రత్నం రెడీ | Vishal Rathnam Movie Release Date Locked | Sakshi
Sakshi News home page

రత్నం రెడీ

Published Fri, Jan 26 2024 4:10 AM | Last Updated on Fri, Jan 26 2024 4:10 AM

Vishal Rathnam Movie Release Date Locked - Sakshi

వేసవిలో థియేటర్స్‌కు వస్తున్నాడు ‘రత్నం’. విశాల్‌ హీరోగా నటించిన తాజా యాక్షన్‌ ఫిల్మ్‌ ‘రత్నం’. ఈ చిత్రంలో ప్రియాభవానీ శంకర్‌ హీరోయిన్‌గా నటించారు. హరి దర్శకత్వంలో కార్తికేయన్‌ సంతానం ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్స్‌ జరగుతున్నాయి.

కాగా ఈ సినిమాను వేసవిలో ఏప్రిల్‌ 26న విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్‌ వెల్లడించింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. ‘తుప్పరివాలన్‌’ (తెలుగులో ‘డిటెక్టివ్‌’)కి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్‌ 2’ చేస్తున్నారు విశాల్‌. ఈ మూవీలో హీరోగా నటించడంతో పాటు దర్శకత్వం వహించనున్నారట విశాల్‌. ఈ ఏడాదే చిత్రీకరణ ప్రారంభించాలనుకుంటున్నారని సమాచారం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement