వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు.
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ చిన్న మండ్యం మండలం తాళ్లవాండ్లపల్లికి చెందిన హరి దంపతులుగా గుర్తించారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు.