మాట్లాడుతున్న నాయకులు
సాక్షి, ఆదిలాబాద్: హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్న నిరుద్యోగి ప్రవళికది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే అని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గౌరాల సుభాష్, జగన్‌సింగ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని కుమురంభీం భవన్‌లో సోమవారం వారు మాట్లాడారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం విద్యార్థులు, యువకుల బలిదా నాలతో స్వరాష్ట్రం సాధించుకున్నామన్నారు. అయి తే సీఎం కేసీఆర్ నీళ్ల పేరు చెప్పి నిధులను తన ఇంటికి మళ్లించుకున్నారని, ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని మండిపడ్డారు.
గ్రూప్–1 పరీక్ష ఇప్పటికే రెండుసార్లు రద్దయిందన్నారు. ఉద్యోగ ప్రకటనలిస్తూ నియామకాల ప్రక్రియ సరిగా పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరి కారణంగానే ప్రవళిక మానసిక వేదనతో ఆత్మహత్య చేసుకుందని ఆరోపించారు. ప్రవళిక ఆత్మహత్య ప్రేమ విఫలం వల్లే జరిగిందని ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. నిరుద్యోగ యువత ఇప్పటికై నా ఆలోచించాలన్నారు. ప్రజల కోసం నిరంతరం పోరాడే విప్లవ పార్టీలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇందులో నాయకులు అశోక్, దండేకర్ వామన్, నితిన్, సురేష్, కృపాకర్, శ్రవణ్ తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment