హరితో తప్పకుండా మళ్లీ సినిమా చేస్తా | Vishal & Hari are together again | Sakshi
Sakshi News home page

హరితో తప్పకుండా మళ్లీ సినిమా చేస్తా

Oct 24 2014 11:11 PM | Updated on Sep 2 2017 3:19 PM

హరితో తప్పకుండా మళ్లీ సినిమా చేస్తా

హరితో తప్పకుండా మళ్లీ సినిమా చేస్తా

కొన్ని సినిమాలు ‘ఏ’ క్లాస్‌ల్లో బాగా ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు బి, సీల్లో బాగా ఆడతాయి. కానీ... మా ‘పూజ’ అన్ని క్లాసుల్లో బాగా ఆడుతోంది. ఎక్కువ థియేటర్లలో నా సినిమా విడుదల కావడం

‘‘కొన్ని సినిమాలు ‘ఏ’ క్లాస్‌ల్లో బాగా ఆడతాయి. ఇంకొన్ని సినిమాలు బి, సీల్లో బాగా ఆడతాయి. కానీ... మా ‘పూజ’ అన్ని క్లాసుల్లో బాగా ఆడుతోంది. ఎక్కువ థియేటర్లలో నా సినిమా విడుదల కావడం ఇదే ప్రథమం’’ అని విశాల్ అన్నారు. హరి దర్శకత్వంలో విశాల్ నటించి, నిర్మించిన తమిళ చిత్రం‘పూజై’. ఈ సినిమా ‘పూజ’ పేరుతో గురువారం తెలుగులో విడుదలైంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో విశాల్ మాట్లాడారు. ‘‘హరితో ఏడేళ్ల క్రితం ‘భరణి’ చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం చిక్కింది.

ఇద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నప్పుడే కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే కథ కావాలని తనతో చెప్పాను. అనుకున్నట్టే అందరికీ నచ్చే కథ తయారు చేశాడు. ఇప్పుడు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయని అనుకున్నానో అవన్నీ హైలైట్ అవ్వడం ఆనందంగా ఉంది. రాధిక, సత్యరాజు కాంబినేషన్ సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హరితో తప్పకుండా మళ్లీ ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. విశాల్ మంచి నటుడే కాక మంచి నిర్మాత కూడా అనీ,  యాక్షన్ సీన్స్ బాగా రక్తి కట్టించారనీ హరి ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement