టాలీవుడ్‌లో అనుష్క పేరు వినగానే స్టార్ హీరోకు ఏ మాత్రం తక్కువ కాదు అనే అంశం గుర్తుకు వస్తుంది. ఒక సినిమాలో హీరోయిన్ అంటే రెండు సీన్లు, మూడు పాటలకు మాత్రమే పరిమితం కాదు.. అవసరమైతే తనే ఒక సినిమాని ఒంటిచేత్తో నడిపించగలదు. ఈ విషయాన్ని అనేకసార్లు నటి అనుష్క నిరూపించింది. అందుకే ఆమెకు ఇక్కడ అంత క్రేజ్.. సినీ కెరియర్ ఆరంభంలో అందాలు ఆరబోసినా... ఆ తర్వాత అరుంధతిలో జేజమ్మగా దుమ్ములేపింది.
ఆ తర్వాత దేవసేన, రుద్రమదేవి, భాగమతి వంటి అద్భుతమైన పాత్రలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కథానాయిక ప్రాధాన్యం ఉన్న సినిమా అనగానే ఫస్ట్ ఛాయిస్ అనుష్క పేరు గుర్తొచ్చేలా ఆమె మాయ చేసింది. 'వేద' సినిమాలో సరోజ పాత్రలో తన అందం, అభినయంతో యువతను ఉర్రూతలూగించింది అనుష్క.. బిల్లాలో తన గ్లామర్‌తో కిక్ ఇచ్చింది.
తాజాగా విడుదలైన 'మిస్‌శెట్టి మిస్టర్ పొలిశెట్టి'లో అన్విత పాత్రలో అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. అనుష్క సినీ కెరియర్‌లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం భాగమతి.. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రానున్నట్లు తెలుస్తోంది. నేడు (నవంబర్ 7) అనుష్క పుట్టినరోజు సందర్భంగా భాగమతి 2 చిత్రం గురించి యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రకటన అధికారికంగా వస్తే తన కెరియర్‌లో 50వ చిత్రంగా రికార్డుకెక్కనుంది.
Comments
Please login to add a commentAdd a comment