hari
-
తలకు మర్దనా చేస్తున్నారా..?
తలకు మర్దనా చేస్తున్నారా ..?. అయితే ఈ కొద్దిపాటి చిట్కాలు ఫాలోకండి. కేశ సౌందర్యానికే కాదు మన ఆరోగ్యానికి మంచిదట. ఇలా మర్దన చేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన మటుమాయం అవుతాయంటున్నారు నిపుణులు. పైగా మనసుకు తేలిగ్గా అనిపించడమే కాకుండా ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవట. మరీ అనుసరించాల్సిన చిట్కాలేంటో చూద్దామా..!.తలకు మసాజ్ చేసేటప్పుడు ఒకసారి మొత్తంగా వలయాకారంగా మర్దన చేసిన తర్వాత క్రాస్స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి బొటన వేలు – చూపుడు వేలిని మాత్రమే వాడాలి. రెండు వేళ్లలో ఇమిడేటంత జుట్టును కుదుళ్లకు దగ్గరగా పట్టుకుని ఇంగ్లిష్ అక్షరం ఆకారంలో అటూ ఇటూ లాగి వదలాలి. ఇలా నుదుటి దగ్గర నేరుగా పాపిడి తీసే దగ్గర మొదలు పెట్టి తల వెనుక వరకు వెళ్లి తర్వాత పక్కనే మరొక వరుస... ఇలా తలంతా చేయాలి.ఇక పించింగ్ స్ట్రోక్స్ ఇవ్వాలి. దీనికి అన్నివేళ్లనూ వాడాలి. రెండు వేళ్లతో గిచ్చడం కాకుండా అన్నివేళ్లతో పుర్రెను గిచ్చుతున్నట్లు (గోళ్లు తగలకూడదు) ఒత్తిడి కలిగించాలి. చివరగా మరొకసారి తలంతా వలయాకారంగా మర్దన చేయాలి. ఇంతటితో తలకు మసాజ్ పూర్తవుతుంది. మసాజ్ పూర్తయిన తర్వాత పది నిమిషాలకు తలస్నానం చేస్తే ఆహాయి రెండు– మూడు రోజులు ఉంటుంది. ఈ మసాజ్ కేశ సౌందర్యానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా మంచిది. కొన్ని రకాల తలనొప్పులు, ఒత్తిడి కారణంగా వచ్చే చికాకులు మాయమవుతాయి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే మంచి ప్రయోజనం ఉంటుంది.క్రమం తప్పకుండా జుట్టుకు ట్రీట్మెంట్ జరుగుతుంటే జుట్టు రాలడం, చిట్లిపోవడం, చుండ్రు మొదలైన సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉండదు. వంశపారంపర్యంగా కాక పోషకాహార లోపం వల్ల, సంరక్షణలోపం వల్ల చిన్న వయసులోనే తెల్లబడడాన్ని సమర్థంగా నివారించవచ్చు. టేబుల్ స్పూన్ మినప్పప్పు, నాలుగు బాదంపప్పులు కలిపి నీటిలో రాత్రంతా నాబెట్టాలి. ఉదయాన్నే ఈ రెండింటిని మెత్తగా రుబ్బాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, చేతులకు పట్టించి, మెల్లగా రుద్దాలి. అరగంట తర్వాత శుభ్రపరుచుకోవాలి. చర్మం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. (చదవండి: పారిపోవాలని అనిపిస్తోంది..! ఈ సమస్య నుంచి బయటపడేదెలా..?) -
ఈ ఆపిల్ ఎక్కడైనా కాస్తుంది!
హిమవత్పర్వత సానువులకే పరిమితమైన ఆపిల్ సాగును మైదానప్రాంతాలకు తీసుకొచ్చారు ఓ సామాన్య రైతు. ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగయ్యే హెచ్‌ఆర్‌ఎంఎన్–49 ఆపిల్ వంగడాన్ని రైతు శాస్త్రవేత్త హరిమాన్ శర్మ(Hariman Sharma) అభివృద్ధి చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని బిలాస్పూర్ జిల్లాలోని పనియాలా ఆయన స్వగ్రామం. మామిడితో పాటే ఆపిల్ సాగు(Apple Cultivation)... హిమాచల్ ప్రదేశ్, ఉత్తర ప్రదేశ్, కశ్మీర్ రాష్ట్రాల్లోని కొండలపై మాత్రమే ఆపిల్ వాణిజ్య పంటగా సాగులో ఉంది. చల్లని వాతావరణం ఉన్న ఆ కొండప్రాంతాలు మాత్రమే ఆపిల్ సాగుకు అనుకూలంగా ఉంటాయి. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోనూ కొండప్రాంతాల్లో మాత్రమే వాతావరణం చల్లగా ఉంటుంది. అందుకే, ఆ రాష్ట్ర రాజధాని సిమ్లా ఆపిల్ సాగులో దేశంలోనే పేరెన్నికగన్నది. కానీ ఆ రాష్ట్రంలోనూ కొండ లోయల్లో, మైదానప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు అధికమే.బిలాస్పూర్ జిల్లా సముద్ర మట్టానికి 1800 మీటర్ల ఎత్తులో ఉన్న ఒక లోయ ప్రాంతం. అక్కడ ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో రైతులు మామిడి తోటలను విస్తారంగా సాగు చేస్తున్నారు. అలాంటి వేడి వాతావరణం ఉన్నప్రాంతంలో తన ఇంటి పెరట్లో ఒక ఆపిల్ మొక్క మొలకెత్తటాన్ని హరిమాన్ శర్మ గమనించారు. పనియాలా లాంటి వేడి వాతావరణంలో ఆపిల్ చెట్టు పెరగటం శర్మను ఆలోచనలో పడేసింది. ఆ మొక్కను అతి జాగ్రత్తగా చూసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక ఏడాది గడిచాక ఆ ఆపిల్ చెట్టు నుంచి వచ్చిన కొమ్మలను తీసుకొని రేగు మొక్కతో అంటుకట్టారు. ఆప్రాంతంలో అంటు కట్టటానికి కూడా ఆపిల్ చెట్లు అందుబాటులో లేకపోవటమే దీనిక్కారణం. అతని ప్రయోగం విజయవంతమైంది. 45 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ పంట చేతికొచ్చింది! అంతేకాదు.. ఆపిల్ కాయలు సైజులోను, నాణ్యతలోనూ బావున్నాయి. సిమ్లా నుంచి ఆపిల్ విత్తనాలు తెచ్చి పెంచిన మొక్కలతో అంటుకట్టాడు. రెండేళ్ల తరువాత మంచి పంట చేతికొచ్చింది. తను సాగు చేస్తున్న మామిడి చెట్లతో పాటే ఆ ఆపిల్ చెట్లను పెంచాడు. ఆ విధంగా ఒక చిన్న ఆపిల్ తోటనే అతను సృష్టించాడు! సాధారణంగా ఆపిల్‌లో పూత రావలన్నా పిందెలు రావాలన్నా అతి చల్లని వాతావరణం అవసరం. కానీ హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 రకం ఆపిల్‌ను సాధారణ వాతావరణంలోనూ ఉష్ణమండలప్రాంతాల్లోనూ సాగు చేయవచ్చని హరిమాన్ శర్మ చెబుతున్నారు. ఈ మొక్క మూడేళ్లు తిరిగేసరికి కాపుకొస్తుంది. జూన్‌లో కాయటం దీని మరో ప్రత్యేకత. ఆ కాలంలో ఇప్పుడున్న దేశీవాళీ ఆపిల్ కాయలు మార్కెట్లోకి రావు. దీంతో ఈ రకం ఆపిళ్లను సాగు చేసే రైతులు లాభపడుతున్నారు. హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 వంగడంపై నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ (ఎన్.ఐ.ఎఫ్.) దృష్టి కేంద్రీకరించింది. దేశంలోని విభిన్న వ్యవసాయక వాతావరణ పరిస్థితులున్నప్రాంతాల్లో 2015–17 మధ్యకాలంలో ప్రయోగాత్మకంగా సాగు చేయించింది. 29 రాష్ట్రాలు, 5 కేంద్ర పాలితప్రాంతాలకు చెందిన 1,190 మంది రైతులకు 10 వేల ఆపిల్ మొక్కలు ఇచ్చి సాగు చేయించారు. చాలా రాష్ట్రాల్లో సత్ఫలితాలు వచ్చాయని ఎన్.ఐ.ఎఫ్. ప్రకటించింది. పరిశోధనాలయాల్లో సాగులో ఉన్న రకాలతో పోల్చితే హెచ్.ఆర్.ఎం.ఎన్.–99 పండ్లు నాణ్యమైనవని తేలింది. కొన్ని రాష్ట్రాల్లో ఏడాది వయసున్న మొక్కలకే పూత వచ్చింది.దక్షిణాదిన కర్నాటకలోని చిక్మగుళూరు, హర్యానా రైతులు హెచ్‌ఆర్‌ఎంఎన్–99 ఆపిల్ వంగడాన్ని సాగు చేసి ఏడాదికి రెండు పంటలు తీస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు విదేశాల్లోనూ సాగవుతోంది. మంచి దిగుబడులు వస్తున్నాయి. కాయలు రుచిగా ఉండటంతో కొనేందుకు వినియోగదారులు మక్కువ చూపుతున్నారు. బిలాస్పూర్ జిల్లాలోని కొండ దిగువ జిల్లాల్లోనిప్రాంతాల్లోని వేలాది మంది సాధారణ రైతులకు హరిమాన్ శర్మ స్ఫూర్తి ప్రదాతగా మారారు.అంతకు ముందు ఆప్రాంతంలోని రైతులు తాము ఆపిల్‌ను సాగు చేయటమనేది వారు కలనైనా ఊహించ లేదు. ఆయనను ఇప్పుడు బిస్లాపూర్ జిల్లాలో ‘ఆపిల్ మేన్’ అని ఆత్మీయంగా పిలుస్తున్నారు. ఈ ఆవిష్కరణ ఆయనకు ప్రతిష్టాత్మక అవార్డులను సంపాయించి పెట్టింది. రాష్ట్రపతి చేతుల మీదుగా ఎన్.ఐ.ఎఫ్. జాతీయ పురస్కారాన్ని,‘ప్రేరణా శ్రోత్’ పురస్కారాన్ని పొందారు. హరిమాన్ శర్మ, పనియాల గ్రామం, బిలాస్పూర్ జిల్లా, హిమాచల్ ప్రదేశ్ – 174021. ఫోన్: 09418 867209, 09817 284251 , sharmaharimanfarm @gmail.com‘తెలుగు రాష్ట్రాల్లో రైతులకు 15 వేల మొక్కలు అందించాం’మైదానప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల్లోనూ సాగు చేయదగిన ఆపిల్ వంగడాన్ని హారిమన్ శర్మ రూపొందించారు. ఆయన దగ్గరి నుంచి ఈ మొక్కల్ని పల్లెసృజన తరఫున తెప్పించి, తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులకు గత ఐదేళ్లుగా నవంబర్–డిసెంబర్ నెలల్లో ఇస్తున్నాం. ఇప్పటికి సుమారు 15 వేల ఆపిల్ మొక్కల్ని రైతులకు అందించాం. ప్రత్యేకంగా ప్యాక్ చేసి స్పీడ్ కొరియర్లో రైతుల ఊళ్లకే పంపుతున్నాం. ఖర్చులన్నీ కలిపి మొక్క ఖరీదు రూ. 220 అవుతోంది. చాలా చోట్ల ఈ ఆపిల్ చెట్లకు ఇప్పటికే పండ్లు కాస్తున్నాయి. sharmaharimanfarm @gmail.com -
కమర్షియల్ డైరెక్టర్‌తో విజయ్ సేతుపతి ఫస్ట్ సినిమా.. నిర్మాతగా నయనతార
కోలీవుడ్‌లో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈయన హీరో, విలన్ అన్న తారతమ్యం లేకుండా పాత్ర నచ్చితే నటించడానికి రెడీ అంటున్నారు. గత ఏడాదిలో 'జవాన్' చిత్రంలో షారుఖ్ ఖాన్‌కు విలన్‌గా నటించి ప్రశంసలు అందుకున్నారు. అంతకుముందే విజయ్ కథానాయకుడిగా నటించిన మాస్టర్ చిత్రంలో ప్రతి నాయకుడిగా నటించి ఆ చిత్ర విజయంలో భాగమయ్యారు. ఇక ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన మహారాజా చిత్రం సంచలన విజయాన్ని సాధించింది. తాజాగా విడుదలై 2 చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. ప్రస్తుతం ఈయన నటిస్తున్న ట్రైన్, ఏస్, గాంధీ టాకీస్ చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. కాగా తాజాగా విజయ్ సేతుపతి కథానాయకుడిగా మరో చిత్రంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతోంది. కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన హరి దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించే విషయమై చర్చలు జరుగుతున్నట్లు తాజా సమాచారం. దర్శకుడు హరి గతంలో సూర్యతో సింగం సీక్వెల్స్ చిత్రాలను తెరకెక్కించి హిట్ అందుకున్నారు. ఆపై హీరో విశాల్‌తో పూజై సినిమాతో బిగ్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు విజయ సేతుపతితో సినిమా నిజమైతే వారిద్దరి కాంబినేషన్లో తెరకెక్కే తొలి చిత్రం ఇదే అవుతుంది. ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నటి నయనతార, విగ్నేష్ శివన్ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సంస్థలో పలు వైవిద్య భరిత సక్సెస్ఫుల్ చిత్రాలను నిర్మించిన నయనతార విగ్నేశ్ శివన్ లు తాజాగా విజయ్ సేతుపతి హీరోగా చిత్రం చేస్తున్నారన్న ప్రచారం జరగడంతో దీనిపై ఆసక్తి నెలకొంది. కాగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడ లేదన్నది గమనార్హం. -
ఎమ్మెల్యే ఇంట్లోనే నన్ను తీవ్రంగా కొట్టారు
గుంటూరు: నరసరావుపేట టీడీపీ ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్‌బాబు గృహంలోనే తనపై మారణాయుధాలతో దాడిచేశారని ఆ పార్టీ కార్యకర్త అల్లూరి హరికృష్ణ తెలిపారు. తీవ్రంగా గాయపడిన తనకు కనీసం తాగేందుకు మంచినీళ్లు కూడా ఇవ్వకుండా ఎమ్మెల్యే బయటకు నెట్టేశారని చెప్పారు. 4న నరసరావుపేటలోని ఎమ్మెల్యే అరవింద్‌బాబు గృహంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి తన్నుకున్నారు. ఈ ఘర్షణలో తీవ్రంగా గాయపడిన హరికృష్ణ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన నుంచి శుక్రవారం రాత్రి వన్‌టౌన్ పోలీసులు ఫిర్యాదు స్వీకరించి 43మందిపై కేసు నమోదు చేశారు.హరికృష్ణ శనివారం ఆస్పత్రిలో మీడియాతో మాట్లాడారు. ‘నా సొంత ఊరు నరసరావుపేట మండలం ఇసప్పాలెం. నరసరావుపేట శ్రీనివాసనగర్‌లో ఉంటూ పల్నాడు రోడ్డులో బ్లడ్ బ్యాంకు నిర్వహిస్తున్నాను. 4న సాయంత్రం ఎమ్మెల్యేతో డీఎంహెచ్‌వోకు ఒక ఫోన్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ప్రకాష్‌నగర్‌లోని ఆయన ఇంటికి వెళ్లగా... ప్రసాద్, సురేష్, సాయి, రాజేష్, అంకమ్మరాజు, కాళీ, ప్రేమ్‌కుమార్, నవీన్, బొట్టు సాయితోపాటు మరో 40మంది కర్రలు, కత్తులు, ఇనపరాడ్లు పట్టుకుని బైక్‌లపై ఎమ్మెల్యే గృహంలోకి వచ్చి పూలకుండీలు, కురీ్చలు పగలగొట్టారు.అక్కడే నిలబడి ఉన్న నాపై మారణాయుధాలతో దాడి చేయడంతో నా ఎడమ చేయి మోచేతి కిందభాగంలో ఎముక విరిగింది. తల, వీపుపై గాయాలయ్యాయి. అక్కడకు వచ్చిన వారిలో సురేష్ అనే వ్యక్తి నన్ను గుర్తుపట్టి తెలిసినవాడే అనడంతో వదిలేశారు. ఇంట్లో నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేను తీవ్రంగా గాయపడిన నేను తాగేందుకు మంచినీళ్లు ఇవ్వాలని అడిగితే బయటకు నెట్టివేసి లోపలికి వెళ్లిపోయారు. మా గ్రామం టీడీపీకి కంచుకోట. నేను కూడా అరవిందబాబు గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశా. అయినా నాకు తాగేందుకు మంచినీళ్లు ఇవ్వలేదు. రెండు రోజులుగా ఆస్పత్రిలో ఉన్నా పరామర్శించేందుకు కూడా ఎమ్మెల్యే రాలేదు.’ అని చెప్పారు. -
సీఎం జగన్ పై దాడి.. ఈనాడు తప్పుడు వార్త.. యాంకర్ హరి కౌంటర్
-
రత్నం సినిమా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
నటుడు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం రత్నం. కమర్షియల్ దర్శకుడు హరి దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. వీరి కాంబినేషన్లో ఇంతకుముందు తామరబరణి, పూజ వంటి సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి అన్నది గమనార్హం. కాగా తాజాగా విశాల్ దర్శకుడు హరి కాంబోలో హ్యాట్రిక్ చిత్రం రత్నం. నటి ప్రియా భవాని శంకర్ నాయకిగా నటిస్తున్న ఇందులో సముద్రఖని, యోగిబాబు, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తీక్ సుబ్బురాజ్ స్టోన్ బెంచ్ ఫిలిమ్స్, జి.స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈచిత్రాన్ని ఏప్రిల్ 26వ తేదీన విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలోని సింగిల్ సాంగ్ ఇటీవల విడుదల చేశారు. తాజాగా రెండవ పాటను శుక్రవారం విడుదల చేశారు. ఎదనాల అనే పల్లవితో సాగే ఈ మెలోడి పాటను గీత రచయిత వివేక్ రాయగా నటుడు విశాల్, నటి ప్రియా భవాని శంకర్‌లపై చిత్రీకరించినట్లు యూనిట్ వర్గాలు తెలిపారు. రత్నం చిత్రం కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. విశాల్ ఇంతకుముందు నటించిన మార్క్ ఆంటోని చిత్రం మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. దీంతో ఆ తరువాత రాబోతున్న రత్నం చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. -
యువకుడికి 60 ఏళ్ల జైలు శిక్ష
జగిత్యాలరూరల్: చిన్నారులకు మాయ మాటలు చెప్పి.. అశ్లీల చిత్రాలు చూపించి వంచించిన ఓ యువకుడికి మూడు కేసుల్లో ఒక్కో కేసుకు 20 ఏళ్ల చొప్పున 60 ఏళ్ల జైలు శిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా సెషన్స్ జడ్జి నీలిమ శనివారం సంచలన తీర్పునిచ్చారు. అలాగే బాధిత బాలికలకు రూ.3 లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని ఆదేశించారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం దట్నూరు గ్రామానికి చెందిన కొడిమ్యాల హరికృష్ణ అలియాస్ హరీశ్ (27) గ్రామంలో కిరాణా షాపు నిర్వహిస్తున్నాడు. ఆయన షాపునకు వచ్చే ముగ్గురు బాలికలకు సెల్ఫోన్లో గేమ్స్ ఆడుకోమని ఇచ్చి వారి పక్కన కూర్చుని బూతు వీడియోలు, ఫొటోలు చూపిస్తూ వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బాలికల తల్లిదండ్రులు హరీశ్‌పై గొల్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మూడు పోక్సో కేసులు నమోదు చేశారు. అప్పటి డీఎస్పీ ప్రకాశ్, సీఐ బిల్లా కోటేశ్వర్, ఎస్సై శ్రీధర్‌రెడ్డి ఆధారాలు సేకరించి.. కోర్టుకు సమర్పించారు. నేరం రుజువుకావడంతో నిందితుడికి ఒక్కో కేసులో 20 ఏళ్ల జైలుశిక్షతోపాటు రూ.5వేల జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు చెప్పారు. అలాగే ఒక్కో బాలికకు రూ.3 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. మూడు కేసుల్లో శిక్షను ఏకకాలంలో అమలు చేయాలని తీర్పులో పేర్కొన్నారు. -
జనసైనికులను నట్టేట ముంచుతున్న పవన్
-
మీ "కమ్మ” కళ్ళకు అవి కనబడవా
-
సినిమా ఛాన్సులు లేవు.. కానీ భారీగా సంపాదిస్తున్న హీరోయిన్
పాపులర్ హీరోయిన్లు సినిమాల్లో బాగానే సంపాదిస్తారన్నది ఎవరూ కాదనలేరు. అయితే సినిమాల్లోనే కాకుండా ఇతర రంగాల్లోనూ వారు దీటుగా సంపాదించవచ్చని కోలీవుడ్ హీరోయిన్ ప్రీతా విజయకుమార్ నిరూపించారు. ఈమె గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు అనుకుంటా. నటుడు విజయ్ కుమార్, మంజుల దంపతుల నలుగురు కూతుర్లలో ఒకరు ప్రీత. సినీ కుటుంబానికి చెందిన ఈమె కూడా 1998లో రుక్మిణి అనే చిత్రం ద్వారా కథానాయకిగా పరిచయమయ్యారు. ఆ తరువాత తెలుగు, మలయాళం భాషల్లోనూ నటించిన ప్రీత నరసింహ చిత్రంలో రజనీకాంత్ కూతుర్లలో ఒకరిగా నటించి పాపులర్ అయ్యారు. ఆ తరువాత మా అన్నయ్య, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, ప్రియమైన నీకు, చందు, వంటి చిత్రాల్లో నాయకిగా నటించారు. ఆ తరువాత 2002లో దర్శకుడు హరిని పెళ్లి చేసుకుని నటనకు స్వస్తి చెప్పి సంసార జీవితంలో సెటిల్ అయ్యారు. వీరికి ముగ్గురు కుమారులు ఉన్నారు. నటనకు దూరంగా ఉంటున్న ప్రీత సామాజిక మాధ్యమాల్లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. తన సోదరి శ్రీదేవి ఇతర స్నేహితురాళ్లతో కలిసిన ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తూ లైవ్‌లో ఉంటున్న ప్రీత ఇతర వ్యాపారంలోనూ బిజీగా వున్నారు. ఈమె చైన్నె సముద్రతీరంలోని ఉత్తండి అనే ప్రాంతంలో ప్రీత ప్యాలెస్ పేరుతో ఒక అందమైన కల్యాణ మండపాన్ని నిర్మించారు. దాని సమీపంలోనే మెట్రో కాఫీ హౌస్ ఏర్పాటు చేశారు. ఇందులో పనిచేసే వాళ్లందరూ మహిళలు కావడం విశేషం. మద్రాస్ కాఫీ పేరుతో ఇప్పటికే పలు ప్రాంచైజీలు కూడా ఆమె ఇవ్వడం జరిగింది. వీరితో పాటు స్థానిక సాలిగ్రామంలోని సినీ ఎడిటింగ్, డబ్బింగ్ స్టూడియోను నిర్వహిస్తున్నారు. ఇలా ప్రీత నెలకు లక్షల్లో ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. మరో పక్క ఈమె భర్త హరి కమర్షియల్ దర్శకుడిగా మంచి ఫామ్‌లో వున్నారు. -
రత్నం రెడీ
వేసవిలో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘రత్నం’. విశాల్ హీరోగా నటించిన తాజా యాక్షన్ ఫిల్మ్ ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్ హీరోయిన్గా నటించారు. హరి దర్శకత్వంలో కార్తికేయన్ సంతానం ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరగుతున్నాయి. కాగా ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్ 26న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ వెల్లడించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘తుప్పరివాలన్’ (తెలుగులో ‘డిటెక్టివ్’)కి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్ 2’ చేస్తున్నారు విశాల్. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారట విశాల్. ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం. -
మంత్రి రోజాపై చేసిన ఆరోపణలన్నీ నిరాధారమన్న వైఎస్ఆర్సీపీ నేతలు
-
ప్రముఖ దర్శకుడి ఇంట్లో తీవ్ర విషాదం!!
ప్రముఖ తమిళ చిత్ర దర్శకుడు హరి ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి వీఏ గోపాలకృష్ణన్ ఈరోజు చెన్నైలో కన్నుమూశారు. ప్రస్తుతం ఆయనకు 88 సంవత్సరాలు కాగా.. గత కొన్ని వారాలుగా అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సింగం డైరెక్టర్ హరి తండ్రి మృతి పట్ల కోలీవుడ్ ప్రముఖులు, దర్శకనిర్మాతలు సంతాపం ప్రకటించారు. కాగా.. గోపాలకృష్ణన్ భౌతికకాయానికి టుటికోరిన్ జిల్లాలోని వారి స్వగ్రామం కాచనవెల్లిలో ఆదివారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకుడు హరితో పాటు గోపాలకృష్ణన్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ప్రశాంత్ ప్రధాన పాత్రలో నటించిన 2002 తమిళ చిత్రం 'తమిజ్'తో అరంగేట్రం చేసిన దర్శకుడు హరి.. తన 21 సంవత్సరాల సినీ జీవితంలో అనేక కమర్షియల్ హిట్లను అందించారు. హరి ప్రస్తుతం విశాల్ హీరోగా ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. 2003లో సామి, 2010లో సింగం వంటి చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. -
మార్క్ ఆంటోనీ తర్వాత క్రేజీ డైరెక్టర్‌కు ఛాన్స్ ఇచ్చిన విశాల్
మార్క్ ఆంటోనీ చిత్రంతో మళ్లీ విజయాల బాట పట్టిన విశాల్.. తాజాగా కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇంతకుముందు విశాల్ కథానాయకుడిగా భరణి, పూజ సినిమాలకు దర్శకత్వం వహించిన కమర్షియల్ దర్శకుడు హరి ఇప్పుడు మూడోసారి డైరెక్ట్ చేస్తున్నారు. ఇది విశాల్ నటిస్తున్న 34వ చిత్రం. ఇందులో నటి ప్రియా భవానీ శంకర్ నాయకిగా నటిస్తుండగా దర్శకుడు సముద్రఖని, యోగిబాబు తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దీన్ని జి స్టూడియోస్ సౌత్ సంస్థతో కలిసి దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ తన స్టోన్ పెంచి ఫిలిమ్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. గత 20 రోజులుగా జరుగుతున్న ఈ చిత్రం ఇప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం తూత్తుకుడి జిల్లా విళాత్తికుళం పరిసర ప్రాంతాల్లో చిత్ర క్లైమాక్స్ సన్నివేశాలను దర్శకుడు హరి చిత్రీకరిస్తున్నారు. కాగా తాజాగా ఈ చిత్రంలో దర్శకుడు గౌతమ్ మీనన్ ముఖ్య పాత్రను పోషిస్తున్ననట్లు నటుడు విశాల్ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ చిత్రంలో ముగ్గురు దర్శకులతో పనిచేస్తున్నందుకు సంతోషంగా ఉందని, ఈ సంఖ్య వచ్చే ఏడాది నాలుగు అవుతుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మధ్యలో ఆగిపోయిన డిటెక్టెవ్- 2 చిత్రాన్ని దర్శకుడిగా విశాల్‌నే హ్యాండిల్ చేయడానికి సిద్ధమవుతున్నారు. కాగా విశాల్, హరి కాంబోలో రూపొందుతున్న ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు హరి అంటేనే మాస్ మసాలా చిత్రాలకు కేరాఫ్. మరి ఈయన విశాల్‌తో తెరకెక్కిస్తున్న మూడవ చిత్రం హ్యాట్రిక్ సాధిస్తుందో లేదో చూడాలి. -
‘సాక్షి’ రాసింది.. ఏసీబీ కదిలింది!
సాక్షి, హైదరాబాద్: పెంచిన మామూళ్లతో పాటు ‘పాత బకాయిల’ కోసం పబ్ యజమానిని వేధించి, బెదిరించి, తప్పుడు కేసు నమోదు చేసిన బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ ఎం.నరేందర్, ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డి, హోంగార్డు హరిపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు చర్యలకు ఉపక్రమించారు. రాజకీయ నాయకుల ప్రమేయంతో కొన్నాళ్ల క్రితం అటకెక్కిన ఈ కేసు వ్యవహారంపై ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన ఏసీబీ అధికారులు శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌పై దాడి చేశారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఈ నేపథ్యంలోనే నరేందర్ అస్వస్థతకు గురి కావడంతో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ముగ్గురి పైనా శాఖాపరమైన చర్యలు తీసుకుంటూ సస్పెండ్ చేయడానికి ఉన్నతాధికారులు సన్నాహాలు చేపట్టారు. మామూలు పెంచి ‘ఎరియర్స్’ ఇమ్మని... బంజారాహిల్స్ పీఎస్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్న ఎం.నరేందర్‌కు రాజకీయ అండదండలు దండిగా ఉన్నాయన్నది బహిరంగ రహస్యమే. తన పరిధిలో ఉన్న పబ్స్, బార్ అండ్ రెస్టారెంట్స్‌తో పాటు మసాజ్ సెంటర్ల నుంచి నెలవారీ మామూళ్లు వసూలు చేస్తున్నారు. తన వద్ద హోంగార్డుగా పని చేస్తున్న హరికి ఈ కలెక్షన్స్ బాధ్యతలు అప్పగించారు. అతడే ప్రతి నెలా అందరికీ ఫోన్లు చేసి, డబ్బు వసూలు చేసుకుని వస్తుంటాడు. కొన్ని నెలల క్రితం నరేందర్ తన పరిధిలో ఉన్న పబ్స్ ఇచ్చే నెల వారీ మామూళ్లను రూ.50 వేల నుంచి రూ.1.5 లక్షలకు పెంచేశారు. అంతటితో ఆగకుండా రెండు నెలల ‘ఎరియర్స్’తో కలిపి మొత్తం రూ.4.5 లక్షలు చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బంజారాహిల్స్ రోడ్ నెం.14లోని రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్ పబ్‌ను లక్ష్మణ్ రావు, శివలాల్ నిర్వహిస్తున్నారు. అంత మొత్తం ఇచ్చేందుకు వారు అంగీకరించకపోవడంతో ‘రిబేటు’ ఇచ్చిన నరేందర్ రూ.3 లక్షలకు తగ్గించారు. ఈ డబ్బు ఇవ్వాలంటూ లక్ష్మణ రావుకు హోంగార్డు హరితో పదేపదే వాట్సాప్ కాల్స్ చేయించాడు. హేయమైన ఆరోపణలతో తప్పుడు కేసు... పబ్ యాజమాన్యం తన మాట వినకపోవడంతో వారిపై తప్పుడు కేసు నమోదు చేసేందుకు ఎస్సై ఎస్.నవీన్‌రెడ్డితో కలిసి పథక రచన చేశాడు. ఈ ఏడాది జులై 30 రాత్రి నవీన్‌రెడ్డికి రాక్ క్లబ్ అండ్ స్కై లాంజ్‌లో అసాంఘిక కార్యకలాపాలు సాగుతున్నట్లు సమాచారం అందినట్లు, అతడు దానిపై దాడి చేసినట్లు కేసు నమోదు చేశారు. సదరు పబ్ యాజమాన్యం తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవడం కోసం పబ్‌లో మహిళలను కూడా సరఫరా చేస్తోందని, వారితోనే కస్టమర్లకు సర్విస్ చేయిస్తూ రెచ్చగొడుతోందని, ఆకర్షితులైన వినియోగదారులతో కలిసి గడిపేలా ప్రోత్సహిస్తోందనే ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. అదే నెల 31న మహిళల అక్రమ రవాణా నిరోధక చట్టం కిందన నమోదు చేసిన కేసులో ఇద్దరు యజమానులనూ నిందితులుగా చేర్చారు. కాగా రోజు పబ్‌లో వారు ఇరువురూ లేరని, అక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరగట్లేదని, అసలు పోలీసులు దాడే చేయలేదని ఇటీవల ఏసీబీ గుర్తించింది. ఒత్తిడితో మిన్నకుండిపోయిన ఏసీబీ... ఈ నేపథ్యంలో లక్ష్మణ్ రావు ఆగస్టులోనే ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అవసరమైన ఆధారాల కోసం అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. రహస్య కెమెరాలతో కూడిన వాచీలు తదితరాలను ఏర్పాటు చేసి పబ్‌కు సంబంధించిన ఓ వ్యక్తిని నరేందర్ వద్దకు పంపారు. లంచా నికి సంబంధించిన బేరసారాలు ఆడియో, వీడియో లు రికార్డు చేసే ప్రయత్నం చేశారు. అయితే ఓ దశలో సదరు వ్యక్తి రహస్య కెమెరాలతో వచ్చిన విషయం గుర్తించిన నరేందర్ అప్రమత్తమయ్యారు. అసలు విషయం గ్రహించి తన ‘బంధువైన’ రాజకీయ నాయకుడిని ఆశ్రయించారు. ఆయన జోక్యంతో ఏసీబీకి చెందిన కింది స్థాయి అధికారులు అడుగు వెన క్కు వేశారు. మరోసారి సదరు పబ్ జోలికి రావద్దని ఇన్స్పెక్టర్ నరేందర్‌కు, నరేందర్‌ను వదిలేయని పబ్ యాజమాన్యానికి చెప్పి రాజీ చేసి ఫైల్‌ను అటకెక్కించేశారు. దీంతో దాదాపు రెండు నెలలుగా కేసు మరుగున పడిపోయింది. ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకువస్తూ ‘సాక్షి’ సోమవారం ‘ఏ’ క్లాస్ రాజీ! శీర్షికన ప్రత్యేక కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన ఉన్నతాధి కారులు ‘బంజారాహిల్స్ ఫైల్8 దుమ్ము దులిపించారు. ఓసారి షుగర్ డౌన్... మరోసారి ఛాతి నొప్పి... ఏసీబీ డీఎస్పీ శ్రీకాంత్ నేతృత్వంలోని బృందం శుక్రవారం ఉదయం బంజారాహిల్స్ ఠాణాపై దాడి చేసింది. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలను అదుపులోకి తీసుకుని వివిధ కోణాల్లో ప్రశ్నించింది. పబ్ యాజమాన్యంపై నమోదు చేసిన కేసుకు సంబంధించిన పత్రాలు సేకరించింది. సుదీర్ఘంగా ఈ ముగ్గురు నిందితులను విచారించింది. దీంతో తొలుత తన షుగర్ లెవల్స్ పడిపోయాయంటూ నరేందర్ చెప్పడంతో వైద్య బృందాన్ని ఠాణాకు పిలిపించి చికిత్స చేయించా రు. సాయంత్రం తనకు ఛాతీ నొప్పంటూ పడిపోవడ ంతో స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించింది. హాస్పిటల్ వెళ్ళడానికి నరేందర్ నడుచుకుంటూ వచ్చి తన వాహనమే ఎక్కడం గమనార్హం. ఈ కేసుపై ప్రకటన విడుదల చేసిన అవినీతి నిరోధక శాఖ డైరెక్టర్ జనరల్.. ‘ఇన్స్పెక్టర్ నరేందర్ ఆదేశాల మేరకు నవీన్‌రెడ్డి గత శనివారం అర్ధరాత్రి సదరు పబ్ వద్దకు వెళ్లా రు. లక్ష్మణ్ రావును అనవసరంగా పబ్ బయటకు పిలిచారు. రోడ్డుపై ఆపి ఉంచిన పోలీసు వాహనం వద్దకు వచ్చిన ఆయన్ను బలవంతంగా అందులో ఎక్కించుకుని ఠాణాకు తరలించారు. అక్కడ కొన్ని గంటల పాటు నిర్భంధించారు. నరేందర్, నవీన్‌రెడ్డి, హరిలపై నమోదు చేసి కేసు దర్యాప్తులో ఉందని, చట్ట ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం’ అని పేర్కొన్నారు. -
హెయిర్–డై వేసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నారా!
ఒక వయసు దాటాక తెల్లబడ్డ వెంట్రుకలకు రంగువేయడం చూస్తుంటాం. ఇక యువతులూ, కొందరు మహిళలు కూడా స్ట్రెయిటెన్, బ్లీచింగ్ చేసుకోవడం వంటివి చేస్తున్నారు. ఈ ప్రక్రియల్లో జుట్టు (హెయిర్ స్ట్రాండ్స్) దెబ్బ తినకుండా సంరక్షించుకోడానికి చేయాల్సిన పనులివి... మాటిమాటికీ దువ్వడం, దువ్వుతున్నప్పుడు చిక్కులున్నచోట మృదువుగా కాకుండా బలంగా దువ్వడం, జుట్టు తడిగా ఉన్నప్పుడే దువ్వడం వల్ల వెంట్రుకలు దెబ్బతింటాయి. ఇలా దెబ్బతిన్నప్పుడు వెంట్రుక సాఫీగా లేకుండా కొన్నిచోట్ల ఉబ్బుగానూ, మరోచోట పలచగానూ కనిపించవచ్చు. ఇలా కనిపించే వెంట్రుకల్ని ‘బబుల్‌డ్ హెయిర్’ అంటారు. కాబట్టి వెంట్రుకలపై బలం ఉపయోగించకుండా, మృదువుగా దువ్వేలా జాగ్రత్త వహించాలి షాంపూ వాడే సమయంలో దాన్ని నేరుగా వాడకుండా... అరచేతిలో వేసుకుని, కొన్ని నీళ్లు కలిపి, దాని సాంద్రతను కాస్త తగ్గించాలి. దీంతో వెంట్రుకల మీద షాంపూలోని రసాయనాల తాకిడి, ప్రభావం తగ్గుతాయి తలస్నానం తర్వాత డ్రైయర్ వాడేటప్పుడు వెంట్రుకలకు వేడి గాలి మరీ నేరుగా తగలకుండా జాగ్రత్త వహించాలి రంగువేయడం, బ్లీచింగ్‌లతో జుట్టు రసాయనాలకు ఎక్స్పోజ్ అవుతుంది. దాంతో వెంట్రుక పైపొర అయిన ‘క్యూటికిల్’ దెబ్బతినే అవకాశముంది. క్యూటికిల్ దెబ్బతినగానే కాస్త లోపల ఉండే కార్టెక్స్ అనే భాగం బయటపడుతుంది. ఇది క్యూటికిల్లా నునుపుగా కాకుండా కాస్తంత గరుకుగా ఉంటుంది. ఫలితంగా జుట్టు నిర్జీవంగా, గజిబిజిగా కనిపిస్తుంటుంది. అందుకే రంగువేసే సమయంలో నాణ్యమైన హెయిర్–డై వాడుకోవాలి. ఒకసారి తమకు సరిపడుతుందా లేదా అన్నదీ చూసుకోవాలి. (చదవండి: తుంటి ఎముక కీలు సర్జరీ..ఆ పద్ధతి ఎంత వరకు బెస్ట్! లాభాలేమిటంటే?) -
శ్యామల కేసులో ట్విస్ట్: ముందు వేధింపులు, ఏడాది క్రితం అత్యాచారం.. ఏది నిజం!
అనంతపురం: కళ్యాణదుర్గం మండలం ఈస్ట్కోడిపల్లికి చెందిన శ్యామల కేసుకు సంబంధించి త్వరలోనే నిజాలు నిగ్గు తేలుస్తామని ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన మంగళవారం ఎస్పీ కార్యాలయ ఆవరణంలోని కాన్ఫరెన్స్ హాలులో మీడియాకు వెల్లడించారు. ఈ నెల 10న ఈస్ట్ కోడిపల్లిలో ఓ ఇంట్లో మహిళ, మరో వ్యక్తి కలసి ఉండగా స్థానికులు తలుపులకు తాళం వేసినట్లు కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫోన్ ద్వారా సమాచారమందింది. పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని తాళం తీసి ఇంట్లో ఉన్న శ్యామల, బోయ హరిలను బయటకు తీసుకువచ్చారు. స్థానికుల సమక్షంలో విచారణ చేపట్టారు. బోయ హరితో పాటు ఇంట్లో ఉన్న మహిళ చేష్టలు మంచివి కావని స్థానికులు తెలిపారు. వీరిలాగే కొనసాగితే ఎవరైనా ఆమెకు హాని తలపెట్టే అవకాశం ఉందని భావించి తాము ఆ ఇంటికి తాళం వేశామని ఎస్ఐ సుధాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రాథమికంగా అన్ని కోణాల్లో ఆరా తీసిన ఎస్ఐ అప్పటికే రాత్రి కావడంతో ఇద్దరినీ వారి కుటుంబ సభ్యులకు అప్పగించి, ఉదయాన్నే స్టేషన్‌కు రావాలని సూచించి వెళ్లిపోయారు. 11న ఉదయం శ్యామల పోలీసుస్టేషన్‌కు వెళ్లి ముందు రోజు జరిగిన దానికి భిన్నంగా ఫిర్యాదు చేసింది. బోయ హరి తనను మూడు నెలలుగా వేధిస్తున్నాడని, లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నాడని అందులో పేర్కొంది. విచారణ చేసి చర్యలు తీసుకోవాలని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. 14న ఎస్పీ కార్యాలయంలో జరిగిన ‘పోలీస్ స్పందన’కు ప్రజా సంఘాల నాయకులతో కలసి వచ్చిన శ్యామల తనను ఏడాది కిందట ఐదుగురు సామూహిక అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు చేసింది. మీడియా ముందు ఇదే విషయాన్ని వెల్లడించింది. సదరు మహిళకు న్యాయం చేయడం కోసం ముందుగా కేసు నమోదు చేశామని ఎస్పీ తెలిపారు. తదుపరి చట్టపరమైన చర్యలలో భాగంగా విచారణ చేపట్టామన్నారు. శ్యామలకు ఎలాంటి ఇబ్బందులున్నా చట్టపరిధిలో పోలీసులు చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కిందిస్థాయి పోలీసులు ఈ కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించి ఉంటే చర్యలు తీసుకోవాలని డీఎస్పీ శ్రీనివాసులును ఎస్పీ ఆదేశించారు. శ్యామల ఫిర్యాదుపై సమగ్ర విచారణ జరిపి చట్టపరిధిలో చర్యలు తీసుకోవాలని ఆదేశాలు చేశారు. సమావేశంలో అదనపు ఎస్పీ విజయభాస్కరరెడ్డి, కళ్యాణదుర్గం డీఎస్పీ బి.శ్రీనివాసులులు పాల్గొన్నారు. -
ఆమె నియంత హిట్లర్‌కు గూఢచారి.. తన నృత్యాలతో కవ్విస్తూ..
‘మాతా హారీ’.. ప్రపంచంలోనే ఎంతో పేరుగాంచిన గూఢచారి. తన గూఢచర్య విద్యలతో ప్రపంచాన్నే నివ్వెరపోయేలా చేసింది. హిట్లర్ దగ్గర గూఢచారిగా పనిచేసిన మాతా హారీ యూరప్‌ను ఒక కుదుపు కుదిపింది. హిట్లర్‌కు గూఢచారిగా పనిచేసిందన్న ఆరోపణలతో ఆమెను హత్య చేశారు. ఆమె గూఢచార విద్యలో ఆరితేరినదే కాకుండా అందగత్తె, డ్యాన్సర్. నెదర్లాండ్‌లో 1876లో జన్మించిన మాతాహారి అసలు పేరు గెర్ట్రూడ్ మార్గరెట్ జెలె. గూఢచర్యం ఆమె వృత్తి. మాతాహారీకి పలు దేశాల సైన్యాధికారులతో, మంత్రులతో సన్నిహిత సంబంధాలు ఉండేవి. తన అపరిమితమైన కోరికలను తీర్చుకునేందుకు ఆమె 1905లో ఫ్రాన్స్ రాజధాని పారిస్ చేరుకుంది. ఆమె తన అందచందాలతో కొద్దికాలంలోనే అధికారులకు సన్నిహితురాలిగా మారిపోయింది. ఆమె నృత్యం వారిని కట్టిపడేసేది. తన నృత్య కార్యక్రమాల కోసం ఆమె యూరప్ అంతా పర్యటించేది. మొదటి ప్రపంచయుద్ధం ప్రారంభమయ్యేవరకూ ఆమె ఒక డాన్సర్, స్ట్రిప్పర్గానే ఉంది. ఆమె నృత్యాన్ని చూసేందుకు దేశాధినేతలు, సైన్యాధ్యక్షులు, రాజకీయ అతిరథమహారథులు వచ్చేవారు. వారితో తనకు ఏర్పడిన సాన్నిహిత్యాన్నే ఆసరాగా చేసుకున్న ఆమె ఇతరుల రహస్యాలను మరొకరికి చేరవేసే పని మొదలుపెట్టింది. హిట్లర్ కోసం, ఫ్రాన్స్ కోసం ఆమె గూఢచర్యం చేసేదని చెబుతుంటారు. మాతాహారీ హత్య అనంతరం 70వ దశకంలో జర్మనీకి సంబంధించిన అనేక రహస్య పత్రాలు బయటపడ్డాయి. మాతాహారీ జర్మనీకి గూఢచర్యం చేసినట్లు వాటి ద్వారా వెల్లడయ్యింది. గూఢచర్యం చేస్తున్నదన్న ఆరోపపణల మేరకు ఆమెను 1917లో అరెస్టు చేశారు. అయితే కోర్టులో ఆమె గూఢచారి అని నిరూపణ కాలేదు. ఆమె డాన్సర్ మాత్రమేనని కోర్టు తీర్పుచెప్పింది. అయితే ఆ తరువాత ఆమెపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో ఆమె కళ్లకు గంతలు కట్టి తుపాకీతో కాల్చి చంపారు. ఇది కూడా చదవండి: బర్త్‌డే పార్టీకి రూ.3 లక్షల బిల్లు.. జుట్టుజుట్టూ పట్టుకున్న యువతులు! -
ట్రైలర్ చూస్తే కష్టం అర్థమవుతోంది
‘‘నా దగ్గర ఓ వెబ్ సిరీస్‌కు సుబ్రమణ్యం అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ‘నెల్లూరి నెరజాణ’ సినిమాను తెరకెక్కించటానికి చాలా కష్టపడ్డాడు. ఈ మూవీ ట్రైలర్ చూస్తుంటే టీమ్ అందరూ ఎంత కష్టపడ్డారో అర్థమవుతోంది. ఈ సినిమా మంచి విజయం సాధించి, వారందరికీ గొప్ప జీవితాన్ని ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అని డైరెక్టర్ నాగ్ అశ్విన్ అన్నారు. ఎంఎస్ చంద్ర, హరి హీరోలుగా, అక్షాఖాన్ హీరోయిన్ గా నటించిన చిత్రం ‘నెల్లూరి నెరజాణ’. చిగురుపాటి సుబ్రమణ్యం స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్, టీజర్‌ని నాగ్ అశ్విన్ విడుదల చేశారు. ‘‘నెల్లూరి నెరజాణ’ సినిమా అంతా నెల్లూరు యాసలో సాగుతుంది’’ అన్నారు చిగురుపాటి సుబ్రమణ్యం. ‘‘ఇంత మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన సుబ్రమణ్యంగారికి కృతజ్ఞతలు’’ అన్నారు ఎంఎస్ చంద్ర, హరి, అక్షా ఖాన్. -
ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో జబర్దస్త్ కమెడియన్
బుల్లితెరలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గురించి అందరికీ తెలిసిందే. ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్స్ వెండితెరపై కూడా పలు అవకాశాలు దక్కించుకున్నారు. తాజాగా జమర్దస్త్ కమెడియన్ హరిపై ఎర్రచందనం స్మగ్లింగ్ కేసు నమోదు అయింది. అతని ముఠాకు చెందిన కిషోర్ అనే వ్యక్తిని చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 60 లక్షలు విలువైన ఎర్రచందనం దుంగలను వారు స్వాధీనం చేసుకున్నారు. (ఇదీ చదవండి: గోపీచంద్ కొత్త సినిమా ఇదే.. 13 ఏళ్ల తర్వాత పూరిని గుర్తుకు తెచ్చాడు) కానీ కమెడియన్ హరి పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. అతని కోసం గాలిస్తున్నట్లు వారు చెప్పారు. ఇప్పటికే అతనిపై ఎర్రచందనం అక్రమ రవాణా విషయంలో పలు కేసులు ఉన్నాయని పోలీసులు తెలుపుతున్నారు. చిత్తూరు జిల్లా పోలీసులు గతంలోనే హరిపై స్మగ్లింగ్ కేసులతో పాటు, పలు కేసులు నమోదు చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాడనే ఆరోపణలు ఉన్నాయి. జబర్దస్త్ షో ద్వారా లేడీ గెటప్‌లో చాలా రోజుల నుంచి హరి మెప్పిస్తున్న విషయం తెలిసిందే (ఇదీ చదవండి: తెలుగు ఇండస్ట్రీపై హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు) -
ప్రభాస్ తో మల్టీస్టారర్ సినిమా పై క్లారిటీ ఇచ్చిన గోపీచంద్
-
దర్శకుడు హరికి సూర్యకు మధ్య మనస్పర్థలా? అంతా ఉత్తిదే! కాంబో రిపీట్
తమిళ సినిమా: నటుడు సూర్య, దర్శకుడు హరి సూపర్‌హిట్ కాంబినేషన్. ఇంతకు ముందు ఆరు, వేల్, సింగం సిరీస్ మొదలు హిట్ చిత్రాలు వచ్చాయి. సింగం-2 చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో అరువా చిత్రం రూపొందనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ తరువాత సూర్యకు దర్శకుడు హరికి మధ్య మనస్పర్థలు తలెత్తాయని, దీంతో అరువా చిత్రం ఆగిపోయిందని ప్రచారం జరిగింది. అన్నట్టుగానే వీరి కాంబినేషన్లో ఇప్పటి వరకు మరో చిత్రం రాలేదు. నటుడు సూర్య ఇతర చిత్రాలతో బిజీ అయిపోయారు. ప్రస్తుతం శివ దర్శకత్వంలో కంగువా అనే భారీ చిత్రంలో నటిస్తున్నారు. దీని తరువాత వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ చిత్రం చేయనున్నారు. ఇక దర్శకుడు హరి చివరిగా అరుణ్ విజయ్ హీరోగా యానై చిత్రాన్ని చేశారు. కాగా ఇటీవల తన సతీమణితో కలిసి ఓ రికార్డింగ్, ప్రివ్యూ స్టూడియోను ప్రారంభించారు. ఆ వేడుకకు నటుడు సూర్య ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీంతో వీరి మధ్య మనస్పర్థలు అనేవి వదంతులని తేలింది. కాగా దర్శకుడు హరి ఇప్పుడు వరుసగా మూడు కమర్షియల్ కథా చిత్రాలను తెరకెక్కించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. చదవండి: వైరముత్తు నవలలో విక్రమ్ నటిస్తారా? అందులో ముందుగా నటుడు విశాల్ హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలుస్తోంది. వీరి కాంబినేషన్లో ఇంతకు ముందు పూజా, తామ్రరభరణి వంటి హిట్ చిత్రాలు రూపొందాయి. కాగా తదుపరి నటుడు సూర్య కథానాయకుడిగా ఒక భారీ చిత్రాన్ని తెరకెక్కించడానికి కథను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. అదే విధంగా నటుడు కార్తీ తాను హరి చిత్రం చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వీటికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
సినీ ఇండస్ట్రీలో విషాదం.. నటుడు హరి కన్నుమూత
నటుడు హరి వైరవన్ (38) శుక్రవారం అర్ధరాత్రి మదురైలో కన్నుమూశారు. సుశీంద్రన్ దర్శకత్వం వహించిన వెన్నెలా కబడ్డీ కుళు చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అందులో విష్ణు విశాల్ మిత్రుల్లో ఒకరిగా నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత వెన్నెలా కబడ్డీ కుళు–2, కుళ్లు నరి కూట్టం తదితరులు చిత్రాల్లో నటించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో అనారోగ్యానికి గురి కావడంతో వైద్య పరీక్షలో కిడ్నీ పాడైపోయిందని తెలియడంతో మదురైలో వైద్య చికిత్స పొందుతూ వచ్చారు. అయితే వైద్యం ఫలించక తుదిశ్వాస విడిచారు. ఈయన మృతికి నటుడు విష్ణు విశాల్, బ్లాక్ పాండి, అంబానీ శంకర్, దర్శకుడు బాలాజీ తదితర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. హరి వైరవన్‌కు భార్య కవిత, కూతురు రెండేళ్ల రోషిణీశ్రీ ఉన్నారు. ఆయన భౌతికకాయానికి అంత్యక్రియలు స్వగ్రామంలో జరిగాయి. కాగా నటుడు హరి వైరవన్ కుటుంబం ఇప్పటి వరకూ ఆయన సంపాదనతోనే గడుస్తూ వచ్చింది. హరి వైరవన్ మరణంతో ఆ కుటుంబం జీవనాధారం ప్రశ్నార్థకంగా మారింది. దీంతో చిత్ర పరిశ్రమ ఆర్థికంగా ఆదుకోవాలని హరి వైరవన్ భార్య మీడియా ద్వారా వేడుకున్నారు. చదవండి: (లోకనాయకుడు, దర్శకధీరుడు కలిస్తే..?) -
వైరల్: ట్రయాంగిల్ లవ్‌స్టోరీపై క్లారిటీ ఇచ్చిన అషూ..
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డి ఆ తర్వాత బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఇక అదే షోతో పొల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో బిగ్‌బాస్ అనంతరం ప్రేమలో పడ్డట్లు కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. మొదట పునర్నవితో లవ్ ఎఫైర్ నడిపిన రాహుల్ షో అనంతరం అషూకు దగ్గరయ్యాడు. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకొని పార్టీలకు వెళ్లడం, ఆ ఫోటోలను షేర్ చేయడంతో వీరి మధ్యా ఏదో ఉందనే గాసిప్ మొదలైంది. దీనికి తోడు అషూను ఎత్తుకొని ఫోటోకు ఫోజివ్వడం, ఇద్దరూ సోషల్ మీడియా వేదికగా పోస్టులకు ప్రేమ సందేశాలు పంపుకోవడం, ఆ వెంటనే రాహుల్ లవ్ అనౌన్స్మెంట్ అంటూ అషూతో ఫోటో షేర్ చేయడం వంటివన్నీ రూమర్స్‌కు మరింత బలం చేకూర్చాయి. దీంతో వీరిదరూ ప్రేమ మైకంలో మునిగిపోయారని కొందరు నెటిజన్లు పబ్లిక్‌గానే కామెంట్స్ చేశారు. అయితే ఇటీవలె ఓ షోలో పాల్గొన్న అషూ ఎక్స్‌ప్రెస్ హరి అనే కమెడియన్‌తో క్లోజ్‌గా ఉండటంతో ఇది ట్రయాంగిల్ లవ్ అవుతుందేమోన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. అటు హరి సైతం అషూ కోసం బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నాడు. దీంతో రాహుల్-అషూ మధ్యలో హరి అంటూ మీమ్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇన్స్టాగ్రామ్ లైవ్‌లో అభిమానులతో ముచ్చటించిన అషూకు ఇదే ప్రశ్న ఎదురైంది. హరి-రాహుల్‌లలో ఎవరో ఒకరిని ఎన్నుకోవాలంటూ ఫ్యాన్స్ కోరారు. దీంతో 'కుడి కన్ను కావాలా, ఎడమ కన్ను కావాలా అని అడిగితే ఏం చెప్పాలంటూ' అషూ ఫన్నీగా బదులిచ్చింది . అంతేకాకుండా ఈ ఇద్దరిలో ఒకరిని తాను ఇష్టపడుతుంటే, మరొకరు తనని ఇష్టపడుతున్నారంటూ చిన్న హింట్ కూడా ఇచ్చేసింది. దీంతో మొత్తానికి ఈ లవ్కహానీ ట్రయాంగిల్ స్టోరీ అని అర్థమయ్యిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాకుండా ఎక్స్‌ప్రెస్ హరి తన పేరుపై వేసుకున్న టాటూ గురించి స్పందిస్తూ..అది ఒకషో కోసమని, షోలో చాలా జరుగుతుంటాయని చెప్పింది. దీంతో ఆ టాటూ ఫేక్ అని తేలిపోయింది. -
వైరల్ : అషూ పేరు పచ్చబొట్టు.. చెంప చెళ్లుమనిపించిన బ్యూటి
జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అషూరెడ్డికి సోషల్ మీడియాలో ఫాలోవర్లు ఎక్కువే. ఇక డబ్ స్మాష్‌తో ఫేమస్ అయిన ఆమె బిగ్‌బాస్ రియాలిటీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైంది. నిత్యం ఫొటోషూట్లతో, ఫన్నీ వీడియోలతో ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే అషూ ఇటీవలి కాలంలో నిత్యం వార్తల్లో నిలుస్తుంది. బిగ్‌బాస్ సీజన్-3లో తనతో పాటు పాల్గొన్న రాహుల్ సిప్లిగంజ్‌తో అషూ లవ్ ట్రాక్ నడిపింస్తుందంటూ కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు ఈ మధ్యే రాహుల్.. సర్ప్రైజ్ అనౌన్స్మెంట్ అంటూ అషూను హత్తుకున్న ఫొటోను షేర్ చేసి దానికి లవ్ సింబల్ యాడ్ చేసి రూమర్స్‌కి మరింత బలం చేకూర్చాడు. అయితే తాజాగా కమెడియన్ ఎక్స్‌ప్రెస్ హరి-అషూ మధ్య ఏదో ఉందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అషూ కోసం హరి కూడా బోలెడు ప్రయత్నాలు చేస్తున్నట్లు వరుస స్కిట్లతో అలరిస్తున్నారు. ఇప్పుడు మరోసారి అషూపై తన ప్రేమను వ్యక్తం చేశాడు. తన గుండెలపై అషూ పేరును పచ్చబొట్టు వేసుకున్నానని, ఇది శాశ్వతంగా ఉంటుందని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. 'నిన్ను ఎంతలా ప్రేమిస్తున్నానంటే..ఎప్పటికీ నువ్వు నా గుండెలపై నిలిచిపోయేంత' అంటూ హరి తన ప్రేమను ఎక్స్‌ప్రెస్ చేశాడు. దీంతో ఇది నిజమైన పచ్చబొట్టా? లేదా స్కిట్ కోసం చేశావా అని అడగ్గా..నిజంగానే పచ్చబొట్టు వేయించుకున్నానని హరి చెప్పాడు. దీంతో ఎందుకిలా చేశావ్ అంటూ అషూ..హరి చెంప పగలకొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. రాహుల్-అషూ మధ్యలోకి హరి ఎంటర్ అయ్యాడు అని కొందరు కామెంట్లు చేస్తుంటే.. టీఆర్పీ రేటింగుల కోసమే ఈ డ్రామాలంటూ మరొకొందరు కామెంట్ చేస్తున్నారు. -
సూర్య కత్తి
కొన్ని కాంబినేషన్స్‌లో ఎన్ని సినిమాలు వచ్చినా మరిన్ని కావాలనిపిస్తాయి. తమిళంలో అలాంటి కాంబినేషనే హీరో సూర్య–దర్శకుడు హరిలది. ఈ ఇద్దరూ కలసి గతంలో 5 సినిమాలు (వేల్, ఆరు, సింగం 1, 2 , 3) చేశారు. తాజాగా ఆరో సినిమా కోసం కలిశారు. ఈ సినిమాకు ‘అరువా’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. అరువా అంటే కత్తి అని అర్థం. ఏప్రిల్‌లో సెట్స్‌కు మీదకు వెళ్లనున్న ఈ సినిమాను ఒకే షెడ్యూల్లో పూర్తి చేయనున్నారట. ఈ ఏడాది దీపావళికి ఈ సినిమాను రిలీజ్ చే స్తున్నట్టు గ్రీన్ స్టూడియోస్ నిర్మాణ సంస్థ తెలిపింది. డి. ఇమ్మాన్ సంగీత దర్శకుడు. -
నీవెవరు?
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఓమనిషి నీవెవరు’. కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శ కత్వం వహించారు. స్వర్ణ కుమారి దొండపాటి నిర్మించిన ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. సుమన్ మాట్లాడుతూ– ‘‘ఈ సినిమాలో పాత్ర ఉందని స్వర్ణకుమారిగారు చెప్పగానే అదృష్టంగా భావించి చేశాను’’ అన్నారు. ‘‘మా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఎంతో పరిశోధన చేసి, ఈ సినిమా తీశా’’ అన్నారు కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు. ఈ చిత్రానికి సంగీతం: ప్రభాకర్, కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవానీ. -
సూపర్ హిట్ కాంబినేషన్ రిపీట్?
సూపర్‌హిట్ కాంబినేషన్ రిపీట్ కానుందా? ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే బదులే వస్తోంది. నటుడు సూర్య, దర్శకుడు హరి కాంబినేషన్లో ఇంతకుముందు ఆరు, వేల్, సింగం 1,2,3 సీక్వెల్స్ వచ్చాయి. వాటిలో సింగం 3 చిత్రం మినహా అన్నీ హిట్ అయ్యాయి. కాగా వీర్దిరూ కలిసి మరో చిత్రం చేయబోతున్నారని సమాచారం. సూర్య నటించిన ఎన్జీకే చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు. కాగా ప్రస్తుతం ఆయన కేవీ. ఆనంద్ దర్శకత్వంలో కాప్పాన్ చిత్రాన్ని పూర్తి చేశారు. నటి సాయేషా సైగల్ నాయకిగా నటించిన ఈ సినిమాలో మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్, ఆర్య వంటి ప్రముఖ నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. చిత్రాన్ని సెప్టెంబర్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించారు. సూర్య ప్రస్తుతం సుధ కొంగర దర్శకత్వంలో సూరరై పోట్రు చిత్రంలో నటిస్తున్నారు. ఇది ఎయిర్ డెక్కన్ వ్యవస్థాపకుడు జీఆర్.గోపీనాథ్ బయోపిక్‌తో తెరకెక్కుతున్న చిత్రం అని సమాచారం. ఈ చిత్రం షూటింగ్లో ఉండగానే నటుడు సూర్య దర్శకుడు శివతో చిత్రం చేయడానికి పచ్చజెండా ఊపారు. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించనున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో సూర్య మరో చిత్రానికి సై అన్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రానికే హరి దర్శకత్వం వహించనున్నట్లు తెలిసింది. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని నటుడు సూర్యనే తన 2డీ ఎంటర్టెయిన్మెంట్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరి కొద్ది కాలం ఆగాల్సిందే. ఇటీవల తన భార్య జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించే చిన్న బడ్జెట్ చిత్రాలనే నిర్మిస్తున్న సూర్య ఈ సారి తనే హీరోగా భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించడానికి రెడీ అవుతున్నారన్నమాట. ఎందుకంటే హరి దర్శకుడంటేనే కత్తులు, కార్ల బ్లాస్టింగ్, భారీ యాక్షన్ సన్నివేశాలు కచ్చితంగా చోటుచేసుకుంటాయి. అలా పక్కా మాస్ చిత్రాల దర్శకుడిగా ముద్ర వేసుకున్న హరి ఇటీవల నటుడు విక్రమ్ హీరోగా తెరకెక్కించిన సామి స్క్వేర్ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించలేదు.దీంతో ఈ సారి కథ విషయంలో దర్శకుడు హారి, నటుడు సూర్య తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. -
వైవిధ్యంగా ఓ మనిషీ...
రిజ్వాన్ కల్షాన్, సుమన్, చలపతిరావు, హరి, తరుణ్ కుమార్ ప్రధానపాత్రల్లో కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఓ మనిషీ నీవెవరు’. గాడ్ మినిస్ట్రీస్ సమర్పణలో స్వర్ణ క్రియేషన్స్ పతాకంపై స్వర్ణకుమారి దొండపాటి నిర్మిస్తున్నారు. ప్రభాకర్ సంగీతం అందించిన ఈ చిత్రం పాటలను నటులు కృష్ణ విడుదల చేశారు. అనంతరం మొదటి వీడియో సాంగ్‌ను నటులు తనికెళ్ల భరణి, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ రిలీజ్ చేశారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ– ‘‘జీసస్ అంటే ప్రేమ, శాంతి. ఇలాంటి సినిమా వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘ఇలాంటి చిత్రాలు చేయాలంటే చాలా ధైర్యం కావాలి’’ అన్నారు అనూప్ రూబెన్స్. ‘‘ఈ సినిమాలో పాత్ర గురించి చెప్పగానే ఆలోచించకుండా చేస్తానని చెప్పాను. చాలా వైవిధ్యంగా, కష్టంగా ఉండే పాత్ర కూడా’’ అన్నారు సుమన్. ‘‘గోపాలకృష్ణగారికి నేను వేరే కథ చెప్పాను. కానీ ఆయన ఈ కథ చెప్పి సినిమా తీయించారు. శివప్రసాద్‌గారి సహకారం లేకపోతే ఈ సినిమా పూర్తి చేసేవాణ్ణి కాను’’ అని కృష్ణమూర్తి రాజ్‌కుమార్ నాయుడు అన్నారు. సీనియర్ దర్శకులు సాగర్, నటి కవిత, రిజ్వాన్ కులషాన్, స్క్రీన్ ప్లే రచయిత గోపాలకృష్ణ దొండపాటి, కెమెరామేన్ సూర్యభగవాన్ మోటూరి, ఎమ్మెల్సీ రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సూర్య భగవాన్ మోటూరి, సహ నిర్మాత: జంపన దుర్గా భవాని. -
డ్రీమ్ టెక్
అవును కలలకు కూడా టెక్నాలజీ అవసరం.. అదే నెరవేర్చుకోవడానికి!బీటెక్ చేస్తున్న పిల్లలు టెక్ చేయడం మాని వారివారి కలల సాకారానికి చేసే ప్రయత్నం..ఆ ప్రయత్నంలో ఎదుర్కొనే అడ్డంకులు.. పడే అవమానాలు.. పేరెంట్స్‌కి వీళ్ల పట్ల ఉన్న ప్రేమ, ఆశ.. అన్నీ అందరికీ జీవిత పాఠాలే! తల్లిదండ్రుల ఒత్తిళ్ల నుంచి కంటున్న కలల సాకారం వరకు సాగిన ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ ప్రయాణం.. బీటెక్! జీ5 తెలుగు వెబ్ సిరీస్. దర్శకుడు తరుణ్ భాస్కర్ తొలి స్క్రిప్ట్ ఇది. తొమ్మిది ఎపిసోడ్ల ఆ స్టోరీ... విక్రమ్ .. ఒక సినిమా ఇంజనీరింగ్ చదివించి మంచి సాఫ్ట్వేర్ ఎంప్లాయ్‌ని చేయాలన్న పేరెంట్స్ ఆశయానికి విరుద్ధమైన కల విక్రమ్‌ది. ఒక్కడే కొడుకు. ఫిల్మ్ మేకింగ్ అంటే ఆసక్తి. ప్రతి పరీక్షకి ఆన్సర్‌షీట్‌లో కథ రాసి వస్తుంటాడు. ఫైనల్ ఎగ్జామ్స్‌లో తన బయోగ్రఫీనే రాసేస్తాడు. స్నేహితుడి సలహాతో షార్ట్ సినిమా తీయాలని నిర్ధారించుకుంటాడు. ఆ షార్ట్ సినిమా కనెక్షన్‌తో బిగ్ స్క్రీన్‌ని డైరెక్ట్ చేయాలని అబ్బాయి డ్రీమ్. సినిమా పరిశ్రమలోని సుప్రసిద్ధ వెటరన్ డైరెక్టర్ జడ్జిగా వ్యవహరించిన ఓ షార్ట్మూవీ కాంపిటీషన్‌కు తన మూవీని పంపిస్తాడు. టాప్ ఫైవ్‌లో ఉన్నా కూడా తన సినిమాకు ఇవ్వకుండా అసలు షార్ట్‌లిస్ట్‌లో లేని ఇంకో మూవీకి ప్రైజ్ ఎనౌన్స్ చేస్తారు. దీని మీద గొడవ పడ్తారు విక్రమ్ అండ్ ఫ్రెండ్స్. ఆ డైరెక్టర్‌తో కూడా. ఆ పెద్దాయన అండ్ టీమ్ విక్రమ్‌ను దృష్టిలో పెట్టుకుంటారు. ఆ సీన్ అక్కడికి ఎండ్ అయి.. విక్రమ్ తీసిన ఫీచర్ ఫిల్మ్ దగ్గర మళ్లీ కనెక్ట్ అవుతుంది. తన జీవితాన్నే కథగా మలిచిన స్క్రిప్ట్‌తో లోన్ తీసుకుని మరీ సినిమా తీస్తాడు విక్రమ్. ప్రివ్యూలో డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ నచ్చుతుంది. కాని కొనడానికి ముందుకురారు. ‘‘అందరూ బాగుంది అంటున్నారు. మరి ఎవరూ ఎందుకు కొనట్లేదు సర్?’’ అమాయకంగా అడుగుతాడు విక్రమ్. ‘‘కథ బాగుందయ్యా.. కాని కమర్షియల్ వాల్యూస్ లేవు’’అంటూ ప్రాక్టికల్ ట్రూత్ చెప్తాడు ఒక డిస్ట్రిబ్యూటర్. అప్పుడు కనపడ్తాడు ప్రివ్యూ థియేటర్ ప్రెమిసెస్‌లో సుప్రసిద్ధ వెటరన్ డైరెక్టర్. ‘‘నాలాంటి వాళ్లు నీ సినిమా గురించి.. ప్చ్ అంటూ ఒక్క ఎక్స్ప్రెషన్ ఇస్తే చాలు.. నీ కథ ఎలా ఎండ్ అవుతుందో తెలిసింది కదా! పెద్దవాళ్లతో పెట్టుకోవద్దు’’ అని హెచ్చరికతో కూడిన వెటకారమాడ్తాడు ఆ పెద్ద డైరెక్టర్. విక్రమ్‌కి అసలు సినిమా అప్పుడు కనపడ్తుంది. కాని వెనక్కి మళ్లడానికి మనసొప్పదు. పైగా అప్పటిదాకా తన కలకు అడ్డం పడ్డ తండ్రి కూడా కోరుకున్న గమ్యం చేరుకొమ్మని వెన్ను తడ్తాడు. ముందుకే వెళ్లాలనుకుంటాడు దీన్నో పాఠంగా తీసుకొని. అఖ్తర్ అండ్ బైక్ హైదరాబాద్ పాతబస్తీ కుర్రాడు అఖ్తర్. వాళ్ల నాన్న.. కొడుకులిద్దరినీ బాగా చదివించాలని తాపత్రయపడ్తుంటాడు. ఆయననుకున్నట్టుగానే పెద్దకొడుకు చదువులో ఫస్ట్. ప్రవర్తనలో జెమ్. అఖ్తర్ మీదేమో ఆ తండ్రికి ఆకతాయి అనే ఇంప్రెషన్. క్లాస్రూమ్ కన్నా అఖ్తర్కి బైక్ గ్యారేజే మంచి కిక్‌నిస్తుంది. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ చదువుతుంటాడు. అతని తండ్రికేమో కొడుకు ఏ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగో చదివితే బాగుండు అనే ఆశ. పెద్దవాడిలా డిసిప్లిన్‌తో ఉండడని.. ఆవారా తిరుగుళ్లు తిరుగుతుంటాడని.. అఖ్తర్‌ను, అతని ఫ్రెండ్స్‌నూ అస్తమానం తిడ్తుంటాడు. అన్నతో పోల్చి అడుగడుగునా అవమానపరుస్తుంటాడు. అఖ్తర్ బైక్ కొనివ్వమని అడిగితే.. ఓల్డ్ మోడల్ యమహా ఆర్ఎక్స్ 100 సెకండ్ హ్యాండ్ బండీ తెచ్చిస్తాడు. పెద్ద కొడుక్కేమో మార్కెట్లో ఉన్న న్యూ మోడల్ బైక్ కొనిస్తాడు. బైక్ రేస్‌లను శ్వాసగా భావించే అఖ్తర్.. నాన్న ఇచ్చిన బైక్‌కు తన గ్యారేజ్‌లో కొత్త రూపమిస్తాడు. రఫీ అనే డియరెస్ట్ ఫ్రెండ్‌తో కలిసి రేసుల్లో పాల్గొంటుంటాడు. ఆ గెలుపుతో తన పనితీరు మీద నమ్మకాన్ని పెంచుకుంటుంటాడు అఖ్తర్. ఇంకా మంచి రేస్ బైక్‌ను తయారు చేయాలనుకుంటుంటాడు. తమ్ముడి తపన అన్నకు అర్థమవుతుంది. సపోర్ట్ చేస్తాడు. అన్న భుజం తట్టేసరికి ఆత్మవిశ్వాసం రెట్టింపవుతుంది. కొత్త రేస్ బైక్ రీమోడలింగ్‌లో సీరియస్‌గా పడిపోతాడు అఖ్తర్. తండ్రి చీవాట్లు, ఇన్సల్ట్స్ షరా మామూలే. అయినా బ్రేక్ వేయడు. స్పీడ్ తగ్గించడు. హరి అతని పరిశ్రమ హరి .. బాగా బతికి చతికిలబడ్డ కుటుంబంలోని కుర్రాడు. చదువు కన్నా వ్యాపారం మీద మక్కువ. దాని వెనక ఒక కారణం ఉంది. బతికిన కుటుంబం అని చెప్పుకున్నాం కదా. హరి బాల్యంలో వాళ్ల నాన్న పెద్ద వ్యాపారి. ఉండడానికి మంచి బంగ్లా... కారు.. ఫారిన్ బ్రీడ్ డాగ్.. అలా అన్నమాట. నష్టాలపాలై సర్కారు వేలంలో ఆ విలాసం ఇంకొకరి పాలవుతుంది. çకుటుంబం సొంతూరులో స్థిరపడిపోతుంది. పసి హరి హృదయానికి ఇదొక గాయం. అదే పట్టుదలనూ పెంచుతుంది. పెద్దయ్యాక ఎలాగైనా సరే.. ఆ ఇంటిని మళ్లీ సొంతం చేసుకొని తండ్రికి కానుకగా ఇవ్వాలనుకుంటాడు. స్ఫూర్తి కోసం సమయం దొరికినప్పుడల్లా ఆ ఇంటిముందున్న టీ కొట్టులో కూర్చుంటుంటాడు. అందుకే బీటెక్ చదువును మధ్యలోనే ఆపేసి బిజినెస్‌లో పడిపోతాడు. డక్కామొక్కీలు సా«ధారణమే. అతను సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్న కంపెనీ మోసం చేసి బిచాణా ఎత్తేస్తుంది. హరికి నిస్సత్తువ ఆవహిస్తుంది. ఫ్రెండ్ సహాయంతో కొత్త వ్యాపారానికి సన్నాహాలు మొదలుపెడ్తాడు. ఈలోపే మరదలు రమ్యకు పెళ్లి చూపులు. ఆమెకు ఆ పెళ్లి ఇష్టం ఉండదు. ఆ మాట తండ్రికి చెప్పే ధైర్యమూ చేయదు. సో.. బావ హరికి చెప్తుంది. అంతేకాదు.. నువ్వంటే ఇష్టం..నిన్ను పెళ్లిచేసుకుంటాను అనీ తన మనసూ బయటపెడ్తుంది. ఓ రోజూ ఇంట్లో వాళ్లకు, ఇటు హరికి చెప్పకుండా హైదరాబాద్ వచ్చేస్తుంది. చిర్రుబుర్రులాడుతూనే మరదలితో కలిసి అద్దెంట్లోకి దిగుతాడు. వ్యాపారంలో సక్సెస్కోసం పాటుపడుతుంటాడు. ఏ కంపెనీలో షేర్లు పెడితే ఎంత లాభమో.. సలహా ఇస్తుంది రమ్య. అబ్బురపడ్తాడు ఆ అవగాహనకు హరి. తన చదువు అదే అని ఆ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది రమ్య. అప్పటినుంచి రమ్యను తన బిజినెస్ ప్లానింగ్‌లో పార్ట్నర్ను చేస్తాడు. అనుకున్నవన్నీ నిజమైతే.. సిరీస్‌లో ఎక్సైట్మెంట్ ఏముంటుంది? కదా.. కాబట్టి రమ్య ఇన్వెస్ట్ చేయమని చెప్పిన కంపెనీ బోల్తా కొడుతుంది. అప్పుడు ఏమవుతుంది? విక్రమ్, హరి, అఖ్తర్‌ల కనెక్షన్ కనిపిస్తుంది. దీనికి సూత్రధారుడు రఫీ. అఖ్తర్ జాన్‌జిగ్రీ. అతనూ బీటెక్ స్టూడెంటే. అఖ్తర్‌కు చేదోడువాదోడుగా గ్యారేజీలో ఉంటుంటాడు. కలిసి రేస్‌లకు, గొడవలకు వెళ్తుంటారు. కలిసే తల్లిదండ్రుల తిట్లు తింటుంటారు. దురదృష్టవశాత్తు ఆ స్నేహం చివరిదాకా సాగదు. క్యాన్సర్‌తో రఫీ చనిపోతాడు. రఫీ చనిపోయే వరకు అతనికి క్యాన్సర్ అని అఖ్తర్‌కు తెలీదు. గ్యారేజితోపాటు ఓ కెమెరా ఎక్విప్మెంట్ షాప్‌లో కూడా పనిచేస్తుంటాడు రఫీ. విక్రమ్ షార్ట్ ఫిల్మ్స్‌కి తక్కువ ధరకు కెమెరా ఇప్పించి సహాయం చేస్తాడు రఫీ. అలా వాళ్లిద్దరికి పరిచయం అవుతుంది. ఒకసారి అఖ్తర్, రఫీ బైక్‌రేస్ పెట్టుకున్నప్పుడు కళ్లు తిరిగి రోడ్డు మీద పడిపోతాడు రఫీ. అతనిని ఆసుపత్రిలో చేర్చడంలో అఖ్తర్కి సహాయపడ్తాడు హరి. అలా హరికి, రఫీ, అఖ్తర్‌తో పరిచయం ఏర్పడుతుంది. ఈ పరిచయాలను తన ఆప్తమిత్రుడు అఖ్తర్కి సహాయపడేలా చేయాలనుకుంటాడు రఫీ. అదే అతని చివరి కోరిక. చేస్తాడు కూడా. చేసి ఈ ముగ్గరు విజయాలకు కారణమవుతాడు. విక్రమ్ దగ్గర మంచి బైక్ ఉంటుంది. కెమెరా ఎక్విప్మెంట్ రెంట్‌కి తీసుకున్నందుకు బదులుగా అతని బైక్‌ను అఖ్తర్‌కు ఇవ్వమంటాడు కొన్ని రోజుల కోసం. సరే అని అడ్రస్ కనుక్కొని అఖ్తర్‌కు ఇచ్చేస్తాడు. ఆ బైక్‌ను రీ మోడలింగ్ చేయడానికి కావల్సిన డబ్బు కోసం తను కనిపెట్టిన కొత్త రేస్ ఇంజిన్ ఫార్ములాను హరికి పేటెంట్గా ఇచ్చి డబ్బు తీసుకుంటాడు అఖ్తర్. తర్వాత ఆ ఫార్ములా హిట్ అవుతుంది. ఆ ఫార్ములానే షేర్ మార్కెట్లో దివాలా పరిస్థితుల్లో ఉన్న ఆటోమొబైల్ కంపెనీకి ఇచ్చి.. ఆ కంపెనీని ఆదుకుంటాడు హరి. దాంతో ఆ కంపెనీ నిలదొక్కుకుంటుంది. హరి షేర్లతోపాటు ఇంకెందరి షేర్లో అమాంతం పెరిగిపోతాయి. ఇంకోవైపు రేస్‌లో తను గెల్చుకున్న మనీని విక్రమ్‌కు తెచ్చిస్తాడు అఖ్తర్.. ‘‘ఇది న్యాయంగా నీకే చెందాల’’ంటూ.. వద్దువద్దని విక్రమ్ వారిస్తున్నా వినకుండా. మరోవైపు హరి కొనుక్కోవాలనుకున్న ఇల్లు ఇంకొకరి హయాంలోనూ వేలానికి వెళ్లిపోతుంది. అది పాడుకోవాలనుకుంటే కోట్లుండాలన్న సత్యమూ బోధపడుతుంది. కాంప్రమైజ్ కంపల్సరీ అన్న అనుభవం ఇచ్చిన జ్ఞానంతో.. ఒక అపార్ట్‌మెంట్‌ను కొనుక్కొని తండ్రి కళ్లల్లో వెలుగు చూస్తాడు హరి. అంతేకాదు తన బిజినెస్ ఎక్స్పాన్షన్కు ఓ ఫార్ములాతో దారి చూపించిన అఖ్తర్నూ తన కంపెనీలో చేర్చుకుంటాడు. అఖ్తర్ ఇచ్చిన డబ్బు అటు విక్రమ్‌లో కొత్త సినిమా కలకు కలర్స్ అద్దడం మొదలుపెడ్తుంది. రెగ్యులర్ కథే. ముఖ్యమైంది ఐడెంటిటీ. తల్లిదండ్రులు, వారి పిల్లలు అందరూ ఈ సిరీస్‌లోని పాత్రల్లో తమను తాము అన్వయించుకుంటారు. పేరెంట్స్ మాతో ఇలా ఉంటే బాగుండు అనే అనుబంధాన్నీ చూసుకుంటారు. కలలు కనండి.. సాకారం చేసుకోండి అని కలాం చెప్పే మాటనే ప్రాక్టికల్ అడ్డంకులతో సహా చూపించారు. అయినా అధైర్య పడొద్దనే భరోసానూ ఇస్తుంది ఈ సిరీస్. దీనికి డైరెక్టర్ ఉపేంద్ర వర్మ. – సరస్వతి రమ -
జబర్దస్త్ ఫేం హరిపై పీడీ యాక్టు
చంద్రగిరి: ఎర్రచందనం కేసులో ముద్దాయిగా ఉ న్న యల్లంపల్లి హరిబాబు అలియాస్ జబర్దస్త్ ఫేం హరిపై పీడీయాక్టు నమోదు చేసినట్లు చంద్రగిరి సీఐ ఈశ్వరయ్య తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో ముద్దాయిగా పలు కేసులు ఉన్న హరిని జులై 17వ తేదీన తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. ఈ మేరకు అతన్ని పీటీ వా రెంట్‌పై కోర్టులో హాజరుపరచడంతో తిరుపతి సబ్‌జైలులో రిమాండ్‌లో ఉన్నట్లు తెలి పారు. కాగా హరిపై పీడీ యాక్టు నమోదు చేయాలని అర్బన్ ఎస్పీ అభిషేక్ మొహంతి, జిల్లా కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్నను కోరారు. కాగా కలెక్టర్ మంగళవారం పీడీ యాక్టును అమలు చేస్తూ.. ఆదేశాలు జారీ చేశారన్నా రు. ఈ మేరకు కడప జిల్లా కేంద్ర కారాగారానికి తరలించినట్లు ఆయన తెలిపారు. -
‘సింగం’ కాంబోలో మరో మూవీ
సౌత్ స్టార్ హీరో సూర్య, యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి కాంబినేషన్లో వచ్చిన సింగం సిరీస్ ఎంతటి ఘనవిజయం సాదించిందో తెలిసిందే. ఈ సిరీస్‌లో మూడు భాగాలు వచ్చిన సినిమాలు తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ అయ్యాయి. తాజాగా ఈ కాంబినేషన్ మరో రిపీట్ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల విక్రమ్ హీరోగా సామి స్క్వేర్ సినిమాను తెరకెక్కించిన హరి ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయారు. దీంతో తన తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. ఇప్పటికే సూర్యకు లైన్ చెప్పిన హరి ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో ఉన్నాడట. అయితే ఈ కాంబినేషన్లో రాబోయే సినిమా సింగంకు కొనసాగింపు కాదని తెలుస్తోంది. -
‘నేను పోలీస్ కాదు పోకిరి’
మాస్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్లో పదిహేనేళ్ల క్రితం ఘనవిజయం సాధించిన సినిమా సామి. ఇన్నేళ్ల తరువాత అదే కాంబినేషన్లో సామి సినిమాకు సీక్వెల్‌ను రూపొందించారు. తమిళ్లో సామి 2 పేరుతో రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగులో ‘సామి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విక్రమ్‌ను మరోసారి పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో చూపించాడు దర్శకుడు హరి. శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తిసురేష్ హీరోయిన్. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, బాబీ సింహా, ప్రభు తదితరులు ఇతర పాత్రలలో నటించారు. తాజాగా ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాతో విక్రమ్ తిరిగి ఫాంలోకి వస్తారన్న నమ్మకంతో ఉన్నారు చిత్రయూనిట్. హరి మార్క్ స్పీడ్‌తో విక్రమ్ స్టైల్స్ తో రూపొందించిన ఈ ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. -
‘సామి’ ట్రైలర్ విడుదల
-
వస్తాడయ్యో సామి
‘భరత్ అనే నేను’లో ‘వచ్చాడయ్యో సామి’ పాటను తప్పుగా రాశామనుకుంటున్నారా? అదేం కాదు. పదిహేనేళ్ల కిందట తమిళ్లో బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న ‘సామి’ సీక్వెల్ ‘సామి స్క్వేర్’ గురించి చెప్పబోతున్నాం. ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు చిత్రదర్శకుడు హరి. ఈ చిత్రం తెలుగులో ‘సామి’ పేరుతో సెప్టెంబర్ మూడో వారంలో రిలీజ్ కానుంది. తమిళ్లో శిబు థామీన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని పుష్యమి ఫిలిం మేకర్స్, ఎమ్.జి. ఔరా సినిమాస్ బ్యానర్స్‌లో బెల్లం రామకృష్ణా రెడ్డి, కావ్య వేణుగోపాల్ తెలుగులో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం సెన్సార్ పనులు జరుగుతున్నాయి. బెల్లం రామకృష్ణారెడ్డి, కావ్య వేణుగోపాల్ మాట్లాడుతూ– ‘హరి, విక్రమ్‌లది పవర్ఫుల్ కాంబినేషన్. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘సామి’ ఎంతటి ఘన విజయం సాధించిందో తెలిసిందే. సీక్వెల్‌పై క్రేజ్ పెరగడానికి అదో కారణమైతే ‘మహానటి’ చిత్రం తర్వాత కీర్తీ సురేశ్ నటించిన సినిమా కావటంతో మరిన్ని అంచనాలు నెలకొన్నాయి’’ అన్నారు. -
హిట్ కాంబినేషన్.. నాలుగో సారి.!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య, అనుష్కలది సూపర్ హిట్ కాంబినేషన్ అన్న సంగతి తెలసిందే. వీరిద్దరు హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన ‘సింగం’ సిరీస్ ఘనవిజయం సాధించింది. మూడు భాగాలుగా రిలీజ్ అయిన ఈ సినిమాలకు హరి దర్శకుడు. ఈ కాంబినేషన్ మరోసారి మ్యాజిక్ చేసేందుకు రెడీ అవుతున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న సూర్య 39వ సినిమాకు హరినే దర్శకత్వం వహించనున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హీరోయిన్గా మరోసారి అనుష్కనే తీసుకునే ఆలోచనలో ఉన్నాడు దర్శకుడు హరి. అయితే కొద్ది రోజులుగా లుక్ పరంగా విమర్శలు ఎదుర్కొంటున్న అనుష్క ప్రస్తుతం సినిమాలు అంగీకరించటం లేదు. మరి మరోసారి హరి, సూర్యలతో కలిసి పనిచేసేందుకు ఓకె చెపుతుందో లేదో చూడాలి. -
‘పందెంకోడి’ తర్వాత ‘అభిమన్యుడు’
‘అభిమన్యుడు’ సినిమా మేం ఊహించిన దాని కంటే చాలా పెద్ద హిట్ అయ్యింది. మంచి సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారనడానికి ఇదొక ఉదాహరణ. మంచి హిట్ కోసం నాలుగేళ్లుగా వెయిట్ చేసిన నాకు ఈ సక్సెస్ సంతోషాన్నిచ్చింది’’ అని నిర్మాత గుజ్జలపూడి హరి అన్నారు. విశాల్, సమంత జంటగా పి.ఎస్.మిత్రన్ దర్శకత్వంలో విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకంపై రూపొందిన చిత్రం ‘ఇరుంబు తిరై’. తమిళంలో ఘనవిజయం సాధించిన ఈ సినిమాని ఎం.పురుషోత్తమన్ సమర్పణలో జి.హరి ‘అభిమన్యుడు’ పేరుతో ఈ నెల 1న విడుదల చేశారు. ఈ సందర్భంగా హరి మాట్లాడుతూ– ‘‘స్క్రిప్ట్ దశ నుంచే నాకీ సినిమా గురించి తెలుసు. గ్యారంటీ హిట్ అని నమ్మాను. డిజిటల్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సామాన్యుడు ఎదుర్కొంటున్న కష్టాలను మిత్రన్ బాగా తెరకెక్కించడంతో ‘అభిమన్యుడు’కి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. విశాల్‌కి సామాజిక బాధ్యత ఎక్కువ. ఈ చిత్రంలో చేసిన పాత్ర ఆయన నిజజీవితానికి దగ్గరగా ఉంటుంది. 600 థియేటర్స్‌లో విడుదలైన మా సినిమాకు మరో 60 థియేటర్స్ పెంచాం. సినిమా విడుదలైన 3 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో 6 కోట్ల 40 లక్షలు వసూలు చేసింది. ‘పందెం కోడి’ సినిమా తర్వాత విశాల్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ ‘అభిమన్యుడు’. ఈ సినిమాకు సీక్వెల్ చేయాలని విశాల్‌గారు అనుకుంటున్నారు. గురువారం సక్సెస్ మీట్ నిర్వహించనున్నాం. విశాల్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇప్పుడే చెప్పలేం. ప్రస్తుతం ‘పందెంకోడి’కి సీక్వెల్‌గా విశాల్‌గారు చేస్తున్న ‘పందెం కోడి’ 2 రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. దసరాకు సినిమా రిలీజ్‌కి సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. -
మాస్ యాక్షన్ ‘స్వామి స్క్వేర్’
సింగం సిరీస్‌లో మూడు చిత్రాలను తెరకెక్కించిన తమిళ దర్శకుడు హరి, తాజాగా తన మరో సూపర్ హిట్ సినిమా సామికి సీక్వల్‌ను రూపొందిస్తున్నారు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన సామి 2003లో రిలీజ్ అయి ఘనవిజయం సాధించింది. తరువాత అదే సినిమాను తెలుగులో లక్ష్మీ నరసింహా పేరుతో బాలకృష్ణ హీరోగా రీమేక్ చేశారు. తాజాగా సామి సినిమా సీక్వల్‌ను సామి స్క్వేర్ పేరుతో రూపొందిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో విక్రమ్ మరోసారి యాంగ్రీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. విక్రమ్ జోడిగా కీర్తి సురేష్ నటిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈసినిమా ప్రమోషన్ ను స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే ఫస్ట్, టీజర్లను రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా యాక్షన్ ప్యాక్డ్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. తమిళనాట స్వామి స్క్వేర్ జూన్ 14న రిలీజ్ కానుంది. -
‘స్వామి స్క్వేర్’ ట్రైలర్
-
విక్రమ్ ’సామి’ మోషన్ పోస్టర్ విడుదల
-
మూడు గెటప్‌లలో విలన్
తమిళ సినిమా : తమిళం, మలయాళం భాషల్లో విలక్షణ నటుడిగా రాణిస్తున్న తెలుగు నటుడు బాబీసింహా. స్వయంకృషితోనే ఎదుగుతున్న నటుడీయన. చిన్న పాత్రల నుంచే విలన్, హీరో స్థాయికి చేరుకున్నారు. జిగర్తండా చిత్రంలో విలక్షణ విలనీయంను ప్రదర్శించి జాతీయ అవార్డును గెలుచుకున్న నటుడు బాబీసింహా. ఆ తరువాత హీరోగా అవతారమెత్తారు. ఉరుమీన్ లాంటి కొన్ని చిత్రాల్లో కథానాయకుడిగా నటించినా ఆయన్ని హీరోగా కంటే విలన్‌గానే ప్రేక్షకులు ఆదరిస్తున్నారన్న విషయాన్ని గ్రహించి, వారి అభీష్టానికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నారు. అంతే మళ్లీ నటుడిగా బిజీ అవుతున్నారు. ప్రస్తుతం విక్రమ్ హీరోగా నటిస్తున్న సామి స్క్వేర్ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు. ఇది గతంలో విక్రమ్ నటించిన సామి చిత్రానికి కొనసాగింపు అన్నది తెలిసిందే. హరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తీసురేశ్ నాయకి. పులి, ఇరుముగన్ చిత్రాల నిర్మాత శిబుతమీన్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో బాబీసింహా మూడు గెటప్‌లలో కనిపించనున్నారట. దర్శకుడు హరి చిత్రంలో విలన్ పాత్రలు చాలా శక్తివంతంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. సామి చిత్రంలో కోటాశ్రీనివాసరావు విలన్‌గా నటించారు. ఆ చిత్రంలో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అదే విధంగా సామి స్క్వేర్ చిత్రంలో బాబీసింహా పాత్ర చాలా బలమైందిగా ఉంటుందట. ఈయన నటిస్తే బాగుంటుదనే దర్శక నిర్మాతలతో పాటు నటుడు విక్రమ్ కూడా బాబీసింహాను సంప్రదించారు. సామి స్క్వేర్ చిత్రం తరువాత బాబీసింహా మరోసారి విలన్‌గా బిజీ అయిపోతారంటున్నారు ఆ చిత్ర వర్గాలు. -
‘అజ్ఞాతవాసి పరిహాసమేమో అనుకున్నా..!’
దుబాయ్ : అదృష్టదేవత ఎప్పుడు ఎవరికి ఎందుకు వరమిస్తుందో తెలియదు! ఒకవేళ వరమిచ్చినా అది నిజమని నమ్మాలనిపించదు!! పరాయి దేశంలో దర్జాగా సెటిలైన ఓ భారతీయుయ కుటుంబం ఇప్పుడు సరిగ్గా ఇలాంటి స్థతిలోనే ఉంది. సరదాగా కొన్న లాటరీ టికెట్‌కు రూ.21కోట్ల జాక్‌పాట్ లభించింది. దుబాయ్ సహా ఇండియా అంతటా మారుమోగుతోన్న ఈ వార్త వివరాల్లోకి వెళితే.. అలెప్పి(కేరళ)కు చెందిన హరి కృషన్ దుబాయ్‌లో బిజినెస్ డెవలపర్‌గా సెటిలయ్యారు. అతనికి భార్యా,కొడుకు ఉన్నారు. దుబాయ్ ఎయిర్‌పోర్టులో ఒకటిరెండుసార్లు లాటరీ టికెట్లు కొన్నా బహుమతి తగల్లేదు. హరికి అదేమంత పెద్ద విషయంకాదు. ఇటీవల 500 దిరామ్స్‌పెట్టి ఇంకో లాటరీ టికెట్ కొని ఆ సంగతి మర్చిపోయారు. రెండు రోజుల కిందటే లాటరీ ఫలితాలు వచ్చాయి. హరి కొన్న టికెట్ నంబర్‌కే రూ.12లక్షల దిరామ్స్(సుమారు రూ.21కోట్లు) జాక్‌పాట్ తగిలింది. ‘‘రూ.21కోట్ల బంపరాఫర్ కొట్టేశారని ఫోన్ వచ్చింది.. ఎవరో అజ్ఞాతవాసి పరిహాసం చేస్తున్నాడేమో అనుకున్నా. అలా నాలుగైదు కాల్స్ తర్వాత ఓ మీడియా మితృడి నుంచి ఫోనొచ్చింది, అటుపై ఓ రేడియో స్టేసన్ నుంచి!! వెంటనే నా భార్యకు చెప్పాను.. లాటరీ కంపెనీ వెబ్సైట్ చూడమని. చివరికి ఆమె కన్ఫార్మ్ చేస్తేగానీ నమ్మలేదు. ఇంతటి అదృష్టం ఇంకా కలగానే అనిపిస్తోంది’’ అని చెప్పుకొచ్చాడు హరి. ఈ సొమ్మును తన భవిష్యత్ అవసరాల కోసం అట్టిపెట్టుకుంటానని ఆయన తెలిపారు. -
అప్పుడు సెన్సార్ సర్టిఫికెట్.. రోలింగ్ టైటిల్సే మిగులుతాయి!
‘‘మిస్కిన్ (దర్శకుడు) విచిత్రమైన మనిషి. నేనూ, ఆయన సినిమా చేస్తున్నామనగానే ‘ఇద్దరు సైకోలు కలసి సినిమా చేస్తున్నారు’ అని ఫైనాన్స్ ఇవ్వడానికి ఎవరూ ముందుకు రాలేదు. మిస్కిన్ దర్శకత్వంలో నటిస్తే... నా కెరీర్లో గుర్తుండిపోయే చిత్రం అవుతుందని గట్టి నమ్మకం. ఆయన డిఫరెంట్ సినిమాలు తీస్తారు. ఎనిమిదేళ్లుగా ఇద్దరం సినిమా చేయాలనుకుంటుంటే... ఈ ఏడాది కుదిరింది. హాలీవుడ్ ‘షెర్లాక్ హోమ్స్’ తరహా చిత్రమిది. అక్టోబర్‌లో తమిళ్లో ‘తుప్పరివాలన్’గా విడుదలై సూపర్ హిటై్టంది. తెలుగులోనూ హిట్టవుతుందనే నమ్మకముంది. నా కెరీర్లో వన్నాఫ్ ద బెస్ట్ ఫిల్మ్’’ అన్నారు విశాల్. మిస్కిన్ దర్శకత్వంలో విశాల్ హీరోగా జి. హరి నిర్మించిన సస్పెన్స్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ ‘డిటెక్టివ్’. ఈ నెల 10న సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో విశాల్ మాట్లాడుతూ– ‘‘ఇందులో అద్వైత భూషణ్‌గా నటించా. ఒక్క పాట కూడా లేకుండా నేను సినిమా చేయడం ఇదే తొలిసారి. వచ్చే ఏడాది ఈ సినిమాకి సీక్వెల్ చేయాలని ఆల్రెడీ ప్లాన్ చేశాం’’ అన్నారు. తెలుగులో మీ సిన్మాలు ఎందుకు లేటుగా విడుదలవుతున్నాయి? అనడిగితే.. ‘‘సెన్సార్ సమస్యలే కారణం. తమిళ్ సెన్సార్‌ను ముంబైకి షిఫ్ట్ చేశారు. అక్కడ నుంచి సర్టిఫికెట్ వచ్చేసరికి ఎంబీబీఎస్ డిగ్రీ చేతికొచ్చినట్టు ఉంటోంది. ఒక్కోసారి తెలుగులో పెద్ద హీరోల సినిమాలు ఉంటే వెనక్కి వెళ్లక తప్పడం లేదు. (నవ్వుతూ...) 10వ తేదీన సినిమా విడుదల కాకుంటే హరిని చంపేస్తా. తెలుగులో నా బలం హరి’’ అన్నారు విశాల్. ‘విజయ్ ‘మెర్సల్’కి మద్దతిచ్చారు. చెన్నైలో వరదలొస్తే హెల్ప్ చేస్తున్నారు. భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా?’ అనడిగితే... ‘‘సీబీఎఫ్సీ (సెన్సార్) సర్టిఫికెట్ వచ్చిన తర్వాత రాజకీయ పార్టీల జోక్యం ఏంటి? వాళ్లందరూ డైలాగులు కట్ చేస్తే... చివరికి సిన్మాలో సెన్సార్ సర్టిఫికెట్, రోలింగ్ టైటిల్స్ మాత్రమే మిగులుతాయి. ఇక, రాజకీయాలు అంటారా? పవర్ ఉంటేనే ప్రజలకు మేలు చేయగలుగుతానని ఫీలైన రోజున రాజకీయాల్లోకి వస్తా. మన రాజకీయ నాయకులు మంచి రాజకీయం చేయాలని నా ఆశ.అప్పుడు నాలాంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రావలసిన అవసరం ఉండదు’’ అని విశాల్ తెలిపారు. మన దేశంలోని సినీ ప్రముఖులందరూ కలసి కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీపై ఓ ప్రజెంటేషన్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు ఓ ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. కార్యక్రమంలో చిత్రనిర్మాత హరి, నటి ఆండ్రియా, మాటల రచయిత రాజేశ్ ఎ.మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఎవరితో.... అనేదిఅమ్మాయి ఇష్టమే! క్యాస్టింగ్ కౌచ్... (హీరోయిన్లపై లైంగిక వేధింపులు/పడకగదికి వస్తే సిన్మాలో ఛాన్స్ ఇస్తామని చెప్పడం)... ఇప్పుడీ అంశం ప్రతి సినిమా ఇండస్ట్రీలోనూ వినిపిస్తోంది! కొందరు హీరోయిన్లు తమకు ఎదురైన చేదు అనుభవాల గురించి గళం విప్పుతున్నారు. సోషల్ మీడియాలో సామాన్యులు ‘మీ టూ’ పేరుతో ఓ క్యాంపెయిన్ రన్ చేస్తున్నారు. ‘‘క్యాస్టింగ్ కౌచ్, మీటూ’లపై మీ అభిప్రాయం ఏంటి?’ అని ఆండ్రియాను అడిగితే... ‘‘ఇండస్ట్రీలో నాకెలాంటి లైంగిక ఇబ్బందులూ ఎదురుకాలేదు. ఒకవేళ ఎదురైతే సినిమాలు వదులుకోవడానికి నేను సిద్ధమే. అయినా... ఓ అమ్మాయి ఎవరితో పడుకుంటుందనేది ఆమె వ్యక్తిగతం. మగవాళ్లు డిసైడ్ చేయాల్సిన విషయం కాదిది. మరొకరు బలవంతం చేయకూడదు’’ అన్నారు. ప్రేమ పెళ్లే... జనవరిలో! ఇంట్లో కోప్పడుతున్నారు... ‘పెళ్లెప్పుడు?’ అని! డిసెంబర్లో ‘నడిగర్ సంఘం’ ఓన్ బిల్డింగ్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ నెక్ట్స్ మంత్... జనవరిలో పెళ్లి చేసుకుంటా. ‘పెద్దలు కుదిర్చిన వివాహమా? ప్రేమ వివాహమా?’ అని ‘సాక్షి’ అడగ్గా... ‘‘లవ్ మ్యారేజే (ప్రేమ పెళ్లే)! నాకు అరేంజ్డ్ మ్యారేజ్ సెట్ కాదండీ’’ అని నవ్వేశారు విశాల్. -
సామి 2 నుంచి త్రిష ఔట్
సామి2 చిత్ర యూనిట్ ఆదిలోనే షాక్‌కు గురైంది. నటుడు విక్రమ్‌కు కమర్షియల్ హీరో ఇమేజ్ను ఆపాధించిన చిత్రం సామి. యాక్షన్ కథా చిత్రాలను తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన హరి దర్శకత్వం వహించిన ఈ చిత్ర విజయంలో కథానాయకి త్రిషకు భాగం ఉంటుంది. ఆమె అందాలు సామి చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. ఇక విషయానికి వస్తే సామి చిత్రానికి సీక్వెల్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. విక్రమ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి హరినే దర్శకుడు. హీరోయిన్ కూడా త్రిషనే. అయితే అధనంగా కీర్తీసురేశ్ వచ్చి చేరింది. శిబుతవీన్ భారీ ఎత్తున్న నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీశ్రీప్రసాద్ సంగీత బాణీలు కడుతున్నారు. చిత్ర యూనిట్ ఇటీవలే ఢిల్లీలో కొన్ని కీలక సన్నివేశాలతో పాటు, యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించుకుని తొలి షెడ్యూల్ పూర్తి చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో సామి 2 చిత్రం నుంచి వైదొలగుతున్నట్లు నటి త్రిష సోమవారం తన ట్విట్టర్లో పేర్కొన్నారు. బేధాభిప్రాయం కారణంగా తాను చిత్రం నుంచి తప్పుకున్నానని, చిత్ర యూనిట్‌కు బెస్ట్ ఆఫ్ లక్ అంటూ త్రిష పేర్కొన్నారు. కాగా ఆది నుంచి సామి 2 చిత్రంలో నటి కీర్తీసురేశ్‌కే ప్రాముఖ్యత అని, త్రిష పాత్ర పరిమితంగానే ఉంటుందనే ప్రచారం సాగుతోంది. తాజా పరిణామాలతో అది నిజమని రుజువయ్యిందనిపిస్తోంది. కాగా త్రిష సామి2 చిత్రం నుంచి వైదొలగడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ విషయంపై చిత్ర వర్గాలు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మొత్తం మీద ఈ విధంగా త్రిష సామి2 చిత్ర యూనిట్‌కు షాక్ ఇచ్చారన్నమాట. Due to creative differences,I have chosen to opt out of Saamy 2 . Wishing the team goodluck. — Trisha Krishnan (@trishtrashers) 23 October 2017 -
అటా ఆధ్వర్యంలో డెట్రాయిట్లో ఉచిత వైద్య సేవలు
డెట్రాయిట్: అమెరికాలోని డెట్రాయిట్లో అమెరికా తెలుగు సంఘం(అటా) డెంటల్, యోగా, మెడిటేషన్ సెషన్లను నిర్వహించింది. డెట్రాయిట్ అటా ట్రస్టీ హరి లింగాల, టీం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దాదాపు 130 హెల్త్ స్క్రీనింగ్‌లను చేశారు. వీటిలో ఈకేజీ 70 డెంటల్ స్క్రీనింగ్స్, 25 ఎక్స్‌రేలు ఉన్నాయి. మెడిటేషన్, యోగా కార్యక్రమాలకు కూడా కొందరు హాజరయ్యారు. మొత్తం ఎనిమిది మంది డాక్టర్లు, ఎనిమిది మంది టెక్నీషియన్లు, 20 మంది వాలంటీర్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. డా. అశోక్ కొండూరు, సన్నీ రెడ్డిలకు కార్యక్రమ నిర్వహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. -
భార్యతో గొడవపడి నిప్పంటించుకున్న భర్త
రాయదుర్గం అర్బన్ : భార్యతో గొడవపడి మనస్తాపానికి గురైన భర్త ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. రాయదుర్గం పట్టణంలోని శ్రీచౌడమ్మ గుడి ప్రాంతంలో నివాసముంటున్న భీమునిపల్లి హరి (35), కృష్ణవేణి దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్యాభర్తలు నిత్యం ఏదో ఒక విషయంపై గొడవపడేవారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయంలో గొడవపడ్డారు. మనస్తాపానికి గురైన హరి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. మంటలకు బాధ తట్టుకోలేక ఇంట్లోంచి బయటకు పరుగులు తీశాడు. స్థానికులు గమనించి, మంటలు ఆర్పి.. 108 వాహనంలో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. డాక్టర్ వసంతలక్ష్మి ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం బళ్లారి విమ్స్‌కు సిఫార్సు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
కదిరిలో మళ్లీ దొంగలుపడ్డారు!
- వరుస చోరీలతో పోలీసులకు దొంగల సవాల్ - తాజాగా ఉపాధ్యాయుడి ఇంట్లో చోరీ - బెంబేలెత్తుతున్న జనం కదిరి టౌన్ : కదిరిలో మళ్లీ దొంగలు పంజా విసిరారు. దైవదర్శనానికి వెళ్లిన ఉపాధ్యాయుడి ఇంట్లో పడి నగలు, నగదు ఎత్తుకెళ్లారు. కదిరి నడిబొడ్డున గల అడపాలవీధిలోని హరి అనే ఉపాధ్యాయుడు కుటుంబ సభ్యులతో కలసి ఈ నెల 24న తమ ఇంటి ఇలవేల్పైన వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు తిరుమలకు వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దొంగలు 26న ఇంటికున్న తాళాన్ని పగులగొట్టి లోనికి ప్రవేశించారు. ఇంట్లోని బీరువాను ధ్వంసం చేసి, అందులోని బంగారు నల్లపూసల దండ, నాలుగు జతల కమ్మలు, ఉంగరాలన్నీ కలిపి 15 తులాల ఆభరణాలతో పాటు రూ.5 వేల నగదుతో ఉడాయించారు. ఈ విషయాన్ని హరినాయక్ బంధువులు కనుగొని బాధితునికి సమాచారం అందించారు. దీంతో బాధితుడు కదిరికి వచ్చి చోరీపై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. పట్టణ సీఐ శ్రీనివాసులు చోరీ జరిగిన ఇంటికెళ్లి పరిశీలించారు. వేలిముద్రల నిపుణులతో ఆధారాలు సేకరించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
కీర్తి కోసం అడ్జస్ట్ అవుతున్న విక్రమ్..!
సినీరంగం సక్సెస్ వెంటే పరిగెడుతుంది. అందుకే సక్సెస్ ఫుల్ నటీనటులకు, టెక్నిషియన్స్‌కు యమా డిమాండ్ ఉంటుంది. అదే బాటలో హీరోయిన్ కీర్తి సురేష్ జోరు ఇప్పుడు టాలీవుడ్ కోలీవుడ్‌లలో మామూలుగా లేదు. యంగ్ హీరోలతో పాటు స్టార్ హీరోలతోనూ వరుసగా సినిమాలు చేసేస్తుంది ఈ హోమ్లీ బ్యూటీ. తెలుగు, తమిళ భాషల్లో కీర్తి సురేష్ హీరోయిన్ గా తెరకెక్కిన సినిమాలన్నీ ఘనవిజయం సాధించటంతో ఆమెకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. అందుకే కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ కూడా కీర్తి డేట్స్ కోసం తానే అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. విలక్షణ నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్, మాస్ యాక్షన్ సినిమాల దర్శకుడు హరి దర్శకత్వంలో సామి 2 సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కీర్తి సురేష్‌ను హీరోయిన్గా తీసుకోవాలని నిర్ణయించారు. అయితే ప్రస్తుతం చేతినిండా సినిమాలతో కీర్తి బిజీగా ఉండటంతో ఆమె డేట్స్‌కు తగ్గట్టుగా విక్రమ్ తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటున్నాడట. కొంత కాలంగా తన రేంజ్‌కు తగ్గ హిట్ ఇవ్వలేకపోతున్న విక్రమ్ కూడా కీర్తి లక్ మీద నమ్మకం పెట్టుకున్నాడు. -
హరితో సినిమా.. సింగం కాదు
కోలీవుడ్, టాలీవుడ్ లలో సూపర్ హిట్ నిలిచిన యాక్షన్ సీరీస్ సింగం. సూర్య హీరోగా తెరకెక్కిన ఈ సీరీస్ లో మూడు భాగాలు రిలీజ్ అయ్యాయి. అయితే తొలి రెండు భాగాలు ఘనవిజయం సాధించినా.. మూడో సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే సినిమా రిలీజ్ సమయంలో సింగం సీరీస్ తరువాత కూడా కొనసాగుతుందని ప్రకటించాడు హరి. తాజాగా హరి దర్శకత్వంలో సూర్య మరో సినిమా చేయబోతున్నాడన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఫ్యాన్స్.. సూర్య, హరి కాంబినేషన్ అంటే అది సింగం సీరీస్ లోని సినిమానే అయిఉంటుందని భావించారు. కానీ సూర్యతో హరి చేయబోయే నెక్ట్స్ సినిమా సింగం సీరీస్ కు కొనసాగింపు కాదని తెలుస్తోంది. సూర్య కోసం ఫ్రెష్ గా ఓ మాస్ ఎంటర్టైనర్ ను రెడీ చేస్తున్నాడు హరి. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న విఘ్నేష్ శివన్ సినిమా, ఆ తరువాత సెల్వరాఘవన్ ల సినిమాలు పూర్తి చేసిన తరువాత హరి దర్శకత్వంలో సూర్య సినిమా తెరకెక్కనుంది. సూర్య హీరోగా హరి కొత్త కథతో సినిమా చేస్తుండటంతో సింగం సీరీస్ కు తెరపడినట్టేనని భావిస్తున్నారు ఫ్యాన్స్. -
విక్రమ్‌కు జోడిగా త్రిష
కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఇటీవల సూర్య హీరోగా సింగం సీరీస్ లో మూడో భాగాన్ని రిలీజ్ చేసిన హరి, విక్రమ్ హీరోగా కూడా సీక్వల్నే రూపొందించనున్నాడు. విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న డైరెక్టర్ హరి, త్వరలోనే విక్రమ్‌తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించాడు. అన్న మాట ప్రకారం సింగం 3 సినిమా తరువాత సామి ను పట్టాలెక్కిస్తున్నాడు. ఈసినిమా కూడా సింగం తరహాలోనే పక్కా సీక్వల్ లా ఉండేలా ప్లాన్ చేస్తున్నాడు. అందుకే తొలి భాగంలో హీరోయిన్గా నటించిన త్రిషనే మరోసారి హీరోయిన్గా ఎంపిక చేసుకున్నాడు. ఈ సినిమాలో తనకు చాన్స్ ఇవ్వటంపై హీరోయిన్ త్రిష ఆనందం వ్యక్తం చేసింది. -
మరో ఐదేళ్లలో సింగం–4
టీనగర్: మరో ఐదేళ్లలో సింగం–4 చిత్ర దర్శకత్వం చేపట్టనున్నట్లు హరి తెలిపారు. ఇటీవల ఆయన ఒక చిత్ర విజయోత్సవంలో ఈ వివరాలు వెల్లడించారు. హరి దర్శకత్వంలో సూర్య నటించిన సింగం చిత్రం 2010లో విడుదలైంది. 2013లో సింగం–2, 2017లో సింగం–3 రిలీజై ప్రదర్శించబడుతున్నాయి. ఊహించిన విధంగానే వీటికి అభిమానుల నుంచి అనూహ్య స్పందన లభించింది. తర్వాత సింగం–4 ఎప్పుడు విడుదలవుతుందా? అనే ఉత్కంఠ అభిమానుల్లో నెలకొంది. దీనికి సమాధానమిచ్చే విధంగా ఇటీవల సింగం–3 తెలుగు చిత్ర విజయోత్సవంలో హరి వివరాలు వెల్లడించారు. మరోఐదు లేదా ఆరేళ్లలో సింగం చిత్రం నాలుగో భాగాన్ని రూపొందించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం విక్రమ్ నటించిన సామి చిత్రం రెండవ భాగానికి దర్శకత్వం వహిస్తానని, ఈ చిత్రం ముగియగానే మళ్లీ సూర్య నటించే మరో చిత్రానికి దర్శకత్వం వహిస్తానని అన్నారు. ఈ రెండు చిత్రాల్లో పాత్రలు ఎంతో భిన్నంగా ఉంటాయని తెలిపారు. హరి చేసిన ఈ ప్రకటనతో సామి–2, సూర్య నటించే చిత్రం కోసం అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. -
మహేష్ బాటలో సూర్య
స్టార్ హీరోలు ఒకరినొకరు ఆదర్శంగా తీసుకుంటున్నారు. ముఖ్యంగా తమకు హిట్ ఇచ్చిన దర్శకులను సర్ప్రైజ్గా కాస్ట్లీ కానుకలను అందిస్తున్నారు. గతంలో శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు కొరటాల శివకు హీరో మహేష్ బాబు గిఫ్ట్ ఇచ్చాడు. శ్రీమంతుడు రిలీజ్ తరువాత కొరటాల ఖరీదైన కారును కానుకగా ఇచ్చాడు మహేష్. ఇప్పుడు అదే బాటలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా తనకు సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు హరికి 50 లక్షల ఖరీదు చేసే టొయోటా ఫార్చూనర్ కారును గిఫ్ట్ ఇచ్చాడు. సూర్యను టాప్ స్టార్ నిలబెట్టిన సింగం సీరీస్ లో మూడు వరుస సూపర్ హిట్స్ అందించిన హరి, ముందు ముందు ఇదే సీరీస్ లో మరిన్ని సినిమాలను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. -
విజయ్‌తో సినిమాపై సింగం డైరెక్టర్ కామెంట్
కోలీవుడ్ మాస్ యాక్షన్ సినిమాల స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్న దర్శకుడు హరి. సింగం సీరీస్‌తో తిరుగులేని స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న హరి, కెరీర్లో ఇప్పటి వరకు డైరెక్ట్ చేసినవి కేవలం 14 చిత్రాలు మాత్రమే. రేసీ స్క్రీన్‌ప్లేతో పాటు ఫ్యామిలి ఎమోషన్స్, యాక్షన్ సీన్స్‌తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్లను తెరకెక్కించే హరి, ఇన్నేళ్ల కెరీర్లో ఇద్దరు స్టార్ హీరోలతో సినిమా చేయలేకపోయాడు. అయితే అందుకు కారణం ఏంటో కూడా చెపుతున్నాడు హరి. సూర్య, విక్రమ్, విశాల్, లాంటి స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన హరి... విజయ్, అజిత్‌లతో సినిమాలు చేయలేకపోయాడు. సింగం తొలి భాగం రిలీజ్ అయిన సమయంలో విజయ్‌తో సినిమా చేసేందుకు చర్చలు జరిపిన హరి, సరైన నిర్మాత దొరక్క పోవటంతో ఈ సినిమా పట్టాలెక్కలేదు. ప్రస్తుతం సింగం 3 ప్రమోషన్లో భాగంగా మీడియాతో మాట్లాడిన హరి, విజయ్ మార్కెట్ రేంజ్‌కు తగ్గ స్థాయిలో సినిమాను తెరకెక్కించే నిర్మాత దొరికితే సినిమా చేసేందుకు తాను సిద్ధమే అంటూ ప్రకటించాడు. -
సింగం 3 షూట్లో 99.2% వేస్ట్
సినిమా మేకింగ్ డిజిటల్ అయిన తరువాత రీల్ ఖర్చు గణనీయంగా తగ్గింది. ముఖ్యంగా అనవసరపు షాట్లతో పాటు సినిమా లెంగ్త్ ఎక్కువయ్యిందన్న కారణంతో సినిమాలో చాలా భాగం తొలగిస్తుంటారు. కొన్నిసార్లు అలా కట్ అయిన సీన్స్ ఖర్చే కోట్లల్లో ఉంటుంది. డిజిటల్ టెక్నాలజీ వచ్చిన తరువాత రీల్ ఖర్చు తగ్గినా అనవసరపు సీన్స్ తీయటం వల్ల చాలా సమయం వృధా అవుతోంది. ఇలా అనవసరపు సీన్స్ తీయటంలో సూర్య హీరోగా తెరకెక్కిన సింగం 3 రికార్డ్ సృష్టించిందన్న టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా కోసం షూట్ చేసిన మొత్తంలో కేవలం 0.8% మాత్రమే సింగం 3 సినిమాలో కనిపించనుందట, మిగతా 99.2% సినిమాలో కటింగ్స్ లో తీసేశారంటూ స్వయంగా దర్శకుడు హరి ప్రకటించాడు. సూర్య లాంటి స్టార్ హీరోతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన సినిమాలో ఇంత సమయం వేస్ట్ చేయటమంటే మామూలు విషయం కాదు. అయితే దర్శకుడు మాత్రం ప్రస్తుతం ఉపయోగించని సీన్స్‌ను సింగం 4, 5 పార్ట్స్‌లో ఉపయోగిస్తామని చెపుతున్నాడు. సూర్య సరసన అనుష్క, శృతిహాసన్‌లు నటించిన ఈ సినిమా కోసం దాదాపు 17 లక్షల రోల్స్ షూట్ చేశారట. అయితే ఫైనల్ ఎడిటింగ్ తరువాత సినిమా లెంగ్త్, కేవలం 14 వేల రోల్స్‌కే పరిమితం చేశారు. ఈ నెల 9న రిలీజ్ అవుతున్న సింగం 3 నిర్మాతలకు ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి. -
ఈసారైనా రిలీజ్ అవుతుందా..?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన మాస్ మసాలా యాక్షన్ ఎంటర్టైనర్ సి 3 (సింగం 3). సూర్య, హరిల కాంబినేషన్లో తెరకెక్కిన సింగం సిరీస్‌లో మూడో భాగంగా రూపొందిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా సూర్యను మరింత పవర్ ఫుల్ రోల్లో ఇంటర్నేషనల్ కాప్‌గా చూపిస్తున్నాడు హరి. చాలా కాలం క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో మాత్రం అభిమానులను నిరాశపరుస్తున్నారు. ముందుగా ఈ సినిమాను డిసెంబర్ 16న రిలీజ్ చేయాలని భావించారు. అయితే అదే సమయంలో రామ్ చరణ్ ధృవ రిలీజ్ ఉండటంతో సింగం 3 వాయిదా పడింది. ఆ తరువాత కూడా రెండు మూడు సార్లు వాయిదా పడిన ఈ సినిమాను ఫైనల్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న రిలీజ్ చేయాలని భావించారు. కానీ తమిళ నాట జల్లికట్టు నిషేదం పై నిరసనలు, అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ లోనూ ఉద్రికత్త పరిస్థితులు నెలకొనటంతో సింగం 3ని మరోసారి వాయిదా వేశారు. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 9న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. సూర్య సరసన అనుష్క, శృతి హాసన్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను కె.ఇ.జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. హరీష్ జయరాజ్ సంగీతం అందించిన ఈ సినిమాకు ఆడియో మంచి రెస్పాన్స్ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి ఈ సారైన అనుకున్నట్టుగా సినిమా రిలీజ్ అవుతుందో లేదో చూడాలి. -
వేటకు సిద్ధమైన 'సింగం'
కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా తెరకెక్కిన సక్సెస్ ఫుల్ సీరీస్ సింగం. రేసీ స్క్రీన్‌ప్లే, భారీ యాక్షన్ ఎపిసోడ్స్‌తో తెరకెక్కిన ఈ సీరీస్‌లో ఇప్పటికే రెండు భాగాలు ఘనవిజయం సాధించగా.., ఇప్పుడు మూడో భాగం రిలీజ్‌కు రెడీ అవుతోంది. చాలా రోజుల క్రితమే నిర్మాణాంతర కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకున్న సింగం 3, రిలీజ్ మాత్రం వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సూర్య ఫ్యామిలీ బ్యానర్ స్టూడియో గ్రీన్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తొలి రెండు భాగాలకు దర్శకత్వం వహించిన హరి దర్శకుడు. ఇదే సీరీస్‌లో రిలీజ్ అయిన గత చిత్రాలతో పోలిస్తే భారీ బడ్జెట్‌తో మరింత స్టైలిష్‌గా సింగం 3ని తెరకెక్కించారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్లు ఆకట్టుకోగా సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు సినిమా రిలీజ్ డేట్‌పై ఎటూ తేల్చని చిత్రయూనిట్ ఫైనల్‌గా జనవరి 26 సింగం 3ని రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించింది. మరి సూర్య సింగంలా మరోసారి కలెక్షన్ల వేట కొనసాగిస్తాడో.. లేదో.. చూడాలి. -
వ్యక్తికి రిమాండ్
బెళుగుప్ప (ఉరవకొండ) : మండల పరిధిలోని గంగవరం గ్రామానికి చెందిన విద్యార్థినిపై ఈనెల 4న లైంగికదాడి చేసిన ఘటనలో హరి అనే వ్యక్తిని కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించామని ఎస్ఐ నాగస్వామి శుక్రవారం పేర్కొన్నారు. నిందితుడ్ని కళ్యాణదుర్గం కోర్టుకు హాజరుపరుచగా 14 రోజులు రిమాండ్‌ను కోర్టు విధించిందన్నారు. -
సింగం 3 మరోసారి వాయిదా..?
సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సూపర్ హిట్ సీరీస్ సింగం. తెలుగు, తమిళ భాషల్లో ఘనవిజయం సాధించిన ఈ సీరీస్‌లో ఇప్పుడు మూడో భాగం రెడీ అయ్యింది. తొలి రెండు భాగాలకు మించి భారీ బడ్జెట్‌తో మరింత రేసీ స్క్రీన్‌ప్లేతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న సింగం 3 సినిమాను ముందుగా డిసెంబర్ 16నే రిలీజ్ చేయాలని భావించారు. అయితే అందుకు వారం ముందు ధృవ సినిమా రిలీజ్ కావటంతో సింగం 3ని డిసెంబర్ 23కు వాయిదా వేశారు. కానీ ఇప్పుడు 23న కూడా ఈ సినిమా రిలీజ్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో పాటు వర్థ తుఫాను దెబ్బకు విలవిలలాడిన ప్రజలు అప్పుడే థియేటర్లకు వస్తారా.. అన్న ఆలోచనలో ఉన్నారట నిర్మాతలు. అదే సమయంలో సెన్సార్ బోర్డ్ సింగం 3 సినిమాకు ఏ సర్టిఫికేట్ ఇవ్వటం కూడా వాయిదాకు కారణం అన్న టాక్ వినిపిస్తోంది. తమిళనాట యు సర్టిఫికేట్ వచ్చిన సినిమాలకు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో మరోసారి రివ్యూ కమిటీకి వెళ్లి సింగం 3కి యు సర్టిఫికేట్ తెచ్చుకోవాలని భావిస్తున్నారట. అందుకే సినిమాను మరో వారం పాటు వాయిదా వేస్తే బెటర్ అన్న ఆలోచన ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది. సింగం 3 సినిమా రిలీజ్ డేట్‌పై గురువారమే నిర్మాత జ్ఞానవేల్ రాజా క్లారిటీ ఇవ్వనున్నారు. -
సింగం దర్శకుడితో ఎన్టీఆర్.?
జనతా గ్యారేజ్ సినిమాతో కెరీర్లోనే బిగెస్ట్ హిట్ కొట్టిన ఎన్టీఆర్, నెక్ట్స్ సినిమా విషయంలో మాత్రం ఎటూ తేల్చుకోలేకపోతున్నాడు. వరుసగా డిఫరెంట్ మూవీస్ చేస్తూ వస్తున్న జూనియర్, ఈ సారి ప్రయోగాలను పక్కన పెట్టి పక్కా మాస్ కమర్షియల్ సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడు. అందుకు తగ్గ కథా కథనాలతో మాస్ కథలను పర్ఫెక్ట్గా డీల్ చేసే దర్శకుడి కోసం ఎదురుచూస్తున్నాడు. ఇప్పటికే త్రివిక్రమ్ శ్రీనివాస్, వివి వినాయక్, అనీల్ రావిపూడి లాంటి దర్శకుల పేర్లు వినిపించగా తాజాగా మరో ఆసక్తికరమైన పేరు వినిపిస్తోంది. తమిళనాట మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన హరి దర్శకత్వంలో ఎన్టీఆర్ తన నెక్ట్స్ సినిమా చేయబోతున్నాడట. సింగం సీరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితుడైన హరి, సింగం 3 రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ సినిమా తరువాత సామి సీక్వల్‌ను ప్లాన్ చేసిన హరి, ఎన్టీఆర్ కు కూడా ఓ కథ వినిపించాడన్న టాక్ వినిపిస్తోంది. మరి నిజంగానే తమిళ దర్శకుడితో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నాడో లేదో తెలియాలంటే మాత్రం అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
ఇంకొక్కడు సక్సెస్‌తో జోరు పెంచాడు
కొంతకాలంగా సరైన హిట్స్ లేక ఇబ్బందుల్లో ఉన్న చియాన్ విక్రమ్ ఇప్పుడు స్పీడు పెంచాడు. ఇటీవల ఇరుముగన్ సినిమాతో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన చియాన్, అదే జోరును కంటిన్యూ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అందుకే వరుసగా సినిమాలు అంగకీరిస్తూ ఫాం కొనసాగించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. ప్రస్తుతం తన నెక్ట్స్ సినిమా కోసం రెడీ అవుతున్న విక్రమ్ మరో రెండు చిత్రాలను లైన్ లో పెట్టాడు. త్వరలో హరి దర్శకత్వంలో సామి సినిమాకు సీక్వల్ ను పట్టాలెక్కించనున్నాడు. ఈ సినిమా తరువాత తన స్వీయ దర్శకత్వంలో హాలీవుడ్ సూపర్ హిట్ సినిమా డోంట్ బ్రీత్ ను రీమేక్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడు. ఈ రెండు సినిమాలు లైన్ లో ఉండగానే స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ దర్శకత్వంలో మరో సినిమాను అంగీకరించాడు. రొమాంటిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ సినిమా 2017లోనే రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు విక్రమ్. -
షూటింగ్ పూర్తి చేసుకున్న ఎస్ 3
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ యాక్షన్ డ్రామా సీరీస్ సింగం. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమాకు ఇప్పుడు మూడో సీక్వల్ రెడీ అవుతోంది. మరోసారి సూర్య పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. చెన్నైతో పాటు వైజాగ్. హైదరాబాద్, పలు ఫారిన్ లోకేషన్లలో భారీగా ఈ సినిమాను చిత్రీకరణ జరిపారు. తొలి రెండు భాగాల్లో హీరోయిన్ గా నటించిన అనుష్క మరోసారి సింగంతో జోడి కడుతోంది. మరో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. గత చిత్రాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ఈ సినిమాకు మాత్రం హారీష్ జయరాజ్ ను తీసుకున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా తొలి టీజర్ రిలీజ్ కానుంది. డిసెంబర్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
డిసెంబర్లో సింగం 3
దక్షిణాదిలో సీక్వల్స్గా రిలీజ్ అయిన సినిమాలు సక్సెస్ అవ్వటం చాలా అరుదు. అలాంటి అరుదైన సక్సెస్‌ను సొంతం చేసుకున్న హై టెంపో యాక్షన్ డ్రామా సింగం. సూర్య హీరోగా హరి దర్శకత్వంలో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలు తమిళ్‌తో పాటు తెలుగు లోనూ ఘనవిజయం సాధించాయి. అదే ఊపులో ఇప్పుడు సింగం 3ని తెరకెక్కించారు. త్వరలో షూటింగ్ పూర్తి చేసుకోనున్న ఈ సినిమా బిజినెస్ పరంగా కూడా సంఛలనాలు నమోదు చేస్తోంది. సూర్య సరసన మరోసారి అనుష్క హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కీలక పాత్రలో శృతిహాసన్ కనిపించనుంది. తొలి రెండు భాగాలకు సంగీతం అందించిన దేవీ శ్రీ ప్రసాద్‌కు బదులుగా మూడో భాగానికి హరీష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నాడు. తమిళ్‌తో పాటు తెలుగులోనూ భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. త్వరలోనే నిర్మాణాంతర కార్యక్రమాలను కూడా పూర్తి చేసి నవంబర్‌లో ఆడియోను డిసెంబర్ 16న సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. -
సూర్యకు విలన్‌గా మారిన టీవీ స్టార్
తన కెరీర్ లో బిగెస్ట్ హిట్స్ గా నిలిచిన సింగం, సింగం 2 సినిమాలకు ఇప్పుడు మూడో కొనసాగింపును రెడీ చేస్తున్నాడు తమిళ స్టార్ హీరో సూర్య. హరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నారు. ముఖ్యంగా స్క్రీన్‌ప్లే విషయంలో మరోసారి తన మ్యాజిక్‌ను రిపీట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు దర్శకుడు హరి. ఇక హీరోయిజాన్ని ఎలివేట్ చేయటం కోసం తన సినిమాలో విలన్ పాత్రను చాలా పవర్‌ఫుల్‌గా చూపిస్తాడు దర్శకుడు హరి. అందుకు తగ్గట్టుగా సింగం తొలి భాగంలో ప్రకాష్ రాజ్‌ను, తరువాత సింగం 2లో లండన్ నటుడు డానీ సపానీని ఎంచుకున్న హరి.. ఈ సారి సింగం 3 కోసం ఓ నార్త్ టివి స్టార్‌ను ఎంపిక చేసుకున్నాడు. ఇటీవల హిందీలో ఘన విజయం సాధించిన మహాభారత్ సీరియల్లో ధృతరాష్ట్రుడిగా నటించిన థాకూర్ అనూప్ సింగ్‌ను సూర్యకు ప్రతినాయకుడిగా సెలెక్ట్ చేశాడు. దీపావళికి రిలీజ్ కానున్న సింగం 3 తనకు వెండితెర మీద కూడా బ్రేక్ ఇస్తుందన్న నమ్మకంతో ఉన్నాడు అనూప్. గ్రీకు వీరుడి లాంటి ఫిజిక్‌తో ఆకట్టుకుంటున్న అనూప్ సింగ్, సౌత్‌తో పాటూ నార్త్‌లోనూ వెండితెర అరంగేట్రం చేయనున్నాడు. విద్యుత్ జమాల్ హీరోగా తెరకెక్కుతున్న కమాండో 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు అనూప్. -
సామి సీక్వల్లో విక్రమ్
కొంత కాలంగా ప్రయోగాత్మక చిత్రాలు మాత్రమే చేస్తూ వస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, త్వరలో ఓ మాస్ మసాలా ఎంటర్టైనర్లో నటించేందుకు రెడీ అవుతున్నాడు. గతంలో విక్రమ్ హీరోగా సామి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన హరి దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం సూర్య హీరోగా సింగం సినిమాకు రెండో సీక్వల్‌ను రూపొందిస్తున్న హరి, విక్రమ్ హీరోగా కూడా సీక్వల్నే రూపొందించే ఆలోచనలో ఉన్నాడు. ఇటీవల విక్రమ్ హీరోగా తెరకెక్కిన ఇరుముగన్ సినిమా ఆడియో ఫంక్షన్లో పాల్గొన్న డైరెక్టర్ హరి, త్వరలోనే విక్రమ్‌తో సినిమా చేయనున్నట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం సింగం 3ని రూపొందిస్తున్న ఈ దర్శకుడు విక్రమ్‌తో సామి సినిమాకు సీక్వల్‌ను రూపొందిస్తానని తెలిపారు. ఈ ప్రాజెక్ట్ చాలా కాలం కిందే మొదలవ్వాల్సి ఉన్నా.. వాయిదా పడుతూ వచ్చిందని.. త్వరలోనే మొదలవుతుందని తెలిపారు. -
మస్కా!
పట్టుకోండి చూద్దాం హరి, యమునలు చిలకా గోరింకల్లా కనిపించి కనువిందు చేస్తారు. కొన్నిసార్లు మాత్రం... పాము, ముంగిసల్లా పోట్లాడుకొని చుట్టుపక్కల వాళ్లను భయపెడతారు. అందుకే వారి సంసారం చాలామందికి ఒక పజిల్లా అనిపిస్తుంటుంది. ‘వాళ్లు కలిసి ఉంటారా? కలిసి ఉన్నట్లు నటిస్తుంటారా?’ అనేది చాలామంది సందేహం. ఒక రోజు ఊరి నుంచి హరి నాన్నగారు నారాయణరావు వచ్చాడు. వారం రోజుల పాటు ఉన్నాడు. మామగారు రావడం, ఇంట్లో వారం రోజుల పాటు ఉండడం యమునకు నచ్చలేదు. అలా అని ముఖం మూడ్చుకొని కూర్చోలేదు. మామగారిని చాలా మర్యాదగా చూసుకుంది. అందుకేనేమో... నారాయణరావు వెళుతూ వెళుతూ కోడలితో అన్నాడు...‘‘నాకు కూతురు లేని లోటును తీర్చావు’’ యమున చిన్నగా నవ్వుతూ... ‘‘నా మామయ్యకు ఈ మాత్రం సేవ చేయాలేనా...’’ అంది. నారాయణరావు వెళ్లిపోయిన తరువాత ఇల్లు యుద్ధరంగంగా మారింది. ‘‘మీ ఇంట్లో వాళ్లకు సేవ చేయడానికి నన్ను పెళ్లి చేసుకున్నావా?’’ అని గట్టిగా అడిగింది యమున. ‘‘నీ బుద్ధ్ది మారదా? వచ్చిన వ్యక్తి మా నాన్నగారు... పరాయి వ్యక్తి కాదు... సొంత మామనే అవమానిస్తున్నావు. నువ్వు మనిషివా? రాక్షసివా!’’ ఆ రోజంతా తగాదా పడుతూనే ఉన్నారు భార్యాభర్తలు. ఇద్దరి మధ్య మాటలు లేవు. మరుసటి రోజు జ్వరంతో హరి ఆఫీసుకు వెళ్లలేదు. మంచంలో నిద్రపోయి దగ్గుతున్న హరి దగ్గరికి యమున వచ్చింది... ‘‘లేవండీ... హాస్పిటల్‌కు వెళదాం’’ అన్నది. ఈ మాటకు హరి చలించిపోయాడు. మరోమాట మాట్లాడకుండా భార్యతో పాటు హాస్పిటల్‌కు వెళ్లాడు. ‘‘నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గొడవ పడ్డారు. ఇప్పుడు చూడు... ఎలా నవ్వుతూ వెళుతున్నారో’’ అనుకున్నారు ఇరుగు పొరుగు. హాస్పిటల్ నుంచి బయటికి వస్తున్నప్పుడు... ‘థ్యాంక్స్’ అన్నాడు హరి. ‘‘థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయిదాన్ని చేస్తున్నావా?’’ అంది యమున. ‘‘అమ్మో... నీతో ఎలా మాట్లాడినా సమస్యే’’ అన్నాడు అభయ్ నవ్వుతూ యమున భుజం మీద చేయివేస్తూ. ‘‘రేపు ఆదివారం కదా... ఎప్పటిలాగే ఇంట్లో వంటావార్పు బంద్. యస్ఆర్నగర్లో రుచులు అనే కొత్త రెస్టారెంట్ పెట్టారు. రేపు అక్కడ భోజనం చేద్దాం’’ అంది యమున. ‘‘ఓకే’’ అని బదులిచ్చాడు హరి. ఆ తరువాత మూడు వారాల్లో... గోపి విషయంలో మాత్రం ఒకసారి తగాదా జరిగింది. గోపి, యమున కోలిగ్. గోపితో సన్నిహితంగా ఉండడం హరికి నచ్చలేదు. ‘‘అతడు నా అన్నలాంటి వాడు... ఏవేవో ఊహించుకొని మనసు పాడు చేసుకోకు’’ అని యమున వివరణ ఇవ్వడంతో తగాదా అక్కడికక్కడే ముగిసింది. ఆ తరువాత మూడు వారాలకు... ఆ రోజు ఆదివారం. యమున ఎవరినో కూరలు తరిగే కత్తితో పొడిచి చంపిందనే వార్త ఫోన్లో విని పరుగు పరుగునా పోలిస్‌స్టేషన్‌కు వెళ్లాడు హరి. ఇంట్లోకి దూరిన అగంతకున్ని ఆత్మరక్షణ కోసమే యమున హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. ‘‘అసలు ఏం జరిగింది?’’ యమునను ప్రశ్నించాడు హరి. ‘‘డోర్‌బెల్ మోగగానే మీరేమో అనుకొని తీశాను. తలకు మాస్క్ వేసుకున్న ఒక వ్యక్తి నా మీదికి రాబోయాడు. ఏం చేయాలో తోచక... చేతిలో ఉన్న కూరగాయల కత్తితో పొడిచాను...’’ అని ఏడుస్తూ చెప్పింది యమున. ‘‘ఇందులో ఏదో తిరకాసు ఉంది. మీతో కొద్దిసేపు మాట్లాడాలి’’ అని తన గదిలోకి తీసుకెళ్లి యమునను ఎంక్వైరీ చేశాడు ఇన్స్పెక్టర్ నరసింహ. ఆమె చెప్పిన విషయం విని ఇన్స్పెక్టర్ ఆశ్చర్యపోయాడు. ఇంతకీ... యమున ఇన్స్పెక్టర్తో ఏం చెప్పింది? అసలు ఇన్స్పెక్టర్ యమునను ఎందుకు అనుమానించాడు? Ans:- ‘డోరు బెల్ మోగగానే మీరేమో అనుకొని తలుపు తీశాను’ అని చెప్పింది యమున. వచ్చింది భర్తే అని తెలిసినప్పుడు చేతిలో కత్తి పట్టుకొని ఎందుకు వెళ్లింది? ప్రతి ఆదివారం ఇంట్లో వంట చేయరు. మరి కూరలు తరిగే కత్తి ఆమె చేతిలో ఎందుకు ఉన్నట్లు?..’ ఈ కారణాలతోనే యమునను అనుమానించాడు ఇన్స్పెక్టర్. భర్తను చంపడానికే యమున కత్తితో వెళ్లింది. డోర్ తీసీతీయగానే... ఎదుటి వ్యక్తి ఎవరా? అనేది కూడా ఆలోచించకుండా ఆవేశంగా అగంతుకుడిని కత్తితో పొడిచింది. -
అద్వైతం... ఆత్మజ్ఞానప్రదాయకం
మాండూక్యోపనిషత్తు హరిః ఓమ్... ఓంకార స్వరూపాన్ని, ప్రాముఖ్యాన్నీ, వివిధ దశలనూ వివరించే మాండూక్యోపనిషత్తు అధర్వణ వేదంలోనిది. కేవలం పన్నెండు మంత్రాల చిన్న ఉపనిషత్తు అయినా ప్రధానమైన పది ఉపనిషత్తులలో ప్రముఖ స్థానాన్ని పొందింది. సూత్రప్రాయంగా ఉన్న ఈ ఉపనిషత్తుకు ఆదిశంకరుల గురువైన గౌడపాదాచార్యులు వివరంగా కారికలు రాశారు. శంకరాచార్యుని అద్వైత ప్రతిపాదనలో మాండూక్యం ప్రధానపాత్ర వహించింది. ఓంకారాన్ని ‘ప్రణవం’ అంటారు. అనగా నిత్యనూతనం. అ, ఉ, మ అనే మూడు సాకారమైన అక్షర ధ్వనుల చివర వినపడే నిరాకార ధ్వనితో ఆత్మజ్ఞానాన్ని, పరబ్రహ్మతత్త్వాన్నీ మెలకువలో, కలలలో, గాఢనిద్రలో అన్ని దశలలో అందించే ఓంకారం ధ్వనితరంగాలతో ఏకాగ్రతను, శాంతినీ సాధించే శాస్త్రీయమైన నాదోపాసన. కులమతాలతో, స్త్రీపురుష భేదాలతో, వయస్సులతో సంబంధంలేని స్వచ్ఛధ్యానయోగకేంద్రం మాండూక్యం. విశ్వమంతా ఓంకారమే. భూత, వర్తమాన, భవిష్యత్తులు అంతా ఓంకారమే. మూడుకాలాలకూ, అతీతమైన స్థితి కూడా ఓంకారమే. ఓంకారమే పరబ్రహ్మ. పరమాత్మ. ఇది నాలుగు పాదాలుగా అనగా నాలుగు స్థానాల్లో ఉంటుంది. మొదటిది మెలకువగల బాహ్యప్రజ్ఞ. ఇది అగ్నిస్వరూపం. అగ్నికి ఏడు అంగాలు, పందొమ్మిది ముఖాలు ఉంటాయి. స్థూలమైన అనగా భౌతికదృష్టి కలిగి ఉంటుంది. రెండవది స్వప్నస్థానం. అంతఃప్రజ్ఞతో ఇది తేజోమయమై ఉంటుంది. ఈ తైజసరూపానికి కూడా ఏడు అంగాలు, పంతొమ్మిది ముఖాలు ఉంటాయి. ఈ తైజసమైన ఆత్మ స్వప్నావస్థలో ఏకాంతమైన మనోలోకంలో విహరిస్తూ ఉంటుంది. ఏ కోరికలూ, కలలూ లేని గాఢనిద్రను ‘సుషుప్తి’ అంటారు. ఇది మూడవ స్థానం. పరబ్రహ్మ సుషుప్తస్థితిలో, ఒకే ఒక్కడుగా, ‘ప్రజ్ఞాన ఘనుడుగా, ఆనందమయుడుగా ఆనందాన్ని అనుభవిస్తూ, మనోముఖుడై, ప్రాజ్ఞుడై ఉంటాడు. ఏష సర్వేశ్వరః ఏష సర్వజ్ఞ ఏషో తర్యామ్యేష యోనిః సర్వస్య ప్రభవాప్యయౌ హి భూతానామ్ ఇతడే సర్వేశ్వరుడు. సర్వజ్ఞుడు. అంతర్యామి. అన్నిటి పుట్టుకకు, నాశనానికి మూలకారణం ఇతడే. అద్వైతస్థానం నాలుగవది. ఇదే పరమాత్మ. అంతఃప్రజ్ఞకు, బహిఃప్రజ్ఞకు, ఉభయ ప్రజ్ఞకు అన్నిటికీ అతీతం. ప్రజ్ఞాసహితమూ కాదు. రహితమూ కాదు. కనపడదు. కదలికలు ఉండవు. పట్టుకోవడానికి దొరకదు. ఏ లక్షణాలూ ఉండవు. ఊహకు అందదు. వర్ణనాతీతం. ఏకైకం. పంచజ్ఞానేంద్రియ రహితం. శాంతం, మంగళప్రదం, అద్వైతం (రెండుకానిది) అయినది ఆత్మ. దానిని తెలుసుకోవాలి. దానికి ఓంకారమే ఆధారం. వైశ్వానర, తైజస, సుషుప్త, తురీయస్థానాల్లో ఉన్న ఆత్మలో లీనం కావడానికి మానవులకు ఆధారమైనది ఓంకారం. ఆత్మ యొక్క నాలుగుదశలూ ఓంకారంలో ఉన్నాయి. శబ్దబ్రహ్మాన్ని ఏకాగ్రతతో ఉపాసించినవాడు రసాత్మకమైన పరబ్రహ్మం అవుతాడు. ఆనంద మయుడు అవుతాడు. శబ్దరూపమైన పరబ్రహ్మమే ఓంకారం. ఓంకారంలో మూడు మాత్రలు ఉన్నాయి. (మాత్ర అంటే చిటిక వేసినంత కాలం). అవి అ, ఉ, మ్ అనే మూడుపాదాలు. అ+ఉ గుణసంధితో ఓ అవుతాయి. దానికి మకారాన్ని కలిపితే ఓమ్ అయింది. దాని చివర నామరూపరహితమైన ధ్వని నాలుగోపాదం. దానితో ఓంకారం సంపూర్ణ పరబ్రహ్మం అవుతుంది. ఓంకారంలోని మొదటిపాదం ‘అ’. ఇది జాగ్రత్ స్థానంలో ఉన్నా వైశ్వానరుని (అగ్ని) రూపం. వ్యాప్తి, ప్రథమస్థానం అనే లక్షణాలు అగ్నికీ, ‘అ’ కారానికీ సరిపోతాయి. ఇది తెలుసుకొని ఓంకారాన్ని ఆరాధించినవాడు అన్నిటినీ పొందుతాడు. సాధకులలో ప్రథముడు అవుతాడు. ప్వప్నస్థానంలో ైతె జసరూపంలో ఉన్న ఉ కారం రెండవపాదం అవుతుంది. మాత్ర ఎక్కువదనం వల్ల, రెండిటి మధ్య (అ, ఉ మ్) ఉండటం వల్ల ఉకారానికి తేజస్సుకీ పోలికలున్నాయి. ఈ విషయాన్ని తెలుసుకుని ఓంకారాన్ని ఉపాసించినవాడు నిత్యజ్ఞానియై ద్వందాలకు (సుఖదుఃఖాలు, లాభనష్టాలు, నిందాస్తుతులు మొదలైనవి) అతీతుడు అవుతాడు. అతని వంశంలో బ్రహ్మజ్ఞానం లేనివాడు పుట్టడు. సుషుప్తస్థానంలో ప్రాజ్ఞరూపంలో ‘మ’కారం మూడోపాదం అవుతుంది. కొలత కొలిచే నేర్పు, గ్రహింపగల శక్తీ ఉన్న ‘మ’కారం ప్రాజ్ఞునితో సమానం. ఇది తెలుసుకున్నవాడు దేనినైనా అంచనా వేసి తెలుసుకోగలుగుతాడు. అమాత్ర శ్చతుర్థో వ్యవహార్యాః ప్రపంచోపశమః శివోద్వైత ఏవ మోంకార ఆత్మైవ! సంవిశత్యాత్మనాత్మానంయ ఏవం వేద, య ఏవం వేద నామరూపరహితమైన నాలుగోపాదాన్ని ఎవరూ వర్ణించి చెప్పలేరు. అది వ్యవహారాలకు అందదు. జ్ఞానేంద్రియాలు ఉపశమించి శాంతించి ఉంటాయి. మంగళప్రదమూ, అద్వైతస్వరూపమూ అయిన ఓంకారాన్ని ఆత్మగా తెలుసుకున్నవాడు తానే పరబ్రహ్మమని తెలుసుకుంటాడు. ఇలా ఓంకారాన్ని గురించి నాలుగుదశలను గురించి తెలుసుకున్న వాడే నిజమైన జ్ఞాని. ఓంకారోపాసన నిరంతరమూ చేసేవానికి బ్రహ్మజ్ఞానం స్వయంగా లభిస్తుంది. ఏ గురువూ, ఏ విద్యా అవసరం లేకుండా ఓంకారధ్యానం లోనుంచి అది ఉద్భవిస్తుంది. సర్వజనులకూ అద్వైతాత్మజ్ఞానప్రదాయిని మాండూక్యోపనిషత్తు. ఓం శాంతి శ్శాంతి శ్శాంతిః - డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ -
ఈ నడక చట్టాన్ని తెచ్చేందుకు..
సత్వర న్యాయం కోసం ఓ రైతు పాదయాత్ర నెల్లూరు నుంచి ఒంగోలుకు చేరిన పాదయాత్ర తెలుగు రాష్ట్రాల సీఎంలకు విన్నవించేందుకు కంకణం ఒంగోలు టౌన్ : ‘ఉప్పు దొరకని ఊరున్నా ఫర్వాలేదు. న్యాయం దొరకని ఊరంటూ ఉండకూడదని’ ఓ యువ రైతు పాదయాత్ర ప్రారంభించారు. ‘ఈ నడక చట్టాన్ని తెచ్చేవరకు’ అనే ఫ్లెక్సీని భుజంపై మోసుకుంటూ పాదయాత్ర చేపట్టారు. నెల్లూరు జిల్లా కోట మండలం చిట్టేడు గ్రామానికి చెందిన ఎన్.శ్రీహరి అనే యువ రైతు సత్వర న్యాయం కోసం ఐదు రోజుల క్రితం తన గ్రామం నుంచి బయలుదేరాడు. ముందుగా విజయవాడ చేరుకుని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలవాలని, ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావును కలిసి సత్వర న్యాయం జరిగేందుకు చర్యలు తీసుకోవాలని విన్నవించుకోవాలని నిర్ణయించాడు. అందులో భాగంగా చేపట్టిన పాదయాత్ర బుధవారం ఒంగోలులోని ప్రకాశం భవనం వద్దకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. గ్రామాల నుంచి నగరాల వరకు రోజూ ఎక్కడో ఒకచోట ఏదో ఒకవిధంగా గొడవలు జరగడం, అవి ఘర్షణలకు దారితీయడం, చివరకు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోందన్నారు. ఆస్తి తగాదాలు, అక్రమ సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు, భూముల గొడవలు.. ఇలా సంఘటనలు ఏమైనా సత్వర న్యాయం లేకపోవడం వల్ల అనర్థాలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో చిన్న గొడవ జరిగినా, పెద్ద గొడవ జరిగినా రచ్చబండకు తీసుకువచ్చి సత్వర న్యాయం జరిగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనిపించడం లేదన్నారు. ఎలాంటి సంఘటన అయినా నెలలు, సంవత్సరాలు పడుతోందన్నారు. సత్వర న్యాయం జరగాలంటే ప్రతి గ్రామంలో న్యాయం సమీక్షించేవిధంగా ఒక కమిటీ ఉండాలని సూచించారు. ప్రజలు ఎన్నుకున్న న్యాయ కమిటీ ఎప్పటికప్పుడు తమ గ్రామాల్లో సమస్యలపై చర్చించి సత్వర న్యాయం అందించేలా చూడాలన్నారు. న్యాయ సమీక్ష చేసే సమయంలో దానిని వీడియో రికార్డింగ్ చేయాలన్నారు. న్యాయ కమిటీ తప్పు చేస్తే అందులో ఉండేవారిని శిక్షించేందుకు వెనుకాడరాదన్నారు. ఈ న్యాయ కమిటీలో విద్యావంతులను నియమించి నిర్ణీత కాలవ్యవధి ఉండేలా చూడాలన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతోపాటు జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ను కలిసి ఈ విషయాలను విన్నవించనున్నట్లు శ్రీహరి చెప్పారు. -
మూడోసారి 'సింగం' వేట మొదలైంది
తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకున్న... హీరో సూర్య కెరీర్ లో బిగెస్ట్ హిట్ సింగం. ఇప్పటికే రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా తెలుగు, తమిళ భాషలతో పాటు హిందీలోనూ రీమేక్ అయి సూపర్ హిట్ అయ్యింది. దీంతో ఇప్పుడు ఈ సినిమాకు మూడో కొనసాగింపును తెరకెక్కిస్తున్నారు చిత్రయూనిట్. సౌత్ ఇండస్ట్రీలో సీక్వల్ సినిమాలు ఆడవనే అపవాదును చెరిపేస్తూ సూపర్ హిట్ అయిన సింగం.., పార్ట్ 3 పై భారీ అంచనాలు ఏర్పాడ్డాయి. మరోసారి సూర్యను పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా చూపించడానికి రెడీ అవుతున్నాడు దర్శకుడు హరి. తొలి రెండు భాగాల్లో సూర్య సరసన హీరోయిన్గా నటించిన అనుష్క మరోసారి సింగంతో జతకడుతోంది. శృతిహాసన్ మరో ఇంపార్టెంట్ రోల్లో నటిస్తోంది. డిసెంబర్లోనే ఈ సినిమా షూటింగ్ మొదలు కావాల్సి ఉన్నా.., చెన్నైలో వరదల కారణంగా వాయిదా పడింది. దీంతో గురువారం ఈ సినిమా షూటింగ్ మొదలవుతున్నట్టుగా తన ట్విట్టర్లో తెలిపాడు హీరో సూర్య. షూటింగ్ మొదలైన రోజే సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లను కూడా రిలీజ్ చేశారు. Thank you all for the wishes #S3 starts today..!! -
దేశం కోసం గ్రీన్ కార్డును రద్దు చేసుకున్నాడు..
