anushka setty
-
హీరోలతో పోటీ పడుతున్న సూపర్ లేడీస్.. ఇప్పుడిదే ట్రెండ్
సినిమాని జనరల్‌గా మేల్ లీడ్ చేస్తుంటారు. ఫిమేల్ లీడ్ చేయడం తక్కువ. అయితే ఈ మధ్య కాలంలో లేడీస్ లీడ్ చేసే సినిమాలు ఎక్కువయ్యాయి. ఒకవైపు హీరోల సరసన రెగ్యులర్ చిత్రాల్లో నటించడంతో అటు హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు చేస్తున్నారు కొందరు కథానాయికలు. స్టోరీని లీడ్ చేస్తున్న ఆ లీడ్ లేడీస్ గురించి తెలుసుకుందాం. ప్రతీకారం కేసు పెడదామంటే..‘అరుంధతి, రుద్రమదేవి, భాగమతి, నిశ్శబ్దం’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ చేసిన అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటీ’. ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సినిమా తర్వాత అనుష్క తెలుగులో కమిటైన చిత్రమిది. ఈ మూవీకి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. వీరి కాంబినేషన్లో వచ్చిన ‘వేదం’ (2010) మంచి హిట్‌గా నిలిచింది. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ‘ఘాటీ’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారట క్రిష్. బిజినెస్ ఉమన్‌గా ఎదుగుతున్న ఓ మహిళను కొందరు కావాలని టార్గెట్ చేస్తారు. వ్యాపారంలో నష్టాలపాలైన ఆ మహిళ అందుకు కారకులైన వారిపై ప్రతీకారం తీర్చుకోవాలనుకునే కథాంశంతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారట. ఆంధ్రా– ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోంది. శివశక్తిగా... తమన్నా లీడ్ రోల్లో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓదెల 2’. 2021లో విడుదలై, హిట్‌గా నిలిచిన ‘ఓదెల రైల్వేస్టేషన్ ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఓదెల 2’ రూపొందుతోంది. తొలి భాగాన్ని తెరకెక్కించిన అశోక్ తేజయే రెండో భాగానికి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్‌పై డి. మధు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో తన కెరీర్లో తొలిసారిగా శివశక్తి (నాగ సాధు) పాత్రలో నటిస్తున్నారు తమన్నా. ఇప్పటికే విడుదలైన ఆమె ఫస్ట్ లుక్, పోస్టర్‌కి అనూహ్యమైన స్పందన వచ్చింది. సూపర్ నేచురల్ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ‘ఓదెల 2’ ఫైనల్ షెడ్యూల్ ఓదెల గ్రామంలోని ఓదెల మల్లన్న క్షేత్రంలో జరుగుతోంది. తన దర్శకత్వంలో వచ్చిన ‘రచ్చ’ సినిమాలో హీరోయిన్గా తమన్నాకి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ సంపత్ నంది ‘ఓదెల 2’లో లీడ్ రోల్ చేసే చాన్స్ ఇచ్చారు. ఈ మూవీలో హెబ్బా పటేల్, వశిష్ఠ ఎన్. సింహా, మురళీ శర్మ, నాగమహేశ్, గగన్ విహారి వంటివారు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. బంగారు బొమ్మ ‘యశోద, శాకుంతలం’ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాల తర్వాత సమంత నటించనున్న తాజా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘మా ఇంటి బంగారం’. తన బర్త్ డే (ఏప్రిల్ 28న) సందర్భంగా ఈ సినిమాని ప్రకటించారు సమంత. తన సొంత డైరెక్షన్ బ్యానర్ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మించనున్నట్లు ఆమె ప్రకటించడం విశేషం. తెలుగులో ‘ఖుషి’ సినిమా తర్వాత ఆమె అంగీకరించిన చిత్రం ఇదే. అయితే ఈ సినిమాకి దర్శకుడు ఎవరు? అనే విషయాన్ని ప్రకటించలేదు. ఇప్పటిదాకా నటిగా మంచి విజయాలను అందుకున్న సమంత ఇప్పుడు నిర్మాతగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ సినిమా డైరెక్టర్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. డబుల్ ధమాకా హీరోయిన్ రష్మికా మందన్నా ఒకేసారి రెండు లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో నటిస్తున్నారు. ఓ వైపు ‘పుష్ప 2: ది రూల్’, ‘కుబేర’, ‘సికందర్’, ‘ఛావా’, వంటి క్రేజీ ప్రాజెక్టుల్లో అల్లు అర్జున్, ధనుష్, సల్మాన్ ఖాన్, విక్కీ కౌశల్ వంటి హీరోలకి జోడీగా నటిస్తూ దూసుకెళుతున్న ఈ బ్యూటీ మరోవైపు ‘రెయిన్బో’, ‘ది గాళ్ ఫ్రెండ్’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేస్తున్నారు. శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్న ‘రెయిన్బో’లో రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌పై ఎస్ఆర్. ప్రకాశ్‌బాబు, ఎస్ఆర్. ప్రభు నిర్మిస్తున్నారు. అదేవిధంగా ‘చిలసౌ’ (2018) సినిమాతో దర్శకుడిగా మారిన నటుడు రాహుల్ రవీంద్రన్ కొంచెం గ్యాప్ తర్వాత తెరకెక్కిస్తున్న సినిమా ‘ది గాళ్ ఫ్రెండ్’. ఈ మూవీలోనూ రష్మికా మందన్నా లీడ్ రోల్ చేస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్న ఈ సినిమాలో రష్మిక కళాశాల విద్యార్థి పాత్ర చేస్తున్నారని సమాచారం. ఓ కాలేజ్ స్టూడెంట్ ప్రేమ, సంఘర్షణ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని టాక్. ఈ మూవీలో కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, అనూ ఇమ్మాన్యుయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. మహిళల పరదా పక్కింటి అమ్మాయి, హోమ్లీ గర్ల్ ఇమేజ్ ఉన్న అనుపమ పరమేశ్వరన్ ‘రౌడీ బాయ్స్, టిల్లు స్క్వేర్’ సినిమాలతో రూట్ మార్చారు. గ్లామరస్‌గా కనిపించడంతో పాటు ముద్దు సీన్స్‌లోనూ నటించి ఆశ్చర్యపరిచారు. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా తెలుగు చిత్రం ‘పరదా’. ‘ఇన్ ద నేమ్ ఆఫ్ లవ్’ అనేది ఉపశీర్షిక. ‘సినిమా బండి’ మూవీ ఫేమ్ ప్రవీణ్ కాండ్రేగుల ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ డొంకాడ, శ్రీనివాసులు పీవీ, శ్రీధర్ మక్కువ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సంగీత, దర్శన రాజేంద్రన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకి ‘పరదా’ అనే టైటిల్ ఖరారు చేసి, ఫస్ట్ లుక్, కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు మేకర్స్. మహిళల చుట్టూ సాగే కథతో రూపొందుతోన్న ఈ సినిమా ప్రేక్షకుల్ని మరో ప్రపంచంలోకి తీసుకెళుతుందని యూనిట్ పేర్కొంది. ఓ భక్తురాలి కథ మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘ఆదిపర్వం’. సంజీవ్ కుమార్ మేగోటి దర్శకత్వం వహించారు. రావుల వెంకటేశ్వర్ రావు సమర్పణలో ఎమ్ఎస్కే నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకురానుంది. ‘‘ఆదిపర్వం’ ఓ అమ్మవారి కథ. అమ్మవారిని నమ్ముకున్న ఓ భక్తురాలి కథ. ఆ భక్తురాలిని దుష్ట శక్తుల నుండి కాపాడే ఓ క్షేత్రపాలకుడి కథ. ఎర్రగుడి నేపథ్యంలో దైవానికి, దుష్టశక్తికి మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. 1974 నుంచి 1992 మధ్యకాలంలో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించాం. పీరియాడిక్ డ్రామాగా రూపొందిన ఈ మూవీలో గ్రాఫిక్స్ ప్రధానాకర్షణగా నిలుస్తాయి. మంచు లక్ష్మి నటన సరికొత్తగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. సరికొత్త థ్రిల్లర్ మలయాళ, తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్ సంయుక్తా మీనన్. తెలుగులో ‘భీమ్లా నాయక్, బింబిసార, సార్, విరూపాక్ష’ వంటి వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న ఈ బ్యూటీ తొలిసారి ఓ లేడీ ఓరియంటెడ్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘సామజవరగమన, ఊరు పేరు భైరవకోన’ వంటి హిట్ చిత్రాలు తీసిన నిర్మాత రాజేష్ దండా ఈ సినిమా నిర్మిస్తున్నారు. మాగంటి పిక్చర్స్, హాస్య మూవీస్ బ్యానర్స్‌పై రూపొందుతున్న ఈ సినిమాకి యోగేష్ కేఎంసీ దర్శకుడు. ఈ సినిమా బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ‘‘సరికొత్త యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ మూవీ రూపొందుతోంది. ఇది బలమైన మహిళా ప్రధాన పాత్రతో ఆకట్టుకునే కథ. స్క్రిప్ట్‌లో చాలా సామాజిక, రాజకీయ అంశాలు కూడా ఉన్నాయి. ఒక స్త్రీ తనదైన రీతిలో మొత్తం నెగిటివిటీని తగ్గించే మార్గం ఉంది. ఆమె ఎలా చేస్తుంది అనేది ఈ చిత్రకథ’’ అని సంయుక్తా మీనన్ తెలిపారు. కుమారి ఖండం నేపథ్యంలో..హీరోయిన్గా గ్లామర్ పాత్రలు చేస్తూనే మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తున్నారు శ్రద్ధా దాస్. ఆమె లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘త్రికాల’. ‘స్క్రిప్ట్ ఆఫ్ గాడ్’ అనేది ట్యాగ్‌లైన్. మణి తెల్లగూటి దర్శకత్వం వహించారు. రిత్విక్ సిద్ధార్థ్ సమర్పణలో మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై రాధికా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘‘భారీ బడ్జెట్‌తో ఫ్యాంటసీ, హారర్ మూవీగా ‘త్రికాల’ రూపొందింది. కుమారి ఖండం నేపథ్యాన్ని ఆధారంగా చేసుకుని నేటి కాలానికి తగ్గట్టుగా మార్పులు చేర్పులు చేశాం. పురాణ నేపథ్యంతో సాగే ఈ మూవీలో విజువల్ గ్రాఫిక్స్‌కు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది’’ అని పేర్కొన్నారు మేకర్స్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోన్న ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. హత్యలు చేసిందెవరు? ప్రియమణి లీడ్ రోల్లో నటించిన తాజా చిత్రం ‘క్యూజి: కొటేషన్ గ్యాంగ్’. ఎన్టీఆర్ శ్రీను సమర్పణలో వివేక్ కుమార్ కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమా ఈ నెల 30న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది. జాకీ ష్రాఫ్, సన్నీ లియోన్ , సారా అర్జున్ ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తెలుగు వరల్డ్ వైడ్ రిలీజ్ హక్కులను రుషికేశ్వర్ ఫిలింస్ అధినేత ఎం.వేణుగోపాల్ సొంతం చేసుకున్నారు. ‘‘మంచి మాస్ మసాలా కమర్షియల్ ఎంటర్టైనర్గా ‘క్యూజి: కొటేషన్’ గ్యాంగ్’ రూపొందింది. ముంబై, కశ్మీర్, చెన్నై ప్రాంతాల మధ్య కిరాయి హత్యలు చేసే గ్యాంగ్‌లకు సంబంధించిన కథ ఇది. ఒక హత్య కేసు ఈ మూడు ప్రాంతాలకు కనెక్ట్ అవుతుంది. అది ఏంటి అనేది సస్పెన్స్. నాలుగు స్టోరీలు, మూడు ప్రాంతాల్లో సాగుతాయి. స్క్రీన్‌ప్లే అద్భుతంగా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే... హీరోయిన్లు నయనతార, కీర్తీ సురేష్. శ్రుతీహాసన్, హన్సిక, వరలక్ష్మీ శరత్‌కుమార్ వంటి వారు తమిళ భాషల్లో ప్రస్తుతం లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. -
జస్ట్ బ్రేక్... అంతే!
మనసుకి నచ్చిన కథ వచ్చే వరకూ కొందరు స్టార్స్ ఖాళీగా ఉంటారు తప్ప ఏ సినిమా పడితే అది చేయరు. కొందరికి నచ్చిన కథ వచ్చినా ఆరోగ్యం బాగా లేక ఇంటిపట్టున ఉండాల్సిన పరిస్థితి ఎదురవుతుంది. వేరే వ్యక్తిగత కారణాల వల్ల కూడా కొందరు బ్రేక్ తీసుకుంటారు. కారణాలు ఏమైనా ఈ మధ్య కొందరు స్టార్స్ సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. బ్రేక్ తర్వాత కెమెరా ముందుకి వచ్చి, ఆ తారామణులు చేస్తున్న, చేసిన చిత్రాల గురించి తెలుసుకుందాం. ⇒ తెలుగు ప్రేక్షకుల మనసుల్లో లేడీ సూపర్ స్టార్‌గా నిలిచిపోయారు నటి విజయశాంతి. ‘నాయుడమ్మ’ (2006) సినిమా తర్వాత పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి వెళ్లారామె. దాదాపు 14 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మహేశ్‌బాబు హీరోగా నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ (2020) సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు విజయశాంతి.ప్రోఫెసర్ భారతి పాత్రలో తనదైన నటనను, భావోద్వేగాలను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారామె. ‘సరిలేరు నీకెవ్వరు’ తర్వాత మళ్లీ రాజకీయాల్లో బిజీ అయిన విజయశాంతి దాదాపు మూడున్నరేళ్ల తర్వాత ఓ సినిమా కమిట్ అయ్యారు. కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రంలో నటిస్తున్నారామె. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వైజయంతీ ఐపీఎస్ అనే పవర్ఫుల్ పాత్ర చేస్తున్నారు. ఈ నెల 24న విజయశాంతి పుట్టినరోజుని పురస్కరించుకుని ఆమె పాత్ర తాలూకు గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. ‘వైజయంతీ ఐపీఎస్. తాను పట్టుకుంటే పోలీస్ తుపాకీకి ధైర్యం వస్తుంది.. వేసుకుంటే యునిఫామ్కి ΄ûరుషం వస్తుంది.. తనే ఒక యుద్ధం. మేమే తన సైన్యం’ అంటూ విడుదలైన గ్లింప్స్‌కి అద్భుతమైన స్పందన వస్తోంది. ⇒ తెలుగులో జేజమ్మగా ప్రేక్షకుల మనసు దోచుకున్నారు అనుష్క. గత ఏడాది ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు ఈ బ్యూటీ. 2018లో విడుదలైన ‘భాగమతి’ మూవీ తర్వాత ‘నిశ్శబ్దం’ (2020)లో కథానాయికగా నటించారు. ఈ రెండు చిత్రాలకు మధ్య ‘సైరా’లో అతిథి పాత్ర చేశారు. ‘నిశ్శబ్దం’ తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని, ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ (2023) చేశారు. ఈ చిత్రం విడుదలైన ఏడాదికి కొత్త చిత్రాలు కమిట్ అయ్యారు.ప్రస్తుతం ఆమె ‘కథనార్–ది వైల్డ్ సోర్సెరర్’ అనే మలయాళ సినిమాలో నటిస్తున్నారు. తెలుగులో అంగీకరించిన చిత్రం ‘ఘాటీ’. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు. యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందుతోంది. ఒడిశాలోని ఒక మహిళ జీవితంలో జరిగిన వాస్తవ ఘటన నేపథ్యంలో ‘ఘాటీ’ని తెరకెక్కిస్తున్నారని టాక్. అందుకే ఆంధ్రా–ఒడిశా బోర్డర్లో తొలి షెడ్యూల్ చిత్రీకరణ జరిపారట. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతోంది. ⇒ ‘ఛాతీ మీద చటాకు మాంసం లేదు నువ్వు పెద్ద రౌడీవా?, రేయ్.. నీకంటే పెద్ద రౌడీరా నేను.. ముందు నాతో కొట్లాడు.. సిద్ధిపేటలో అడుగు చాందినీ గురించి చెబుతారు’ అంటూ ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంలో నభా నటేశ్ చెప్పిన మాస్ డైలాగులు ప్రేక్షకుల మనసుల్లో లోతుగా గుచ్చుకున్నాయి. సుధీర్ బాబు హీరోగా నటించిన ‘నన్ను దోచుకుందువటే’ (2018) సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చారీ బ్యూటీ.