
కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ ప్రస్తుతం రత్నం సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. 'సింగం' సిరీస్ సినిమాలతో దర్శకుడిగా తనకంటా క్రేజ్ దక్కించుకున్న హరి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ ట్రైలర్ చూడగానే ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. ఈ చిత్రంలో ప్రియా భవానీశంకర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం హీరో విశాల్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.
మీరు పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు? అని ప్రశ్నించారు. దీనికి విశాల్ నవ్వుతూ సమాధానం చెప్పారు. ప్రభాస్ పెళ్లి అవ్వగానే తప్పకుండా చేసుకుంటానని తెలిపారు. అంతే కాకుండా ఫస్ట్ ఇన్విటేషన్ కూడా ప్రభాస్‌కే ఇస్తానని తెలిపారు. అయితే గతంలో తమిళ నిర్మాతల నడిగర్ సంఘం భవనం నిర్మాణం పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటానని వెల్లడించారు. తాజాగా మరోసారి పెళ్లి ప్రస్తావన రావడంతో విశాల్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. కాగా.. రత్నం మూవీ ఈనెల 26న థియేటర్లలో సందడి చేయనుంది. మరోవైపు ప్రభాస్ ది రాజాసాబ్ చిత్రంతో బిజీగా ఉన్నారు.
😅 #Vishal Anna during #Rathnam movie promotions 😁 " #Prabhas anna pelli ayyaka Nen kuda pelli cheskuntanu " - @VishalKOfficial pic.twitter.com/ioVpmw8fgb
— Prabhas Fan (@ivdsai) April 18, 2024