి వలయాకార సూర్యగ్రహణం ఆదివారం ప్రారంభమైంది. సూర్యుడికి చంద్రుడు అడ్డు రావడంతో గగన తలంలో వలయాకార సుందర దృశ్యం కనువిందు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఆదివారం ఉదయం 9.15 గంటలకు సూర్యగ్రహణం మొదలు కాగా, ఉత్తర భారత దేశంలోని పలు ప్రాంతాల్లో మాత్రమే ఇది సంపూర్ణంగా కనిపిస్తోంది. భారత్‌లోనే మిగతా ప్రాంతాల్లో పాక్షికంగా దర్శనం ఇస్తోంది. ఈ ఏడాదిలో ఇదే తొలి సూర్యగ్రహణం. ఇది పాక్షిక సూర్య గ్రహణం కాగా, డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆదివారం ఉదయం 9.16 గంటలకు సూర్యగ్రహణం మొదలైంది. ఇది మధ్యాహ్నం 12 గంటల 10 నిమిషాలకు మరింత స్పష్టం కన్పించనుంది. భారత్‌లో మాత్రం ఉదయం 9.56 గంటలకు ఆరంభమై...మధ్యాహ్నం 3 గంటలా 4 నిమిషాలకు ముగియనుంది. అయితే తెలంగాణలో మధ్యాహ్నం 1.44 గంటల వరకు 51 శాతం గ్రహణం వుంటుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10 గంటల 21 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంటా 49 నిమిషాల వరకు 46 శాతం గ్రహణం ఉండనుంది. (సూర్యగ్రహణం నేడే) సూర్యగ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది.. కాగా భూమికి, సూర్యునికి మధ్య చంద్రుడి ప్రవేశంతో సూర్యగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడిని చంద్రుడు కప్పేయడం కారణంగా భూమిపై చంద్రుడి నీడ మాత్రమే కన్పిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక్క అమావాస్య రోజున మాత్రమే జరుగుతుంది. డెహ్రాడూన్, సిర్సా, టెహ్రీ ప్రాంతాల్లో వలయాకారంలో కన్పించే సూర్యగ్రహణాన్ని, ఢిల్లీ, ఛండీగఢ్, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, బెంగళూరు పట్టణాల్లోని ప్రజలు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడవచ్చు. ఇక గ్రహణం రోజున దేశంలోని అనేక ఆలయాలను మూసివేశారు. అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం, స్నానం చేయరాదని పెద్దలు చెప్తుంటారు. దేవుళ్ల విగ్రహాలను తాకరాదని, గ్రహణం విడిచిన తర్వాత మాత్రమే స్నానం చేసి తినాలని చెప్తుంటారు. గ్రహణం అనంతరం ఆలయాలు సంప్రోక్షణ చేసి మరుసటి రోజు నుండి యధావిధిగా దర్శనాలకు భక్తులను అనుమతిస్తారు. 0.001 శాతం మాత్రమే వైరస్ అంతం.. ఇక ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ను సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు హరిస్తాయంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. -
సూర్యగ్రహణం నేడే
న్యూఢిల్లీ: ఆకాశంలో అద్భుత దృశ్యమైన సూర్యగ్రహణాల్లో ఒకటైన వార్షిక సూర్యగ్రహణం ఆదివారం భారత్‌లో కనిపించి కనువిందు చేయనుంది. ఈ సూర్యగ్రహణం సమయంలో చంద్రుడు భూమికి సుదూరంగా వెళ్లడంతో పూర్తిగా సూర్యుడ్ని కప్పి ఉంచలేడు. 70శాతం మాత్రమే కప్పివేయడంతో ఖగోళ అద్భుత దృశ్యాల్లో ఒకటైన రింగ్ ఆఫ్ ఫైర్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే సూర్యగ్రహణం ఉదయం గం.9:15 గంటలకు మొదలై మధ్యాహ్నం 12:10 గంటలకు అత్యున్నత స్థితికి చేరుకొని మధ్యాహ్నం 3 గంటలకు ముగుస్తుంది. అయితే ప్రాంతాలను బట్టి సమయంలో కాస్త మార్పులు ఉంటాయని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వెల్లడించింది. గ్రహణం తెలంగాణలో ఉదయం 10.15 గంటల నుంచి 1.44 గంటల వరకు ఉంటుంది. 51 శాతం గ్రహణం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఉదయం 10.21 గంటల నుంచి మధ్యాహ్నం 1.49 గంటల వరకు 46 శాతం గ్రహణం ఉంటుంది. విశ్వ వ్యాప్తంగా 3గంటల 33 నిమిషాలపాటు గ్రహణం ఉంటుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా పూర్తిస్థాయి వలయాకార సూర్యగ్రహణం విశ్వవ్యాప్తంగా ఉదయం 9.16 గంటల నుంచి మధ్యాహ్నం 3.04 వరకు ఉంటుంది. భారత్‌లో గుజరాత్లో మొదట గ్రహణం కనిపిస్తుంది. హైదరాబాద్‌లో పాక్షికంగా కనిపించనుంది. సూర్యగ్రహణం వేళ అతినీలలోహిత కిరణాలు భూమి మీద పడినపుడు కరోనా వైరస్ 0.001 శాతం మాత్రమే చనిపోయే అవకాశముంది. ► 2020లో సంభవించే రెండు సూర్యగ్రహణాల్లో ఇది మొదటిది. ఇది పాక్షిక సూర్య గ్రహణమే. డిసెంబర్ 14న ఏర్పడబోయేది సంపూర్ణ సూర్యగ్రహణం. ► దేశంలో గుజరాత్‌లోని భుజ్‌లో మొదట కనిపిస్తుందని, అస్సాంలోని దిబ్రూగఢ్‌లో చివరిగా మధ్యాహ్నం 2:29 గంటలకు పూర్తవుతుందని నెహ్రూ ప్లానెటోరియంలోని ఖగోళ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ► ఇవాళ్టి వార్షిక సూర్యగ్రహణంలో ఆకాశంలో అద్భుత దృశ్యమైన రింగ్ ఆఫ్ ఫైర్ కనువిందు చేయనుంది. రాజస్తాన్, హరియాణా, ఉత్తరాఖండ్ రాష్ట్రాల ప్రజలు దీనిని వీక్షించవచ్చును. ► రాజస్తాన్‌లో సూరత్‌గఢ్, అనూప్‌గఢ్, హరియాణాలో సిర్సా, రాటియా, కురుక్షేత్రలోనూ, ఉత్తరాఖండ్‌లో డెహ్రాడూన్, చంబా, చమోలిŠ‡లో రింగ్ ఆఫ్ ఫైర్ ఒక్కనిమిషం వరకు కనిపిస్తుంది. ► సెంట్రల్ ఆఫ్రికా, పాకిస్తాన్, దక్షిణ సెంట్రల్ చైనా, యూరప్‌లో కొన్ని ప్రాంతాలు, ఆస్ట్రేలియాలోనూ సూర్యగ్రహణం కనిపిస్తుంది. ► సూర్యగ్రహణాన్ని నేరుగా చూస్తే మనిషి కంటిలో రెటీనా దెబ్బ తింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తగినన్ని రక్షణ జాగ్రత్తలతో ఫిల్టర్ కళ్లద్దాలు ధరించిన తర్వాతే రింగ్ ఆఫ్ ఫైర్ దృశ్యాన్ని చూడొచ్చు. – రఘునందన్, ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా -
నేడు సూర్యుడికి సమీపంగా భూమి..
సాక్షి హైదరాబాద్: అంతరిక్షంలో మరో వింత చోటు చేసుకోబోతుంది. గురువారం సూర్యుడికి భూమి సమీపంగా చేరబోతుంది. ఖగోళ పరిభాషలో సూర్యుడికి భూమి సమీపంగా వెళ్లటాన్ని పెరిహిలియన్ అని, దూరంగా వెళ్లటాన్ని అపిలియన్ అని పిలుస్తుంటారు. గురువారం జరిగే ఈ వింతను పెరిహిలియన్‌గా పిలువనున్నారు. సూర్యుడికి భూమి దగ్గరగా, దూరంగా వెళ్లే ప్రక్రియ ఏటా రెండు మార్లు చోటు చేసుకుంటోంది. సూర్యుడి చుట్టూ భూమి దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతుంది. ఈ గమనంలో ఒకసారి సూర్యుడికి సమీపంగా, మరోసారి సూర్యుడికి దూరంగా వెళుతుంది. జనవరి 3న భూమి సూర్యుడికి సమీపంగా వెళుతుంది. ప్రతి ఏటా ఈ వింత చోటు చేసుకుం టోంది. అయితే జీవుల కంటికి నేరుగా కనిపించని ఈ ఘటన ఖగోళపరంగా చాలా ముఖ్యమైంది. దీని వల్ల వాతావరణంపై ఎటువంటి ప్రభావం ఉండబోదని ఖగోళ నిపుణులు చెబుతున్నారు. ఇది ప్రజలకు ముఖ్యంగా విద్యార్థులకు ముఖ్యమైన ఒక అంశాన్ని బోధించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వాతావరణ మార్పులు అపోహే.. సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వలన వాతావరణ మార్పులు వస్తాయనేది అపోహ మాత్రమే అనే విషయాన్ని ఈ ఖగోళ ఘటన ద్వారా రూఢీ చేసుకోవచ్చని ప్లానటరీ సొసైటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ రఘునందన్ కుమార్ తెలిపారు. ‘ఈ ఘటనలో భూమి సూర్యుడికి దగ్గరగా వస్తున్నప్పటికీ మనతో సహా ఉత్తర ధృవంలోనూ చలికాలమే కొనసాగుతోంది. జూలైలో భూమి సూర్యుడికి దూరంగా వెళ్లే ఘటన చోటు చేసుకుంటుంది. ఆ సమయంలో మనకు వేసవికాలం. కాబట్టి సూర్యుడికి, భూమికి మధ్య దూరం తగ్గటం వల్ల రుతువులు ఏర్పడతాయని, లేదా వాతావరణ మార్పులు కలుగుతాయనేది అవాస్తవం. దీర్ఘ వృత్తాకారంలో తిరుగుతున్నప్పుడు భూమి వాలే తీరును బట్టి కాలాలు, రుతువులు ఏర్పడతాయి. ఈ విషయాన్ని విద్యార్థులు అర్థం చేసుకోవడానికి ఈ ఘటనను వారికి చూపించవచ్చు’అని రఘునందన్ పేర్కొన్నారు. పది రోజులు ఉల్కలు.. జనవరి 12 వరకు సూర్యోదయానికి ముందు ఆకాశంలో ఉల్కలను చూసే అవకాశం ఉందని, ముఖ్యంగా 4వ తేదీ నాడు ఈ అవకాశం మరింత ఎక్కువగా ఉందని రఘునందన్ తెలిపారు. ఉదయం 3 గంటల నుంచి, తూర్పు, ఈశాన్య దిశల్లో రాలే చుక్కల (ఉల్క)ను చూడవచ్చని చెప్పారు. -
‘వ్యోమోగ్రహ’కు నాసా పిలుపు
పెరుగుతున్న జనాభా, గ్లోబల్ వార్మింగ్‌తో రాబోయే రోజుల్లో భూమి మనుగడ ప్రమాదకరం కానుంది. అందుకోసం ముందుగానే నా వంతుగా ఈ పరిశోధనకు శ్రీకారం చుట్టాను. నా ఈ ప్రయత్నాన్ని తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యం, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. వారందరికీ కృతజ్ఞతలు -ప్రవళిక కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినులతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొం దించారు. ఈ పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకు వచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు. -
‘వ్యోమోగ్రహ’కు నాసా ఆహ్వానం
కాటేదాన్, న్యూస్‌లైన్: అంతరించిపోనున్న భూమి.. ప్రత్యామ్నాయ మార్గాలు, ప్రమాదపుటంచునున్న మానవజాతి.. కాపాడేందుకు ప్రయత్నాలు.. ఇతర గ్రహాలపై మనిషి మనుగడ అనే అంశంపై సాగించిన పరిశోధనలు.. ఇంకేముంది ఆ విద్యార్థినిని అమెరికాకు చెందిన నాసా పరిశోధనా కేంద్రం గుర్తించింది. వివరాల్లోకి వెళ్తే... మైలార్‌దేవ్‌పల్లి టీఎన్జీవోస్‌కాలనీకి చెందిన వరప్రకాష్, అనురాధ దంపతులు. వీరి సంతానం ప్రవళిక. ఈ బాలిక స్థానికంగా ఉన్న మణికంఠ హిల్స్‌లోని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాలలో ఎనిమిదోతరగతి చదువుతోంది. మధ్య తరగతి కుటుంబానికి చెందిన వరప్రకాష్, అనురాధలు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూనే తమ కూతుర్ని నూతన పరిశోధనల కోసం ప్రో త్సహిస్తున్నారు. కాగా ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపకులు రఘునందన్ నేతృత్వంలో ప్రవళిక మరో నలుగురు విద్యార్థినిలతో ‘వ్యోమోగ్రహ’ పేరుతో పరిశోధనలు నిర్వహించారు. రానున్న రోజుల్లో ప్రపంచం అంతరించిపోతుందని వస్తున్న కథనాల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికతో ‘వ్యోమోగ్రహ’ పరిశోధనను రూపొందించారు. అయితే పరిశోధనాంశాన్ని ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంస్థ నాసాకు పంపించింది. వీరి పరిశోధనాంశాన్ని పరిశీలించిన నాసా అధికారులు ప్రవళిక బృందాన్ని ఆహ్వానించారు. ఈ మేరకు తమ పాఠశాల విద్యార్థిని సాధించిన ఘనత తమకు మంచి గుర్తింపును తీసుకువచ్చిందని పయోనీర్ కాన్సెప్ట్ పాఠశాల కరస్పాండెంట్ ఎస్. ప్రమోద్‌రెడ్డి, డెరైక్టర్ బి. శ్రీనివాస్, ప్రిన్సిపల్ గోపాల్, సిబ్బంది ప్రవళికను ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో అభినందించారు. కాగా భావితరాలకు మార్గదర్శకాన్ని చూపిం చేందుకు ప్రవళిక చేస్తున్న కృషి ప్రతి విద్యార్థినికి ఆదర్శం కావాలని ఆమె తల్లిదండ్రులు అభిప్రాయపడ్డారు. నాసా పరిశోధనా కేంద్రానికి వెళ్లి వచ్చేందుకు దాదాపు 15రోజులు పడుతుందని, అందుకు సుమారు రూ.3లక్షలు ఖర్చవుతాయని, దీనిని సొంతంగా తామే భరిస్తున్నామని వారు పేర్కొన్నారు.