మంచి చదువు, ఉద్యోగాల కోసం ఫారెన్ కంట్రీస్ కు వెళ్ళి.. అక్కడే గ్రీన్ కార్డును సంపాదించి స్థిరపడిపోయిన వాళ్ళ గురించి విన్నాం... కొన్నాళ్ళ తర్వాత సంపాదించిన దానికి సంతృప్తితో స్వదేశానికి తిరిగి వచ్చి.. దేశంలోని పేదలకు, అనాధలకు చేయూతనందించేవారినీ చూస్తుంటాం.... ఏకంగా మాతృభూమి కోసం తన స్టేటస్ ను, పౌరసత్వాన్ని వదులుకొని ఇండియాకు వచ్చేశాడో ఎన్నారై. తనకు వచ్చిన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించాడు. మళ్ళీ కొత్త జీవితంలోకి అడుగు పెట్టేందుకు కావలసిన విద్యను కూడా అభ్యసించి... మానవత్వాన్ని చాటుతూ భారతదేశాన్ని విపత్తు స్థితి స్థాపకంగా చేయడమే ధ్యేయంగా తనవంతు సాయం అందించేందుకు నడుం బిగించాడు. అమెరికాలోని ఇంటర్నేషనల్ హోటల్ చైన్ జనరల్ మేనేజర్ గా పూర్తిస్థాయి వృత్తిని, పౌరసత్వాన్ని వదిలి ఇండియాకు వచ్చేసిన హరి బాలాజీ.. సెప్టెంబర్ 11, 2001 న్యూయార్క్ ఉదంతం సమయంలో జూరిచ్ ఫ్లైట్ లో ప్రయాణం చేస్తున్నాడు. వరల్డ్ ట్రేడ్ సెంటర్ లోకి రెండు జెట్ లైనర్స్ దూసుకెళ్ళిన ఘటనలో దాదాపు మూడు వేలమంది మృతి చెందగా... ఆమెరికా నడిబొడ్డున టెర్రరిస్టుల దాడితో అల్లకల్లోలం అలుముకుంది. అదేరోజు జురిచ్ నుంచి అట్లాంటా బయల్దేరిన హరి ప్రయాణిస్తున్నవిమానం ఉన్నట్టుండి దారి మళ్ళించారు. ప్రయాణీకులెవరికీ ఏం జరిగిందో తెలియలేదు. చివరికి జురిచ్ లోని హోటల్ రూమ్ కు చేరిన హరికి... వరల్డ్ ట్రేడ్ సెంటర్ అటాక్ గురించి తెలిసింది. మానవ నిర్మిత విపత్తుపై స్వానుభవమైంది. ఆతర్వాత న్యూయార్క్ మేయర్ గిలియానీ గెట్ మోటివేటెడ్ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు హరిని ప్రేరేపించాయి. దీంతో విపత్తు సంసిద్ధత గురించి వాస్తవాలను అధ్యయనం చేసేందుకు హరి ఆకర్షితుడయ్యారు. ఇండియాలోని చెన్నైకి చెందిన హరి బాలాజీ... స్విజ్జర్లాండ్ లోని స్విస్ హోటల్ మేనేజ్ మెంట్ లో చదివి, భారత్, స్విజ్జర్లాండ్, కువైట్ సంయుక్త ప్రముఖ బ్రాండ్లకు అనేక నిర్వహణ హోదాల్లో పనిచేశాడు. లూసియానాలో ఉన్నప్పుడు సహజ విపత్తు అయిన హరికేన్ ను కళ్ళారా చూసి, తీవ్రంగా స్పందించాడు. ఇలా సునామీ వంటి పలు ప్రకృతి బీభత్సాలను చూసిన హరి... డిజాస్టర్ మేనేజ్ మెంట్ పై స్వంత దేశంలో శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించుకున్నాడు. కుటుంబ సభ్యుల మద్దతుతో గ్రీన్ కార్డ్ రద్దు చేసుకున్నాడు. భారతదేశానికి పూర్తిగా తరలివచ్చాడు. తిరిగి వచ్చిన తర్వాత హరి ఆరోగ్య సంప్రదాయ విద్యను చెన్నై శ్రీ రామచంద్ర విశ్వవిద్యాలయంలో పూర్తి చేశాడు. హాస్పిటల్ అండ్ హెల్త్ సిస్టమ్స్ మేనేజ్ మెంట్ లో ఎంబిఎ చేశాడు. కోర్సులో భాగంగా చెన్నై, బెంగళూరు ప్రాంతాల్లోని ప్రధాన ఆసుపత్రుల్లో విపత్తుల అంచనాపై అధ్యయనం చేశాడు. చెన్నై ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ లో ఓ కార్యనిర్వాహక కమిటీ సభ్యుడుగా పనిచేశాడు. పలు ప్రత్యేక ప్రాజెక్టులను నిర్వహిస్తూ విపత్తు నిర్వహణలో స్వతంత్ర కార్ఖానాలు నిర్వహించడం ప్రారంభించాడు. అగ్ని ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు సమయాల్లో వ్యూహాలపై తాను నిర్వహిస్తున్న కార్ఖానాల్లో దృష్టి పెట్టారు. భౌతిక నష్టాన్నే కాక, మానసికంగా కూడ వారికి ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకు కావలసిన శిక్షణ ఇవ్వడంపై అవగాహన కల్పించాడు. ఒక్క విపత్తులపైనే కాక హరి బాలాజీ... మానవత్వాన్ని చాటుతూ పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అక్రమ రవాణాకు గురౌతున్న మహిళలు, బాలికలకు అవగాహన కల్పించడం, వివక్షను నిర్మూలించే ప్రయత్నాలతో పాటు... విపత్తు సమాయాల్లో ఎదుర్కొనే పలు సమస్యలపై దృష్టి సారిస్తూ... అడుగు ముందుకేస్తున్నాడు. పలు పాఠశాలల్లో విద్యార్థులకు విపత్తులపై అవగాహన కల్పించేందుకు ఇన్సెంటివిటి తరగతులను కూడ నిర్వహిస్తున్నారు. విపత్తు నిర్వహణలో ప్రపంచంలోనే భారత్ ముందుండేందుకు కృషి చేస్తూ... ప్రత్యేక కార్యక్రమాలతో ఉత్సాహంగా దూసుకుపోతున్నాడు. -
సూర్య సినిమాకు నో చెప్పాడు
కోలవరి పాటతో ఒక్కసారిగా నేషనల్ లెవల్లో క్రేజ్ సొంతం చేసుకున్న యువ సంగీత దర్శకుడు అనిరుధ్. ఈ యంగ్ మ్యూజిషియన్ ప్రస్తుతం సౌత్‌లో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అందుకే సౌత్ ఇండియన్ టాప్ హీరోలు కూడా అనిరుధ్ పాటలకు స్టెప్పులేయాలని ఎదురుచూస్తున్నారు. అయితే ఎంత బిజీగా ఉన్న మ్యూజిషియన్ అయినా సూర్య లాంటి టాప్ హీరో సినిమాకు ఛాన్స్ వస్తే కాదనరు. కానీ అనిరుధ్ మాత్రం ఆ సాహసం చేశాడు. సూర్య, హరి కాంబినేషన్లో తెరకెక్కిన సింగం, సింగం 2 సినిమాలకు సీక్వెల్‌గా సింగం-3 సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే తొలి రెండు భాగాలకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా మూడో భాగానికి మాత్రం అనిరుధ్‌తో మ్యూజిక్ చేయించాలని భావించారట చిత్రయూనిట్. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న అనిరుధ్, సింగం 3 సినిమాకు మ్యూజిక్ ఇవ్వలేనంటూ రిజెక్ట్ చేసేశాడు. దీంతో మరోసారి దేవీ శ్రీ నే సింగంకు సంగీతం అందించే ఛాన్స్ ఉందంటున్నారు. సూర్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ డైరెక్షన్లో '24' సినిమాలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తరువాత నవంబర్ 15 నుంచి సింగం 3 షూటింగ్ ప్రారంభించనున్నారు. -
అరుదైన రికార్డ్ క్రియేట్చేయనున్న సూర్య
-
దెయ్యం ఉందా?
ఆ నలుగురు యువకులు దెయ్యం ఉందా? లేదా? అని వాదించుకుంటారు. నలుగురిలో ఒకడు దెయ్యం లేదంటాడు. ఒకవేళ ఉందని నిరూపిస్తే తన ఆస్తిలో సగం రాసిస్తానని మిగతా ముగ్గురికీ సవాల్ విసురుతాడు. ఇంతకూ దెయ్యం ఉందా..? లేదా అనే కథాంశంతో సాగే చిత్రం ‘అమ్మో’. ఇ.ఆర్.వి లోకనాథన్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి హరి, హరీశ్ దర్శకులు. నిర్మాత మాట్లాడుతూ -‘‘ప్రతి సన్నివేశం ప్రేక్షకులను ఉత్కంఠకు గురి చేసేలా ఉంటుంది. త్వరలోనే చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బి. నాగరాజన్. -
రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య
వైఎస్సార్ జిల్లా: వైఎస్సార్ జిల్లాలో విషాదం నెలకొంది. రైలు కిందపడి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. వారిద్దరూ చిన్న మండ్యం మండలం తాళ్లవాండ్లపల్లికి చెందిన హరి దంపతులుగా గుర్తించారు. అయితే ఈ ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసుకున్నారు. -
సేలంలో 'అనంత' యువతిపై అత్యాచారం
అనంతపురం : అనంతపురం జిల్లాకు చెందిన యువతిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు కేరళ యువకుడిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే జిల్లాలో బెలుగుప్ప మండలం కలుపల్లికి చెందిన ఏడుగురు యువతులు కోయంబత్తూరులోని ఓ ప్రయివేట్ వస్త్ర కర్మాగారంలో పని చేస్తున్నారు. కలుపల్లిలో జరిగే తిరునాళ్లకు వారిని తీసుకు వెళ్లేందుకు యువతుల బంధువులు వచ్చారు. వారు కోయంబత్తూరు నుంచి బెంగళూరు వెళ్లి, అక్కడ నుంచి అనంతపురం రావటానికి ఏర్పాట్లు చేసుకున్నారు. వీరంతా శనివారం రాత్రి కన్యాకుమారి నుంచి బెంగళూరు వెళ్లే ఐల్యాండ్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఎక్కారు. రైలు రాత్రి రెండు గంటల సమయంలో సేలం రైల్వేస్టేషన్‌కు అయిదు కిలోమీటర్ల ముందు ఉన్న సిగ్నల్ వద్ద ఆగింది. ఆ సమయంలో ఏడుగురిలో ఓ యువతికి చెందిన పర్సు రైల్లో నుంచి కిందపడిపోయింది. దీంతో ఆమె కిందకు దిగగా, వెంటనే రైలు కదిలిపోయింది. కాగా అదే రైల్లో పక్క బోగీలో ప్రయాణిస్తున్న కేరళకు చెందిన హరి ....యువతి దిగటం చూసి అతడు కిందకు దిగాడు. రైలు వెళ్లిపోవటంతో ఒంటరిగా ఉన్న యువతిని పక్కనే ఉన్న పొదల్లోకి లాక్కెళ్లి ఆమెపై అత్యాచారం చేశాడు. అనంతరం ఈ ఘటనపై బాధితురాలు గేట్ కీపర్‌కు ఫిర్యాదు చేసింది. సూరమంగళం రైల్వే పోలీసులు హరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
కవ్వింత: కోతి పిల్లాడు
కోతిని భుజాన ఎక్కించుకుని రోడ్డు మీద నడుస్తున్నాడు హరి. ట్రాఫిక్ పోలీస్ చూసి, ‘‘ఏయ్, నీ పేరేమిటి? ఆ కోతిని జూకు తీసుకెళ్లు’’ అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్టుగా. ‘‘సరే సార్’’ వినయంగా జవాబిచ్చాడు హరి. తెల్లారి, మళ్లీ అదే రోడ్డుమీద, అదే కోతిని భుజాన ఎక్కించుకుని వెళ్తున్నాడు హరి. మళ్లీ పోలీసు చూశాడు. ఆయనకు చిర్రెత్తుకొచ్చింది. ‘‘ఏయ్, నీకు నిన్న దీన్ని జూకు తీసుకెళ్లమని చెప్పానా లేదా?’’ కోపంగా అన్నాడు. ‘‘మీరు చెప్పినట్టే నిన్న జూకే తీసుకెళ్లాన్ సార్. ఇవ్వాళ సినిమాకు తీసుకెళ్తున్నా’’ వినయంగా బదులిచ్చాడు హరి. అంకెలు కనబడుటలేదు! పిల్లలతో కాలిక్యులేటర్ ప్రాక్టీస్ చేయిస్తూ, ఉదాహరణ కోసం 10+5 కూడమంది టీచర్. ఒక్క వెంగళప్ప తప్ప అందరూ చేశారు. ‘‘ఏం, నువ్వెందుకు చేయలేదు?’’ ప్రశ్నించింది టీచర్. ‘‘నాకు 10 ఎక్కడుందో కనబడట్లేదు మేడమ్’’ జవాబిచ్చాడు వెంగళప్ప. కిందివీ మెట్లే! ‘‘యాభై అడుగుల నిచ్చెన మీదినుంచి కింద పడ్డాను తెలుసా?’’ చెప్పింది బుజ్జి. ‘‘అయ్యో, దెబ్బలేమీ తగల్లేదుకదా!’’ అడిగాడు చంటి. ‘‘లేదు, మొదటి మెట్టునుంచి పడ్డాను’’ అంది బుజ్జి. -
విజయ్‌తో పోటీనా?
నటుడిగా, నిర్మాతగా వరుస విజయాలతో దూసుకుపోతున్నారు విశాల్ . తాజాగా హరి దర్శకత్వంలో సొంతంగా నిర్మించి, కథా నాయకుడిగా నటించిన చిత్రం పూజై. శ్రుతి హాసన్ కథానాయికిగా నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా విడుదలై ప్రేక్షకాదరణ పొందుతోంది. చిత్ర విజయ యాత్రలో భాగం గా విశాల్ తిరుచ్చిలో విలేకరులతో మాట్లాడు తూ తాను నటించి, నిర్మించిన పూజై చిత్రాన్ని విజయవంతం చేసిన అభిమానులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కృతజ్ఞతలు చెప్ప డం ఇష్టం లేక ప్రత్యక్షంగా కలవడానికి వచ్చానన్నారు. పూజై సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రం అన్నారు. అలాగే అన్ని వర్గా ల వారు చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. మరోసారి హరి దర్శకత్వంలో నటించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానన్నారు. చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదు చరిత్రాత్మక చిత్రాలపై ఆసక్తి లేదని విశా ల్ పేర్కొన్నారు. తనకు సాధారణ చిత్రాల్లోని సంభాషణలు పలకడానికే కష్టం. అలాం టిది చారిత్రక చిత్రాల్లోని సంభాషణలు పల కడం మరింత కష్టం అన్నారు. అదే విధంగా పంచ్ డైలాగ్స్ చెప్పడానికి ఇష్టపడ్డానన్నారు. అందువలనే చారిత్రక కథా చిత్రాలు చేయాలనే ఆసక్తి లేదని స్పష్టం చేశారు. పూజై, కత్తి చిత్రాలు ఒకేసారి తెరపైకి రావడంతో నటుడు విజయ్‌తో ఢీ కొంటున్నట్టు ప్రచారం జరుగుతోందన్నారు. నిజం చెప్పాలంటే తాను విజ య్‌తో పోటీ పడటం లేదని అన్నారు. పూజై చిత్రం ప్రారంభం ముందే దీపావళికి విడుదల చే యాలని నిర్ణయించామన్నారు. విజయ్ కత్తి చిత్రం కూడా అదే సమయంలో విడుదలవుతుందన్న విషయం తనకు తెలియదని చెప్పారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందేనని విశాల్ వివరించారు. -
హరితో తప్పకుండా మళ్లీ సినిమా చేస్తా
‘‘కొన్ని సినిమాలు ‘ఏ’ క్లాస్‌ల్లో బాగా ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు బి, సీల్లో బాగా ఆడతాయి. కానీ... మా ‘పూజ’ అన్ని క్లాసుల్లో బాగా ఆడుతోంది. ఎక్కువ థియేటర్లలో నా సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం’’ అని విశాల్ అన్నారు. హరి దర్శకత్వంలో విశాల్ నటించి, నిర్మించిన తమిళ చిత్రం‘పూజై’. ఈ సినిమా ‘పూజ’ పేరుతో గురువారం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో విశాల్ మాట్లాడారు. ‘‘హరితో ఏడేళ్ల క్రితం ‘భరణి’ చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం చిక్కింది. ఇద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నప్పుడే కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే కథ కావాలని తనతో చెప్పాను. అనుకున్నట్టే అందరికీ నచ్చే కథ తయారు చేశాడు. ఇప్పుడు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయని అనుకున్నానో అవన్నీ హైలైట్ అవ్వడం ఆనందంగా ఉంది. రాధిక, సత్యరాజు కాంబినేషన్ సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హరితో తప్పకుండా మళ్లీ ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. విశాల్ మంచి నటుడే కాక మంచి నిర్మాత కూడా అనీ, యాక్షన్ సీన్స్ బాగా రక్తి కట్టించారనీ హరి ప్రశంసించారు. -
ఎంజాయ్ చేస్తారు
‘‘నేను ‘కొత్త జంట’ సినిమా చేస్తున్నప్పుడు హరి ఈ చిత్రకథ చెప్పారు. అప్పుడు కొన్ని సలహాలిచ్చాను. హరి ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ‘మనసంతా నువ్వే’ ఎలాంటి అనుభూతికి గురి చేసిందో, ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు అలాంటి మంచి అనుభూతినే మిగులుస్తుంది’’ అని దర్శకుడు మారుతి అన్నారు. ఆయన సమర్పణలో మహేంద్రబాబు .బి, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘లవర్స్’. సుమంత్ అశ్విన్, నందిత, షామిలి ముఖ్య తారలుగా హరి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి జేబీ పాటలు స్వరపరిచారు. ఆడియో విజయం సాధించిన నేపథ్యంలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుకను హైదరాబాద్‌లో జరిపారు. ఈ వేడుకలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వీవీ వినాయక్, బోయపాటి శ్రీనివాస్, దశరథ్, బెల్లంకొండ సురేష్ తదితరులు చిత్రం విజయం సాధించాలనే ఆకాంక్షను వెలిబుచ్చారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ -‘‘ఈ మధ్యకాలంలో వారం గ్యాప్‌లో అల్లుడు శీను, రన్ రాజా రన్, గీతాంజలి చిత్రాలు విడుదల చేశాను. అవి విజయం సాధించాయి. ఇప్పుడు నైజాంలో విడుదల చేయనున్న ఈ ‘లవర్స్’ కూడా ఘనవిజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఎంజాయ్ చేస్తూ ఈ చిత్రంలో నటించాననీ, ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తారని సుమంత్ అశ్విన్ అన్నారు. ఈ వేడుకలో చిత్రబృందం పాల్గొన్నారు. -
లవర్స్ మూవీ ఆడియో లాంచ్
-
ముక్కిపోయిన రేషన్ బియ్యం
తిరువూరు : తిరువూరు రాజుపేటలోని ఒక రైస్‌మిల్లులో అక్రమంగా నిల్వచేసిన రేషన్‌బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న పౌరసరఫరాల అధికారులు తదుపరి వాటి గురించి పట్టించుకోకపోవడంతో ముక్కిపోయి పనికిరాకుండా పోయాయి. 2012 జనవరిలో తిరువూరు ఎంఎల్ఎస్ పాయింటుకు చేరాల్సిన రేషన్‌బియ్యం బస్తాల లోడును నల్లబజారుకు తరలించడంలో భాగంగా రాజుపేట మిల్లులో నిల్వచేశారు. రేషన్‌బియ్యంతోపాటు స్వాధీనం చేసుకున్న మిల్లులో అనధికారికంగా ఉంచిన సాంబమసూరి బియ్యం మాత్రం పౌరసరఫరాల అధికారులు వేలం వేసి పాడుకున్న వ్యక్తికి అప్పగించారు. రేషన్‌బియ్యాన్ని కనీసం ఎంఎల్ఎస్ పాయింటుకు తరలించకపోవడం, గత ఏడాదిన్నర కాలంగా మిల్లులో ఉన్న బియ్యం పరిస్థితిని పట్టించుకోకపోవడంతో పురుగులుపట్టి ముక్కిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. శుక్రవారం పౌరసరఫరాల విభాగం అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ వెంకటేశ్వర్లు, ఎకౌంట్స్ అసిస్టెంట్ మేనేజర్ భరద్వాజ ఈ బియ్యాన్ని పరిశీలించారు. రైస్‌మిల్లు యజమాని హరి తమ మిల్లునుంచి ఈ బియ్యం బస్తాలను తొలగించాలని పలుమార్లు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో తిరువూరు తహశీల్దారు బాలకృష్ణారెడ్డిని పీడీఎస్ అధికారులు సంప్రదించారు. నిబంధనల పేరుతో కాలయాపన చేసిన అధికారులు రేషన్‌బియ్యాన్ని వృథా చేశారని పలువురు విమర్శిస్తున్నారు.