ఆ తర్వాత ‘అదుగో, ఇస్మార్ట్ శంకర్, డిస్కో రాజా, సోలో బ్రతుకే సో బెటర్’ వంటి మూవీల్లో నటించారు. కాగా ‘ఇస్మార్ట్ శంకర్’ మూవీతో హిట్‌ని తన ఖాతాలో వేసుకోవడంతో పాటు ప్రేక్షకుల్లో ‘ఇస్మార్ట్ బ్యూటీ’గా పేరు తెచ్చుకున్నారు నభా. ఓ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆమె దాదాపు మూడేళ్లు సినిమాలకు బ్రేక్ ఇచ్చారు. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న ‘స్వయంభూ’లో హీరోయిన్గా నటిస్తున్నారు నభా. ⇒ మలయాళ తార మమతా మోహన్‌దాస్ తెలుగులో హీరోయిన్గా నటించిన తొలి చిత్రం ‘యమదొంగ’(2007). ఈ చిత్రంలో ‘చంపేస్తాన్రా రేయ్.. ఆగండ్రా.. రేయ్ యాడికి పోతార్రా.. ఏదో ఒకరోజు దొరకాల.. నెల్లూరు ట్రంకు రోడ్డులో గుడ్డలూడదీసి తంతాను నాయాల్లారా..’ అంటూ ‘యమదొంగ’లో మమతా మోహన్‌దాస్ చెప్పిన డైలాగ్స్ బాగా పాపులర్ అయ్యాయి. ఆ తర్వాత తెలుగులో వరుస అవకాశాలు అందుకున్నారామె.నాగార్జున హీరోగా నటించిన ‘కేడీ (2009) తర్వాత మరో తెలుగు సినిమా చేయలేదు. దాదాపు 14 ఏళ్ల తర్వాత ‘రుద్రంగి’ (2023) చిత్రంతో తెలుగులో రీ ఎంట్రీ ఇచ్చారు మమతా మోహన్‌దాస్. ఇటీవల ఆమె నటించిన ‘మహారాజ’ (విజయ్ సేతుపతి హీరో) సినిమా ఈ నెల 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. ⇒ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు శోభన. కృష్ణ, చిరంజీవి, మోహన్‌బాబు, నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, జగపతిబాబు వంటి హీరోలందరికీ జోడీగా నటించారామె. ప్రత్యేకించి కార్తీ హీరోగా నటించిన ‘అభినందన’ (1988) సినిమాలో ఆమె నటన అద్భుతం. ఇక ‘సూర్య పుత్రులు’ (1997) తర్వాత దాదాపు పదేళ్లు తెలుగు సినిమాల నుంచి విరామం తీసుకున్న ఆమె మోహన్‌బాబు, విష్ణు మంచు నటించిన ‘గేమ్’ (2006) మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ చిత్రం తర్వాత తెలుగులో దాదాపు పద్దినిమిదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చారు శోభన. ఈ చిత్రంలో శంబాల రాజ్యానికి చెందిన నాయకురాలు మరియంగా తనదైన నటనతో ఆకట్టుకున్నారామె. ఈ చిత్రం ఈ గురువారం (మే 27) విడుదలైంది. -
కథలకు ప్రాణం పోసిన టాప్ హీరోయిన్స్.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్గ్రీన్
సౌత్ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు హీరోయిన్లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో బాక్సాఫీస్ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. అనుష్క సినీ కెరియర్లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి 15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్ వాచబుల్ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది. కిర్తీ సురేష్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది. 2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి సూపర్ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయిన 'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్లో ఆమె మెప్పిస్తుంది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్ ప్రైమ్,జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. -
హీరోలను ఢీ కొట్టే రేంజ్ అనుష్క సొంతం
టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఫేస్ ఆఫ్ ది సినిమాగా చెప్పుకునేది హీరోనే. ఆ హీరోలకు సమానంగా ఇమేజ్ తెచ్చుకునే హీరోయిన్స్ అరుదుగా వస్తుంటారు. అలాంటి అరుదైన నాయిక అనుష్క శెట్టి. తన అందం, అభినయం, విజయాలతో హీరోలకు సమానంగా ఇమేజ్, మార్కెట్ సంపాదించుకుంది అనుష్క. ఆమె నటించిన లేడి ఓరియెంటెడ్ సినిమాలు అరుంధతి, రుద్రమదేవి, భాగమతి బాక్సాఫీస్ వద్ద తిరుగులేని విజయాల్ని సాధించి ఈ విషయాన్ని ప్రూవ్ చేశాయి. రీసెంట్గా అనుష్క నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమాలో అనుష్క చేసిన అన్విత క్యారెక్టర్ ప్రేక్షకుల హృదయాలను హత్తుకుంది. తన నటన హైలైట్ గా సాగిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఒక స్పెషల్ మూవీగా సెలబ్రిటీల, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూనే కమర్షియల్‌గా పెద్ద సక్సెస్ అందుకుందీ సినిమా. అటు దాదాపు అందరు స్టార్ హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూనే సోలోగా హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీస్‌తో మెప్పించడం ఆమెకే సాధ్యమైందని అనుకోవచ్చు. 'వేదం' సినిమాలో సరోజ క్యారెక్టర్లో అనుష్క నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. అరుంధతి, వేదం, రుద్రమదేవి సినిమాల్లోని నటనకు గానూ ఆమె 'ఫిలిమ్ ఫేర్' అవార్డును అందుకున్నారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్ సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు అనుష్క. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. బాహుబలి సినిమాలోని 'దేవసేన' పాత్రలో అనుష్క నటన ఆమెను కెరీర్లో అగ్ర స్థానంలో నిలబెట్టింది. 'సైజ్ జీరో' సినిమా కోసం అనుష్క చేసిన హార్డ్ వర్క్ సినిమా పట్ల ఆమెకున్న కమిట్మెంట్ తెలియజేసింది. చిరంజీవి నటించిన 'సైరా నరసింహారెడ్డి'లో అనుష్క ఝాన్సీ లక్ష్మీబాయి పాత్రలో చిరస్మరణీయమైన పాత్రలో కనిపించారు. 2021లో విడుదలైన 'నిశ్శబ్దం' ఆమె గొప్ప నటనకు మరో ఉదాహారణగా నిలిచింది. అనుష్క అద్భుతమైన నట ప్రయాణం మరిన్ని ఆసక్తికర సినిమాలతో ముందుకు సాగనుంది. త్వరలో అనుష్క 50వ సినిమా 'భాగమతి-2' ని యూవీ క్రియేషన్స్‌లో భారీగా ప్లాన్ చేస్తున్నారు. ఆడియెన్స్, ఇండస్ట్రీ.. అందరికీ ఇష్టమైన స్వీట్ హీరోయిన్ స్వీటీ అనుష్క శెట్టి కెరీర్ ఇలాగే ఘన విజయాలతో సాగాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్ డే టు హర్. అనుష్క బర్త్‌డే.. స్ఫెషల్ ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అనుష్క పుట్టినరోజు గిఫ్ట్.. ఆ హిట్ సినిమా పార్ట్-2 ప్రకటన
టాలీవుడ్లో అనుష్క పేరు వినగానే స్టార్ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే అంశం గుర్తుకు వస్తుంది. ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం కాదు.. అవసరమైతే తనే ఒక సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని అనేకసార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్.. సినీ కెరియర్ ఆరంభంలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా దుమ్ములేపింది. ఆ తర్వాత దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే ఫస్ట్ ఛాయిస్ అనుష్క పేరు గుర్తొచ్చేలా ఆమె మాయ చేసింది. 'వేద' సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది అనుష్క.. బిల్లాలో తన గ్లామర్‌తో కిక్ ఇచ్చింది. తాజాగా విడుదలైన 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరియర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం భాగమతి.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే తన కెరియర్లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది. -
అనుష్క కోసం సమంత.. ఏం చేశారంటే
యంగ్ టాలెంటెడ్ హీరో నవీన్ పొలిశెట్టి, స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి జంటగా నటించిన ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రం సెప్టెంబర్ 7న విడుదలైంది. ఈ సినిమాకు ఆడియెన్స్‌తో పాటు సెలబ్రిటీల నుంచి కూడా ప్రశంసలు అందుతున్నాయి. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ మారుతి ఈ సినిమాను చూసి అభినందించారు. (ఇదీ చదవండి: లిప్‌లాక్ సీన్‌కు త్రిష ఓకే చెబితే.. హీరోనే వద్దన్నాడు.. కారణం ఇదే!) తాజాగా స్టార్ హీరోయిన్ సమంత ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాపై ప్రశంసలు కురిపించారు. అనుష్కతో ఆమెకు ఉన్న స్నేహం కోసం సినిమా చూశారు. ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా స్పందిస్తూ. ఇటీవల కాలంలో ఏ సినిమా కూడా తనను ఇంతగా నవ్వించలేదని చెప్పారు. సినిమాలో అనుష్క ఛార్మింగ్‌గా కనిపించారని చెప్పుకొచ్చారు. ఇందులో నవీన్ పోలిశెట్టి సూపర్బ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడని తెలిపారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ టీమ్ అందరికీ కంగ్రాట్స్ అంటూ ఆమె పోస్ట్ చేసింది. (ఇదీ చదవండి; ఎలిమినేషన్ ఎత్తేసిన బిగ్‌బాస్.. మరో కొత్త ట్విస్ట్!) ఈ సినిమా అన్నివర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుని సూపర్ హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు దక్కించుకుంటోంది. యూఎస్‌లో ఆఫ్ మిలియన్ డాలర్స్ మార్క్‌ను ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చేరుకుంది. వన్ మిలియన్ మైల్ స్టోన్ వైపు దూసుకెళ్తోంది. రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కథతో ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యువీ క్రియేషన్స్ బ్యానర్‌పై వంశీ, ప్రమోద్ నిర్మాణంలో దర్శకుడు మహేష్ బాబు.పి తెరకెక్కించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) -
బాహుబలి తర్వాత అందుకే చేయలేదు: అనుష్క శెట్టి ఆసక్తికర కామెంట్స్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్కశెట్టి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను పలకరించింది. మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టితో చాలా రోజుల గ్యాప్ తర్వాత అభిమానులను అలరించింది. ఈ చిత్రంలో నవీన్ పొలిశెట్టితో కలిసి తెరపై మెరిశారు. పి. మహేశ్ బాబు డైరెక్షన్లో తెరకెక్కిన ఈ చిత్రం మొదటి రోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అ పాన్ ఇండియా మూవీ బాహుబలి-2 తర్వాత పెద్దగా చిత్రాల్లో కనిపించలేదు. ఆ విషయంపై అనుష్క ఆసక్తికర కామెంట్స్ చేసింది. బాహుబలి తర్వాత పాన్ ఇండియా సినిమాల్లో నటించకపోవడంపై తొలిసారి స్పందించింది. (ఇది చదవండి: 'నేను మీకు వీరాభిమానిని'.. జ్యోతిక పోస్ట్ వైరల్!) రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి-1, బాహుబలి-2 ప్రపంచవ్యాప్తంగా భారీగా వసూళ్లు సాధించిన సంగతి తెలిసిందే. దేవసేన మెప్పించిన అనుష్క ఈ చిత్రం తర్వాత పెద్ద ప్రాజెక్ట్స్‌లో ఎక్కడా కనిపించలేదు. ఆ సినిమా తర్వాత 2018లో భాగమతితో ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన నిశ్శబ్దంలో కనిపించింది. దీంతో పాన్ ఇండియా మూవీస్‌లో ఎందుకు నటించలేదనే విషయంపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వూకు హాజరైన అనుష్క ఈ విషయంపై తొలిసారి క్లారిటీ ఇచ్చారు. అనుష్క మాట్లాడుతూ..'నేను బాహుబలిని చేసిన తర్వాత భాగమతి సినిమాకు ఓకే చెప్పా. ఆ తర్వాత కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నా. ఎందుకంటే ఆ సమయంలో అది నాకు చాలా అవసరం. అందువల్లే ఆ సమయంలో పెద్ద ప్రాజెక్టులకు ఓకే చెప్పలేదు. భవిష్యత్తులో మరిన్నీ ప్రాజెక్టులు చేయాలంటే బ్రేక్ తప్పనిసరి అనిపించింది. కొంత సమయం సినిమాలకు గ్యాప్ ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ఎలాంటి స్క్రిప్ట్ వినలేదు. కానీ మంచి కథ వస్తే తప్పకుండా చేస్తా. అది ఏ భాషలోనైనా కావొచ్చు.' అని తెలిపింది. చాలా రోజుల తర్వాత మిస్ శెట్టి.. మిస్టర్ పొలిశెట్టి చిత్రంలో ప్రేక్షకులను అలరించింది భామ. చెఫ్ పాత్రలో కనిపించి అభిమానులను ఆకట్టుకుంది. (ఇది చదవండి: ప్రభాస్ కల్కిలో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్.. ఇప్పటికే!) -
