టాలీవుడ్ హీరోల్లో ఎవరి పెళ్లి కోసమైనా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారంటే అది ఆయన ఒక్కరిదే. ఇప్పటికే పలువురు టాలీవుడ్ హీరోలు వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. గతేడాదిలోనే నాగచైతన్య ఓ ఇంటివాడయ్యారు. అంతేకాకుండా ఈ ఏడాదిలోనే అఖిల్ అక్కినేని సైతం పెళ్లి చేసుకోబోతున్నారు. అలా దాదాపు మన హీరోలంతా పెళ్లిళ్లు చేసుకుని వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.
ప్రభాస్ పెళ్లి కోసం ఫ్యాన్స్ ఎదురుచూపులు..
కానీ టాలీవుడ్ ఫ్యాన్స్‌కు ఇప్పటి వరకు తీరని కోరిక ఏదైనా ఉందంటే అది మన రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి వేడుకే. ప్రభాస్ పెళ్లి కోసం ఆయన ఫ్యామిలీ కంటే.. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే టాలీవుడ్‌లో ఏదో ఒక సందర్భంలో ఈ టాపిక్ గురించి చర్చ నడుస్తూనే ఉంటుంది. అలానే తాజాగా ప్రభాస్ పెళ్లి గురించి మరోసారి చర్చ మొదలైంది.
అందుకు కారణం ప్రభాస్ బంధువుల పెళ్లిలో ఆయన ముగ్గురు చెల్లెల్లతో పాటు కృష్ణంరాజు భార్య శ్యామల దేవి కనిపించారు. పెళ్లిలో వారంతా కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియా షేర్ చేశారు. ఇంకేముంది ప్రభాస్ అన్న పెళ్లి ఎప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఇటీవల జరిగిన బంధువుల పెళ్లికి కృష్ణంరాజు భార్య శ్యామల దేవి హాజరయ్యారు. ఆమెతో పాటు ముగ్గురు కుమార్తెలు(ప్రభాస్ చెల్లెళ్లు) ప్రసీద, ప్రదీప్తి, ప్రకీర్తి కూడా ఈ పెళ్లి వేడుకలో సందడి చేశారు. అందరూ కలిసి దిగిన ఫోటోలను ప్రసీద్ ఉప్పలపాటి తన ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ఇవీ చూసిన అభిమానులు ప్రభాస్ అన్నకు త్వరగా పెళ్లి చేయండి సిస్టర్స్ అంటూ విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా.. ప్రసీద తమ నిర్మాణ సంస్థ బాధ్యతలను చూసుకుంటున్నారు. మిగిలిన ఇద్దరు సిస్టర్స్ మాత్రం సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment