
సాక్షి, వైఎస్సార్ జిల్లా : జిల్లాల్లో దారుణం చోటుచేసుకుంది. చదువుకు తగ్గ ఉద్యోగం రాలేదని మనస్తాపం చెంది ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైఎస్సార్ జిల్లా బద్వేలు కృష్ణదేవరాయనగర్‌కి చెందిన చైతన్య ఢిల్లీలో ఓ చిన్న ఉద్యోగం చేస్తున్నారు. తన చదువు తగ్గ ఉద్యోగం దొరకలేదని మనస్తాపం చెందిన చైతన్య ఇటీవల సొంత గ్రామానికి తిరిగి వచ్చారు.
మూడు రోజుల క్రితం చైతన్య తల్లిదండ్రులు పని మీద వేరే గ్రామానికి వెళ్లారు. ఇదే మంచి సమయంగా భావించిన చైతన్య సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇంటి తలుపులు పగులగొట్టి చూడగా చైతన్య తాడుకు వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకి తరలించామని, సూసైడ్ నోట్‌పై విచారణ చేపట్టామని పోలీసులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment