
టాలీవుడ్‌లో రెబల్ స్టార్ పెళ్లి గురించి చర్చ ఇప్పటి నుంచి మొదలైంది కాదు. గత పదేళ్లుగా ఏదో ఒక సందర్భంలో ప్రభాస్ పెళ్లి ముచ్చట వినిపిస్తూనే ఉంటుంది. అలా మరోసారి ఇటీవలే ప్రభాస్ పెళ్లి లొల్లి మొదలైంది. ఓ ప్రముఖ వ్యాపారవేత్త కూతురిని ఆయన పెళ్లాడబోతున్నారని టాక్ వచ్చింది. కానీ ఈ విషయంపై ఆరా తీస్కే అదంతా ఒట్టి పుకారే తేలిపోయింది. ఈ విషయంపై ఆయన టీమ్ సైతం స్పష్టమైన సమాధానం ఇచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలేనని కొట్టిపారేసింది.
ఇక ప్రభాస్ అన్న పెళ్లి ముచ్చట వచ్చినప్పుడల్లా ఆ స్టార్ హీరోయిన్ పేరు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వీరిద్దరు జంటగా పలు సూపర్ హిట్ మూవీల్లో నటించారు. ఆమె మరెవరో కాదు.. టాలీవుడ్ అభిమానులు స్వీటీ అని పిలుచుకునే అనుష్క శెట్టి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలని ఎంతోమంది సినీ ప్రియులు ఎదురు చూస్తూనే ఉన్నారు. కానీ ఇదేది అంత ఈజీగా అయ్యే పనిలా మాత్రం కనిపించడం లేదు.
అందుకే ఓ నెటిజన్ వినూత్న ఆలోచనతో ఓ వీడియోను రూపొందించాడు. అది చూస్తే ఈ జంట ఇంత చూడముచ్చటగా ఉన్నారా? అంటూ కామెంట్స్ చేయకుండా ఉండలేరు. అంతలా ఎడిట్ చేసిన ఓ నెటిజన్ ఆ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశాడు. ఇంతకీ ఆ వీడియో ఏంటో చూసేద్దాం పదండి.
నెటిజన్ ఎడిట్ చేసిన ఫోటోలతో ప్రభాస్- అనుష్క శెట్టికి పెళ్లైనట్లు ఊహించుకుని ఓ వీడియోను రూపొందించాడు. పెళ్లి మాత్రమే కాదు.. ఈ జంటకు పిల్లలు పుడితే ఎలా ఉంటారో కూడా ఊహించి మరీ ఫోటోలు ఎడిట్ చేసిన తీరు అభిమానులను ఆకట్టుకుంటోంది. అలా ఎడిట్ చేసిన ఫోటోలు చూస్తే ప్రభాస్- అనుష్క జోడీ టాలీవుడ్‌లో సూపర్ హిట్‌గా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోలు మీరు కూడా చూసి ఊహల్లో విహరించండి.
Entraa idi entha realistic ga undi 🫠 pic.twitter.com/7JG14Sf4kC
— x_tweet's 🌅 (@MididoddiSai1) March 31, 2025