ఈ నగరమంటే నాకు చాలా ఇష్టం: నవీన్ పోలిశెట్టి
నవీన్ పోలిశెట్టి, అనుష్క శెట్టి జంటగా నటించిన తాజా చిత్రం మిస్ శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న వచ్చేనెల 7న థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు నవీన్ పోలిశెట్టి. తాజాగా నెల్లూరులో సందడి చేశారు. ఆయనను చూసిన అభిమానులు సైతం సెల్ఫీల కోసం ఎగబడ్డారు. (ఇది చదవండి: క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న 'క్రిమినల్' !) పోలిశెట్టి మాట్లాడుతూ.. 'నా సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ 80 శాతం నెల్లూరులోనే జరిగింది. ఇక్కడి ఫుడ్ సూపర్. నాకు ఎంతో ఇష్టం.' అని అన్నారు. నగరంలోని మద్రాస్ బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో పలువురు ఫుడ్ బ్లాగర్స్‌తో ముచ్చటించారు.అనంతరం మినీబైపాస్ రోడ్డులోని ఓ హోటల్లో నిర్వహించిన సమావేశంలో నవీన్ మాట్లాడారు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ షూటింగ్ సమయంలో నగర వీధుల్లో తిరిగానని.. ఈ ప్రాంతం బాగా తెలుసన్నారు. ఇందులో హీరోయిన్గా అనుష్క నటించడం సంతోషంగా ఉందన్నారు. కథపై ఎంతో నమ్మకంతో నటించేందుకు ఆమె ఒప్పుకున్నట్లు తెలిపారు. అనంతరం ఎంజీబీ మాల్లో జరిగిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు. Amazing craze for @NaveenPolishety at Nellore . Stand up promotional tour of #MissShettyMrpolishetty is getting a massive response . Today they are moving to Vijayawada. 6pm PVP Mall meet and greet with #NaveenPolishetty #MSMPStandupTour #MSMPonSep7th pic.twitter.com/1hzhrzKvEC — GSK Media (@GskMedia_PR) August 26, 2023 -
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ మూవీ స్టిల్స్
-
Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి ’ సినిమా ట్రైలర్ విడుదల (ఫొటోలు)
-
హీరోయినే...హీరో
-
రుద్రమదేవి విడుదల వాయిదా
హైదరాబాద్: గుణశేఖర్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన రుద్రమదేవి చిత్రం విడుదల వాయిదా పడింది. ఈ చిత్రాన్ని ఈ నెల 26న విడుదల చేయాలని భావించారు. అయితే గ్రాఫిక్స్ పనులు ఇంకా పూర్తికానందున ఆలస్యమైంది. దర్శకుడు గుణశేఖర్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఫేస్బుక్లో ఈ మేరకు వెల్లడించారు. అత్యుత్తమ గ్రాఫిక్స్ అందించేందుకు వందలాదిమంది టెక్నిషియన్లు పనిచేస్తున్నారని, నిర్ణీత సమయానికి చిత్రాన్ని విడుదల చేయడం సాధ్యంకాదని తెలిపారు. కాగా ఎప్పుడు విడుదల చేస్తామన్న విషయాన్ని గుణశేఖర్ తెలియజేయలేదు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహించిన మరో భారీ బడ్జెట్ చిత్రం బాహుబలి వచ్చే నెల 10న విడుదల కానుంది. ఇక మహేహ్ బాబు చిత్రం 'శ్రీమంతుడు' ఆగస్టు 7న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రుద్రమదేవి చిత్రాన్ని ఆగస్టులో లేదా ఆ తర్వాత విడుదల చేసే అవకాశముందని సమాచారం. రుద్రమదేవిగా అనుష్క నటించగా, ఇతర ముఖ్య పాత్రలను యువ హీరోలు అల్లు అర్జున్, రానా పోషించారు.